ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అరెస్టు
posted on Sep 11, 2022 @ 1:48PM
ఏపీలో పోలీసుల హడావుడి మరీ ఎక్కువయింది. తమ పార్టీ అధినేతపై, సీనియర్ నేతపైనా అనుచిత వ్యాఖ్యలు చేసినం దుకు వారిపై ఫిర్యాదులు చేయ డానికి వెళుతున్న టీడీపీ నాయ కులను అడుగు ముందుకు వేయకుండా పోలీసులు అడ్డు కుంటున్నారు. విపక్షనేతలను పోలీసులు అడ్డుకున్నతీరు వారు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్న ట్టుగా ఉందని పరిశీలకులు అం టున్నారు. రాజకీయంగా ప్రజల్లో మద్దతు కోల్పోతున్న అధికార పార్టీ వైసీపీ పోలీసుల సాయంతో విపక్షాలను అరికట్టాలని చూడ టం దురదృష్టకరమని విశ్లేషకుల మాట.
తెలుగుదేశంపార్టీ అధినేత చంద్ర బాబు, లోకేష్‌లపై మాజీ మంత్రి కోడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై గుడివాడ పోలీసు స్టేషన్‌కి ఫిర్యాదుచేసేందుకు వెళుతున్న టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. గుడి వాడ వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు అన్నారు. కాగా పామర్రులోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కంకిపాడు టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మో హన్ వాహానాన్ని పోలీసులు అడ్డుకుని అతనిని అరెస్టు చేసి, ఉంగుటూరు పీఎస్‌కు తరలించారు.
చంద్రబాబు కుటుంబంపై వ్యాఖ్యలుచేస్తే, ఆకాశంపై ఉమ్మేసినట్టేనని, అలాంటి వ్యాఖ్యల ద్వారా చరిత్ర హీనుడిగా నిలిచిపోతావని మాజీ మంత్రి కొడాలి నానికి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం కోశాధికారి శ్రీరాం తాతయ్య హితవు పలికారు. సంస్కారహీనంగా కుటుంబ స్త్రీలు, మహిళలపట్ల సభ్య సమాజం ఏమాత్రం సహించని వ్యాఖ్యలు చేయటం ఎవరు హర్షించరన్నారు. రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి కొఠారు సత్యనారాయణప్రసాద్ మాట్లాడుతు, డిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం జగన్ కుటుంబసభ్యుల పేర్లు వినిపిస్తుంటే ప్రజల దృష్టి మరల్చేందుకు కొడాలితో సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు.
నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కన్నెబోయిన రామలక్ష్మి మాట్లాడుతూ, కొడాలి నానికి దమ్ముంటే తన రౌడీ అను చరులు, పోలీసులు లేకుండా మహిళల వద్దకు వచ్చి అలాంటి మాటలు మాట్లాడాలని సవాల్ చేశారు. త్వరలోనే తెలుగు మహి ళలు నాని తాట తీస్తారని హెచ్చరించారు. నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు కానూరి కిశోర్ మాట్లాడుతూ, కొడాలి ప్రెస్‌మీట్ అంటే ప్రజలు టీవీలు కట్టేసుకుంటున్నారని, ఇకనైనా సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు.