బండి పాదయాత్రను ఆపేసి టీఆర్ఎస్ సాధించేదేమిటి?

గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తీసుకువచ్చారన్నది సామెత. టీఆర్ఎస్ బండి సంజయ్ పాదయాత్ర విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆ సామెతనే గుర్తు చేస్తున్నది. బండి ప్రజా సంగ్రామ యాత్ర.. ఆ యాత్ర ఎప్పుడు ఎక్కడ జరుగుతోందో కూడా రాష్ట్రంలో జనం పట్టించుకోవడం లేదు. విడతల వారీగా బండి ప్రజా సంగ్రామ యాత్ర అంటూ నడుస్తున్నారు. ముగింపు సభ పేర పార్టీ అగ్రనాయకులను తీసుకువచ్చి బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ యాత్రలో ఆయన చేస్తున్న విమర్శలు, ప్రసంగాలూ అన్నీ ఆవు కథనే చెబుతున్నాయి. కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ కుటుంబ అవినీతి అన్న విమర్శలు తప్ప కొత్తదనం ఏమీ లేదు. రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు వినా మరెవరూ ఈ యాత్రను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బండి పాదయాత్ర వల్ల ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడుతోందంటూ యాత్రకు బ్రేక్ వేయడం ఎందుకో? దాని వెనక ఉన్న వ్యూహమేమిటో అర్ధం కావడం లేదని పరిశీలకులు అంటున్నారు. అవసరం లేని ఆంక్షల వల్ల బీజేపీ గ్రాఫ్ పెరగడం వినా మరో ప్రయోజనం ఉండదని అంటున్నారు. పైగా బండి సంగ్రామ యాత్ర దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. మరో మూడు రోజులలో అంటే ఈ నెల 24న ముగుస్తున్నది. అంతా అయిపోయిన తరువాత ఇప్పుడు యాత్రను నిలువరించి టీఆర్ఎస్ ఏం సాధిద్దామునుకుంటోందన్నది ఆ పార్టీ వ్యూహకర్తలే చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుమార్తె తనయ పేరు ఉందంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలపై నుంచి దృష్టి మరల్చడానికే బండి సంజయ్ యాత్రను నిలువరిస్తున్నారని భావించడానికి లేదు. ఎందుకంటే.. ఇప్పుడు సంజయ్ యాత్రను నిలువరించడానికి ఆ అంశంపై నుంచి ప్రజల దృష్టి మరల్చడానికేనని బీజేపీ ఆరోపణాస్త్రాలు సంధిస్తుంది. పైగా యాత్ర నిలువరించడానికి వ్యతిరేకంగా చేపట్టే ఆందోళనల్లో కూడా ప్రముఖంగా లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయాన్ని ప్రస్తావిస్తుందనడంలో సందేహం లేదు. యాత్ర సాగడం కంటే యాత్రను నిలువరించడం వల్లనే బీజేపీకి ఎక్కువ మైలేజ్ వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దానికి ఉదాహరణగా  పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చిన తరువాత ఇంత కాలంగా బండి ప్రజాసంగ్రామ యాత్రకు రాని కవరేజి మీడియాలో వచ్చింది. ఇప్పటి దాకా పెద్దగా యాత్రను పట్టించుకోని జనం కూడా యాత్ర ఎందుకు నిలిపేస్తున్నారన్న విషయంపై విస్తృతంగా చర్చించుకుంటున్నారు. అన్నిటికీ మించి బండి పాదయాత్రకు అవరోధాలు కలిగించడంపై బీజేపీ అగ్రనేతలు సైతం స్పందించి ప్రకటనలు, ఖండనలు గుప్పిస్తున్నారు. దీంతో విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అన్నిటికీ మించి లిక్కర్ స్కాం లో కేసీఆర్ తనయ కవిత పేరు బయటకు రావడం వల్లనే బీజేపీపై టీఆర్ఎస్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పట్టించుకోకుండా వదిలేస్తే ఏ ప్రచారం లేకుండా ఎప్పుడు మొదలైందో.. ఎప్పుడు ముగిసిందో తెలియకుండా పూర్తి కావలసిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఇప్పుడు ఆంక్షల వల్ల అందరికీ తెలిసింది. చర్చకు కేంద్రంగా మారింది. దీనివల్ల బీజేపీకి మైలేజి పెరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మునుగోడులో కమలానికి మూడో ప్లేసే..!

బీజేపీ ఎంత ప్రయత్నించినా, ఎన్ని గిమ్మిక్కులు చేసినా మునుగోడులో గెలిచే పరిస్థితి లేదని తాజా సర్వే తేల్చేసింది. గెలవడం అటుంచి ఆ పార్టీ మూడో స్థానంతోనే సరిపెట్టుకోవలసి ఉంటుందని కూడా పేర్కొంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కంచుకోటలాంటి మునుగోడులో జెండా పాతాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తున్నది. కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డితో పాటు ఇంకా పలువురు కాంగ్రెస్ నుంచి కమలం గూటికి చేరుతారని ఆ పార్టీ ఆశించింది. కానీ అది జరగలేదు. పైపెచ్చు కాంగ్రెస్ బలం మునుగోడులో రాజగోపాలరెడ్డి రాజీనామా తరువాత కూడా తగ్గలేదని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మునుగోడు పరిస్థితిపై ఒక రహస్య సర్వే చేయించినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సంబంధం లేకుండా అధిష్ఠానమే ఈ సర్వే చేయించిందని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. ఆ సర్వే ఫలితాన్ని ఇటీవల ప్రియాంకా గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమైన సందర్భంగా వెల్లడించినట్లు చెబుతున్నారు.  ఆ సర్వే ప్రకారం మునుగోడులో బీజేపీ చేస్తున్న హడావుడి అంతా పైపై ఆర్భాటమేనని తేలిపోయిందని చెబుతున్నారు. అయితే అంత మాత్రాన కాంగ్రెస్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యే పరిస్థితి కూడా లేదని సర్వే తేల్చిందని అంటున్నారు. ఆ సర్వే ప్రకారం మునుగోడులో బీజేపీ మూడో స్థానంతోనే సరిపెట్టుకోవలసి వచ్చినా కాంగ్రెస్ కు కలిసి వచ్చేదేం  లేదనీ, ఆ పార్టీ రెండో స్థానానికి పరిమితమౌతుందని సర్వే ఫలితం వెల్లడించిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. మునుగోడులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ స్థానంలో అధికార టీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నది కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది. అయితే టీఆర్ఎస్- కాంగ్రెస్ ల మధ్య తేడా చాలా స్వల్పమని, కొంచం గట్టిగా ప్రయత్నిస్తే కాంగ్రెస్ ఈ సీటు నిలబెట్టుకునే అవకాశం ఉందనీ, సర్వే ఫలితాన్ని విశ్లేషించిన కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీసీలు అత్యధికంగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ కనుక బీసీ అభ్యర్థిని నిలబెడితే ఆ తేడాను సునాయాసంగా అధిగమించవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక వామపక్షాలు టీఆర్ఎస్ కు మద్దతు పలకడం ఆ పార్టీకి కలిసి వచ్చిందని అంటున్నారు. వామపక్షాలకు మునుగోడులో దాదాపు 15వేల ఓట్లు ఉన్నాయని, అయితే నేతలు టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించినంత మాత్రాన ఆ ఓటు గంపగుత్తగా టీఆర్ఎస్ కే పడుతుందన్న నమ్మకం లేదనీ కూడా కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. కనీసంలో కనీసం ఎనిమిది వేల ఓట్ల వరకూ కాంగ్రెస్ కు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మునుగోడులో బీజేపీకి క్యాడర్ లేకపోవడం, రాజగోపాలరెడ్డి రాజీనామా చేసి కమలం గూటికి చేరినా.. ఆయన వెంట కాంగ్రెస్ క్యాడర్ వెళ్లకపోవడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశంగా పార్టీ నాయకులు భావిస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ సర్వేలోనే మునుగోడులో టీఆర్ఎస్ కే విజయావకాశాలు ఉన్నాయని తేలింది. అయితే రెండు పార్టీల మధ్యా తేడా అతి స్వల్పంగా ఉండటంతో సమష్టిగా కృషి చేస్తే సానుకూల ఫలితం ఉండే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.

పోస్టు కోవిడ్ ఎఫెక్ట్.. పిల్లలలో మానసిక వైకల్యం, పెద్దలలో డిప్రషన్!

పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ మానసిక స్వస్థతపై తీవ్ర ప్రభావం చూపుతుందా? కోవిడ్ బారిన పడి కోలుకున్న వారిలో డిప్రషన్, యాంగ్సైటీ, మానసిక వైకల్యం తదితర రుగ్మతలు వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే పరిశోధకులు ఉన్నాయనే అంటున్నారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న వృద్ధులు డిప్రషన్, యాంగ్సైటీకి గురయ్యే అవకాశాలు సాధారణ వృద్ధుల కంటే రెండింతలు ఎక్కువ ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే కోవిడ్ బారిన పడి కోలుకున్న చిన్నారులలో మానసిక వైకల్య సమస్యలు అధికం అని వైద్య నిపుణులు అంటున్నారు. దాదాపు 1.25 మిలియన్ రికార్డులను పరిశీలించి పరిశోధించిన అనంతరం సైంటిస్టులు పోస్టు కోవిడ్ ప్రభావ తీవ్రతపై ఒక నిర్ధారణకు వచ్చారు. పోస్టు కోవిడ్ ఎఫెక్ట్ పిల్లల్లో ఒక రకంగా, వృద్ధులలో మరో రకంగా బయటపడుతోందని వెల్లడించారు. కోవిడ్‌ బారిన పడి, చికిత్స తర్వాల కోలుకున్న వారిపై ఈ పరిశోధనలు జరిగాయి.  కరోనాకు గురి కావడానికి ముందు మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారిలో చికిత్స తరువాత మానసిక వైకల్యం   తీవ్రత పెరిగిందని పరిశోధనల్లో తేలింది.  వివిధ దేశాల్లో మొత్తం కోవిడ్‌ సోకి, చికిత్సతో బయటపడిన 2.47 లక్షల మందిపై ఈ పరిశోధనలు జరిపామని శాస్త్ర వేత్తలు వెల్లడించారు. వృద్ధులలో డిప్రషన్, యాంగ్సైటీ సమస్యలు, పిల్లలలో మానసిక సమస్యలు వెలుగు చూసినట్లు తేల్చిన పరిశోధనలు, వయస్సు పైబడిన వారిలో పోస్టు కోవిడ్ సమస్యలలో కండరాల సమస్య కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 

పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు.. బండి సంజయ్ యాత్రకు అనుమతి నిరాకరణ

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు జనగామ పోలీసలు బ్రేక్ వేశారు. జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని పేర్కొన్న పోలీసులు ఈ మేరకు బండి సంజయ్ కు నోటీసులు ఇచ్చారు. పాదయాత్ర పేరిట విద్వేష పూరిత వ్యాఖ్య చేస్తున్నారనీ, దీని వల్ల శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమౌతుందంటూ నోటీసులో పేర్కొన్నారు.ఈ మేరకు వర్ధన్నపేట ఏపీసీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి నోటీసు జారీ చేశారు. అలాగే  పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ లకు నోటీసులను అందించారు.  ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి  సమీకరణ చేస్తున్నారనీ, రెచ్చగొట్టే ప్రకటనలతో   జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంటూ, తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని నోటీసులో పేర్కొన్నారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని  హెచ్చరించారు.  కాగా పోలీసుల నోటీసుపై బీజేపీ మండిపడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రశ్నే లేదని స్పష్టం చేసింది. పోలీసుల అనుమతితోనే   మూడు విడతలుగా పాదయాత్ర కొనసాగిస్తున్నమని పేర్కొంది. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని ప్రశ్నించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వరకూ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అలాగే ఈ నెల 27న హన్మకొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అలాగే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోకుండా ప్రభుత్వానికి తగు సూచనలు ఇవ్వాల్సిందిగా బీజేపీ నేతలు గవర్నర్ తమిళిసైను కలిసి కోరారు. కాగా తన పాదయాత్రను అడ్డుకోవడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఎక్కడ యాత్రను ఆపారో అక్కడే మళ్లీ ప్రారంభిస్తానని ప్రకటించారు.  జనగామలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కరీంనగర్‌లోని ఇంటి దగ్గర వదిలి పెట్టి గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి విదితమే,  కాగా, ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించి బీజేపీ అత్యవసరంగా హౌజ్​ మోషన్​ పిటిసన్​ దాఖలు చేసింది. అయితే  హైకోర్టు ఈ పిటిషన్​ని తిరస్కరించి, లంచ్​ మోషన్​ పిటిషన్​ దాఖలు చేయాలని  సూచించింది.

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నవీడియోపై రాష్ట్రపతికి ఫిర్యాదు

 వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారంపై రాష్ట్రపతికి ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై పారదర్శక విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా నేతల బృందం రాష్ట్రపతిని కలిసి డిమాండ్ చేసింది. ‘డిగ్నిటీ ఫర్ వుమెన్’ పేరుతో మహిళా నేతల బృందం  ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,  జాతీయ మహిళా కమిషన్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ సహాయంతో రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకున్న మహిళా నేతలు రాష్ట్రపతితో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్, జాతీయ మహిళా కమిషన్‌కు విడివిడిగా ఫిర్యాదులు అందజేశారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని వారు ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో మహిళలు భయాందోళనల మధ్య  జీవనం సాగిస్తున్నారని, గత మూడూళ్లలో మహిళలపై నేరాలు 21.45 శాతం పెరిగాయని వారా ఫిర్యాదులో పేర్కొన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం పేరు చెప్పి ప్రజల్ని తప్పుదోవపట్టిస్తోందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారే మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏపీ మంత్రి  అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ ఇలాంటి అసభ్యకర ప్రవర్తనతో అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. గోరంట్ల మాధవ్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం కేసు నమోదై అత్యాచారం, హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జస్టిస్ వర్మ కమిషన్ నివేదికను అమలు చేయాలని రాష్ట్రపతిని కోరారు. గోరంట్ల మాధవ్ వీడియో క్లిప్‌ను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి పరీక్షించాలని విజ్ఞప్తి చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడిన అభియోగాలు ఎదుర్కొంటున్నవారిని గ్రామ పంచాయితీ నుంచి పార్లమెంటు వరకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా నిషేధించాలని, ఆ మేరకు వర్మ కమిషన్ సిఫార్సులను కఠినంగా అమలు చేయాలని అభ్యర్థించారు. ఇప్పటికే ఎన్నికైన ప్రతినిధులు ఈ తరహా ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటే తక్షణమే వారిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు అందరికీ లింగబేధం, లింగవివక్ష, లైంగిక వేధింపులు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ శిక్షణనివ్వాలని సూచించారు. – ఎవరైనా మహిళలపై అసభ్యంగా ప్రవర్తించినా… లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడినా.. వెంటనే సూమోటోగా కేసులు నమోదు చర్యలు చేపట్టాలని జాతీయ మహిళా కమిషన్‌ను కోరారు. ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి సమన్లు జారీ చేసి విచారణ జరపాలని కోరారు.   వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ చెన్నుపాటి కీర్తి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేత సుంకర పద్మశ్రీ , ఐద్వా ప్రతినిధి ఎస్. పుణ్యవతి, పి. రాణి , తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జ్యోత్స్న తిరుగనగరి, ఆ పార్టీ నేతలు ముల్పురి నాగ కళ్యాణి, అన్నాబత్తుని జయలక్ష్మితో పాటు ఏపీ స్టేట్ కుర్బ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ సంజీవరెడ్డి సవిత తదితరులు రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు.

అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. కారణమదేనా?

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అయిన అమిత్ షా హీరో జూనియర్ ఎన్టీఆర్ ల భేటీ తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించింది. వారి మధ్య భేటీ జరిగి రెండు రోజులు గడిచిపోయినా ఆ విషయంపై చర్చోప చర్చలు ఎడతెగకుండా సాగుతూనే ఉన్నాయి. ఎప్పుడో 2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం తరఫున ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ ఆగ్రనేత ఆయనను స్వయంగా ఢిన్నర్ మీట్ కు ఆహ్వానించడం.. ఆ ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఆయనను కలవడం తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. ఈ భేటీపై పలు రకాల ఊహాగానాలు వెల్లువెత్తాయి. జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా బీజేపీలోకి ఆహ్వానించారనీ, తెలంగాణ తెలుగుదేశం బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరారనీ.. ఇలా పలు రకాల చర్చలు తెరమీదకు వచ్చాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారైతే ఇరువురి మధ్యా రాజకీయ చర్చలే జరిగి ఉంటాయని చెప్పారు. బీజేపీ, వైసీపీ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఎన్టీఆర్ తో భేటీపై అమిత్ షా ఒక ట్వీట్ చేస్తూ ఓ అద్భుత నటుడితో భేటీ ఎంతో సంతృప్తి నిచ్చిందని పేర్కొన్నారు. ఇక బీజేపీ సీనియర్లు అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన అమిత్ షా తన తెలంగాణ పర్యటనలో ఆయనతో భేటీ కావాలని భావించారని, అందుకే ఆయన ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ భేటీ అయ్యారనీ చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా తెలుగు ఇండస్ట్రీలో మరో టాక్ జోరుగా వినిపిస్తున్నది.  తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ.. అందుకు సినిమాను కూడా బలమైన ఆయుధంగా వాడుకోవాలని భావిస్తోంది. అందుకే తెలంగాణ సాయుధ పోరాట యోధుల అణచివేతకు నిజాం నవాబు రజాకార్లను పంపిన సంఘటనలపై రజాకార్ ఫైల్స్ అనే సినిమాను తెరకెక్కించాలన్న యోచనలో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఆ సినిమాకు ఇప్పటికే కథ సిద్ధమైందని కూడా అంటున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి, ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయిన విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఆ కథను ప్రధాని మోడీకి వినిపించినట్లు కూడా చెబుతున్నారు. రజాకార్ ఫైల్స్ కథ వినడం కోసం ఐదు నిముషాల పాటు విజయేంద్ర ప్రసాద్ కు అప్పాయింట్ మెంట్ ఇచ్చిన మోడీ దానికి ఇరవై నిముషాలకు పెంచినట్లు కూడా చెబుతున్నారు. ఆ కథకు కథానాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ అయితేనే సరిపోతారని విజయేంద్ర ప్రసాద్ భావించారనీ అదే విషయాన్ని మోడీతో చెబితే మోడీ అమిత్ షాతో ఒక సారి జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి మాట్లాడాల్సిందిగా  చెప్పారనీ, ఆ పర్యవశానమే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీ అని చెబుతున్నారు. రజాకార్ ఫైల్స్ సినిమా తెలంగాణలో బీజేపీ పలుకుబడి పెంచుతుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోందని అంటున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పోషించిన కొమురం భీం పాత్రకు సర్వత్రా ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే. అటువంటి జూనియర్ ఎన్టీఆర్ రాజాకార్ ఫైల్స్ సినిమాలో నటిస్తే కాశ్మీర్ ఫైల్స్ ను మించి ప్రజలను ఆకట్టుకుంటుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ రజాకార్ ఫైల్స్ ను సినిమాతో ఆపేయకుండా వెబ్ సిరీస్ కూడా తీయాలన్న భావనతో ఉన్నారనీ, రెంటిలోనూ జూనియర్ ఎన్టీఆరే ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉందని  చెబుతున్నారు. అయితే ఈ వార్త ధృవపడాల్సి ఉంది. మొత్తం మీద అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ రాజకీయ, సినీ రంగాలలో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ అగ్రనేత అమిత్ షా‌తో జూనియర్ ఎన్టీఆర్‌ భేటీ కావడం తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కొన్నేళ్లుగా సినిమాలు తప్ప మరో ప్రపంచమే తెలియని తారక్.. మళ్లీ రాజకీయాల వైపు వస్తున్నారా..? కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో యంగ్ టైగర్ భేటీ వెనక  ఆంతర్యమేంటి..? ట్రిపుల్ ఆర్ కోసమే అయితే.. రామ్ చరణ్ లేకుండా స్పెషల్ మీటింగ్ ఎందుకు..? కేంద్ర హోం మంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలవడం ఎక్కడలేని ప్రాధాన్యత సంతరించుకుంది. సినీ వర్గాల్లో కంటే.. రాజకీయంగా ఈ భేటీ గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. బీజేపీ అగ్ర నేతతో తారక్‌కు పనేంటి..? అంత ప్రత్యేకంగా ఈ ఇద్దరూ కలవడానికి కారణమేంటంటూ ఆసక్తి కరమైన చర్చ జరుగుతుంది. ట్రిపుల్ ఆర్‌లో కొమరం భీమ్ పాత్ర నచ్చి.. అమిత్ షా ప్రశంసించారని తారక్ వర్గాలు చెప్తున్న మాట. అయితే ఈ భేటీ వెనుక పాలిటిక్స్ తప్ప మరొకటి లేదన్నది మరికొందరి అభిప్రాయం. భేటీ తర్వాత ఎలాంటి లీకులు రాకపోవడంతో నిజంగా వారిద్దరూ ఏ అంశాలపై చర్చించారన్న ఆసక్తి నెలకొంటోంది. తారక్, అమిత్ షా భేటీ వెనక మరో వార్త టాలీవుడ్ వర్గాల్లో బాగా వైరల్ అవుతుంది. ది కాశ్మీర్ ఫైల్స్ తరహాలోనే.. రజాకార్ ఫైల్స్ అనే సినిమా ఒకటి త్వరలోనే రాబోతుంది. దీనికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. బిజేపీ ప్రభుత్వ సపోర్ట్‌తోనే రజాకార్ ఫైల్స్ భారీ ఎత్తున తెరకెక్కబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఇందులో తారక్‌ను నటింపచేయాలనేది పార్టీ ఎత్తుగడలా కనిపిస్తోందని విశ్లేషకుల అభిప్రాయం. తారక్, అమిత్ షా మధ్య రాజకీయ చర్చకు తావేం లేదని.. కేవలం ఈ రజకార్ ఫైల్స్ సినిమా గురించి చర్చించుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అటు రాజకీయం, ఇటు సినిమాలపై పూర్తి అవగాహన ఉన్న తారక్.. తీసుకునే ఏ నిర్ణయమైనా భవిష్యత్తును అంచనా వేసుకునే నిర్ణయం తీసుకుంటారనే అతన్ని దగ్గర్నుంచి గమనించిన వాళ్ళకు అర్థమవుతుంది. మరి రజాకార్ ఫైల్స్ విషయంలో అమిత్ షా తారక మంత్రం ఎంతవరకు పని చేస్తుందనేది మిలియన్ డాలర్స్ ప్రశ్న.

జింబాబ్వేలో మెరిసిన సంజూ, గిల్‌, ధ‌వ‌న్‌, ర‌జా

జింబాబ్వేతో టీమ్ ఇండియా త‌ల‌ప‌డిన వ‌న్డేసీరీస్‌ను ఎంతో గొప్ప‌గా ముగించింది. టీమ్ ఇండియా బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ ఉన్న‌త‌స్థాయి ప్ర‌ద‌ర్శ‌న‌తో సీరీస్‌ను కైవ‌సం చేసుకోవ‌డంలో కుర్రాళ్లు త‌మ స‌త్తా చాటారు. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వేను 10 వికెట్ల తేడాతో ఓడిం చిన భారత జట్టు పూర్తి వృత్తిపరమైన ప్రవర్తనను ప్రదర్శించింది. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న భారత్ జింబాబ్వే ను 40.3 ఓవర్లలో 189 పరుగులకే పరిమితం చేసింది. బ్రాడ్లీ ఎవాన్స్ మరియు రిచర్డ్ నగరవ మధ్య తొమ్మిదో వికెట్‌కు 70 పరు గుల భాగస్వామ్యం లేకపోతే అది చాలా తక్కువగా ఉండేది. జింబాబ్వే తరఫున దీపక్ చాహర్, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ తలో మూడు వికెట్లు తీయగా, కెప్టెన్ రెగిస్ చకన్‌బవ్వ 35 పరుగులతో టాప్ స్కోర్ చేశాడు. బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ లు రాణించలేకపోయారు. ముఖ్యంగా గిల్ త్వరగా స్కోర్ చేయడంతో మూడ్‌లో ఉన్నాడు, ధావన్ ఒకసారి వేగం త‌గ్గించి సాధారణంకంటే నెమ్మదిగా స్కోర్ చేసిన తర్వాత కూడా,  భారత్ గేమ్‌ను 30.5 ఓవర్లలో మాత్రమే ముగించేలా చూసు కున్నాడు. గిల్ 72 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, ధావన్ 113 బంతుల్లో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ఇప్పుడు 2-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. 162 పరుగుల ఛేదన లో ఐదు వికెట్లు చేతిలో ఉండగా, 24.2 ఓవర్లు మిగిలి ఉండగానే రెండో గేమ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సంజూ శాంసన్ 43 పరుగులతో భారత్‌లో అత్యధిక స్కోరు చేశాడు, అతను కూడా ఒక సిక్స్‌తో గేమ్‌ను ముగిం చాడు. అతనితో పాటు శిఖర్ ధావన్ (33), శుభ్‌మన్ గిల్ (33), దీపక్ హుడా (25) కూడా ఆరంభాన్నిచ్చారు. అయితే కేఎల్ రాహుల్ (1), ఇషాన్ కిషన్ (1) అవకాశాన్ని వినియోగించుకోవడంలో విఫలమయ్యారు. జింబాబ్వే కోసం, ఈసారి బంతితో మెరుగైన ప్రదర్శన కనబరిచారు వారి బౌల‌ర్లు. మొదటి గేమ్‌లో వికెట్‌లేకుండా పోయిన తర్వాత, తనకా చివాంగా, వికోరి న్యౌచి, ల్యూక్ జోంగ్వే వికెట్‌లు తీశారు.  సికందర్ రజా కూడా మొత్తం ఐదు వికెట్లు సాధించ డానికి ఒక వికెట్ తీశారు. బ్యాట్ తో అంద‌ర్నీ భారీ షాట్స్‌తో అద్భుతమైన 43 పరుగుల‌తో ఆక‌ట్టుకున్న‌సంజూ శాంస‌న్‌  వికెట్ కీప‌ర్‌గా  మూడు క్యాచ్‌లతో  సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు, అందులో ఒకటి అసాధారణమైన ఒన్ హ్యాండ్ క్యాచ్, చూసి తీరాల్సిందే. హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల‌ను వ‌దులుకున్న జింబాబ్వే మూడ‌వ‌ది, చివ‌రి వ‌న్డే మ్యాచ్‌లో మాత్రం విజృంభించింది.  జింబాబ్వే 290 పరుగుల ఛేదనను అత్యద్భుత సెంచరీతో భార‌త్ బౌల‌ర్ల‌ను ఆడుకున్న‌ సికందర్ రజా భారత్‌కు తీవ్ర భయాన్ని కలిగించాడు. అయితే, అతను 49వ ఓవర్‌లో 115 పరుగుల వద్ద వెనుదిరిగాడు.  ఆ తర్వాత ఆతిథ్య జట్టు బౌలింగ్‌లో లేదా 276 పరుగులు చేసింది. భారత్ తరఫున అవేష్ ఖాన్ 3/66, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్ తలో రెండు వికెట్లు తీశారు. శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీసుకున్నాడు - అన్నింటికంటే ముఖ్యమైన రజా వికెట్ తీయ‌డం. మొదటి రెండు గేమ్‌ల్లో టీమ్ ఇండియాకు ప‌రిస్థితులు కొంత అనుకూలించాయి.  అయితే జింబాబ్వే మూడవ, చివరి మ్యాచ్‌లో మాత్రం పర్యాటకులకు చుక్క‌లు చూపిం చింద‌నే అనాలి.  అయితే, 290 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆతిథ్య జట్టు 169/7కు కుప్ప కూలిన తర్వాత మరో భారీ ఓటమిని చవిచూసింది. అయితే, సికందర్ రజా,  బ్రాడ్ ఎవాన్స్ ఎనిమిదో వికెట్‌కు 104 పరుగులు జోడించి ఛేజింగ్‌ను పునరుద్ధరించారు. రజా 115 పరుగులు చేయగా, ఎవాన్స్ కీలకమైన 28 పరుగులు చేశాడు. 49వ ఓవర్‌లో రజా ఔట్ అయ్యే ముందు ఇవాన్స్ అవేష్ చేతిలో ఎల్‌బిడబ్ల్యూ ట్రాప్ అయ్యాడు, భారత్ థ్రిల్లింగ్ విజయాన్ని పూర్తి చేసింది. మొత్తానికి ఈ టూర్ శుభ‌మ‌న్ గిల్‌, సంజూ శాంస‌న్‌, దీప‌క్ హుడా వంటి యువ స్టార్స్ టీమ్ ఇండియాకు ఎంత అవ‌స‌ర‌మ‌న్న‌ది మ‌రోసారి రుజువు చేసింది.

వైసీపీలో  అస‌మ్మ‌తి అగ్గి రాజేస్తున్న ఇన్‌ఛార్జ్‌ల  మార్పు !

రాష్ట్రంలో రాజ‌కీయ‌ప‌రిస్థితులు ఊహించ‌ని విధంగా వేగంగా మారిపోతున్నాయి. సీఎం జ‌గ‌న్ ఏ క్ష‌ణం ఎలాంటి నిర్ణ‌యంతో భ‌య‌పెడ‌తారోన‌న్న భీతి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లోనూ ఉంది. ప‌థ‌కాల అమ‌లు, పాల‌నా ప‌ర నిర్ణ‌యాల మీద ప్ర‌జ‌ల‌వ‌ద్ద‌కు పాల‌న అనే అంశాల గురించి ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న కోరి ఇప్ప‌టికే వైసీపీ తీవ్ర‌వ్య‌తిరేక‌త‌ను గ్ర‌హించింది. గ‌డ‌ప గ‌డ‌ప‌కు పేరుతో మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను ప్ర‌జ ల్లోకి త‌రిమి సాధించింది కేవ‌లం అవ‌మానాల భార‌మే. ఈ త‌రుణంలో వైసీపీ అద‌న‌పు ఇన్‌ఛార్జుల నియా మ‌కం ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఇప్ప‌టికే గుంటూరుజిల్లా తాటి కొండ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాదును నియమించడంతో ఎమ్మెల్యే శ్రీదేవి అగ్గిలం పై గుగ్గిలమవు తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా మరికొన్ని నియోజకవర్గాల్లో అదనపు ఇన్​చార్జు లను నియమించడం, మార్పులు చేయడం పై వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. దీంతో ఎవరి సీటుకు ముప్పు వాటిల్లుతుందోనన్న ఆందోళన ఆయా నియోజకర్గాల ఎమ్మెల్యేలు, ఇన్​చార్జుల్లో నెలకొంది. ఇప్పటిదాకా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో తలమునకలవుతున్న ఎమ్మెల్యేలు, ఇన్​చార్జులను మార్చడం వల్ల ప్రయోజనం ఉంటుందని సీఎం జగన్​ భావిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, నాయకులపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటే మార్పులతో కొంత ప్రయోజనం ఉండొచ్చు. అసలు ప్రభుత్వం పైనే వ్యతిరేకత ఉంటే ఈ మార్పులు మరింత నష్టానికి దారి తీసే అవకాశముంది. ఈపాటికే ఎన్నికల మూడ్​లోకి వెళ్లిన వైసీపీ నేతల్లో మార్పులపై గుబులు రేగుతోంది. సీఎం వైఎస్​ జగన్​ మొత్తం 175 నియోజకవర్గాల్లో అనేక సర్వేలు చేయించారు. ఐ ప్యాక్​ టీంతోపాటు ఢిల్లీకి చెందిన మరో సంస్థతోనూ ఈ సర్వేలు నిర్వహించినట్లు సమాచారం. వాళ్లు ఇచ్చిన నివేదికలను బట్టి మొత్తం 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు ఉండొచ్చని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. అలాగే 12 మంది ఎంపీలను కూడా మార్చే అవకాశముంది. కొందర్ని ఎమ్మెల్యేలుగా పోటీకి దింపడం.. కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం అదనపు ఇన్​చార్జులను నియమించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇంతకీ  58 నియోజకవర్గాలు ఏవంటే.. గుంటూరు జిల్లాలో తెనాలి, మంగళగిరి, పొన్నూరు, తాటికొండ ఉన్నాయి. బాపట్ల జిల్లాలో బాపట్లతోపాటు వేమూరు, సంతనూతలపాడు, పర్చూరు ఉన్నాయి. పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి, చిలకలూరిపేట, ప్రకాశం జిల్లాలో కొండపి, మార్కాపురం, యర్రగొండపాలెం, నెల్లూరు జిల్లాలో కావలి, ఉదయగిరి, కోవూరు, కందుకూరు, తిరుపతి జిల్లాలో వెంకటగిరి, గూడూరు, శ్రీకాళహస్తి నియో జకవర్గాలున్నట్లు  సమాచారం. ఇంకా ఉత్తరాంధ్ర నుంచి కృష్ణాజిల్లా వరకు చూస్తే ఎచ్చెర్ల, కురుపాం, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం, బొబ్బిలి, ఎస్​ కోట, గజపతినగరం, వైజాగ్ ఈస్ట్​, వైజాగ్​ సౌత్​, పాయకరావుపేట, నర్సీ పట్నం, అరకు, గాజు వాక, పిఠాపురం, పాడేరు, జగ్గంపేట, ప్రత్తిపాడు, రాజమండ్రి అర్బన్​, రూరల్​, కాకి నాడ రూరల్​, రంపచోడవరం, పాలకొల్లు, ఉంగుటూరు, ఏలూరు, పెనమలూరు, విజయవాడ వెస్ట్​; మైలవరం, కైకలూరు, అవని గడ్డ ఉన్నాయి. రాయలసీమలో పూతలపట్టు, పలమనేరు, శింగనమలై, పత్తికొండ, హిందూపురం, పుటపర్తి, అనంత పురం, కల్యాణదుర్గం, నందికొట్కూరు, మైదుకూరు నియోజకవర్గాలున్నాయి. 12 ఎంపీ నియోజవర్గాల్లోని పార్టీ ఎంపీలు, ఇన్​చార్జులను  కూడా మార్చనున్నట్లు తెలుస్తోంది. అందులో హిందూపురం, అనంత పురం, నెల్లూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు, నర్సాపురం, అమలాపురం, అనకాపల్లి, విశాఖ, విజయ నగరం, శ్రీకాకుళం ఉన్నాయి.

ప్రచారం ఓకే.. పరనింద వద్దు.. రామ్ దేవ్ బాబాకు సుప్రీం చురకలు

అల్లోపతి, ఆయుర్వేదం, యూనాని ఇలా వైద్య విధానాలు వేరైనా అన్నిటి లక్ష్యం మాత్రం రోగికి స్వస్థత చేకూర్చడం, రోగాన్ని నియం చేయడమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఫలానా వైద్య విధానమే అత్యుత్తమమైదని ప్రచారం చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ, ప్రచారం పేరుతో మరో వైద్య విధానాన్ని దూషించడం, కించపరచడం ఎంత మాత్రం తగదు. ఇదే విషయాన్ని దేశ సర్వోన్నత న్యాయ స్థానం యోగాగురి బాబా రాందేవ్ కు సుతిమెత్తగానైనా స్పష్టంగా చెప్పింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సందర్బంగా యోగాగురు బాబా రామ్ దేవ్ పై ఒకింత అసహనం వ్యక్తం చేసింది. యోగా గురు బాబా రామ్ దేవ్ అల్లోపతి వైద్యులను నిందించడం తగదని చురకలు వేసింది. ఇప్పటికే యోగాకు ప్రాచుర్యం, ప్రజాదరణ రావడంలో బాబా రామ్ దేవ్ చేసిన కృషిని ప్రస్తావిస్తూ, అలాగే ఆయుర్వేదానికి కూడా ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు ప్రచారం చేసుకుంటే తప్పులేదనీ, అయితే ఆ పేరుతో అల్లోపతిని నిందించడం, దూషించడం, అల్లోపతి వైద్యులను కించపరచడం తగదని మందలించింది. కోవిడ్ సంక్షోభ సమయంలో రామ్ దేవ్ అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న పలువురు వైద్యులు మరణించారనీ, అల్లోపతి ఒక మూర్ఖ వైద్య విధానమనీ రామ్ దేవ్ అప్పట్లో వ్యాఖ్యానించిన సంగతి విదితమే. ఇలా ఉండగా మీరు అనుసరించే వైద్య విధానం అన్ని రోగాలు, రుగ్మతలూ నయం చేస్తుందన్న గ్యారంటీ ఏమైనా ఉందా అని సుప్రీం కోర్టు రామ్ దేవ్ బాబాను ప్రశ్నించింది. మీ వైద్య విధానాన్ని ప్రచారం చేసుకోవడం వరకూ ఓకే కానీ ఇతర వైద్య విధానాలను దూషించడం తగదని పేర్కొంది.  

ముస్లిం మంత్రితో నీతిష్ ఆల‌య ప్ర‌వేశం.. మండిప‌డుతున్న బీజేపీ

అప‌లే దేశంలో రాజ‌కీయ‌ప‌రిస్థితులు అంతంత‌మాత్రంగా ఉన్నాయి. బీజేపీ నాయ‌క‌త్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం వీలు చిక్కిన‌పుడ‌ల్లా విప‌క్షాల మీద విరుచుకుప‌డ‌ట‌మో, ఈడీ, సిబిఐల‌ను ఉసిగొల్ప‌డ‌మో చేస్తోంది. ఈ స‌మ‌యంలో బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ గ‌య‌లోని విష్ణుప‌ధ్ ఆల‌యంలోకి ఒక ముస్లిం మంత్రితో క‌లిసి వెళ్లి మ‌రీ పూజ‌లు చేశారు. బీహార్‌లో బీజేపీకి ఝ‌ల‌క్ ఇచ్చిన నితీష్‌పై ప‌గ సాధిం చడానికి బీజేపీ ఎంత‌గానో ఎదురుచూస్తున్న త‌రుణంలో బీజేపీ కి ఈ విధంగా నీతిష్ దొరిక‌డంతో రాష్ట్రం లో రాజ‌కీయ దుమారం చెల‌రేగింది.   నితీష్ కుమార్‌ను తప్పుపడుతూ బీజే పీ విమర్శలు గుప్పించింది. గయలో మంగళవారం అధికార పర్యట నకు వెళ్లిన నితీ‌ష్ కుమార్ తనతో పాటు స‌మాచార‌, సాంకేతిక శాఖ మంత్రి మొహమ్మద్ ఇజ్రాయిల్ మన్సూరీని కూడా విష్ణుపద్ ఆలయ దర్శనానికి తీసుకువెళ్లారు. కలిసి పూజలు చేశారు. అనంతరం మన్సూరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రితో కలిసి విష్ణుపద్ ఆలయ గర్భగుడిలో పూజలు చేయడం తన అదృష్టం గా భావిస్తున్నానని చెప్పారు. కాగా, హిందూయేతరులకు ప్రవేశం లేదని ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన నోటీసు విషయాన్ని తాము మన్సూరి దృష్టికి  తెచ్చామని, అయినప్పటికీ  ఆయన ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించారని  ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఒక కమిటీని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు.  ఈ ఘనటపై హిందుత్వవాది, బీజేపీ ఎమ్మెల్యే థాకూర్ బచౌల్ మండిపడ్డారు. ఇది మతవిశ్వాసాలకు సం బంధించిన అంశమని అన్నారు. హిందూయేతరులకు ఆలయ ప్రవేశంపై నిషేధం ఉందని స్పష్టంగా చెప్పినప్పటికీ ఆయన (మన్సూరి) దృష్టికి తీసుకువచ్చినప్పటికీ , ఆయన బేఖాతరు చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర ఓబీసీ విభాగం ప్రతినిధి నిఖిల్ ఆనంద్ మాట్లాడుతూ, హిందువుల మనో భావా లను నితీష్ గాయపరచిచారని, ఆలయ వ్యవస్థను అవమానించారని అన్నారు. స్థానిక పూజారుల ఆచరించే పద్దతులు, పురాతన మత సంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వడం ద్వారా ఆలయ ప్రాంగణాన్ని అపవిత్రం చేసేందుకు నితీష్ కుమార్ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని, ప్రపంచవ్యాప్తంగా హిందూ విశ్వాసాలు, సనాతన ధర్మంపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికీ నితీష్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలతో ముస్లింలను ప్రసన్నం చేసు కు నే ప్రయత్నాలు గర్హనీయమని అన్నారు.  కాగా, బీజేపీ నేతల వాదనను హిందుస్థాని అవామ్ మోర్చా (హెచ్ఏఎం) కొట్టిపారేసింది. బీజేపీ మత తత్వవాద వ్యాప్తి పూర్తిగా అభ్యంతరకరమని హెచ్ఏఎం జాతీయ ప్రతినిధి దినేష్ రిజ్వాన్ అన్నారు. సమాజంలో విషపూరిత వాతావరణాన్ని బీజేపీ నేతలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వారి మతతత్వ ఎజెండా వ్యాప్తిని సాగనిచ్చేది లేదని చెప్పారు.

ఢిల్లీ మ‌ద్యం స్కామ్‌.. ఇద్ద‌రు అధికారులు స‌స్పెండ్‌

దేశంలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న ఢిల్లీ మ‌ద్యం స్కామ్‌లో కేంద్ర హోం శాఖ ఇద్ద‌రు అధికారుల‌ను స‌స్పెండ్ చేసింది. మాజీ ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ గోపీకృష్ణ‌ను, మాజీ ఎక్సైజ్  డిప్యూటీ క‌మిష‌న‌ర్ ఆనంద్ తివా రీనీ స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ స్కామ్‌లో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ను ఏ1గా చేర్చింది. 120-బీ, 477-ఏ సెక్షన్ల ప్రకారం ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌‌లో చేర్చారు. సిసోడియా సహా మొత్తం 15 మంది పేర్లు ఈ ఎఫ్‌ఐఆర్‌‌లో ఉన్నాయి. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌‌లో నాటి ఎక్సైజ్ కమిషనర్ అర్వా గోపి కృష్ణ పేరు, మాజీ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారీ పేర్లు కూడా ఉన్నాయి.  ఇదిలా ఉండ‌గా, ఢిల్లీ మ‌ద్యంవిధానంపై దాఖ‌లైన కేసులో భాగంగా సిసోడియా నివాసంపై సీబీఐ దాడులు నిర్వ‌హించింది. అలాగే ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర‌పాలిత ప్రాంతంతోపాటు మొత్తం 21 చోట్ల ఈ దాడులు జ‌రిగాయి.  గత ఏడాది నవంబర్‌లో కేజ్రీవాల్ సర్కారు ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అవకతవకలు, విధా నపర లోపాలు జరిగాయ‌ని ప్ర‌చారం వెల్లువెత్తింది.  టెండర్ల విధానంలో ఆయాచితంగా కొందరికి లబ్ధి చేకూరేలా నిర్ణయా లు తీసుకున్నారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదిక పై దర్యాప్తు చేప ట్టాలని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐకి సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖకు ఇంఛార్జ్‌గా ఉన్న మనీశ్ సిసోడియా పాత్ర గురించి కూడా నివేదికలో ఉంది. దీంతో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు.  తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి కూడా ఢిల్లీ మద్యం స్కామ్‌తో సంబంధాలున్నాయని కథనాలు వెలువ డుతున్నాయి. ఢిల్లీ మద్యం స్కామ్‌తో సంబంధం ఉందంటూ తనపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సాపై పరువునష్టం దావా వేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే హెచ్చరించారు. 

మోడీ ఔనన్నా.. కాదన్నా విజయం నాదే.. సుబ్రహ్మణ్య స్వామి

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామిది ఒక ప్రత్యేక ఒరవడి. ఆయనకు పార్టీలూ, ఆ పార్టీల విధానాలతో పెద్దగా సంబంధం ఉండదు. ఆయన అనుకున్నది అనుకున్నట్లు మాట్టాడేస్తారు. జనతా పార్టీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా మరో పార్టీ అయినా ఆయనకు పెద్ద తేడా ఉండదు. ప్రస్తుతం ఆయన తన కాన్సన్ట్రేషన్ అంతా  ప్రధాని మోడీపై పెట్టారు. ఆయన టార్గెట్ గా వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. తాజాగా సోమవారం ఆయన రామసేతు అంశాన్ని అడ్డుపెట్టుకుని మోడీపై సెటైర్లతో ట్వీట్ చేశారు. రామసేతు అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న సంగతి విదితమే. రామసేతుపై సుప్రీం కోర్టు సోమవారం (ఆగస్టు 22) విచారణ చేపట్టింది. అందులో భాగంగా రామసేతు పురాతన వారసత్వ కట్టడమా? కాదా అన్నది తేల్చి చెప్పాలంటే దేశ సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలను ఆధారం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి మోడీపై చురకలు వేశారు. సుప్రీం ఆదేశాలతో రామసేతు విచారణ తుది దశకు వచ్చినట్లేనని పేర్కొన్న సుబ్రహ్మణ్య స్వామి ఇక కేంద్రం నోరు తెరవక తప్పదని అన్నారు. అంతే కాదు మోడీ ఔనన్నా.. కాదన్నా తానే గెలుస్తానని చమత్కరించారు.  మోడీ రామసేతు పురాతన వారసత్వ కట్టడమే అని అంగీకరిస్తే విజయం తనదనీ, అలా కాకుండా అది పురాతన వారసత్వ కట్టడం కాదని సుప్రీం కు తెలియజేస్తే 2024 ఎన్నికలలో మోడీ పరాజయం ఖాయమన్నారు. ఎలా చూసినా విజయం తనదేనని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు.

ద్రావిడ్‌కి కోవిడ్‌... ఆసియా క‌ప్‌కి దూరం

ఆసియా కప్ 2022 పోటీలకు ముందు టీం ఇండియా జట్టు హెడ్ కోచ్రా హుల్ ద్రావిడ్  క‌రోనా బారిన పడ్డారు. ఆసియా కప్ పోటీలకు వెళ్లే ముందు క్రికెట్ జట్టు క్రీడాకారులు, ఇతర సభ్యులకు ముందస్తు కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో రాహుల్ ద్రావిడ్ కు పాజిటివ్ అని మంగళవారం తేలింది. యునై టెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కరోనా నెగిటివ్ తో వచ్చిన రాహుల్ ద్రావిడ్ కు తాజా పరీక్షల్లో కొవిడ్ పాజి టివ్ అని తేలిందని బీసీసీఐ తెలిపింది. రాహుల్ ద్రావిడ్ బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని, నెగిటివ్ రిపోర్టు వచ్చాక రాహుల్ ద్రావిడ్ టీంతో కలుస్తారని బీసీసీఐ పేర్కొంది. రాహుల్ ద్రావిడ్ సెలక్షన్ కమిటీలో ఉండటం వల్ల జింబాబ్వే సిరీస్ కు వెళ్లలేదు. కాగా కోవిడ్ అనేది కేవ‌లం ఫ్లూ వంటిదేన‌ని దీన్ని కార‌ణంగా చేసుకుని ద్రావిడ్‌ను టోర్నీకి దూరం చేయ డం ప‌ట్ల టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ ర‌వి శాస్త్రి మండిప‌డ్డాడు. ఆగ‌ష్టు 28 ఆదివారం దుబాయ్ లో ఆరంభం కానున్న టోర్నీ తొలి మ్యాచ్‌లో భార‌త్ జ‌ట్టు చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి పాక్‌తో త‌ల‌ప‌డుతుంది. కానీ డ్ర‌సింగ్ రూమ్‌లో ద్రావిడ్ లేనిలోటు తెలుస్తుంద‌ని శాస్త్రి అన్నారు.  కోవిడ్‌ను అంత సీరియ‌స్ గా తీసుకోవ‌డ‌మేమిట‌న్నారు. కోవిడ్ సంబంధించిన మందులు వాడితే స‌రి పోతుంద‌ని, అందుకు డాక్ట‌ర్లు స‌ల‌హాలు సూచ‌న‌లు ఎలాగూ ఉంటాయి. కానీ టోర్నీ మొత్తానికి ఆ కార‌ణం చెప్పి ద్రావిడ్‌ను దూరం చేయడం స‌బ‌బు కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. అయితే ద్రావిడ్ యుఎఇ కి జ‌ట్టు తో పాటు వెళ్ల‌డానికి ముందు జ‌రిపిన ప‌రీక్ష‌ల్లో కోవిడ్ పాజిటివ్ వ‌చ్చిన కార‌ణంగానే ద్రావిడ్‌కు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.  ఆసియా క‌ప్ టీ-20 టోర్నీలో శ్రీ‌లంక‌, ఆఫ్ఘ‌నిస్థాన్‌, భార‌త్‌, పాకిస్తాన్ పాల్గొంటున్నాయి. వాస్త‌వానికి భార‌త్‌, పాకిస్తాన్ ల మ‌ధ్య ద్వైపాక్షిక టోర్నీలు ర‌ద్ద‌య్యాయి. కానీ ఇత‌ర టోర్నీల్లో పోటీప‌డుతూనే ఉన్నాయి. ఆసియాక‌ప్ తొలి మ్యాచ్‌లో శ్రీ‌లంక‌, ఆఫ్ఘ‌నిస్తాన్ త‌ల‌ప‌డ‌తాయి. అలాగే భార‌త్‌, పాక్ పోటీప‌డ‌తాయి. గ‌త ఏడాది దుబాయ్‌లో జ‌రిగిన టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌లో భార‌త్ ప‌ది వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన సంగ‌తి తెలిసిందే. 

చిరంజీవి బర్త్ డే వేడుకల్లో కొడాలి నాని.. అందుకేనా?

రాజకీయ లబ్ధి కోసం పార్టీల నేతలు ఎప్పటికి ఏది అవసరమో అది నిస్సంకోచంగా చేసేస్తారనడంలో ఏమాత్రం అనుమానం ఉండక్కర్లేదు. నాలుగు ఓట్లు తమకు వస్తాయంటే.. ఎక్కడికైనా వెళ్లారు.. ఎవరితోనైనా కలిసిపోతారనేదానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా అందుకేమే మినహాయింపు కాదని చెప్పుకోవచ్చు. కొద్ది నెలల క్రితం వరకూ బూతుల మంత్రిగా ప్రసిద్దుడైన కొడాలి నాని జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవి కోల్పోయి కేవలం ఎమ్మెల్యేగా మిగిలారు. పదవి పోయినప్పటి నుంచీ మీడియాలో గానీ, పబ్లిక్ లో గానీ అంతగా కనిపించడం బాగా తగ్గించేశారు కొడాలి నాని. అయితే.. తాజాగా సెప్టెంబర్ 22 (సోమవారం)న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా గుడివాడలో ఆయన అభిమాన సంఘం నిర్వహించిన వేడుకల్లో కొడాలి నాని పాల్గొన్నారు. ఆయన చిరంజీవి అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పాల్గొనడం రాజకీయ వర్గాలనే కాకుండా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. చిరంజీవి బర్త్ డే వేడుకల్లో కొడాలి నాని పాల్గొనడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏముందనే సందేహం ఎవరికైనా కలగొచ్చు. అందుకు సమాధానం కూడా ఉంది. గతంలో ఏనాడూ కొడాలి నాని ఇలా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన వేడుకల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. ఇప్పుడు మంత్రి పదవి పోయి, పబ్లిక్ లోనూ కొడాలి నాని అంతగా కనిపించకపోవడంతో జనానికి  ఆయన కాస్త దూరమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు కుటుంబానికి కొడాలి నాని వీర విధేయుడనే పేరు  ఉంది. ఆ క్రమంలోనే నాని జూనియర్ ఎన్టీఆర్ తో  స్నేహ సంబంధాలు కొనసాగిస్తారు. అలాంటి కొడాలి నాని ఈ సారి చిరంజీవి బర్త్ డే వేడుకల్లో పాల్గొనడం గుడివాడలోనే కాకుండా ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.   చిరు వేడుకల్లో కొడాలి నాని పాల్గొనడం వెనుక రాజకీయ లబ్ధి పొందాలనే వ్యూహం ఏదో ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  చిరంజీవి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ద్వారా గుడివాడ నియోజకవర్గంలో 30 వేలకు పైగానే ఉన్న కాపు సామాజికవర్గం  దృష్టిని ఆకర్షించడం, తద్వారా వారి ఓట్లకు గాలం వేయడం అనే  వ్యూహం మేరకే కొడాలి నాని చిరంజీవి అభిమానుల సంఘం నిర్వహించిన చిరు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారని అంటున్నారు. నిజానికి కొడాలి నానికి ఈసారి గుడివాడ నుంచి వైసీపీ టికెట్ వచ్చినా.. గెలవడం అంత సులువు కాదనే ఊహాగానాలు నియోజకవర్గంలో వ్యక్తం అవుతున్నాయి. ఇంతకు ముందు వరుసగా గుడివాడ నుంచి ఎన్నికవుతూ వచ్చిన కొడాలి నానికి ఈ సారి గెలుపు నల్లేరు మీద నడక కాదంటున్నారు. ఈ క్రమంలోనే కొడాలి నాని కాపు ఓట్లపై కన్నేశారంటున్నారు. గతంలో ఏనాడూ లేనిది ఈ సారి చిరంజీవి బర్త్ డే వేడుకల్లో పాల్గొనడం వెనుక కొడాలి నాని రాజకీయ వ్యూహం ఇదే కావచ్చని అంటున్నారు. వాస్తవానికి ఏపీలో వైఎస్ జగన్ పాలనపైన, అభివృద్ధి జరగని తీరుపై  ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అదే ప్రభావం గుడివాడ నియోజకవర్గంలో కూడా ఉందంటున్నారు. దీంతో కొడాలి నానిలో ఓటమి భయం పట్టుకుందని, ఈసారి తాను గెలవాలంటే.. కాపుల ఓట్లను ఆకర్షించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే గుడివాడలో చిరంజీవి అభిమాన సంఘాల నేత తోట సాయి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కొడాలి నాని పాల్గొన్నారని చెబతున్నారు. అక్కడితో ఆగని కొడాలి.. తెలుగు చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయే కథా నాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారని చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచింది. దాంతో పాటుగా భగవంతుని ఆశీస్సులతో చిరంజీవి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కూడా కొడాలి నాని ఆకాంక్షించడం విశేషం. మెగాస్టార్ గురించి కొడాలి నాని ఇంతలా పొగిడిన సందర్భం గతంలో ఎన్నడూ  లేదు, ఆయన గురించి నాలుగు మంచి మాటలు చెప్పిన దాఖలాలు కూడా లేవు.  ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న మెగా అభిమానుల మనసు దోచుకోవడం కోసమే నాని ఇలా చిరు అభిమానిగా అవతారం ఎత్తారని పరిశీలకులు అంటున్నారు.  అయితే.. చిరంజీవి చిన్న సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తరచుగా విమర్శలు చేసే కొడాలి నానికి కాపు సామాజికవర్గం ఓట్లు పడతాయా? మెగా ఫ్యాన్స్ ఆయనకు మద్దతుగా నిలుస్తారా? అన్న ప్రశ్నలకు  పరిశీలకులు అనుమానమే అంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిని ఓడిస్తామని పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే సవాల్ చేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. 

బీజేపీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్

ఘోషామహల్ ఎమ్మెల్యేపై బీజేపీ వేటు వేసింది. స్టాండప్ కమేడియన్ మునావర్ షోను హైదరాబాద్ లో నిర్వహించరాదంటూ ఆందోళనకు దిగిన రాజాసింగ్.. ఆ తరువాత విడుదల చేసిన ఒక వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ వ్యాఖ్యలు ఉండటంతో హైదరాబాద్ లో ఆందోళనలు చెలరేగాయి. రాజా సింగ్ అరెస్టు డిమాండ్ చేస్తూ కమిషనర్ కర్యాలయాన్ని కూడా ముట్టడించారు. రాజా సింగ్ వ్యాఖ్యలు మతసామరస్యానికి భంగం కలిగించేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులనన్నిటినీ పరిగణనలోనికి తీసుకున్న బీజేపీ మత సామరస్యానికి భంగం కలిగించేలా వ్యవహరించినందుకు రాజా సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మత సామరస్యానికి భంగం కలిగించేలా వ్యవహరించినందకు పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించరాదో పది రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది.  అంతకు ముందు ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు సోమవారం ( ఆగస్టు 22) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాజా సింగ్ వీడియో విడుదల చేసిన అనంతరం సోమవారం హైదరాబాద్ లో నిరసనలు వెల్లువెత్తాయి. ఏకంగా కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ఎదుటే నిరసనకారులు ఆందోళనకు దిగారు. అలాగే నగర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఆందోళనలు జరిగాయి. రాజాసింగ్ తమ మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆయనను అరెస్టు చేయాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. దీంతో పలు చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను అదపులోనికి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాజా సింగ్ పై కేసు నమోదైంది. ఇంతకీ అసలు జరిగిందేమిటంటే కమేడియన్ మునావర్ ఫరూకీ హైదరాబాద్ లో స్టాండప్ కామెడీ షో నిర్వహిస్తే తానూ కామెడీ వీడియోను విడుదల చేస్తానని రాజా సింగ్ హెచ్చరించారు. ఆ నేపథ్యంలోనే మునావర్ కామోడీ షోకు పోటీగా రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

రెండు అరెస్టులు... ర‌గులుతున్న విద్వేషాలు!  

క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు ఇటీవ‌లి రాజ‌కీయ‌ప‌రిస్థితులు అద్దంప‌డున్నాయి. తెలంగాణాలో రాజ కీయ ప‌రి స్థితుల్లో వేగంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు అందుక్కార‌ణం. ఇటీవ‌లి కాలంలో ఊహిం చ‌ని విధంగా టీఆర్ ఎస్, బీజేపీల మ‌ధ్య ర‌గులుతోన్న నిప్పు మ‌రింత రాజేసిన‌ట్ట‌యింది. అది మ‌రింత ర‌గులు కుని రెండు అరెస్టులు, రెండు పార్టీల మ‌ధ్య వైష‌మ్యాలు మ‌రింత‌గా పెంచాయి. బీజేపీ నేత‌లు రాజాసింగ్‌, బండి సంజ‌య్ అరెస్టులు ఇపుడు రెండు పార్టీల‌ను యుద్ధానికి మ‌రింత స‌న్న‌ధం చేశాయి.  హైద‌రాబాద్ పాత‌న‌గ‌రానికి చెందిన బీజేపీ నేత రాజాసింగ్‌ను మంగ‌ళ‌వారం (ఆగ‌ష్టు 23) అరెస్టు చేశారు. ఆయ‌న మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త గురించి కామెంట్ చేయ‌డం అందుక్కార‌ణం అన్నారు. గ‌తంలోనూ రాజా సింగ్ ఈ విధంగా ఒక మ‌తాన్ని ద్వేషిస్తూ చేసిన ప్ర‌సంగాలు బీజేపీనీ ఇబ్బందిపెట్టాయి. ఇది హైద‌రాబాద్ పాత న‌గ‌రంలో విద్వేషాల‌కు దారితీసే విధంగా ఉన్నాయి.  బీజేపీ నాయ‌కుల‌కు ఇలాంటి ర‌చ్చ చేయ‌డం ప‌రి పాటిగా మారింది. ఎన్నిక‌ల స‌మ‌యానికి ముందు, మ‌రేద‌యినా కీల‌క స‌మావేశాల‌కు ముందు త‌ప్పకుం డా ఏదో ర‌కంగా గొడ‌వ‌లు సృష్టించ‌డం వారికి వెన్న‌తో పెట్టిన విద్య‌గా మారింది.  కాగా రాజాసింగ్ ఆగ్రహాని కి కార‌ణం స్టాండ‌ప్ క‌మెడియ‌న్ మునావ‌ర్ హిందువులను, భార‌తీయ‌త‌ను అప హాస్యం చేసే విధంగా అత ని షోలు ఉంటున్నాయ‌ని రాజాసింగ్ ఆరోప‌ణ‌. వాటిని ఏవిధంగానూ కొన‌సాగిం చ‌రాద‌ని ఆయ‌న నినదిం చారు. అలాంటివారిని ప్రోత్స‌హించ‌డం హిందువుల‌ను కించ ప‌ర‌చడంతో స‌మాన‌మ‌ని భావించే మునా వ‌ర్ మీద బీజేపీ నేత మండిప‌డ్డారు. అయితే బీజేపీ నేత వ్య‌వ‌హ‌రించిన తీరువ‌ల్ల మ‌త‌విద్వేషాలు  రేగుతున్నాయ‌న్న ఆందోళ‌న ప‌ట్టుకుంది.  న‌గ‌రంలో రెండువ‌ర్గాల మ‌ధ్య విభేదాలు మ‌ళ్లీ త‌లెత్తి  గొడ‌వలు, విధ్వంసాల‌కు దారితీసే ప‌రిస్థితుల‌ను అణిచివేయ‌డానికే బీజేపీ నేత‌ను అరెస్టు చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణాలో  మ‌త‌సామ ర‌స్యం వెల్లివిరుస్తోంద‌ని, క‌లిసిమెల‌సి జీవిస్తున్నార‌న్నది అంద‌రికీ తెలిసిన స‌త్యం.  కాగా బీజేపీ నేత మాత్రం ప్ర‌మాద‌క‌ర‌ కామెంట్ల‌తో ఆ సహృత్ భావ వాతావ‌ర‌ణాన్ని దెబ్బ‌తీసేలా చేస్తున్నార‌న్న విమర్శలు చాలాకాలం నుంచే ఉన్నాయి. బీజేపీవారికి కేసీఆర్‌ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా ఉంది. క‌నుక పాలన‌లో, ఇత‌ర అంశాల్లోనూ అడ్డుకునే మార్గాల‌కే బీజేపీ ప్రాధాన్య‌త నిస్తోంద‌న్న‌ది  విమ‌ర్శ‌కుల మాట‌. గొడ‌వ‌లు సృష్టించ‌డం ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం నిరుప‌యోగం అన్న‌ది జాతీయ చిత్ర‌ప‌టం మీద ప్ర‌ద‌ర్శించ‌డం  బీజేపీ ఒక ఆన‌వాయితీగా పెట్టుకుంది. ఈ విబేదాలు సృష్టించే త‌త్వ‌మే ఇక్క‌డ ప్ర‌భుత్వంతో, మ‌రీ ముఖ్యంగా కేసీ ఆర్ తో  గొడ‌వ‌లు ముద‌ర‌డానికి ప‌రిస్థితులు దారి తీశాయి.   కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను పోలీసు లు అరెస్ట్ చేశారు. దీంతో జనగాంలో ఆయన పాదయాత్ర శిబిరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీగా పోలీసుల మోహరించి బండిని అరెస్టు చేశారు. బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ కార్యకర్తలు తీవ్రం గా ప్రతి ఘటించారు. పోలీసులు అటువైపు వచ్చేందుకు వీలు లేకుండా పక్కా వ్యూహాన్ని పన్నారు పార్టీ శ్రేణులు. ఆయన చుట్టూ భద్రతా వలయంగా కార్యకర్తలు ఏర్పడ్డారు. వాళ్లను పక్కకు లాగిపడేశారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బండి సంజయ్‌ను తీసుకెళ్తున్నంత సేపు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియుకుండా పోయింది.  ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కవిత టార్గెట్‌గా బీజేపీ ఆగ ష్టు 22న‌ ఎదురు తాడి చేసింది. సాయంత్రానికి బీజేపీకి చెందిన మహిళా నేతలు... కవిత ఇంటి ముట్ట డి కి యత్నించారు. స్కాంలో ఇరుక్కున్న ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశా రు. వారిని అరెస్టు చేసిన పోలీసులు... వారిపై కేసులు పెట్టారు.  బీజేపీ శ్రేణులపై పెట్టిన కేసులపై భగ్గుమన్నారు బీజేపీ లీడర్లు. వెంటనే కేసులు ఉపసంహరించు కోవా ల్సిందేనంటూ పట్టుపట్టారు. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు నిరసనకలకు బీజేపీ రాష్ట్రాధ్య క్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. అంతే కాదు తమ శ్రేణులు, నేతలపై అక్రమ కేసులు పెడుతు న్నారంటూ తానే స్వయంగా దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు.  ప్రస్తుతం జనగామలో పాదయాత్రలో ఉన్న బండిసంజయ్‌ అక్కడే దీక్ష చేసేందుకు రెడీ అయ్యారు. కేసీ ఆర్‌ ప్రభుత్వ తీరుకు నిరసనగా ధర్మ దీక్ష పేరుతో నిరసన చేపడుతున్నట్టు ప్రకటించారు. నల్లబ్యాడ్జీలు ధరించి అంతా జనగామలో కూర్చునేందుకు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం వరకు దీక్ష చేసి మధ్యాహ్నం తర్వాత పాదయాత్ర కంటిన్యూ చేయాలని నిర్ణయించారు.  ధర్మ దీక్షకు కూర్చుంటున్న టైంలో జనగామ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసుల రంగప్రవేశంతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అరెస్టు చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణు లు వలయాలుగా ఏర్పడి... బండికి రక్షణ గోడలా నిలబడ్డారు. పోలీసులు అటువైపు రాకుండా జాగ్రత్త ప డ్డారు. వారందర్నీ పక్కకు నెట్టేస్తూ పోలీసులు బండిని అదుపులోకి తీసుకున్నారు. కానీ జీపులో ఆయ న్ని ఎక్కించుకొని అక్కడి నుంచి బయటపడేందుకు మాత్రం శ్రమ పడాల్సి వచ్చింది.  ఢిల్లీలో బ‌య‌ట‌ప‌డిన లిక్క‌ర్ స్కామ్‌లో కేసీఆర్ త‌న‌య క‌విత త‌దిత‌రుల పేర్లు బ‌య‌టికి రావ‌డంతో బీజే పీ నాయ‌కులు తెలంగాణాలో ఎక్క‌డిక‌క్క‌డ కేసీఆర్ వ్య‌తిరేకంగా  నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. ఊహిం చ‌ని విధంగా క‌విత‌, కేసీఆర్ కుటుంబ స‌భ్యులంతా కూడా దీనికి సంబంధించిన వ్య‌వ‌హారంలో భాగ‌స్తులే అన్న‌ది బ‌య‌ట‌ప‌డింది. ఆమె అక్క‌డి అధికారుల‌తో స‌మావేశం కావ‌డం సంబంధించిన స‌మాచారం వెలుగులోకి వ‌చ్చింది. దీనికి తోడు ఆమె ఇటీవ‌లి కాలంలో రాష్ట్రానికి సంబంధించిన ఏ కార్య‌క్ర‌మంలోనూ ఎక్క‌డా పాల్గొన్న దాఖ‌లాలు లేక‌పోవ‌డం కూడా గ‌మ‌నార్హం. పైగా కేసీఆర్ గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న వెన‌క కూడా క‌థ‌నాలు విన‌వ‌చ్చాయి.  పంజాబ్‌లో ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. కాగా  ఆ  ఎన్నిక‌ల వ్య‌యం కేసీఆర్ ఏర్పాటు చేశార‌న్న వార్త ప్ర‌చారంలో ఉంది. దీన్ని గురించి రాష్ట్రంలో బీజేపీ మ‌రింతగా  టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం మీద ఉద్య‌మిస్తూండ‌డం కేసీఆర్‌కు మింగుడుప‌డ‌టం లేదు. ఈ కార‌ణంగానే బీజే పీ నేత‌లు ఎక్క‌డ ఏ కార్య్ర‌క‌మం నిర్వ‌హించుకుండా అడ్డుప‌డుతూ వ‌స్తున్నారు. ఈ క‌క్ష‌లో భాగంగానే ఈ క‌క్ష‌లో భాగంగానే  బండిసంజ‌య్‌ను అరెస్టు చేయ‌డం జ‌రిగింద‌న్న‌ది విమ‌ర్శ‌కుల మాట‌.  క‌క్ష సాధింపు చ‌ర్య‌లు ఒక‌రికి మించి మ‌రొక‌రు చేప‌ట్ట‌డం బీజేపీ, టీఆర్ ఎస్ ఈ విధంగా ప్ర‌జ‌ల‌కు తెలియ జేశారు. కేవ‌లం టీవీ టాక్ షోలు, బ‌హిరంగ స‌భ‌ల్లో, పాద‌యాత్ర‌ల్లో భారీ విమ‌ర్శ‌లు చేసుకోవ‌ డంతో ఆగ‌క అరెస్టుల‌ప‌ర్వానికి తెర‌లేపింది టీఆర్ ఎస్‌. ఇది బీజేపీ ప‌ట్ల టీఆర్ ఎస్‌కి ర‌గులు తోన్న ఆగ్ర‌హానికి నిద ర్శ‌నం. 

కేసీఆర్.. కేటీఆర్ మధ్య ఎడం పెరిగిందా..?

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసుడు, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్  అందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. నిజానికి, 2018 ఎన్నికలకు ముందు నుంచి కూడా త్వరలోనే కేటీఆర్ పట్టాభిషేకం తథ్యమనే వార్తలొచ్చాయి. ముహూర్తాలు ఖరారయ్యాయి. బహిరంగ వేదికల నుంచి మంత్రులు, తెరాస ముఖ్య నేతలు, అయన సమక్షంలోనే  కేటీఆర్ ను కాబోయే ముఖ్యమంత్రిగా సంభోదించారు. అయితే, అక్కడక్కడా వినిపిస్తున్నట్లుగా  కుటుంబ కలహాలు కారణమా,ఇంకేదైనా కారణమా, ఏమో కానీ, విఘ్నేశ్వరుని పెళ్లి ముహూర్తం లాగా, కేటీఆర్ పట్టాభిషేక ముహూర్తానికి బ్రేకులు పడుతూనే ఉన్నాయి.  రామన్న పట్టాభిషేక ముహుర్తం ఇంతవరకు ముడిపడలేదు. అయితే ఇటీవలి కాలంలో కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం లేదు. అందుకు కారణం కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసే విషయంలో కేసీఆర్ ఎటూ తేల్చక పోవడమే అని అంటున్నారు. కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించినప్పటి నుంచీ ఆయన ఇప్పుడో అప్పుడో ముఖ్యమంత్రి కావడం ఖాయమని విస్తృతంగా ప్రచారం అయ్యింది. అయితే ఆ ముహూర్తం ఇంత వరకూ ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలోనే తండ్రి తనకు సీఎంగా ప్రమోషన్ ఇచ్చే విషయంలో చేస్తున్న తాత్సారం పట్ల కేసీఆర్ ఒకింత ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందే సీఎంగా కేటీఆర్ పట్టాభిషిక్తుడు కావడం ఖాయమన్న రీతిలో పార్టీలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ప్రచారం పూర్తిగా నిలిచిపోయింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వేసిన అడుగులను ఒక్కటొక్కటిగా వెనక్కు తీసుకునే పరిస్థితులు ఎదురవ్వడంతో ఆయన ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో ముచ్చటగా మూడో సారి టీఆర్ఎస్ ను అధికారంలోనికి తీసుకు రావడంపైనే దృష్టి సారించారు. దీంతో కేటీఆర్ కూడా నిర్వేదానికి గురయ్యారని అంటున్నారు. అందుకే ఇటీవల ఒక సందర్భంగా   మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆరే అని కేటీఆర్ స్వయంగా ప్రకటించారు.  ఈ కారణంగానే తండ్రి కొడుకుల మధ్య ఒకింత ఎడం పెరిగిందని పరిశీలకులు అంటున్నారు. అందకు తగ్గట్టుగానే తండ్రీ కొడుకులు ఇరువురూ ఒకే వేదికపై ఇటీవలి కాలంలో కనిపించిన దాఖలాలు లేవు. ఆఖరికి స్వాతంత్ర్య వజృత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన సమావేశానికి కూడా కేటీఆర్ కనిపించలేదు. కేటీఆర్ మొత్తంగా పార్టీ కార్యక్రమాలకూ, సభలూ సమావేశాలకూ దూరంగా ఉంటున్నారా అంటే అదేం లేదు. ఆయన ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. సభలు, సమావేశాలూ, ప్రారంభోత్సవాలలో చురుకుగా పాలుపంచుకుంటున్నారు. అయితే తండ్రితో మాత్రం వేదిక పంచుకోవడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు అసలు ఎదురుపడుతున్న దాఖలాలే లేవు. కేసీఆర్ పాల్గొంటున్న సభలలో కేబినెట్ సభ్యులందరూ పాల్గొంటున్నారు. ఒక్క కేటీఆర్ తప్ప. దీంతోనే పరిశీలకులు ఇరువురి మధ్యా ఏదో జరిగిందనీ, తండ్రీ కొడుకుల మధ్య ఎడం పెరిగిందనీ అంటున్నారు. అందుకు కేటీఆర్ సీఎం ఆకాంక్షకు కేసీఆర్ ఎప్పటికప్పుడు కళ్లెం వేయడమేనని విశ్లేషిస్తున్నారు. అదలా ఉంటే.. కేసీఆర్ తనయ కవిత కూడా ఇటీవలి కాలంలో పెద్దగా పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నట్లు కనిపించడం లేదు. తనపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో సోమవారం (ఆగస్టు 22)న మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి ఆశీర్వాదం తీసుకుంటూ కనిపించారు. అలాగే బోనాల సందర్బంగా బంగారు బోనం సమర్పింస్తూ మీడియా ముందుకు వచ్చారు. చాలా వరకూ ఆమె పార్టీ కార్యక్రమాలకు, బహిరంగ సభలకూ దూరంగానే ఉంటున్నారు. ఇలా కుమారుడూ,కుమార్తె కూడా తండ్రితో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. దీనిపై పరిశీలకులు పలు విశ్లేషణలు చేస్తున్నప్పటికీ కుటుంబ కలహాలు కారణమని మాత్రం గట్టిగా వినిపిస్తున్నది. అది కూడా కేటీఆర్ సీఎం ఆకాంక్ష నెరెవేర్చే విషయంలో కేసీఆర్ చేస్తున్న తాత్సారమే కారణమని అంటున్నారు. అయితే ఇంతలోనే ఇంత మార్పు ఎలా వచ్చింది? కొద్ది రోజుల క్రితం వరకూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెళతారని ఫ్రంట్ కాదంటే జాతీయ పార్టీ పెట్టేసి, ఢిల్లీ వెళ్లి పోతారని, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలను కేటీఆర్ కి అప్పగిస్తారని, అదనీ, ఇదనీ చాలా చర్చ జరిగింది. చాలా చాలా  ఉహాగానాలు వినిపించాయి. ఉహాగానాలు కూడా కాదు స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు జాతీయ ఆలోచనలను బహిరింగంగానే వినిపించారు.   మరోవంక  ఎక్కడా పెద్దగా ఖండనలు రాలేదు. తెరాస నాయకులు  ఎవరూ ఉహాగానాలను  కాదనలేదు. ఖండించలేదు. మరోవంక, అవును అది నిజమే అనే సంకేతాలు ఇస్తున్నారా అన్నట్లుగా కేటీఆర్ కూడా దూకుడు పెంచారు.   భాష మార్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవలసిన కీలక నిర్ణయాలు స్వయంగా అయనే తీసుకున్నారు. హఠాత్తుగా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఎవరూ కేటీఆర్ సీఎం అన్న మాటే మాట్లాడటం లేదు. అసలా ప్రతిపాదనే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామమే కేసీఆర్ పట్ల కేటీఆర్ అలకబూనడానికి కారణమని విశ్లేషణలు వినవస్తున్నాయి.  

మళ్లీ తెరపైకి జగన్మాయ.. లేపాక్షి నాలెడ్జ్ భూముల స్వాహాకు క్విడ్ ప్రొకొ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తండి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడే భారీ అవినీతి కేసుల్లో ఇరుక్కున్న జగన్ సీఎం అయిన  తరువాత మరింత రెచ్చిపోయారనడానికి ఇప్పుడు వెల్లువెత్తుతున్న ఆరోపణలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇసుక, మద్యం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న జగన్ ఒన్లీ క్యాష్ లావాదేవీలను కొనసాగించడమే ఆయన అవినీతి తిమింగలంలా మారారనడానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ మద్యం విధానంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ మంతా ఆన్ లైన్ లావాదేవీల వెంట పరుగులెడుతుంటే.. ఆఖరికి ఏపీ సర్కార్ బటన్ ద్వారా లబ్ధిదారులకు అందజేసే నగదు కూడా ఆన్ లైన్ ద్వారానే వెళుతుంటే ఒక్క మద్యం అమ్మకాలు మాత్రం క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో నిర్వహించడమే ఆ విధానంలో అవినీతి ఏరులై పారుతోందనడానికి నిదర్శనమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ ఆరోపణలన్నీ ఒకెత్తు అయితే అనంతపురం లేపాక్షి భూముల విషయంలో వెల్లువెత్తుతున్న ఆరోపణలు మరొక ఎత్తు అని విశ్లేషకులు అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ హయాంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేర ఇందూ ప్రాజెక్ట్స్ కు ఎకరం 50 వేల రూపాయల చొప్పున వేల ఎకరాల కేటాయింపు జరిగింది. అయితే వాటిలో పరిశ్రమలు, ప్రాజెక్టుల ఏర్పాటు మాటే ఏత్తని ఇందూ ప్రాజెక్టులు ఆ భూములను తాకట్టు పెట్టి వేళ కోట్ల రూపాయల రుణాలను దండుకుంది. అలా దండుకున్న సొమ్ములో కొంత భాగం జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులుగా మరలాయని సీబీఐ అప్పట్లో నమోదు చేసిన కేసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈడీ కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేసింది. దీంతో ఇందూ ప్రాజెక్ట్ చేతులెత్తేసింది. దీంతో బ్యాంకులు ఆ ప్రాజెక్టు దివాళా తీసిందని ప్రకటించేశాయి. దాంతో ఐదువందల కోట్ల రూపాయలకు ఇందు ఆస్తులను ఓ కంపెనీకి దారాదత్తం చేసేయడానికి బ్యాంకులు అంగీకరించేశాయి. అసలు బ్యాంకులు అందుకు ఎలా అంగీకరించాయో ఆర్థిక నిపుణులకు కూడా అర్ధం కాక తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఆ భూ కేటాయింపులను రద్దు చేసేసి చాలా కాలమైంది. ఆ భూములు ఇప్పుడు ఈడీ అధీనంలో ఉన్నాయి. అటువంటప్పుడు బ్యాంకులు ఆ భూములు తమ తనఖాలో ఉన్నాయంటూ.. ఏదో ఒక కంపెనీకి ఐదొందల కోట్ల రూపాయలకు అప్పనంగా అప్పగించేయడాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలి. కేటాయింపులు రద్దు చేశామని నోటీసులు పెట్టాలి.  అలా చేయడం లేదు.   ఇందు ప్రాజెక్ట్స్ భూములపై రూ. ఐదు వేల కోట్ల వరకూ అప్పులిచ్చిన బ్యాంకులు… దివాలా ప్రక్రియలో రూ. ఐదు వందల కోట్లిస్తే చాలని అంగీకరించడం వెనుక మతలబు ఏమిటి?  అలా కాకుండా ఆ భూములను వేలం వేస్తే ఇంకా ఎక్కువ సొమ్ము వస్తుంది కదా?  కానీ   బ్యాంకులు వేలం వేయకుండా.. రూ. ఐదువందల కోట్లిస్తామని వచ్చిన కంపెనీకే కట్టబెట్టడానికి సిద్ధమైపోవడం వెనుక ఉన్న జగన్మాయ ఏమిటి? ఇప్పుడు లేపాక్షి నాలెడ్జ్ భూములను కొనుగోలు చేస్తున్న సంస్థలో జగన్ మేనమామ.. రవీంధ్రనాథ్ రెడ్డి కుమారుడు ఒక డైరక్టర్‌. ఈ కంపెనీకి డబ్బులు సమకూరుస్తోంది ఏపీలో పోర్టులు..సెజ్‌లు దక్కించుకున్న అరబిందో సంస్థ.   సో భూమి గుండ్రంగా ఉంది అన్నట్లు ఎక్కడెక్కడ స్కామ్ లూ తిరిగి తిరిగి జగన్ అక్రమాస్తుల కుంభకోణం దగ్గరకే చేరుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ ఇందు ప్రాజెక్టు ఆస్తులను 500 కోట్ల రూపాయల అతి చౌక ధరకు అప్పనంగా తీసేసుకుంటున్న సంస్థ పేరు ఎర్తిన్ ప్రాజెక్టు. ఆ సంస్థ డైరెక్టర్ జగన్ మేనమామ కుమారుడు. ఎర్తిన్ కు నిధులు సమకూరుస్తున్నది ఏపీలో పోర్టులు సెజ్ లను దక్కించుకున్న అరబిందో సంస్థ. దీంతో  ఈ డీల్ మొత్తం క్విడ్ ప్రొకొ అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.