చిన్న పిల్లలకు కొవాగ్జిన్ వ్యాక్సిన్! క్లీనికల్ ట్రయల్స్ కు పర్మిషన్ 

కరోనా కల్లోలంతో అల్లాడుతున్న దేశానికి ఇదో గుడ్ న్యూస్. చిన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే దిశగా కీలక ముందడుగు పడింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన `కోవాగ్జిన్` టీకా 2-18 ఏళ్ల మధ్య వయసు గల వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకునేందుకు క్లినికల్ ప్రయోగాలు జరిపేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది. 2-18 ఏళ్ల మధ్య వయసు గల వారిపై కోవాగ్జిన్ రెండు, మూడు దశల పరీక్షలు ప్రయోగాలు నిర్వహించాలని నిపుణులు కమిటీ చేసిన సిఫారసు మేరకు డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది.  2-18 ఏళ్ల మధ్య వయసు గల 525 మంది వాలంటీర్లపై భారత్ బయోటెక్ ఈ ప్రయోగాలు జరపనుంది. అయితే మూడో దశ ప్రయోగాలు ప్రారంభించడానికి ముందే రెండో దశ క్లినికల్ ట్రయల్స్ భద్రత డేటా, డీఎస్‌ఎంబీ సిఫారసులను సీడీఎస్‌సీవోకు సమర్పించాలని భారత్ బయోటిక్‌కు డీసీజీఐ సూచించింది. ఢిల్లీ ఎయిమ్స్, పట్నా ఎయిమ్స్ సహా దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈ ప్రయోగాలు జరగనున్నాయి. వాలంటీర్లకు 28 రోజుల వ్యవధిలో రెండు డోసులను ఇచ్చి ఫలితాలను విశ్లేషించనున్నారు.  ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. ఫస్ట్ వేవ్ లో వృద్ధులపై వైరస్ ఎక్కువ ప్రభావం చూపగా... సెకండ్ వేవ్ లో యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత రెండు నెలలుగా యువకులే ఎక్కువగా కరోనా భారీన పడుతున్నారు. సెప్టెంబర్ లో భారత్ లో థర్డ్ వేవ్ రావొచ్చని వైద్య నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. థర్డ్ వేవ్ లో చిన్నారులపై కరోనా పంజా విసిరే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేలా కొవాగ్జిన్ క్లీనికల్ ట్రయల్స్ జరుగుతుండటం ఊరట కల్గిస్తోందియ చిన్న పిల్లల వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేలోపు.. 18 ఏండ్ల పైబడిన వారందరికి టీకాలు వేసేలా భారత సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. 

అమిత్ షా మిస్సింగ్ ?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తప్పి పోయారా? ఆయన ఎవరికీ కనిపించకుండా పోయారా? అలాంటిదేమీ లేదు న్క్షేపంగా అయన పని ఆయన చేసుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ) ట్విట్టర్’లో మాత్రం, ‘ అమిత్ షా మిస్సింగ్’ అనే యాష్‌ట్యాగ్‌తో 500కు పైగా ట్వీట్లు గురువారం ఉదయం చక్కర్లు కొట్టాయి. అంతే కాదు, ఎన్ఎస్‌యూఐ కార్యదర్శి నగేష్ కరియప్ప, కేంద్ర హోమేమంత్రి కనిపించడం లేదని, ఏకంగా పోలీసుకే ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్’లి కరియప్ప, దేశం కరోనా కోరల్లో చిక్కుకున్న సమయంలో, ప్రజలకు అందుబాటులో ఉండి  సేవ చేయవలసిన హోం మంత్రి అమిత్ షా, బాధ్యతల నుంచి తప్పించుకుని పలాయనం చిత్తగించారని కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి నాయకుడు తమ ఫిర్యాదులలో  పేర్కొన్నారు.   అలాగే, కాంగ్రెస్ యువ నేత రాజకీయనేతలు జవాబుదారీతనంతో ఉండాలని, జవాబుదారీతనం కేవలం భారత ప్రభుత్వానికి, బీజేపీకి మాత్రమే కాదని, దేశ ప్రజల పట్ల తప్పనిసరిగా ఉండితీరాలని అన్నారు. చివరిసారిగా అమిత్‌షా బెంగాల్ ప్రచారంలో కనిపించారని కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, కరియప్ప ఫిర్యాదుపై విచారించేందుకు. ఎన్ఎస్‌యూఐ కార్యాలయానికి వెళ్ళిన పోలీసులకు కరియప్ప కనిపించలేదు. ఎక్కడున్నారో, ఎప్పుడొస్తారో కూడా తెలియదని సిబ్బంది చెప్పడంతో పోలీసులు ఆకక్దినుంచి వేణు తిరగారు.. ఇంతకీ కనిపించనిది అమిస్త్ షానా, కరియప్ప?

25 మంది కరోనా రోగులు పరార్

25 మంది కరోనా రోగులు తప్పించుకుని వెళ్లారు. కేవిడ్ కేర్ సెంటర్ లో చికిత్స పొందుతున్న రోగులు... అర్ధరాత్రి సమయంలో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారు. కరోనా రోగులు పారిపోయారన్న వార్తలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పారిపోయిన కొవిడ్ రోగుల కోసం స్థానిక అధికారులు, పోలీసులు గాలిస్తున్నారు. త్రిపుర రాష్ట్రంలోని అంబస్సాలో ఈ ఘటన జరిగింది.  త్రిపుర రాష్ట్రంలోని అంబస్సా పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ భవనంలో తాత్కాలికంగా కొవిడ్ కేర్ సెంటరును ఏర్పాటు చేసి అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను ఉంచారు. వంద మందికి వరకు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ సెంటర్ నుంటే 25 మంది కరోనా రోగులు పారిపోయారు. కరోనా రోగులు పారిపోయారన్న సమాచారంతో స్థానికంగా ఉన్న అన్ని పోలీసుస్టేషన్లు, రైల్వేస్టేషన్లకు సమాచారం అందించి వారిని అప్రమత్తం చేశారు. పారిపోయిన కొవిడ్ రోగుల కోసం పోలీసులు గాలించగా వారిలో ఏడుగురిని రైల్వేస్టేషనులో పట్టుకున్నారు. మరో 18 మంది కరోనా రోగులు రైలు ఎక్కి త్రిపుర రాష్ట్రం విడిచి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఏప్రిల్ నెల 22వతేదీన 31 వతేదీన అగర్తలాలోని అరుంధతీనగర్ కొవిడ్ కేర్ సెంటరు నుంచి కరోనా రోగులు తప్పించుకొని పారిపోయారు. త్రిపుర స్టేట్ రైఫిల్స్ లో నియమకాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కరోనా బారిన పడటంతో కొవిడ్ కేర్ కేంద్రంలో చేర్చగా పారిపోయారు.పారిపోయిన వారిని ఇంకా గుర్తించలేదు. దీంతో తమ రాష్ట్రానికి వచ్చే వారందరూ కొవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలని త్రిపుర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

విపక్ష నేతలతో చర్చలు.. ఈటల రాజేందర్ దారెటు?

రాష్ట్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ కు గురైన మాజీ మంత్రి ఈటల భవిష్యత్ వ్యూహం ఏమిటి? ఆయన ఏమి చేయ బోతున్నారు? ఈటల పై వేటుపడి, పదిరోజుల పైనే అవుతోంది, అయినా ఇంతవరకు ఆయన తమ రాజకీయ భవిష్యత్ ‘వ్యూహం’ ఏమిటో మాత్రం బయట పెట్టలేదు. ఆయన మనసులో ఏముందో, ఏమి చేయాలనుకుంటున్నారో, ఎక్కడా చెప్పలేదు. నిజానికి, ఈవిషయంలో ఆయనకే స్పష్టత లేదేమో అని పిస్తోంది. అందుకే కావచ్చు, కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పదవి వదులుకుంటానని అంటూనే, ఎన్నికలలో పోటీ చేసేందుకు బీ’ ఫారం ఇచ్చింది పార్టీనే అయినా, గెలిపించింది మాత్రం ప్రజలే అని అంటున్నారు. అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంలోనూ ఈటల ఒక నిర్ణయానికి  రాలేక పోతున్నారు అనిపిస్తుంది.  అందుకే, కావచ్చు ఆయన పార్టీలతో సంబంధం లేకుండా అనేక మంది నాయకులను కలుస్తున్నారు. అయితే, ఎందుకు కలుస్తున్నారు,ఏమి మాట్లాడుతున్నారు అనేది మాత్రం ఎవరికీ అంటూ చిక్కడం లేదు. మొత్తానికి ఈటల ఒక సందిగ్ధావస్థలో ఉన్నారు అన్నది మాత్రం ఆయన మాటలు, చేతలే స్పష్టం చేస్తున్నాయి.   ఒక సందర్భంలో ఆయనే, అన్నట్లుగా ఆయనకు అన్ని పార్టీలలోనూ మిత్రులున్నారు. అయినా, ఇంతకాలం  రాజకీయ కట్టుబాట్ల కారణంగా కొందమంది సీనియర్ రాజకీయ నాయకులను కలవలేక పోయారు.  అలా  కలవాలని ఉన్నా, కలవలేక పోయిన పాత మిత్రులను కలుస్తున్నారు. ఈ కలయికలు, ఎదో ఒక వ్యూహం ఆధారంగా సాగుతున్నాయని మాత్రం చెప్పలేము. అఫ్’ కోర్స్, ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినప్పుడు సహజంగానే రాజకీయాలు చర్చకు వస్తాయి, అందులోనూ ప్రస్తుతం ఆయన ఉన్న పరిస్థితులలో రాజకీయాలు చర్చకు రాకుండా ఉండవు. అయితే, ఈ చర్చల పర్యవసానం ఏమిటి,  ఎలా ఉంటుంది  అన్నది ఎవరికీ తెలియదు. అయితే అయన ఎవరిని కలిసినా, అందుకు అనుగుణంగా కథలు, కదానాలు అయితే వస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులను కలిస్తే, ఆ పార్టీలో చేరిపోతున్నారని, మరో నేతను కలిస్తే ఆయన, ఈయన కలిసి కొత్త పార్టీ పెడుతున్నారని, ఇలా మీడియాలో కధనాలు వస్తున్నాయి. అంటే కానీ, ఆయనగా  ఆయన తమ మనసులో ఏముందో మాత్రం చెప్పడం లేదు.  అయితే, అక్కడక్కడా, అప్పుడప్పుడు ఆయన మాట్లాడిన ఒకటి రెండు మాటలు, మర్మ గర్భంగా ఆయన వ్యక్త పరిచిన అభిప్రాయాలను గమనిస్తే, ఆయన తెరాస కొండను ‘ఢీ’ కొనేందుకు సిద్దంగా లేరేమో అని పిస్తుంది. నిజానికి, ముఖ్యమంత్రి, తెరాస అధినేత కీసీఅర్ అంటే ఏమిటో, ఆయన ‘పగ - ప్రేమ’ ఎలా ఉంటుందో అందరికంటే ఈటలకే బాగా తెలుసు. ఆ ఇద్దరి మధ్య ఉన్నది, ఒకటా రెండా 19 ఏళ్ల బంధం. అందుకే, తనపై వేటుపడిన తర్వాత ఈటల ఒక సందర్భంలో గతాన్ని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్’తో ఒకసారి తెగిన బంధం మళ్ళీ ముడి పడదని అన్నారు. అలాగే, గతంలో ఇతర నాయకులను, ఇంతకంటే అన్యాయంగా బయటకు పంపినప్పుడు, కేసీఆర్ చర్యను సమర్ధించి తప్పు చేసామన్న బాధను వ్యక్త పరిచారు. అదే సమయంలో, గతంలో పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా చేసిన వ్యాఖ్యలు విమర్శలకు సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం కూడా ఈటల చేశారు. ఎదో ఒక చానల్’కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో పార్టీని, ప్రభుత్వాన్ని తానెప్పుడు ఉద్దేసపూర్వకంగా విమర్శించలేదని, కొన్ని సందర్భాలలో ప్రజల నుంచి వచ్చిన వత్తిళ్ళు, అభ్యర్ధనలకు బదులుగా, అలాంటి వ్యాఖ్యలు, విమర్శలు చేయవలసి వచ్చిందని అన్నారు.  మరో వంక ముఖ్యమంత్రి కేసీఆర్’ మంగళ వారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో, ఈటల తప్పు చేశారని, చేసిన తప్పును స్వయంగా  ఒప్పుకున్నారని,  అందుకనే ఆయన మీద చర్యలు తీసుకున్నామని మంత్రులకు వివరించినట్లు వార్త లొచ్చాయి. అయితే ఆయన చేసిన, ఒప్పుకున్న తప్పేమిటి, అనేది చెప్పలేదు. రాజకీయంగా చేసిన వ్యాఖ్యలు తపప్ని ఒప్పుకున్నారా, లేక అసైన్డ్ భూముల వ్యహరంలో నేరాన్ని అంగీకరించారా, అన్నవిషయంలో కేసీఆర్ క్లారిటీ ఇవ్వలేదు.  అంతే కాదు ఈటల విషయంలో  ఎవరూ ఏమీ మాట్లాడవద్దని గాగ్ ఆర్డర్స్ పాస్ చేశారు. అంటే కేసీఆర్’కు సంబందిచినంత వరకు ఈటల ఎపిసోడ్ ముగిసిన అధ్యాయం.  ఇక ఈటల ఏమి చేస్తారు అన్నది ఆయన ఇష్టం. అయితే, స్వభావరీత్యా మెతక వైఖరి అవలంబించే ఈటల, ఎంత వరకు కేసీఅర్’ను ‘ఢీ’ కొంటారు అనేది ఇప్పుడేచెప్పడం కష్టం. అంతేకాకుండా, అసైన్డ్ భూముల వ్యవహారం, ఒకటే కాకుండా ఈటలకు సంబదించిన ఇంకేదో రహస్యం కూడా కేసీఆర్ గుప్పిట్లో ఉందని, అందుకే ఇద్దరూ ఒక విధంగా దాగుడు మూతలు ఆడుతున్నారని కొందరు లోపలి వ్యక్తుల సమాచారం.  బర్తరఫ్’కు గురైన తర్వాత అధికార తెరాస పార్టీలో ఎమ్మెల్ల్యేలు, ఎంపీలే కాదు  ఏ స్థాయి నాయకుడు కూడా ఈటలను సమర్ధిస్తూ, ఒక ప్రకటన చేయలేదు. సొంత నియోజక వర్గంలో కొంత మంది పార్టీ అనయకులు, కార్యకర్తలువచ్చి పోయినా, రాష్ట్ర స్థాయిలో ఎటు నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. ఈటల వ్యవహారానికి సంబంధించి స్పందించిన ఒకరిద్దరు మంత్రులు, ఇతర నాయకులు కూడా ఆయన్ని తప్పు పట్టారే గానీ, ఈటలఫై కూసింత సానుభూతి కూడా చూపించలేదు. సో, ఈటల ఎపిసోడ్ శుభం  కార్డ్ ఎలా పడుతుంది అన్నది ఉహించడం కూడా ప్రస్తుతానికి కష్టమే అనిపిస్తోంది.

వామ్మో దేశంలో కరోనా డెత్ బెల్స్ .. 

దేశంలో రెండు రోజులు క్రితం కాస్త తగ్గినట్లే కన్పించిన కరోనా వైరస్ ఇప్పుడు మళ్లీ పుంజుకుంటుంది.వరుసగా రెండో రోజు మరణాలు ఆందోళనకర రీతిలో 4వేల పైనే నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 4,120 మందిని వైరస్‌ పొట్టనబెట్టుకుంది. ఇక కొత్త కేసులు 4లక్షలకు దిగువనే ఉన్నప్పటికీ క్రితం రోజు కంటే స్వల్పంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.  బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 18.64లక్షల మంది కరోనా పరీక్షలు చేయించుకోగా.. 3,62,727 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంతక్రితం రోజుతో పోలిస్తే దాదాపు 15వేలు ఎక్కువ. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 2.37కోట్లకు చేరింది.   ఇదే సమయంలో 4,120 మంది వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు 2,58,317 మందిని బలితీసుకుంది. మరణాల రేటు 1.09శాతంగా ఉంది.  ఇక కొత్త కేసులతో పాటు రికవరీలు కూడా భారీగా ఉంటుండటం కాస్త సానుకూలాంశం. 24 గంటల్లో మరో 3,52,181 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 1.97కోట్ల మంది కరోనాను జయించారు. రికవరీ రేటు 83.26శాతానికి చేరింది.    మరోవైపు బుధవారం నాటితో పోలిస్తే దేశంలో యాక్టివ్‌ కేసులు స్వల్పంగా 6వేలు పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37,10,525 మంది వైరస్‌కు చికిత్స తీసుకుంటున్నారు. క్రియాశీల రేటు 15.65శాతంగా ఉంది. ఇదిలా ఉండగా.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. నిన్న 18.94లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటి వరకు 17.72కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు.    తెలంగాణాలో టీకాలు..  క‌రోనా వ్యాక్సినేష‌న్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా నిన్న‌టి వ‌ర‌కు 43,74,351 మందికి మొదటి డోస్.. 10,65,362 మందికి రెండో డోస్ టీకా ఇచ్చిన‌ట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. నిన్న ఒక్క రోజు 657 మందికి తొలి డోస్, 33,438 మందికి రెండో డోస్ టీకా వేసిన‌ట్లు పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు 55,52,360 వ్యాక్సిన్ డోస్‌లు రాగా..  54,39,713 డోస్‌ల‌ వ్యాక్సిన్‌ను వినియోగించారు.  

కుక్కను పట్టుకోండి.. లక్ష పట్టుకోండి.. 

ఆలస్యం చేయకండి  బాబు ఆలోచిస్తే ఆశ భంగం. మంచి తరుణం మించిన దొరకదు. కుక్కను పట్టుకోండి. రూ లక్ష కొల్లగొట్టండి. అది అలాంటిలాంటి కుక్క కాదు బాబు సాక్షాత్తు హీరోయిన్ కుక్క. ఆ కుక్క అంటే ఆమెకు ప్రాణం అందుకే ఈ బంఫర్ ఆఫర్. అదేంటి కుక్క పట్టుకుంటే లక్ష రూపాయలు ఇస్తారా అని అనుకుంటున్నారా..? నేను చెప్పింది నిజం. మీరు విన్నది నిజం. అదేంటో మీరే చూడండి..  హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ తాజాగా ఓ పోస్ట్ చేస్తూ త‌మ కుక్క త‌ప్పిపోయింద‌ని, దాని ఆచూకీ తెలిపిన వారికి రూ.ల‌క్ష ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఆ కుక్క ఫొటోతో పాటు ఆచూకీ తెలిసిన వారు ఫోను చేయాల్సిన నంబ‌రును ఆమె పోస్ట్ చేసింది. కుక్క ఆచూకీ చెబితే ఏకంగా ల‌క్ష రూపాయ‌లు ఇస్తామ‌ని ఆమె చేసిన పోస్టు వైర‌ల్ అవుతోంది. పూరీ జ‌గ‌న్నాథ్‌-రామ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాలో న‌టించి మెప్పించిన‌ నిధి అగ‌ర్వాల్ కు వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. టాలీవుడ్‌లోనే కాకుండా తమిళంలోనూ నిధి అగర్వాల్ ప‌లు సినిమాల్లో న‌టిస్తోంది. త‌మిళంలో ఆమె న‌టించిన‌ రెండు సినిమాలు ఈ ఏడాది జ‌న‌వ‌రిలో విడుద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం ఆమె చేతిలో గల్లా అశోక్ హీరోగా న‌టిస్తోన్న సినిమాతో పాటు, పవన్ కల్యాణ్ న‌టిస్తోన్న 'హరి హర వీర మల్లు' సినిమా కూడా ఉంది.    

క‌మ్మ‌..క‌మ్మ‌.. జ‌గ‌న్‌రెడ్డీ ఏమిటీ కుల జాడ్యం?

వీచే గాలిది ఏ కులం? పారే నీటిది ఏ కులం? కాసే ఎండ‌ది ఏ కులం? మ‌నుషుల్లోనే ఎందుకీ కులం? అంటే, అదేం మాట‌.. కులంతో ఎన్నో రాజ‌కీయ‌ ప్ర‌యోజ‌నాలు. ఎన్నో వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునే సౌక‌ర్యాలు. కులం పేరుతో స‌మాజాన్ని చీల్చ‌వ‌చ్చు. కులం పేరుతో ఓట్ల‌ను దండుకోవ‌చ్చు. కులం పేరుతో ఎన్నో స్వార్థ‌ రాజ‌కీయాలు నెర‌ప‌వ‌చ్చు. ఏంటి? న‌మ్మ‌ట్లేదా? డౌట్ ఉంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని అడ‌గండి తెలుస్తుంది.. కులం పేరుతో రాజ‌కీయం ఎంత క‌మ్మ‌గుంటుందో చెబుతారు. ఆయ‌న చెప్ప‌డ‌మెందుకు.. జ‌గ‌న్ తీరును ఓ సారి ప‌రిశీలిస్తే చాలు.. కులంతో గంద‌ర‌గోళం సృష్టించి.. ఏ మేర‌కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొందారో అర్థం అవుతుంది. తాజా ఎపిసోడ్ నుంచే మొద‌లుపెడితే.. కొవాగ్జిన్‌కూ కులం మ‌కిలి అంట‌గ‌ట్టిన మ‌హానుభావుడు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి. క‌మ్మ కులంలో కొవాగ్జిన్ పుట్టిన‌ట్టు మాట్లాడుతున్నారు. ఆ వ్యాక్సిన్‌కు స‌మీప బంధువులు ఇద్ద‌రట‌. ఒక‌రు ఈనాడు గ్రూప్ ఛైర్మ‌న్ రామోజీరావు.. మ‌రొక‌రు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. ఇక్క‌డ మ‌రో అక్ర‌మ సంబంధమూ అంట‌గట్టారు సీఎం గారు. రామోజీరావుకు చంద్ర‌బాబుకు మ‌ధ్య ఎలాంటి బంధుత్వం లేద‌నేది జ‌గ‌మెరిగిన విష‌యమే. అయినా.. జ‌గ‌న్‌రెడ్డి వారిద్ద‌రికీ బ‌ల‌వంతంగా బంధం క‌లిపేశారు. కొవాగ్జిన్ త‌యారు చేస్తున్న‌ భార‌త్ బ‌యోటెక్ య‌జ‌మాని.. రామోజీరావు కొడుకు వియ్యంకుడు కాబ‌ట్టి.. ఆయ‌న‌ చంద్ర‌బాబుకూ బంధువే అవుతార‌ట‌. అదెలాంటి చుట్ట‌రిక‌మో ఆయ‌న‌కే తెలియాలి. చంద్ర‌బాబుతో వారికి ఎలాంటి బంధుత్వం లేకున్నా.. బ‌ట్ట కాల్చి మీద వేయ‌డ‌మే జ‌గ‌న్‌రెడ్డి తీరులా ఉంది.  కృష్ణా ఎల్లా, రామోజీరావు, చంద్ర‌బాబులు క‌మ్మ కులంలో పుట్ట‌డ‌మే వారు చేసిన త‌ప్పిదం. అందుకే, వ్యాక్సిన్లు కొన‌డానికి క‌నీసం ఆర్డ‌ర్లు కూడా పెట్ట‌కుండా.. అడ్వాన్సులు చెల్లించ‌కుండా.. కొవాగ్జిన్ కోసం ఎలాంటి ప్ర‌య‌త్నాలూ చేయ‌కుండా.. ఆ ముగ్గురు క‌మ్మ కుల‌స్తులు కాబ‌ట్టే.. ఏపీకి వ్యాక్సిన్ ఇవ్వ‌టం లేదంటూ నోటికొచ్చిన కూత‌లు కూస్తున్నారు గౌర‌వ ముఖ్య‌మంత్రివ‌ర్యులు. న‌వ్వి పోదురు గాక నాకేంటి అన్న‌ట్టు ఉంది ఆయ‌న తీరు. జ‌గ‌న్ నోట ఇలాంటి క‌మ్మ‌టి మాట‌లు రావ‌డం ఇదే మొద‌టిసారి ఏమీ కాదు. ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ విష‌యంలో అనేక‌మార్లు ఇలా కుల గ‌జ్జిని గోకుతూనే ఉండేవారు. నిమ్మ‌గ‌డ్డ‌, చంద్ర‌బాబులు ఒకే సామాజిక వ‌ర్గం కాబ‌ట్టి.. బాబు చెప్పిన‌ట్టు నిమ్మ‌గ‌డ్డ ఆడుతున్నాడంటూ రాజ్యాంగ‌బ‌ద్ద ప‌ద‌విలో ఉన్న ర‌మేశ్ కుమార్‌పై బ‌హిరంగంగా, నిస్సిగ్గుగా ఆరోప‌ణ‌లు చేయ‌డం అప్ప‌ట్లో తీవ్ర వివాదాస్ప‌దం అయింది. అప్ప‌టి ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌కు అడుగ‌డుగునా మోకాలొడ్డే ప్ర‌య‌త్నం చేసినా.. కోర్టుల పుణ్యాన ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్కారు చ‌ర్య‌ల‌కు చెక్ పెడుతూ.. ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను స‌జావుగా పూర్తి చేసి.. చ‌రిత్ర‌లో నిలిచిపోయారు నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌. క‌మ్మ కులం పేరుతో ఆనాడు జ‌గ‌న్‌రెడ్డి చేసిన దిగ‌జారుడు ఆరోప‌ణ‌ల‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చెల‌రేగినా.. వాటిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా.. విమ‌ర్శ‌ల‌ను దులిపేసుకుంటూ.. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త అంశాల్లో.. కొత్త కొత్త‌ వారి విష‌యంలో.. కులం కార్డు ప్ర‌యోగిస్తూ.. జ‌గ‌న్‌రెడ్డి రాజ‌కీయ ప‌బ్బం గడుపుకుంటున్నారనేది ఆరోప‌ణ‌ . ఏకంగా సుప్రీంకోర్టు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ విష‌యంలోనూ ఇలాంటి క్యాస్ట్ పాలిటిక్స్‌ చేసేందుకు ట్రై చేసి.. ఏకంగా న్యాయ‌స్థానాల‌నే వివాదంలోకి లాగాల‌ని చూశారు జ‌గ‌న్‌రెడ్డి. క‌మ్మ కులం అయితే చాలు.. వెన‌కా ముందు చూసే ప్ర‌స‌క్తే లేద‌న్న‌ట్టు.. ఎదుటి వారు ఎలాంటి వారైనా.. వారి మెడ‌లో కులం కార్డు వేసేసి.. చంద్ర‌బాబు మ‌నిషంటూ ముద్రేసి.. రాజ‌కీయ కులం క్రీడ ఆడేస్తున్నారు. సుప్రీంకోర్టు జ‌డ్జిగా ఉంటూ.. ఎన్వీ ర‌మ‌ణ ఏపీ హైకోర్టు తీర్పుల‌ను ప్ర‌భావితం చేస్తున్నారంటూ.. అప్ప‌టి ఎస్‌సీజేకు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ రేసులో ఉన్న ర‌మ‌ణ‌కు ఆ అత్యున్న‌త హోదా రాకుండా అడ్డుకునేందుకే అలా కుట్ర చేశారని అంటారు. జ‌గ‌న్ చెప్పింద‌ల్లా న‌మ్మ‌డానికి వాళ్లేమీ ఏపీ ఓట‌ర్లు కాదు క‌దా. అందుకే, జ‌స్టిస్‌ ర‌మ‌ణ‌పై సీఎం జ‌గ‌న్‌రెడ్డి చేసిన‌ ఆరోప‌ణ‌ల‌కు కొట్టేసింది సుప్రీంకోర్టు. జ‌గ‌న్ కుతంత్రాల‌ను కూల‌దోసి.. ఎన్వీ ర‌మ‌ణ‌నే సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ అయ్యారు. అయితే, ఆ విష‌యంలో అసంబ‌ద్ధ ఫిర్యాదు చేసిన సీఎం జ‌గ‌న్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన సుప్రీంకోర్టు ఎందుకోగానీ క్ష‌మించి వ‌దిలేసింది.  కొవాగ్జిన్‌, ఎస్ఈసీ, సుప్రీంకోర్టు జ‌స్టిస్‌.. ఇవి మ‌చ్చుకు కొన్ని మాత్ర‌మే. క‌మ్మ కులం, చంద్ర‌బాబు టార్గెట్‌గా జ‌గ‌న్ రేపిన కుల గ‌జ్జి.. రాచ‌పుండులా ఏపీని వేధిస్తూనే ఉంది. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న‌ప్పుడు కూడా ఇలానే కుల ఆరోప‌ణ‌ల‌తో రాజ‌కీయంగా లాభం పొందేవారు. సీఎం చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీ పోలీస్ శాఖ‌లో బ‌దిలీలు జ‌రిగితే.. క‌మ్మ కుల‌స్తుల‌కే ప్ర‌మోష‌న్లు, స‌ముచిత స్థానాలు క‌ల్పించారంటూ విష ప్ర‌చారం చేశారు. తీరా ప‌క్కాగా లెక్క‌లు తీస్తే.. అందులో క‌మ్మ వారు అతి త‌క్కువ మందే. కానీ, అప్ప‌టికే రాజ‌కీయంగా పొందాల్సినంత లాభం పొందేశారు జ‌గ‌న్‌రెడ్డి. ప్ర‌జ‌లూ ఆయ‌న ఆరోప‌ణ‌లను ఎప్ప‌టిక‌ప్పుడూ ఫ్రెష్‌గా న‌మ్ముతుండ‌టం శోచ‌నీయం. ఇక‌, చంద్రబాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప‌ని చేసిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును క‌మ్మ కుల‌స్తుడిగా, చంద్ర‌బాబు మ‌నిషిగా ఫిక్స్ చేసి.. ఆయ‌న్ను ఎంత‌లా వేధిస్తున్నారో అంద‌రికీ తెలిసిందే.  ఇలా.. క‌మ్మ కులాన్ని ఎంత‌లా అబాసుపాలు చేయాలో అంత‌కంటే ఎక్కువే చేస్తున్నారు జ‌గ‌న్‌రెడ్డి. త‌న పాల‌నా వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకోడానికి, తాను రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం పొంద‌టానికి.. క‌మ్మ కులం ఆయ‌న‌కి ఆట బొమ్మ‌లా మారిందంటున్నారు. లేక‌పోతే ఏంటి.. దేశానికి కొవాగ్జిన్‌-క‌రోనా టీకా అందిస్తున్న‌ మ‌న తెలుగు వాడిని అభినందించాల్సింది పోయి.. వ్యాక్సిన్ పైనా క‌మ్మ ముద్ర వేసి.. రామోజీరావు, చంద్ర‌బాబుతో ముడిపెట్టి.. కుల రాజకీయం చేయ‌డం.. హేయ‌మైన, నీతిబాహ్య‌మైన‌, నీచ‌, దిగ‌జారుడు రాజ‌కీయం కాక మ‌రొక‌టి కాదనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  రాగ‌ధ్వేషాల‌కు అతీతంగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తానంటూ ప్ర‌మాణం చేసిన ముఖ్య‌మంత్రి.. గ‌ద్దె నెక్కాక‌.. క‌మ్మ కులంపై కేవ‌లం ధ్వేషం మాత్ర‌మే చూపిస్తూ.. ప‌రిపాలిస్తుండ‌టం.. రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం అంటున్నారు. జ‌గ‌న్‌రెడ్డికి ముఖ్య‌మంత్రిగా కొన‌సాగే అర్హ‌త అస‌లే మాత్రం లేదని తప్పుబ‌డుతున్నారు. రాష్ట్రంలోని ప్ర‌తీ ఒక్క‌రినీ ఒకేలా చూడాల్సిన ముఖ్య‌మంత్రి.. ఇలా ఒక కులంపై క‌క్ష కట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం.. ఒక కులానికి చెందిన‌ కొంద‌రు వ్య‌క్తుల‌ను ప‌దే ప‌దే టార్గెట్ చేయ‌డం సీఎం జ‌గ‌న్‌రెడ్డికి ఏమాత్రం త‌గ‌దు. కాలం.. రంగుల రాట్నం లాంటిది. ఎప్పుడూ ఒకరి ద‌గ్గ‌రే ఆగిపోదు. కాలం గిర్రున తిరిగి.. అధికార‌మూ తారుమారు కావొచ్చు. అందుకే, కాస్త‌.. త‌గ్గు..త‌గ్గు. ఇలాంటి కుల రాజ‌కీయం వ‌ద్దు..వ‌ద్దు.

ఒక్క అమ్మాయి.. ముగ్గురు అబ్బాయిలు.. 

అది తూర్పుగోదావరి జిల్లా. తన స్నేహితుడితో కలిసి సముద్రతీరానికి వచ్చింది ఓ యువతి. అలా సరదారా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక్క సారిగా కొంత మంది ఎక్కడి నుండి వచ్చారో తెలియదు. మద్యం మత్తులో చాలా దారుణానికి పాల్పడ్డారు. ఆ దారుణం ఏంటో ఏలుసుకోవాలనుకుంటున్నారా..? మీరే చూడండి.  పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని ఉప్పలగుప్తం మండలానికి చెందిన 21 ఏళ్ల యువతి  రెండు వారాల క్రితం అల్లవరంలోని తమ బంధువుల ఇంటికి వచ్చింది. ఈ సందర్భంగా స్నేహితుడితో కలిసి కొమరగిరిపట్నం కడదరి ప్రాంతంలో సముద్రం ఒడ్డుకు వెళ్లింది. అప్పటికే అక్కడ సీతారామపురానికి చెందిన ఇద్దరు యువకులు మద్యం తాగిన మత్తులో ఉన్నారు. అలాగే సత్యనారాయణపురానికి చెందిన మరో వ్యక్తి కూడా ఉన్నాడు. యువతీయువకులను చూసిన ఈ ముగ్గురూ వారిని సమీపించి యువకుడిపై దాడిచేసి బంధించారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి నగ్న ఫొటోలను తీసి వదిలిపెట్టారు. పది రోజుల తర్వాత నిందితుల్లో ఒకడు యువతికి ఫోన్ చేసి తన కోరిక తీర్చాలని, లేదంటే తన వద్ద వున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో భయపడిన బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

పెళ్లి.. ఆమెకు ఉరి.. 

అది పాలకొండ పట్టణం. రామకళామందిర్‌ వీధి. ఆమె పేరు హనుమాన్‌శెట్టి ఉమా వెంకట సీతామహాలక్ష్మి. ఆమె వయసు 23 ఏళ్ళు. పెళ్లి అయింది. ఆ రోజు బుధవారం. ఇంట్లో ఎవరు లేరు. సీతామహాలక్ష్మీ ఇంటి తలుపులు మూసింది. ఫ్యాన్‌కు ఉరివేసుకుని   ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖపట్నంలోని ఎండాడకు చెందిన ఈమెకు పాలకొండ పట్టణానికి చెందిన హనుమాన్‌శెట్టి వినయ్‌కుమార్‌తో తొమ్మిది నెలల కిందట వివాహమైంది. ఘటన సమాచారం అందుకున్న ఎస్సై సీహెచ్‌ ప్రసాద్‌ ఘటనాస్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. అనంతరం డీఎస్పీ ఎం.శ్రావణి, సీఐ జి.శంకరరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. క్లూస్‌టీం ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.    వరకట్నమే కారణం  తమ కుమార్తె మృతికి వరకట్న వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఎం.సావిత్రి, కృష్ణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిత్యం ఇంట్లో తమ కుమార్తెను వేధిస్తుండేవారని పోలీసులకు వివరిస్తూ తల్లిదండ్రులు బోరున విలపించారు. నిత్యం కుటుంబంలో గొడవలు ఉండేవని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో పోలీసులు భర్త వినయ్‌తో పాటు కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.     మన ఫ్రెండ్ డల్లే ఇంకెవాడుంటాడు. జనమండర్లో తానొక్కడేం కాడు. ప్రతి ఒక జీవితంలో ఒక మంచి స్నేహితుడు ఉండాలి. ఎందుకంటే మన కష్టాన్ని, ఇష్టాన్ని పంచుకునేవాడు ఫ్రెండ్ ఒక్కడే. ఒక మంచి ఫ్రెండ్ మన లైఫ్ లో ఉండే మన ప్రయాణానికి , మన కుటుంబానికి ఎలాంటి భయం ఉండదు. ఇద్దంత మీకు ఎందుకు చెప్తున్నానో మీరే చూడండి.  రోడ్డు  ప్రమాదంలో గాయపడిన తమ మిత్రుని కాపాడుకోవాలని వారు పడిన తాపత్రయం నెరవేరలేదు. చికిత్సపొందుతూ పాలకొండ మండలం వెలగవాడకు చెందిన ఎన్ని విజయ్‌కుమార్‌ రాజు(30) బుధవారం మృతిచెందాడు. ఈ నెల తొమ్మిదిన ఈ యువకుడు స్థానిక సింగన్నవలస కూడలి వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఏడాదిన్నర కిందట వివాహమైంది. భార్య శ్రీదేవి గర్భిణి. తండ్రి చనిపోవడంతో ప్రైవేటు వాహన డ్రైవరుగా పనిచేస్తూ తల్లి, భార్యను పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన మృతితో భార్య, తల్లి దుఃఖానికి అంతేలేకుండాపోయింది.     విరాళాలు పోగుచేస్తుండగానే..:  పేదకుటుంబానికి చెందిన విజయ్‌కుమార్‌కు వైద్యానికి రూ.4 లక్షల వరకు ఖర్చవుతుందని తెలుసుకున్న స్నేహితులు రెండు రోజులుగా విరాళాలు సేకరిస్తున్నారు. మిత్రుడిని బతికించుకుందామని డబ్బులు పోగుచేస్తున్న క్రమంలోనే మృతిచెందడంతో వారు కన్నీటి పర్యంతమవుతున్నారు.         

హర్భజన్ కు సాయం చేసిన సోను సూద్

కరోనా సమయంలో అవసరం రాగానే అందరూ సోనూసూద్ వైపు చూస్తున్నారు ప్రజలు.. సాధారణ పౌరులే కాదు.. సెలబ్రిటీలు సైతం సోనూసూద్ ద్వారా సాయం పొందుతున్నారు. ఇటీవల సురేష్ రైనా సైతం సోనూసూద్ నుంచి సాయం అందుకోగా లేటెస్ట్‌గా మరో ఇండియన్ క్రికెటర్‌కు సైతం అడగ్గానే సాయం చేశాడు సోనూసూద్. ఫస్ట్ వేవ్ సమయంలో వలసకార్మికులను సొంత ఊళ్లకు పంపడానికి స్పెషల్‌గా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసి సాయం చేసిన సోనూసూద్.. సెకండ్ వేవ్ సమయంలో బెడ్, ఆక్సిజన్, ప్లాస్మా, ఇంజెక్షన్.. ఇలా ప్రతీ విషయంలో సాయం చేసి నయా మెస్సయ్యగా మారిపోయారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్, స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనకు తెలిసినవారికి ఒకరికి రెండిసివర్ ఇంజెక్షన్ కావాలని దండం పెడుతూ సహాయం కోరగా.. సోనూసూద్‌ను అడగాలంటూ ఫాలోవర్స్ ట్యాగ్ చేశారు. వెంటనే స్పందించిన సోనూసూద్.. తప్పకుండా సహాయం అందుతుందంటూ భరోసా ఇచ్చేశాడు. కర్ణాటకలో అవసరమైన వ్యక్తులకు ఇంజెక్షన్ అందుతుంది అని చెప్పగా.. హర్బజన్ ధన్యవాదాలు సోదరా.. దేవుడు ఆశీస్సులతో మీరు బాగుండాలి అని ఆశీర్వదించారు.

హైడ్రోజన్ వాటర్ తో ఇమ్మ్యూనిటి.. 

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ అంత ఇంత కాదు.  ఆక్సిజన్‌ అందక పిట్టల రాలిపోతున్నారు. ఆక్సిజన్ లేక మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కొవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ అందించడంలో అటు దేశంలో లోటుపాట్లు నెలకొంటున్నాయి. ఇలాంటి సమయంలో కరోనా బాధితులకు ప్రత్యేక అల్కలైన్‌ హైడ్రోజన్‌ వాటర్‌ను దివ్యాయుషాధంగా అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్‌లోని మెడిలైట్‌ హెల్త్‌కేర్‌ సంస్థ. హైడ్రోజన్‌ గ్యాస్‌తో కూడిన ఈ నీళ్లను తాగితే కరోనా రోగుల్లో ఆక్సిజన్‌ స్థాయి పెరగడమే కాకుండా రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. కరోనా చికిత్సలో హైడ్రోజన్‌ థెరపీతో మంచి ఫలితాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.   కరోనా చికిత్సలో రోజురోజుకూ కొత్త కొత్త విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అయినప్పటికీ రోగుల్లో ఆక్సిజన్‌ స్థాయి పడిపోడవం వల్ల అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గత 20 ఏళ్లుగా చైనా, జపాన్‌, అమెరికా దేశాల్లో అమలు చేస్తున్న హైడ్రోజన్‌ థెరపీని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మెడిలైట్‌ హెల్త్‌కేర్‌ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ సహా అనేక విశ్వ విద్యాలయాలు, ప్రయివేట్‌ సంస్థల పరిశోధనల్లో హైడ్రోజన్‌ థెరపీలో ఇచ్చే అల్కలైన్‌ హైడ్రోజన్‌ వాటర్‌ రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి పెంచడమే కాకండా దెబ్బతిన్న కణాల పునరుద్ధరణకు దోహదపడుతుందని రుజువయింది.   ఈ క్రమంలోనే 2016 నుంచి మెడిలైట్‌ హెల్తెకేర్‌ సంస్థ  నగరంలోని చాలా ప్రాంతాలకు అల్కలైన్‌ హైడ్రోజన్‌ రిచ్‌ వాటర్‌ను సరఫరా చేస్తోంది. ఆసుపత్రులు, గృహ అవసరాలకు అనుగుణంగా 20 లీటర్ల క్యాన్లలో ఈ వాటర్‌ను పంపిణీ చేస్తోంది. ఈ నీటిని తాగిన వాళ్లలో ఆక్సిజన్‌ స్థాయి సాధారణంగా ఉండటమే కాకుండా.. రోగనిరోధక శక్తి మెరుగవుతుందని మెడిలైట్‌ హెల్త్‌కేర్‌ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్‌ శ్రీనివాస్‌ చెబుతున్నారు.   ఆల్కలైన్‌ హైడ్రోజన్‌ వాటర్‌ విటమిన్‌ ‘సి’ కంటే 188 రెట్లు అధిక ప్రయోజనాలు చేకూరుస్తుందని ఆక్స్‌ఫార్డ్‌ యూనివర్సిటీ వెల్లడించింది. ఈ నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి మినరల్స్‌తో పాటు హైడ్రోజన్ వాయువు విడుదల అవుతుంది. ఆ నీటిని తాగడం ద్వారా రక్తం లోకి హైడ్రోజన్‌ త్వరగా కలిసి పోయి కణాలకు ఆక్సిజన్‌ అందిస్తుంది. తద్వారా కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు దోహదపడుతుంది.    ప్రస్తుత సమయంలో కరోనా వైరస్‌ ఊపిరితిత్తులను బాగా దెబ్బతీస్తోంది. కణజాల వ్యవస్థను క్షీణింపజేస్తోంది. దీంతో బాధితులు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అల్కలైన్‌ హైడ్రోజన్‌ వాటర్‌ తీసుకోవడం ద్వారా శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పెరిగి ఊపిరితిత్తుల వాపు తగ్గుతుంది. అలాగే కణాల క్షీణత అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.      

కొవిడ్ కట్టడి ఇలా.. ప్రధానికి విపక్షాల ఉమ్మడి లేఖ

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోడీకి పన్నెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా లేఖ రాశాయి. కరోనా కట్టడికి సంబంధించి పలు సూచనలు చేశాయి. మహమ్మారి నేపథ్యంలో నెలకొన్న సంక్షోభాన్ని మానవ విషాదంగా పేర్కొన్న పార్టీలు.. ఉచిత వ్యాక్సిన్లు, సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు నిలిపివేత వంటి పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాయి.  గతంలోనే పలు పార్టీలు చేసిన విన్నపాల్ని ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించాయి. ఈ వైఖరే మానవ విషాదానికి దారి తీసిందని వ్యాఖ్యానించాయి. అందుబాటులో ఉన్న అన్ని వనరుల నుంచి వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని విపక్షాలు సూచించాయి. వెంటనే ఉచిత, సార్వత్రిక వ్యాక్సినేషన్‌ క్యాంపెయిన్‌ను నిర్వహించాలని కోరాయి. టీకా ఉత్పత్తిని పెంచేందుకు తప్పనిసరి లైసెన్సింగ్‌ విధానాన్ని తీసుకురావాలని ప్రధానికి సూచించాయి. వ్యాక్సిన్ల కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ.35 వేల కోట్లను వెంటనే ఖర్చు చేయాలన్నాయి 12 విపక్ష పార్టీలు. సెంట్రల్‌ విస్టా నిర్మాణాన్ని నిలిపివేసి ఆ నిధులను ఆక్సిజన్‌, వ్యాక్సిన్ల కోసం ఉపయోగించాలని సూచించాయి. పీఎం కేర్స్‌ నిధులను వ్యాక్సిన్లు, ఆక్సిజన్‌, వైద్య సామగ్రి కొనుగోలు చేసేందుకు కేటాయించాలని కోరాయి. నిరుద్యోగులకు నెలకు రూ.6000 చొప్పున అందించాలని డిమాండ్ చేశాయి. అర్హులకు ఉచితంగా ఆహారధాన్యాలు పంపిణీ చేయాలని.. సాగు చట్టాల్ని రద్దు చేసి ఆందోళన చేస్తున్న రైతుల్ని కొవిడ్‌ నుంచి రక్షించాలని విపక్షాలు ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో సూచించాయి.

గాంధీలో అద్బుతం.. కరోనాను జయించిన 110 ఏళ్ల వృద్దుడు 

కొవిడ్ హాస్పిటల్ గా గాంధీ వైద్యులు ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తున్నారు. గత 14 నెలలు వేలాది మందికి ప్రాణం పోశారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో గాంధీ హాస్పిటల్ లో రోగులతో నిండిపోయింది. రోజూ వందలాది మంది కొత్త పేషెంట్లు వస్తుండగా.. వందలాది మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అవుతున్నారు. తాజాగా గాంధీ కొవిడ్ హాస్పిటల్ లో అద్బుతం జరిగింది. 110 ఏండ్ల రామనంద కరోనాను జయించారు. 110 సంవత్సరాలున్న రామనంద తీర్థ 10 రోజుల క్రితం కరోనా భారీన పడ్డారు. ఆయనకు లక్షణాలు తీవ్రంగా ఉండటంతో  ఎనిమిది రోజుల క్రితం గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. గాంధీ వైద్య సిబ్బంది ఇచ్చిన చికిత్సతో కరోనా నుంచి కోలుకున్నారు రామనంద. దేశంలోనే అతిపెద్ద వయసు గల వ్యక్తి కరోనాను జయించాడని  గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజా రావు ప్రకటించారు. గాంధీ వైద్య సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. 

సీఎంవా? మత ప్రచారకుడివా?            

ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. హాస్పిటల్స్ లో బెడ్లు లేక, ఆక్సిజన్ అందక రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. జగన్ రెడ్డి సర్కార్ వైఫల్యం వల్లే జనాలు చనిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నా జగన్ సర్కార్ మొద్దు నిద్ర పోతుందని సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి  వేల్పూరి శ్రీనివాస రావు విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన  బహిరంగ లేఖ   రాశారు. రాష్ట్రంలో కోనిడ్ విలయ తాండవం చేస్తుంటే  అత్యవసర కేబినెట్ సమావేశం పెట్టి పాస్టర్లకు వేతనాలు పెంచడం ఏంటని లేఖలో వేల్పూరి శ్రీనివాస రావు ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో పాస్టర్ లకు 5 వేలు నుండి 10 వేలు , ఇమామ్ లకు 5 వేలు నుండి 10 వేలు , పురోహితులకు 10 వేలు నుండి 15 వేలుకు నెలకు వేతనం పెంచాల్సిన అవసరం ఏంటని ఆయన నిలదీశారు.  ముఖ్యమంత్రి ముసుగులో వున్న మత ప్రచారకుడు జగన్ అని రుజువు అయిందని తన బహిరంగ లేఖ లో వేల్పూరి స్పష్టం చేశారు. తిరుపతి రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక 11మంది కోవిడ్ బాధితులు చనిపోతే కేవలం 10 లక్షలు పరిహారం ఇవ్వటం,  అదే విశాఖపట్నం గ్యాస్ లీకై మృతి చెందిన వారికి 1 కోటి రూపాయలు పరిహారం ఇవ్వటం మృతుల పట్ల వివక్ష చూపడమేనని   వేల్పూరి శ్రీనివాస రావు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని.. కొవిడ్ బాధితులకు సత్వరం వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కేబినెట్ ప్రక్షాళనకు ముహుర్తం! గవర్నర్ కు కేసీఆర్ వర్తమానం! 

తెలంగాణ మంత్రివర్గ పునర్ వ్యవస్థికరణకు ముహుర్తం ఖరారైందా? రెండు, మూడు రోజుల్లోనే కొత్త మంత్రులకు ఛాన్స్ దక్కనుందా? అంటే తెలంగాణ ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం పుదిచ్చేరిలో ఉన్న రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్.. హడావుడిగా హైదరాబాద్ వస్తున్నారు. తాను హెదరాబాద్ వస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం పుదిచ్చేరి, తమిళనాడులో లాక్ డౌన్ అమలవుతోంది. తెలంగాణ రాష్ట్రంలోను బుధవారం నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. అయినా తమిళి సై హైదరాబాద్ కు వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థికరణ కోసమే గవర్నర్.. హడావుడిగా హైదరాబాద్ వస్తున్నారనే చర్చ జరుగుతోంది.  ఇటీవలే వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేశారు. ఈటల నిర్వహించిన వైద్య శాఖ ప్రస్తుతం ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. రెండు, మూడు రోజులుగా వైద్యశాఖపై సీఎం కేసీఆరే సమీక్షలు నిర్వహించారు. లాక్ డౌన్ విధింపు ప్రకటన కూడా వైద్య శాఖ మంత్రి లేకుండానే వచ్చింది. రాష్ట్రంలో కోవిడ్ పంజా విసురుతున్న సమయంలో వైద్య శాఖకు మంత్రి లేకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఆరోగ్య మంత్రి లేకపోవడంపై విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. కరోనా సమయంలో వైద్య శాఖ మంత్రిని ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నిస్తున్నాయి. కరోనా కష్టాలను చెప్పుకోవడానికి మంత్రి లేకుంటే ఎలా అని జనాలు కూడా ప్రశ్నిస్తున్నారు.  కరోనా కట్టడిపై ఫోకస్ చేసిన తెలంగాణ సర్కార్.. మంత్రి కేటీఆర్ సారథ్యంలో కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది. అయితే కొవిడ్ కల్లోల సమయంలో వైద్యశాఖను సీఎం దగ్గర ఉంచుకోకుండా.. మరొకరి అప్పగిస్తేనే బెటరనే చర్చ టీఆర్ఎస్ నేతల్లోనూ జరుగుతుందంటున్నారు. దీంతో సీఎం కేసీఆర్ కూడా వైద్యశాఖకు కొత్త మంత్రిని నియమించాలని డిసైడ్ అయ్యారంటున్నారు. కొత్త వైద్య శాఖ కోసం చాలా పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. కేసీఆర్ తొలి కేబినెట్ లో వైద్య శాఖ మంత్రిగా ఉన్న లక్ష్మారెడ్డికి రెండో సారి ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు ఈటల స్థానంలో లక్ష్మారెడ్డిని కేబినెట్ లోకి తీసుకుని ఆయనకు వైద్య శాఖను అప్పగించవచ్చనే చర్చ జరుగుతోంది. డాక్టర్ అయిన లక్ష్మారెడ్డి అయితే బెటరనే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నారంటున్నారు. అంతేకాదు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జడ్చర్లలో టీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించడం కూడా ఆయన ప్లస్ గా మారిందంటున్నారు. ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుకు వైద్య శాఖను అప్పగించవచ్చనే మరో చర్చ కూడా జరుగుతోంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి హర్షవర్ధన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో హరీష్ రావు పాల్గొనడటంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది.  కేబినెట్ విస్తరణ ఉంటే... ఈటలతో ఖాళీ అయిన ఒక్క స్థానానికే పరిమితం అవుతారా లేక పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తారా అన్నదానిపై క్లారిటీ రావడం లేదు. కేబినెట్ లో భారీగానే మార్పులు ఉండవచ్చనే ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. మరో ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించవచ్చని తెలుస్తోంది. ఈటలతో పాటు మహబూబ్ నగర్, మేడ్చల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన మంత్రులకు ఉద్వాసన ఉండవచ్చంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ దాదాపుగా నిర్ణయించారని చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ కవితకు మంత్రివర్గంలో చోటు దక్కవచ్చని రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.  ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పల్లాను కేబినెట్ లోకి తీసుకుంటే.. ఆయన సామాజికవర్గానికే చెందిన మంత్రికి ఉద్వాసన ఖాయమంటున్నారు. మేడ్చల్ జిల్లాకు చెందిన మల్లారెడ్డికి షాక్ తప్పకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటి నుంచి ఆయనపై విమర్శలు వస్తున్నాయి. భూదందాల్లోనూ ఆయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కమిషన్ కోసం మంత్రి బెదిరిస్తున్న ఆడియో లీకై వైరల్ గా మారింది. మేడ్చల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలతోనూ మల్లారెడ్డికి పొసగడం లేదు. అంతేకాదు గత లోక్ సభ ఎన్నికల్లో మల్లారెడ్డి అల్లుడికి ఎంపీ టికెట్ ఇచ్చినా.. గెలిపించుకోలేకపోయారు మల్లారెడ్డి. దీంతో పల్లాను తీసుకోవడం కోసం మంత్రివర్గం నుంచి మల్లారెడ్డిని తప్పించడం ఖాయమని చెబుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు మంత్రిపదవిపై ఇప్పటికే కేసీఆర్ సంకేతమిచ్చారనే చర్చ జరుగుతోంది.

ఏపీ బడ్జెట్ సమావేశాలు  ఎన్నిరోజులో తెలుసా ?

వరుసగా రెండు సంవత్సరాలు ఆర్డినెన్సు ద్వారా బడ్జెట్ ఆమోదించుకుని చరిత్ర సృష్టించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, మరో  బ్యాడ్ ‘రికార్డ్’ సృష్టించేందుకు సిద్దమవుతోంది. నిజానికి మార్చిలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగవలసింది . అయితే, దేనికీ అడ్డురాని కరోనా సెకండ్ వేవ్’ను సాకుగా చూపించి ప్రభుత్వం, అసెంబ్లీకు సమావేశాలకు పంగనామాలు పెట్టింది. మూడు నెలల కాలానికి, ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అత్యవసర ఖర్చుల నిమిత్తం రూపొందించిన ఓటాన్ ఎకౌంటు బడ్జెట్’ ను ఆర్డినెన్సు కు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.గవర్నర్ అనివార్యంగా ఆమోద ముద్రవేసారు.  అప్పట్లోనే ప్రభుత్వ నిర్ణయాన్నిప్రతిపక్షాలు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ తప్పు పట్టింది. అంతకు ముందు సంవత్సరం కూడా  ఆర్డినెన్సు రూపంలోనే బడ్జెట్ ఆమోదం పొందిన నేపధ్యంలో వరసగా రెండవ సంవత్సరం కూడా ఆర్డినెన్సు రూట్’లో బడ్జెట్ ఆమోదించడం, సరికాదని ఆర్థిక రంగ నిపుణులు కూడా అభ్యంతరం వ్యక్త పరిచారు.ఆర్థిక క్రమశిక్షణ గది తప్పుతుందని హెచ్చరించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించింప్పుడు, ఏపీకి వచ్చిన ప్రత్యేక ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. అయినా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొండిగా, మొరటుగా ప్రతిపక్షాలను పట్టించుకోలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాలకు ఓటాన్ ఎకౌంటు బడ్జెట్’ను ఆర్డినెన్సు రూపంలో కానిచ్చేసింది.  ఇప్పుడు ఆ మూడు నెలల కలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపధ్యంలో, ఈనెల మూడవ వారంలో, 21 లేదా 22 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, బడ్జెట్ సమావేశాలు ఎన్ని రొజూలు నిర్వహిస్తారు, అనే విషయంలో అధికారికంగా ఎలాంటి సమాచారం లేక పోయినప్పటికీ, ఒకే ఒక్క రోజులో ‘బడ్జెట్ క్రతువును’ కానిచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే బడ్జెట్ ప్రవేశ పెట్టడం, బడ్జెట్ పై చర్చ, ఆమోదం అన్నీ ఒకే రోజులో కానిచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని భావించవలసి ఉంటుంది. అదే, జరిగితే, ఇప్పటికే వరసగా రెండు సంవత్సరాలు ఆర్డినెన్సు రూట్ లో బడ్జెట్ క్రతువు కానిచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఒక రోజు బడ్జెట్ సమావేశాలు నిర్వహించి కొత్త అపప్రదను మూట కట్టుకున్నట్లు అవుతుంది.

కేసీఆర్ వ్యూహానికి ఈటల చెక్? 

తన మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారు సీఎం కేసీఆర్. ఈటల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కేసీఆర్ తనను అవమానించారన్న రాజేందర్.. భవిష్యత్ కార్యాచరణలో నిమగ్నమయ్యారు. తన సత్తా ఏంటో చూపించాలనే కసితో ఉన్న రాజేందర్... అందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. కేసీఆర్ లాంటి ఉద్దండున్ని ఎదుర్కొవాలంటే అంత ఈజీ రాదని తెలుసు కాబట్టే.. రాజేందర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. అయితే కారు గుర్తుపై గెలిచిన తనకు ఆ పదవి అవసరం లేదని చెప్పిన ఈటల. ఇంకా రాజీనామా చేయకపోవడం ప్రశ్నగా మారింది. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా చేయరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  టీఆర్ఎస్‌కు దూరమైన మాజీమంత్రి ఈటల రాజేందర్.. ఇప్పుడు కాకపోయినా మరికొన్ని నెలలకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఖాయమని ఆయన అనచురులు చెబుతున్నారు. ఉప ఎన్నిక జరిగితే హుజురాబాద్‌ను టీఆర్ఎస్ సొంతం చేసుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తుంటే.. తన సీటును ఎలాగైనా మళ్లీ తానే గెలుచుకోవాలని ఈటల రాజేందర్ భావిస్తున్నారు. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఖాయమని ఫిక్స్ అయిన టీఆర్ఎస్.. హుజూరాబాద్‌లో ఆయనను ఓడించేందుకు వ్యూహాలు కూడా రచిస్తోంది. అక్కడ టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ చేజారిపోకుండా చూసుకుంటోంది. కేసీఆర్ కు ఆ అవకాశం ఇవ్వదొన్న ఆలోచనలో రాజేందర్..కేసీఆర్ వ్యూహాలను కౌంటర్ ప్లాన్ వేశారని అంటున్నారు. హుజూరాబాద్‌లో  తాను కచ్చితంగా గెలిచేలా ఈటల వ్యూహాలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది.     హుజురాబాద్‌లో ఉప ఎన్నిక జరిగితే.. పోటీ తనకు టీఆర్ఎస్ మధ్య అన్నట్టుగా ఉండాలనే రాజేందర్ భావిస్తున్నారట. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పోటీ చేయకుంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటుందన్నది ఆయన ఆలోచన. అందుకే ఆ రెండు పార్టీలు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేలా చేయాలని యోచిస్తున్నారు రాజేందర్. ఇందులో భాగంగానే ఆయన విపక్ష నేతలతో సమావేశం అవుతున్నారని చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరైన మల్లు భట్టి విక్రమార్కతో మంగళవారం చర్చించారు రాజేదంర్. బుదవారం ఎంపీ డి.శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయన తనయుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా పాల్గొన్నారు.   కాంగ్రెస్, బీజేపీలు హుజురాబాద్‌లో పోటీ చేయకుండా తనకు మద్దతు ఇచ్చేలా ఈటల ఇలా  ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనుకునే ఈటల రాజేందర్‌కు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీలు ముందుకొస్తాయా ? అన్నది చర్చనీయాంశంగా మారింది.  మొత్తానికి ఉప ఎన్నికలు జరిగితే హుజురాబాద్‌ను టీఆర్ఎస్ సొంతం చేసుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తుంటే.. తన సీటును ఎలాగైనా మళ్లీ తానే గెలుచుకోవాలని ఈటల రాజేందర్ భావిస్తున్నారు. దీంతో హుజూరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.

ఏపీ బడ్జెట్ సమావేశాలు  ఎన్నిరోజులో తెలుసా ?

వరసగా రెండు సంవత్సరాలు ఆర్డినెన్సు ద్వారా బడ్జెట్ ఆమోదించుకుని చరిత్ర సృష్టించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, మరో  బ్యాడ్ ‘రికార్డ్’ సృష్టించేందుకు సిద్దమవుతోంది. నిజానికి మార్చిలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగవలసింది . అయితే, దేనికీ అడ్డురాని కరోనా సెకండ్ వేవ్’ను సాకుగా చూపించి ప్రభుత్వం, అసెంబ్లీకు సమావేశాలకు పంగనామాలు పెట్టింది. మూడు నెలల కాలానికి, ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అత్యవసర ఖర్చుల నిమిత్తం రూపొందించిన ఓటాన్ ఎకౌంటు బడ్జెట్’ ను ఆర్డినెన్సు కు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.గవర్నర్ అనివార్యంగా ఆమోద ముద్రవేసారు.  అప్పట్లోనే ప్రభుత్వ నిర్ణయాన్నిప్రతిపక్షాలు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ తప్పు పట్టింది. అంతకు ముందు సంవత్సరం కూడా  ఆర్డినెన్సు రూపంలోనే బడ్జెట్ ఆమోదం పొందిన నేపధ్యంలో వరసగా రెండవ సంవత్సరం కూడా ఆర్డినెన్సు రూట్’లో బడ్జెట్ ఆమోదించడం, సరికాదని ఆర్థిక రంగ నిపుణులు కూడా అభ్యంతరం వ్యక్త పరిచారు.ఆర్థిక క్రమశిక్షణ గది తప్పుతుందని హెచ్చరించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించింప్పుడు, ఏపీకి వచ్చిన ప్రత్యేక ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. అయినా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొండిగా, మొరటుగా ప్రతిపక్షాలను పట్టించుకోలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాలకు ఓటాన్ ఎకౌంటు బడ్జెట్’ను ఆర్డినెన్సు రూపంలో కానిచ్చేసింది.  అయితే ఇప్పుడు ఆ మూడు నెలల కలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపధ్యంలో, ఈనెల మూడవ వారంలో, 21 లేదా 22 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, బడ్జెట్ సమావేశాలు ఎన్ని రొజూలు నిర్వహిస్తారు, అనే విషయంలో అధికారికంగా ఎలాంటి సమాచారం లేక పోయినప్పటికీ, ఒకే ఒక్క రోజులో ‘బడ్జెట్ క్రతువును’ కానిచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే బడ్జెట్ ప్రవేశ పెట్టడం, బడ్జెట్ పై చర్చ, ఆమోదం అన్నీ ఒకే రోజులో కానిచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని భావించవలసి ఉంటుంది. అదే, జరిగితే, ఇప్పటికే వరసగా రెండు సంవత్సరాలు ఆర్డినెన్సు రూట్ లో బడ్జెట్ క్రతువు కానిచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఒక రోజు బడ్జెట్ సమావేశాలు నిర్వహించి కొత్త అపప్రదను మూట కట్టుకున్నట్లు అవుతుంది.

సీఎం జగన్ సమీప బంధువు అరెస్ట్.. వివేకా హత్య కేసు తేలేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఆయన దగ్గరి బంధువును పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం జగన్ కు అత్యంత సమీప బంధువైన వైఎస్ ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం కడప జిల్లాలో సంచలనంగా మారింది . కడప జిల్లా మామిళ్లపల్లె ముగ్గురాళ్ల గనుల్లో ఈనెల 8వ తేదీన పేలుడు సంభంవించింది. జిలెటన్ స్టిక్స్ పేలిన ఘటనలో పది మంది కూలీలు చనిపోయారు. పేలుడుకు బాధ్యులైన లీజుదారుడు నాగేశ్వరరెడ్డి, ఎక్స్‌ప్లోజివ్‌ మేనేజర్‌ రఘునాథరెడ్డిలను మరుసటి రోజే అరెస్ట్ చేశారు. మైనింగ్‌ పేలుడు కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. తాజాగా ఎక్స్‌ప్లోజివ్‌ లైసెన్సు దారుడు వైఎస్‌ ప్రతాప్ రెడ్డిని అరెస్టు చేశారు. ఈయన సీఎం జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సమీప బంధువు, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి స్వయానా పెదనాన్న.  వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య సతీమణి కస్తూరిబాయి పేరుతో 2001 నవంబరులో మామిళ్లపల్లిలో మైనింగ్‌ లీజు జారీ కాగా.. నిర్వహణ హక్కులను బి.మఠం మండలానికి చెందిన వైసీపీ నేత నాగేశ్వర్‌రెడ్డికి 2013లో జీపీఏ ఇచ్చారు. ప్రస్తుతం ఆయనే మైనింగ్‌ నిర్వహిస్తున్నారు. నిబంధనలకు తూట్లు పొడిచి భూగర్భ బెరైటీస్‌ మైనింగ్‌ను కొనసాగిస్తున్నారు. గనిలో వినియోగించే జిలెటన్‌ స్టిక్స్‌ పులివెందుల నుంచి కలసపాడు వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పులివెందులలో వైఎస్‌ ప్రతాప్‌రెడ్డికి చెందిన మ్యాగజైన్‌ లైసెన్స్‌ నుంచి జిలెటన్‌ స్టిక్స్‌ తరలించినట్లు వెల్లడైంది. అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టకుండా తరలించారంటూ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. వైఎస్ ప్రతాప్ రెడ్డికి పులివెందుల, సింహాద్రిపురం, లింగాల పరిసర ప్రాంతాల్లో గనులున్నాయి. ఈ నేపథ్యంలో పేలుడుకు వినియోగించే జిలెటన్‌ స్టిక్స్‌కు మ్యాగజైన్‌ లైసెన్స్‌ ప్రతాప్‌రెడ్డికి ఉంది.  ఈ క్రమంలో వైఎస్ ప్రతాప్ రెడ్డి.. పులివెందులకు చెందిన యర్రగుడి రఘునాథరెడ్డికి పేలుడు పదార్థాలు, రెండు మ్యాగజైన్లలో భద్రపరుచుకోవడానికే అగ్రిమెంటు ఇచ్చారు. ప్రతాప్ రెడ్డికి చెందిన లైసెన్సు మ్యాగజైన్లలో పేలుడు పదార్థాలు, జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లను అధిక లాభానికి లైసెన్సు లేని వారికి రఘునాథరెడ్డి అక్రమంగా విక్రయిస్తూ వస్తున్నారు. 8న ఎక్స్‌ప్లోజివ్‌ రూల్స్‌కు విరుద్ధంగా లైసెన్సు లేని లక్ష్మిరెడ్డికి జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లను రఘునాథరెడ్డి అక్రమంగా విక్రయించారు. వాటిని కలసపాడు మండలం, పోరుమామిళ్ల సమీపంలోని కొండగంగమ్మ మైనింగ్‌కు ఎలాంటి భద్రత లేని కారులో తీసుకొని వెళ్లి దించుతుండగా ఈ పేలుళ్లు జరిగాయి. పేలుడు కేసులో సీఎం సమీప బంధువు అరెస్ట్ కావడం  రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఈ కేసులానే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును త్వరగా చేధించి నిందితులను అరెస్ట్ చేయాలనే డిమాండ్ వస్తోంది. వైఎస్ వివేకా హత్య కేసులోనూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులపై తమకు అనుమానాలు ఉన్నాయని... వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి పలు సార్లు చెప్పారు. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐకి కూడా ఆమె ఈ వివరాలు అందించారు.