అయ్యో పాపం రోజా మేడం అవుటై పోయారు!
అయిపొయింది,. మంత్రి రోజా నోటికి గట్టిగానే పని చెపుతున్నారు.అంతకు ముందు ఎలా ఉన్నా కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆమె మాటల దూకుడు పెంచారు. అంతవరకు ఉన్న కొద్ది పాటి కట్టుబాట్లను కూడా తెంచుకుని మరీ రెచ్చి పోయారు. ఏమి మాట్లాడుతున్నారో, ఎవరిని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నామో తెలియకుండా, కనీసం స్థాయి బేధం అయినా, పట్టించుకోకుండా, పోయి ప్రతిపక్షమ మీద విరుచుకు పడుతున్నారు.
అయినా, నోరు దాచుకోకుండా అంతలా కష్ట పడుతున్నా, చివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆమెను,’గడప గడప’కు పరీక్షలో ‘ ఫెయిల్ చేశారు. పనితనం పెంచుకోక పొతే, పక్కన పెట్టక తప్పని హెచ్చరించారు‘గడప గడప’ పరీక్ష ఫెయిల్ అయిన ఏమ్మేల్యేల ఫస్ట్ లిస్ట్’ లోని 27 ఎమ్మెల్యేలలో మంత్రి ఆర్కే రోజా పేరు కూడా వుంది. అఫ్కోర్స్, ఆమెతో పాటుగా, తానేటి వనిత, కారుమూరు నాగేశ్వరరావు, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కూడా ఉన్నారను కోండి, అది వేరే విషయం. కానీ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పక్షం రోజుల్లోనే రోజాకు రెండవ సారి వార్నింగ్ ఇవ్వడంతో పాటుగా ఇదే ఫైనల్ వార్నింగ్ అని హెచ్చరించడంతో రోజా రాజకీయ భవిష్యత్ ఏమిటనే విషయంలో ఆమె సన్నిహిత వర్గాల్లో చర్చ మొదలైంది. చివరకు రోజా పరిస్థితి, ‘ఒక్క సారి మంత్రి చేయి గణనాథా, నువ్వు ఓడకుంటే ఒట్టు పెట్టు గణనాథ’ అన్న చందంగా మారుతుందా అన్న ఆందోళన ఆమె సన్నిహితుల్లో మొదలై నట్లు, చెపుతున్నారు.
నిజానికి, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. చివరకు అసెంబ్లీలో దూకుడు ప్రదర్శించి సంవత్సరం పాటు సస్పెండ్ కూడా అయ్యారు. ఒక విధంగా వైసీపీ ఫేస్ గా, జగన్ రెడ్డి, ఇన్నర్ సర్కిల్ లో ఒకరుగా మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫస్ట్ కాబినెట్ లోనే తనకు బెర్త్ ఖాయమన్న ధీమాతో, రోజా ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే మంత్రిగా ప్రమాణ స్వీకారానికి రెడీ అయిపోయారు. ఎంతవరకు నిజమో ఏమో కానీ, ప్రమాణ పత్రం తెచ్చుకుని బట్టీ పట్టారని కూడా అంటారు. అయితే జగన్ రెడ్డి రోజాకు తొలి మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వలేదు. కార్పొరేషన్ చైర్మన్ పదవితో సరిపెట్టారు. ఆ విధంగా, కలలలో తేలియాడుతున్న రోజా, జగనన్న ఇచ్చిన షాక్ కు ఖగుతున్నారు.అవాక్కయ్యారు అని అంటారు.
ఇక అక్కడి నుంచి మంత్రి వర్గ విస్తరణ కోసం. ఇంకా తెలవారదేమి అంటూ చకోరా పక్షిలా ఎదురు చూశారు. గుళ్లూ గోపురాలూ తిరిగారు. నోములూ వ్రత్రాలూ చేశారు. జ్యోతిషులను నమ్మి శాంతులు, హోమాలు గట్రా చేయించారు. ఒకటని కాదు, ఏమేమి చేయాలో అన్నీ చేశారు. చివరకు ఏ దేవుడు కరుణించాడో, ఏ ప్రభువు ఆశ్వీదరించారో, గానీ, ఆమె కల నెరవేరింది. జగనన్న కొంచెం ఆలస్యంగానే అయినా, రెండవ విడత, గత డిసెంబర్ లో చేపట్టిన మంత్రి వర్గ పునర్వ్యవస్తీకరణలో ఆమెకు అవకాశం కల్పించారు. పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి శాఖను కేటాయించారు. శాఖ ఏదైతేనేం మంత్రి అయ్యానని ఆమె హ్యాపీహ్యపీస్ గా సంతోషంగా ఉన్నారు.
అయితే, మంత్రి పదవి వచ్చి ఇంకా నిండా ఆరు నెలలు అయినా నిండక ముందే, పిడుగులాంటి వార్త వచ్చి పడింది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పెట్టిన, గడప గడపకు పరీక్షలో రోజా ఫెయిల్ అయ్యారని, స్వయంగా ముఖ్యమంతే అందరి ముందు ప్రకటించారు.
రెండు నెలలు సమయమిచ్చి, ఈలోగా, పాస్ మార్కులు తెచ్చుకుంటే సరి, లేదంటే మంత్రి పదవి కాదు, ఎమ్మెల్యే టికెట్’కే భరోసా లేదని ఖరా ఖండిగా, చెప్పారు. దీంతో, మంత్రి పదవి మూడునాళ్ళ ముచ్చటేనా, అనే విషాదం యోగంలోకి రోజా జరుకున్నారని అంటున్నారు. చివరకు ఎమౌతుందో, ఏమో కానీ, ప్రస్తుతానికి అయితే రోజా రాజకీయ జీవితం తెర మరుగయ్యే హెచ్చరికలు మాత్రం బలంగానే,వినిపిస్తున్నాయని, అంటున్నారు.ఆమె అభిమానులు అయితే అయ్యో పాపం రోజా మేడం ..అవుటై పోయారు...అంటూ పాడుకుంటున్నారు.