ద్రావిడ్‌కి కోవిడ్... ఆసియా కప్‌కి దూరం
posted on Aug 23, 2022 @ 3:36PM
ఆసియా కప్ 2022 పోటీలకు ముందు టీం ఇండియా జట్టు హెడ్ కోచ్రా హుల్ ద్రావిడ్ కరోనా బారిన పడ్డారు. ఆసియా కప్ పోటీలకు వెళ్లే ముందు క్రికెట్ జట్టు క్రీడాకారులు, ఇతర సభ్యులకు ముందస్తు కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో రాహుల్ ద్రావిడ్ కు పాజిటివ్ అని మంగళవారం తేలింది. యునై టెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కరోనా నెగిటివ్ తో వచ్చిన రాహుల్ ద్రావిడ్ కు తాజా పరీక్షల్లో కొవిడ్ పాజి టివ్ అని తేలిందని బీసీసీఐ తెలిపింది. రాహుల్ ద్రావిడ్ బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని, నెగిటివ్ రిపోర్టు వచ్చాక రాహుల్ ద్రావిడ్ టీంతో కలుస్తారని బీసీసీఐ పేర్కొంది. రాహుల్ ద్రావిడ్ సెలక్షన్ కమిటీలో ఉండటం వల్ల జింబాబ్వే సిరీస్ కు వెళ్లలేదు.
కాగా కోవిడ్ అనేది కేవలం ఫ్లూ వంటిదేనని దీన్ని కారణంగా చేసుకుని ద్రావిడ్‌ను టోర్నీకి దూరం చేయ డం పట్ల టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి మండిపడ్డాడు. ఆగష్టు 28 ఆదివారం దుబాయ్ లో ఆరంభం కానున్న టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ జట్టు చిరకాల ప్రత్యర్ధి పాక్‌తో తలపడుతుంది. కానీ డ్రసింగ్ రూమ్‌లో ద్రావిడ్ లేనిలోటు తెలుస్తుందని శాస్త్రి అన్నారు.
కోవిడ్‌ను అంత సీరియస్ గా తీసుకోవడమేమిటన్నారు. కోవిడ్ సంబంధించిన మందులు వాడితే సరి పోతుందని, అందుకు డాక్టర్లు సలహాలు సూచనలు ఎలాగూ ఉంటాయి. కానీ టోర్నీ మొత్తానికి ఆ కారణం చెప్పి ద్రావిడ్‌ను దూరం చేయడం సబబు కాదని అభిప్రాయపడ్డాడు. అయితే ద్రావిడ్ యుఎఇ కి జట్టు తో పాటు వెళ్లడానికి ముందు జరిపిన పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ వచ్చిన కారణంగానే ద్రావిడ్‌కు అవకాశం ఇవ్వలేదని బీసీసీఐ కార్యదర్శి జై షా ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసియా కప్ టీ-20 టోర్నీలో శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, భారత్, పాకిస్తాన్ పాల్గొంటున్నాయి. వాస్తవానికి భారత్, పాకిస్తాన్ ల మధ్య ద్వైపాక్షిక టోర్నీలు రద్దయ్యాయి. కానీ ఇతర టోర్నీల్లో పోటీపడుతూనే ఉన్నాయి. ఆసియాకప్ తొలి మ్యాచ్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ తలపడతాయి. అలాగే భారత్, పాక్ పోటీపడతాయి. గత ఏడాది దుబాయ్‌లో జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ పది వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే.