ఇక్క‌డ ప్లీన‌రీ.. అక్క‌డ క‌విత‌.. అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా!

అక్టోబ‌ర్ 25, సోమ‌వారం టీఆర్ఎస్ ప్లీన‌రీ. హైద‌రాబాద్‌లో జోర్‌దార్‌గా ఏర్పాట్లు. గులాబీ పార్టీ 20 ఏళ్ల ఆవిర్భావ వేడుక‌ల‌ను అట్ట‌హాసంగా జ‌రుపుకునేందుకు భారీ ఎత్తున స‌న్నాహాలు. ప్లీన‌రీలో ఆరు వేల మందికి గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ నేరుగా దిశానిర్దేశం చేయ‌నున్నారు. పార్టీ త‌ర‌ఫున ఇంత పెద్ద కార్య‌క్ర‌మం జ‌రుగుతుంటే.. కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ క‌విత మాత్రం ప్ర‌స్తుతం దుబాయ్‌లో ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. గుస‌గుస‌ల‌కూ కార‌ణం అవుతోంది. స‌రిగ్గా.. స‌మ‌యం చూసి మ‌రీ క‌విత దుబాయ్‌లో ప్రోగ్రామ్ పెట్టుకున్నారా?  కావాల‌నే ప్లీన‌రీ టైమ్‌లో హైద‌రాబాద్‌లో లేకుండా చూసుకున్నారా? క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో కుంపటి మ‌రింత రాజుకుందా? నాన్న‌, అన్న‌తో చెల్లికి గ్యాప్ బాగా పెరిగిందా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు. ఇంత‌కీ క‌విత దుబాయ్ ఎందుకు వెళ్లారంటే... ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో 23వ తేదీ రాత్రి ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయిలోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించనున్నారు. శనివారం రాత్రి 9.40 గంటలకు, 10.40 గంటలకు రెండు సార్లు బుర్జ్‌ ఖలీఫాపై 3 నిమిషాల పాటు బతుకమ్మ వీడియోను ప్రదర్శించనున్నారు. దేశవిదేశాలకు చెందిన లక్షలాది మంది ఒకేసారి బుర్జ్‌ ఖలీఫా అతిపెద్ద స్క్రీన్‌పై బతుకమ్మను వీక్షించనున్నారు. బతుకమ్మ వేడుకల ద్వారా మన సంస్కృతి, ఖ్యాతిని ప్రపంచమంతా చాటి చెప్పేందుకే ఎమ్మెల్సీ కవిత ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ జాగృతి వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమం కోసం కవిత ప్ర‌స్తుతం దుబాయ్‌లో ఉన్నారు. ఇదీ దుబాయ్ మేట‌ర్‌. క‌ట్ చేస్తే.. అదంతా ఓకే. దుబాయ్‌.. బుర్జ్ ఖ‌లీఫా.. బ‌తుక‌మ్మ‌.. క‌విత‌.. జాగృతి.. అంతా బాగేనే ఉంది కానీ.. టైమింగే ఏదో తేడా కొడుతోంద‌ని అంటున్నారు. టీఆర్ఎస్ 20 ఏళ్ల వేడుక‌ల స‌మ‌యం. ప్లీన‌రీతో పార్టీలో పండుగ సంద‌డి క‌నిపిస్తోంది. ఈవెంట్ సోమ‌వార‌మే అయినా.. ఇప్ప‌టి నుంచే హైద‌రాబాద్ మొత్తం గులాబీ మ‌యం అయిపోయింది. ఇలాంటి ప్రెస్టీజియ‌స్ ప్రొగ్రామ్‌కు గ‌తంలో ద‌గ్గ‌రుండి ఏర్పాట్లు చూసుకున్న క‌విత‌.. ఈ సారి మాత్రం హైద‌రాబాద్ వీడి దుబాయ్ వెళ్లిపోయారు. జ‌స్ట్‌.. బ‌తుక‌మ్మ కోస‌మే వెళ్లారా? లేక‌.....? అదే టాక్ న‌డుస్తోంది ఇప్పుడు. క‌విత కావాల‌నే దుబాయ్ వెళ్లార‌ని అంటున్నారు. క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయికి చేరాయ‌ని.. పార్టీలో క‌విత‌కు ప్రాధాన్యం లేద‌ని.. తండ్రీకొడుకులు ఆమెతో మాట్లాడ‌టం లేద‌ని చెబుతున్నారు. కేటీఆర్‌కు క‌విత రాఖీ క‌ట్ట‌లేదు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఇంటి ఆడ‌బిడ్డ బ‌తుక‌మ్మ ఆడ‌టానికి రాలేదు. ఎప్ప‌టి నుంచో న‌డుస్తున్న గుస‌గుస‌ల‌కు ఈ రెండు సంద‌ర్భాలు మ‌రింత ఆజ్యం పోశాయి. పైగా, ఇటీవ‌ల శాస‌న‌మండ‌లిలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ఎమ్మెల్సీ క‌విత గ‌ట్టిగా ప్ర‌శ్నించ‌డం మ‌రింత అనుమానాల‌కు కార‌ణ‌మైంది. కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేయ‌డం క‌విత‌కు ఇష్టం లేద‌ని అందుకే వారి మ‌ధ్య తేడా వ‌చ్చింద‌ని అంటున్నారు. ఆస్థి త‌గాదాల వ‌ల్లే వైరం పెరిగింద‌ని కూడా చెబుతున్నారు. కార‌ణ‌మేంటో తెలీదు కానీ.. క‌విత‌ను కేసీఆర్‌, కేటీఆర్ ప‌క్క‌న పెట్టేశార‌నే మాత్రం వాస్త‌వ‌మే..అంటున్నారు.  ఇలా ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సందర్భంలో క‌విత మ‌రోసారి ఇలాంటి ప్ర‌చారానికి ఊత‌మిచ్చేలా వ్య‌వ‌హ‌రించార‌ని అంటున్నారు. బ‌తుక‌మ్మ ముగిశాక ఇన్ని రోజుల త‌ర్వాత‌.. ఇప్పుడు కావాల‌నే దుబాయ్ బుర్జ్ ఖ‌లీఫాపై బ‌తుక‌మ్మ ప్రోగ్రామ్ పెట్టుకుని.. హైద‌రాబాద్‌లో లేకుండా చూసుకున్నార‌ని చెబుతున్నారు. అయ‌తే, శ‌నివారం రాత్రితో దుబాయ్ ప్రోగ్రామ్ ముగుస్తుంది. మ‌రి, ఆ వెంట‌నే ఆదివారం తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చేస్తారా? సోమ‌వారం పార్టీ ప్లీన‌రీలో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తారా? అనేదే ఇక్క‌డ ఇంట్రెస్టింగ్ పాయింట్‌. క‌విత సోమ‌వారం నాటికి వ‌చ్చే ఛాన్సెస్ త‌క్కువేన‌ని తెలుస్తోంది. సోమ‌వారం టీఆర్ఎస్ ప్లీన‌రీకి క‌విత రాక‌పోతే మాత్రం.. ఇక పార్టీలో ఆమె ఖేల్ ఖ‌తం.. దుకాణం బంద్ అన్న‌ట్టే...అంటున్నారు.

ఢిల్లీకి చంద్రబాబు బృందం.. జగన్ రెడ్డి ప్రభుత్వంలో కలవరం! 

ఆంధ్రప్రదేశ్ లో కాక రేపుతున్న రాజకీయాలు ఢిల్లీకి చేరుతున్నాయి. వైసీపీ సర్కార్ అరాచక పాలన సాగిస్తోందని ఆరోపిస్తున్న తెలుగు దేశం పార్టీ దేశ రాజధాని కేంద్రంగా పోరాటానికి సిద్ధమవుతోంది. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నిరంకుశ పాలనపై కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేయబోతోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఆ పార్టీ బృందం ఈ నెల 25న ఢిల్లీ వెళ్లనుంది. రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనుంది. ఎంపీలతో సహా సుమారు పది మంది నేతలు ఈ బృందంలో ఉంటారు.  రాష్ట్రపతి కోవింద్‌తో పాటు పలువురు పెద్దలను కలసి మాదకద్రవ్యాలు, వైసీపీ దాడులపై ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబు. రాష్ట్రపతి సోమవారం అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని, హోంమంత్రి అపాయింట్‌మెంట్‌ కోసం ఆ పార్టీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడటానికి రాష్ట్రపతి పాలన విధించాలని ఆ పార్టీ కోరనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్లను టీడీపీ బృందం కోరింది. వాళ్లను కూడా కలిసి వైసీపీ ప్రభుత్వ విధానాలు, ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులపై ఫిర్యాదు చేయనుంది. టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిపై సీబీఐ విచారణ జరపాలని కోరే అవకాశం ఉంది. మంగళవారం వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు నెల్లూరు, విశాఖ, గుంటూరు పార్టీ ఆఫీసులపై దాడికి పాల్పడ్డాయి. విజయవాడలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి చేసి విద్వంసం స్పష్టించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇండ్ల దగ్గర దాడులకు ప్రయత్నించాయి. ఈ ఘటనలతో ఏపీ ఉధ్రిక్తతంగా  మారింది. వైసీపీ దాడులకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు బుధవారం రాష్ట్ర బంద్ నిర్వహించింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 36 గంటల నిరసన దీక్ష చేశారు చంద్రబాబు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.  చంద్రబాబు దీక్షకు అనూహ్య స్పందన వచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం కిటకిటలాడింది. ఉదయం 6గంటలకు మొదలైన కార్యకర్తల రాక.. సాయంత్రానికి విపరీతంగా పెరిగిపోయింది. కార్యాలయం లోపల  కాలుమోపలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలతో మినీ మహానాడు మాదిరిగా మారిపోయింది. అమరావతి దళిత జేఏసీ కూడా ప్రదర్శనగా తరలివచ్చింది. దీక్ష ముగింపు సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీనే గంజాయి కేంద్రంగా మార్చారని ఆరోపించారు. ప్రశ్నిస్తే దాడులు చేసే అరాచక పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి దమ్ముంటే, పోలీసులు లేకుండా టీడీపీ కార్యాలయం వైపు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సవాల్‌ చేశారు. ఎవరూ లేని సమయంలో టీడీపీ ఆఫీసు పై రాళ్లేసి.. ఉద్యోగులను కొట్టి వెళ్లడం కాదు.. దమ్ముంటే ఇప్పుడు రండి.. మా సత్తా చూపిస్తాం’ అని హెచ్చరించారు.  ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంద. అందుకే చంద్రబాబు దీక్షకు భారీ స్పందన వచ్చిందని, కరోనా భయపెడుతున్నా జనాలు భారీగా వచ్చి మద్దతు తెలిపారని చెబుతున్నారు. ఇదే స్పీడుతో జాతీయ స్థాయిలో జగన్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రిని కలిసి ఏపీ పరిస్థితులను వివరించబోతున్నారు. టీడీపీ బృందం హస్తిన పర్యటనతో వైసీపీలో కలవరం మొదలైందని తెలుస్తోంది. ఏపీలో జరుగుతున్నపరిణామాలతో ఇప్పటికే చాలా డ్యామేజీ జరిగిందని, టీడీపీ నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసే తమకు ఇబ్బందులు తప్పవనే భయాందోళన జగన్ శిబిరంలో కనిపిస్తుందని అంటున్నారు. 

అప్పు కోసం గవర్నర్ అధికారాలు తనఖా? జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్..

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి న్యాయస్థానాల చేత అక్షింతలు వేయించుకోవడం అలవాటుగా మారిపోయింది. కోర్టులు పెట్టవలసిన నాలుగు చీవాట్లు పెట్టనిదే, ప్రభుత్వ పెద్దలకు నిద్రపట్టదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగం అంటే ఏమిటో తెలుసో లేదో కానీ, ఆయన దాన్నసలు పట్టించుకోరు. అధికారులు, లక్షల లక్షల్లో జీతాలు, కోటల్లో ముడుపులు పుచ్చుకుంటున్న సలహ దారులు చాలామందే ఆయన చుట్టూ ఉంటారు. అయినా, ఎవరి లెక్క వారిది. ఎవరి పనిలో వారు బిజీ ..బిజీగా  ఉంటారు. అందుకే ప్రభుత్వం ఏమి చేయచ్చు, ఏమి చేయకూడదు, అనే విషయంలో ఎవరికీ ఎలాంటి పట్టింపు ఉండదు, అందుకే ప్రతి చిన్నా చితక విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవడం, సర్కార్ నెత్తిన అక్షింతలు వేయడం నిత్య క్రతువుగా మారింది.  అప్పుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఎద్దగోలుగా వ్యవ్వహరిస్తుందో వేరే చెప్పనక్కర లేదు. అప్పుకోసం ఏమైనా చేస్తాం.. ఎంతవరకైనా పోతాం అనే విధంగా ప్రభుత్వం మద్యంపై ముందున్న పాతికేళ్ళ పాటు వచ్చే ఆదాయాన్ని, ముందుగానే తాకట్టు పెట్టి రూ. 25వేల కోట్లు ప్పుతెచ్చింది. ఈ ఒక్క పద్దును పట్టి చూస్తే చాలు, జగన్ రెడ్డి ప్రభుత్వం అప్పు సూత్రం అర్థమైపోతుంది.  అయితే అదొక్కటేనా అంటే, కాదు, ఏపీ సర్కార్ బుర్రలో, ‘వాట్ యాన్ ఐడియా..జగన్’  అని అందరూ ముక్కున వేలేసుకునే విధంగా ఇన్నోవేటివ్ ఐడియాలు ఎన్నో ఉన్నాయి. అందుకు మద్యం అప్పు ఓ మచ్చుతునక అయితే, ఏపీఎ్‌సడీసీ ద్వారా రూ.25వేల కోట్ల రుణం పొందేందుకు బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో వ్యక్తిగతంగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరును చేర్చిన ఐడియా ఇంకొకటి. ఇప్పుడు  ఈ విషయంగానే, ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు శ్రీ సర్కార్ వారికి చీవాట్లు పెట్టింది.  వివరాలలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎస్‌డీసీ) ద్వారా తీసుకున్న అప్పులు, జరిపిన లావాదేవీలకు సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లన్నింటినీ తమ ముందుంచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు ఈ విషయంలో కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. ఏపీఎ్‌సడీసీ ద్వారా రూ.25వేల కోట్ల రుణం పొందేందుకు... బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో వ్యక్తిగతంగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరు ఎలా చేరుస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్న రుణం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైతే గవర్నర్‌కు ఆయా బ్యాంకులు నోటీసులు జారీ చేసి, కేసులు పెట్టేందుకు వీలు కల్పించడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. రాజ్యాంగంలోని 361 అధికరణ ప్రకారం గవర్నర్‌పై సివిల్‌, క్రిమినల్‌ కేసులు నమోదు చేయడానికి వీల్లేకుండా రక్షణ ఉందని గుర్తు చేసింది. ఒప్పందం ద్వారా గవర్నర్‌ సార్వభౌమాధికారాన్ని  తొలగించడం సరికాదని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాన్ని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు జమ చేయకుండా నేరుగా ఏపీఎ్‌సడీసీ ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించింది. నిధుల బదిలీకి సంబంధించి ఒరిజనల్‌ డాక్యుమెంట్లను కోర్టు ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఏపీఎ్‌సడీసీ ఏర్పాటు, అప్పులు తీసుకునే విధానంపై, ఇతర నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వై.బాలాజీ, బి.నళినీకుమార్‌, గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. ‘‘ఎవరైనా వ్యక్తి, సంస్థ గవర్నర్‌పై కేసులు నమోదు చేయకుండా రాజ్యాంగంలోని అధికరణ 361 రక్షణ కల్పిస్తుంది. కానీ ఏపీఎ్‌సడీసీ ద్వారా రూ.25వేల కోట్ల రుణం పొందేందుకు బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో గవర్నర్‌ సార్వభౌమాధికారాన్ని ప్రభుత్వం వదులుకుంది. రుణాలు తిరిగి చెల్లించని పక్షంలో ఆర్థిక సంస్థలు గవర్నర్‌కు నోటీసులు జారీ చేసే అవకాశముంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను ఎస్‌బీఐ క్యాప్‌ ట్రస్టీకి తనఖా పెట్టారు. ఒప్పందంలో గవర్నర్‌ పేరును చేర్చడంపై ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో ఎలాంటి వివరణ ఇవ్వలేదు’’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.  జూలై 30వ తేదీన రాష్ట్రానికి రాసిన లేఖలో... రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా అప్పు తేవడం రాజ్యాంగంలోని 266(1) అధికరణకు వ్యతిరేకమని కేంద్రం తెలిపిందన్నారు. దీనికి ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ సమాధానమిస్తూ...‘‘ప్రభుత్వానికి వచ్చే ఆదాయన్ని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో జమ చేయకుండా నేరుగా ఏపీఎ్‌సడీసీకి జమ చేస్తున్నామన్న వాదనలో నిజం లేదు’’ అని తెలిపారు. ఎస్‌డీసీ ద్వారా రూ.25,000 కోట్ల భారీ మొత్తాన్ని అప్పుగా తేవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని కేంద్రమే లేఖ రాసినందున కేంద్రం, అప్పులిచ్చిన 8 బ్యాంకులు కౌంటర్‌ దాఖలు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న బెంచ్‌  కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను నవంబరు 15కి వాయిదా వేసింది. నిజానికి అప్పిచ్చేవాడు ఎవరైనా, ఏషరతులు విధించనా తలవంచుకుని తెసుకోవదానికి, చివరకు గవర్నర్ సార్వభౌమాధికారాన్ని కుదువ పెట్టేదుకు కూడా ప్రభుత్వం సిద్దమైంది.. అంటే .. ఇక మిగిలిదేముంది ?

ఏపీలో  ముందస్తు  ఎన్నికల సందడి?వైసీపీ నేతల్లో అలజడి..

ఆంధ్ర ప్రదేశ్ లో ఓ వంక రాజకీయ రచ్చ జరుగుతోంది.  బూతులే రాష్ట్ర అనధికార అధికార ప్రామాణిక భాషగా చెలామణి అవుతున్న రాష్ట్రంలో... మంత్రులే బూతుల మత్రులుగాముద్రవేసుకుని మురిసి పోతున్న  రాష్ట్రంలో ... ఒక ప్రతిపక్ష నాయకుడు నోరుజారిన, ఒకే ఒక్క బూతుపదం చుట్టూ రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఆ ఒక్క మాటను పట్టుకుని,అధికార వైసీపీ నాయకులు బీపీలు పెంచేసుకుని దాడులు, దండయాత్రలు, బాంబు బెదిరిపులు ఇలా రాష్ట్రాన్ని ఉగ్రవాదుల్లా వనికిస్తున్నారు.  మరోవంక ఎన్నికలు, పొత్తులు, ప్రణాళికల మీద చర్చలు సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. అధికార వైసీపేతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకునేందుకు, బీజేపీ సహా ఏ పార్టీ సిద్ధంగా లేవు.వైసీపీ ప్రభుత్వం అరాచక అప్పుల పాలన పట్ల విసిగి పోయిన అన్ని వర్గాల ప్రజలు  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడేందుకు, టీడీపీ, బీజేపీ, జనసేన తిరిగి జట్టుకట్టాలనికోరుకుంటున్నారు. నిజానికి, గత (2019) ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలకు వచ్చిన సీట్ల మధ్య పెద్ద వ్యత్యాసమే ఉన్నా, ఓట్ల మధ్య దూరం అంతగా లేదు. వైసీపీకి 50 శాతం ఓట్లు వస్తే, టీడీపీకి 40 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీ, జనసేనలకు కలిపి ఓ ఆరేడు శాతం ఓట్లు వచ్చాయి. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ మూడు పార్టీలు కలిస్తే,కూటమి ఓటు 46-47 శాతానికి చేరుకుంటుంది. ఇక వైసీపే, టీడీపీ కూటమి మధ్య వ్యత్యాసం రెండు మూడు శాతం కంటే దిగువకు పడిపోతుంది. ప్రభుత్వ వ్య్తతిరేకతను కలిపితే ఫలితాలు తిరగబడతాయని, ఓట్ల లెక్కలు చెపుతున్నాయి. అయితే, పాత మిత్రులు ముగ్గురు మళ్ళీ కలుస్తారా? గతం గతః అని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉమ్మడి శతృవును ఓడించేందుకు చేతులు కలుపుతారా? అంటే, రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలే ఉంటాయని,రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీల మధ్య సీక్రెట్ లవ్ నడుస్తోందన,టీడీపీతో మళ్ళీ పొత్తుకు బీజేపీ కేంద్ర నాయకత్వం అంత సుముఖంగా లేదని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అది నిజమే అనుకున్నా, టీడీపీ, జనసేన చేతులు కలిపినా, జగన్ రెడ్డికి దబిడి దిబిడి తప్పదని అంటున్నారు. బీజేపీ, జనసేన ఖాతాలో చేరిన ఆరేడు శాతం ఓట్లలో ఐదున్నర శాతం ఓట్లు జనసేన ఖాతాలోవే, బీజేపీకి వచ్చింది ఒక శాతం కంటే తక్కువే.ఈ నేపధ్యంలో టీడీపీ, జనసేన పొత్తుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  ముఖ్యంగా జనసేన అడుగులు ఎటు వేస్తుంది అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పార్టీలకు మద్దతు పలికి పోటీకి దూరంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో విభేదించి పవన్ కళ్యాణ్ టీడీపీతో పాటు బీజేపీతో పొత్తుకు స్వస్తి చెప్పారు.2019 ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్షాలతో కలసి ఎన్నికలలో పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో  జనసేన  ఒక్క స్థానానికే పరిమిత అయింది.   ఇక ఆ తర్వాత బీజేపీతో మళ్లీ చేతులు కలిపిన పవన్ కళ్యాణ్, ఈమధ్య కాలంలో బీజేపీకి దూరంగా ఉంటున్నారు.ఈ నేపధ్యంలోనే, అధికారికంగా కాకపోయినా, అనదికారికంగా ఇప్పటికే  పొత్తును తుంచేసుకున్నారని,అతి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉంటుందని అంటున్నారు.  ఈమధ్య కాలంలో పవర్ స్టార్ సినిమాల కంటే  రాజకీయాల వైపు ఎక్కువ మొగ్గ్గు చూపుతున్నారు. అంతే కాదు, చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసుకుని, ఫుల్ టైమ్ పొలిటీషియన్’గా ఉంటారని అంటున్నారు. కాగా ఒక దశలో 2024 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఆలోచించిన పవన్ కళ్యాణ్, ఆలోచనలో మార్పు వస్తున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి..మరో వంక టీడీపీ - జనసేన పార్టీలు మళ్లీ చేతులు కలపబోతున్నాయన్న ప్రచారం సాగుతోంది. చివరకు ఏమి జరుగుతోందో ఇప్పుడే చెప్పడం కొంచెం కష్టం.  అదెలా ఉన్నా మాములుగా అయితే, అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా దూరం ఉంది, కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాలలో సాగుతున్న రాజకీయ సందడి చూస్తుంటే, రెండు రాష్ట్రాలలో ఒకేసారి  ఎన్నికలకు వెళ్ళే ఉమ్మడి  వ్యూహం ఏదైనా ఉడుకుతోందా .. లేక కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు వెళ్ళే ఆలోచన చేస్తోందా ..అనే సదేహాలు బలపడుతున్నాయి. ఏమైనారాష్ట్రంలో ఎన్నికల సందడి అయితే వచ్చేసింది.  

29 రకాల వంటకాలు.. నాన్ వెజ్ స్పెషల్! గులాబీ ప్లీనరీలో ఘుమఘుమలే..

తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లినరీకి సర్వం సిద్ధమవుతోంది. టీఆర్ఎస్ ప్లీనరీని సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందుకే రెండేండ్లకోసారి జరిగే గులాబీ పండుగ భారీ స్థాయిలో జరుగుతుంది. టీఆర్ఎస్ ప్లీనరీ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది వంటకాలే. ప్రతి ప్లీనరీలోనూ అతిథులకు వడ్డించే భోజనమే స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. భోజన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు సీఎం కేసీఆర్.  అక్టోబర్ 25న హైటెక్స్ లో జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీలో ఏర్పాట్లు భారీ ఎత్తున సాగుతున్నాయి. కుకింగ్ సెక్షన్ ఇప్పటికే సన్నాహాలు చేసేస్తోంది. ఈసారి ప్లీనరీలో మాంసాహార వంటకాలనే ఎక్కువగా వడ్డించనున్నారు. ఫుడ్‌ కమిటీ ఇన్‌చార్జిగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్నారు. ఆయన  ఆధ్వర్యంలో ఈసారి 29 రకాల వంటలను సిద్ధం చేయబోతున్నారు. ఒకేసారి 8 వేల మంది అతిథులు భోజనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలతో పాటు ప్రజాప్రతినిధులు, మహిళలకు వేర్వేరుగా భోజనశాలలను సిద్ధం చేస్తున్నారు. ప్లినరీలో మెన్ ఇదే..  ధమ్‌ చికెన్‌ బిర్యానీ, మటన్‌ కర్రీ, నాటుకోడి పులుసు, పాయాసూప్‌, బోటిఫ్రై, ఎగ్‌ మసాలా, రుమాల్‌ రోటి, ఆలూ క్యాప్సికం, బగారా రైస్‌, వెజ్‌ బిర్యానీ, వైట్‌ రైస్‌, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, దాల్‌రైస్‌, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చి పులుసు, ముద్ద పప్పు, సాంబారు, ఉలవచారు+క్రీమ్‌, పెరుగు, వంకాయ చట్నీ, వెల్లుల్లి జీడిగుల్ల అవకాయ, బీరకాయ టమోటా చట్నీ, పాపడ్‌, వడియాలు, జిలేబీ, డబల్‌ కా మీఠా, ఐస్‌ క్రీం, గ్రీన్‌ సలాడ్‌, బటర్‌ రైస్‌, డ్రై ఫ్రూట్స్‌, కారా, బూంది, లడ్డూ, చాయ్‌ అందివ్వనున్నారు.  ప్లీనరీకి వచ్చే ప్రతినిధులు, కార్యకర్తలకు రుచికరమైన భోజనం అందిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పారు. సుమారు 15 వేల మందికి వెజ్‌, నాన్‌వెజ్‌ వంటల రుచి చూపించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం చెయ్యి తిరిగిన 500 మందిని నియమిస్తున్నామన్నారు. వాలంటీర్లు, ప్రత్యేక సిబ్బందితో ఒకేసారి 8 వేల మంది భోజనాలు చేసేలా చూస్తున్నామని తెలిపారు ప్లీనరీ ఫుడ్ ఇంచార్జ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.   

కేసులు పెట్టి ఏం పీకావ్.. జగన్ రెడ్డి! చంద్రబాబు ఉగ్రరూపం.. 

ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగుతుందని తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు.తప్పుల్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా.. ఇది ఉగ్రవాదం కాకపోతే మరేమిటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం జగన్‌ దుష్పరిపాలన ప్రజలందరికీ తెలియాలని  అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ బూతులు మాట్లాడలేదని తెలిపారు. దాడులు చేసిన వాళ్లపై కేసులు లేవు.. పట్టాభిపై కేసు పెడతారా అని నిలదీశారు. పట్టాభి అన్న మాట ఏంటో నేను ఇంతవరకు వినలేదన్నారు. పట్టాభి మాటలకు కొత్త అర్ధాలు తీసి దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు.  పోలీసులు, అధికారులకు భయపడి మేం సరెండర్ కావాలా అని చంద్రబాబు అన్నారు.  36 గంటల దీక్షను విరమించిన చంద్రబాబు.. ఆవేశంగా మాట్లాడారు. 70 లక్షల మంది కార్యకర్తల మనోభావాలు ఇక్కడున్నాయని, దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్‌పై దాడి ఉగ్రదాడేనని చంద్రబాబు స్పష్టం చేశారు. 100 గజాల దూరంలో డీజీపీ ఆఫీస్‌ ఉందని, డీజీపీ సరైన చర్యలు తీసుకుంటే ఇది జరిగేదా..? అని ప్రశ్నించారు. ఏపీని డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారని ధ్వజమెత్తారు. ఇష్టానుసారంగా పాలసీలు డిసైడ్‌ చేయడానికి వీల్లేదన్నారు. కల్తీ మద్యంతో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. డ్రగ్స్‌తో ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో సమాధానం చెప్పాలని  డిమాండ్ చేశారు. డ్రగ్స్‌పై టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. ఏపీలో లక్ష కోట్ల డ్రగ్స్‌ ఉన్నట్టు మీడియా కథనాలు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. 

ప్రచారం ముగిసే రోజు నుంచి కోడ్ అమలట.. ఏపీ ఎన్నికల కమిషన్ స్పెషల్..

తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలో బద్వేల్ అసెంబ్లీ నియోజక వర్గాలకు.. అదే విధంగా దేశంలో మరికొన్ని రాష్ట్రాలలో ఇంకొన్ని అసెంబ్లీ స్థానాలకు ఈ నెల అంటే, అక్టోబర్ 30 పోలింగ్ జరుగుతుంది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 28 న కేంద్ర ఎన్నికల కేంద్ర షెడ్యూలు విడుదల చేసింది. అదే రోజు నుంచి ఎన్నికల నియమావళి, ఎలక్షన్ కోడ్  అమలులోకి వచ్చేసింది ... అని కదా అనుకుంటున్నాం .. కానీ, అది తప్పు .. ఉయ్ ఆర్ రాంగ్... మనం తప్పులో కాలేశాం. షెడ్యూలు ప్రకారం నోటిఫికేషన్, నామినేషన్ల ఘటం ముగిసి ప్రచారపర్వం  సాగుతోంది. అదంతా ఓకే ...అలాగే రేపు అక్టోబర్ 30 పోలింగ్ ... నవంబర్ 2 న ఓట్ల లెక్కింపు అన్నీ కూడా ... యథాతథంగానే ఉంటాయి .. అలాగే జరిగి పోతాయి ... కానీ...ఎలక్షన్ కోడ్ మాత్రం  మీరు, నేను, మనం అనుకుంటున్నట్లుగా  సెప్టెంబర్ 28 రాలేదు ... అక్టోబర్ 28వస్తుంది.. ఏంటి .. నీకేమన్నా మెంటలా ..తల తిరుగుతోందా .. అక్టోబర్ 28 కి ప్రచారం కూడా ముగిసి పోతుంది ..ఆరోజున ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడం ఏమిటో, తిక్క సన్నాసి అంటారా? అలాయితే మీరు ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అక్టోబర్ 22న విడుదల చేసిన ఈ ప్రెస్ నోట్ ..చూడండి ..ఆ తర్వాత తిక్క ..పిచ్చ ..తల తిరుగుడు ఎవరికో .. మీరే డిసైడ్ చేసుకోండి  ఏపీ ఎన్నికల కమిషన్ ప్రెస్ నోట్..  The election commission of India has announced schedule for bye – election to 124 – Badvel (SC) Assembly constituency of Andhra Pradesh State vide press note no .ECI1/PN/83/202, dated 28  September, 2021 and the MODEL CODE OF CONDUCT came into effect from 28.10.2021../అని కదా ఉంది అంటే ఏంటి...పోలింగ్’కు రెండు రోజుల ముందు ఈనెల (అక్టోబర్) 28 ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తుంది ... చుసారా.. ఏముందో.. మరి ఇంత వరకు అమలులో ఉన్నది ఏమిటీ... అంటారా.. అదేమిటో శ్రీ కమిషన్ వారే సెలవియ్యాలి.... 

పులులు కాదు పిల్లులు.. గంట క‌ళ్లు మూసుకుంటే.. మాకూ బీపీ.. టాప్‌న్యూస్ @7pm

1. కొన్ని పిల్లులు తాము పుల‌ల‌మ‌నుకుంటున్నాయి.. మా పార్టీ ఆఫీసులో ప‌గిలింది అద్దాలు మాత్ర‌మే.. మా కార్య‌క‌ర్త‌ల గుండెల‌ను మీరు గాయ‌ప‌ర‌చ‌లేరు.. ఒక చెంప మీద కొడితే రెండు చెంప‌లు వాయ‌గొడ‌తాం.. అంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ వైసీపీని తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు. ప‌సుపు జెండా చూస్తే వైసీపీ శ్రేణుల‌కు ఎందుకంత భ‌య‌మ‌ని ప్ర‌శ్నించారు. ఏపీలో గంజాయి దందా బాగా న‌డుస్తోంది.. దీనిపై నిల‌దీస్తే టీడీపీ కార్యాల‌యంపై దాడి చేశార‌ని మండిప‌డ్డారు. ఏపీ సీఎంగా మ‌ళ్లీ చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం ఖాయ‌మ‌న్నారు నారా లోకేశ్‌.  2. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయ‌న‌ గంట కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామంటూ పరిటాల సునీత వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘మాలో ప్రవహించేది సీమ రక్తమే’’ అన్నారు. తన భర్తను చంపినప్పుడు కూడా ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామని.. ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదని హెచ్చ‌రించారు. ఇక‌నైనా చంద్రబాబు తీరు మారాల‌న్నారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీకి చుక్కలు చూపిస్తామని పరిటాల సునీత గ‌ట్టిగా హెచ్చరించారు.  3. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష స్థానానికి నామినేషన్ల గడువు ముగిసింది. కేసీఆర్ పేరును బలపరుస్తూ మొత్తం 18 నామినేషన్లు దాఖలు అయ్యాయి. దీంతో కేసీఆర్ ఎన్నిక లాంఛనమే కానుంది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష స్థానానికి వచ్చిన నామినేషన్లను శనివారం పరిశీలిస్తారు. ఈ నెల 25న టీఆర్ఎస్ ప్లీనరీ జరుగనుంది. ప్లీనరీలో టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 వసంతాలు కావడంతో 25న పార్టీ తరపున ద్విదశాబ్ది ఉత్సవాలను నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.  4. టీడీపీ ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ సీఎం జ‌గ‌న్‌రెడ్డితో పాటు మంత్రుల‌పై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. ‘‘మంత్రి పదవి కోసమే ఇన్నాళ్లూ కొడాలి నాని టీడీపీ నేతలను తిట్టారు. త్వరలోనే ఆయన పదవి పోవడం ఖాయం. జగన్‌కే కాదు.. గాడ్సేకు కూడా అభిమానులున్నారు. మేమూ ఉప్పూకారం తింటున్నాం.. మాకూ బీపీ వస్తుంది’’ అని చింతమనేని ప్రభాకర్ హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ఎన్నికల జరగాల్సిన స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ ఇస్తే వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తామన్నారు చింతమనేని.  5. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలని కోరుతూ నవంబర్ 1 నుంచి రైతులు మహా పాదయాత్ర చేప‌డుతున్నారు. తుళ్లూరు గ్రామం నుంచి తిరుమల వరకు 45 రోజుల పాటు పాద‌యాత్ర కొన‌సాగనుంది. డిసెంబర్ 17వ తేదీతో పాదయాత్ర ముగియనుంది. మహా పాదయాత్రకు పలు పార్టీల మద్దతు కూడ‌గ‌డుతున్నారు. తాజాగా, మహా పాదయాత్రకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతును రాజధాని రైతుల ప్రతినిధులు కోరారు. శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్‌ను రైతులు కలిసారు. 6. న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు గతేడాది నవంబర్‌ 11న దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 16 మందిపై 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. విదేశాల్లో ఉన్న నిందితులపై ఏవిధంగా చర్యలు తీసుకోవాలో చూడాలని గతంలో హైకోర్టు ఆదేశించ‌గా.. ఆ దిశగా సీబీఐ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  7. చిత్తూరు జిల్లాలో వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో చంద్రబాబుపై రెస్కో చైర్మన్‌ జీఎస్‌ సెంథిల్‌కుమార్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ‘చంద్రబాబూ.. కుప్పం వస్తే కారు మీద బాంబు వేస్తా.. దమ్ముంటే కుప్పంకి రా రా..’ అంటూ బ‌రితెగింపు మాట‌లు మాట్లాడారు. ఎంపీ రెడ్డెప్ప సమక్షంలోనే ఇలా రెచ్చిపోయారు. చంద్ర‌బాబుపై వైసీపీ లీడ‌ర్ సెంథిల్‌కుమార్ చేసిన తీవ్ర వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సెంథిల్‌కుమార్‌పై టీడీపీ శ్రేణులు భ‌గ్గు మంటున్నాయి. 8. అమ్మను వదిలేసినవాడు అమ్మఒడి ఇస్తాడా? అని అమరావతి జేఏసీ అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘‘చెల్లిని వదిలేసిన వాడికి సెంటిమెంట్స్ ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి తన సమాధిని తానే కట్టుకుంటున్నాడు. అరాచకంతో అధికారంలోకి వచ్చిన ఏ నాయకుడూ పూర్తికాలం అధికారంలో లేడు. ఈరోజు నుంచి సీఎం జగన్ గంజాయి ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చినవారే సమాధి చేస్తారు. తాడేపల్లి నుంచి తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్ కోసం ప్రజలంతా తిరగబడాలి. సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు జగన్ అరాచకాన్ని సృష్టించాడు’’ అని కొలికపూడి మండిప‌డ్డారు.  9. తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. నవంబర్, డిసెంబర్ నెల‌లకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టికెట్లను ఆన్‌లైన్లో ఉంచింది. రోజుకి 12 వేల చొప్పున 7.8 లక్షల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. అయితే, నాలుగు గంటల్లోనే ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయాలు పూర్తయ్యాయి. ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయంతో టీటీడీకి 21 కోట్ల రాబడి వచ్చింది.  10. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో 100 కోట్ల మైలురాయిని అధిగ‌మించిన సంద‌ర్భంగా ఈ ప్రయాణాన్ని ‘ఆందోళన నుంచి భరోసా’ వరకు అని ప్ర‌ధాని మోదీ అభివర్ణించారు. ‘‘దాదాపు 100 ఏళ్ల తర్వాత మానవాళి ఇంతటి ఘోరమైన మహమ్మారిని ఎదుర్కొంటోంది. కన్పించని శత్రువు వేగంగా పాకుతుంటే ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితుల్లో పడిపోయాం. అలాంటి ఆందోళనల నుంచి బయటపడి టీకాలు తయారుచేసుకున్నాం. ఇప్పుడు 100 కోట్ల మైలురాయిని దాటుకుని మహమ్మారి నుంచి బయటపడగలమనే భరోసా ఇవ్వగలుగుతున్నాం. ఈ ప్రయాణంతో మనం మరింత బలంగా మారాం. దీని కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని మోదీ అన్నారు. 

కొన్ని పిల్లులు పులులమని భావిస్తున్నాయి.. అస‌లు సినిమా ముందుంది.. లోకేశ్ ఫైర్‌

మా పార్టీ ఆఫీసులో ప‌గిలింది అద్దాలు మాత్ర‌మే.. మా కార్య‌క‌ర్త‌ల గుండెల‌ను మీరు గాయ‌ప‌ర‌చ‌లేరు.. ఒక చెంప మీద కొడితే రెండు చెంప‌లు వాయ‌గొడ‌తాం.. అంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ వైసీపీని తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు. ప‌సుపు జెండా చూస్తే వైసీపీ శ్రేణుల‌కు ఎందుకంత భ‌య‌మ‌ని ప్ర‌శ్నించారు. ఏపీలో గంజాయి దందా బాగా న‌డుస్తోంది.. దీనిపై నిల‌దీస్తే టీడీపీ కార్యాల‌యంపై దాడి చేశార‌ని మండిప‌డ్డారు. ఏపీ సీఎంగా మ‌ళ్లీ చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం ఖాయ‌మ‌న్నారు నారా లోకేశ్‌.  వైసీపీ దాడులను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష క్లైమాక్స్‌కు చేరింది. మంగ‌ళ‌గిరి ఎన్టీఆర్‌భవన్‌కు రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి టీడీపీ నాయ‌కులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి లోకేశ్‌ మాట్లాడుతూ.. వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఏకిపారేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క పరిశ్రమ రాకపోయినా.. రాష్ట్రంలో గంజాయి పరిశ్రమ మాత్రం బాగా నడుస్తోందని విమర్శించారు. గంజాయితో యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని నిలదీస్తే టీడీపీ ఆఫీసుల‌పై దాడులు చేశారని విమర్శించారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయించడం దారుణమన్నారు. ఎవరూ లేని సమయంలో వైసీపీ మూకలు దాడిచేశారు.. దమ్ముంటే ఇప్పడు రావాలని సవాల్‌ విసిరారు నారా లోకేశ్‌.   చట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వారు ఎక్కడున్నా రాబోయే రోజుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని లోకేశ్‌ హెచ్చరించారు.  ‘‘పసుపు జెండా చూస్తే మీకు ఎందుకంత భయం. కొన్ని పిల్లులు.. పులులమని భావిస్తున్నాయి. మా ఆఫీసులో పగిలింది అద్దాలు మాత్రమే.. మా కార్యకర్తల గుండెలు మీరు గాయపరచలేరు. టీడీపీ కార్యకర్తలు కేసులకు భయపడక్కర్లేదు. ఒక చెంప మీద కొడితే .. రెండు చెంపలు వాయగొడతాం. జగన్‌రెడ్డిలా నేను చిన్నాన్న జోలికి వెళ్లలేదు. జగన్‌ మగాడైతే చిన్నాన్న హత్య కేసు తేల్చాలి. రెండున్నరేళ్లు ఆగండి.. చంద్రబాబే మళ్లీ సీఎం. 2024లో మంగళగిరిలో టీడీపీని గెలిపించి కానుకగా ఇస్తా. వైసీపీకి ట్రైలర్‌ మాత్రమే చూపించాం.. సినిమా ముందుంది’’ అంటూ లోకేశ్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.   

వైసీపీకి బిగ్ షాక్‌.. ఆ కేసులో ఆరుగురి అరెస్ట్‌...

జ‌గ‌న్‌ను చూసుకొని రెచ్చిపోయారు. అభిమానం అరాచ‌కంగా మారింది. త‌మ‌నెవ‌రు అడిగేద‌ని విర్ర‌వీగారు. సోష‌ల్ మీడియాలో నోటికొచ్చిన‌ట్టు వాగారు. ఇష్టం వ‌చ్చిన‌ట్టు పోస్టులు పెట్టారు. అయితే, టీడీపీని విమ‌ర్శించిన‌ట్టు హైకోర్టు తీర్పుల‌ను త‌ప్పుబ‌డితే న్యాయ‌స్థానం ఊరుకుంటుందా? అదే చేస్తోంది. త‌మ జ‌డ్జిమెంట్‌పై సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు పోస్టులు పెట్టిన వారంద‌రి సంగ‌తి తేల్చమంటూ సీబీఐని ఆదేశించింది. రంగంలోకి దిగిన సీబీఐ.. వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ సోష‌ల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టిన వారంద‌రిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తోంది. ఆ కేసులో తాజాగా మ‌రో ఆరుగురిని అరెస్ట్ చేసింది. న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకటసత్యనారాయణ, గూడ శ్రీధర్‌రెడ్డి, శ్రీనాథ్‌ సుస్వరం, కిషోర్‌ కుమార్‌ దరిస, సుద్దులూరి అజయ్‌ అమృత్‌లను అరెస్టు చేసినట్టు సీబీఐ వెల్లడించింది.  హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు గతేడాది నవంబర్‌ 11న దర్యాప్తు ప్రారంభించారు.  మొత్తం 16 మందిపై 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఏపీ సీఐడీ అధికారుల నుంచి వివరాలు సేక‌రించారు. గతంలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వేర్వేరుగా ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేశారు. మరింత లోతుగా దర్యాప్తు జరిపిన సీబీఐ తాజాగా ఆరుగురిని అరెస్టు చేసింది. విదేశాల్లో ఉన్న నిందితులపై ఏవిధంగా చర్యలు తీసుకోవాలో చూడాలని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా సీబీఐ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల్లో ఉంటూ, వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. టీడీపీని విమ‌ర్శిస్తున్న కొంద‌రు.. అదే రీతిన న్యాయ‌మూర్తులు, న్యాయ‌స్థానాల‌పైనా ఇష్టం వ‌చ్చిన‌ట్టు పోస్టులు పెట్ట‌డంతో.. ఇప్పుడు వారంద‌ని భ‌ర‌తం ప‌ట్టేందుకు సీబీఐ చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వ‌డం వైసీపీ శ్రేణుల‌కు షాకింగ్ ప‌రిణామం..అంటున్నారు.   

తుళ్లూరు టూ తిరుమ‌ల‌.. అమరావతి రైతుల మహా పాదయాత్ర.. జ‌న‌సేన స‌పోర్ట్‌!

దాదాపు రెండేళ్లుగా ఉద్య‌మిస్తున్నారు. ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తిని కాల‌రాయొద్దంటూ పోరాడుతున్నారు. రాజ్యం ఎంత ఒత్తిడి తెస్తున్నా.. కేసుల‌తో ఎంత‌గా ఉక్కుపాదం మోపుతున్నా.. త‌గ్గేదే లే అంటూ అమ‌రావ‌తి రైతులు మొక్క‌వోని దీక్ష చేస్తున్నారు. కొవిడ్ కార‌ణంగా ఉధృతి కాస్త స‌ద్దుమ‌నగ‌గా.. మ‌రోసారి రాజ‌ధాని రైతులు ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణ‌కు ప‌దును పెట్టారు.  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలని కోరుతూ నవంబర్ 1 నుంచి రైతులు మహా పాదయాత్ర చేప‌డుతున్నారు. తుళ్లూరు గ్రామం నుంచి తిరుమల వరకు 45 రోజుల పాటు పాద‌యాత్ర కొన‌సాగనుంది. డిసెంబర్ 17వ తేదీతో పాదయాత్ర ముగియనుంది.  మహా పాదయాత్రకు పలు పార్టీల మద్దతు కూడ‌గ‌డుతున్నారు. తాజాగా, మహా పాదయాత్రకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతును రాజధాని రైతుల ప్రతినిధులు కోరారు. శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్‌ను రైతులు కలిసారు. రెండేళ్లుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని రైతులు ఆరోపించారు. అమరావతి పరిరక్షణలో భాగంగా మహా పాదయాత్ర తలపెట్టినట్లు రైతులు చెప్పారు. రాజధాని కోసం మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్, మనోహర్‌లు మహా పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని రైతులు, జేఏసీ నేతలలు విజ్ఞప్తి చేసారు. రైతుల మహా పాదయాత్ర  విజయవంతం కావాలని మనోహర్ ఆకాంక్షించారు.   

రేవంత్‌రెడ్డికి భ‌ట్టి హ్యాండిస్తారా? కేసీఆర్ స్కెచ్ వ‌ర్క‌వుట్ అయ్యేనా?

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. కానీ, పార్టీ సీనియర్లలో మాత్రం ఇంకా కదలిక రాలేదు. సీతక్క, షబ్బీర్ అలీ, మధు యాష్కి వంటి కొద్ది మంది రేవంత్ రెడ్డి అడుగులో అడుగేసి నడుస్తున్నా, ఇతర సీనియర్ నాయకులు వెయిట్ అండ్ వాచ్ మూడ్’లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, సీనియర్ల స్తబ్దతకు ఇంకా కారణాలున్నా ఇప్పట్లో ఎన్నికలు లేక పోవడం కూడా సీనియర్ నాయకుల స్లీపింగ్ మోడ్’కు కారణమని కొందరు పార్టీ నేతలు అంటున్నారు. అలాగే, జాతీయ స్థాయిలో పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో ‘సెట్’ అవలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడితేనే గానీ, కాంగ్రెస్ ఫ్యూచర్ మీద క్లారిటీ రాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో అంతవరకు వెయిట్ అండ్ వాచ్ పాలసీ ఫాలో కావడం ఉత్తమం అనే స్టేట్ సీనియర్ నాయకులు కూడా ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. అలాగే, ఈ లోగా హుజూరాబాద్’ ఫలితంతో స్టేట్ సీన్’లో కూడా ఇంకొంత క్లారిటీ వస్తుందని, ఏ రకంగా చూసినా, ప్రస్తుతానికి వెయిట్ అండ్ వాచ్’ ఉత్తమం అనే అభిప్రాయమే పార్టీ సీనియర్ లీడర్స్’లో ఉందని అంటున్నారు.   అదలా ఉంటే, అధికార తెరాస మరో సారి కొందరు సీనియర్ లీడర్ల ఎగరేసుకు పోయేందుకు పావులు కదుపుతోంది. జాబితా కొంచెం పెద్దగానే ఉన్నా, ఫస్ట్ ప్రయారిటీ మాత్రం, సీఎల్పీ నేత బట్టి విక్రమార్కదే అంటున్నారు. రేవంత్ రెడ్డి దూకుడును తగ్గించి, కాంగ్రెస్ స్పీడ్’కు బ్రేకులు వేసేందుకు భట్టి విక్రమార్క వంటి సీనియర్ అండ్ సిన్సియర్ లీడర్’ను తమ వైపుకు తిప్పుకోవడం అవసరమని తెరాస నాయకత్వం భావిస్తోంది. ఈ నేపధ్యంలోనే ఎలాగైనా భట్టిని బుట్టలో వేసుకునేందుకు, ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తడం మొదలు, దళిత బంధు పథకం విస్త‌రణలో భాగంగా ప్రభుత్వం ఎంపిక చేసిన నియోజక వర్గాల్లో భ‌ట్టి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా చేర్చింది. అంతే కాదు, మిగిలిన, సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలకు రూ .50 కోట్లు చొప్పున  విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, భట్టి నియోజక వర్గం మధిర నియోజకవర్గానికి మాత్రం రూ .100 కోట్లు విడుదల చేసి, ప్రత్యేక ప్రేమను వ్యక్త పరిచారు.   నిజానికి అంతకు ముందు నుంచి భట్టి పై కేసేఆర్ ప్రేమ పొంగుతున్నా, మ‌రియ‌మ్మ లాక‌ప్ డెత్ ఇష్యూతో, ‘లవ్ స్టొరీ’ ఓపెన్ అయింది. ఇక అక్కడి నుంచి, దళిత సాధికారిత పేరున తెచ్చిన దళిత బంధును అడ్డుపెట్టుకుని భట్టికి వరసగా బిస్కెట్లు వేస్తూనే ఉన్నారు కేసీఆర్.  తెరాస...ప్రేమ బాణాలు సంధిస్తూనే ఉంది. కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ మీడియా ముచ్చట్ల (చిట్ చాట్ ) లో మరోసారి, మరో వలపుబాణం విసిరారు. భ‌ట్టి లాంటి మంచి నాయకుడిని ప‌క్క‌న‌బెట్టి.. గ‌ట్టి అక్ర‌మార్కులు పార్టీని ఏలుతున్నారంటూ ప్రాసతో కూడిన మరో మెరుపు బాణం వ‌దిలారు.   నిజానికి, భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ విషయంలో ఎక్కడా నెగటివ్ కామెంట్స్ చేయలేదు. రేవంత్ రెడ్డి తనను పక్కన పెట్టారని, కేసీఆర్, కేటీఆర్ చెవిలో ఏమైనా చెప్పారేమో కానీ, బహిరంగంగా మాత్రం ఎక్కడా తనకు రేవంత్ రెడ్డితో విభేదాలున్నాయని సూచన మాత్రంగా అయినా సంకేతాలు ఇవ్వలేదు. అయినా కేటీఆర్ ఆయనకేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పడం ద్వారా భట్టిని బుట్టలో వేసుకునేందుకు ఏస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చును. అయితే, భట్టిని బుట్టలో వేసుకోవడం అన్ని పార్టీలు తిరిగి వచ్చిన మోత్కుపల్లిని బుట్టలో వేసుకున్నంత ఈజీ కాదని, పార్టీ, సిద్ధాంత నిబద్దత గల భట్టి విషయంలో తెరాస నాయకులకు భంగపాటు తప్పదని అంటున్నారు భట్టి కమిట్మెంట్ తెలిసిన కాంగ్రెస్ నాయకులు.

చంద్రబాబు మీద బాంబు వేస్తా.. వైసీపీ లీడ‌ర్ బ‌రితెగింపు.. కుప్పంలో హైటెన్ష‌న్‌

ఇప్ప‌టికే ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాల‌యాల‌పై వైసీపీ మూక‌లు దాడులు చేశారు. ప‌లువురు టీడీపీ నాయ‌కుల‌పై కేసులు బ‌నాయించి జైలుకు త‌ర‌లించారు. ఇక మంత్రుల బెదిరంపుల‌కైతే హ‌ద్దే లేదు. చేసింది చాల‌ద‌న్న‌ట్టు.. కొంత‌మంది వైసీపీ నాయ‌కులు మ‌రీ ఓవ‌ర్‌గా మాట్లాడుతున్నారు. ఏకంగా చంద్ర‌బాబు నాయుడినే అంతం చేస్తామంటూ బెదిరింపుల‌కు దిగుతున్నారు. జ‌గ‌న్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్య‌ల‌ను, నాయ‌కుల‌ను ఎంక‌రేజ్ చేస్తుండ‌టంతో.. మంత్రుల నుంచి చోటామోటా లీడ‌ర్ల వ‌ర‌కూ అంతా నోటికొచ్చిన‌ట్టు వాగుతున్నారు.  తాజాగా.. చిత్తూరు జిల్లాలో వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో చంద్రబాబుపై ఓ నేత రెచ్చిపోయి తీవ్ర పదజాలం వాడారు. ‘చంద్రబాబూ.. కుప్పం వస్తే కారు మీద బాంబు వేస్తా.. దమ్ముంటే కుప్పంకి రా రా..’ అంటూ బ‌రితెగింపు మాట‌లు మాట్లాడారు. ఇలా వాగింది ఏ సాదాసీదా చిల్ల‌ర నాయ‌కుడో కాదు. ఆయ‌న బాధ్యతాయుత పదవిలో ఉన్న రెస్కో చైర్మన్‌ జీఎస్‌ సెంథిల్‌కుమార్‌.  కుప్పంకు వ‌స్తే చంద్ర‌బాబు కారు మీద బాంబులేస్తానంటూ సెంథిల్‌కుమార్ ఏకంగా ఎంపీ రెడ్డెప్ప సమక్షంలో రెచ్చిపోయారు. సెంథిల్ అలా వాగుతుంటే.. ఎంపీ రెడ్డెప్పతో సహా అక్క‌డున్న వారెవ‌రూ ఆయ‌న్ను క‌నీసం ఆపే ప్రయత్నం చేయకపోవడం విడ్డూరం. చంద్ర‌బాబుపై బాంబులేస్తాన‌ని బెదిరించ‌డ‌మే కాదు.. ఇంకా చాలా బూతులే మాట్లాడారు సెంథిల్‌కుమార్‌.  చంద్ర‌బాబుపై వైసీపీ లీడ‌ర్ సెంథిల్‌కుమార్ చేసిన తీవ్ర వ్యాఖ్య‌లు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆ మాట‌ల వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సెంథిల్‌కుమార్‌పై టీడీపీ శ్రేణులు భ‌గ్గు మంటున్నాయి. సెంథిల్ కుమార్ వ్యాఖ్య‌ల‌తో కుప్పంలో తీవ్ర‌ ఉద్రిక్తత త‌లెత్తింది. టీడీపీ అధినేతపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వైసీపీ నేతపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వారికి పోటీగా వైసీపీ శ్రేణులూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. దీంతో ఇరువర్గాలు రోడ్డుపై బాహాబాహీకి దిగారు. తోపులాట తీవ్రస్థాయికి చేరడంతో భారీగా పోలీసుల మోహరించారు. టీడీపీ శ్రేణుల నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకొని.. ఇరువర్గాలకూ నచ్చజెప్పి పంపించేశారు పోలీసులు.  బోసిడీకే అన్నందుకే ప‌ట్టాభిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.. టీడీపీ కార్యాల‌యాల‌పై దాడులు చేశారు.. మ‌రి, చంద్ర‌బాబు కారుపై బాంబులేస్తాన‌ని బెదిరించిన వైసీపీ నాయ‌కుడు సెంథిల్‌కుమార్‌పై పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.

మేమూ ఉప్పూకారం తింటున్నాం.. మాకు బీపీ వస్తే జగన్ తాట తీస్తాం..

చంద్ర‌బాబు చేప‌ట్టిన 36 గంట‌ల నిర‌వ‌ధిక దీక్షలో టీడీపీ నాయ‌కులు సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై చెల‌రేగిపోతున్నారు. తూటాల్లాంటి మాట‌ల‌తో వైసీపీ ప్ర‌భుత్వాన్ని తూట్లు పొడుస్తున్నారు. ఒక్కో నేత ఒక్కో ర‌కంగా వార్నింగ్ ఇస్తున్నారు. అందరిలోకీ ప‌రిటాల సునీత చేసిన హెచ్చ‌రిక హైలైట్‌. టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక గంట క‌ళ్లు మూసుకుంటే చాలు.. తామేంటో చూపిస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.  ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఏపీని చంద్రబాబు రామరాజ్యంగా మారిస్తే, జగన్ రాక్షస రాజ్యంగా మార్చారని విమర్శించారు. తెలుగు తమ్ముళ్లకు బీపీ వస్తే జగన్ తాట తీస్తారని హెచ్చరించారు. వైసీపీ తాకాటు చప్పుళ్లకు భయపడమని.. 2024లో టీడీపీదే అధికారమని బుద్దా వెంకన్న అన్నారు.  ఇక మ‌రో ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్ చింత‌మ‌నేని సైతం ఓ రేంజ్‌లో జ‌గ‌న్‌రెడ్డిని, మంత్రుల‌ను దుయ్య‌బ‌ట్టారు. ‘‘మంత్రి పదవి కోసమే ఇన్నాళ్లూ కొడాలి నాని టీడీపీ నేతలను తిట్టారు. త్వరలోనే ఆయన పదవి పోవడం ఖాయం. జగన్‌కే కాదు.. గాడ్సేకు కూడా అభిమానులున్నారు. మేమూ ఉప్పూకారం తింటున్నాం.. మాకూ బీపీ వస్తుంది’’ అని చింతమనేని ప్రభాకర్ హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ఎన్నికల జరగాల్సిన స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ ఇస్తే వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తామన్నారు చింతమనేని.  మ‌రోవైపు.. అమ్మను వదిలేసినవాడు అమ్మఒడి ఇస్తాడా? అని అమరావతి జేఏసీ అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘‘చెల్లిని వదిలేసిన వాడికి సెంటిమెంట్స్ ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి తన సమాధిని తానే కట్టుకుంటున్నాడు. అరాచకంతో అధికారంలోకి వచ్చిన ఏ నాయకుడూ పూర్తికాలం అధికారంలో లేడు. ఈరోజు నుంచి సీఎం జగన్ గంజాయి ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చినవారే సమాధి చేస్తారు. తాడేపల్లి నుంచి తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్ కోసం ప్రజలంతా తిరగబడాలి. సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు జగన్ అరాచకాన్ని సృష్టించాడు’’ అని కొలికపూడి మండిప‌డ్డారు.   

రేవంత్‌రెడ్డి ఇమేజ్ అదుర్స్‌.. ఇత‌ర రాష్ట్రాల్లోనూ రీసౌండ్‌...

రేవంత్‌రెడ్డి. ఇప్పుడిది పేరు మాత్ర‌మే కాదు ఓ ప‌వ‌ర్‌. కాంగ్రెస్‌కు ప‌వ‌ర్ బూస్ట‌ర్‌. టీపీసీసీ ప‌గ్గాలు చేప‌ట్టాక రేవంత్‌రెడ్డి పేరు తెలంగాణ వ్యాప్తంగా మ‌రింత మారుమోగుతోంది. తెలంగాణ‌లో ఏ ఇద్ద‌రు క‌లిసినా రేవంత్‌రెడ్డి దూకుడు గురించే మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్‌పై, టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఆయ‌న చేసే ప‌దునైన‌ విమ‌ర్శ‌ల గురించే చ‌ర్చించుకుంటున్నారు. ఇలా, కొంత‌కాలంతా రాష్ట్ర‌మంతా రేవంత్‌రెడ్డి హ‌వా న‌డుస్తోంది. మ‌న‌కు ఇంత వ‌ర‌కే తెలుసు. కానీ, రేవంత్‌రెడ్డి టాపిక్ కేవ‌లం తెలంగాణ‌కే ప‌రిమితం కాలేద‌ని.. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నాయ‌కుల దృష్టిలోనూ రేవంత్‌రెడ్డి ఉన్నార‌ని తాజా ప‌రిణామంతో స్ప‌ష్ట‌మైంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... పంజాబ్ మాజీ సీఎం అమ‌రీంద‌ర్‌సింగ్ తెలుసుగా. ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి సొంత పార్టీ ఏర్పాట్ల‌లో బిజీగా ఉన్నారు. బీజేపీతో పొత్తుకూ సై అన్నారు. అమ‌రీంద‌ర్ ఎపిసోడ్ ఇప్పుడు ఇటు పంజాబ్‌లో, అటు కాంగ్రెస్‌లో వాడివేడి ర‌గిలిస్తోంది. బీజేపీతో జ‌త‌క‌ట్ట‌డంపై కాంగ్రెస్ వాదులు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లూ చేస్తున్నారు. సెక్క్యూల‌రిజం ఏమందంటూ కుళ్ల‌బొడుస్తున్నారు. ఒళ్లుమండిన అమ‌రీంద‌ర్‌.. రివర్స్ అటాక్‌కు దిగారు. మీ కాంగ్రెస్ నేత‌లేమైనా సెక్యుల‌రిస్టులా? అంటూ సిద్ధూ గ‌తంలో బీజేపీలో లేరా? తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆర్ఎస్ఎస్ వాది కాదా? అంటూ ఎదురు ప్ర‌శ్నించారు. ఇంత‌టి కీల‌క‌మైన విమ‌ర్శ‌లోనూ పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్‌సింగ్ నోటి నుంచి రేవంత్‌రెడ్డి పేరు రావ‌డ‌మే ఇక్క‌డ ఇంట్రెస్టింగ్ పాయింట్‌.  రేవంత్‌రెడ్డి ఆర్ఎస్ఎస్ వాది అవునా? కాదా? అనేది పెద్ద‌గా ప్రాధాన్యం లేని విష‌యం. బ‌హుషా విద్యార్థి ద‌శ‌లో రేవంత్‌ ఏబీవీపీలో ఉన్నందుకు కాబోలు ఆయ‌న‌లా అని ఉంటార‌ని అంటున్నారు. అయితే, రేవంత్‌రెడ్డి గురించి అంత చిన్న డీటైల్ కూడా.. ఆయ‌న‌ స్టూడెంట్ లైఫ్ గురించి కూడా.. పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమ‌రీంద‌ర్‌సింగ్‌కు తెలిసి ఉండ‌ట‌మే ఆస‌క్తిక‌ర‌మైన అంశం. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి విష‌యంలో ఎంత డీప్ డిస్క‌ష‌న్ జ‌రిగి ఉంటుందో.. దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ పెద్ద స్థాయి నాయ‌కులంద‌రికీ రేవంత్‌రెడ్డి గురించి ఎంత‌లా అప్‌డేట్ ఉండి ఉంటుందో.. అమ‌రీంద‌ర్‌సింగ్ వ్యాఖ్య‌ల‌తో అర్థ‌మైపోతోంద‌ని అంటున్నారు. రేవంత్‌రెడ్డిని జాతీయ కాంగ్రెస్‌ పూర్తిగా స్ట‌డీ చేశాకే.. పార్టీలో చేరిన వెంట‌నే వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఆ త‌ర్వాత పీసీసీ ప్రెసిడెంట్ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టార‌ని చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి చిచ్చ‌ర‌పిడుగు కాబ‌ట్టే.. తెలంగాణ‌లోనే కాదు పంజాబ్‌లోనూ ఆయ‌న పేరు రీసౌండ్ అవుతోంది. అందుకే, రేవంత్‌రెడ్డినా.. మ‌జాకా.. అంటున్నారు అభిమానులు.  

గంట క‌ళ్లు మూసుకుంటే మేమేంటో చూపిస్తాం.. మాకూ బీపీ వ‌స్తోందంటూ ప‌రిటాల వార్నింగ్‌..

ప‌రిటాల ఫ్యామిలీ. రాయ‌లసీమ‌లో ప‌రిటాల స‌త్తా ఎంతో తెలుసుగా. ఒక‌ప్పుడు కంటిచూపుతోనే సీమ‌ను శాసించేవారు. రాష్ట్ర రాజ‌కీయాల‌ను మార్చేసేవారు. అప్ప‌ట్లో ప‌రిటాల ర‌వీంద్ర చెప్పిందే వేదం.. చేసిందే శాస‌నం. న‌క్స‌లిజం, ఫ్యాక్ష‌నిజం, రాజ‌కీయం.. అన్నిటినీ మిక్స్ చేసి.. సీమ‌లో మొన‌గాడిలా నిలిచారు. ఆయ‌నిప్పుడు లేకున్నా.. ప‌రిటాల బ‌లం, బ‌ల‌గం చెక్కు చెద‌ర‌లేదు. డౌట్ ఉంటే అనంత‌పురం జిల్లాలో ఏ ఒక్క‌రిని అడిగినా చెబుతారు.   టీడీపీకి వెన్నుద‌న్నుగా ఉండే ప‌రిటాల ఫ్యామిలీ ఇప్పుడు ఆగ్ర‌హంతో ఊగిపోతోంది. దేవాల‌యంలాంటి టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై వైసీపీ మూక‌లు దాడి చేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. చేసిన దాడులు స‌రిపోవ‌న్న‌ట్టు.. తాజాగా సీమకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విజ‌య‌వాడ‌లో కాబ‌ట్టి దాడుల‌తో స‌రిపోయింది.. అదే మా సీమ‌లో అయితే ఖూనీలు జ‌రిగేవంటూ మ‌రింత రెచ్చ‌గొట్టేలా మాట్లాడ‌టం క‌ల‌క‌లం రేపింది. దీంతో.. టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ దాడులు, మంత్రుల బూతులు, వైసీపీ రెచ్చ‌గొట్ట‌డంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత ప‌రిటాల సునీత తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గంట కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామంటూ పరిటాల సునీత వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘మాలో ప్రవహించేది సీమ రక్తమే’’ అన్నారు. తన భర్తను చంపినప్పుడు కూడా ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామని.. ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదని హెచ్చ‌రించారు. ఇక‌నైనా చంద్రబాబు తీరు మారాల‌న్నారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీకి చుక్కలు చూపిస్తామని పరిటాల సునీత గ‌ట్టిగా హెచ్చరించారు.   

అరాచ‌క ప్ర‌భుత్వాన్ని త‌రిమి కొడ‌తాం.. టీడీపీ స్ట్రాంగ్ వార్నింగ్‌..

ఏపీలో అరాచక ప్రభుత్వం నడుస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిప‌డ్డారు. సీఎం జగన్‌రెడ్డి పాలనలో అరాచకత్వం రాజ్యమేలుతోందని విమర్శించారు. పట్టాభి ఇంటిపై వైసీపీ గూండాలు దాడి చేశారు.. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై గంజాయి బ్యాచ్‌తో దాడి చేయించారు.. ఇలాంటి దాడులకు భయపడబోమన్నారు దేవినేని ఉమా.  జగన్ రెడ్డి గుర్తుంచుకో.. టీడీపీ అధికారంలోకి వస్తుంది. మంత్రులు బరితెగించి బూతులు తిడుతున్నారు. అందరినీ ప్రజాస్వామ్య పద్ధతిలో తరిమి కొడతాం.. అంటూ దేవినేని ఉమా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 11 సీబీఐ, 6 ఈడీ, 18 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జ‌గ‌న్‌రెడ్డి పరిపాలనలో ఇంతకన్నా ఏమీ ఆశిస్తామ‌న్నారు. 28 వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయి గురించి మాట్లాడితే.. ఆ టాపిక్‌ను పక్కదారి పట్టించడానికే ఇలా దాడులు కార్యక్రమం చేశారన్నారు. ప్రజలు విద్యుత్ బాదుడుపై కోపంగా ఉన్నారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు వస్తున్నాయి. మనవాడంటూ ప్రజల్ని ఎలా మోసం చేశారో కడపలో ఓ మాజీ మంత్రి చెప్పారు. ఇలా జ‌గ‌న్ గ్రాఫ్ దారుణంగా ప‌త‌న‌మ‌వుతుండ‌టంతో ఇలా దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. తప్పు చేసిన అధికారుల లిస్టంతా రాస్తున్నాం. అధికారంలోకి వ‌చ్చాక అంద‌రి సంగ‌తీ తేలుస్తాం. జగన్‌రెడ్డికి డీజీపీ సాగిల పడ్డారు. 5 సార్లు కోర్టు మెట్లు ఎక్కారు. ప్రజాస్వామ్యానికి దెబ్బ తగిలింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. అసమర్థ, అవినీతి పాలనపై సీబీఐ విచారణ చేయాలంటూ దేవినేని ఉమ డిమాండ్ చేశారు.   

గంజాయి బ్యాచ్‌తో దాడి!.. వాళ్లు ఆ నాయ‌కుడి అనుచ‌రులేనా?

మంగ‌ళ‌గిరిలోని టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్‌పై దాడి చేసి బీభ‌త్సం సృష్టించారు. ఈ దాడి చేసిన వారిపై టీడీపీ ఫిర్యాదు చేసినా.. ఇంత వ‌ర‌కూ ఎవ‌రినీ అదుపులోకి తీసుకోలేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. దాడి చేసింది త‌న అభిమానులేన‌ని సీఎం జ‌గ‌న్‌రెడ్డినే స్వ‌యంగా ఒప్పుకున్నారు. అందుకే, ఈ కేసులో జ‌గ‌న్‌రెడ్డి పేరు కూడా చేర్చాలంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ డిమాండ్ చేస్తున్నారు. దాడి ఘ‌ట‌న‌లో 70 మందిపై కేసు న‌మోదు చేసి చేతులెత్తేశారు. పైగా బాధితులైన టీడీపీ వ‌ర్గీయుల‌పైనా కేసులు క‌ట్టి.. అరెస్ట్ చేసి.. నాదెండ్ల బ్ర‌హ్మంను జైలుకు కూడా త‌ర‌లించ‌డం మ‌రింత దారుణ‌మైన విష‌యం అంటున్నారు.  మ‌రి, క‌ర్ర‌లు, రాడ్లు, సుత్తిల‌తో దాడి చేసిన వైసీపీ గూండాల‌ను ఇంకా ఎందుకు ప‌ట్టుకోలేక పోతున్నారు? సీసీకెమెరాల్లో ప‌క్కాగా విజువ‌ల్స్ ఉన్నా.. ధ్వంస ర‌చ‌న మొత్తం రికార్డైనా.. ఆ ఫూటేజీ ఆధారంగా నిందితుల‌ను ఎందుకు అరెస్ట్ చేయ‌ట్లేదు? వ‌చ్చిన వారంతా దేవినేని అవినాశ్ మిత్ర‌బృందంకు చెందిన వార‌ని విజ‌య‌వాడ‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. వారంతా గంజాయి బ్యాచ్ అని చెబుతున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన అల్ల‌రిమూక‌ను బెజ‌వాడ వాసులు గుర్తు ప‌డుతున్నారు. మ‌రి, పోలీసులు మాత్రం వారిని గుర్తించ‌క‌పోవ‌డం.. అరెస్ట్ చేసి జైలుకు త‌ర‌లించ‌క‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. పోలీసులు పాల‌క ప‌క్షానికి కొమ్ము కాస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌కు మ‌రింత బ‌లం చేకూర్చుతోంది. టీడీపీ నేత‌లు ప‌ట్టాభి, నాదెండ్ల బ్ర‌హ్మంల అరెస్టు విష‌యంలూ చూపించిన దూకుడు.. టీడీపీ కార్యాల‌యంపై దాడి చేసిన వైసీపీ గూండాలు, గంజాయి బ్యాచ్‌ల‌పై చూపించ‌రా? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి, ఈ ఆరోప‌ణ‌ల‌కు పోలీసుల స‌మాధానం ఏంటి? సీసీ కెమెరా ఫూటేజ్‌లో క్లియ‌ర్‌గా క‌నిపిస్తున్నా.. నిందితులంద‌రినీ అరెస్ట్ చేయ‌క‌పోవ‌డాన్ని ఎలా చూడాలి?    

మ‌చిలీప‌ట్నం నుంచి రాజమండ్రి జైలుకు పట్టాభి తరలింపు.. బెయిల్ వ‌చ్చేనా? క‌స్ట‌డీ కోరేనా?

ఏపీలో ఇంకెవ‌రూ బూతులు మాట్లాడ‌న‌ట్టు.. రాష్ట్రంలో బూతుల‌ను నిషేధించిన‌ట్టు.. టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి ఒక్క‌రే బూతు మాట్లాడిన‌ట్టు.. జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రులకు అస‌లు బూతులే రాన‌ట్టు.. ఒక్క ప‌ట్టాభిపైనే కేసులు పెట్టి.. రాత్రి వేళ ఆయ‌న ఇంటిపై దాడి చేసి.. ఇంటి తలుపులు ప‌గ‌ల‌గొట్టి.. అరెస్ట్ చేసి క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల‌కు వైసీపీ ప్ర‌భుత్వం పాల్ప‌డటంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప‌ట్టాభిని సాకుగా చూపి రాష్ట్ర‌వ్యాప్తంగా టీడీపీ ఆఫీసుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డ్డాయి వైసీపీ మూక‌లు. దేవాల‌యం లాంటి టీడీపీ కార్యాల‌యంపై దాడికి నిర‌స‌న‌గా పార్టీ అధినేత చంద్ర‌బాబు 36 గంట‌ల నిర‌స‌న దీక్ష చేస్తున్నారు. ఇలా, ప‌ట్టాభి ఎపిసోడ్ అనేక మ‌లుపులు తిరుగుతూ రాజ‌కీయంగా ఉద్రిక్త‌త రాజేస్తోంది.  సీఎం జగన్‌ను బోసిడీకే అని తిట్టారంటూ నమోదైన కేసులో ప‌ట్టాభిని అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయ‌స్థానం. గురువారం ప‌ట్టాభిరామ్‌ను మ‌చిలీప‌ట్నం జైలుకు త‌రలించారు పోలీసులు. కొవిడ్ పరీక్ష‌లు నిర్వ‌హించిన అనంత‌రం.. శుక్ర‌వారం ప‌ట్టాభిని పోలీస్ బందోబ‌స్తుతో మ‌చిలీప‌ట్నం జైలు నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.  ఇక‌, పట్టాభికి బెయిల్ ఇవ్వాలంటూ ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు కోర్టును ఆశ్ర‌యించ‌నున్నారు. మ‌రోవైపు, పోలీసులు సైతం ప‌ట్టాభిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. మ‌రి, ప‌ట్టాభికి బెయిల్ వ‌స్తుందా?  పోలీస్ క‌స్ట‌డీ వ‌స్తుందా? అనే ఉత్కంఠ కొన‌సాగుతోంది.