కరోనా.. మరణాలకు వారే కారణం..హై కోర్టు
posted on May 5, 2021 @ 1:30PM
దేశం లో కరోనా మరణాలు చూసి ఆ యముడి హృదయం అయినా కరిగిపోతాడేమో గానీ, మన పాలకులు హృదయాలు మాత్రం కదలడం లేదు. ఈ విషయంలో లో దేశ నాయకులు కసాయి వారైతే. మన తెలుగు రాష్ట్ర నాయకులు ఆ కసాయి వారి బాబులు అని చెప్పాలి. ఆక్సిజన్ లేక, కళ్ళల్లో జీవకల లేక ఏమిచేయలేక కరోనా బాధితులు పిట్టలా రాలిపోతున్నారు. ఈ నేపథ్యం లో మొన్నటికి మొన్న చైన్నై హై కోర్టు కలగా చేసుకుని. కరోనా కేసులు పెరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం పై సంచల కామెంట్స్ చేసింది. తాజాగా అలహాబాద్ హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద సంచలన వ్యాఖ్యానాలు చేసింది.
కరోనా బాధితులకు ఆక్సిజన్ అందక చనిపోతున్నారన్న విషయం నిజంగా మారణహోమం వంటిదేనని, ఆ పాపం పాలకులడే అని.. ఆ మరణాలకు బాధ్యతని పాలకులడే అని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆక్సిజన్ ను సరఫరా చేయలేకపోవడం నేరపూరిత చర్య అని. ప్రజా ఆరోగ్యం మీద పాలకులకు చిత్త శుద్ధి లేకపోవడమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది.
సప్లయ్ చైన్ ను నిర్వహించలేని అధికారులు, నేతలు అసమర్థులేనని తేల్చిచెప్పింది. సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో ఆక్సిజన్ లేకుండా కరోనా బాధితులు మరణిస్తున్నారని వచ్చిన వార్తలు, ప్రచారంపై స్పందించిన జస్టిస్ సిద్ధార్ద్ వర్మ, జస్టిస్ అజిత్ కుమార్ ల ధర్మాసనం, కరోనా పరిస్థితులపై దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించింది.లక్నో, మీరట్ జిల్లాల్లో ప్రాణ వాయువు సరఫరా అందక పలువురు మరణించగా, అన్ని కేసుల్లోనూ విచారణకు ఆదేశిస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. క్వారంటైన్ సెంటర్లలో పరిస్థితిని వెంటనే సమీక్షించాలని, అవసరార్థులకు ఆసుపత్రుల్లో బెడ్లను, ఆక్సిజన్, వెంటిలేటర్లను అందించాలని ఆదేశించింది.
ఆక్సిజన్ అందక రోగులు మరణిస్తున్నారని విని మేము చాలా బాధపడుతున్నాం. ఇది మా మనసును కలచి వేస్తోంది. కరోనా మరణాల పట్ల మేము కలత చెందుతున్నాం అని. ఇది నిజంగా మారణహోమం కన్నా తక్కువేమీ కాదు. కసాయి తనమే అని చెప్పింది. మెడికల్ ఆక్సిజన్ ను నిర్వహించాల్సిన వారు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదు.. ఈ సమయంలో ప్రజలు ముఖ్యంగా మహమ్మారి బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
దేశంలో గుండె మార్పిడి చికిత్సలు, మెదడు ఆపరేషన్లు విజయవంతంగా జరుగుతున్న వేళ, సాధారణ జబ్బుతో రోగులు మరణించడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. సాధారణ పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ విషయంలో కోర్టులు కల్పించుకోబోవని, కానీ వార్తలు చూస్తూ, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలు చూస్తూ, దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ఎలా తోసి పుచ్చగలమని న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లక్నో, మీరట్ కలెక్టర్లు వెంటనే స్పందించి, తమ నివేదికలను 48 గంటల్లోగా కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.