చెవిలో పాము పిల్ల!
posted on Sep 12, 2022 @ 2:35PM
ఆమధ్య ఒక మహిళ చెవిలోంచి సాలీడు వస్తేనే అమ్మో ఇది ఎలా జరిగింది అని తెగ ఆశ్చర్యపడ్డారు. ఇపుడు ఏకంగా ఒక మహిళ చెవిలో చిన్న పాము ఉండడం నెటిజన్లను మరింత ఆశ్చర్యపరుస్తోంది, భయ పెడుతోంది కూడా. ఎందుకంటే అది పాము. దానికి ఇబ్బంది అనిపిస్తే కాటూ వేస్తుంది. పచ్చని రంగులో ఉన్న పాము ఆమె చెవిలోంచి బయటికి రావడానికి ఇష్టపడటంలేదట! డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు.
చందన్ సింగ్ తన ఫేస్బుక్ దానికి సంబంధించిన వీడియో పెట్టాడు. చాలామందికి భయమేసింది. అసలు పాము పిల్లయినా చెవిలోకి ఎలా వెళ్లిందా అని! దానికి సమాధానం లేదు. కానీ ఆమె చెవిలో ఉండడంమాత్రం చూపించింది. చాలామంది అదంతా ఫేక్ అనీ అంటున్నారు. డాక్టర్ దాన్ని చెవి లోంచి బయటికి తీస్తుండడం ఫేక్ ఎలా అవుతుంది? అయితే పాము పిల్లలు ఇళ్లలోకి వచ్చి చాలా రోజులు మనుషులకు కనిపించ కుండా ఉంటూనే ఉంటాయి.
నిద్రపోతున్న సమయంలో ఇలా జరగడానికీ ఆస్కారం ఉంటుందని అంటు న్నారు. అందువల్ల తోటలు, అటవీప్రాంతాల్లో ఉండేవారు రాత్రిపూట చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ కూడా చాలా పర్యాయాలు హెచ్చరిస్తూనే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ పాము స్నేహంతో ఆమె ప్రాణం పోయేలోపే ఆమెను రక్షించమని ఆమె బంధువులు వేడుకుంటున్నారట