పీఎంవో వేస్ట్.. గడ్కరీ బెస్ట్! బీజేపీ నేత సంచలనం

దేశంలో కరోనా మహ్మమారి పంజా విసురుతోంది. సెకండ్ వేవ్ లో దేశంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ అందుక కరోనా రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. పెద్ద పెద్ద నగరాల్లోని హాస్పిటల్స్ లో శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. కేంద్ర సర్కార్ నిర్లక్ష్యం వల్లే దేశంలో కరోనా విజృంభిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని అంతర్జాతీయ మీడియా తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తోంది. మన దేశంలోని విపక్షాలు మోడీ సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి. తాజాగా మోడీపై సొంత పక్షం నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.  ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర సర్కార్ తీరుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా బాధ్యతల నిర్వహణకు సంబంధించి ప్రధాని కార్యాలయంపై ఆధారపడటం అనవసరమని.. ఆ బాధ్యతలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అప్పగించాలని చెప్పారు. పీఎంఓపై ఆధారపడటం దండగని అన్నారు సుబ్రహ్మణ్యస్వామి.  అయితే తాను కేవలం ప్రధాని కార్యాలయాన్నే విమర్శిస్తున్నానని... ప్రధాని మోదీని కాదని వివరణ ఇచ్చారు. కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కు కూడా పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేదని అన్నారు. హర్షవర్ధన్ తన అధికారాలను పూర్తి స్థాయిలో నిర్వహించలేని పరిస్థితి ఉందని చెప్పారు. గడ్కరీతో కలిస్తే హర్షవర్ధన్ విజయవంతమవుతారని అన్నారు. మన దేశం మరో కరోనా వేవ్ ను ఎదుర్కోబోతోందని స్వామి హెచ్చరించారు. ఈ వేవ్ పిల్లలపై కూడా ప్రభావం చూపుతోందని... ప్రతి ఒక్కరు కట్టుదిట్టమైన జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు సుబ్రహ్మణ్యస్వామి. 

నర్సు పై.. డాక్టర్..  

అది తెలంగాణ. జగిత్యాల జిల్లా. అది ఓ ప్రైవేటు అసుపత్రి. ఆ డాక్టర్ పేరు రాజేష్. మూడు నెలల క్రితం జగిత్యాల పట్టణంలో ఓ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ మధ్యనే కోవిడ్ ఆసుపత్రిగా అనుమతులు లభించాయి. సదువుకున్నోడి కంటే ఆడు ఎవడో మేలు అన్నట్లు..  గీ.. డాక్టర్ చదువైతే సదివిండు గానీ..  వాడి ముద్ది మాత్రం గడ్డి తినింది. మెదడు మోకాళ్ళలో ఉంది. అందుకే వాడికి ఆడోళ్ళ వాసనా కావాల్సి వచ్చింది ఆ దరిద్రపు గొట్టు డాక్టర్ కు. అందుకోసం అక్కడ ఇక్కడ ఎందుకని ఆసుపత్రిలో పని చేస్తున్న సాటి నర్సు పైనే  ఆ డాక్టర్ పాపపు కండ్లు పడ్డాయి. కామంతో కళ్ళు మూసుకుపోయి.​ నర్సు కొవిడ్ పేషంట్లకు సంబంధించిన పరీక్షల రిపోర్టులను వైద్యుడు రాజేష్‌కు చూపించేందుకు గదిలోకి వెళ్ళింది. అంతటితో ఇదే అదును అని పసిగట్టిన ఆ కామాందుడు. నర్సుతో నీకు జీతం ఎంత ఇస్తున్నారని, ఇంతకంటే ఎక్కువ జీతం ఇప్పిస్తానని చెప్పి తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.  కట్ చేస్తే.. ఆ  వైద్యుడి పై, నర్సు కోరుట్ల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలిసులు డాక్టర్ ఆణిముత్యం పై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం రోజున సినాఫ్ ఎఫెన్స్ క్రింద డిఎస్పీ ఆసుపత్రిని పరిశీలించారు. ఆస్పత్రిలో పనిచేసే నర్సు పైనే వైద్యుడు ఇలా ప్రవర్తించడంతో తోటి సిబ్బంది, రోగులు ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసిన ఏమున్నది గర్వకారణం.. నిత్యం మహిళలపై అఘాయిత్యాలు, అకృత్యాలు, అక్రమాలు తప్పా.. సవుడుకున్నోడికి సదువుకోనోడికి తేడాలేకుండా పోయింది. అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే అన్ని మర్చిపోతారు పోరికిగాళ్ళు.. పోరంబోకులు. తమ అక్క తమ చెల్లి ఒక ఆడదే కదా అని మరిచిపోతారు. మృగంలా పై బడుతారు.   

మరాఠీలకు నో రిజర్వేషన్..  

మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మరాఠి సంఘం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆ వార్త తో మహారాష్ట్రలోని మరాఠి ప్రజలు ఒక్కసరిగా కలత చెందారు. గతంలో రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఇది అధిగమించిందని హై కోర్టు తెలిపింది. 2018లో మరాఠాలకు మహారాష్ట్ర సర్కార్‌ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో 16 శాతం రిజర్వేషన్‌ కల్పించింది.  దీన్ని వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విచారణ జరిపిన కోర్టు రిజర్వేషన్లను సమర్థిస్తూ 2019లో తీర్పు వెలువరించింది. అయితే, కోటాను 16 శాతం నుంచి విద్యాసంస్థల ప్రవేశాల్లో 12 శాతానికి, ఉద్యోగ నియామకాల్లో 13 శాతానికి తగ్గించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసును విచారించిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు తుది తీర్పును వెలువరించింది. ఆర్థిక, సామాజిక వెనకబాటుతనం ఆధారంగా మారాఠాలకు రిజర్వేషన్‌ కల్పించారని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. గతంలో పార్లమెంటు చేసిన ఓ సవరణ ప్రకారం.. ఒక వర్గాన్ని సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన జాబితా(ఎస్‌ఈబీసీ)లో చేర్చే హక్కు రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. రాష్ట్రాలు కేవలం ఆయా వర్గాలను గుర్తించి కేంద్రానికి సిఫార్సు మాత్రమే చేయాలని.. అనంతరం రాష్ట్రపతి వాటిని వెనుకబడిన వర్గాల జాబితాలో చేరుస్తారని వివరించింది. ఈ కోటా కింద ఇప్పటికే చేపట్టిన నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాలపై తాజా తీర్పు ప్రభావం ఉండబోదని.. వాటిని అలాగే కొనసాగించాలని స్పష్టం చేసింది. మండల్‌ తీర్పుగా పేరొందిన ఇందిరా సాహ్నీ తీర్పు (1992)ను  పునఃసమీక్షించాల్సిన అసవరం కూడా లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పీజీ మెడికల్‌ కోర్సుల్లో మునుపటి ప్రవేశాలు కొనసాగుతాయని వెల్లడించింది. గతంలో జరిగిన అన్ని నియామకాలకు ఎలాంటి ఇబ్బంది లేదని వివరించింది. కోర్టు నిర్ణయం పై మరాఠీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నపలంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తాము అభివృద్ధికి మరింత దూరం అవుతామని ఆవేదన చెందుతున్నారు.   

తెలంగాణ‌లో వీకెండ్ లాక్‌డౌన్‌! పోలీసుల‌కు ఫుల్ ప‌వ‌ర్స్‌.. హైకోర్టు సీరియ‌స్‌..

తెలంగాణ‌లో వీకెండ్ లాక్‌డౌన్ పెట్టండి. నైట్ క‌ర్ఫ్యూ వేళ‌లు పొడిగించండి. ఈ నెల 8వ లోగా నిర్ణ‌యం తీసుకోండి. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌న్నింటినీ ప‌రిశీలించాల్సిందిగా తెలంగాణ హైకోర్టు ప్ర‌భుత్వానికి సూచించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు తగ్గడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. ఇక‌పై రోజుకు లక్ష కొవిడ్ టెస్టులు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స, మందుల‌ ధరలు ప్రభుత్వమే నిర్ణయించాలని.. వాటిపై తాజా మార్గదర్శకాలు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ‘‘రెండు రోజుల్లో కరోనాపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి. నిపుణుల కమిటీ సమావేశాల వివరాలు కోర్టుకు సమర్పించాలి. శ్మశాన వాటికలు, సదుపాయాల వివరాలు తెలపాలి. శుభకార్యాల్లో 200 మంది, అంత్యక్రియల్లో 50 మందికి మించొద్దు. వివాహాలు, అంత్యక్రియల్లో ఆంక్షలపై 24 గంటల్లో జీవో ఇవ్వాలి. ఆస్పత్రుల ద‌గ్గ‌ర‌ పోలీసు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మాస్కులు ధరించనివారి వాహనాల జప్తు అంశాన్ని పరిశీలించాలి. పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే. ఔషధాల అక్రమ విక్రయాలపై మరింత కఠినంగా వ్యవహరించాలి. ఫంక్షన్‌ హాళ్లు, పార్కులు, మైదానాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలి. ఆర్టీపీసీఆర్‌ ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాకపోకలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.   మరోవైపు కరోనా నిబంధనల అమలు పర్యవేక్షణకు 859 పెట్రోలింగ్‌, 1,523 ద్విచక్రవాహనాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. భౌతికదూరం పాటించని సంస్థలపై కేసులు పెడుతున్నామని.. భౌతికదూరం పాటించని వ్యక్తులపై కాదన్నారు. ఇప్పటి వరకు ఔషధాల అక్రమ విక్రయాలకు సంబంధించి 39 కేసులు నమోదు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు డీజీపీ.  పేరంబుదురు నుంచి ఆక్సిజన్‌ రాకుండా తమిళనాడు ప్రభుత్వం అడ్డుకుంటోందని విచారణ సందర్భంగా డీహెచ్‌ శ్రీనివాస్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తమిళనాడు నుంచి ఆగిన ఆక్సిజన్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేలా చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం కోరింది. చర్యలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి తెలపాలని కేంద్రానికి సూచించింది. క‌రోనా క‌ట్ట‌డికి హైకోర్టే రంగంలోకి దిగ‌డం.. ప‌లు ఆదేశాలు ఇవ్వ‌డంతో.. స‌ర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 

ఈటల రాజేందర్ బ్యాక్ స్టెప్! 

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన ఈటల రాజేందర్ ఎపిసోడ్ లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో రగిలిపోతున్న ఈటల... కేసీఆర్ తో అమీతుమీకి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరిగింది. ఈటల మద్దతుదారులు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈటల సీఎం సీఎం అంటూ నినదిస్తున్నారు. రాజేందర్ కూడా హుజురాబాద్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తుండటంతో .. ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కారు సింబల్ తో గెలిచిన పదవి తనకు అక్కర లేదని ఈటల చెప్పడంతో.. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడం ఖాయమని అంతా భావించారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్ పర్యటన తర్వాత సీన్ మారిపోయినట్లు కనిపిస్తోంది. ఈటలను కలిసిన మద్దతుదారులు.. రాజీనామాపై భిన్నాభిప్రాయాలు చెప్పారని తెలుస్తోంది. రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టాలని కొందరు కోరితే... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవద్దని మరికొందరు సూచించారట. ప్రభుత్వం ఏం చేయబోతోంది, కేసీఆర్ వ్యూహం ఏంటన్నదాని కోసం మరికొన్ని రోజులు ఎదురుచూస్తే బెటరని మరికొందరు నేతలు సూచించారని చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశంలో ఈటల రాజేందర్ కూడా పునరాలోచన చేస్తున్నారని  తెలుస్తోంది. హైదరాబాద్ కు వెళ్లి మరికొందరు నేతలతో మాట్లాడాకే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజేందర్ రాజీనామా చేయబోవడం లేదనే ఎక్కువ మంది ఈటల మద్దతుదారులు చెబుతున్నారు.  తన నియోజకవర్గ నేతలతో చర్చల తర్వాత మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ కూడా ఇదే రకమైన సంకేతం ఇచ్చారు. తనకు జరిగిన అన్యాయం భరించరానిదని కార్యకర్తలు అభిప్రాయపడ్డారని ఈటల రాజేందర్ చెప్పారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నానని చెప్పారు.  రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల ఉద్యమకారులంతా సూచనలు ఇచ్చారన్నారు. 20 ఏళ్ల ఉద్యమ ఘట్టాలను కొందరు గుర్తు చేశారని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటే ఉంటామని కార్యకర్తలు భరోసా ఇచ్చారని ఈటల తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌ నుంచే కాకుండా ఖమ్మం సహా 9 జిల్లాల నుంచీ కార్యకర్తలు పరామర్శించేందుకు వచ్చారన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆత్మీయులతో మాట్లాడుతానని.. వాళ్ళతో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తానన్నారు. ఆత్మ గౌరవం పెద్ద సమస్య అయ్యిందని పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయమని.. అందరూ అర్థం చేసుకోవాలన్నారు. సమస్య వస్తే మీ దగ్గరికే వస్తానని ఈటల వెల్లడించారు. 

కరోనా.. మరణాలకు వారే కారణం..హై కోర్టు  

దేశం లో కరోనా మరణాలు చూసి ఆ యముడి హృదయం అయినా కరిగిపోతాడేమో గానీ, మన పాలకులు హృదయాలు మాత్రం కదలడం లేదు. ఈ విషయంలో లో దేశ నాయకులు కసాయి వారైతే. మన తెలుగు రాష్ట్ర నాయకులు ఆ కసాయి వారి బాబులు అని చెప్పాలి. ఆక్సిజన్ లేక, కళ్ళల్లో జీవకల లేక ఏమిచేయలేక కరోనా బాధితులు పిట్టలా రాలిపోతున్నారు. ఈ నేపథ్యం లో మొన్నటికి మొన్న చైన్నై హై కోర్టు కలగా చేసుకుని. కరోనా కేసులు పెరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం పై సంచల కామెంట్స్ చేసింది. తాజాగా అలహాబాద్ హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద సంచలన వ్యాఖ్యానాలు చేసింది.    కరోనా బాధితులకు ఆక్సిజన్ అందక చనిపోతున్నారన్న విషయం నిజంగా మారణహోమం వంటిదేనని, ఆ పాపం పాలకులడే అని.. ఆ మరణాలకు బాధ్యతని పాలకులడే అని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆక్సిజన్ ను సరఫరా చేయలేకపోవడం నేరపూరిత చర్య అని. ప్రజా ఆరోగ్యం మీద పాలకులకు చిత్త శుద్ధి లేకపోవడమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది. సప్లయ్ చైన్ ను నిర్వహించలేని అధికారులు, నేతలు అసమర్థులేనని తేల్చిచెప్పింది. సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో ఆక్సిజన్ లేకుండా కరోనా బాధితులు మరణిస్తున్నారని వచ్చిన వార్తలు, ప్రచారంపై స్పందించిన జస్టిస్ సిద్ధార్ద్ వర్మ, జస్టిస్ అజిత్ కుమార్ ల ధర్మాసనం, కరోనా పరిస్థితులపై దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించింది.లక్నో, మీరట్ జిల్లాల్లో ప్రాణ వాయువు సరఫరా అందక పలువురు మరణించగా, అన్ని కేసుల్లోనూ విచారణకు ఆదేశిస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. క్వారంటైన్ సెంటర్లలో పరిస్థితిని వెంటనే సమీక్షించాలని, అవసరార్థులకు ఆసుపత్రుల్లో బెడ్లను, ఆక్సిజన్, వెంటిలేటర్లను అందించాలని ఆదేశించింది. ఆక్సిజన్ అందక రోగులు మరణిస్తున్నారని విని మేము చాలా బాధపడుతున్నాం. ఇది మా మనసును కలచి వేస్తోంది. కరోనా మరణాల పట్ల మేము కలత చెందుతున్నాం అని. ఇది నిజంగా మారణహోమం కన్నా తక్కువేమీ కాదు. కసాయి తనమే అని చెప్పింది. మెడికల్ ఆక్సిజన్ ను నిర్వహించాల్సిన వారు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదు.. ఈ సమయంలో ప్రజలు ముఖ్యంగా మహమ్మారి బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దేశంలో గుండె మార్పిడి చికిత్సలు, మెదడు ఆపరేషన్లు విజయవంతంగా జరుగుతున్న వేళ, సాధారణ జబ్బుతో రోగులు మరణించడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. సాధారణ పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ విషయంలో కోర్టులు కల్పించుకోబోవని, కానీ వార్తలు చూస్తూ, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలు చూస్తూ, దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ఎలా తోసి పుచ్చగలమని న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లక్నో, మీరట్ కలెక్టర్లు వెంటనే స్పందించి, తమ నివేదికలను 48 గంటల్లోగా కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.           

ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా?

మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈటలకు మద్దతుగా విపక్ష నేతలు కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. తన అవినీతికి సహకరించడం లేదనే తొలగించారని ఆరోపిస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న ఇతర మంత్రులనుతొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజేందర్ కు మద్దతుగా బీసీ సంఘాలు రోడ్డెక్కుతున్నాయి. ఈటలను పదవి నుంచి అవమానకరంగా తొలగించారంటూ కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నాయి. తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలు, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంపై సీరియస్ గానే స్పందిస్తున్నారు ఈటల రాజేందర్. మూడు రోజులుగా హుజురాబాద్ లో ఉన్న ఈటన తన అనుచరులు, బీసీ సంఘాలు, కలిసి వచ్చే నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు రాజేందర్. కేసీఆర్ ను టార్గెట్ పక్కా ప్లాన్ ప్రకారమే తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసులు, అరెస్టులకు భయపడేది లేదన్న ఈటల.. టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవి తనకు అవసరం లేదని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజేందర్ రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది.  అయితే తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారిన మాజీ మంత్రి ఈటల వివాదంలో మరో కొత్త నినాదం తెరపైకి వచ్చింది. గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ కూడా రాజీనామా చేయాలని ఈటల మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇటు హుజురాబాద్‌‌లో ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తెలిపారు. ఇద్దరూ కలిసి పోటీ చేస్తే అసలు ఓనర్ ఎవరో తెలుస్తుందని... ఎవరు గెలిస్తే వారే నిజమైన ఓనర్లని అన్నారు. ఉద్యమంలో కేసీఆర్, ఈటల ఇద్దరిదీ ఒకే స్థాయి అని చెప్పుకొచ్చారు. కాగా తమ నేతపై మంత్రులు చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఈటలకు లేదని మద్దతుదారులు స్పష్టం చేశారు. దీంతో ఈటల అనుచరుల డిమాండ్  ప్రకారం గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది.  ఉద్యమ సమయంలో చాలా సార్లు కేసీఆర్ రాజీనామా చేశారు. విపక్షాల సవాల్ చేసిన వెంటనే స్పందించి తన పదవికి రాజీనామా చేసి.. ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. ఈ నేపథ్యంలో ఈటల వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలు, ఈటల అనుచరుల డిమాండ్ మేరకు కేసీఆర్ .. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 

దేశంలో కంప్లీట్‌ లాక్‌డౌన్‌.. కండీష‌న్స్ అప్లై..

అవును. దేశంలో లాక్‌డౌన్ అమ‌లు అవుతోంది. ఇందులో డౌటేమీ అవ‌స‌రం లేదు. ప్ర‌ధాని మోదీ అధికారికంగా ప్ర‌క‌టించ లేదు అంతే. అన‌ధికారికంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం.. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం లాక్‌డౌన్ త‌ర‌హా ఆంక్ష‌ల‌ను ఇప్ప‌టికే అమ‌లు చేస్తున్నాయి. అందుకే, దేశంలో ప్ర‌స్తుతం సంపూర్ణ లాక్‌డౌన్ ఉందంటున్నారు. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాల‌నే డిమాండ్‌లు పెరుగుతున్న వేళ‌.. ఈ ఆంక్ష‌ల విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు దాదాపు అన్ని స్టేట్స్‌లో నైట్ క‌ర్ఫ్యూ కొన‌సాగుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌రింత క‌ఠిన ఆంక్ష‌ల దిశ‌గా అడుగులు వేసింది. ఏపీలో హాఫ్ డే లాక్‌డౌన్‌ను బుధ‌వారం నుంచి అమ‌లు చేస్తున్నారు. మ‌ధ్యాహ్నం 12 త‌ర్వాత స‌క‌లం బంద్‌. తెలంగాణ‌లోనూ లాక్‌డౌన్ విధించాల‌నే డిమాండ్ పెరుగుతోంది. అటు, దేశ రాజ‌ధాని ఢిల్లీ ఏప్రిల్ 19 నుంచి లాక్‌డౌన్లో ఉంది. ప్ర‌స్తుతానికి మే 10 వ‌ర‌కూ కొన‌సాగ‌నుంది. అవ‌స‌ర‌మైతే అది మ‌రింత కాలం పొడిగించే అవ‌కాశం క‌నిపిస్తోంది. అటు, కొవిడ్ హాట్‌స్పాట్‌గా మారిన మ‌హారాష్ట్రలోనూ ఈ నెల 15 వరకు లాక్‌డౌన్ త‌ర‌హా ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి.  కర్ణాటకలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో  ఆ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తోంది. ఏప్రిల్‌ 27 రాత్రి నుంచి మే 12వ తేదీ వరకు కర్ణాటకలో పాక్షిక లాక్‌డౌన్‌ విధించారు. అయితే ఈ పాక్షిక లాక్‌డౌన్‌ వల్ల కేసుల్లో తగ్గుదల కనిపించడం లేదు. దీంతో ఈ పాక్షిక లాక్‌డౌన్‌ గడువు ముగిసిన వెంటనే అదే రోజు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రభుత్వం సమాయాత్తం అవుతున్నట్లు సమాచారం.  హరియాణాలో మే మూడు నుంచి ఏడు రోజుల లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది.  ఒడిశా.. మే 5 నుంచి 19 వరకు 14 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. రాజస్థాన్‌లో ఈ నెల 17వరకు లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నారు.   ఝార్ఖండ్‌లో గత నెల 22 నుంచి మే 6 వరకు.. లాక్‌డౌన్‌ తరహా కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. పంజాబ్‌లో వారాంతపు లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ లాంటివి ఈ నెల 15 వరకు అమల్లో ఉండనున్నాయి. మధ్యప్రదేశ్‌ ఈ నెల 7 వరకు కరోనా కర్ఫ్యూ.. గుజరాత్‌లోని 29 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ.. తమిళనాడులో మే 20వరకు కఠిన ఆంక్షలు.. కేరళలో ఈ నెల 9 వరకు కఠిన ఆంక్షలు.. అస్సాం, ఉత్త‌రాఖండ్‌లో రాత్రిక‌ర్ఫ్యూ అమ‌ల‌వుతోంది. ఇలా.. అన్ని రాష్ట్రాలూ ఏదో ఒక ర‌క‌మైన ఆంక్ష‌లు విధించ‌డంతో.. దేశంలో లాక్‌డౌన్ త‌ర‌హా ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. అయినా, క‌రోనా ఏమాత్రం కంట్రోల్‌కి రాక‌పోవ‌డం క‌ల‌వ‌ర పాటుకు గురి చేస్తోంది. అంత‌రాష్ట్ర రాక‌పోక‌ల‌పై నిషేధం లేక‌పోవ‌డం.. క‌ల్లోల స‌మ‌యంలో ప‌లు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డంతో.. వైర‌స్ మ‌రింత‌గా విజృంభిస్తోంది. ప్ర‌స్తుత క‌రోనా క‌ల్లోలానికి ప్ర‌భుత్వాలు, పాల‌కుల ఉదాసీన వైఖ‌రే కార‌ణంగా క‌నిపిస్తోంది. 

ఒక్క ఫోన్ కాల్ తో 22 మందికి ప్రాణం.. సోను సూద్ కు వందనం 

కరోనా కల్లోలం కష్టాల్లో ఉన్న జనాలకు ఆపద్భాదంవుడిగా నిలుస్తున్నారు నటుడు సోనూ సూద్. గత సంవత్సరం కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆయన  సాయం చేస్తూనే ఉన్నారు.ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. పేదలకు ప్రాణం పోశారు. ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికుల తరలింపు నుంచి కష్టకాలంలో ఉన్న ఎంతో మందిని ఆయన తన సొంత డబ్బుతో ఆదుకున్నారు. ప్రత్యేక రైళ్లు, విమానాలను కూడా ఏర్పాటు చేసి బాధితులకు సాయపడ్డారు సోనూ సూద్. పేదల పేలిట పేన్నిధిగా మారిన సోను సూద్ కు ఇటీవలే కరోనా సోకింది. అయినా క్వారంటైన్ లో ఉంటూనే సేవా కార్యక్రమాలు కొనసాగించారు. తన ఆస్తులను తాకట్టు పెట్టీ మరీ పేదలకు ఖర్చు చేశారు. తాజాగా బెంగళూరులో తనకు వచ్చిన ఒక్క ఫోన్ కాల్ కు వేగంగా స్పందించి 22 మంది ప్రాణాలు కాపాడారు రియల్ హీరో. రాత్రంతా తన్ టీమ్ ను అలర్ట్ చేసి.. , 22 ప్రాణాలను కాపాడి, తానేంటో మరోసారి నిరూపించుకున్నారు సోనుసూద్.  బెంగళూర్ ఆర్క్ హాస్పిటల్ లో ఆక్సిజన్ అయిపోయింది. పదుల సంఖ్యలో రోగులు ఆక్సిజన్ పై ఉన్నారు.ఈ విషయాన్ని యహలంక పాత బస్తీ ఇనస్పెక్టర్ సత్యనారాయణ సోనూ సూద్ దృష్టికి తీసుకుని వెళ్లారు. విషయాన్ని సోనూ నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ కు ఆయన చెప్పగానే, పరిస్థితిని అర్థం చేసుకున్న వెంటనే ఆయన టీమ్ ను అలర్ట్ చేశారు. అప్పటికే ఆక్సిజన్ కారణంగా ఆసుపత్రిలో ఇద్దరు బాధితులు కన్నుమూయగా, మిగతావారిని కాపాడాలన్న ఆదేశాలు అందాయి. దీంతో గంటల వ్యవధిలోనే సోనూ టీమ్ 15 ఆక్సిజన్ సిలిండర్లను అందించింది. "ఇది నా కృషి కాదు. నా టీమ్ చేసిన అద్భుతం. కేవలం కొద్దిమంది మాత్రమే సమష్టిగా పనిచేశారు. సత్యనారాయణ నుంచి కాల్ రాగానే, మేము దాన్ని వెరిఫై చేశాము. నిజమని తెలియగానే నిమిషాల వ్యవధిలో పని మొదలైంది. రాత్రంతా ఆసుపత్రికి ఆక్సిజన్ ను అందించేందుకు శ్రమించాం. మేము ఆలస్యం చేసుంటే ఎన్ని ప్రాణాలు పోయుండేవో తెలియదు. ఈ ఆపరేషన్ ను విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా హష్ మత్ అనుక్షణం నాతో మాట్లాడుతూ, మిగతా వారిని సమన్వయపరుస్తూ ఆసుపత్రికి సాయం చేశారు. ఇందుకు నాకెంతోగర్వంగా ఉంది" అని ఈ సందర్భంగా సోనూ సూద్ వ్యాఖ్యానించారు. సకాలంలో హాస్పిటల్ కు ఆక్సిజన్ అందించి 22 మంది ప్రాణాలు కాపాడిన సోనుసూద్ కు అన్ని వర్గాల నుంచి అభినందనలు అందుతున్నాయి. నెటిజన్లు సోనుకు సెల్యూట్ చేస్తున్నారు. ప్రభుత్వాలు చేయలేని పని చేస్తూ రియల్ హీరోగా నిలుస్తున్నారని కొనియాడారు. అధికారులు కూడా ప్రభుత్వంతో కాదని.. సోనుసూద్ ను ఆశ్రయించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. 

7 కోట్ల ఖ‌రీదైన వైన్ బాటిల్‌.. అంత ధ‌ర ఎందుకంటే...

వైన్ అంటేనే సంథింగ్ స్పెష‌ల్‌. బ్రాంది, విస్కీల‌కంటే డిఫ‌రెంట్‌. విదేశాల్లో వైన్‌కు ఫుల్ క్రేజ్‌. ఇక ఫ్రెంచ్ వైన్ అన్నిటికంటే బెస్ట్‌. ఎంత పాత వైన్ అయితే అంత టేస్ట్‌. వైన్‌ ఎంత‌గా మాల్ట్ అయితే అంత కాస్ట్‌. వైన్‌కు ప్ర‌త్యేక రుచి తీసుకొచ్చేందుకు.. భూగ‌ర్భంలో నేల‌మాలిగ‌ల్లో వైన్‌ను ఏళ్ల త‌ర‌బ‌డి పులియ‌బెడ‌తారు. బాగా పులిశాక‌.. అంద‌మైన బాటిల్స్‌లో అమ్ముతుంటారు. అంత క‌ష్టం, అంత రుచి, అంత ప్ర‌త్యేక వాస‌న ఉంటుంది కాబ‌ట్టి.. ధ‌ర కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ఒక్కో బాటిల్ ల‌క్ష‌ల్లో ధ‌ర ప‌లుకుతుంది. కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే వైన్ బాటిల్ వీట‌న్నిటికంటే చాలా చాలా స్పెష‌ల్‌. అందుకే ఆ బాటిల్‌కు ఏకంగా 7 కోట్ల‌కు పైగా చెల్లించేందుకు వైన్ ల‌వ‌ర్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇంత‌కీ, ఆ వైన్ స్పెషాలిటీ ఏంటంటే... అది అంతరిక్షంలో పులియబెట్టిన వైన్‌. అందుకే దాని ధర కూడా ఆకాశ‌మంత ఎత్తులో ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం-ISSలో ఏడాదికిపైగా ఆ వైన్‌ను మాల్ట్ చేశారు. ఆ ఫ్రెంచ్ వైన్‌ బాటిల్‌ను ఇప్పుడు క్రిస్టీస్‌ సంస్థ వేలానికి పెట్టింది. ఇది 10 లక్షల డాలర్లు (దాదాపు 7.37 కోట్లు) పలకొచ్చని భావిస్తోంది.  2019 నవంబరులో అంతరిక్షంలోకి 12 వైన్‌ సీసాల‌ను పంపించారు. అందులోని ఒక బాటిల్‌నే ఇప్పుడు వేలం వేస్తున్నారు. భూమికి వెలుపల సేద్యానికి అవకాశాలపై పరిశోధనలో భాగంగా ప్రైవేటు అంకుర పరిశ్రమ ‘స్పేస్‌ కార్గో అన్‌లిమిటెడ్‌’ వీటిని అక్కడికి పంపింది. 14 నెలల తర్వాత ఆ బాటిల్స్‌ను తిరిగి భూమికి తీసుకొచ్చారు. వీటికి ఫ్రాన్స్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వైన్‌ అండ్‌ వైన్‌ రీసెర్చ్‌లో పరిశోధకులు పరీక్షలు నిర్వహించారు. భూమిపై అంతేకాలం పాటు పులియబెట్టిన వైన్‌తో దీన్ని పోల్చి చూశారు. రుచిలో రెండింటి మధ్య చాలా తేడా ఉందని చెప్పారు. అంత‌రిక్షంలో మాల్ట్ చేసిన వైన్‌.. స్మూత్‌గా, సువాసన భరితంగా ఉందని తేల్చారు. గురుత్వాకర్షణ లేని చోట ప్రత్యేక వాతావరణంలో ఈ వైన్‌ ‘పరిపక్వానికి’ వచ్చింది కాబ‌ట్టి ఆ వైన్ టేస్ట్ అదుర్స్ అంటున్నారు. అందుకే, ఆ వైన్ బాటిల్‌ వేలంలో  7 కోట్ల‌కు పైగా ధ‌ర ప‌ల‌కొచ్చ‌ని చెబుతున్నారు. ఆ వైన్ బాటిల్‌కు ఓ పేరు కూడా ఉంది. ‘పెట్రస్‌ 2000’. 

హుజూరాబాద్ లో కేసీఆర్ స్కెచ్! ఈటలకు అగ్ని పరీక్షే? 

భూకబ్జా ఆరోపణలతో సీనియర్ నేత ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తప్పించారు సీఎం కేసీఆర్. ఈటలను పదవి నుంచి అవమానకరంగా తొలగించారనే ఆరోపణలు వస్తున్నాయి. తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలు, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంపై సీరియస్ గానే స్పందించారు ఈటల రాజేందర్. పక్కా ప్లాన్ ప్రకారమే తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసులు, అరెస్టులకు భయపడేది లేదన్న ఈటల.. టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవి తనకు అవసరం లేదని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజేందర్ రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది.  ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు జరిగే అవకాశం ఉంది. ఆయన సొంతంగానే పోటీ చేస్తారా లేక కొత్త పార్టీ పెట్టి .. ఆ పార్టీ తరపున బరిలో ఉంటారా లేక ఇప్పుడున్న పార్టీల్లోనే ఏదో ఒక దాంట్లో చేరతారా అన్నదానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.  ఈటల రాజీనామాతో జరిగే హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపనుంది. అయితే ఈటలను తొలగించాలని ముందే డిసైడ్ అయిన కేసీఆర్... తర్వాత జరగబోయే పరిణామాలపైనే క్లారిటీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈటల ఏం చేస్తారు.. ఎలా చేస్తారన్న దానిపై గులాబీ బాస్ అంచనాతో పక్కా వ్యూహాలు సిద్ధం చేశారని అంటున్నారు. ఈటల రాజీనామాతో జరగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికపైనా కేసీఆర్ అప్పుడే ఫోకస్ చేశారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఈటలపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారని సమాచారం.  హుజురాబాద్ నియోజకవర్గంలో చాలా యాక్టివ్ గా ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి. ఈటల రాజేందర్ అవినీతికి పాల్పడ్డారని కూడా ఆయన పోరాటం చేస్తున్నారు. ఈటల ఆస్తులకు సంబంధించిన సమాచారమంతా కౌశిక్ రెడ్డి దగ్గర ఉందంటున్నారు. గత ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి గెలుస్తారనే ప్రచారం కూడా జరిగింది. అందుకే ఈటలకు బలమైన ప్రత్యర్థిగా కౌశిక్ రెడ్డి ఉంటారని భావిస్తున్న కేసీఆర్.. అతన్ని పార్టీలోకి తీసుకురావాలని  స్థానిక నేతలను ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు జిల్లాకు చెందిన ఒక మంత్రి కౌశిక్ రెడ్డి తో మంతనాలు జరిపినట్లు సమాచారం.  నియోజక వర్గంలో ఈటెలను డీ కొట్టాలంటే కౌశిక్ రెడ్డి తప్ప మరో మార్గం లేదని కెసిఆర్ కు సదరు మంత్రి తెలిపినట్లు సమాచారం. దీంతో కౌశిక్ రెడ్డి ని పార్టీ లోకి చేర్చుకునేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఈటెల తేరుకుని పార్టీ కి నష్టం చేసే లోపే ఇంఛార్జి ని నియమించి క్యాడర్ ను కాపాడుకోవాలని భావిస్తూ పావులు కదుపుతున్నారు.నియోజకవర్గంలో  ఈటెలకు సన్నిహితంగా ఉన్న నేతలతోనూ టీఆర్ఎస్ పెద్దలు మాట్లాడుతున్నారని అంటున్నారు.  బీసీ నేతలు రాజేందర్ తో వెళ్లకుండా చూసేందుకు బీసీ సంఘం నాయకుడు వకుళాభరణం కృష్ణ మోహనరావు ను రంగం లోకి దించారని చెబుతున్నారు. కేసీఆర్ డైరెక్షన్ లోనే  ఈటెల కు వ్యతిరేకంగా టీవీ డిబేట్లలో వకుళాభరం మాట్లాడుతున్నారని అంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ అధిష్టానం ఈటల విషయంలో తీసు కుంటున్న చర్యలను జాగ్రత్తగా పరిశీలిస్తున్న ఇతర పార్టీల నేతలు ఆయనతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది . కాంగ్రెస్ నుండి బట్టి, రేవంత్ రెడ్డి, దాసోజు శ్రవణ్ కుమార్, బీజేపీ నుండి ఎంపీ అరవింద్, ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు ఈటల సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి . తాను తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి తన తో కలిసి వచ్చేవారెవరు ? టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని పక్కకు తప్పుకునే వారెవరు ? అనే అంశంపై ఈటల సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు తెలిసింది. కెసిఆర్ వ్యూ హం ఫలించి కౌశిక్ తెరాస తీర్థం పుచ్చుకుంటే నియోజక వర్గ రాజకీయాలు రసవత్తరం అవుతాయని భావిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం తమ నాయకుడు కౌశిక్ పార్టీ వీడడని చెబుతున్నారు

భారీగా క‌రోనా.. ఆర్బీఐ ఆందోళ‌న‌..

రెండు రోజులుగా నిల‌క‌డ‌గా ఉన్న క‌రోనా కేసులు మ‌ళ్లీ విజృంభిస్తున్నాయి. వారం రోజులుగా మూడున్న‌ర ల‌క్ష‌ల పైనే పాజిటివ్ కేసులు న‌మోద‌వుతుండ‌టం కల‌వ‌రం సృష్టిస్తోంది. తాజాగా, మ‌రో 3,82,315 మందికి క‌రోనా సోక‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ‌రోవైపు గ‌డిచిన 24 గంట‌ల్లో 3,780 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు.   దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటేసింది. మొత్తం 2,06,65,148 కేసులు,  2,26,188 మ‌ర‌ణాల‌తో దేశంలో మ‌ర‌ణ మృదంగం మోగుతోంది.  కేసుల సంఖ్య పెరుగుతున్నా.. రికవరీలు కూడా అదే స్థాయిలో ఉండటమే కాస్త‌ ఊరటనిచ్చే అంశం. మంగ‌ళ‌వారం ఒక్క రోజే 3,38,439 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కొవిడ్‌ను జయించిన వారి సంఖ్య  1,69,51,731కి చేరింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు సంఖ్య 34,87,229కి పెరిగింది.  ఇక‌, తెలంగాణలోనూ కరోనా వేగంగా వ్యాపిస్తోంది. మంగ‌ళ‌వారం 77,435 మందికి కరోనా పరీక్షలు చేయ‌గా.. అందులో 6,361 మందికి పాజిటివ్ వ‌చ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,225 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణ‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,69,722కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 77,704 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి మంగ‌ళ‌వారం 8,126 మంది కోలుకున్నారు.    కరోనా సంక్షోభం దేశాన్ని అతలాకుతలం చేస్తోందని ఆర్బీఐ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా వ్యాపారం చేయాలో అందరూ నేర్చుకున్నారని.. కంటైన్‌మెంట్ ప్రాంతాలు, భౌతిక దూరం పాటిస్తూ వ్యాపారాలు చేయడం అలవాటు చేసుకున్నారని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. సూక్ష్మ, మధ్యతరగతి సంస్థలపై రెండో దశ కరోనా ప్రభావాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.   

కరోనా పై యముడి కన్నీరు.. 

యముడు ఆ పేరు వింటే చాలు. తప్పు చేసినోడి గుండెల్లో గుబులు పుడుతుంది. తప్పు చేస్తే ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ, యముడి నుండి ఎప్పటి తప్పించుకోలేరు అని, ఎప్పటికైనా యముడి ద్వారా భారీ మూల్యం చెల్లించాల్సిందే అని అంటుంటారు దైవత్వం ఉన్నారు. యముడు  అదేపనిగా ఎప్పటికప్పుడు తప్పు చేసిన వాళ్ళ చిట్టా పద్దులు తెలుస్తుంటాడని  అంటుంటారు.  కానీ కరోనా వాళ్ళ ఇప్పుడు యముడికి ఆ అవసరం లేకుండా పోయింది. పని కట్టుకుని తప్పుచేసినోడి తాట తీసేపని ఆయనకు లేకుండా పోయింది.    భారత దేశం లో సంచారం చేస్తున్నాడు. కరోనా రావడం తో ఆయనకు పని తప్పింది. పని కట్టుకుని ప్రాణాలు తీసే పని యముడికి లేకుండా పోయింది. తప్పు చేసిన వారికీ భూమి మీద నూకలు చెల్లితే యమా ధర్మ రాజు ఎకాఎకిన వచ్చి తన పాశం సంధించి గదా వచ్చి కోడి పిల్లలను ఎత్తుకుపోయినట్లు ఎత్తుకుపోయే యముడు కూడా భారత దేశం పరిస్థితి చూసి యముడు కూడా కన్నీటి పర్వం చెందుతున్నాడు. దేశంలో కొనసాగుతున్న కరోనా మరణాలపై, కరోనా వైరస్ పై అవగాహనా కాలిస్తున్నాడు.. ఆ యముడు.. యముడు ఏంటి? కరోనా మీద కన్నీరు పెట్టడం ఏంటి? కరోనా పై అవగాహనా కల్పించడం ఏంటని అనుకుంటున్నారా..? మీరే చూడండి తెలుస్తుంది.   కరోనా తీవ్రత దృష్ట్యా ప్రజలంతా మాస్కు ధరించాలంటూ హిందూపురం పోలీసులు వినూత్న అవగాహన కల్పించారు. యోగి నారాయణ సేవాసమితి సహకారంతో యముడు, యమ భటుల వేషధారణతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాస్కు ధరించకపోతే ఎదురయ్యే అనర్థాలను వివరించారు. భౌతిక దూరం పాటించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. లేదంటే కరోనా మహమ్మారి బారిన పడతారని హెచ్చరించేలా ఈ కార్యక్రమం సాగింది. ‘నేను యముడిని. మాస్కు పెట్టుకోకుంటే వస్తా.. మీరు ఇంట్లో ఉంటే నేను బయట ఉంటా. బయటకు వస్తే మీ వెంటే ఉంటా..’ అంటూ  యముడి వేషధారణలో ఉన్న వ్యక్తి హెచ్చరించారు. ప్రజలందరూ సహకరించి మాస్కు తప్పనిసరిగా ధరించాలని, రేపటి నుంచి కర్ఫ్యూ అమలు కానుండటంతో అనవసరంగా బయట తిరిగితే కేసులు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.  

ఏపీలో మద్య దర్శనం.. తెల్లవారుజామునే ఛీర్స్

దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్పెషల్. రివర్స్ పాలన సాగుతుందనే విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి సర్కార్ మరో నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా నిలిచింది. ఏపీ ప్రజలకు మద్య దర్శనం కల్పించింది. ప్రజలు నిద్ర లేవకముందే రాష్ట్రంలో మద్యం షాపులు తెరుచుకున్నాయి. టీ తాగే సమయానికి ముందే మందు అందుబాటులోకి వచ్చింది. . గతంలో ఎన్నడూ చూడని విధంగా మొట్టమొదటిసారి ఉదయం 6గంటలకే లిక్కర్ షాపులు తెరుచుకున్నాయి. కరోనా పంజా విసురుతుండటంతో బుధవారం మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ అమలు చేయనుంది ఏపీ సర్కార్. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వాణిజ్య కార్యకాలాపాలు కొనసాగించాలని ఆదేశించింది. అందులో భాగంగానే సర్కార్ కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం షాపులను ఉదయమే తెరవాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాల సమయాల్లో మార్పులు చేసింది. ఉదయం 6 గంటల నుంచే మద్యం షాపులు తెరవాలని ఆదేశించింది. దీంతో బుధవారం తెల్లవారుజామునే ఏపీలో మద్యం దుకాణాలన్ని తెరుచుకున్నాయి. మందు బాబులు లిక్కర్ కోసం క్యూలు కట్టారు. మద్యం షాపులతో పాటు మద్యం సరఫరా చేసే డిపోలు కూడా ఇవే నిబంధనలు పాటిస్తున్నాయి.  గతేడాది కరోనా తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో 43 రోజుల పాటు మద్యం అమ్మకాలను పూర్తిగా ఆపేశారు. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రభుత్వం అమ్మకాలకే మొగ్గు చూపింది. ఇదంతా ఆదాయం కోసమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ఫ్యూ అమలుచేస్తే ఒకచోట నలుగురు కంటే గుమికూడకూడదు. అలాంటప్పుడు బార్లకు అనుమతి ఎలా ఇస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంకోవైపు ఎప్పటిలాగే మద్యం షాపుల వద్ద క్యూలు కనిపిస్తున్నాయి. అలా క్యూలు ఉంటే కరోనా వ్యాప్తి పెరిగిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మాత్రం ప్రజల ప్రాణాల కంటే ఆదాయమే లక్ష్యంగా మద్యం అమ్మకాలను కొనసాగిస్తోంది.

న్యాయమా రెడ్డీ? రాజ‌కీయం 'క‌మ్మ‌'గుంది!

జ‌గ‌న్‌ది రెడ్డి సైన్యం. చంద్ర‌బాబుకు క‌మ్మ ధైర్యం. ఇలా ఏపీలో రెండు బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాలు.. ఇద్ద‌రు నాయ‌కుల‌ను వెన‌కుండి న‌డిపిస్తున్నాయి. ఈ రెండు వ‌ర్గాల్లో ఎవరిది అప్ప‌ర్ హ్యాండ్ అయితే.. వారిదే అధికారం. ఏళ్లుగా ఇదే జ‌రుగుతోంది. తిరుప‌తి ఎంపీ ఉప ఎన్నిక త‌ర్వాత ఏపీలో టీడీపీ మ‌ళ్లీ బ‌లం పుంజుకుంటోంద‌నే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఓడినా టీడీపీ బ‌లంగా ప్ర‌తిఘ‌టించింది. తెలుగు త‌మ్ముళ్లు క‌సితో ప‌ని చేశారు. క‌లిసిక‌ట్టుగా పోరాడారు. ప్ర‌తిప‌క్ష పార్టీని 3 ల‌క్ష‌ల మెజారిటీలోపే నిలువరించారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గం ఏపీలో రెట్టించిన ఉత్సాహంతో ఉంటే.. జ‌గ‌న్‌రెడ్డి వ‌ర్గం మాత్రం తీవ్ర నిరుత్సాహం, నిర్లిప్త‌త‌తో ఉంది. ఈ తీరే.. భ‌విష్య‌త్తులో అధికారాన్ని మ‌ళ్లీ తారుమారు చేసే అవ‌కాశం ఉందంటున్నారు సామాజిక రాజ‌కీయ‌ విశ్లేష‌కులు. ముందు రెడ్ల విష‌యానికి వ‌ద్దాం. రాయ‌ల‌సీమ వ్యాప్తంగా రెడ్డి వర్గానిదే ఆధిప‌త్యం. మిగ‌తా జిల్లాల్లోనూ చెప్పుకోద‌గ్గ ప్ర‌భావం. వీళ్లే జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి అండా-దండా. అంగ బ‌లం, అర్థ బ‌లంతో జ‌గ‌న్‌రెడ్డిని ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్ట‌డంలో కీల‌క పాత్ర పోషించారు. 2019 ఎన్నిక‌ల నాటికి ఐదేళ్లుగా అధికారానికి దూర‌మై.. ఆవురావుర‌మంటూ ఉన్న ఆ సామాజిక వ‌ర్గం.. ఆనాటి ఎల‌క్ష‌న్ల‌లో జ‌గ‌న్‌రెడ్డి గెలుపు కోసం శాయ‌శ‌క్తులా కృషి చేశారు. మ‌ళ్లీ ప‌వ‌ర్‌లోకి రావాల‌నే ధృడ సంక‌ల్పంతో గ‌ట్టిగా ప్ర‌య‌త్నించారు. త‌మ ఆర్థిక వ‌న‌రుల‌న్నీ పోగేసి.. ఎన్నిక‌ల్లో భారీగా ఫండింగ్ చేసి.. స్వ‌చ్ఛందంగా ప‌ని చేసి.. జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించుకున్నారు. త‌మ వాడు మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోవ‌డం చూసి తెగ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక‌, ఎన్నిక‌ల్లో పెట్టిన ఖ‌ర్చుకు ప‌దింత‌లు తిరిగి రాబ‌ట్టుకోవ‌చ్చు అనుకున్నారు. కానీ, ఆదిలోనే వారి ఆశ‌లు అడియాశ‌లు అయ్యాయి. అక్క‌డున్న‌ది జ‌గ‌న్‌రెడ్డి క‌దా. వీళ్ల దోపిడీ సాగ‌లేదు. దొరికిన‌దంతా తిమింగ‌ళంలా ఆయ‌నే దోచుకుంటున్నారంటూ.. పిల్ల చేప‌లు ఆహారం లేక అల‌మ‌టిస్తున్నాయి. మ‌నోడే అనుకుంటే న‌ట్టేట ముంచేస్తున్నాడుగా అంటూ తెగ వ‌ర్రీ అవుతున్నాయి.  ఏపీలో లిక్క‌ర్, ఇసుక రీచ్‌లు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం ప్ర‌ధానంగా రెడ్ల చేతిలో ఉంటాయి. ఆ మూడింటిలో ఇప్పుడు రెడ్ల‌కు అవ‌కాశం లేకుండా చేశాడు జ‌గ‌న్‌రెడ్డి. కాసులు పిండుకునే ఛాన్స్ ఉండే.. మ‌ద్యం వ్యాపారాన్ని ప్రభుత్వప‌రం చేసి లిక్క‌ర్ డాన్‌ల గ‌ల్లాపెట్టె ప‌గ‌ల‌గొట్టాడు. చంద్ర‌బాబు హ‌యాంలోనూ వైన్లు, బార్ల‌తో బాగా సంపాదించుకున్న ఆ వ‌ర్గ‌మంతా.. ఇప్పుడు నోరు మూసుకొని చూస్తూ ఉండాల్సిన దుస్థితి. భారీగా ముడుపులు స్వీక‌రించి.. ఊరూపేరు లేని బ్రాండ్ల‌ను తీసుకొచ్చి, అడ్డ‌గోలుగా ధ‌ర‌లు పెంచి.. లిక్క‌ర్ ఆదాయాన్నంతా జ‌గ‌న్‌రెడ్డి ఒక్క‌డే గంప గుత్త‌గా దోచేసుకుంటున్నాడ‌నే ఆగ్ర‌హం ఆ వ‌ర్గంలో వెల్లువెత్తుతోంది. అధికారంలో ఉన్న జ‌గ‌న్‌ను ఏమీ చేయ‌లేక ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు ఒక‌ప్ప‌టి మ‌ద్యం వ్యాపారులంతా.  అటు, రెడ్డి వ‌ర్గాల‌కు ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా ఉన్న ఇసుక త‌వ్వ‌కాల‌నూ ఏక మొత్తంగా ర‌ద్దు చేసేశారు జ‌గ‌న్‌రెడ్డి. కొత్త ఇసుక పాల‌సీ అంటూ.. రాష్ట్రంలోని శాండ్ మైనింగ్ కాంట్రాక్ట్‌ మొత్తాన్ని వేలం వేసి అంగ‌ట్లో అమ్ముకున్నారు. త‌న‌కు అత్యంత స‌న్నిహితమైన రాంకీ గ్రూపున‌కే ఏపీలోని ఇసుకంతా దార‌ద‌త్తం చేశారు. ప‌రోక్షంగా జ‌గ‌న్ ఒక్క‌డే ఇసుక నుంచి కాసుల తైలంబు పిండుకుంటున్నాడనే విమర్శలు వస్తున్నాయి.  ఇక‌ ఏపీలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది. గ‌డిచిన రెండేళ్ల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రియ‌ల్ రంగం అధఃపాతాలానికి ప‌డిపోయింది. అమ‌రావ‌తిని మూడు ముక్క‌లు చేయ‌డంతో భూముల ధ‌ర‌లు కుప్ప‌కూలిపోయాయి. క‌నీసం ఎగ్జిక్యూటివ్ కేపిట‌ల్‌గా ప్ర‌క‌టించిన విశాఖ‌లోనైనా రియ‌ల్ వ్యాపారం చేసుకుందామన్నా అదీ కుద‌ర‌డం లేదు. విశాఖ‌లో భూమంతా వైసీపీ నేత‌ల పర‌మైందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ ఆగ‌డాల‌తో భూమిపై పెట్టుబ‌డి పెట్టేందుకు వ్యాపారులు భ‌య‌ప‌డుతున్నారని అంటున్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో ప్ర‌తీ జిల్లాలో ఏదో ఒక ప్రాజెక్టు గానీ, సెజ్ గానీ ఉండేది. దీంతో, ఏపీ వ్యాప్తంగా రియ‌ల్ ఎస్టేట్ జోరుగా సాగింది. ఆ రంగంలో ముందున్న రెడ్లు అప్ప‌ట్లో బాగా లాభ‌ప‌డ్డారు. ఇప్పుడు జ‌గ‌న్ రాక‌తో.. అంతా త‌ల‌కిందులైంది. రియ‌ల్ రంగం కుదేలైంది. ఇటీవ‌ల తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అన్న వ్యాఖ్య‌లే అందుకు నిద‌ర్శ‌నం. తెలంగాణ‌లో రెండు ఎక‌రాల భూమి అమ్మితే.. ఏపీలో 3 ఎక‌రాలు కొనుక్కోవ‌చ్చంటూ కేసీఆర్ చేసిన కామెంట్లు ప్ర‌స్తుత ప‌రిస్థితికి స‌రిగ్గా స‌రిపోతున్నాయి.  అన్ని రంగాల్లోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ తిరోగ‌మ‌నంలో ఉండ‌టంతో.. అన్ని ర‌కాల వ్యాపారాలు చేసే రెడ్డి సామాజిక వ‌ర్గం ఆర్థికంగా బాగా చితికిపోయింది. మ‌నోడ‌ని గెలిపిస్తే.. మ‌న‌ల్నే ముంచేస్తున్నాడ‌ని ఆ వ‌ర్గ‌మంతా అక్క‌స్సుతో ఉందని చెబుతున్నారు.  గ‌తంలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు క‌మ్మ వ‌ర్గానికి వ్యాపారాల్లో ప్రాధాన్యత ల‌భించిందనే టాక్ ఉంది.  ఆ స‌మ‌యంలో ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు నేతలు బాగా సంపాదించుకున్నార‌ని చెబుతారు. దీంతో.. సంపాదించింది చాల్లే అన్న సంతృప్తి.. మ‌న‌మే ఎలాగూ గెలుస్తామ‌నే ఉదాసీన‌త‌.. రెండూ క‌లిసి 2019 ఎన్నిక‌ల నాటికి చంద్ర‌బాబు వ‌ర్గంలో నిర్లిప్త‌త ఆవ‌హించింది. అందుకే, ఆ ఎల‌క్ష‌న్ల‌లో ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించారు. అదే స‌మ‌యంలో ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న రెడ్లు క‌సితో క‌ష్ట‌ప‌డ్డారు. ఫ‌లితం.. 2019లో అధికారం క‌మ్మ‌ నుంచి రెడ్డి చేతికి చిక్కింది.  రెండేళ్లైనా గ‌డిచిందో లేదో.. మ‌ళ్లీ మార్పు మొద‌లైంద‌ని అంటున్నారు. జ‌గ‌న్‌రెడ్డిని అంద‌ల‌మెక్కించినా ద‌మ్మిడి ఆదాయం లేక‌, పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేక‌.. ఆయ‌న సామాజిక వ‌ర్గ‌మంతా ఆగ్ర‌హంతో ఉందంటున్నారు. అదే స‌మ‌యంలో.. అధికారం లేక‌పోతే త‌మ ప‌రిస్థితి ఎంత అధ్వాహ్నంగా ఉంటుందో క‌మ్మ వ్యాపారుల‌కు, తెలుగు త‌మ్ముళ్ల‌కూ బాగా తెలిసొచ్చింది. అందుకే, టీడీపీ శ్రేణులంతా మ‌ళ్లీ ఏక‌మై చంద్ర‌బాబు గెలుపు కోసం ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. తొలి ప్ర‌భావం, ఫ‌లితం తిరుప‌తి ఉప ఎన్నిక‌లో క‌నిపించింది. ప్ర‌చారంలో టీడీపీ వ‌ర్గాలు చ‌మ‌టోడ్చాయి. త‌మ పార్టీ అభ్య‌ర్థిని ఎలాగైనా గెలిపించుకోవాల‌నే తాప‌త్ర‌యం, ప‌ట్టుద‌ల వారిని క‌ష్ట‌ప‌డేలా చేసింది. అందుకే,, తిరుప‌తిలో చంద్రబాబు, నారా లోకేశ్ ర్యాలీలు, స‌భ‌లో జ‌నంతో కిక్కిరిసిపోయాయి. బైపోల్‌లో టీడీపీకి జేజేలు హోరెత్తాయి. వైసీపీ మెజార్టీకి భారీగా కోత ప‌డింది. ఇదే ప‌ట్టుద‌ల‌తో, ఇదే క‌సితో.. ముందుముందు మ‌రింత గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం మ‌ళ్లీ టీడీపీనే వ‌రించ‌డం ఖాయం. మ‌ళ్లీ చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అవ‌డం త‌థ్యం. ఎనీ డౌట్స్‌?

అయోధ్య,వారణాసిలో బీజేపీ ఓటమి! యూపీలో యోగీకి షాక్ 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం ఎదురైంది. ఇటీవలే కర్ణాటకలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీగా ఉండికూడా చతికిలపడింది. తాజాగా ఏడాదిలో  అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీ  సత్తా చాటుకుంది. పార్టీ గుర్తులు లేకుండా జరిగిన జిల్లా, క్షేత్ర(మండల), గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీజేపీకి ఎస్పీ, ఇతర ప్రతిపక్షాలు దీటుగా నిలిచాయి.  ప్రధాని నరేంద్ర మోడీప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసితోపాటు బీజేపీ రాజకీయ ఎదుగుదలకు కేంద్రమైన అయోధ్యలోనూ ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. వారణాసిలోని 40 జిల్లా పంచాయతీ సీట్లకుగానూ ఎస్పీ 15 సీట్లను కైవసం చేసుకోగా, బీజేపీ కేవలం 8 సీట్లకే పరిమితమైంది. ఆధ్యాత్మిక కేంద్రమైన అయోధ్యలో 40 జిల్లా పంచాయతీ సీట్లకు గాను 24 సీట్లు సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకోగా, బీజేపీ కేవలం 6 సీట్లకు పరిమితమైంది. మిగిలిన 10 సీట్లలో మాయావతి సారథ్యంలోని బీఎస్‌పీ 5, ఇండిపెండెంట్లు 5 గెలుచుకున్నారు. మధురలోని మొత్తం 33 సీట్లలో ఎనిమిది మాత్రమే బీజేపీ గెలుచుకుంది. బీఎస్పీ 13 స్థానాల్లో విజయం సాధించగా, సమాజ్ వాదీ, రాష్ట్రీయ లోక్ దళ్ చెరో స్థానాన్ని గెలుచుకున్నాయి. యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గమైన గోరక్ పూర్ లో (మొత్తం స్థానాలు 68) బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ చెరో 22 గెలుచుకోగా, 23 మంది స్వతంత్రులు గెలవడం గమనార్హం. ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ నిషాద్ పార్టీలు తలా ఒక సీటును గెలుచుకున్నాయి.  మొత్తం 3,050 జిల్లా పంచాయితీ సీట్లలో బీజేపీ బలపరచిన అభ్యర్థులు 918 చోట్ల లీడింగ్‌లో ఉండగా, ఎస్‌పీ బలపర్చిన అభ్యర్థులు 504 సీట్లలో అధిక్యంలో ఉంన్నారు. బీఎస్పీ బలపర్చిన అభ్యర్థుల్లో 132 మంది, కాంగ్రెస్ నుంచి 62 మంది, ఇండిపెండెట్లు 608 మంది లీడింగ్ లో ఉన్నారు. యూపీలో మొత్తం 58,176 గ్రామ పంచాయితీల్లో 7.32 లక్షల వార్డులకు, 3,050 క్షేత్ర(మండల) పంచాయితీల్లోని 75,852 వార్డులకు, 75 జిల్లాల్లోని 3,050 జిల్లా పంచాయితీ స్థానాలకు ఏప్రిల్ చివరి వారంలో ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్‌పై గొడవ జరిగడంతో వ్యవహారం సుప్రీం దాకా వెళ్ళింది. మొత్తానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో  కౌంటింగ్‌ మొదలైంది. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరగడంతో కౌంటింగ్ ప్రక్రియ నిదానంగా సాగుతోంది.  ఎమ్మెల్యేల స్థానాలను తలిపించే జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కూడా బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాజకీయపరంగా వారణాసి, అయోధ్యలను కీలకంగా భావించే బీజేపీ అక్కడి స్థానిక ఎన్నికల్లో ఓడిపోవడం హెచ్చరిక లాంటిదేనని పార్టీనేతలు అంగీకరించారు. యూపీ పంచాయితీ ఎన్నికల తుది ఫలితాలకు ఇంకా సమయం పడుతుంది.

కరోనాను జయించిన కేసీఆర్.. నేటి  నుండి విధుల్లోకి .. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి ఆన్ డ్యూటీ చేయనున్నారు. దాదాపు రెండు వారాలకు పైగా కరోనా తో బాధపడిన కేసీఆర్, చివరికి కరోనా ను సైతం జయించాడు. ఐసోలేషన్‌లో ఉన్న కూడా విధులు నిర్వహించిన ఘనత కేసీఆర్ మాత్రమే దక్కింది. అక్రమాలు చేశారని ఆరోపణలు వస్తున్నాయని  ఈటల పై యాక్షన్ తీసుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన రెండు పరీక్షల్లోనూ కరోనా నెగటివ్ రిపోర్టులు వచ్చాయి. ముఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం నిన్న ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో ఆర్టీపీసీఆర్, యాంటిజెన్ పరీక్షలు నిర్వహించింది. ఆ రెండింటిలోనూ కరోనా లేదని నిర్ధారణ అయింది. చివరికి  అలాగే, రక్త పరీక్షల్లోనూ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తేలింది. ముఖ్యమంత్రి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, కాబట్టి ఇక నుంచి విధులకు హాజరు కావొచ్చని వైద్యులు తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల 19న కరోనా బారినపడ్డారు. అప్పటి నుంచి ఆయన ఐసోలేషన్‌లోనే ఉన్నారు. నేడు హైదరాబాద్ రానున్న సీఎం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. కరోనా దెబ్బకు ప్రముఖ దేవాలయాలు మూసివేత..  హైదరాబాద్‌లో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాలను మూసివేయాలని ఆయా ఆలయాల అధికారులు నిర్ణయించారు. ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నేటి నుంచి సాధారణ, ప్రత్యేక దర్శనాలతోపాటు అన్ని సేవలను నిలిపివేస్తున్నట్టు పెద్దమ్మతల్లి ఆలయ అధికారులు తెలిపారు. అయితే, అంతరాలయంలో నిత్య పూజలు మాత్రం జరుగుతాయని స్పష్టం చేశారు. బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయ అధికారులు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నపూర్ణ తెలిపారు. భక్తులు, అర్చక సిబ్బంది క్షేమాన్ని కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఆలయం పక్కనే ఉన్న బోనం కాంప్లెక్స్‌ను కూడా మూసివేస్తున్నట్టు తెలిపారు. అమ్మవారి ఏకాంత సేవలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు.  

గాంధీ  పర్సనల్ సెక్రటరీ మృతి.. 

అతని పేరు. కళ్యాణం. సిమ్లా లో 1922 వ సంవత్సరం లో జన్మించాడు. ఎప్పుడు ఆయనకు సరిగ్గా 99 సంవత్సరాలు. ఆయన ఎవరో కాదు. తెల్లదొరల భారతం పట్టి,  మన దేశానికి స్వతంత్రం తెచ్చిన మన జాతిపిత మహాత్మాగాంధీ చివరి పర్సనల్ సెక్రటరీ. తాజాగా వి.కల్యాణం ఈరోజు తుదిశ్వాస విడిచారు. వయసుకు సంబంధించిన కారణాలతో ఆయన చెన్నైలో మృతి చెందారు. ఆయన మధ్యాహ్నం 3.30 గంటలకు కల్యాణం మృతి చెందినట్టు ఆయన కుమార్తె నళిని వెల్లడించారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు బసంత్ నగర్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 1944 నుంచి 1948 వరకు గాంధీతో ఆయన కలిసి ఉన్నారని బయోగ్రాఫర్ కుమారి ఎస్ నీలకందన్ తెలిపారు. మహారాష్ట్రలోని సేవాగ్రామ్ ఆశ్రమంలో కల్యాణం ఉన్నారని.... గాంధీకి వివిధ భాషల్లో వచ్చే లేఖల వ్యవహారాలను ఆయన చూసేవారని చెప్పారు. నాలుగేళ్ల పాటు గాంధీకి ఆయన సేవలందించారని తెలిపారు. 1948 జనవరి 30న ఢిల్లీలో మహాత్మాగాంధీ హత్యకు గురైనప్పుడు కూడా కల్యాణం అక్కడే ఉన్నారని చెప్పారు.  

భార్య ను బలికొన్న అనుమానం.. 

అనుమానం. ఇది ఒక పెద్ద పెనుభూతం. ఒక్క సారి మనిషిలో అనుమానం అనే సందేహం మొదలైతే, పక్క వాళ్ళ అంతు చూసే వరకు నిద్దరపోదు. ఈ అనుమానం తో క్షణికావేశంలో ఎన్నో ఘోరాలు జరిగాయి.. ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా భర్త అనుమానం భార్య ప్రాణాలు తీసింది. ఎందుకు? ఎక్కడ ? ఎలా ? అని ఆలోచిస్తున్నారా? చదవండి మీకే తెలిసింది.  అది పటాన్‌చెరు. రుద్రారం గ్రామం. అతని పేరు సురేష్. ఆమె పేరు స్వప్న. వాళ్ళిద్దరికి పెళ్లి అయింది. పిల్లలు కూడా ఉన్నారు. కొంత కాలం బాగానే ఉన్నారు. అయితే సురేష్ భార్య  తను ఇంట్లో లేనప్పుడు ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుంది. అలా కొన్నిరోజులు ఆ వ్యవహారం కొనసాగింది. ఈ నేపధ్యం లో సురేష్‌ భార్య స్వప్నపై  అనుమానం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి సురేష్‌ ఇంటికి వచ్చేసరికి భార్య స్వప్న ఫోన్‌లో మాట్లాడుతోంది. దీంతో అనుమానం పెంచుకున్న అతడు భార్యను తీవ్రంగా కొట్టిగాయపరిచాడు. గాయపడిన స్వప్న అపస్మారక స్థితి చేరుకుంది. ఆమెను ఇస్నాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అనంతరం పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ ఉరి..   అది దుండిగల్‌. వంగర మండలం.  గీతనాపల్లి గ్రామం.  అతని పేరు కె.రమణమూర్తి. ఆయన భార్య పేరు శారద. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌ కి వచ్చారు. సూరారంలోని పాండు బస్తీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. గత 7 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు రమణమూర్తి. అతను తరచూ మద్యం తాగుతుండడంతో దంపతుల మధ్య కలహాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఇటీవల తన సోదరుడి ఇంటికి శారద  ఇద్దరు కుమారులను తీసుకొని వెళ్లింది. రమణమూర్తి డ్యూటీ కి వెళ్లకుండా మత్తులో మునిగి తేలుతున్నాడు.  కట్ చేస్తే.. ఈ నెల 1న శారదా కు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లో కానిస్టేబుల్‌ కృష్ణ,  రమణమూర్తి విధులకు హాజరవడం లేదని చెప్పాడు. దీంతో ఆమె తన బంధువులకు ఈ విషయం చెప్పింది. శారదా బంధువులు  అదే రోజు ఇంటికి వెళ్లి చూడగా రమణమూర్తి ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసుల అక్కడికి వెళ్లారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. పోలీసుల కధనం ప్రకారం కుటుంబ కలహాల నేపథ్యంలోనే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    గొంతు కోసుకున్న మరో కానిస్టేబుల్..  ఆర్థిక ఇబ్బందులు.. మానసిక వ్యథతో ఓ కానిస్టేబుల్‌ గొంతు కోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మలక్‌పేట పోలీస్‌ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ముసారాంబాగ్‌ డివిజన్‌ సలీంనగర్‌ పరిధి బాలదానమ్మ బస్తీలో నివసించే అభిలాష్‌ నాయక్‌(33) కానిస్టేబుల్‌. 2011లోనే తన మేనమామ కుమార్తె ఇంద్రజ్యోతితో వివాహమైంది. వీరికి ధీరజ్‌, హేమంత్‌ అనే కుమారులు ఉన్నారు. ఆరేళ్లుగా మాదన్నపేటలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అభిలాష్‌.. భారీగా అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు అధికం కావటంతో మానసిక వేదనకు గురయ్యాడు. రెండు రోజుల క్రితం భార్య, పిల్లలను కోదాడలోని పుట్టింట్లో వదిలి వచ్చాడు. సోమమధ్యాహ్నం భోం చేసి రెండో అంతస్తులోని గదిలో పడుకుంటానని తల్లితో చెప్పి వెళ్లాడు. తర్వాత కిందికి రాలేదు. రాత్రి పదింటికి సోదరుడు ప్రభు వెళ్లి చూడగా గది తలుపు మూసి ఉంది. ఎంతకు సమాధానం రాకపోవడంతో స్థానిక యువకుడు అశోక్‌తో కలిసి తలుపు బద్ధలు కొట్టారు. లోపలికి వెళ్లి చూడగా అభిలాష్‌ రక్తపుమడుగులో మంచం కింద విగతజీవిగా పడి ఉన్నాడు. అప్పటికే మరణించడంతో పోలీసులకు సమాచారం అందించారు. తొలుత బ్లేడుతో ఎడమ చేయి మణికట్టు, తర్వాత గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.