ప్రేమలో ఫెయిల్.. బీఈడీ విద్యార్థిని సూసైడ్.. 

అమ్మానాన్న నన్ను క్షమించండి. నేను ప్రేమలో మోసపోయాను.  ఈ విషయంలో పోలీసులు కూడా నాకు న్యాయం చెయ్యలేదు. రక్షణ కల్పించలేదు. అందుకే నేను చనిపోతున్నాను. మీరు దైర్యంగా ఉండండి. ఇది ఒక అమ్మాయి చనిపోతూ రాసిన లేఖ.. ఇంతకీ ఏం జరిగింది..? ఎందుకు ఆ అమ్మాయి చనిపోయింది.? దానికి గలకారణాలు ఏంటో తెలుసుకుందాం..   అది బయ్యారం మండలం. మిర్యాలపెంట పంచాయతీ, పత్యాతండా. ఆ యువతి పేరు ధరంసోత్‌ సునీత(21) వరంగల్‌లో బీఈడీ చదువుతున్న రోజుల్లో ఇదే తండాకు చెందిన మాలోతు శివ మాయమాటలతో ప్రేమలోకి దించాడు. ఆ అమ్మాయికి బతుకు మీద ఆశ కలిపించాడు. ఆమె కూడా నిజమే అనుకుంది. ఆ తరువాత ఇద్దరు కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి కాలేజీ కి వెళ్ళింది. చదువు పూర్తయ్యాక కుటుంబసభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుందామని చెప్పాడు.  కట్ చేస్తే.. సునీత ఏప్రిల్‌ 4న కళాశాల నుంచి  తిరిగి ఇంటికి వచ్చింది.  చాలా రోజులుగా ఉన్న సునీత శివతో మాటాడాలని కలుద్దామని ట్రై చేసింది. శివ అందుకు టైం ఇవ్వడంలేదు. శివలో వచ్చిన మార్పును గమనించి సునీత. తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పకూడదని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఆమెపై అత్యాచారయత్నంతో పాటు కిడ్నాప్‌నకు యత్నించాడు శివ. ఆ విషయం పై  ఇరు కుటుంబాల మధ్య వివాదానికి దారి తీసింది. అనంతరం జరిగిన ఘర్షణలో శివతోపాటు సునీత తండ్రి బిచ్చ గాయపడ్డారు. ఇరు కుటుంబాలు ఏప్రిల్‌ 24న బయ్యారం పోలీసులను ఆశ్రయించగా విచారణ చేపట్టిన పోలీసులు సునీత తండ్రి బిచ్చపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. అండగా ఉండే తండ్రి జైలుకు వెళ్లడంతో పాటు తండాలోని కొందరు కుటుంబాన్ని దూషించడాన్ని తట్టుకోలేక సునీత తీవ్ర మనస్తాపానికి గురైంది.  ఒక వైపు  ప్రేమ వ్యవహారంలో ఎదురైన వేధింపులు,  మరో వైపు ఇరు కుటుంబాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు. మరోవైపు ఊర్లో వాళ్ళ సూటిపోటి మాటల తో  మనస్తాపం చెందిన యువతి సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తన కుటుంబానికి సరైన న్యాయం చేయలేదని.. రక్షణ కనిపించడం లేదని, ప్రేమ విషయంలో మోసపోయానని.. అమ్మానాన్న క్షమించాలని, మీరు ధైర్యంగా ఉండాలని లేఖలో రాసింది. ఇదిలా ఉండగా సునీతను వేధిస్తున్న శివపై చర్య తీసుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట మృతదేహంతో ధర్నాకు యత్నించారు. పోలీసులు అడ్డుకుని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎస్సై జగదీష్‌ను వివరణ కోరగా.. సునీత తండ్రిపై వచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో విచారించి కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రేమ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. సునీత ఆత్మహత్యపై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతికి కారణమైన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.         

వేగం ఒకడిది.. ప్రాణం మరొకడిది.. 

యాక్సిడెంట్ అంటే బైక్ కో ఓ కారు రోడ్డు మీద పడడం కాదు పరం.. ఓ కుటుంబం మొత్తం రోడ్డున పాడడం. ఓ ఊశన్న రోడ్లు జాగిలంగా ఉన్నాయని వంద, రెండొందలు గొట్టగాకు.. ఈ మాటలు ఎక్కడో విన్నట్లు ఉంది కదా.. ? అదే నంది సన్ అఫ్ సత్యమూర్తి, అరవింద సామెత సినిమా డైలాగ్స్ ..ఎంత బాగా చెప్పాడు మహాబావులు.. ఎవరో ఎన్ని చెప్పిన మనం మాత్రం మాట వినం.. సినిమాలో ఉన్న మంచిని పక్కకు పెట్టి చెత్త విషయాల మీద మన ఫోకస్ అంత. అతివేగం ప్రాణం తీస్తుందని తెలుసు అయిన సరే ఎక్సలేటర్ తొక్కాల్సిందే.. ప్రాణాలు తీయాల్సిందే.. అదివేగం వల్ల మన ప్రాణాలే కాదు పక్కలో ఉన్న ప్రాణాలు కూడా పోతాయి అని ఆలోచించాలి. మనం ఏదైనా ఘటన నుండి  తప్పించుకోవచ్చు కానీ. ఎంత పెద్దవాళ్ళు అయిన, చిన్న వాళ్ళు అయిన. ఉన్నవాడు అయిన లేనోడు అయిన విధి రాత నుండి తప్పించుకోలేరు. విధి రాతను ఎవరు మార్చలేరూ అని అంటారు. ఈ వార్త చదివాకా..మీరు కూడా నిజమే..! అని అనుకుంటారు.  ఎందుకంటే..? ఈ ఘటన రామేశ్వరం వెళ్లిన శనేశ్వరం వదల్లేదు అనే తెలుగు సామెత వంటిది. కొన్ని సార్లు తప్పు ఒకడు చేస్తే.. శిక్ష మరొకడికి పడుతుంది. కొన్ని సార్లు ఎవడో చేసిన పనికి మనం బలి అవ్వాల్సి  వస్తుంది. కానీ ఒక డ్రైవర్ చేసిన పనికి ఏం జరిగిందో మీరే చూడండి.   ఓపెన్ చేస్తే అది ప్రకారం జిల్లా. మార్కాపురం.  అతని పేరు సూరె వెంకట కృష్ణారావు. తన తండ్రి కోటేశ్వరరావు. కోటేశ్వరావు కి కొంత కాలంగా  అనారోగ్యంగా ఉన్నాడు. ఆదివారం అద్దెకు ఓ కారు మాట్లాడుకున్నారు. గుంటూరులోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తీసుకువెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా కారు అదుపుతప్పింది. రెప్ప పాటు సమయంలో ఘోరం జరిగింది. వేగంగా వస్తున్న కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా, స్వల్పంగా గాయపడిన మరొకరు కాసేపటికే గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. దీంతో కారు నడుపుతున్న కటికల ప్రవీణ్‌(29) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కృష్ణారావు (34)ను మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. స్వల్ప గాయాలపాలైన కోటేశ్వరరావు (61) ఇంటికి వచ్చిన 10 నిమిషాలకే గుండెపోటుతో చనిపోవడంతో కారులో ప్రయాణించిన వారందరి కథా విషాదాంతమైంది. కారు దూసుకెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మరికొందరికి ప్రాణాపాయం తప్పింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. కృష్ణారావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.     

ఆన్‌లైన్లో మ‌ద్యం అమ్మ‌కం.. లాక్‌డౌన్‌లో ప్ర‌భుత్వం పర్మిష‌న్‌..

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ దెబ్బకు అనేక రాష్ట్రాలు క‌ఠిన ఆంక్ష‌లు విధించాయి. ప‌లు స్టేట్స్ నైట్ క‌ర్ఫ్యూకే ప‌రిమిత‌మైతే.. ఇంకొన్ని రాష్ట్రాలు సంపూర్ణ లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నాయి. కేవ‌లం నిత్యావ‌స‌రాల కొనుగోళ్ల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇస్తున్నాయి. దీంతో, బార్లు, వైన్లు, ప‌బ్బులు బంద్ అయ్యాయి. పాపం.. మందుబాబులు నాలుక త‌డారిపోయి నానా యాత‌న ప‌డుతున్నారు. మ‌ద్యానికి అల‌వాటు అయిన వాళ్లు.. మద్యం ప్రియులకు తెగ ఇబ్బందిగా ఉంది. ఎన్ని రోజులైనా లాక్‌డౌన్ పెట్టుకోండి కానీ.. రోజూ ఓ గంటైనా వైన్స్ తెర‌వండి అంటూ ప్ర‌భుత్వాల‌కు తెగ రిక్వెస్టులు పంపుతున్నారు.  ఎట్ట‌కేల‌కు.. మందు బాబులు అభ్య‌ర్థ‌న‌ను ఓ రాష్ట్ర ప్ర‌భుత్వం అర్థం చేసుకుంది. మద్యం ప్రియుల‌కు మందు ఎంత ముఖ్య‌మో గుర్తించింది. అయితే, వైన్ షాపులు తెరిచేందుకు మాత్రం ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు కానీ.. లాక్‌డైన్ ఉన్నంత కాలం ఆ రాష్ట్రంలో ఆన్‌లైన్లో లిక్క‌ర్ హోం డెలివ‌రీకి మాత్రం ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌ర్కారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. సోమ‌వారం నుంచే ఈ ఫెసిలిటీ అందుబాటులోకి రానుంది.  ఆన్ లైన్ లిక్కర్ ఆర్డ‌ర్ చేసేందుకు.. మ‌ద్యాన్ని హోం డెలివరీ చేసేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌త్యేకంగా ఓ యాప్‌ను తయారు చేసింది. ‘సీఎస్ఎంసీఎల్’ యాప్‌లో వివరాలు న‌మోదు చేసి, ఆర్డ‌ర్ చేస్తే.. ఇంటి ద‌గ్గ‌రికే లిక్కర్‌ సరఫరా చేస్తారు. ఎంచ‌క్కా లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉంటూ.. ఆన్‌లైన్‌లో మందు బుక్ చేసుకుంటూ.. కావల‌సిన స‌రుకు ఇంటికే తెప్పించుకుంటూ.. మందేస్తూ.. చిందేస్తూ.. ఇంట్లోనే  మ‌జా చేసేయొచ్చు అంటున్నారు. ఐడియా భలే బాగుంది క‌దూ. అందుకే, లాక్‌డౌన్ ఉన్నా.. లేకున్నా.. ఆన్‌లైన్ లిక్క‌ర్ డెలివ‌రీని కొన‌సాగించాల‌ని అప్పుడే డిమాండ్లు మొద‌ల‌య్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆన్‌లైన్‌లో లిక్క‌ర్ డెలివ‌రీ సౌక‌ర్యం ఎప్పుడు వ‌స్తుందోన‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు మందుబాబులు...

క‌రోనాకు గోమూత్ర చికిత్స‌.. గోశాలలో కొవిడ్‌కేర్‌ సెంటర్‌

గోవు. స‌ర్వ జ‌గ‌ద్ర‌క్ష. ఆవుకు హిందూధ‌ర్మంలో అధిక ప్రాధాన్యం ఉంది. గో మూత్రానికి అనేక రుగ్మ‌త‌ల‌ను హ‌రించే శ‌క్తి ఉంద‌ని అంటారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారికి సైతం గో మూత్రంతో చికిత్స చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు గుజ‌రాత్‌లోని కొంద‌రు ఔత్సాహికులు. అక్క‌డి ఓ గోశాలలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. క‌రోనా బాధితులకు గోమూత్రంతో తయారు చేసిన మాత్రలను అందిస్తున్నారు.  కరోనా ఉద్ధృతి పెరుగుతుండటంతో గ్రామాల్లోనూ కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చని గుజరాత్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో బనస్కాంత జిల్లాలోని టేతోడా గ్రామంలోని ఓ గోశాలలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దానికి ‘వేదలక్షణ పంచగవ్య ఆయుర్వేద్‌ కొవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌’గా పేరు పెట్టారు. ప్రస్తుతం ఇక్కడ ఏడుగురు కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. వారికి దేశీ ఆవు మూత్రం, పాలతో తయారు చేసిన ఆయుర్వేదిక్‌ మందులు ఇస్తున్నారు. అవసరమైన వారికి అలోపతి మందులు కూడా అందిస్తున్నారు.   ‘స్వల్ప లక్షణాలు ఉన్న బాధితులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం ఏడుగురు చికిత్స పొందుతున్నారు. గోవు పాలు, మూత్రం, నెయ్యితో తయారు చేసిన ఎనిమిది రకాల ఆయుర్వేద మందులను వారికి  అందిస్తున్నాం.’ అని గోశాల నిర్వాహకులు తెలిపారు.  దగ్గును తగ్గించేందుకు గో మూత్రంతో తయారు చేసిన ‘గో తీర్థ’ అనే మందును ఇస్తున్నారు. వైర‌స్ బారిన ప‌డిన‌ బాధితుల్లో ఇమ్యూనిటీ పెంచేందుకు ఆవు పాలతో తయారు చేసిన ‘చవన్‌ప్రాశ్‌’ను అందిస్తున్నారు. గోశాల‌లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్‌లో రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఇద్దరు ఆయుర్వేద వైద్యలు, మరో ఇద్దరు ఎంబీబీఎస్‌ వైద్యులు బాధితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ అనుమతితోనే నిర్వాహకులు గోశాలలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ పటేల్‌ వెల్లడించారు. అయితే, క‌రోనా సోకిన తొలినాళ్ల‌లో, స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి మాత్ర‌మే ఈ గోశాల‌లో చికిత్స‌. కొవిడ్ ముదిరితే.. హాస్పిట‌ల్‌కి వెళ్లాల్సిందే అంటున్నారు. 

పావుగంటకో ప్రాణం.. క‌డ‌ప‌లో మ‌రీ ఘోరం.. పాల‌కులే చేతులెత్తేస్తే ఎలా?

అండ‌గా ఉంటార‌ని అంద‌లం ఎక్కిస్తాం. క‌ష్టాల్లో ఆదుకుంటార‌ని అధికారాన్ని అప్ప‌గిస్తాం. అస‌లు, ప్ర‌జ‌ల‌కు క‌ష్టాలే రాకుండా చూస్తార‌ని ఆశిస్తాం. కానీ, తీరా గ‌ద్దె నెక్కాక‌.. ఆ ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డమే మానేస్తారు కొంద‌రు నేత‌లు. రాష్ట్ర ప్ర‌జ‌లు క‌రోనాతో అల్లాడిపోతున్నా.. సీఎం జ‌గ‌న్‌రెడ్డి మొద్దు నిద్ర‌లో జోగుతున్నారంటూ విమ‌ర్శ‌లు. ఏపీని ఆక్సిజ‌న్ కొర‌త వేధిస్తున్నా.. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదంటూ మండిపాటు. ముఖ్య‌మంత్రి సొంత జిల్లా క‌డ‌ప‌లో ఆక్సిజ‌న్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతుంటే.. కేంద్రానికి లేఖ‌లు రాస్తూ.. త‌ప్పును ఢిల్లీపైన నెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా క‌రోనా విల‌య‌తాండ‌వం సృష్టిస్తున్నా.. చేష్ట‌లుడిగి చూస్తూ.. చేతులెత్తేస్తోంది జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు అంటూ విప‌క్షాలు మండిప‌డుతున్నాయి.  అవును, ఏపీలో మ‌ర‌ణ మృదంగం మోగుతోంది. రాష్ట్రంలో పావుగంట‌కో ప్రాణం పోతోంది. ఒక్క రోజే 96 మంది మృత్యువాత ప‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఏపీలో మ‌రోసారి 20వేల‌కు పైగా కొత్త క‌రోనా కేసులు న‌మోద‌వ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు నిద‌ర్శ‌నం. ఏపీలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 12,65,439కు చేరాయి. మొత్తం యాక్టివ్‌ కేసులు 1,87,392 కాగా.. మొత్తం మరణాలు 8,615కు పెరిగాయి. తాజాగా 19,272 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు.   ఏపీలో కొవిడ్ మ‌ర‌ణాలు సెంచ‌రీ కొడుతుండ‌టం తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. పావు గంట‌కు ఒక‌రు చ‌నిపోతున్నారంటే అదేమైన చిన్న విష‌య‌మా?  వైర‌స్ ముదిరి ప్రాణాలు పోతున్న వారికంటే.. ఆక్సిజ‌న్ లోటు, బెడ్స్ కొర‌త‌తో.. స‌రైన చికిత్స అంద‌క చ‌నిపోతున్న వారే ఎక్కువ మంది ఉంటున్నార‌ని అంటున్నారు. ఇవి, కొవిడ్ మ‌ర‌ణాలు కావ‌ని.. పాల‌కుల నిర్ల‌క్ష్యం, చేత‌గాని త‌నం వ‌ల్ల జ‌రుగుతున్న హ‌త్య‌ల‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆక్సిజ‌న్ అంద‌క చ‌నిపోతున్న మ‌ర‌ణాల్లో దేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండో స్థానంలో ఉండ‌టం.. ముమ్మాటికీ ప్ర‌భుత్వ వైఫ‌ల‌మ్యే. ఆ పాపం.. పాల‌కుల‌దే.  ఏప్రిల్ 13 నుంచి మే 6 మ‌ధ్య సేక‌రించిన వివ‌రాల ప్ర‌కారం.. ఆక్సిజ‌న్ అంద‌క చ‌నిపోయిన వారి సంఖ్య‌లో దేశ రాజ‌ధాని ఢిల్లీ మొద‌టి స్థానంలో ఉంటే.. 40కి పైగా మ‌ర‌ణాల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ యావ‌త్ దేశంలోనే రెండో స్థానంలో నిల‌వ‌డం పాల‌కుల ఉదాసీన వైఖ‌రికి సాక్షం. ఏపీ సిగ‌లో విశాఖ ఉక్కు క‌ర్మాగారం ఉన్నా.. అక్క‌డ ట‌న్నుల‌కు ట‌న్నులు మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి జ‌రుగుతున్నా.. ఏపీలో భారీగా ఆక్సిజ‌న్ కొర‌త ఉండ‌టం.. ప్రాణ వాయువు అంద‌క రోగులు పిట్ట‌ల్లా రాలిపోతుండ‌టం.. ప్ర‌భుత్వ చేత‌గాని త‌న‌మే కాక మ‌రొక‌టి కాదంటున్నారు. ఆక్సిజ‌న్ ల‌భ్య‌త‌, స‌ర‌ఫ‌రా, అందుబాటుపై జ‌గ‌న్‌రెడ్డి స‌రైన చ‌ర్య‌లు చేపట్ట‌క పోవ‌డమే ప్ర‌స్తుత చావుల‌కు కారణ‌మ‌ని చెబుతున్నారు.  ఏపీ వ్యాప్తంగానే కాదు.. సీఎం జ‌గ‌న్‌రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌లోనూ వైర‌స్ కేసులు భారీగా విజృంభిస్తున్నాయి. క‌నీసం సొంత జిల్లాపైనైనా స‌రైన‌ దృష్టి పెట్ట‌ని అస‌మ‌ర్థ పాల‌కులు అధికారంలో ఉండ‌టంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నారు. ఇటీవ‌ల క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌కి రాసిన లేఖ‌.. క‌డ‌ప జిల్లాలో కొవిడ్ క‌ల్లోలం, ఆక్సిజ‌న్ కొర‌త‌ను క‌ళ్ల‌కు క‌డుతోంది. క‌డ‌ప జిల్లా ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ కొర‌త తీవ్రంగా ఉందంటూ.. లెక్క‌ల‌తో స‌హా కేంద్ర మంత్రికి వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి లేఖ రాశారు.  అయినా.. ఓ జిల్లా స‌మ‌స్య‌ను కేంద్రం నేరుగా ఎలా తీర్చ‌గ‌ల‌దు? మ‌రి, క‌డ‌ప జిల్లాను అంతగా ఆక్సిజ‌న్ కొర‌త వేధిస్తుంటే.. రాష్ట్రానికి కావ‌ల‌సినంత ఆక్సిజ‌న్‌ను ర‌ప్పించుకోవ‌డంలో ముఖ్య‌మంత్రి చేస్తున్న ప్ర‌య‌త్నాలేంటి?  సీఎం జ‌గ‌న్‌రెడ్డి విఫ‌లం అయ్యారు కాబ‌ట్టే.. ముఖ్య‌మంత్రి వ‌ల్ల కావ‌డం లేదు కాబ‌ట్టే.. ఎంపీ అవినాశ్‌రెడ్డి నేరుగా కేంద్రానికి లెట‌ర్ రాశారని అనుకోవ‌చ్చా? అంటే, త‌మ ముఖ్య‌మంత్రి క‌రోనా విష‌యంలో అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యార‌ని ఆయ‌నే ప‌రోక్షంగా ఒప్పుకుంటున్న‌ట్టేనా?  విశాఖ ఉక్కు క‌ర్మాగారం నుంచి ఎక్క‌డెక్క‌డికో ఆక్సిజ‌న్ అందిస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే ఇంత‌లా ప్రాణ‌వాయువు కొర‌త ఉంటే.. సీఎం కుర్చీలో కుర్చున్న జ‌గ‌న్‌రెడ్డి ఏం చేస్తున్న‌ట్టు?  ముఖ్య‌మంత్రి సొంత జిల్లాలోనే ఇంత‌లా మెడికల్ ఆక్సిజ‌న్ డిమాండ్ ఉంటే.. ఆ జిల్లా వాడై కూడా ప‌ట్టించుకోవ‌డం లేదంటే.. ఇక మ‌న ముఖ్య‌మంత్రిని ఏమ‌నాలి?  నీరో చ‌క్ర‌వ‌ర్తిలా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్‌రెడ్డిని ఇంకెంత‌లా త‌ప్పుబ‌ట్టాలి?  ప్ర‌జ‌ల ప్రాణాలంటే లెక్క‌లేదా? క‌రోనా క‌ట్ట‌డికి ప్యాలెస్ వీడి బ‌య‌ట‌కు రారా?  ప్ర‌జాక్షేత్రంలో ప‌ర్య‌టించి.. వాస్త‌వ ప‌రిస్థితులు, రోగుల క‌ష్ట‌, న‌ష్టాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌రా? అయినా, సొంత జిల్లాలో ఆక్సిజ‌న్ కొర‌త‌నే తీర్చ‌లేని ముఖ్య‌మంత్రి.. ఇక రాష్ట్రంలోని మిగ‌తా రోగులను ఎలా ఆదుకుంటారు? క‌రోనా మ‌హ‌మ్మారిని ఇంకేం క‌ట్ట‌డి చేస్తారు? అంటున్నాయి విప‌క్షాలు. 

జ‌గ‌న్‌ స‌ర్కారుపై తిరుగుబాటు.. రేష‌న్ వాహ‌నాలు రిటర్న్స్..

అంత‌న్నారు. ఇంత‌న్నారు. ఇంటి ద‌గ్గ‌రికే నిత్యావ‌స‌రాల పంపిణీ అన్నారు. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. ఆహో, ఓహో అంటూ ఊద‌ర‌గొట్టారు. కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు. క‌ట్ చేస్తే.. రేష‌న్ వాహ‌నాల ఆప‌రేట‌ర్లు నిండా మునిగారు. లాభ‌మే రాక‌, న‌ష్టాలే మిగిలాయి. అందుకే, ఇక త‌మ వ‌ల్ల కాదంటూ.. ఇలాంటి ప‌నికి మాలిన ప‌థ‌కాల‌తో తాము రోడ్డున ప‌డ్డామంటూ స‌ర్కారుపై తిరుగుబాటు జెండా ఎగ‌రేశారు. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ఇచ్చిన రేష‌న్ వాహ‌నాల‌ను ఆప‌రేట‌ర్లు స‌ర్కారుకే తిరిగిచ్చేస్తున్నారు. ఆ ప‌థ‌కంలోని డొల్ల త‌నం.. ఆ ఆప‌రేట‌ర్ల‌ను అప్పుల పాలు చేస్తోంది.  ఇంటి వద్దకు నిత్యావసరాలు పంపిణీ చేయలేమంటూ వాహనాల ఆపరేటర్లు తప్పుకుంటున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో 20 మంది వాహన ఆపరేటర్లు ఉన్నారు. వారిలో 10 మంది తమ వాహనాలను తహసీల్దారు కార్యాలయంలో అప్పగించారు. నెల‌కు తమకు వస్తున్న రూ.21 వేలు ఏ మూల‌కూ స‌రిపోవ‌డం లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. వ‌చ్చిందంతా.. పెట్రోల్‌, వాహన ఈఎంఐ, హమాలీకే సరిపోతోందని వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ కూడా అందడం లేదని ఆపరేటర్లు ఆందోళ‌న వెలిబుచ్చుతున్నారు.  తమకొచ్చే జీతంలో ఏమీ మిగలట్లేదని.. వెట్టి చాకిరి చేయడం తప్ప ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వాహనాలను తిరిగి ఇచ్చేశామని ఆపరేటర్లు స్పష్టం చేస్తున్నారు. వాహనం తీసుకునే సమయంలో తాము రూ.70 వేల వరకు ఖర్చు పెట్టామని.. దాన్ని ఇచ్చేస్తే వేరే ఉపాధి చూసుకుంటామని చెబుతున్నారు. ఇలా.. స‌రైన లాభ‌దాయ‌క‌మైన‌ విధాన‌మంటూ లేకుండా ఆర్బాటంగా ప్ర‌వేశ‌పెట్టిన ఇంటింటి రేష‌న్ కార్య‌క్ర‌మం ఆప‌రేట‌ర్ల నిరాక‌ర‌ణ‌తో అబాసుపాల‌వుతోంది. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ విధానాలు మ‌రోసారి విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. 

మోడీ భజన ఎందుకో తెలుసులే! జగన్ కు జేఎంఎం కౌంటర్

కొవిడ్ కట్టడి అంశంలో ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ వివాదం మరింత ముదురుతోంది. ప్ర‌ధాని మోడీకి స‌పోర్ట్ చేస్తూ.. స్వ‌యంగా మ‌రో రాష్ట్ర సీఎంకు కౌంట‌ర్ ఇస్తూ.. జగన్ ట్వీట్ చేయ‌డం జాతీయ స్థాయిలో రచ్చగా మారింది. తమ నేతను కౌంటరిస్తూ జగన్ చేసిన ట్వీట్ కు హేమంత్ సోరేన్ పార్టీ ఝార్ఖండ్ ముక్తి మోర్చా ఘాటుగానే స్పందించింది. మీ నిస్సహాయత గురించి దేశం మొత్తం తెలుసంటూ జగన్‌కు చురకలంటించింది. అంతేకాదు  మేము కూడా నిన్ను అభిమానించి, గౌరవిస్తున్నామని, మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నామని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.  ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో శనివారం ట్వీట్ చేసింది. ‘‘మీ నిస్సహాయత గురించి దేశం మొత్తం తెలుసు వైఎస్ జగన్.. అవును, మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాం.. గౌరవిస్తాం.. మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం’’ అని స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చింది. ట్వీట్‌కు జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదాపడిన న్యూస్‌ను ట్యాగ్ చేసింది జేఎంఎం.  శుక్రవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ కొవిడ్ పై మాట్లాడారు. ప్రధాని ఫోన్‌ సంభాషణ తర్వాత హేమంత్‌ సోరెన్‌ ‘గౌరవనీయ ప్రధానమంత్రి ఫోన్‌ చేశారు. కేవలం ఆయన మనసులోని మాట మాత్రమే చెప్పారు. దానికి బదులు పనికొచ్చే మాటలు చెప్పి, పనికొచ్చే మాటలు వింటే బాగుండేది’’ అని ట్వీట్‌ చేశారు. హేమంత్‌ ట్వీట్‌ను ఆక్షేపిస్తూ ఏపీ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ప్రధానిపై ఝార్ఖండ్ సీఎం సోరేన్ చేసిన విమర్శలను ఖండించారు. సోరేన్ వ్యాఖ్యలపై దేశంలో మరే ఏ ముఖ్యమంత్రి ఖండించలేదు. బీజేపీ ముఖ్యమంత్రులు, నేతలు కూడా కౌంటర్ ఇవ్వలేదు. ఏపీ సీఎం జగన్ మాత్రమే స్పందించారు.   ప్రధాని మోడీకి.. జగన్ మద్దతు తెలపడంతో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. జగన్ పై సీబీఐ, ఈడీ కేసులున్నాయి. గతంలో ఆయన జైలుకు వెళ్లారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు జగన్. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీపీఐ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ కూడా మొదలైంది. దీంతో ఏ క్షణాన్నైనా బెయిల్ రద్దై జగన్ తిరిగి జైలుకు వెళ్లక తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం మద్దతు ఉంటేనే జగన్ కు రాజకీయ మనుగడ సాధ్యం. అందుకే మోడీకి మోకరిల్లుతూ అడక్కుండానే జగన్ ట్విట్టర్ లో మద్దతు ఇచ్చి కేంద్రాన్ని మచ్చిక చేసుకుంటున్నారనే చర్చ జాతీయ స్థాయిలో జరుగుతోంది. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకే జగన్.. అడగకపోయినా, బీజేపీ నేతల కంటే స్పీడుగా, దూకుడుగా ప్రధాని మోడీకి అండగా నిలిచారని అంటున్నారు. దేశంలో క‌రోనా క‌ల్లోలానికి కారణమంటూ అంత‌ర్జాతీయ మీడియా మోడీని టార్గెట్ చేసింది. నిపుణులు హెచ్చ‌రిస్తున్నా.. సెకండ్ వేవ్‌పై చేతులెత్తేశారంటూ  ఏకిపారేస్తోంది. వ్యాక్సిన్ కొర‌త‌కు, ఆక్సిజ‌న్ లోటుకు ఆయ‌న చేత‌గాని త‌న‌మే కార‌ణ‌మంటూ కథనాలు వస్తున్నాయి. జన‌మంతా క‌రోనా దోషిగా న‌రేంద్ర మోడీపై దుమ్మెత్తిపోస్తుంటే.. ఏపీ సీఎం జగన్ మాత్రం ఆయ‌న్ను ఏమీ అనొద్దంటూ వెన‌కేసుకు వ‌చ్చారు. దీంతో జగన్ ట్వీట్‌పై నెటిజన్లు కూడా చరకలంటిస్తున్నారు. కరోనా ఇంత విపత్తు సమయంలోనూ ఎందుకీ మోడీ భజన అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైఎస్‌ఆర్సీపీ అభిమానులు కూడా జగన్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. వ్యాక్సిన్ విషయంలో కేంద్రాన్ని మీరు నిలదీయకుండా.. అడుగుతున్న వ్యక్తులను మీరెందుకు అడుగుతున్నారని చెప్పినట్టుందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

భార్య పీక కోసి.. ర‌క్తం పూసుకొని.. శవంతో సెల్ఫీ..

చూడ ముచ్చ‌టైన జంట‌. హ‌రి వెడ్స్ మంజుల‌. పెళ్లి స‌మ‌యంలో ఆ జంట‌ను చూసి అంతా భ‌లే ఉన్నారే అని సంబ‌ర ప‌డ్డారు. ఆ న‌వ దంప‌తులు సైతం ఆనందంగా త‌మ దాంప‌త్య జీవితాన్ని స్టార్ట్ చేశారు. మొత్తం ఏడు నెల‌ల దాంప‌త్య జీవితం. త్రీ మంత్స్ హ్యాపీ. దెన్ స్టార్టెడ్ ట్ర‌బుల్స్‌. ఎవ‌రి దిష్టి త‌గిలిందో ఏమో.. వారి కాపురంలో క‌ల్లోలం మొద‌లైంది. హ‌రిలో అనుమాన బీజం నాటుకుంది. అది మొక్కై.. మ‌హా వృక్ష‌మై.. అత‌న్ని నిలువెల్లా ఆక్ర‌మించేసింది. ఇక అంతే, భార్య‌పై అనుమానంతో మొగుడు కాస్తా య‌ముడిగా మారాడు.  క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్‌కు చెందిన హ‌రి, త‌న భార్య‌ మంజుల‌ వేరే ఎవ‌రితోనో అక్ర‌మ సంబంధం పెట్టుకుందంటూ ర‌గిలిపోయాడు. వాడెవ‌డో తెలీదు. ఎవ‌రితోనో ఫోన్లో మాట్లాడుతోంద‌నే డౌట్‌. ఎవ‌రితోనో ఛాటింగ్ చేస్తోంద‌ని సందేహం. నిజంగా ఆమెకు ఎవ‌రితోనో సంబంధం ఉంద‌నడానికి ఎలాంటి సాక్ష‌మూ లేదు. ఉన్న‌ద‌ల్లా.. అనుమానం ఒక్క‌టే. అదొక్క‌టి చాల‌దా? మ‌నిషిని మృగంగా మార్చేయ‌డానికి. హ‌రి విష‌యంలోనూ అదే జ‌రిగింది. అనుమానంతో.. భార్య‌పై అక్ర‌మ సంబందం నెపం మోపి.. అమానుషంగా ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లుపెట్టాడు. ప్ర‌తీ రోజూ భార్య‌కు టార్చ‌రే. మొగుడు చేతిలో చిత్ర‌హింస‌లే. ఇలా, కొన్ని నెల‌లుగా వారి ఇంట్లో గొడ‌వ‌లే గొడ‌వ‌లు.  రోజూ మాదిరే శుక్రవారం రాత్రి కూడా ఆ భార్యాభ‌ర్తలు పెద్ద‌గా గొడవపడ్డారు. కొంతసేప‌టికి నిద్ర పోయారు. తెల్లారేస‌రికి ఆమె శ‌వ‌మై ప‌డుంది. భ‌ర్త చేతిలో ప్రాణాలు కోల్పోయింది. భార్య‌పై ఎప్ప‌టి నుంచో అనుమానంతో కోపం పెంచుకున్న హ‌రి.. ఆ రోజు తెల్ల‌వారు జామున భార్యపై దారుణానికి పాల్ప‌డ్డాడు. కాల‌య‌ముడిగా మారాడు. గాఢనిద్రలో ఉన్న భార్యను కత్తితో పీకకోసి చంపేశాడు. తీవ్ర ర‌క్తస్రావంతో మంజుల అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు విడిచింది.  భార్య‌ను పీక కోసి చంపింనా శాంతించ‌లేదు ఆ శాడిస్టు మొగుడు. భార్య రక్తాన్ని ఒంటికి పూసుకొని ఉన్మాదిగా ప్ర‌వ‌ర్తించాడు. ర‌క్త‌పు మ‌డుగులో ప‌డున్న భార్య డెడ్‌బాడీతో సెల్ఫీ తీసుకుని.. పైశాచిక ఆనందం పొందాడు. వాడు మ‌నిషా? మృగ‌మా? విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హరిని అదుపులోకి తీసుకొని.. అత‌నిపై కేసు నమోదు చేశారు. హ‌రిని క‌ఠినంగా శిక్షించాల‌ని మంజుల కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

నారా లోకేష్ పై క్రిమినల్ కేసు 

మూడు కేసులు... ఆరు అరెస్టులుగా సాగుతోంది ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు. కరోనా కల్లోలంలోనూ టీడీపీ నేతలపై కేసులు ఆగడం లేదు. వైరస్ తో పోటీ పడుతున్నట్లుగా టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో టీడీపీ ముఖ్య నేతలను వివిధ కేసుల్లో అరెస్టులు చేస్తూ వస్తున్నారు పోలీసులు. తాజాగా శుక్రవారమే కర్నూల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై కేసు నమోదైంది. కరోనా నేపథ్యంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ  చంద్రబాబుపై  జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు పెట్టారు.  చంద్రబాబుపై కేసు నమోదు చేసిన కొన్ని గంటల్లోనే టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైనా క్రిమినల్ కేసు నమోదైంది. లోకేష్ పై అనంతపురం జిల్లా డి .హిరేహాళ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్.111/2021 అండర్ సెక్షన్ ఐ.పి.సి 153(A),505 and 506 గా కేసు నమోదు చేశారు పోలీసులు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘటనకు సంబంధించి లోకేష్ పై కేసు పెట్టారని తెలుస్తోంది.  ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డిని నిందిస్తూ,వార్నింగ్ లు ఇస్తూ ట్విట్టర్ మరియు ఇతర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ లు పెట్టారట. ఆ పోస్టులకు సంబంధించి కాపు రామచంద్రారెడ్డి  గౌరవానికి భంగం కలిగించారని పోలీసులకు  ఫిర్యాదు అందిందని చెబుతున్నారు. కాపు రామచంద్రారెడ్డి పై  ప్రజలలో వ్యతిరేకత ద్వేషం కలిగిస్తూ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్ట పరచడానికి కుట్రపన్నినట్లు ఫిర్యాదు చేయడంతో.. అందుకు బాధ్యులుగా నారా లోకేష్ పై కేసు నమోదు చేశారని సమాచారం. అనంతపురం జిల్లాలో లోకేష్ పై కేసు నమోదు కావడం దుమారం రేపుతోంది. సోషల్ మీడియా పోస్టులతో ఎలాంటి సంబంధం లేకున్నా... అనవసరంగా  రాజకీయ దురుద్ధేశంతో లోకేష్ పై కేసు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

ఫేస్ బుక్ లో పెళ్లి సంబంధాలు.. రూ . 11.70  లక్షలు  ఛీటింగ్.. 

ఒకప్పుడు ఏ పని చేసిన, చేయకపోయిన పెళ్లి మాత్రం సకాలంలో చేసుకునే వాళ్ళు. కానీ ఈ పోటీ ప్రపంచంలో మనిషికి పుట్టడం లేట్, ఆ మనిషికి  ఉద్యోగం రావడం లేట్. పెళ్లి  చేసుకోవడం లేట్. పిల్లలు కననడం లేటు. ఇలా ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మనిషి అన్ని లేట్ గానే చేసుకుంటున్నాడు. ఏ విషయం లో లేట్ అయినా పర్లేదు గానీ, ఒక పెళ్లి విషయం లో లేట్ అయితే సర్వమంగళమే.. పెళ్లి విషయంలో కూడా  రెండు మూడు సంవత్సరాలు లేట్ అయితే ఒకే, మరి ముదిరితే  అమ్మాయిలు అమ్మాయిలను చేసుకోవడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కూరగాయల షాప్ లో ముదిరిన బెండకాయల. అమ్మాయి గాని అబ్బాయి గానీ ముదిరింరంటే మూడు ముళ్ళు పడడం కష్టమే.. ఆ తర్వాత ఎవరు వచ్చిన పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు.. ఎవరు వచ్చిన చేసుకుందాం అనే సందేహం వచ్చిన వాళ్ళ డోర్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంచుతారు. చివరికి అలాంటి వాళ్ళే మోసపోతున్నారు.  ఎలానో మీరే చూడండి..    ప్రేమ, పెళ్లి  ఈ రెండు పేర్లతో జరగని మోసం లేదు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమాజంలో పెళ్లంటే లైట్ తీసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా. ఆమె పేరు పతంగి మహేశ్వరి, అలియాస్ ధరణి రెడ్డి. మహేశ్వరి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. కానీ ఆమె పేరుతో కాదు. ఇందు దాసరి అనే ఫేక్ పేరుతో ఫేస్‌బుక్‌ అకౌంట్ ఓపెన్ చేసింది. ముందుగా ఇన్బాక్స్ లో హాయ్ అని సెండ్ చేస్తుంది. ఆ తర్వాత మగాళ్ల వీక్నెస్ పట్టుకుంటుంది. అందులో పరిచయం అయ్యే యువకులకు వలపు వల విసురుతూ వారి వద్ద నుంచి డబ్బులు దండుకోవటం మొదలెట్టింది. పెళ్లి సంబంధాలు పేరుతో అబ్బయిల ప్రొఫైల్ మార్చి ఫేక్ ఐడీలను క్రియేట్ చేసింది. ఈ క్రమంలో కొందరు అబ్బాయిలతో పరిచాయలు పెంచుకొని వారిని బ్లాక్ మెయిల్ చేసింది.  ఈ క్రమంలో ఆమెపై హైదరాబాద్‌ కొంపల్లికి చెందిన బొమ్మెల వెంకటేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను బెదిరించి డబ్బులు తీసుకోవడమే కాక సోషల్ మీడియాలో తాము షేర్‌ చేసిన ఫొటోలను ఉపయోగించి పెళ్లి సంబంధాల పేరిట ఆడపిల్లల తల్లిదండ్రుల వద్ద సంబంధం కుదిరిస్తానని మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు వెంకటేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకొని అతడితో నగ్నంగా వీడియో చాటింగ్‌ చేసి వాటిని వేరే వారికి చూపిస్తానని బెదిరించేదన్నారు. అంతేకాకుండా అతని బంధువు, సోదరుడైన బొమ్మెల అనుదీప్‌ అనే వ్యక్తితో సైతం సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకొని అతడి ఫొటోలను సేకరించి మూడు నెలలుగా డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తుందన్నాడు. తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరిస్తున్నదని చెప్పారు. డబ్బు ఇవ్వకపోతే తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని హెచ్చరిస్తుందని తెలిపాడు. పెళ్లి సంబంధాల పేరుతో అబ్బాయిల ఫోటోలు పేర్లు మార్చి.. వాళ్ల ప్రోఫైల్ మార్చి చెపుతూ మోసాలకుపాల్పడిందని పోలీసులు హెచ్చరించారు. పలువురు బాధితుల వద్ద నుంచి ఆమె ఇటీవలల రూ. 11.70 లక్షలూ వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పదుల సంఖ్యలో ఆమె బాధితులు ఉన్నారు. ఈ కిలాడీ లేడీ నల్లగొండ పట్టణంలోని వన్‌ టౌన్‌ పరిధిలో నివాసం ఉంటున్నట్లుగా గుర్తించి నల్లగొండ వన్‌ టౌన్, మహిళా పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది ఆధ్వర్యంలో అరెస్ట్‌ చేసినట్లు వివరించారు. ఈ లేడీపై కూకట్‌పల్లి, ఘట్‌ కేసర్, ఖమ్మం, సత్తుపల్లి, వేంసూరు పోలీస్‌స్టేషన్లతో పాటు కరీంనగర్‌ షీటీమ్, గచ్చిబౌలి సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు.

త్వరలో చంద్రబాబు అరెస్ట్! కర్నూల్ పోలీసుల క్లారిటీ...

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కర్నూలులో కేసు నమోదు కావడం రాజకీయంగా కలకలం రేపుతోంది.న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదుతో చంద్రబాబుపై 188, 505/1/బి/2, 54 సెక్షన్లు, జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేశారు కర్నూల్ వన్ టౌన్ పోలీసులు. చంద్రబాబుపై కేసు నమోదు కావడంతో.. త్వరలోనే ఆయన్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు పెట్టడం టీడీపీలో కలవరం రేపుతోంది. కరోనా నేపథ్యంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ చంద్రబాబుపై న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. కర్నూలులో ఎన్440కే వైరస్ ఉందంటూ భయపెడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తారంటూ వస్తున్న వార్తలపై కర్నూల్ జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప స్పందించారు. ఎన్ 440కే వైరస్‌పై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఈకేసులో చంద్రబాబు‌కు నోటీసులు ఇస్తామని తెలిపారు. చంద్రబాబుకు నోటీస్ ఇచ్చి 7 రోజుల్లోపు హాజరు కావాలని కోరుతామన్నారు. శాస్త్రీయంగా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తగిన నిర్ణయం తీసుకుంటారని కర్నూల్ ఎస్పీ డా.ఫక్కీరప్ప చెప్పారు. 

తెలంగాణ‌లో ఆంధ్రా మేయ‌ర్లు!.. అక్క‌డ సెటిల‌ర్ల‌దే రాజ్యం..

ఖ‌మ్మం కార్పొరేష‌న్ టీఆర్ఎస్ కైవ‌సం చేసుకుంది. మ‌హిళ‌ల‌కే మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వులు వ‌రించాయి. ఖమ్మం మేయర్‌ పునుకొల్లు నీరజ. డిఫ్యూటీ మేయర్‌ షేక్‌ ఫాతిమా జోహ్రా. అయితే, వీరిద్ద‌రు తెలంగాణ రాష్ట్రీయ స‌మితి నుంచే ఎన్నికైనా.. వీరి స్వ‌స్థ‌లం మాత్రం ఆంధ్రా ప్రాంతం కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. తెలంగాణ గ‌డ్డ‌పై.. ఆంధ్ర‌లో పుట్టిన ఇద్ద‌రు మ‌హిళ‌లు.,. అధికార పీఠంపై కూర్చోవ‌డం విశేషంగా మారింది. ఏపీకి స‌రిహ‌ద్దు జిల్లా అయిన ఖ‌మ్మం రాజ‌కీయ భిన్న‌త్వం  చ‌ర్చ‌నీయాంశ‌మైంది.  ఖ‌మ్మం మేయ‌ర్‌గా ఎన్నికైన‌ నీరజ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఆగిరిపల్లి గ్రామం. ఆమెకు పెదపారుపూడికి చెందిన పునుకొల్లు రామబ్రహ్మంతో వివాహం జ‌రిగింది. ఈ కుటుంబం 1988లో ఖమ్మం వచ్చి వ్యాపార రంగంలో సెటిల్‌ అయ్యారు. 2005లో టీడీపీ తరపున 23వ డివిజన్‌ నుంచి తొలిసారిగా కౌన్సెలర్‌గా పోటీచేసి గెలుపొందారు. ఆ త‌ర్వాత‌ 2016లో 17వ డివిజన్‌ కార్పోరేటర్‌గా గెలిచారు. తాజా, ఎన్నికల్లో 26వ డివిజన్‌లో గెలిచి.. ముచ్చ‌ట‌గా మూడోసారి కార్పొరేట‌ర్ కావ‌డ‌మే కాకుండా.. ఏకంగా మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సుల‌తోనే మేయ‌ర్ పీఠం ద‌క్కింది. క‌మ్మ సామాజిక వ‌ర్గం కావ‌డ‌మూ క‌లిసొచ్చింది. మేయ‌ర్ నీర‌జ భ‌ర్త రామ‌బ్ర‌హ్మం.. మంత్రి పువ్వాడ‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకూ సన్నిహితుడే. రామబ్రహ్మం మూడు దఫాలుగా డీసీసీబీ డైరెక్టర్‌గా ఎన్నికవుతూ వస్తున్నారు. మొద‌ట తెలుగుదేశం పార్టీలో ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లో కీల‌క నేత‌గా ఎదిగారు.  ఇక డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన షేక్‌ ఫాతిమా జోహ్రా స్వస్థలం గుంటూరు. 1984 మే 10న జన్మించిన ఆమె పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. ఆమె భర్త ముక్తార్‌ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు నమ్మిన బంటుగా ఉన్నారు. గతంలోనే ముక్తార్‌కు సుడా డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. ప్ర‌స్తుతం మైనారిటీ కోటాలో ముక్తార్‌ భార్యకు డిప్యూటీ మేయర్‌ పదవి వ‌రించింది.  ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ఇద్ద‌రూ సెటిల‌ర్సే కావ‌డం ఇక్క‌డ ఇంట్రెస్టింగ్ పాయింట్‌. ఖమ్మంను సెటిలర్ల గుమ్మం అంటారు. పేరుకు తెలంగాణ అయితే.. ఇక్కడి భాష, యాస‌, అలవాట్లు, ఆచారాలపై ఆంధ్ర ప్ర‌భావం ఎక్కువ‌. ఏపీతో సుదీర్ఘ సరిహద్దులు.. విస్తృత బంధుత్వాలు.. ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ప‌లు జిల్లాల నుంచి అనేక మంది ఖ‌మ్మంకు వ‌ల‌స వ‌చ్చి.. వ్య‌వ‌సాయంతో పాటు వివిధ‌ వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తున్నారు. ఇలా సెటిల్ అయిన వారిలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే అధికం. విద్య‌, వైద్య రంగం, మైనింగ్‌, సింగరేణి, కేటీపీఎస్‌ తదితర రంగాలలో ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్‌ అయిన వారి సంఖ్య చెప్పుకోదగినదే. ఈ క్రమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పలు ఉద్యమాల్లోనూ ఆంధ్ర సెటిలర్లు పెద్ద సంఖ్య‌లో భాగ‌స్వామ్య‌మై గ‌ట్టిగానే పోరాడారు. ఉద్యమంలో త‌మ వంతుగా చురుకైన పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ సాకారం అనంతరం.. సీఎం కేసీఆర్ సైతం సెటిల‌ర్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ వ‌స్తున్నారు. గణనీయంగా ఉన్న సెటిలర్ల ఓటు బ్యాంకును టీఆర్ఎస్ వైపున‌కు తిప్పుకున్నారు. తాజాగా, ఖ‌మ్మం కార్పొరేష‌న్ మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్లుగా ఆంధ్రా ప్రాంతం నుంచి వ‌చ్చిన మ‌హిళ‌ల‌కు ఇచ్చి.. రెండు ప‌ద‌వుల‌తో.. రెండు సామాజిక వ‌ర్గాలు.. రెండు ప్రాంతల ఓట‌ర్ల‌ను గంప‌గుత్త‌గా త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్నారు. 

జాతీయ రాజకీయాలపై బెంగాల్ ఫలితాల ప్రభావం?

ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాలు, పలికే ప్రగల్బాలు ఎలాఉన్నా అంతిమంగా ప్రజలు ఇచ్చే తీర్పే ప్రజాస్వామ్య మనుగడకు మూల ఔషదంగా నిలుస్తుంది. ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుంది. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు జరిగిన ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పు నిస్సందేహంగా ప్రజాస్వామ్య పునాదులను  బలోపేతం చేసింది. అందులో ఏ మాత్రం సందేహంలేదు. ముఖ్యంగా అధికారాన్ని ఎవరికీ ఇచ్చిన ప్రతిపక్షాన్ని విస్మరించలేదు. ప్రజాస్వామ్యం మనుగడకు ప్రతిపక్షాల అవసరాన్ని ప్రజలు గుర్తించారు. ఇదొక శుభ పరిణామం.  ఎన్నికలు జరిగన ఐదు రాష్ట్రాలలో  మూడు రాష్ట్రాలు  అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళలలో ఓటర్లు అధికార పార్టీకి మళ్ళీ మరో అవకాశం ఇచ్చారు. అస్సాంలో బీజేపీ, బెంగాల్లో తృణమూల్, కేరళలో వామపక్షకూటమి  అధికారాన్నినిలబెట్టుకున్నాయి.తమిళనాడులో,అన్నాడీఎంకే,పుదుచ్చేరిలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయాయి.డిఎంకే అధినాయకుడు కరుణానిధి,అన్నా డిఎంకే అధినాయకురాలు జయలలిత లేకుండా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో, ఎంకే స్టాలిన్ సారధ్యంలోని డిఎంకే అధికారాన్ని హస్త గతం చేసుకుంది. పుదుచ్చేరీలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎ అధికారంలోకి వచ్చింది. పుదుచ్చేరీలో బీజేపీ బలం నామమాత్రమే. 30 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీకి దక్కింది ఆరు స్థానాలు మాత్రమే. అయితే బీజేపీ మిత్ర పక్షం ఎన్ఆర్సీ 10 స్థానాలు గెలుచుకుంది. దాంతో, తొలిసారిగా, బీజేపీ శాసనసభలో అడుగుపెట్టింది. అది కూడా అధికార పార్టీగా ఎంట్రీ ఇచ్చింది. అలాగే, ఉత్తరాది పార్టీగా అక్కడి ప్రజలు ఇంతవరకు దూరం పెట్టిన, ద్రవిడ రాష్ట్రం తమిళనాడులో డిఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఇన్నేళ్ళలో తొలిసారిగా నాలుగు స్థానాలు గెలుచుకుంది. సంఖ్యా పరంగా చూస్తే, ఇదేమంత గొప్ప విజయం అనిపించుకోదు, కానీ, ఇంతవరకు ఉనికే లేని తమిళ రాజకీయాల్లో అంతో ఇంతో స్థానం సంపాదించుకోవడం చెప్పుకో దగ్గ విశేషమే. పొరుగున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంలో  అధికారంలోకి రావడం ఒక విధంగా విశేషమే.  అందరి చూపు బెంగాల్ పై కేంద్రీకృతం కావడంతో, మిగిలిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పక్కకు పోయి, బెంగాల్ ఒక్కటే, నేషనల్ ఫోకస్’లోకి వచ్చింది.అయితే, బెంగాల్ విషయంలోనూ, బీజేపీ అధికారంలోకి రాలేదన్న ఆనందమో మరేమో గానీ, చాలా వరకు మీడియా సంస్థలు, రాజకీయ విశ్లేషకులు బెంగాల్లో బీజేపీ బలం గణనీయంగా పెరిగిందనే వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. అలాగే, రాష్ట్రాన్ని సుమారు 60 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు నామరూపాలు లేకుండా తుడిచి పెట్టుకో పోయాయి అనే విషయాన్ని కూడా మేధావులు, విశ్లేషకులు అంతగా పట్టించుకోవడం లేదు. బహుశా ఆ రెండు పార్టీలను  మేథావులు, విశ్లేషకులు చరిత్రలో కలిపెసారో ఏమో.. అదలా ఉంచి బీజేపీ విషయానికి వస్తే ఐదేళ్ళ క్రితం, 2016లో కేవలం మూడంటే మూడు అసెంబ్లీ స్థానాలలో మాత్రమే విజయం సాధించిన బీజేపీ ఈ ఎన్నికలలో అదే మూడు తక్కువ 80 స్థానాల్లో (77) విజయం సాధించింది. అదే సమయంలో గత ఎన్నికల్లో 70 స్థానాలో గెలిచిన కాంగ్రెస్, కమ్యూనిస్ట్ కూటమి  కనీసం ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేక పోయింది. అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానాన్ని కమల దళం పూర్తిగా కబ్జా చేసింది. ఇది కూడా మాములు విజయం కాదు. అసలు ఉనికే లేని చోట ఇతర ప్రతిపక్షాలను పూర్తిగా భూస్థాపితం చేసి, అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్ధిగా ఎదిగి రావడం సామాన్య విషయం, సాధారణ విజయం కాదు. అయితే, సంవత్సరం క్రితం జరిగిన లోక్ సభ  ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 18 స్థానాలు గెలుచుకోవడంతో , ఆ ఫలితాలతో పోల్చుకుని బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశించిన కమల దళం అభిమానులకు, బీజేపీ అధికారంలోకి వస్తుందని భయపడిన మిత్రులకు మాత్రం నిరాశే మిగిలింది.  లోక్ సభ ఎన్నికల నుంచి బెంగాల్లో బీజేపీ  అసెంబ్లీ ఎన్నికలపై ఆశలు పెంచుకుంది. అధికారం కోసం ‘అతిగా’ శ్రమించింది. ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి, పార్టీ ప్రధాన వ్యూహ కర్త అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇంకా అనేక మంది కేంద్ర మంత్రులు, ఇతర అగ్ర నేతలు, చాలా ముమ్మరంగా ప్రచారం సాగించారు. ముఖ్యంగా అమిత్ షా 200 ప్లస్ మంత్రంతో సాగించిన ప్రచారం ఫలించక పోవడంతో, బీజేపీ ఓడి పోయిందనే భావన ఏర్పడింది. కానీ, నిజానికి ఓడి పోయింది కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, తృణమూల్ అధికారాన్ని నిలుపుకుంది. బీజేపీ ఒక్కటే బలాన్ని పెంచుకుంది.  ఒక్క బెంగాల్ లోనే కాదు మొత్తంగా చూసినా, ఈ ఎన్నికలలో ఎక్కువగా లాభపడిన, బలపడిన పార్టీ బీజేపీ. అస్సాంలో అధికారం నిలుపుకుంది. పుదుచ్చేరీలో అధికారంలోకి వచ్చింది. బెంగాల్లో బలమైన ప్రతిపక్షం స్థాయికి ఎదిగింది. తమిళనాడులోనూ, ‘ఉన్నాను’ అనుపించుకుంది. ఒక్క కేరళలో మాత్రమే ఉన్న ఒక్కసీటును కూడా నిలుపుకోలేక పోయింది. మరో వంక కాంగ్రెస్ పార్టీ పుదుచ్చేరిలో అధికారం కోల్పోయింది. కేరళలో ఆనవాయితీకి భిన్నంగా కాంగ్రెస్ సారధ్యంలోని యూడీఎఫ్ కూటమి ఓడి పోయింది. గత లోక్ సభ ఎన్నికల్లో  మొత్తం 20 స్థానాలకు గానూ 15 స్థానాలలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ, అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడింది. తమిళనాడులో, డిఎంకే మిత్ర పక్షంగా కొద్దిగా  మెరుగైన ఫలితాలు సాధించింది. కొద్దిపాటి ఊరట లభించిది.  జాతీయ రాజకీయాలను విశ్లేషించుకుంటే జాతీయ స్థాయిలో బీజేపీ ప్రత్యాన్మాయంగా నిలవగలిగే జాతీయ పార్టీ, ప్రస్తుతానికి అయితే ఏదీ లేదు. అది బెంగాల్లో మమత అయిన మరో రాష్ట్రంలో మరో పార్టీ అయినా బీజేపీకి ప్రాంతీయ పార్టీలే ప్రధాన ప్రత్యర్ధి పార్టీలు.  బెంగాల్లో, బీజేపీ ఓటమికి ఇంకా చాలా కారణాలు ఉన్నా, ముఖ్యమంత్రి ‘చెహరా’ ముఖం లేక పోవడం కూడా ఒక ప్రధాన కారణం. లోక్ సభ ఎన్నికల్లో, ప్రతిపక్షాల పరిస్థితి కూడా అదే. అదీగాక, పరిణతి చెందిన భారతీయ ఓటరు ఏ ఎన్నికలకు ఆ ఏన్నికల్లో ప్రత్యేకంగానే తీర్పు నిస్తున్నారు. కాబట్టి, బెంగాల్లో, ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది కాబట్టి, బీజేపీ పనైపోయిందని అనుకోవడం రాజకీయ విజ్ఞత, వివేకం అనిపించుకోదు. అలాగే, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని అనుకోలేము. రాజకీయాలు నిశ్చలన చిత్రాలు కాదు.. చలనచిత్రాలు ఏఆటీఆఊడూ సీన్ మారుతూ ఉంటుంది.  అందుకే రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని అంటారు.  

స్టాలిన్ కేబినెట్ లో ఐదుగురు తెలుగువారు

తమిళనాడులో  డీఎంకే పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన స్టాలిన్... 34 మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో ఐదుగురు తెలుగువారికి అవకాశం దక్కింది. తాజా ఎన్నికల్లో 15 మంది తెలుగు వారు వివిధ పార్టీల ద్వారా తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీరిలో కేకేఎస్ రామచంద్రన్, ఏ వేలు , ఆర్ గాంధీ , పీకే శేఖర్ బాబు, కేఎన్ నెహ్రూకు స్టాలిన్ మంత్రివర్గంలో చోటు దక్కింది.  తెలుగువారందరికీ స్టాలిన్ కీలక శాఖలను అప్పగించారు. అరుప్పుకొట్టై ఎమ్మెల్యేగా గెలిచిన కేకేఎస్ రామచంద్రన్ కు  కీలకమైన రెవెన్యూ శాఖను కేటాయించగా..  తిరువణ్ణామలై ఎమ్మెల్యే ఏ వేలుకుడబ్ల్యూడీ శాఖ దక్కింది. రాణిపేట నుంచి విజయం సాధించిన ఆర్ గాంధీకి టెక్స్ టైల్ శాఖను కట్టబెట్టారు.  చెన్నై దురైముగం నియోజకవర్గం ఎమ్మెల్యే పీకే శేఖర్ బాబుకి దేవాదాయశాఖ మంత్రిగా అవకాశం లభించింది. తిరుచ్చి వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఎన్ నెహ్రూకు మున్సిపల్ శాఖ మంత్రి కేటాయించారు స్టాలిన్.  గతంలో సీఎంలుగా పనిచేసిన కరుణానిధి, జయలలిత, పళనిస్వామి, పన్నీర్ సెల్వం అందరూ తమ కేబినెట్లో తెలుగువారికి ప్రాతినిధ్యాన్ని కల్పించారు. స్టాలిన్ కూడా అదే ఒరవడిని కొనసాగించారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. అందుకే ఆయా ప్రాంతాల్లో అన్ని పార్టీలు తెలుగువారికి టికెట్లు ఇస్తుంటాయి.గతంలో బాలకృష్ణారెడ్డి, కదంబురు రాజు వంటి వారు పదేళ్ల పాటు మంత్రులుగా పని చేశారు.

కారులో నలుగురు చిన్నారుల మృతి.. 

చిన్న పిల్లలు బాగా అల్లరి చేస్తుంటారు. మారం చేస్తుంటారు. కొన్ని సార్లు పిల్లలకు ఏదైనా కావాలి అంటే తెచ్చి పెట్టాల్సిందే.. వాళ్ళు అడిగింది చెయ్యాల్సిందే. లేదంటే వారి ఏడుపు ద్వారా తల్లి దండ్రులకు మనశాంతి ఉండదు. అలాంటి అల్లరి చేయడం వాళ్ళ కొంత మంది పిల్లలు అనర్ధాలకు దారి తీస్తుంది. తాజాగా అలా అల్లరి చేసిన నలుగురు పిల్లలు చివరికి మృత్యువాత పడ్డారు..  ఓ ఇంటి ముందు పార్కు చేసి ఉంది. ఆ కారును చూడగానే అక్కడ ఉన్న ఐదుగురు పిల్లలు సరదాపడ్డారు. అందరూ ఆ కారులోకి వెళ్లారు.. సంతోషంగా ఆదుకున్నారు. అసలే చిన్న పిల్లలు ఒక చోటు ఉండరు. అలా అని వాళ్ళ చేతులు కూడా ఊరుకోవు.. ఆ నలుగురిలో ఎవరు ఏం చేశారో. ఏమో ఒక్కసారిగా కారు లాక్ పడింది..  దీంతో వారంతా అందులోనే ఉండిపోయారు. అందరూ ఆందోళన చెందారు. గట్టిగా అరిచారు అయినా ఎవరు వినిపించలేదు. కనీసం అటువైపు ఎవరు చూడలేదు. ఆ పిల్లలకి  ఊపిరాడ‌లేదు. వారిని గుర్తించి బ‌య‌ట‌కు తీసే స‌మ‌యానికే న‌లుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఆ చిన్నారులు అంద‌రూ పదేళ్ల‌లోపు వ‌య‌సున్న వారే అని వివ‌రించారు. చిన్నారుల‌ మృత‌దేహాల‌ను పోస్టుమార్టంకు త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. వారు ఊపిరాడ‌క మృతి చెందిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింద‌ని చెప్పారు. మ‌రొక చిన్నారికి ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సింగౌలిత‌గా గ్రామంలో చోటు చేసుకుంది.   

కేసుల భయంతోనే ట్వీట్! మోదీకి జగన్ మద్దతుపై రచ్చ..

ట్విట‌ర్‌లో మోదీకి జ‌గ‌న్ స‌పోర్ట్‌. క‌ట్ చేస్తే, సాక్షి మీడియాలో కేంద్ర వైఫ‌ల్యాల‌పై న్యూస్‌. ఓవైపు ప్ర‌ధానికి అండ‌గా ఉండాలంటూ జ‌గ‌న్ హిత‌వు. మ‌రోవైపు, మోదీ చేత‌గాని త‌నం వ‌ల్లే దేశంలో క‌రోనా క‌ల్లోల‌మంటూ సాక్షి పేప‌ర్లో క‌థ‌నాలు. ఇలా.. మోదీ, కేంద్రం, క‌రోనా అంశంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి డ‌బుల్ గేమ్ ఆడుతున్నాడ‌ని అంటున్నారు. సీఎం జ‌గ‌న్ చేసిన ట్వీట్‌.. సాక్షిలో వ‌స్తున్న స్టోరీస్‌.. జ‌గ‌న్‌రెడ్డి కాంట్ర‌వ‌ర్సీ పాలిటిక్స్‌పై జాతీయ స్థాయిలో వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు.. ఇవ‌న్నీ ఏపీ కేంద్రంగా ఢిల్లీ స్థాయిలో కాక రేపుతున్నాయి. సీఎం జ‌గ‌న్‌ను దోషిగా బోనులో నిల‌బెడుతున్నాయి. దేశంలో క‌రోనా క‌ల్లోలం. ఇప్ప‌టికే 2కోట్ల మందికిపైగా పాజిటివ్‌. 2 ల‌క్ష‌ల మందికి పైగా మృత్యువాత‌. ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితికి కార‌ణం ఎవ‌రంటే అన్ని వేళ్లూ ప్ర‌ధాని వైపే. అంత‌ర్జాతీయ మీడియా మోదీని నిప్పుల‌తో క‌డిగేస్తోంది. విమ‌ర్శ‌ల‌తో శ‌ల్య‌ప‌రీక్ష చేస్తోంది. నిపుణులు హెచ్చ‌రిస్తున్నా.. సెకండ్ వేవ్‌పై చేతులెత్తేసిన మోదీని ఇంటా, బ‌య‌టా అంతా ఏకిపారేస్తున్నారు. వ్యాక్సిన్ కొర‌త‌కు, ఆక్సిజ‌న్ లోటుకు ఆయ‌న చేత‌గాని త‌న‌మే కార‌ణ‌మంటూ మోదీని తూట్లు పొడుస్తున్నారు. జన‌మంతా క‌రోనా దోషిగా న‌రేంద్ర మోదీపై దుమ్మెత్తిపోస్తుంటే.. ఏపీ సీఎం జగన్ మాత్రం ఆయ‌న్ను ఏమీ అనొద్దంటూ వెన‌కేసుకు వ‌స్తున్నారు.  కరోనా నియంత్రణపై ప్రధాని మోదీ గురువారం జరిపిన ఫోన్‌ సంభాషణను విమర్శిస్తూ జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ట్వీట్‌ చేయడం.. దాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఖండించడం జాతీయ, ప్రాంతీయ‌ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ‘గౌరవనీయ ప్రధానమంత్రి ఫోన్‌ చేశారు. కేవలం ఆయన మనసులోని మాట  చెప్పారు. దానికి బదులు పనికొచ్చే మాటలు చెప్పి, పనికొచ్చే మాటలు వింటే బాగుండేది’’ అంటూ హిందీలో ట్వీట్‌ చేశారు హేమంత్‌ . ఈ ట్వీట్‌కు ఏపీ సీఎం జగన్‌ కౌంట‌ర్ ట్వీట్ చేశారు. ‘‘ప్రియమైన హేమంత్‌ సోరెన్‌, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. మన మధ్య ఎన్ని విభేదాలున్నా ఇలాంటి రాజకీయాలు చేయడం తగదని, అది మన జాతిని బలహీనపరుస్తుందని ఒక సోదరుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. మనం కొవిడ్‌పై పోరాడుతున్నాం. ఇది ఒకరినొకరు వేలెత్తి పించుకునే తరుణం కాదు. మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో మనమంతా చేయీచేయి కలిపి ప్రధానికి అండగా నిలవాల్సిన సమయమిది’అంటూ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.  సీఎం జ‌గ‌న్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు రాజ‌కీయ మంట రాజేస్తోంది. ప్ర‌ధాని మోదీకి స‌సోర్ట్ చేస్తూ.. స్వ‌యంగా మ‌రో రాష్ట్ర సీఎంకు కౌంట‌ర్ ఇస్తూ.. జగన్ ట్వీట్ చేయ‌డం వెనుక పెద్ద రాజ‌కీయ‌మే న‌డిచింద‌నే అనుమాన‌మూ వ్య‌క్తం అవుతోంది. సాధార‌ణంగా ఇలాంటి మోదీ వ్య‌తిరేక ట్వీట్ల‌పై బీజేపీ నాయ‌కులే కౌంట‌ర్ల‌తో విరుచుకుప‌డుతుంటారు. కానీ ఈసారి ఆ పనిని ఏపీ సీఎం జగన్ తీసుకున్నారు. ప్రధాని మోడీని మద్దతుగా జార్ఖండ్ సీఎం చేసిన ట్వీట్ కు కౌంటరిచ్చారు. జగన్ ట్వీట్ జాతీయ స్థాయిలో రచ్చగా మారింది. జగన్ పై సీబీఐ, ఈడీ కేసులున్నాయి. గతంలో ఆయన జైలుకు వెళ్లారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు జగన్. ఏ క్షణాన్నైనా ఆయన బెయిల్ రద్దై జైలుకు వెళ్లేదు తెలియదు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం మద్దతు ఉంటేనే జగన్ కు రాజకీయ మనుగడ సాధ్యం. అందుకే మోడీకి మోకరిల్లుతూ అడక్కుండానే జగన్ ట్విట్టర్ లో మద్దతు ఇచ్చి కేంద్రాన్ని మచ్చిక చేసుకుంటున్నారనే చర్చ జాతీయ స్థాయిలో జరుగుతోంది. ఇదే అర్ధం వచ్చేలా కాంగ్రెస్ ఎంపీ ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది.  ‘కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వంటి పెద్ద నాయకుడి కుమారుడివై ఉండి.. సీబీఐ, ఈడీ దాడులకు భయపడి, మీ రాజకీయ ప్రయోజనాల కోసం మోదీతో ఇలా లాలూచీ పడటం సరికాదు. మీరు ఎదగాలి జగన్‌.. ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు’అంటూ సూటిగా, ఘాటుగా ఒడిశా కాంగ్రెస్‌ ఎంపీ సప్తగిరి ఉలాకా చేసిన రీట్వీట్‌ రాజ‌కీయంగా ఆస‌క్తిక‌రంగా మారింది. త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత నిచ్చెలి శ‌శిక‌ళ సైతం జ‌గ‌న్ తీరుపై ట్విట్ట‌ర్‌లో వ‌రుస ట్వీట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఇంత‌టి వెన్నుముఖ లేని నాయ‌కుడు జ‌గ‌న్ అని తాను అనుకోలేద‌న్నారు. జ‌గ‌న్ ట్విటర్ ఐడీని.. బీజేపీ ఐటీ సెల్ హ్యాండిల్ చేస్తోందా? అని అనుమానం వ్య‌క్తం చేస్తూనే.. షేమ్ మిస్ట‌ర్ జ‌గ‌న్‌.. అంటూ శ‌శిక‌ళ ట్వీట్ చేశారు. మోదీ చెప్పిన‌ట్టు చేసే మ‌నిషి జ‌గ‌న్ అంటూ..  మ‌రో ట్వీట్ కూడా చేశారు. త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌లో లాక్‌డౌన్ పెట్టినా ప‌ట్టించుకోని జ‌గ‌న్‌.. త్వ‌ర‌లో ఆ రాష్ట్రాల‌ను చూసి సిగ్గులేకుండా ఆయ‌న లాక్‌డౌన్ పెడ‌తారంటూ ఎద్దేవా చేశారు. ఇలా మోదీకి మ‌ద్ద‌తుగా జ‌గ‌న్‌రెడ్డి చేసిన ట్వీట్ పై..  మోదీ మ‌నిషంటూ జాతీయ స్థాయి నాయ‌కులు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని విమ‌ర్శ‌ల‌తో కుళ్ల‌బొడుస్తున్నారు.  అయితే నేష‌న‌ల్ లీడ‌ర్స్‌కి జ‌గ‌న్‌రెడ్డి నిజ‌స్వ‌రూపం గురించి స‌గం మాత్ర‌మే తెలుసు. ఆయ‌న‌లోని అప‌రిచితుడి స్వ‌భావం వారికి పూర్తిగా తెలుసుండ‌దు. జ‌గ‌న్‌రెడ్డి రాజ‌కీయంగా ఎంత క‌న్నింగ్, ఎంత ఖ‌త‌ర్నాక్‌, ఎంత డ‌బుల్ గేమ్ లీడ‌రో ఏపీలోకి తొంగి చూస్తే కానీ అర్థం కాదు. తాజా  మోదీ ఎపిసోడ్‌నే తీసుకుంటే.. మ‌రింత లోతుగా ప‌రిశీలిస్తే.. జ‌గ‌న్‌రెడ్డి ఆడుతున్న రెండు నాలుక‌ల పొలిటిక‌ల్ గేమ్‌పై కాస్తైనా క్లారిటీ వ‌స్తుంది. బీజేపీ జాతీయ స్థాయి నాయ‌కులంతా ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉంటారు. అక్క‌డ ఏ చిన్న మాట అన్నా.. వారి దృష్టిలో ఇట్టే ప‌డ‌తారు. అందుకే మోదీపై త‌న‌కున్న భ‌క్తిని, భ‌యాన్ని చాటుకునేందుకు ఆయ‌నే సొంతంగా ఈ ట్వీట్ చేశారని అంటున్నారు.   క‌ట్ చేస్తే.. బీజేపీతో మిలాఖ‌త్ అనే విష‌యం తెలిస్తే.. ఏపీ ప్ర‌జ‌లు జ‌గ‌న్‌ను అస‌హ్యించుకుంటారు. అందుకే, ఇక్క‌డి వారిని బురిడీ కొట్టించేందుకు.. త‌న సొంత సాక్షి మీడియాలో కేంద్రానికి వ్య‌తిరేకంగా వ‌రుస‌గా ఆర్టిక‌ల్స్ వ‌చ్చేలా చూసుకుంటున్నారు. క‌రోనా కట్ట‌డి విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైందంటూ సాక్షి పేప‌ర్‌లో గ‌త కొన్ని రోజులుగా వ‌రుస క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌వుతున్నాయి.  "డొల్ల పాల‌న‌.. గుల్ల ప్ర‌జాస్వామ్యం"..  "వ్యాక్సిన్ కూడా స‌రుకేనా?".. "ఈ ఫ‌లితాలు కారుచీక‌ట్లో కాంతిరేఖ‌లు" .. ఇలా ర‌క‌ర‌కాల హెడ్డింగ్స్‌తో.. వేరు వేరు వ్యాస‌క‌ర్త‌ల‌తో.. కేంద్రానికి వ్య‌తిరేకంగా నిత్యం సాక్షి పేప‌ర్లో విశ్లేష‌నాత్మ‌క క‌థ‌నాలు వ‌స్తూనే ఉన్నాయి. అన్ని స్టోరీస్‌లోనూ క‌రోనా క‌ట్ట‌డిలో కేంద్ర ప్ర‌భుత్వ‌ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూనే ఉన్నారు.  వ్యాక్సిన్ కొర‌త‌, ఆక్సిజ‌న్ లోటుకు కేంద్ర ప్ర‌భుత్వ చేత‌గాని త‌న‌మే కార‌ణం అనిపించేలా సాక్షి పేప‌ర్లో క‌థ‌నాల‌తో క‌డిగిపారేస్తున్నారు. మ‌రి, ఇదేంటి? ట్విటర్‌లో జ‌గ‌న్ చెప్పిన నీతులేంటి? సాక్షి పేప‌ర్లో వ‌స్తున్న నీతిమాలిన క‌థ‌నాలేంటి? ప్ర‌స్తుత సంక‌ట స‌మ‌యంలో మోదీని అండ‌గా ఉండాలంటూ, రాజ‌కీయాలు త‌గ‌వంటూ.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ట్విట‌ర్‌లో నీతులు చెప్పి.. బీజేపీ జాతీయ నాయ‌కుల మ‌న్న‌న‌లు పొందారు జ‌గ‌న్‌. కానీ, రాష్ట్రానికి వ‌చ్చే సరికి త‌న సొంత సాక్షి పేప‌ర్‌లో కేంద్రాన్ని, మోదీని ఏకిపారేస్తూ క‌థ‌నాలు రాయించ‌డం.. జ‌గ‌న్ డ‌బుల్ గేమ్ అడుతున్నార‌న‌డానికి నిద‌ర్శ‌నం అంటున్నారు విమ‌ర్శ‌కులు.  ఏపీలో క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మైంది. ఆ ప్ర‌జా వ్య‌తిరేక‌త నుంచి త‌ప్పించుకోడానికే.. టీడీపీ నేత‌ల‌పై ప‌లు ర‌కాల క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కూ దిగింది. మ‌రోవైపు, సాక్షి మీడియాలో క‌రోనా పాపం కేంద్రానిదే అంటూ వార్త‌లు వ‌చ్చేలా చేసి.. ఆ త‌ప్పు త‌మ‌ది కాద‌ని.. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించి.. త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మండిప‌డుతోంది విప‌క్షం. అటు, జాతీయ స్థాయిలో కేంద్రానికి ఊడిగం చేస్తూ.. ఇటు రాష్ట్ర ప్ర‌జ‌ల ముందు కేంద్రాన్ని దోషిగా చూపిస్తూ.. సాక్షి మీడియా ద్వారా మోదీపైకి ప్ర‌జ‌ల‌ను ఉసిగొల్పుతూ.. జ‌గ‌న్‌రెడ్డి అప‌రిచితుడిలా బిహేవ్ చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. ఇదంతా జ‌గ‌న్‌రెడ్డి ఆడుతున్న రాజకీయ డ‌బుల్ గేమ్ అంటున్నారు. అందుకే, బీవేర్ ఆఫ్ జ‌గ‌న్‌రెడ్డి అంటున్నారు రాజ‌కీయ విమ‌ర్శ‌కులు, త‌ట‌స్థులు.  

కడపలో 9 మంది మరణం ఎందుకో తెలుసా... 

క‌డ‌ప జిల్లాలో క‌ల‌కలం చెల‌రేగింది. భారీ పేలుడు సంభ‌వించి  తొమ్మిది మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. వారి మృత‌దేహాలు అక్కడికక్కడే చెల్లా చెదురుగా పడిపోయాయి. ఈ ఘ‌ట‌న‌లో మ‌రికొంత మందికి గాయాల‌య్యాయి. వారిని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. క‌డ‌ప జిల్లా క‌ల‌స‌పాడు మండ‌లం మామిళ్ల‌ప‌ల్లె శివారులో ఈ రోజు ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. జిలెటిన్‌స్టిక్స్ ను వాహ‌నంలో తీసుకొస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని తెలిసింది. ప్ర‌మాద‌వ‌శాత్తు వాహ‌నంలో జిలెటిన్‌స్టిక్స్ పేలాయి. బ‌ద్వేలు నుంచి ముగ్గురాళ్ల‌గ‌నికి జిలెటిన్‌స్టిక్స్ త‌ర‌లిస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది. ఈ ఘ‌ట‌న‌పై టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు స్పందిస్తూ.. మృతుల ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు చంద్రబాబు తన ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. క‌డ‌ప పేలుడు ఘ‌ట‌న‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించాలని  చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు మళ్ళీ జరగకుండా రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న చెప్పారు. 

బీజేపీ కథ మళ్లీ మొదటికి! వర్గ పోరే కారణమా? 

దుబ్బాక గెలుపు ఊపు నిచ్చింది. హైదరాబాద్ విజయంతో జోష్ పెరిగింది. ఇక, తెలంగాణలో, తెరాసకు ప్రత్యాన్మాయం బీజేపీనే, అని అటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులే కాదు, సామాన్య ప్రజలు కొంతవరకు రాజకీయ విశ్లేషకులు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో, ఇక పార్టీ పరుగులు తీస్తుందని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదే అని కూడా, అనుకున్నారు. బండి సంజయ్ అయితే, తెరాసను గద్దె దింపుతామని బల్లగుద్దారు.    అయితే ఇంతలోనే కథ అడ్డం తిరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం (హైదరాబాద్)లో బీజేపీ ఓడిపోయింది. మరో స్థానం (ఖమ్మం) లో ఎక్కడో  నాలుగో స్థానానికో అయిదో స్థానానికో పడిపోయింది. నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్ధి డిపాజిట్ గల్లంతయింది. అలాగే ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఇతర నగరపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లోనూ కమలం కనీసం గౌరవప్రదమైన ఓటమికి కూడా నోచుకోలేదు. ఎక్కడా పట్టుమని పది సీట్లు గెలవలేదు. అంటే, బీజేపీ కథ మళ్ళీ  మొదటికి వచ్చింది.  ఇవన్నీ ఒకెత్తు అయితే, పార్టీలో, అంతర్గత విబేధాలు బుసలు కొడుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, అనుకూల వ్యతిరేక వర్గాలుగా పార్టీ చీలి పోయిందా అనేవిధంగా, రాష్ట్ర స్థాయి నాయకుల మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. అంతే కాదు, తెరాస అనుకూల వ్యతిరేక వర్గాలగానూ పార్టీలో కొందరు అటూ కొందరు ఇటూ అన్నట్లుగా  వ్యవహరించి  పార్టీకి తలవంపులు తెస్తున్నారు.ముఖ్యంగా జీహెచ్ఎంసిలో లిగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక, విషయంలో తలెత్తిన వివాదం, చిలికి చిలికి గాలివానగా మారింది. ఏకగ్రీవం చేయాలని కోరుతూ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సహా కొందరు నాయకులు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్’ను కలవడంతో మొదలైన బండి వర్సెస్ స్టొరీ చివరకు సిట్టింగ్ స్థానంలో బీజేపీ ఓడిపోవడంతో మరో మలుపు తిరిగింది.  అయితే, గుడ్డిలో మెల్ల అన్నట్లుగా, ఒక్క నాగర్జున సాగర్ మినహా ఇతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా, గొప్పగా జెండా ఎగరేయలేదు. మరో వంక దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో షాక్’కు గురైన అధికార తెరాస, పొంచి ఉన్న ప్రమాదాన్ని పసికట్టి, దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ముఖ్యంగా, ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు, కారు పార్టీ ఎన్నికల స్టీరింగ్ తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ, ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలు, మున్సిపల్  ఎన్నికల వరకు పార్టీని విజయపధంలో ముందుకు నడిపించారు. అంతే కాదు, అదే ఊపులో, యువరాజ పట్టాభిషేకానికి అవరోధం అనుకున్న వారి అడ్డుతొలిగించే పనికి శ్రీకారం చుట్టారు.అయితే అలాగని పార్టీలో, అంతా బాగుందని అనుకుంటే, అది పొరపాటే అవుతుంది.  గతంలో కేసీఆర్ అనేక మంది పార్టీ సీనియర్లను, చివరకు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంత కీలక పాత్రను పోషించిన ప్రొఫెసర్ కోదండ రామ్ సహా అనేక మందిని ఇదే తరహాలో, ఇంతకంటే అవమానకంరంగా సాగనంపినా, ఎవరూ కూడా కేసీఆర్’ను రాజకీయంగా దేబ్బతీయలేక పోయారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కోదండరామ్ ఓడిపోయారు. అలాగే, తెరాస నుంచి వెలికి గురై సొంత కుంపట్లు పెట్టుకున్నవారు కానీ, ఇతర పార్టీలలో చేరినవారు కానీ, కేసీఆర్ నాయకత్వాన్ని సవాలు చేయలేక పోయారు. కానీ, మారిన  పరిస్థితుల్లో ఈటల నాయకత్వంలో కీసీఅర్ వ్యతిరక శక్తులు అన్నీ ఏకమయ్యేందుకు, ఏకం చేసేందుకు జరుగతున్నప్రయత్నాలు ఫలిస్తే, రాజకీయ సమీకరణాలు మారే అవకాశం లేక పోలేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అలాగే, ఈటల కొత్త పార్టీ పెట్టినా, మరో జాతీయ పార్టీతో పొట్టు లేకుండా, తెరాస, కేసీఆర్’ను ఎదుర్కోవడం సాధ్యం కాదని కూడా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  అదలా ఉంటే, ఈటల వ్యవహారం కూడా బీజేపీలో చిచ్చుకు కారణం అయింది. ఈటల వ్యవహారంలో పార్టీ సీనియర్ నాయకుడు, మోత్కుపల్లి నరసింహులు చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఈటల పై వేటును పార్టీ తీవ్రంగా ఖండించింది. పార్టీ అధ్యక్షడు బండి సంజయ్ సహా పార్టీనాయకులు అందరు కేసీఆర్  ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడుతున్నారు. ఈటలకు అండగా ఉంటామని బహిరంగంగా ప్రకటించారు. అయినా,  మోత్కుపల్లి మాత్రం అందుకు విరుద్ధంగా, బీసీ నేతకు మంత్రి పదవి ఇచ్చినందుకు, ఈటల ముఖ్యమంత్రి బొమ్మ పెట్టుకుని పూజ చేయాలని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలని, అన్నారు. అయన ఈటల తీరును తీవ్రం తప్పు పట్టారు. ఇలా పార్టీ విధానానికి విరుద్ధంగా మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు, పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని, కేటీఅర్’ను కలసిన నాయకులపై చర్యలు తీసుకున్నట్లుగానే మోత్కుపల్లి పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని  కొందరు అంటుంటే, మరి కొందరు మాత్రం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి  పార్టీ క్రమశిక్షణ నిబంధనల విషయంలో కొంత కాలం పాటు, కొంత  వెసులుబాటు ఇవ్వాలని అంటున్నారు.  ఇదిలాఉంటే, రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలపై జాతీయ నాయకత్వం ఆరా తీస్తోంది. గీత దాటితే ఎవరినైనా ఉపేక్షించవద్దని రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఆదేశించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే, మొత్తంగా చూస్తే, దుబ్బాక ఊపు, జీహెచ్ఎంసీ జోష్ చల్లారి, పార్టీ ఇమేజ్ మళ్ళీ మొదటికి వచ్చిందని, కొందరు పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే, జాతీయ స్థాయి పరిణామలు, ముఖ్యంగా కొవిడ్కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో  ఆశించిన  ఫలితాలు రాక పోవడం, పార్టీ కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని పార్టీ సీనియర్ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. ఈ నేపధ్యంలో  పార్టీ నాయకత్వం ఎరువు నేతల కోసం ఎదురు చూడకుండా,పార్టీని సంస్థాగతంగా, సిద్ధాంతపరంగా బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తేనే,ఎప్పటికైనా పార్టీకి భవిష్యత్ ఉంటుందని అంటున్నారు.

కరోనా గురించి చెప్పడానికి మాటలు లేవు.. 

కరోనా  గురించి చెప్పడానికి మాటలు లేవు.. రాయడానికి పదాలు లేవు.. ఏదేమైనా కరోనా భార‌త్‌లో ముమ్మరంగా విస్తరిస్తుంది. విరుచుకు పడుతుంది. దేశంలో క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. నిన్న‌ కొత్త‌గా 4,01,078  మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,18,609 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,18,92,676కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 4,187 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,38,270కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,79,30,960 మంది కోలుకున్నారు. 37,23,446 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 16,73,46,544 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 30,04,10,043 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 18,08,344 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. తెలంగాణలో కరోనా..  గడచిన 24 గంటల్లో 65,375 కరోనా పరీక్షలు నిర్వహించగా 5,559 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 984 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో రెండంకెల్లోనే కొత్త కేసులు రావడం తాజా బులెటిన్ లో చూడొచ్చు. అదే సమయంలో 8,061 మంది కరోనా నుంచి కోలుకోగా 41 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,87,199కి పెరిగింది. 4,13,225 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 71,308 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 2,666కి చేరింది. తెలంగాణ ప్రభుత్వం ఫీవర్ సర్వే..   కోవిడ్ నియంత్రణకు గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫీవర్ సర్వేలో భాగంగా ఇప్పటివరకు 1,82,924 ఇళ్లలో సర్వే నిర్వహించారు. సోమవారం ప్రారంభమైన ఈ సర్వేలో ప్రతి రోజు జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన బృందాలు ఇంటింటికీ తిరిగి జ్వరం, కొవిడ్ లక్షణాలున్నవారి సర్వేను పెద్దఎత్తున చేపట్టాయి. ఒక ఏఎన్ఎం, ఆశా వర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్‌తో కూడిన బృందాలు ఇంటింటికీ తిరిగి సర్వే చేపట్టారు. ఈ బృందాలు జ్వరంతో ఉన్న వారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. నగరంలో ఇవాళ ఒక్కరోజే 720 బృందాలతో 53,002 ఇళ్లలో సర్వేను నిర్వహించారు.