పెద్దారెడ్డి వర్సెస్ జేసీ.. తాడిపత్రిలో హై టెన్షన్ 

అనంతపురం జిల్లా తాడిపత్రి భగ్గుమంటోంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి,  జేసీ ప్రభాకర్‌రెడ్డి పోటాపోటీ రాజకీయాలతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  అక్రమ కట్టడాల కూల్చివేతపై  ఇద్దరు నేతలు పంతాలకు పోతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ కనిపిస్తోంది. సీపీఐ కాలనీలో కూల్చివేతలకు వ్యతిరేకంగా తహశీల్దార్ కార్యాలయం దగ్గర జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నాకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వందలాది మంది పోలీసులను మోహరించారు.  తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే కొన్ని రోజులుగా పట్టణంలో అక్రమ కట్టడాల పేరుతో కూల్చివేతలు జరుగుతున్నాయి. అక్రమ కట్టడాల కూల్చివేత వెనుక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పాత్ర ఉందన్నది జేసీ ప్రభాకర్‌ ఆరోపణ. ఈ ఇష్యూపై ఇద్దరి మధ్య మాటకు మాట కూడా కొనసాగింది. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ ఓడిపోతే.. తాడిపత్రిలో మాత్రం గెలిచింది. జేసీ చైర్మన్ కావడాన్ని ఎమ్మెల్యే పెద్దారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే జేసీని సీటు నుంచి దించేందుకు ఎమ్మెల్యే స్కెచ్ వేశారని చెబుతున్నారు. అందులో భాగంగానే జేసీకి మద్దతుగా ఉన్న సీపీఐ కౌన్సిలర్ ను టార్గెట్ చేశారని అంటున్నారు.  సీపీఐ కౌన్సిలర్‌ను డైరెక్ట్‌గా కాకుండా.. ఇన్‌డైరెక్ట్‌గా బెదరకొట్టాలన్న వ్యూహాంలో భాగంగానే సీపీఐ కాలనీలో కూల్చివేతలకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. సీపీఐ కౌన్సిలర్ ఉన్న  కాలనీలోని మున్సిపల్ స్థలంలో కొందరు అక్రమంగా ఇళ్లు కట్టుకున్నారని..అధికారులు నోటీసులిచ్చారు. ఇళ్ల కూల్చివేతకు మార్కింగ్‌ కూడా ఇచ్చారు. ఈ అక్రమ ఇళ్ల లిస్టులో జేసీకి సపోర్ట్ చేసిన ఓ సీపీఐ కౌన్సిలర్‌ కూడా ఉన్నారటంటున్నారు.ఎమ్మెల్యే ప్లాన్ కు కౌంటర్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తనకు మద్దతు ఇచ్చినందుకే సీపీఐ కౌన్సిలర్ ను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్న జేసీ.. బాధితులకు మద్దతుగా రోడ్డెక్కారు.  కూల్చివేతలపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి పట్టుదలగా ఉండటం.. అడ్డుకుంటానని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శపథం చేస్తుండటంతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత జనవరిలోనూ ఇలాంటి పరిస్థితులే తలెత్తాయి. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏకంగా జేసీ ఇంటికే వెళ్లారు. ఆయన సీట్లు కూర్చుని హంగామా చేశారు.  దీంతో గత జనవరిలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకుంటూ తాడిపత్రి జనాలు ఆందోళనకు గురవుతున్నారు.

పెళ్ళాం పుట్టింటికి వెళ్ళింది.. గురుడు మరో పెళ్ళికి రెడీ అయ్యాడు.. 

దురాశ దుఃఖానికి చేటు అన్నారు. ఏదైనా సరే మన దగ్గర ఉన్న దానితోనే సంతృప్తి పడాలని కూడా మన పెద్దలు ఎప్పుడు చెపుతుంటారు. చాలా మంది, వాళ్ళకు ఉన్నదానితో సంతోషపడక వాళ్ళ దగ్గర లేనిది, వాళ్లకు దొరకని దానికోసం ట్రై చేస్తుంటారు. అలా ట్రై చేసి చివరికి బోల్తా పడుతుంటారు. అప్పుడే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా లాంటి పాటలు వినిపిస్తుంటాయి. తాజాగా  ఒక వ్యక్తి ఇలాగే బోల్తా పడ్డాడు ఇంతకీ ఆ విషయం ఏంటో తెలుసుకుందామా?  అది హైదరాబాద్.  పహాడిషరీఫ్ ప్రాంతం. ఆ ప్రాంతానికి చెందిన మహ్మద్ జావిద్ అనే వ్యక్తికి పెళ్లి అయింది. తన భార్య తనకు వంశోధరకుడిని ఇవ్వడానికి పండంటి బిడ్డకు జన్మ నిచ్చెనందుకు పుట్టింటికి వెళ్లింది. దీంతో ఇదే  అదునుగా భావించి జావిద్ ఏకంగా మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. భార్య పుట్టింటికి వెళ్లగానే సంబంధాలు చూసుకుంటే వేట మొదలెట్టాడు ఈ పెళ్లి రాయుడు. ఈ క్రమంలో కింద మీద పడి  హైదరాబాద్ జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన ఒక యువతితో వివాహం ఖాయం చేసుకున్నాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి మొదటి భార్య చెవిలో పడింది.    కట్ చేస్తే.. జులై 25న కొత్త పెళ్లిచేసుకోటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈసంగతి తెలిసిన మొదటి భార్య కుటుంబీకులు కొత్త పెళ్లి కూతురు కుటుంబానికి జావిద్ సంగతి తెలిపారు.దీంతో జావిద్ అసలు రంగు  బయటపడంది.  ఆ విషయం వినగానే అగ్గిమీద గుగ్గిలంలా కోపంతో రగిలిపోయిన కొత్త పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు. జావిద్‌ను ఇంటికి రమ్మని  మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. పెళ్లి వారు పిలుస్తున్నారనే ఉత్సాహంతో సంకలు గుద్దుకుంటూ కొత్త పెళ్లి కూతురు ఇంటికి వెళ్లాడు జావేద్. ఇంకా అంతే జావిద్‌ను పట్టుకుని పహాడిషరీఫ్ పోలీస్టేషన్‌లో అప్పగించి ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.  

యడ్డీ రాజకీయ జీవితం ముగిసినట్లేనా? 

అనూహ్యం కాకపోయినా, ఆఖరి క్షణం వరకు ఉత్కంఠ భరితంగా సాగిన, కర్నాటక పొలిటికల్ డ్రామా, చివరాఖరికి ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప రాజీనామాతో అలా ముగింపుకు చేరింది. యడియూరప్ప రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ప్రత్యాన్మాయ ఏర్పాట్లు జరిగే వరకు తత్కాలికంగా పదవిలో కొనసాగమని గవర్నర్ కోరారు. అయితే, ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న అదే .. యడ్డీ వ్రాసుడు ఎవరు? వారసుని ఎంపిక, అధికార మార్పిడి  సజావుగా సాగుతుందా? ఇదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. అయితే,పార్టీ అధినాయకత్వం,యడ్డీని పదవినుంచి తప్పించడం మొదలు, వారసుని ఎంపిక వరకు ఎదురయ్యే సమస్యలను ముందుగానే ఊహించి, అన్ని ఏర్పట్లు చేసుకున్న తర్వాతనే యడ్డీ పుట్టలో వేలు పెట్టిందని పార్టీ వర్గాల సమాచారం. అందుకే చివరి క్షణం వరకు వ్యూహత్మకంగా పావులు కలిపి యడ్డీ నోటితోనే రాజీనామా  మాట చెప్పించడం జరిగిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.  అదలా ఉంటే, యడ్డీ వారసుని ఎంపిక విషయంలోకూడా బీజేపీ అధిష్ఠానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. అయితే, ఎవరా వారసుడు, అనేది ప్రస్తుతానికి సస్పెన్సుగానే వుంది. మరో 18 నెలలలో 2023 ఏప్రిల్ - మే నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకు వచ్చే లక్ష్యంతో బీజేపీ యువతకు ప్రాధాన్యత ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.అలాగే, కులాల సమీకరణలు ఇతరత్రా అంశాలను కూడా పార్టీ అధినాయకత్వం అనివార్యంగా పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ నేపధ్యంలో, ప్రధానంగా ఆరేడు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో లిగాయత్ సామాజిక వర్గం నుంచి రాష్ట్ర హోమ్ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు, బసవరాజ్ బొమ్మై,రాష్ట్ర గనుల శాఖ మంత్రి మురుగేశ్ నిరాణి, ఎమ్మెల్యే అరవింద్ బెల్లార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో, బసవరాజ్ బొమ్మైకి ముఖ్యమంత్రి పదవినుంచి తప్పుకుంటున్న యడ్యూరప్ప ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు. అయితే అలాంటిదేమీ లేదని, తాను ఎవరి పేరు ప్రతిపాదించలేదని యడ్డీ పదేపదే చెప్పుకొస్తున్నారు.  అయితే ఒకే వర్గం ఓటు బ్యాంకుపై ఆధారపడకుండా, ఇతర వర్గాలలో కూడా పార్టీ  పునాదులు విస్తించేందుకు, ఈసారి, ఓబీసీ, వక్కళిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన కూడా పార్టీ అధినాయకత్వానికి  ఉన్నట్లుగా కూడా వినవస్తోంది. అదే జరిగితే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి, రాష్ట్ర చీఫ్ విప్ సునీల్ కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఎవరూ కాకుండా, ఎవరి ఊహకు అందని ఆగంతకుడు ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్య పోనవసరం లేదని, పార్టీ వర్గాల సమాచారం.   యడ్డీ వాట్ నెక్స్ట్ అనేది  కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగ ఉంది. ముందుగా, యడ్డీని ఏపీ లేదా మరో రాష్ట్రానికి గవర్నర్’గా పంపుతారని వార్తలు వచ్చినా, అందుకు ఆయన సుముఖంగా లేరు. ఈ రోజు  (సోమవారం) విలేకరుల సమవేశంలో ఇదే ప్రశ్న వచ్చినప్పుడు అయన, అలాంటి పదవులపై తనకు ఆసక్తి లేదని కుండబద్దలు కొట్టారు. మరో 15 ఏళ్ళు క్రియాశీల రాజకీయాల్లో ఉంటానని పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో కాషాయ దళానికి బాటలు వేసిన 78 ఏళ్ల యడ్యూరప్ప, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా, ఒక్కసారి కూడా ఐదేళ్ళు అధికారంలో కొనసాగలేదు. యడ్డీ తొలిసారి, 2007 నవంబర్’ లో కేవలం ఏడు రోజులు మాత్రమే పదివిలో కొనసాగారు. ఆ తర్వాత 2008 మే నెలలో రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్డీ, మూడు సంవత్సరాల రెండు నెలలు,మూడవసారి 2018 మే లో కేవలం మూడు రోజులు, చివరకు 2019జులై 26 నుంచి, 2021 జూలై 26 వరకు రెండేళ్ళు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. అందులో చివరి రెండేళ్ళలో రెండు వరదలు, సంవత్సరంన్నర కరోనా కష్టాలతోనే కాలం కరిగి పోయింది.  అదలా ఉంటే,75 సంవత్సరాల వయసు నిండిన ఎవరైనా ప్రభుత్వ పదవుల నుంచి తప్పుకోవాలన్న పార్టీ  నియమావళి ప్రకారం, ఆయన మరోమారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేక పోయినా, యడ్యూరప్ప రాజకీయ జీవితం ముగిసినట్లే అనుకోలేము. ఎందుకంటే ఆయన యడ్యూరప్ప కాబట్టి ..అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సీబీ‘ఐ‘ కన్ను కొడుతుందా? జగన్ టీమ్ లో కలవరమేనా? 

భీకరంగా యుద్ధం జరుగుతుంటే.. ఉన్న సేనాధిపతిని వెనక్కు రమ్మని..ఆ ప్లేసులో మరో కొత్తవారిని పంపిస్తే ఆ యుద్ధం పరిస్దితి ఎలా ఉంటుంది? బ్యాంకు రాబరీ జరిగి.. దొంగలు సొమ్ముతో పరార్ అవుతుంటే.. పట్టుకోవాల్సిన పోలీస్ ఆఫీసర్ తనకు జ్వరం వచ్చిందని సెలవు పెడితే ఎలా ఉంటుంది? వివేకా హత్య కేసులో సీబీఐ ఆఫీసర్ ని కీలక సమయంలో బదిలీ చేస్తే...అలాగే ఉంటుంది. జగన్ బెయిల్ రద్దు చేయమని రఘురామ పిటిషన్ పై సీబీఐ కోర్టు డెడ్ లైన్ పెట్టినా గడువు అడిగి మరీ 26న అఫిడవిట్ ఫైల్ చేస్తామని చెప్పి.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి జ్వరం వచ్చిందని మళ్లీ వాయిదా వేయమని అడిగితే అలాగే ఉంటుంది.సీబీఐలోని ’ఐ‘ కి తేడా వచ్చినట్లుంది. ఆ కన్ను మూసుకుపోయిందా లేక కండ్లకలక వచ్చిందా..లేక కన్నుకొడుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి.  11 ఛార్జిషీట్లు ఒక ఎత్తయితే... ఇప్పుడు సీబీఐ విచారణ చేస్తున్న వివేకా హత్య కేసు, జగన్ బెయిల్ రద్దు చేయమని రఘురామ వేసిన పిటిషన్ ఈ రెండూ మరో ఎత్తయ్యాయి. ఎందుకంటే వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని.. అక్కర్లేదని..ఆపాలని తెగ ప్రయత్నించినా..చెల్లి సునీత పట్టుదలతో సీబీఐ విచారణ తప్పలేదు. మరి అందులో ఏ నిజాలు బయటపడతాయని అంతగా భయపడ్డారో తెలియదు గాని.. ఇప్పుడు మరింత భయపడుతున్నారని అందరూ అనుకున్నారు. క్లైమాక్స్ కొచ్చిందిలే అనుకుంటున్న సమయంలో జరుగుతున్న ట్విస్టులు.. అనుమానాలు పెంచేస్తున్నాయి.. అసలు వారిని తప్పించి కొసరువారిని ఇరికించి.. పెద్దలకు రిలాక్సేషన్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందా అనే డౌట్ వచ్చేస్తోంది. సీబీఐ తరపున ఈ విచారణ చూస్తున్న అధికారి సుధాసింగ్ ని బదిలీ చేసేశారు. ఎంతలా అంటే ఆమెకు కనీసం తెలియను కూడా తెలియదు. మేడమ్ వాచ్ మెన్ రంగయ్య సాక్ష్యం నమోదు చేయించే పనిలో బిజీగా ఉండగా.. పై నుంచి ఈ ఉత్తర్వులు వదిలారు. అంటే ఆ అధికారి పైవాళ్లు చెప్పిన మాట వినలేదా.. లేక ఇక్కడ నుంచి విన్నపాలు అందుకుని.. అసలు వ్యక్తులను బయటపడేయాలనుకుంటుందా అనే కామెంట్లు వినపడుతున్నాయి. మరి కొత్త ఆఫీసర్ రామ్ కుమార్ ఏం చేస్తారో చూడాలి. ఇక రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణ చివరికి వచ్చేసింది.అసలు 26వ తేదీ అటో ఇటో తేలిపోతుందనుకున్నారు. ముందు మీ ఇష్టం మీరే నిర్ణయం తీసుకోండని ధర్మాసనానికి చెప్పిన సీబీఐ మళ్లీ మనసు మార్చుకుని రాతపూర్వకంగా అపిడవిట్ ఫైల్ చేస్తామని చెప్పింది.  చెప్పి గడువు అడిగింది. తీరా ఆ గడువు అయిపోయాక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి జ్వరమొచ్చింది కాబట్టి మళ్లీ టైమ్ అడిగితే 30వ తేదీకి వాయిదా వేశారు. ఇక్కడ కూడా సీబీఐ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది. వారు జగన్ బెయిల్ రద్దు చేయొద్దని రాసివ్వలేరు.. రఘురామ లేవనెత్తిన పాయింట్లు కరెక్ట్ కాదని కూడా చెప్పలేదు.. అలా అని బెయిల్ రద్దు చేయమని కూడా రాసివ్వలేకపోతుందా? అందుకే వాయిదాలు కోరుతుందా? లేక పై స్థాయిలో నెగోషియేషన్స్ నడుస్తున్నాయా? అవి తేలేవరకు సీబీఐ నివేదిక ఇవ్వదా అనే కామెంట్లు వినపడుతున్నాయి. ఏమైనా సీబీఐ అనేది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఎవరుంటే వారి మాటలు వినే తొత్తు సంస్థగా మారిపోయిందని..స్వతంత్రత కోల్పోయిందనే విమర్శలు పెరుగుతున్నాయి.

ఇప్ప‌టికీ అమ‌రావ‌తినే టాప్‌.. దేశంలో చెక్కుచెద‌ర‌ని రికార్డ్‌..

అమ‌రావ‌తి. ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధాని. అంత‌ర్జాతీయ స్థాయి న‌గ‌రం. సీఎం చంద్ర‌బాబు త‌ల‌పెట్టిన కార్యం. స్వ‌యంగా దేశ ప్ర‌ధాని మోదీనే త‌ర‌లివ‌చ్చి శంకుస్థాప‌న చేసిన ప్రాంతం. చంద్ర‌బాబు సీఎంగా ఉండిఉంటే.. ఇప్ప‌టిక‌ల్లా అమ‌రావ‌తికి ఓ రూపం వ‌చ్చి ఉండేది. ఆకాశ హ‌ర్మాల‌తో ఏపీ రాజ‌ధాని వెలుగొందుతూ ఉండేది. ఒక్క ఛాన్స్ అంటూ అంద‌ల‌మెక్కిన జ‌గ‌న్ అమ‌రావ‌తిని స్మ‌శానంలా మార్చేశారు. రాజ‌ధానిని మూడు ముక్క‌లు చేశారు. ఆంధ్రుల క‌ల‌ల సౌధాన్ని కుప్ప‌కూల్చేశారు. ఆఖ‌రికి అమ‌రావ‌తి రోడ్ల‌ను త‌వ్వుకొని కంక‌ర‌, ఇసుక ఎత్తుకెళ్లే స్థాయికి ఏపీ రాజ‌ధానిని దిగ‌జార్చారు. సీఎం జ‌గ‌న్ రాజ‌ధానితో ఎంత‌లా ఆడుకుంటున్నా.. అమ‌రావ‌తి ప్ర‌భ‌ను మాత్రం మ‌స‌క‌బార్చ‌లేక‌పోయారు. ఇప్ప‌టికీ ఓ విష‌యంలో అమ‌రావ‌తి దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌గానే ఉంది. ఆంధ్రుల నిండు గౌర‌వం సృష్టించిన రికార్డు ఇంకా ప‌దిలంగానే ఉంది.  మున్సిపల్ బాండ్ల ద్వారా నిధుల సమీకరణలో అమరావతి దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. సిటీ డెవలప్‌మెంట్ జారీ చేసిన రూ.2వేల కోట్ల బాండ్లను మరే నగరం దాటలేకపోయింది. 2018-19 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది నగరాలు/ పట్టణాభివృద్ధి సంస్థలు నిధుల సమీకరణకు బాండ్లను జారీ చేశాయి. మొత్తం రూ. 8,840 కోట్లు సేకరించాయి. ఇవేవీ అమరావతి స్థాయిలో నిధులు రాబ‌ట్ట‌లేక‌పోయాయి.  2018లో అప్పటి ప్రభుత్వం రూ.2వేల కోట్లకు బాండ్లను జారీచేయగా.. వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అమరావతి బ్రాండ్‌కు మంచి గుర్తింపు దక్కింది. సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వాన్ని న‌మ్మి.. అమ‌రావ‌తి మోడ‌ల్‌ను విశ్వ‌సించి.. ఏపీ ప్ర‌భుత్వం జారీ చేసిన బ్రాండ్ల‌ను ఎగ‌బ‌డి కొన్నారు. అదంతా అమ‌రావతికి ద‌క్కిన గౌర‌వం. చంద్ర‌బాబు నాయ‌క‌త్వానికి నిద‌ర్శ‌నం. ఆ రికార్డు ఇప్ప‌టికీ చెక్కుచెద‌ర‌కుండా అలానే ఉంది. ఇటీవ‌ల లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన‌ ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది.   

పెంచిన బడ్జెట్ ఇవ్వలేం.. పోలవరంపై జగన్ కు కేంద్రం షాక్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోషారి షాక్ ఇచ్చింది కేంద్ర సర్కార్.పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ రెడ్డి సర్కార్ కు ఝలక్ ఇచ్చింది. డిజైన్లు మార్చినప్పటికీ.. 2014 ఏప్రిల్‌ 1 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ ఇరిగేషన్‌ పనులకు అంచనా వేసిన వ్యయాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ల మార్పుల వల్ల హెడ్‌ వర్క్స్‌ వ్యయం 5,535 కోట్ల రూపాయల నుంచి 7,192 కోట్ల రూపాయలకు పెరిగినట్లుగా ఏపీ ప్రభుత్వం తెలిపినట్టుగా కేంద్ర మంత్రి తన సమాధానంలో తెలిపారు. గోదావరి ట్రైబ్యునల్‌ నియమ, నిబంధనలకు లోబడే ప్రాజెక్టు డిజైన్లు ఉండాలన్నారు. వాటిని సీడబ్ల్యూసీ(కేంద్ర జల సంఘం) ఆమోదించాకే ఆచరణలో పెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.  ఏపీ కోరిక మేరకు ప్రాజెక్టులోని కొన్ని డిజైన్లకు సీడబ్ల్యూసీ మార్పులు చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. మార్పుల కారణంగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల ఎత్తు పెంచడం, పునాదుల లోతు పెంచడం, స్పిల్‌వేలోని అత్యంత లోతైన బ్లాకులలో కాంక్రీట్‌ గ్రేడ్‌ల పెంపు, ఎగువ కాఫర్‌ డామ్‌లో ఎడమ వైపు డయాఫ్రం వాల్‌తో కటాఫ్‌ నిర్మాణం, గేట్‌ గ్రూవ్స్‌లో చిప్పింగ్‌ పనులు, స్పిల్‌వేలో రెండో దశ కాంక్రీట్‌ పనుల నిర్వహణ పనులను అదనంగా చేపట్టవలసి వస్తోందని మంత్రి తెలిపారు. ఇక పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదే అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. నిర్మాణ ప్రణాళికతోపాటు ప్రాజెక్ట్‌లోని వివిధ విభాగాలకు సంబంధించిన డిజైన్ల రూపకల్పన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. కేంద్ర మంత్రి సమాధానంతో ఏపీ సర్కార్ కు షాక్ తగిలినట్లైంది. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర పతనావస్థలో ఉన్న ప్రభుత్వానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టులో వ్యయం భరించాల్సి రావడం భారంగా మారనుంది. నిధుల లేమితో ప్రాజెక్టు పనులు ఆపితే జనాల్లో తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. 

బిజేపికి మరో బిగ్ షాక్.. వలస నేతలంతా జంపేనా? 

అధికారమే లక్ష్యంగా దూకుడుగా వెళుతున్న తెలంగాణ బీజేపీ బండికి రివర్స్ గేర్లు పెడుతున్నాయి. వివిధ పార్టీల నుంచి జోరుగా సాగిన వలసలతో ఊపు మీదు కనిపించిన తెలంగాణ బీజేపీ.. కమలం పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవలే మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కమలం పార్టీకి కటీఫ్ చెప్పగా.. తాజాగా మరో సీనియర్ నేత హ్యాండిచ్చారు. కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఇనగాల పెద్దిరెడ్డికి బీజేపీకి రాజీనామా చేశారు. తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖ విడుదల చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తాను పార్టీలో ఉండలేకపోతున్నానని ఆయన లేఖలో వెల్లడించారు.  టీడీపీలో ఓ వెలుగు వెలిగిన పెద్దిరెడ్డి గత లోక్ సభ ఎన్నికల సమయంలో ముందు బీజేపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో యాక్టివ్ గానే ఉంటున్నారు. అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన సైలెంట్ అయ్యారు. పెద్దిరెడ్డి కూడా గతంలో హుజురాబాద్ నుంచే పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆయన బీజేపీలో చేరారని చెబుతారు. అందుకే ఈటల చేరికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన బహిరంగంగానే ప్రకటనలు చేశారు. ఈటల బీజేపీలోకి రావడానికి తాను వ్యతిరేకం కాదంటూనే.. తనతో సంప్రదించకుండానే ఎలా నిర్ణయం తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.  బీజేపీలో ఈటల చేరికను పెద్దిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వస్తున్నాయి. పెద్దిరెడ్డితో బీజేపీ ముఖ్య నేతలు మాట్లాడారని, ఆయన కూల్ అయ్యారనే ప్రచారం కూడా జరిగింది. బండి సంజయ్ తో జరిగిన చర్చలు ఫలించాయని, ఆయన బీజేపీలోనే కొనసాగుతారని బీజేపీ నేతలు చెప్పారు. కాని సడెన్ గా రాజీనామాతో ముందుకు వచ్చారు పెద్దిరెడ్డి. అయితే పెద్దిరెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది తెలియరాలేదు. ఆయన టిఆర్ఎస్ లో చేరతారా? కాంగ్రెస్ వైపు వెళ్తారా అనేది తేలాల్సి ఉంది. కొన్ని రోజులుగా తెలంగాణలో బిజెపికి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. టిపిసిసి చీఫ్ గా రేవంత రెడ్డి నియామకం జరిగిన తర్వాత పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది.ఇటీవల ఆ పార్టీకి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ గుడ్ బై చెప్పారు. ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరతానని ప్రకటించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోదరుడు సంజయ్ కూడా రేవంత్ రెడ్డిని కలిసి తాను కాంగ్రెస్ చేరుతానని తెలిపారు. ఇక దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే దేవేందర్ గౌడ్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు రేవంత్ రెడ్డి. బీజేపీలో చేరుతారని భావించిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రస్తుతం మనసు మార్చుకున్నారని, ఆయన కాంగ్రెస్ లోనే ఉంటారని చెబుతున్నారు. బీజేపీలో చేరిన శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కూడా ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని, ఆయన కూడా త్వరలో కాంగ్రెస్ గూటికి చేరుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన బోడ జనార్ధన్, చాడా సురేష్ రెడ్డి వంటి నేతలు కూడా కాంగ్రెస్ లో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో కాంగ్రెస్ లో కీలకంగా ఉండి బీజేపీలో చేరిన నేతలు కూడా సొంత గూటికి చేరడానికి సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఇప్పటికే రేవంత్ రెడ్డికి టచ్ లోకి వచ్చారంటున్నారు.  

మమత కోసం ఈటలకు హ్యాండిస్తారా?

హుజూరాబాద్ లో గెలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరున్నొక్క రాగాలు ఆలాపిస్తుంటే కేంద్రంలోని బీజేపీ నేతల ప్రియారిటీస్ క్షణక్షణం మారుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు బీజేపీ నేతలకు ఈటల రాజేందర్ గెలుపే ముఖ్యంగా కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడా ప్రాధాన్యం తగ్గుతుందన్న వ్యాఖ్యానాలు ఢిల్లీలో వినిపిస్తున్నాయి. అందుక్కారణం మమత ఢిల్లీ మీద కన్నేయడమేనంటున్నారు.  బెంగాల్ సీఎం మమత మొన్నటి ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అయినా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఆరు నెలల్లో ఉపఎన్నికల్లో గెలిస్తే ఆమె సీఎంగా కొనసాగుతారు. లేకపోతే తన వీరవిధేయుడికి సీఎం కుర్చీ త్యాగం చేయాల్సి వస్తుంది. అదే జరిగితే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు భారీగా బీటలు  పడటం ఖాయంగా భావిస్తున్నారు. ఇదే విషయం మమతను కూడా ఆందోళనలో పడేసింది. అందుకే బెంగాల్లో ఇప్పటివరకు డిమాండ్ రూపంలో కూడా లేని విధానసభ అంశాన్ని ముందుకు తెస్తున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే బెంగాల్లో మమత సీటు కిందికి నీళ్లు రావడం ఖాయమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే తృణమూల్ కాంగ్రెస్ లో అలజడి రేగుతుంది. అసంతృప్తులు, నిరసనకారుల సంఖ్య పెరుగుతుంది. వారందరినీ కంట్రోల్ చేసే యుక్తి గానీ, సామర్థ్యం గానీ మమతకు ఉన్నంతగా ఆమె విధేయులకు ఉండే అవకాశమే లేదు. ఇది జరగకుండా ఉండేందుకే ఆ రాష్ట్రంలో విధానసభ పెట్టాలని మమత హడావుడిగా పావులు కదుపుతున్నారు. ఆమె పోటీ చేయాల్సి ఉన్న భవానీపూర్ ఇప్పటికే ఖాళీగా ఉంది.  మమతను అట్నుంచి అటే ఇంటికి పంపించేందుకు బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. కరోనా థర్డ్ వేవ్ సాకుతో కేంద్రం ఆధీనంలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం భవానీపూర్ ఎన్నికను ఇప్పట్లో నిర్వహించే అవకాశం కనిపించడం లేదన్న ఊహాగానాలు ఢిల్లీలో షికార్లు చేస్తున్నాయి. బీజేపీ హైకమాండ్ ఆలోచన మేరకే బెంగాల్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ ఆలస్యం కావచ్చని, అందువల్ల హుజూరాబాద్ కు కూడా నోటిఫికేషన్ వచ్చే చాన్స్ లేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలా అనివార్య పరిస్థితుల్లో హుజూరాబాద్ లో ఉపఎన్నిక ఆలస్యమవుతున్నకొద్దీ అది ఈటల సానుభూతి పవనాలను బలహీనం చేస్తుందని, దీనివల్ల ఈటల సర్వశక్తులు ఒడ్డినా గెలుపు అంత సులభం కాదని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. తమ మీద వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవాలంటే బీజేపీ నేతలకు ఈటల గెలుపు కన్నా మమతను ఇంటికి పంపించడమే ముఖ్యం. కాబట్టి హుజూరాబాద్ అంశాన్ని బీజేపీ నేతలు అటకెక్కించడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ భవానీపూర్ ఎన్నిక ఆలస్యమైతే ఈటల రాజకీయ భవిష్యత్తును బీజేపీ నేతలే చేజేతులా పాడు చేసినట్లవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రేపేం జరుగుతుందో చూడాలి మరి..

ప్రభుత్వ పథకం ముసుగులో పార్టీ ఎజెండా.. వారెవ్వా కేసీఆర్

మోస్ట్ పాపులర్ లీడర్ కేసీఆర్ ఎప్పుడూ మొహంమాటం లేకుండా మాట్లాడతారు. ఏదైనా దర్జాగానే చేస్తారు.. అవతలి వ్యక్తిని నిర్వీర్యం చేసినా, తాను నిస్సిగ్గుగా మాట్లాడినా... ఏం చేసినా బాజాప్తా చేయడమే తన మార్క్ అంటారు కేసీఆర్. దళితబంధు ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ లో కూడా అదే జరిగింది. సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్లో ప్రభుత్వ కార్యక్రమం ముసుగులో పార్టీ  కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. దాదాపు 500 మంది దళిత ప్రజలు, అధికారులు, ఇతర పార్టీల దళిత నేతలతో హుజూరాబాద్ ఎన్నికకు సమర శంఖం పూరించారు. హుజూరాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులు సాధించే విజయం మీదనే యావత్ తెలంగాణ దళిత బంధు విజయం ఆధారపడి ఉందని, వచ్చినవారంతా ఆ దిశగా ధృఢ నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. దళిత బంధు అనేది ఒక కార్యక్రమం కాదని, ఓ ఉద్యమమని జనమంతా ఆశ్చర్యపోయేలా ఓ సరికొత్త నిర్వచనం ఇచ్చారు.  దీన్నే ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక అనేది పార్టీలకు సంబంధించిన వ్యవహారమని, అన్ని పార్టీల్లాగే టీఆర్ఎస్ కూడా ఎన్నికల బరిలో పోటీ పడాల్సిందే తప్ప... ప్రభుత్వంలో ఉన్నాం కదాని ఏకంగా ప్రభుత్వాధికారిక స్థలాన్నే పార్టీ ఆఫీసుగా మార్చుకొని స్పీచ్ లు దంచడమేంటని ప్రశ్నిస్తున్నారు. దాదాపు 430 మందిని, వారితో పాటు సమన్వయకర్తలు, స్థానిక నాయకులు, అధికారులు కలుపుకుంటే 500 మందికి పైనే అవుతున్నారు. వారిని 15 వాహనాల్లో అధికారిక ప్రగతిభవన్ కు తరలించడం అక్కడ మీటింగ్ లో నిస్సిగ్గుగా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపుకోసం పిలుపునివ్వడంపై తీవ్రస్థాయిలో ప్రజలు విరుచుకుపడుతున్నారు. టీఆర్ఎస్ ఫేస్ చేయాల్సిన హుజూరాబాద్ ఎన్నికను దళితబంధు అనే ప్రభుత్వ పథకం కిందికి తీసుకురావడం ముఖ్యమంత్రి హోదానే అవమానపరచడంగా భావిస్తున్నారు. తాను ఓడిపోతున్నానని తెలిసే కేసీఆర్  ఇంతలా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారని ప్రజాస్వామ్యవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ ఖర్చులతో పార్టీ వ్యవహారాలు చక్కబెట్టుకునే కురుచ బుద్ధికి నిదర్శనమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దళితబంధు పైలట్ ప్రాజెక్టు ప్రారంభానికి అయిన ఖర్చెంతో తెలంగాణ ప్రజల ముందుంచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.  కేసీఆర్ ఒంటెత్తు పోకడలకు మరో నిదర్శనం ముఖ్యమంత్రి హోదాలో ఒంటెత్తు పోకడలు పోయే వ్యక్తిగా కేసీఆర్ ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అందుకు నిదర్శనంగా లెఫ్ట్ పార్టీల నుంచి పలువురు నేతలను ప్రగతి భవన్ కు ఆహ్వానించడాన్ని ఎత్తి చూపుతున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభమైన దళితబంధు పైలట్ ప్రాజెక్టుకు లెఫ్ట్ నాయకులు తప్ప ఇతర పార్టీ నాయకుల్ని ఎందుకు పిలవలేదన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ విషయాన్ని కావాలనే విస్మరించారా... కేసీఆర్ కు నచ్చినట్టు చేయాలన్న ఉద్దేశంతోనే సీఎస్ అసలు విషయాన్ని పక్కన పెట్టారా.. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తితే దానికి సీఎస్ ఏమని జవాబిస్తారు.. అన్న ప్రశ్నాస్త్రాలతో విపక్షాలు రెడీ అవుతున్నాయి. సీపీఎం జాతీయ స్థాయి నాయకుడు వెంకట్ తో పాటు సీపీఐ రాష్ట్ర స్థాయి నాయకుడైన బాలనరసింహను కేసీఆర్ ఆహ్వానించారు. హుజూరాబాద్ ఎన్నిక తరువాత యావత్ తెలంగాణలో దళిత బంధు పథకం విజయవంతం అయ్యాక దేశమంతా దాని అమలు కోసం కేంద్ర సర్కారు మీద ఒత్తిడి తెస్తామని, హుజూరాబాద్ లో ఫెయిలైతే దాని పరిణామాలు ఆ తదుపరి చాలా తీవ్రంగా పడతాయని, అందువల్ల దీన్నో యజ్ఞంలా భావించి హుజూరాబాద్ లో పని చేయాలని నిర్మొహమాటంగా లెఫ్ట్ నాయకులు స్టేట్ మెంట్లు ఇవ్వడం గమనార్హం.  కేసీఆర్ ఇటీవల.. తమదేం సన్నాసుల పార్టీ కాదని, తమ లాభం తాము చూసుకుంటామని, గెలవడం కోసమే పని చేస్తామని, తమది ఫక్తు రాజకీయ పార్టీయేనంటూ మరోసారి నిర్లజ్జగా బయటకు కక్కేశారు. అదే కేసీఆర్ అసలు నైజం అంటూ ఈ సందర్భంగా ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, ఇతర పౌర సంఘాల ప్రతినిధులు మరోసారి గుర్తు చేస్తున్నారు.  

చిక్కుల్లో ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్?

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు ఉచ్చు బిగిస్తోందా?కేంద్ర హోంశాఖ ఆయనపై వేటు వేయనుందా? అంటే ఢిల్లీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఢిల్లీలో పెట్టిన కేసు విషయంలో జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉంటున్నాయి. సునీల్ కుమార్ విషయంలో కేంద్ర హోంశాఖ సీరియస్ గానే స్పందించే అవకాశం ఉందని సమాచారం.  హిందూ మత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటూ సునీల్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్‌లో ఎంపీ రఘురామ రాజు గతంలో ఫిర్యాదు చేశారు. సునీల్‌కుమార్‌ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తన ఫిర్యాదులో రఘురామ పేర్కొన్నారు. ఏపీ సీబీసీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ డీఓపీటీ శాఖ మంత్రి జితేంద్రసింగ్‌కు కూడా  రఘురామ లేఖ రాశారు. అయితే  సునీల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ రఘురామ రాసిన లేఖను కేంద్ర డీఓపీటీ శాఖజితేంద్రసింగ్ హోంశాఖకు పంపారు. హోంశాఖ కార్యదర్శికి పంపిన లేఖ కాపీని రఘురామకు కూడా జితేంద్రసింగ్ పంపారు. సునీల్‌పై హోం శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేదానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. సునీల్ కుమార్ వ్యవహారాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఇప్పటికే సమాచారం సేకరించిందని తెలుస్తోంది. మతాలకు సంబంధించి ఆయన చేసిన కొన్ని ప్రసంగాలు యూట్యూబ్ లో ఉన్నాయి. వాటన్నింటిని కేంద్రం పరిశీలిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ కు ఉచ్చి బిగిస్తోందని ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.

పాము కాటుకు 5  మంది మృతి .. 

పాములు పగబడతాయా ? అంటే నమ్మాలో నమ్మకూడదో అర్థం కాదు. కొన్ని సార్లు శాస్త్రీయంగా లోచిస్తే పగపట్టావు అని.. మరి కొన్ని సంఘటనలు చూస్తే నమ్మాల్సి వస్తుంది.. మరి ఇంతకీ పాములు పగబడుతాయా ?  తాజాగా జరిగిన సంఘటన గురించి వింటే పగపడుతాయి అనే అనుమానం మీకు కూడా వస్తుంది. తాజాగా పాములు 24 గంటల వ్యవధిలోనే ఐదుగురిన కాటు వేశాయి. చివరికి పొట్టనబెట్టుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలోని వివిధ పాముకాటు ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా..వీరిలో ఆరేళ్ల చిన్నారి కూడా ఉంది. మృతుల్లో ఎక్కువగా యుక్త వయస్కులే ఉన్నారు. మృతుల్లో 22, 28, 14, 18 ఏళ్ల వయస్కులు కూడా ఉన్నారు. పాపం ఇంకా జీవితాన్ని చూడాల్సిన వాళ్ళు ఇలా  పాము కాటుతో మరణాన్ని చవి చూశారు.  తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. పాము కాటుకు ఒక సమస్య ఇయితే.. అక్కడి  సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు లేకపోవడం కూడా మరో ముఖ్య మైన సమస్య అని చెప్పాలి. పాము కాటుకు మరణించే  మృతుల సంఖ్య పెరగటానికి ప్రాధమిక కేంద్రంలో మందులు లేకపోవడమే ప్రధాన  కారణంగా తెలుస్తోంది. 24 గం.ల వ్యవధిలోనే ఒకే జిల్లాలో ఐదుగురు వ్యక్తులు పాముకాటుతో మృతి చెందడం యూపీ వ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారింది. యూపీ రాష్ట్ర వ్యాప్తంగానూ గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో పాముకాటు ఘటనలు నమోదయ్యాయి. ప్రతిరోజూ ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో జనం పాముకాటుతో మృతి చెందారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా కలుగులో పుట్టలో తల దాచుకున్న పాములు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో మరి ఎక్కువ  పాము కాటు ఘటనలు చోటుచేసుకోవడంతో సకాలంలో వారికి వైద్య చికిత్స కల్పించలేకపోతున్నారు. చికిత్స ఆలస్యం కావడంతో బాధితులు మృతి చెందుతున్నారు. వర్షాల నేపథ్యంలో వాళ్ళ ఎక్కడికైనా హాస్పత్రికి తీసుకుపోదాం అన్న వరదలు ఒక వైపు, మారు మూల గ్రామాల్లో అయితే రోడ్లు సరిగ్గా ఉండదు. రవాణా సరిగ్గా ఉండదు. ఇది ఇలా ఉంటే పాము కాటు నివారణ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆ జిల్లా ప్రజలను సూచించారు. అటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాము కాటుకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. మిగిలిన జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను  పాము కాటు చికిత్స పట్ల అప్రమత్తం చేశారు. చివరిగా చూస్తే పాములు పగబట్టావ్ అని తెలుస్తుంది. 

'జగనన్న కాలనీ' మిస్సింగ్‌.. దొంగ‌లు ఎత్తుకుపోయారా?

మీ ఇల్లు ఎక్క‌డ‌? అని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే.. ఫ‌లానా చోట‌ అని స్ప‌ష్టంగా చెప్ప‌గ‌ల‌గాలి. కాస్త క‌ష్ట‌మైనా.. అటు ఇటు, కుడి ఎడ‌మ అంటూ ఏదో ర‌కంగా వివ‌రించ‌గ‌లిగాలి. కానీ, మీ ఇల్లు ఎక్క‌డ‌? అని ప్ర‌శ్నిస్తే.. బిక్క‌ముఖం వేసుకొని నోట మాట‌రాక‌పోతే? అడ్ర‌స్ చెప్ప‌డం చానా క‌ష్ట‌మైతే? ఇంటి స్థ‌లం ఎక్క‌డో ఓ పట్టాన అర్థం కాక‌పోతే? అది నివాస ప్రాంత‌మే కాక‌పోతే? భూమి మీద కాకుండా నీళ్ల‌లో దాగుంటే? స‌ముద్రపు నీటిలో మునిగిపోతే? కొండ‌ల్లో క‌లిసిపోతే? కాగితాల‌కే ప‌రిమిత‌మైతే? చివ‌రాఖ‌రికి స‌ర్వం శోధించి సాధించిపెట్టే గూగుల్‌కు సైతం లోకేష‌న్‌ అంతుచిక్క‌క‌పోతే? అది క‌చ్చితంగా జ‌గ‌న‌న్న ఇచ్చిన ఇల్లే అయింటుంది. మీరుండబోయేది.. ఉండ‌లేనిది.. ఆ అడ్ర‌స్ లేని అడ్ర‌స్‌.. కేరాఫ్ 'జగనన్న కాలనీ'.  అవును, పేరుకే అది కాల‌నీ. ఉనికిలో లేని కాల‌నీ. చాలాచోట్ల‌ నివాసానికి ఏమాత్రం ప‌నికిరాని కాల‌నీ. అలాంటి ప్రాంతాల‌ను ప్ర‌త్యేకంగా వెతికి మ‌రీ.. వ‌ద్దుమొర్రో అంటున్నా ల‌బ్దిదారుల‌కు అంట‌గ‌ట్టారు. సంఖ్య పెంచుకోడానికి, బిల్డ‌ప్ ఇచ్చుకోడానికే అన్న‌ట్టు.. అడ్డ‌గోలు ప్రాంతాల్లో జ‌గ‌న‌న్న ఇల్లుల‌ను కేటాయిస్తున్నారు. మ‌నుషులు తిర‌గ‌ని మారుమూల ప్రాంతాల‌ను చూపించి.. ఇవే మీ ఇళ్లు.. జ‌గ‌న‌న్న కాల‌నీలు అంటూ మ‌మ అనిపిస్తున్నారు. పేరుకు 27 లక్షల మందికి స్థలాలు కేటాయించారు గానీ.. అందులో స‌గానికి పైగా ప‌నికిరాని, ప‌నికిమాలిన స్థ‌లాలేన‌ని ల‌బ్దిదారులే విమ‌ర్శిస్తున్నారు.  ఈ స్థలాల కొనుగోలు వెనుక వైసీపీ నేత‌ల గోల్‌మాల్ య‌వ్వారం దాగుంద‌ని ఆరోప‌ణ‌లు మొద‌టినుంచీ వినిపిస్తున్నాయి. ఆవ భూములు, చెరువు స్థ‌లాలు, కొండ‌ప్రాంతాల‌ను అధిక ధ‌ర‌ల‌కు కొన్నట్టు చూపుతూ అక్ర‌మాల‌కు, అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ముందు ప్ర‌భుత్వ‌మే ఇల్లు నిర్మించి ఇస్తామంది. ఆ త‌ర్వాత మీరే క‌ట్టుకోండి మేం రాయితీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. కేంద్ర స్కీంనూ త‌మ ఖాతాలో వేసుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇటీవ‌లే సామూహిక శంకుస్థాప‌న‌లో ఆ ప‌థ‌కానికి ఘ‌నంగా శ్రీకారం చుట్టింది స‌ర్కారు.  క‌ట్ చేస్తే.. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు అనేక చోట్ల‌ జ‌గ‌న‌న్న కాల‌నీలు క‌నుమ‌రుగ‌య్యాయి. అనేక‌చోట్ల ముంపు ప్రాంతాల్లో స్థ‌లాలు ఇవ్వ‌డంతో అవ‌న్నీ ఇప్పుడు నీట‌మునిగాయి. చెరువుల‌ను త‌ల‌పిస్తున్నాయి. అలా చెరువులాంటి చోట త‌మ స్థ‌లం ఎక్క‌డుందో.. త‌మ కాల‌నీ ఎటు వైపు ఉందో గుర్తించ‌డం చానా క‌ష్ట‌మ‌వుతోంద‌ట‌. గూగుల్‌లో సెర్చ్ చేసినా.. జ‌గ‌న‌న్న కాల‌నీల లొకేష‌న్స్ ట్రేస్ అవ‌ట్లేద‌ట‌. ఈ దుస్థితిపై సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో సెటైర్లు పేలుతున్నాయి.    వాన‌ల‌కి ముందు కాస్తోకూస్తో స్థ‌లాల్లా క‌నిపించిన కాల‌నీలు.. ఇప్పుడు వాన‌నీటిలో మునిగి క‌నుమ‌రుగు కావ‌డంతో.. మా స్థ‌లాలు ఎక్క‌డున్నాయో చూపించాలంటూ ల‌బ్దిదారులు వైసీపీ నాయ‌కులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నార‌ట‌. ఇటీవల కృష్ణా జిల్లా, తూర్పు పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో అనేక‌మంది లబ్ధిదారులు ఈ స్థలాలు మాకొద్దు అంటూ పత్రాలను తిరిగి ఇచ్చేస్తున్నార‌ట‌. అందుకే, వ‌ర్షాల‌తో జ‌గ‌న‌న్న కాల‌నీలు క‌నిపించ‌డం లేదంటూ ఏపీ వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయంటున్నారు.

వేదికపైనే టీఆర్ఎస్ మంత్రి, ఎమ్మెల్యే ఫైటింగ్.. 

యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే సాగుతుంటాయి. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి, ఓ ఎమ్మెల్యే ఘర్ణణ పడ్డారు. సభ వేదికపైనే కొట్టుకునేంత వరకు వెళ్లారు. ఒకరికొకరు తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేసుకున్న నేతలు.. మైకులు లాగేసుకున్నారు. కొట్టుకునే వరకు వెళ్లారు. పోలీసులు, రెండు పార్టీలకు చెందిన నేతలు జోక్యం చేసుకోని ఇద్దరిని వేరు చేయడంతో పక్కక జరిగారు.  యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమాన్ని మున్సిపల్ కేంద్రంలో నిర్వహించారు. మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ కు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వచ్చారు. సభలో మాట్లాడిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే లేకుండానే మంత్రి అభివృద్ది కార్యక్రమాలను ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు. జగదీశ్ రెడ్డి ముందే రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతలో కలగజేసుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి.. కోమటిరెడ్డిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిల్లర మాటలు మాట్లాడొద్దంటూ మైకును గుంజుకునే ప్రయత్నం చేశారు. అటు కోమటిరెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటరిస్తూ మంత్రిపై దూషణలకు దిగారు. అంతేకాదు మంత్రి చేతిలోని మైకును లాక్కొవడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నించారు. మంత్రి, ఎమ్మెల్యే ఇద్దరు తోపులాడుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. అదే సమయంలో రెండు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు వేదిక వైపుకు దూసుకువచ్చారు. పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులతో పాటు ఇతర నేతలు మంత్రి, ఎమ్మెల్యేను వారించి కూల్ చేశారు.  సభను బయటికి వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమలకు ఎమ్మెల్యే కు సమాచారం లేకుండా మంత్రి వచ్చిపోవడం ఎమ్మెల్యే లను అవమానపరచడమే అన్నారు. మంత్రిగా ఉంటే నియోజక వర్గంలో ఒక్క చోట ప్రారంభించి మిగతా కార్యక్రమాలను ఎమ్మెల్యే కి వదిలెయాలన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెట్టడం కాదు.. సమస్యలు పరిష్కరించాలని కోరారు. మంత్రి జగదీష్ రెడ్డి కి చిత్తశుద్ధి ఉంటే.. సీఎం కేసీఆర్ తో కొట్లాడి మునుగోడు నిధులు అందించాలని లేకపోతే తన నియోజకవర్గంలో ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించిన ఇలాగే ఉంటుంది అని సవాల్ చేశారు. శివన్నగూడ, ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టులకు కనీసం ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదని.. దమ్ముంటే ప్రాజెక్ట్ లు పూర్తి చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు

 డెల్టా డెత్ గేమ్ స్టార్ట్.. 500 చిన్నారులు మృతి.. 

ఒకటి కాదు రెండు కాదు. ఒకే  వారంలో ఏకంగా  500 మంది చిన్నారులు కరోనాతో మృతి చెందారు. ఇటీవల 5ఏళ్ల కన్నా తక్కువ వయసు  ఉన్న పిల్లల్లో సగం మంది కరోనా కోరల్లో చిక్కి మృతి చెందారు. గత వారంలో 500మంది చిన్నారుల మృతి చెందగా, 50వేల కొత్త కేసులు..ఇండోనేసియా దేశం ఏషియాలోనే డెల్టా వేరియంట్ కే కేంద్రబిందువుగా మారిందా? అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. అక్కడ రోజురోజు పెరుగుతున్న కేసులు, చావు బతుకలతో బెంబేలెత్తిపోతోందా? ఇండోనేసియాలో కోవిడ్ పేనిక్ సిట్యువేషన్ ఎలా ఉంది?  డెల్టా వేరియంట్ లో-  ఇప్పటికే 27 లక్షల కేసులు వచ్చాయి. అది అలా ఉంచితే  ఒక్క వారంలో 50 వేల కేసులు నమోదు అవ్వడం. ఈ దేశం తన రికార్డులను తానే అధిగమిస్తూ తన చావు తానే ఒంటరిగా ఎదుర్కుంటున్న దేశం ఏదైనా ఉందంటే అది ఇండోనేసియా అని చెప్పాలి.  ఇక్కడ చాలా మంది పరిస్థితి ఏంటంటే.. కరోనా ఒక వైపు కరోనా వచ్చాక ఆస్పత్రి బిల్లులు చెల్లించలేక ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు అక్కడి ప్రజలు.  ఇలాంటి డెల్టా డెత్ సమాచారం అందుకుంటున్న సిబ్బంది గతంలో ఒకటీ రెండు మాత్రమే దహన సంస్కారాలను చేసేవారు. అదే ఇప్పుడు.. రోజుకు 24 వరకూ అంత్యక్రియలు చేస్తున్నారంటే పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు. ఆక్సిజన్ కొరత, కోవిడ్ మరణాలు, ప్రాణాధార ఔషధాల అందలేకపోవడంతో దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. అంత వల్లకాడులా మారుతుంది. ప్రస్తుతం ఆ పరిస్థితుల నుంచి కొంత వరకు భారత్ బయటపడిందనే చెప్పాలి. అయితే గతంలో  భారత్ ఎదుర్కొన్న పరిస్థితిని ఇప్పుడు ఇండోనేషియాలో కనిపిస్తోంది. కరోనా మహమ్మారి విలయతాండవం, అక్కడ కరోనా యముడు ప్రజల ప్రాణాలతో శివతాండవం చేస్తుంది. అయితే ఇప్పుడు సంభవిస్తున్న మరణాల్లో  ఎక్కువ శాతం చిన్నారులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ కరోనా విడతల వారీగా ప్రజలపై తన ప్రభావం చూపిస్తుంది. గతం లో వయసు పై బడిన వారిపై ..ఆ తర్వాత యువకులపై నుంచి ఇప్పుడు ఏకంగా చిన్నారలను కబళిస్తుంది. చిన్నారులను  ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకీ పిల్లల్లో కరోనా మరణాల రేటు పెరిగిపోతోంది. వందలాది మంది చిన్నారులు కోవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోతూ.. స్మశానాల్లో కాలుతున్నారు.  ఇండోనేషియాకు చెందిన వందలాది మంది చిన్నారులు  కోవిడ్ మహమ్మారికి చిక్కి చనిపోయారు. వారిలో చాలా మంది ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే కావడంతో దేశ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఇండోనేషియాలో పిల్లల్లో కోవిడ్ మరణాల రేటు ఇతర దేశాల కంటే ఎక్కువగా నమోదైంది. ఇక్కడ జూలై నెలలో వారానికి 100 కన్నా ఎక్కువ కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇండోనేషియాలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసులలో ఇదే ఎక్కువ అని అక్కడి అధికారులు అంటున్నారు. పిల్లల మరణాల సంఖ్య పెరుగుదల ఆగ్నేయాసియాలో డెల్టా వేరియంట్ కేసులతో సమానంగా ఉందని ఆ నివేదిక వెల్లడించింది. ఇండోనేషియా ప్రభుత్వం దేశీయ మొత్తం జనాభాలో దాదాపు 50వేల కొత్త కేసులు నమోదు కాగా.. 1,566 మరణాలు నమోదయ్యాయి. శిశువైద్యుల ఇచ్చిన నివేదికల ప్రకారం.. ఆ దేశంలో కోవిడ్ కేసులలో మునుపటి నెలతో పోలిస్తే… చిన్నారులు 12.5శాతంగా ​ఉన్నారు. జూలై 12న కరోనాతో 150 మందికి పైగా చిన్నారులు చనిపోయారు.  గత వారంలో 500 మంది చిన్నారులు కరోనాతో మృతి చెందారు. ఇటీవల 5ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో సగం మంది కరోనా కోరల్లో చిక్కి మృతి చెందారు. మొత్తంమీద.. ఇండోనేషియాలో 3 మిలియన్లకు పైగా కోవిడ్ కేసులు నమోదుకాగా, 83వేల మరణాలు నమోదయ్యాయి. గత ఏడాది నుంచి ఇండోనేషియాలో 18ఏళ్ల కంటే తక్కువ వయస్సులో 800 మందికి పైగా చిన్నారులు కరోనా రక్కసికి చిక్కారు. కోవిడ్ మరణాలలో ఎక్కువ భాగం గత నెలలోనే నమోదయ్యాయని ఆ దేశ వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. దేశంలో తక్కువ టీకా రేటు కూడా దీనికి కారణమనేది ఇక్కడి వారి రిపోర్టులో వెల్లడైంది. ఇండోనేషియాలో కేవలం 16శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ అందినట్లుగా తెలుస్తోంది. మరో 6శాతం మందికి మాత్రమే రెండో డోస్ వేయించుకున్నవారి సంఖ్య ఉంది. కోవిడ్ కేసుల పెరుగుదల కారణంగా ఆస్పత్రులన్నీ వైరస్ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా సోకిన చిన్నారుల సంరక్షణ కోసం కొన్ని ఆస్పత్రులను ప్రత్యేకంగా  ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ పిలలను రక్షించుకునేందుకు వారి ఉరుకులు పరుగులు చూస్తుంటే మరింత ఆందోళన కలిగిస్తోంది. ఏ దేశానికైనా విపత్తు వచ్చినప్పుడు మన దేశం ఎప్పుడు ముందే ఉంటుంది.. మన దేశం ఎప్పుడు ముందే ఉంటుందని మరో నిరూపించింది. తాజాగా భారత్ తన మిత్ర దేశానికి చేయూతనిస్తోంది. ఇప్పటికే 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 100 మెట్రిక్ టన్నుల ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ ను ఇండోనేషియాకు పంపించింది. భారత నావికాదళానికి చెందిన ఓ నౌకలో వీటిని ఇండోనేషియా రాజధాని జకార్తా తరలించారు.

సీబీఐ న్యాయవాదికి జ్వరమొచ్చింది! జగన్ పై ప్రధానికి రఘురామ లేఖ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. లిఖితపూర్వక వాదనలు సమర్పించడానికి మరింత గడువు కావాలని సీబీఐ అధికారులు కోరారు. సీబీఐ తరఫున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అనారోగ్య కారణంగా కౌంటర్ ధాఖలు చేయలేక పోయామని తెలిపారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణ ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది. నిజానికి జూలై14న జరిగిన విచారణ సమయంలోనే సీబీఐ తీరుపై పిటిషనర్ తరపు లాయర్ అభ్యంతరం తెలిపారు. కౌంటర్ దాఖలుకు మళ్లీ మళ్లీ సమయం కోరడం సరికాదని వాదించారు. అయినా మరోసారి సీబీఐ వాయిదా కోరడంపై విమర్శలు వస్తున్నాయి. అది కూడా  లాయర్ కు జ్వరం వచ్చిందంటూ వాయిదా కోరడం పలు అనుమానాలకు తావిస్తోంది.  సీబీఐ లాయర్ కు  సడెన్ గా ఎందుకు జ్వరం వచ్చిందన్న చర్చ జనాల్లో సాగుతోంది.  ఎంపీ రఘురామ కృష్ణం రాజు తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఏ1, ఏ2లపై చర్యలు తీసుకోవాలని అందులో ఆయన కోరారు. జగన్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తనపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాశారని, ఇప్పుడు తాను కూడా వారిద్దరిపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాశానని ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. జగన్, విజయసాయిల అక్రమ ఆర్థిక వ్యవహారాలు, సూట్ కేసు కంపెనీలపై ఆ లేఖలో వివరించినట్టు తెలిపారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. సీబీఐ కేసు వాయిదా పడటంపైనా రఘురామ స్పందించారు. జగన్‌ బెయిల్‌ రద్దు కేసు పలు కారణాలతో మళ్ళీ వాయిదా పడిందన్నారు. ఒకేసారి సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు జ్వరం రావడంపై...తనకు అనుమానాలు లేవన్నారు. అయినా ఒకేసారి జ్వరం ఎలా వచ్చిందని రఘురామ ప్రశ్నించారు. ట్విటర్‌లో విజయసాయిరెడ్డి అవాస్తవాలు ప్రచారం చేశారని రఘురామ ఆరోపించారు. ఆయన పేర్కొన్న అంశాలను లేఖలో ప్రధానికి వివరించానన్నారు. ఏ-2 పెట్టిన సూట్‌కేసు కంపెనీలతో ఏ-1 కార్యకలాపాలు జరుపుతున్నారని ఆరోపించారు. క్విడ్‌ప్రోకో, సూట్‌కేసు కంపెనీల బాగోతాన్ని లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. తాను విదేశాలకు వెళ్లకుండా పాస్ట్‌పోర్టు రద్దు చేయాలని అడుగుతున్నారని, మరి 20కి పైగా కేసులున్న విజయసాయిరెడ్డి పాస్‌పోర్టును ఏం చేయాలని రఘురామ ప్రశ్నించారు. ఏపీ అంశాలపై అందరం కలిసి రాజీనామా చేద్దామని, అందుకు సిద్ధమా? అని రఘురామ సవాల్ చేశారు. 

మోడీ టార్గెట్ గా ఢిల్లీకి దీదీ! ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యేనా?

ఆమె ఎమ్మెల్యే కాదు .. కానీ,ఆమె ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆమె ఎంపీ కూడా కాదు ... కానీ, ఆమే ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు. ఇంతకీ ఆమె ఎవరు? ఇంకెవరు.. తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇప్పటికే బెంగాల్ అసెంబ్లీ సభ్యురాలు కాకుండానే, ముఖమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మమతా బెనర్జీ, తాజాగా ఎంపీ కాకుండానే తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ గానూ ఎన్నికయ్యారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఎంపీలంతా కలిసి తమ అధినేత్రిని మమతా బెనర్జీని పార్లమెంటరీ పార్టీ  ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే కాకుండా మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వారు గతంలోనూ ఉన్నారు. కానీ ఇలా ఎంపీ కుండానే పార్లమెంటరీ పార్టీ నాయకులుగా ఎన్నికైంది మాత్రం ఇద్దరే ఇద్దరు. ఒకరు సోనియా గాంధీ (1998) రెండు మమతా బెనర్జీ. చివరకు ఇందిరా గాంధీ కూడా  ఎంపీగా ఓడిపోయిన సందర్భంలో (1977) యశ్వంత రావు చౌహాన్ ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుని చేశారు. ఆయనే ప్రతిపక్ష నాయకునిగానూ బాధ్యతలు నిర్వహించారు. అంతకు ముందు ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కి, ఆమె రాత్రికి రాత్రి దేశంలో అంతర్గత అత్యవసర పరిస్థితి  విధించి.. ఆరేళ్ళు నియంత పాలన సాగించారు అనుకోండి. అయితే అప్పట్లో, నియంతగా,  హిట్లరమ్మగా ప్రసిద్ధి చెందిన ఇందిరకు కూడారాని అద్భుత ఆలోచన మమతా బెనర్జీకి వచ్చింది. ఎంపీ కాకుండానే పార్లమెంటరీ పార్టీ నాయకురాలయ్యారు.ఒకటనేముంది, పార్టీలోని అన్ని కీలక పదవులు ఆమె గుప్పిట్లోనే ఉంచుకున్నారు. ఒకప్పుడు ఇందిరా గాంధీ మంత్రివర్గంలో ఆమె ఒక్కరే మగాడు మిగిలిన వాళ్ళంతా అంతే అనే జోక్ ప్రచారంలో ఉండేది. ఇప్పుడు ఆ జోక్ మమతా దీదీకి సరిపోతుంది.  మమతా బెనర్జీ అడుగులు మెల్ల మెల్లగా జాతీయ రాజకీయాల వైపు పడుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.ఇందులో భాగంగానే మమతా బెనర్జీ ఈ నెల (జులై) 28 న ఢిల్లీ చేరుతున్నారు. అదే రోజున ప్రధాని నరేంద్ర  మోడీతో అధికార సమావేశంలో పాల్గొంటారు. ఇక అక్కడినుంచి నుంచి మోడీతో, ‘ఢీ’ కొనే ఆట మొదలవుతుందని, ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతా కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్న దీదీ, ఆ ఎన్నికల తర్వాత తోలి సారిగా ఢిల్లీ వస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా అన్నిపార్టీలను ఏకం చేయడమే దీదీ ఢిల్లీ దండయాత్ర  ప్రధాన అజెండాగా పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె   వివిధ పార్టీల అగ్రనాయకులతో సమావేశమవుతారు. ఇలా అన్ని పార్టీల నాయకులను సమన్మయ పరిచే బాధ్యతను, మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరంకు అప్పగించారు. ఆమె ఢిల్లీ వచ్చేసరికి, పవార్, చిదంబరం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారని, ఆపై వ్యవహారం అంతా మమతా బెనర్జీ చుకుకుంటారని అంటున్నారు.  ఒక విధంగా చూస్తే మమతా బెనర్జీ, ప్రతిపక్ష నాయకురాలిగా, ప్రతిపక్షాల ప్రదాని అభ్యర్ధిగా తనను తాను ప్రకటించుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే పని మీద తృణమూల్ ప్రధాన కార్యదర్శి, మమతా దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, రాజకీయ వ్యూహకర్త, ఈ మొత్తం వ్యవహారం సూత్రధారీ ప్రశాంత్ కిశోర్, నాలుగు రోజుల ముందుగా, జులై 22 నే ఢిల్లీ చేరుకున్నారు. మరోవంక మమతా బెనర్జీ కొందరు ముఖ్య నాయకులతో ఆన్లైన్ మంతనాలు కూడా సాగించినట్లు సమాచారం. ఈ సమావేశానికి కొనసాగింపుగా, 28 సమావేశం ఉంటుంది. అయితే, ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, హస్తం పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా వాద్రా హాజరవుతారా లేదా అనేది తేల లేదు. అయితే సోనియా గాంధీతో మమతా బెనర్జీ భేటీ అవతారని అంటున్నారు. బీజేపీ మాజీ మిత్రపక్షం  శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ కూడా, బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.  మొత్తానికి, మోడీని ఓడించేందుకు మూడేళ్ళ ముందుగానే జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కాకలు  తీరిన రాజాకీయ ఉద్దండులు అంతా, ప్రశాంత్ కిశోర్ కు జీ హుజూర్ అనడం కొంచెం విద్దురంగా ఉందని, రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తపరిస్తున్నారు. అలాగే, ప్రశాంత్ కిశోర్ ఎవరి తరపున ఈ రాజకార్యం చేస్తున్నారు, అనేది కూడా అనుమానాలకు తావిస్తోందనే మాట కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. 

టీఆర్ఎస్‌తో దోస్తీ క‌టీఫ్‌!.. రేవంత్‌కే ఓవైసీ స‌పోర్ట్‌! అందుకేనా డిప్యూటీ సీఎం కిరికిరి?

ఆల్ఇండియా మ‌జ్లిస్-ఇ-ఇత్తేహదుల్ ముస్లిమీన్‌-AIMIM. పాత‌బ‌స్తీకే ప‌రిమిత‌మైన పార్టీ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఉనికి చాటుకుంటోంది. బీజేపీని గెలిపించ‌డానికే అన్న‌ట్టు.. ముస్లిం జ‌నాభా అధికంగా ఉండే ప్రాంతాల్లో పోటీ చేస్తోంది. తాను ఒక‌టో రెండే సీట్లు గెలుస్తూ.. బీజేపీకి మాత్రం గంప‌గుత్త‌గా ఆధిక్యం క‌ట్ట‌బెడుతోంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ రెండు పార్టీల మ‌ధ్య‌ ర‌హ‌స్య స్నేహం న‌డుస్తోంద‌నే అనుమానం. తెలంగాణ‌లో మాత్రం టీఆర్ఎస్‌తో ఎమ్ఐఎమ్‌కి జిగ్రీ దోస్తానా ఉంది. బాయీ బాయీ అంటూ కేసీఆర్ ఓవైసీలు ఒక్క‌తాటిపైన న‌డుస్తుంటారు. కారు స్టీరింగు త‌మ చేతుల్లోనే ఉందంటూ మ‌జ్లిస్ క‌వ్వించినా.. కొన్నిచోట్ల ఫ్రెండ్లీ కంటెస్ట్ చేసినా.. ఆ రెండూ దొందు దొందేన‌ని అంద‌రికీ తెలుసు.  అధికార పార్టీతో అంట‌కాగ‌కుండా మ‌జ్లిస్ రాజ‌కీయం చేయ‌దు. టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీకి మిత్ర‌ప‌క్షం. కాంగ్రెస్ ప‌వ‌ర్‌లో ఉంటే కాంగ్రెస్‌కు స్నేహ హ‌స్తం. టీఆర్ఎస్ గెలిస్తే.. కారులో షికారు. పాత‌బ‌స్తీలో త‌మ సామాజ్యం ప‌దిలంగా ఉంచుకోడానికి.. అటువైపు ప్ర‌భుత్వం, అధికారులు క‌న్నెత్తి కూడా చూడ‌కుండా చేసుకోవ‌డానికి ద‌శాబ్దాలుగా ఎమ్ఐఎస్ అనుస‌రిస్తున్న వ్యూహం ఇది. ఇదే పాయింట్ మీద టీఆర్ఎస్‌తో మ‌జ్లిస్ స్నేహం చేస్తోంద‌ని అంతా అంటారు. ఇప్పుడు ఇదే పాయింట్ మీద‌.. అదే మ‌జ్లిస్ పార్టీ.. టీఆర్ఎస్‌కు హ్యాండ్ ఇవ్వ‌బోతోంద‌ని చెబుతున్నారు. అందుకు కార‌ణం.. రేవంత్‌రెడ్డి. అవును, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డే వారిద్ద‌రి దోస్తానాకు ప‌రోక్షంగా కార‌ణం అవుతున్నారు. గాలి వీచే వైపున‌కే ప‌తంగి ఎగురుతుంది. ఇప్పుడు తెలంగాణ‌లో కాంగ్రెస్ హ‌వా మొద‌లైంది. రేవంత్‌రెడ్డి క్రేజ్ య‌మ జోరుగా సాగుతోంది. గ‌ట్టిగా ట్రై చేస్తే.. ఈసారి కాంగ్రెస్‌దే అధికారమ‌నే ప్ర‌చారం న‌డుస్తోంది. ఇదే ఓవైసీని పున‌రాలోచ‌న‌లో ప‌డేసింద‌ని అంటున్నారు. ఎలాగూ కాంగ్రెస్‌తో పాత స్నేహం ఉండ‌నే ఉంది. పాత దోస్తుతో కొత్తగా దోస్తీ చేయడానికి ఓవైసీ ఆస‌క్తిగా ఉన్నార‌ట‌. ఆ మేర‌కు ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డికి మెసేజ్ పంపించ‌డం.. అటునుంచి సైతం ఓకే అంటూ రిప్లై రావ‌డం జ‌రిగిపోయింద‌ట‌. ఫ‌స్ట్ క‌న్ఫ‌ర్మేష‌న్ వ‌చ్చాక‌.. ఇక మ‌జ్లిస్ పార్టీ కేసీఆర్‌ను మెలిపెట్టే ప‌ని మొద‌లుపెట్టింద‌ని అంటున్నారు.  ఎన్నాళ్లైనా మీరు మాత్ర‌మే  ప‌వ‌ర్‌లో ఉంటారా? మాకు ఏ మాత్రం షేర్ చేయ‌రా? అనేది ఓవైసీ లేటెస్ట్ డిమాండ్‌. ఇన్నాళ్లూ మీకు స‌పోర్ట్ చేసింది చాలు.. ఇక మాకు కూడా ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యం ఇవ్వండంటూ అడుగుతోంద‌ట మ‌జ్లిస్ పార్టీ. ఏదో చిన్నా చిత‌కా ప‌ద‌వి ఇస్తే ఊరుకోబోమ‌ని.. త‌మ వాడిని డిప్యూటీ సీఎం చేయాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతోంద‌ని తెలుస్తోంది. స‌రిగ్గా ఇలాంటి ప్ర‌పోజ‌ల్‌నే యూపీలో స‌మాజ్‌వాదీ పార్టీ ముందు ఉంచింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దేశ‌వ్యాప్తంగా ఇక‌పై ఎమ్ఐఎమ్ ఇలాంటి స్ట్రాట‌జీనే అప్లై చేయ‌బోతోంద‌ని.. ముందుగా తెలంగాణ నుంచే ప్రారంభమ‌ని అంటున్నారు. రేపోమాపో కేటీఆర్‌ను సీఎం చేసేందుకు కేసీఆర్ సిద్ద‌మ‌వుతున్నారు. ఆ అధికార బ‌దిలీ స‌వ్యంగా సాగాలంటే.. త‌మ‌కు డిప్యూటీ సీఎం పోస్ట్ త‌ప్ప‌కుండా ఇవ్వాల్సిందేనంటూ కొర్రీ పెడుతున్నార‌ట ఓవైసీ.  మ‌జ్లిస్‌ అంత దూకుడుగా ఉండ‌టానికి కార‌ణం రేవంత్‌రెడ్డే అంటున్నారు. పీసీసీ చీఫ్  రేవంత్ నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ కొత్త రెక్క‌లు తొడ‌గ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం ద‌క్కించుకునేలా అడుగులు వేస్తుండ‌టంతో.. అవ‌స‌ర‌మైతే రేవంత్‌రెడ్డికి జై కొట్టేందుకు ఓవైసీ రెడీ అవుతున్నార‌ట‌. ఈలోగా కేసీఆర్‌తో కుదిరిన కాడికి బేర‌సారాలు ఆడైనా.. బ్లాక్‌మెయిల్ చేసైనా.. డిప్యూటీ సీఎం ప‌ద‌వి ప‌ట్టేయాల‌నేది మ‌జ్లిస్ ఎత్తుగ‌డ‌. కేసీఆర్ హ‌ర్ట్ అయి త‌మ‌ను కాదు పొమ్మంటే.. కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవ్వొచ్చ‌ని.. లేదంటే, ఎన్నిక‌ల నాటికి హ‌స్తం పార్టీ హ‌వా పెరిగితే.. తమంత‌ట తామే  రేవంత్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వొచ్చ‌నేది.. ఎమ్ఐఎమ్ మైండ్‌గేమ్‌గా తెలుస్తోంది. మ‌రి, ముందుముందు ఏం జ‌రుగుతుందో చూడాలి...  

ఆప‌రేష‌న్ బీజేపీ.. కారు కంటే క‌మ‌ల‌మే రేవంత్‌ మెయిన్‌ టార్గెట్‌?

రాహుల్‌ను ప్ర‌ధాని చేయ‌డ‌మే కాంగ్రెస్‌పార్టీ ప్ర‌ధాన ల‌క్ష్యం. ఆ ల‌క్ష్య సాధ‌న‌ను సుల‌భ‌త‌రం చేయ‌డ‌మే రాష్ట్ర సార‌ధులు చేయాల్సిన‌ ప‌ని. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి బీజేపీ. క‌మ‌ల‌ద‌ళాన్ని ఎంత‌లా దెబ్బ‌కొడితే.. ల‌క్ష్యాన్ని చేర‌డం అంత ఈజీ. అందుకే, పువ్వు పార్టీని న‌లిపేయ‌డమే మెయిన్ టార్గెట్. బీజేపీ అధికారంలోలేని తెలంగాణ‌లాంటి రాష్ట్రాల్లో ప‌వ‌ర్‌లో ఉన్న‌ ప్రాంతీయ పార్టీల‌పై పోరాడుతూనే.. కాషాయ పార్టీని ఖ‌తం చేయ‌డ‌మే ప‌నిగా కాంగ్రెస్ నాయ‌కులు ప‌ని చేయాల్సి ఉంటుంది. ఆ మేర‌కు అధిష్టానం నుంచి వారికి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఉంటాయి. తెలంగాణ‌లోనూ ప్ర‌స్తుతం అదే జ‌రుగుతోంద‌ని అంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై దండ‌యాత్ర చేస్తూనే.. ప‌నిలో ప‌నిగా బీజేపీని బొంద‌పెట్టే ప‌నిలో బిజీగా ఉన్నార‌ని అంటున్నారు. టీఆర్ఎస్‌ను ఎలాగైనా ఎదుర్కోవ‌చ్చు.. క‌మ‌లద‌ళాన్ని నిర్వీర్యం చేసి.. ఎద‌గ‌కుండా చేయ‌డాన్ని మాత్రం అస్స‌లు వ‌దిలిపెట్టొద్దని ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్టున్నారు. అందుకే కాబోలు.. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక‌.. పైకి కేసీఆర్‌పైనే ఫైటింగ్‌లా క‌నిపిస్తున్నా.. డ్యామేజీ మాత్రం బీజేపీకే జ‌రుగుతోంది. వ‌రుస‌గా క‌మ‌ల‌నాథులు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. కాషాయ బండి జోరుకు ఎక్క‌డిక‌క్క‌డ బ్రేకులు ప‌డుతున్నాయి. బీజేపీలో మునుప‌టి ఉత్సాహం క‌నిపించ‌డం లేదు. ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్‌ మిన‌మా పువ్వు పార్టీకి అన్నీ ఎదురుదెబ్బ‌లే. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాక మొద‌టిసారిగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెంపుపై నిర‌స‌న‌కు పిలుపిచ్చారు. ఆ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి ఆయ‌న ఎంచుకున్న స్పాట్‌..నిర్మ‌ల్‌. అదేంటి ఏ హైద‌రాబాదో, క‌రీంన‌గ‌రో, హుజురాబాదో అయితే రాజ‌కీయంగా మ‌రింత మైలేజ్ వ‌చ్చేదిగా? మ‌రి, ఏరికోరి నిర్మ‌ల్‌లోనే రేవంత్‌రెడ్డి నిర‌స‌న‌కు ఎందుకు దిగార‌నే డౌట్ రాక‌మాన‌దు.  అంతెందుకు, తాజాగా ద‌ళిత దండోరా పేరుతో ల‌క్ష‌మందితో రేవంత్‌రెడ్డి మ‌రో ఉద్య‌మానికి సిద్ధ‌మ‌య్యారు. ఆగ‌స్టు 9న ముహూర్తం. అది కూడా ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఇంద్ర‌వెల్లి నుంచే శ్రీకారం. ఆదిలాబాద్‌లో ఎస్టీల సంఖ్య ఎక్కువ‌. అయినా కూడా ద‌ళిత దండోరాను ఇంద్ర‌వెల్లి నుంచే ప్రారంభించ‌డమూ వ్యూహాత్మ‌క‌మ‌నే అంటున్నారు. రేవంత్‌రెడ్డి ప‌దే ప‌దే ఉమ్మ‌డి ఆదిలాబాద్‌లో యాక్టివిటీస్ చేస్తుండ‌టం బీజేపీని దెబ్బ‌కొట్టేందుకేన‌ని చెబుతున్నారు.  ఉమ్మ‌డి ఆదిలాబాద్ వ్యాప్తంగా బీజేపీకి మంచి ప‌ట్టుంది. అక్క‌డ‌ ఓ ఎంపీ కూడా ఉన్నారు. ఆ జిల్లాల్లో రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ‌లు బీజేపీ బ‌ల‌ప‌డేందుకు అనుకూలంగా మారాయి. తెలంగాణ మొత్తంలోకి ఉమ్మ‌డి ఆదిలాబాద్‌లోనే బీజేపీ ఎక్కువ బ‌లంగా క‌న‌బ‌డుతోంది. అందుకే, బీజేపీ జోరును త‌గ్గించేందుకే ఉమ్మ‌డి ఆదిలాబాద్‌పై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫోక‌స్ చేస్తున్నార‌ని అంటున్నారు. అక్క‌డ జ‌రిగే పార్టీ కార్య‌క్ర‌మాల‌కు రేవంత్‌రెడ్డే స్వ‌యంగా హాజ‌ర‌వుతూ.. ప్ర‌జ‌ల‌ను బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  కేసీఆర్ వ‌ర్సెస్ రేవంత్‌రెడ్డి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇలా ఫేస్ టు ఫేస్ ఫైట్ జ‌ర‌గాల‌నేది రేవంత్ గేమ్ ప్లాన్‌. అలాగైతేనే ఓట‌ర్లు ఇద్ద‌రిలో ఒక‌రి వైపు మ‌ళ్లుతారు. లేదంటే.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త చీలిపోయి అది కాంగ్రెస్‌కే న‌ష్టం చేకూర్చుతుంది. అందుకే, అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చే నాటిక‌ల్లా.. బీజేపీని సాధ్య‌మైనంత మేర దెబ్బ‌తీయాల‌నేది రేవంత్ ఎత్తుగ‌డ‌. ఆయ‌న పీసీసీ చీఫ్ అయ్యాక‌.. బీజేపీ నుంచే కాంగ్రెస్‌లోకి వ‌ల‌స‌లు పెరిగాయి. ఏకంగా బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ సోద‌రుడు సంజ‌య్‌నే హ‌స్తం గూటికి చేరుకున్నారు. పాల‌మూరు జిల్లా బీజేపీ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖ‌ర్ సైతం బీజేపీకి బై బై చెప్పేసి రేవంత్‌రెడ్డితో చేయి క‌లిపారు. కాషాయ కండువా క‌ప్పుకోవాల్సిన‌ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి కాంగ్రెస్ వైపు మ‌ర‌లిపోయారు. త్వ‌ర‌లోనే కూనా శ్రీశైలంగౌడ్ సైతం బ‌య‌ట‌కు వ‌చ్చేస్తార‌ని అంటున్నారు. ఇలా, బీజేపీని వీలైనంత మేర‌కు బ‌ల‌హీన ప‌ర‌చ‌డ‌మే రేవంత్‌రెడ్డి టార్గెట్‌లా క‌నిపిస్తోంది. డ‌బుల్ బ్యారెల్ గ‌న్ లాంటి రేవంత్‌రెడ్డి.. ఇటు టీఆర్ఎస్‌, అటు బీజేపీని ఎయిమ్ చేస్తూ.. టూ బ‌ర్డ్స్ ఎట్ వ‌న్ షాట్  స్ట్రాట‌జీని అమ‌లు చేస్తున్నారు. 

35 మంది ట్రాఫిక్ పోలీస్ స్కామ్.. అధికారి ఇల్లు అంత బంగారమే..  

ఈ ప్రపంచంలో మంచి ఎంత ఉందో.. అంతకు రెట్టింతలు  అవినీతి కూడా ఉండనే చెప్పాలి. ఇందుగలడందు లేదని సందేహం కలదు ఎందెందు చూసిన అందండు కలేదు అని కూడా చెప్పొచ్చు.. తాజాగా అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారి నివాసంలో సోదాల కోసం వెళ్లిన పోలీసులకు అక్కడ దృశ్యాలు చూసి కంగుతిన్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం..?  ఈ స్క్యామ్ లో దాదాపు 35 మందికిపైగా ట్రాఫిక్ పోలీసుల కీలక పాత్ర పోషించినట్టు అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణం దర్యాప్తులో కల్నల్ అలెక్సీ సఫోనోవ్ అనే ఉన్నతాధికారి ఇంటిలో సోదాలు నిర్వహించిన అధికారులు. అతని ఇంటిని చూస్తే అధికారులకు నోటిమాట రాలేదు.  అక్కడ దృశ్యాలు చూసి కళ్లు బైర్లు కమ్మాయి. ఆయన ఇల్లంతా ఎక్కడ చూసిన బంగారంతో నిండిపోయింది.  ఆ ఇంట్లోని ఏవస్తువును పట్టుకున్న బంగారంతో తయారుచేసినవే కావడంతో అవాక్కయ్యారు. అంతే కాదు  బెడ్రూమ్‌, హాలు, కిచెన్‌లోని పలు వస్తువులతోపాటు..చివరికి  బాత్రూమ్ లో కూడా ఆ అధికారి బంగారంతో కట్టించుకున్నాడు. అంతే కాదండోయి దానికి మ్యాచింగ్‌గా ఫ్లోర్ను కూడా స్పెషల్  మార్బుల్తో డిసైన్ చేయించారు. అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న స్టావ్రోపోల్లో భూతల స్వర్గాన్ని తలపించే ఆ ఇంటి ముందు రెండు ఖరీదైన కార్లు ఉన్నాయి. అందులోని ఫర్నీచర్, గోడకు ఉండే ఫ్రేమ్లు, కుర్చీలు, కిచెన్లో ఉండే అలమరాలు, ఇతర సామాగ్రి అంతా బంగారంతో మెరిసిపోతున్నాయి. ఇంటీరియర్ డెకరేషన్ అంతా పసిడితోనే చేయడం గమనార్హం. దర్యాప్తు బృందం ఆ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్ను షేక్ చేస్తోంది. జులై 20న ఆప్లోడ్ యూట్యూబ్ లో చేయగా.. ఇప్పటివరకు 4.37 లక్షల మందికిపైగా వీక్షించారు. కామెంట్స్ కూడా చేస్తున్నారు.  కల్నల్ అలెక్సీ, అతడి కింద ఉండే ఆరుగురు అధికారులు పెద్ద మొత్తంలో లంచాలకు మరిగారు.. లంచం తీసుకుని  వాహనాలకు ఫేక్ పర్మిట్లు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీని వల్ల స్టావ్రోపోల్లో ఎలాంటి రుసుము చెల్లించకుండా వాహనాలతో సరుకు రవాణా చేయవచ్చు. ఈ క్రమంలోనే వారు భారీగా అవినీతికి తెరతీసినట్టు కేసు నమోదు కాగా.. ఇందులో మరో 35 మంది హస్తం ఉందనే అనుమానులు ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే పోలీస్ మాఫియా అని చెప్పొచ్చు.  ఈ క్రమంలో సోదాలకు వెళ్లిన దర్యాప్తు అధికారులు.. ఆ ఇంటిని చూసి షాక్ తిన్నారు. ఈ కేసులో 80 చోట్ల సోదాలు నిర్వహించారు. అలెగ్జాండర్ అర్జ‌నుఖిన్ అనే అధికారి సహా మరి కొందర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆరోపణలు రుజువైతే అలెక్సీకి సుమారు 15ఏళ్ల జైలు శిక్ష పడుతుందని స్థానిక మీడియోలో కథనాలు వెలువడ్డాయి. మొత్తానికి ఈ ఘటన రష్యా లో జరిగింది.. ఈ విషయాన్నీ తెలుసుకున్న ప్రొ-క్రెమ్లిన్ యునైటెడ్ రష్యా పార్టీ ఎంపీ అలెగ్జాండర్ ఖిన్‌స్టేన్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో 35 మందికి పైగా ట్రాఫిక్ పోలీస్ అధికారులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ‘స్టావ్రోపోల్‌లో కరుడగట్టిన మాఫియా రాజ్యమేలుతోంది.. బ్లాక్ మార్కెట్ నంబర్ ప్లేట్లు, సరుకు రవాణా నుంచి ఇసుక పంపిణీ వరకు ప్రతిదాని నుంచి లాభం పొందుతోంది’ అని ఆరోపించారు. రష్యాలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.