సైకో, శాడిస్ట్, డ్రగ్గిస్ట్ జగన్‌రెడ్డి.. తేల్చుకుందాం రా!
posted on Oct 19, 2021 @ 8:12PM
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులపై నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. "ఇప్పటివరకూ ముఖ్యమంత్రి అని గౌరవించి గారూ అనేవాడిని. నీ వికృత, క్రూర బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్, డ్రగ్గిస్ట్ జగన్‌రెడ్డి అని అంటున్నాను. నువ్వూ, నీ బినామీలు డ్రగ్స్ బిజినెస్ చేస్తారు. నిలదీసే టిడిపి నేతలపై దాడులకు పాల్పడతావా? పరిపాలించమని ప్రజలు అధికారం అందిస్తే... పోలీసుల అండతో మాఫియా సామ్రాజ్యం నడుపుతావా? టిడిపి కేంద్రకార్యాలయాలపై గూండా మూకలతో దాడులకు తెగబడతావా? ఎన్నాళ్లిలా ఇంట్లో దాక్కుని నీ కుక్కలతో దాడులు చేయిస్తావు! నువ్వే రా తేల్చుకుందాం అంటూ సవాల్ చేశారు నారా లోకేష్.
"తెలుగుదేశం సహనం చేతకానితనం అనుకుంటున్నావా? నీ పతనానికి ఒక్కో ఇటుకా నువ్వే పేర్చుకుంటున్నావు. నిన్ను ఉరికించి కొట్టడానికి తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిన అవసరంలేదు. నీ అరాచకాలపై ఆగ్రహంగా వున్న కేడర్‌కి మా లీడర్ కనుసైగ చేస్తే చాలు. నీ కార్యాలయాల విధ్వంసం నిమిషం పని. నీ ఫ్యాన్ రెక్కలు మడిచి విరిచి నీ పెయిడ్ ఆర్టిస్టుల్ని రాష్ట్రం దాటేంతవరకూ తరిమి కొడతారు మా కార్యకర్తలు. అన్ని ఆనవాయితీలని బ్రేక్ చేసి, ప్రజాస్వామ్యానికి పాతరేసి..నీ సమాధికి నువ్వే గొయ్యి తవ్వుకుంటున్నావు కోడికత్తిగా.." అంటూ నారా లోకేష్ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు.
టీడీపీ నేతలు, కార్యాలయాలపై దాడులు దారుణమని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడిని ఆయన ఖండించారు. దాడి ఘటనపై తక్షణమే డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా నిందితులను అరెస్ట్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం పాలన చేస్తోందని టీడీపీ నేత బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఉన్నామా? పాకిస్థాన్‌లో ఉన్నామా? అని ప్రశ్నించారు. ఇక్కడ చట్టం ఉందా? తాలిబన్ పాలన ఉందా?, వైసీపీ అవినీతిని ఎత్తి చూపితే దాడులా? అని ఆయన ప్రశ్నించారు.