షర్మిలపై జగ్గారెడ్డి కౌంటర్లు.. ఏపీలో జగన్ కు ముచ్చెమటలు!

గదిలో స్విచ్ వేస్తే వరండాలో లైట్ వెలుగుతుంది. ఆ రెండింటికీ ఉన్న కనెక్షన్ అలాంటిది మరి. అలాగే తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలను విమర్శిస్తే.. ఆ విమర్శలు నేరుగా జగన్ కు తగులుతున్నాయి.  జగన్, షర్మిలల మధ్య ఉన్నది అన్నా చెళ్లెళ్ల బంధం మరి. జగన్ కు సీఎం పదవి ఇవ్వాలని నేనూ సంతకం చేశానంటూ జగ్గారెడ్డి చెప్పిన మాటలు ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నేరుగా జగన్ పేరు ప్రస్తావించకపోయినా ఆయన కోరిక మేరకే సంతకాల సేకరణ జరిగిందని జగ్గారెడ్డి చెప్పకనే చెప్పారు. అందుకు తానే ప్రత్యక్ష సాక్షిననీ అన్నారు. దాంతో గతంలో సంతకాల సేకరణ వాస్తవమే కానీ, ఆ విషయం జగన్ కు తెలియదంటూ అప్పట్లో  జగన్ సన్నిహితులు ఇచ్చిన వివరణలన్నీ అవాస్తవమని జగ్గారెడ్డి మాటలతో తేలిపోవడంతో ఇప్పుడు ఏపీలో జగన్ ఒకింత ఇబ్బందికర పరిస్థితుల్లో పడ్డారనే చెప్పాలి.  వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల  కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే జగ్గారెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఆయన ఏ పార్టీలో ఉన్నారో కనీసం ఆయనకూ క్లారటీ ఉందా అన్న అనుమానం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా జగ్గారెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ కోవర్ట్ అని ఆరోపణలు గుప్పించారు. మామూలుగానే జగ్గారెడ్డి ఫైర్ బ్రాండ్. ఆయన విమర్శలు చాలా ఘాటుగా ఉంటాయి. అటువంటి జగ్గారెడ్డికి షర్మిల తనను కేటీఆర్ కోవర్ట్ అంటూ విమర్శించడంతో ఆయనకు ఎక్కడ కాలాలో అక్కడ కాలింది.  దాంతో జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణలో షర్మిల రాజకీయ శక్తి కానే కాదని చెప్పారు. అక్కడితో ఆగకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు షర్మిల కంటే.. ఆమె సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు గట్టిగా తగిలాయి. జగ్గారెడ్డి వైఎస్ మరణించన నాటి సంగతులను ప్రస్తావించారు. వైఎస్ మరణించినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు, భార్యా పిల్లలూ తదుపరి ముఖ్యమంత్రి విషయంపైనే దృష్టి పెట్టారనీ, కుటుంబ పెద్ద మరణించిన బాధ వారిలో ఇసుమంతైనా కనిపించలేదనీ చెప్పారు. అందుకు తానే ప్రత్యక్ష సాక్షినని కూడా చెప్పారు. వైఎస్ మరణించిన సందర్భంగా వారిని పరామర్శించడానికి వెళ్లి తాము ఏడ్చామే తప్ప ఆయన కుమారుడూ, కుమార్తెలలో బాధ అన్నది ఇసుమంతైనా కనిపించలేదన్నారు. వైఎస్ మరణించిన సమయంలో జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ సంతకాలు పెట్టించిన వారిలో తానూ ఉన్నాననీ, సంతకాలు సేకరించమని తమకు ఆదేశాలు వచ్చాయనీ అన్యాపదేశంగా జగన్ ను ఉద్దేశించి ఆయన చెప్పారు. ఇప్పుడు జగ్గారెడ్డి వ్యాఖ్యలే సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. షర్మిల విమర్శలకు ఆయన ఇచ్చిన కౌంటర్ తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వైఎస్ దుర్మరణం పాలైన విషాద సమయంలో, ఇంకా అంత్యక్రియలు కూడా జరగకుండానే సీఎం పదవి కోసం జగన్ సంతకాల సేకరణలో నిమగ్నమయ్యారన్న విమర్శలు అప్పట్లో వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగ్గారెడ్డి వ్యాఖ్యలతో నాడు జగన్ పై సీఎం పదవి కోసం సంతకాలు సేకరించిన మాట వాస్తవమేనని తేలిపోయిందంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. జగ్గారెడ్డి మాటలు వాస్తవమేనని చెప్పేందుకు గతంలో వైఎస్ మరణం నాటి సంఘటనలను వివరిస్తూ నటుడు చిరంజీవి చేసిన ప్రసంగం తాలూకు వీడియో క్లిప్పింగ్ ఒకటి సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. ఆ ప్రసంగంలో చిరంజీవి వైఎస్ అంత్యక్రియలు జరగకుండానే జగన్ సీఎం కావాలంటూ కొందరు సంతకాల కార్యక్రమం చేపట్టారనీ, అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్న తనను కూడా సంతకం పెట్టాల్సిందిగా కోరారనీ వెల్లడించారు. అప్పుడు తాను వారికి అది సబబు కాదనీ, విషాద సమయంలో రాజకీయం కోసం, పదవుల కోసం వెంపర్లాడటం తగదనీ చెప్పానని పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవ్వడంతో జగ్గారెడ్డి, షర్మిలల మధ్య విమర్శల యుద్ధంలో జగన్ కు గాయాలు తప్పడం లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.  

వల్లభనేని వంశీ రాజకీయ సన్యాసం

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా? గన్నవరం నియోజకవర్గంలో విపరీతంగా జరుగుతున్న చర్చలను గమనిస్తే ఔననే అనిపించక మానదు. వంశీ రాజకీయవైరాగ్యానికి దారి తీసిన పరిస్థితులపై కూడా ఈ సందర్భంగా గన్నవరం నియోజవర్గంలో ఓ చర్చ యెడతెగకుండా సాగుతోంది.   జగన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు.  ఆ నిర్ణయం సరికాదంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వెంటనే ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ నిర్ణయంపై ఓ సారి పునరాలోచించాలంటూ సీఎం జగన్‌కు ఎమ్మెల్యే వంశీ సూచించారు. అయితే దీనిపై జగన్ నుంచి స్పందన లేదు సరికదా.. పలువురు వైసీపీ నాయకులు మంత్రులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు సహేతుకమైనదేనంటూ పోటీలు పడి మరీ ప్రకటనలు గుప్పించారు. చివరాఖరుకు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతీ కూడా తన భర్త పేరుపై ఉన్న హెల్త్ వర్సిటీ మార్పును స్వాగతించారు. మరోవైపు   జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు  నిరసన వ్యక్తం చేశారు.    ఇప్పటికే   జగన్ అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్‌గా చేసుకుని పాలన సాగిస్తున్నారనే ఆరోపణలు  వెల్లువెత్తుతున్నాయి. ఆ క్రమంలోనే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి.. వైయస్ఆర్ పేరు పెట్టారని అంటున్నారు. దీంతో అసలు పంచాయతీ అంతా   జగన్ వర్సెస్ ఆ  సామాజికి వర్గం అన్నట్లుగా తయారైందనే అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమౌతోంది.    ఇంకోవైపు..  2019 ఎన్నికల్లో   జగన్ హావా   తట్టుకొని వల్లభనేని వంశీ.. గన్నవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు.   ఆ తర్వాత కారణాలేమైనా.. వైసీపీ గూటికి చేరారు... అక్కడితో ఆగకుండా   టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఆయన ఫ్యామిలీపై వంశీ విమర్శలు గుప్పించారు.. దీంతో ఎన్టీఆర్ ఫ్యామిలీలోని వారంతా మీడియా ముందుకు రావడం ఆ విమర్శలను ఖండించారు.. ఆ తరువాత వల్లభనేని వంశీ ఓ టీవీ చర్చా కార్యక్రమంలో చంద్రబాబు ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పారు. అయితే అప్పటికే వల్లభనేని వంశీకి పూడ్చలేని నష్టం జరిగింది. ఇటు నమ్ముకున్న వైసీపీలో కూడా వర్గ రాజకీయాల కారణంగా ఆయనకు ఉక్కపోత ఆరంభమైంది.   గన్నవరం నియోజకవర్గంలో అధికార ఫ్యాన్ పార్టీలో గ్రూప్‌ల రాజకీయం.. వంశీ కి పొమ్మనకుండా పొగపెట్టేసింది.  వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ కోసం.. అటు యార్లగడ్డ వెంకట్రావు వర్గం.. ఇటు దుట్టా రామచంద్రరావు వర్గం.. హోరా హోరీగా పోటాపోటీ పడుతున్నాయి. ఒకానొక దశలో ఈ నియోజకవర్గ పంచాయతీ కాస్తా సీఎం జగన్ సతీమణి వైయస్ భారతి వరకూ వెళ్లింది.   ఆ క్రమంలో వైయస్ భారతి శివగామి తరహాలో సెటిల్‌మెంట్ చేసి... ఇరు వర్గాల వారిని టండా టండా కూల్ కూల్ చేశారనే ఓ టాక్ సైతం   వైరల్ అయింది. దీంతో గన్నవరం పంచాయతీ   సద్దుమణిగింది.  ఇక వల్లభనేని వంశీని ఈ సారి ఎలాగైనా ఎన్నికల్లో ఓడించాలన్న కృత నిశ్చయంతో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వంశీపై గెలిచే అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టారు. ఆ క్రమంలో పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ప్రస్తుత విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు. కానీ ఆయన ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు  ఆసక్తి చూపడం లేదని  సమాచారం.  మరోవైపై టీడీపీ నుంచి ఫ్యాన్ పార్టీలోకి జంప్ చేసిన వంశీకి వ్యతిరేకంగా ఎంత చేయాలో అంతా దుట్టా, యార్లగడ్డ వర్గాలు చేసేస్తున్నాయని సమాచారం. ఆ క్రమంలో ఇన్ని తలనొప్పుల మధ్య ఎన్నికల్లో పోటీ చేసే కంటే.. రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టేస్తే... బెటర్  అని వంశీ ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. మరి వల్లభనేని వంశీ.. రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారా? లేదా అనేది మరి కొద్ది రోజుల్లో తెలిపోతోంది. కానీ ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పడమే మంచిదన్న నిర్ణయానికి దాదాపు వచ్చేసినట్లేనని ఆయన సన్నిహితులు బాహాటంగానే చెప్పడం కొసమెరుపు. 

హ‌ర్యానా ప్ర‌భుత్వానికి  ఎన్‌జీటీ షాక్‌

చెత్త‌బుట్ట‌లో ప‌డేయాల్సిన చాక్లెట్ క‌వ‌ర్ బ‌య‌ట‌ప‌డేసింది పింకీ, వాళ్ల‌న్న సిగ‌రెట్ పీక కింద‌ప‌డేసేడు. అంతే వాళ్ల‌మ్మ తిట్టింది, మామ్మ‌గారు అలా ప‌డేయ‌కూడ‌ద‌న్నారు, పోనీలేద్దూ చిన్న‌పిల్ల‌న్నారు నాన్న‌. కానీ హ‌ర్యానా ప్ర‌భుత్వం చేసింది మ‌రీ చాలా చెప్ప‌లేనంత పెద్ద త‌ప్పు గ‌న‌క జాతీయ హ‌రిత ట్రిబ్యున‌ల్ (ఎన్‌జిటీ) మొట్టికాయ‌ల‌తో పాటు భారీ జ‌రిమానా విధించింది.   గురుగ్రామ్ డంపింగ్ యార్డును హ‌ర్యానా ప్రభుత్వం 2017లో ఒక చైనాకంపెనీకి  నిర్వ‌హ‌ణా  బాధ్య‌త‌ను అప్ప‌గించింది. కానీ ఆ సంస్థ నిర్ల‌క్ష్యం చేసింది. ఫ‌లితంగా చెత్తను కాల్చిన‌పుడు వెలువ‌డే పొగ‌తో గాలి క‌లుషిత‌మ‌యింది. ఈ కార‌ణంగా చుట్టుప‌క్క‌ల ప్ర‌జ‌లు అనారోగ్యాల‌కు గుర‌వుతున్నారు. అంతే కాకుండా అక్క‌డ‌కి ద‌గ్గ‌ర్లోనే ఉన్న అభ‌యా ర ణ్యంలోని జంతువులకు కూడా ప్రాణ‌హాని ఉంద‌ని ఎన్‌జీటీ అభిప్రాయపడింది. ఈ కార‌ణంగా హ‌ర్యానా ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌ధోర‌ణిని నిర‌సిస్తూ ఎన్‌జీటీ ఆ రాష్ట్ర ప్ర‌భు త్వంపై రూ.100 కోట్లు జ‌రిమానా విధించింది.  ఎన్‌జీటీ ఈ విధంగా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఇది మొద‌టి సారి కాదు. ఇటీవ‌లే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి కూడా షాక్ ఇచ్చింది. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో ప‌ర్యావ ర‌ణ అనుమ‌తులు ఉల్లంఘించింది. ఈ కార‌ణంగా ఎన్‌జీటీ రాష్ట్ర ప్ర‌భుత్వానికి రూ.120 కోట్లు జ‌రిమానా వేసింది. ఇదేవిధంగా, ప‌ర్యావ‌ర‌ణం సంబంధించి ఎలాంటి అనుమ‌తులు లేకుండా క‌ట్టిన మూడు ప్రాజె క్టుల‌కే కూడా జ‌రిమానా విధించింది. పురుషోత్త‌ప‌ట్నం ప్రాజెక్టుకు రూ.24.56కోట్లు, ప‌ట్టిసీమ ప్రాజెక్టుకు రూ.24.90 కోట్లు, చింత‌ల‌పూడి ప్రాజెక్టుకు రూ.73.6 కోట్లు ఎన్‌జిటీ  జ‌రిమానా విధించింది. 

దుబాయ్‌లో ఉద్యోగావ‌కాశం.. అంత‌లో క‌బ‌ళించిన మృత్యువు

పుట్టుక‌తోపాటు మ‌ర‌ణాన్ని గౌర‌వించాలంటారు త‌త్త్వ‌వేత్త‌లు. వారికేం ఇలాంటివి ఎన్న‌యినా చెబు తారు.. ఒక‌రు దూర‌మయిన బాధ‌ను భ‌రించేవారికి తెలుస్తుందంటారు సామాన్యులు.  ఇంట్లో ఒక‌రు మ‌ర‌ణం వ‌ల్ల దూర‌మ‌యితే ఆ వ్య‌ధ జీవితాంతం పెను భారంగా మారుతుంది. మ‌రీ ముఖ్యంగా త‌మ‌ను భ‌విష్య‌త్తులో ద‌గ్గరుండి చూసుకోవాల్సిన కొడుకుని మృత్యువు అమాంతం తీసికెళిపోతే ఆ త‌ల్లిదండ్రుల వ్య‌ధ వర్ణ‌నా తీతం. తెలంగాణా రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ కె.చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి కుమారుడు 23 ఏళ్ల అభిజిత్ కార్డియాక్ అరెస్ట్‌తో మ‌ర ణించాడు.  వ‌రంగ‌ల్ ఎన్ఐటీలో కెమిక‌ల్ ఇంజ‌నీరింగ్ బీటెక్ చేసిన అభిజిత్ వ‌చ్చే నెల‌లో దుబాయ్‌లోని ఆయిల్ కంపెనీలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది.  రూ.58 లక్షల జీతంతో ఉద్యోగంలో చేరబోతున్న సమయంలో.. అభిజిత్  ఆకస్మిక మృతి ఆ కుటుంబాన్ని క‌ల‌చివేస్తోంది.  అంతా సంతోషకరంగా కొనసాగుతున్న తరుణంలో విధి వక్రీకరించింది. అభిజిత్ రెడ్డి ఛాతీలో ఇబ్బం దికి గురయ్యాడు. కుప్పకూలిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు వెంటనే సీపీఆర్ చేశారు. అనం తరం వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటిం చారు. కార్డియాక్ అటాక్ తో ఆయన చనిపోయినట్టు తెలిపారు.  మరోవైపు కార్డియాలజిస్ట్ డాక్టర్ వైపీ రెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుతం యువత అనేక కారణాల వల్ల ఒత్తిడు ల‌కు లోన‌యి హార్ట్ అటాక్ కు గురవుతున్నారని చెప్పారు.

రాష్ట్రంలో  భార‌తీ పే పోస్ట‌ర్ల క‌ల‌క‌లం!

నిర‌స‌న‌, వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేయ‌డానికి రాజ‌కీయ‌పార్టీలు, నాయ‌కులు అనేక మార్గాలు వెతుకుతున్నారు. ఇపుడు కొత్త‌గా పోర్ట‌ర్లువేసి మ‌రీ చెబుతున్నారు. ట్వ‌ట్ట‌ర్లు, మీడియా స‌మావేశాల్లో తిట్ట‌డం  కంటే ఇద యితే రాష్ట్ర‌మంతా తెలు స్తుంద‌న్న కొత్త ఆలోచ‌న‌ను అనుస‌రిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఈ త‌ర‌హా తీవ్ర వ్య‌తిరేక‌త‌ను  ప్ర‌ద ర్శించ‌డం ఇదే మొద‌టిసారి.  ఇది మ‌రింత పెర‌గ‌డానికి కార‌ణం గ‌తంలో చంద్ర బాబునాయుడు వియ్ డోంట్ వాంట్ ఎన్టీఆర్  అని అన్నారంటూ అప్ప‌టి ఆంగ్ల ప‌త్రిక క‌టింగ్‌తో  వైసీపీ  పోస్ట‌ర్లు వేసింది.  ఇపు డు  టీడీపీవారికి అలాంటి ప్ర‌చారంతో వైసీపీ, జ‌గ‌న్ స‌ర్కార్ ప‌రువును బ‌జారున పెట్టడానికి అవ‌కాశం ల‌భించింది. అందుకే పోటీగా టీడీపీ నేత‌లు భార‌తీ పే అనే పోస్ట‌ర్లు అంటిస్తున్నా రు. క‌ర్ణాట‌కాలో కాంగ్రెస్ పే టీఎంకు పేర‌డీగా పే సీఎం పోస్ట‌ర్లు వెలిసాయి.  అదే విధంగా  టీడీపీ నేతలు భారతీపే అనే పోస్టర్లు అంటిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పేటీఎంకు పేర డీగా పేసీఎం పోస్టర్లు తెచ్చి నలభై శాతం కమిషన్లు యాక్సెప్ట్ చేస్తార న్నట్లుగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా వైరల్ అయింది.  ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో నిందితుడిగా చిక్కిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అల్లుడు వాస్త‌వానికి స్కాం సొమ్మంతా ఏపీ సీఎం జ‌గ‌న్‌కు సంబంధించిన  ఒక సంస్థ‌లో పెట్టార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. దీని మీద టిడీపీ నాయ కులు విరుచుకుప‌డ్డారు. ముఖ్యమంత్రికి తెలియ‌కుండానే ఇదంతా జ‌రుగుతోందా అని టీడీపీ నాయ‌ కులు నిల‌దీశారు. కానీ ప్రభుత్వంనుంచి ఎలాంటి అలికిడీ లేక‌పోవ‌డ‌మే ఆ అనుమానాన్ని బ‌ల‌ ప‌రి చింది.  పైగా ఆ సొమ్మును జ‌గ‌న్ భార్య భార‌తి చెల్లించాల‌ని డిమాండ్ చేయ‌డ‌మేనా  మ‌రి ఈ  భార‌తీ పే పోస్ట‌ర్ల ల‌క్ష్యం!  రాజ‌కీయాల్లో ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు సంధించుకోవ‌డం ప‌రిపాటి. కానీ లిక్క‌ర్ స్కామ్‌లో బ‌య‌ట‌ప‌డిన పేర్ల‌లో జ‌గ‌న్ భార్య భార‌తి పేరు ప్ర‌స్తావ‌న‌కు రావ‌డంతో ఈ త‌ర‌హా పోస్ట‌ర్ల‌కు ఊత‌మిచ్చింద‌నాలి. ఒక పార్టీ మీద బుర‌ద జ‌ల్లేట‌పుడు త‌మ పార్టీ ప‌రిస్థితిని ప‌రిశీలించక‌పోవ‌డం వైసిపీ చేసిన త‌ప్పు. త‌మ పార్టీ వ్య‌వ హారాల‌న్నీ ఎంతో చ‌క్క‌గా, ఎలాంటి అవినీతికి పాల్ప‌డనివారితో సాగిపోతోంద‌ని భావించి ఇత‌ర పార్టీల మీద దుమ్ము జ‌ల్ల‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌డం అర్ధ‌ర‌హితం. 

క్యాసినో కేసులో ఈడీ విచారణకు తెరాస ఎమ్మెల్యే

తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో తెరాస ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ విచారణకు హాజయర్యారు. ఈడీ కార్యాలయంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళవారం (సెప్టెంబర్ 26) విచారించారు. ఈ కేసులో పలురంగాలతో పాటు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఉన్నట్లు ఆరోపణలు రావడంతో తెలుగు రాష్ట్రాలలో క్యాసినో కేసు సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ కేసులో క్యాసినో సూత్రధారి చీకోటి ప్రవీణ్ ను విచారించిన ఈడీ అతడి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలకు ప్రమేయమున్నట్లు ఈడీ నిర్థారణకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు రాజకీయ నాయకులకు ఈ కేసులో ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసిందని చెబుతున్నారు. అలా నోటీసులు అందుకున్నవారిలో తెరాస ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ మంగళవారం(సెప్టెంబర్ 26) విచారించి ఆయన నుంచి స్టేట్ మెంట్ తీసుకుంది. క్యాసినో కేసు ఉభయ తెలుగురాష్ట్రాలలో రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఇరు రాష్ట్రాలలోనూ అధికార పార్టీకి చెందిన ప్రముఖుల ప్రమేయం ఉందన్న వార్తలు అప్పట్లో మీడియాలో హల్ చల్ చేయడంతో హై ప్రొఫైల్ కేసుగా ఇది రాజకీయ ప్రకంపనలు సృష్టించింది

విభజన సమస్యల పరిష్కారం.. పురోగతి పూజ్యం.. నామ్ కే వాస్తేగా సమావేశాలు!

ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల అమ‌లు, అపరిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఎడతెగకుండా సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది. విభజన సమస్యల పరిష్కారం దిశగా కేంద్రం నిర్వహిస్తున్న సమావేశాలలో పురోగతి నత్తనడకను తలపిస్తోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశా కీలక సమావేశం నిర్వహించింది. మంగళవారం (సెప్టెంబర్ 27)  జరిగిన ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎస్ లు సోమేష్ కుమార్, సమీర్ శర్మ ల నేతృత్వంలో ఇరు రాష్ట్రాల నుంచీ ప్రతినిథి బృందాలు హాజరయ్యాయి.  ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశం కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ కుమార్‌ భ‌ల్లా నేతృత్వంలో జరిగంది. ఈ సమావేశంలో చర్చకు రూపొందించిన అజెండాలో 14 అంశాలను పొందుపరచగా వాటిలో పలు అంశాలు అసలు చర్చకే నోచుకోలేదని తెలియవచ్చింది. ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్యా తరచూ వివాదానికి కారణమౌతున్న విద్యుత్ బకాయిల అంశం ఈ సమావేశంలో ప్రస్తావనకే నోచుకోలేదని అధికార వర్గాల ద్వారా తెలిపింది. అంతే కాక చర్చ జరిగిన అంశాలలో కూడా ఇరు రాష్ట్రాల మధ్యా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమావేశం నిష్ఫలంగానే ముగిసిందని ఆ వర్గాలు తెలిపాయి. అంటే ఈ సమావేశం కూడా గత సమావేశాల లాగే ఏ సమస్యకూ పరిష్కారం చూపకుండానే ముగిసింది. తెలుగు రాష్ట్రాల సీఎస్ లు, వారి బృందాలూ కూడా తమ వాదనలకే కట్టుబడి ఉండటం, ఎదుటి వారి వాదనను వినే పాటి ఓపిక, ఆసక్తి కనబరచకపోవడంతో సమావేశం ఏ ప్రయోజనం లేకుండానే, ఏ పరిష్కారం కనుగొనకుండానే ముగిసిందని హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా మరో మారు సమావేశం అయ్యే అవకాశం ఉందా లేదా అన్నదానిపై కూడా ఎటువంటి స్పష్టతా లేదని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.సమావేశంలో చర్చకు వచ్చిన ఏ అంశంపైనా కూడా ఇరు రాష్ట్రాల మధ్యా పరస్పర అంగీకారం కుదరలేదు.  ఇక ఈ సమావేశంలో ఏపీ రాజధాని నిర్మాణం కోసం నిధులు కావాలని కోరగా ఇప్పటికే విడుదల చేసిన నిధుల వ్యయానికి సంబంధించిన లెక్కలు చెప్పిన తరువాతనే ఏపీ వినతిని పరిశీలిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.   మొత్తం మీద విభజన సమస్యల పరిష్కారంలో ఎలాంటి పురోగతీ లేకుండానే కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాలు ముగుస్తుండటం పట్ల ఇరు రాష్ట్రాలలోనూ అసంతృప్తి వ్యక్తమౌతున్నది. విభజన చట్టంలో స్పష్టంగా ప్రస్తావించిన అంశాలను కూడా అమలు చేయలేకపోవడం కేంద్రం నిర్లక్ష్య వైఖరికీ, ఇరు రాష్ట్రాల మధ్యా సమస్యల పరిష్కారంలో మోడీ సర్కార్ చిత్తశుద్ధి లేమికీ నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

వర్షం పడితే ‘అ’భాగ్యనగరమే!

అవే అవస్థలు, అవే సమస్యలు, అవే కష్టాలు, అవే ఇబ్బందులు..  చినుకు పడితే చాలు భాగ్యనగరం ప్రజలు తాము అభాగ్యులం అన్న భావనలోకి జారిపోయే పరిస్థితి.  రోడ్లు చెరువలు అవుతాయి. ఇళ్లళ్లో మోకాలి లోతు నీరు నిలిచిపోతుంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. హైదరాబాద్ మహానగరంలో వర్షం పడిన ప్రతి సారీ ఇదే పరిస్థితి. నాలాల ఆక్రమణలు, అక్రమ కట్టడాలే ఇందుకు కారణమనీ, వాటిపై ఉక్కుపాదం మోపుతామనీ ప్రతి సారీ ప్రభుత్వం చెబుతూనే ఉంటుంది. తరువాత అంతా మామూలే. వాన పడిందంటే అవే ఇబ్బందులు, అవే కష్టాలు. విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి అంటూ గప్పాలు కొట్టుకోవడమే తప్ప చినుకు పడితే ఆ విశ్వనగరం కాస్తా విశ్వనగరంగా మారిపోతున్నా పట్టించుకోరు అన్న విమర్శలు నగరవాసుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. రోడ్లు, డ్రైజేజీలు మరమ్మతులు జరుగుతున్న ప్రాంతాలలో జీహెచ్ఎంసీ ఘనంగా  మీ పన్నులతో జరుగుతున్న అభివృద్ధి అని అర్ధం వచ్చేలాంటి బోర్డులను ఏర్పాటు చేస్తున్నది. అయితే ఆ అభివృద్ధి గొప్పతనం బండారం ఒక వర్షం పడితే చాలు బయటపడిపోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే భాగ్యనగరం సోమవారం సాయంత్రం మరో సారి అనుభవించింది. సోమవారం సాయంత్రం భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో విశ్వనగరం చిగురుటాకులా వణికింది. నగరంలోని పలు ప్రాంతాలలో ఓ రెండు గంటల వ్యవధిలో సగటున ఆరు సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమై జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు చెరువులను తలపించాయి. గంటల తరబడి కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, దసరా పండుగ షాపింగ్‌ కోసం వాహనాలతో బయటకు వచ్చిన వారు నరకయాతన అనుభవించారు. సరూర్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, మలక్‌పేట్‌, కోఠి, మొజాంజాహి మార్కెట్‌, లక్డీకాపూల్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎర్రగడ్డ, బేగంపేట్‌, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, హైటెక్‌ సిటీ, జేఎన్‌టీయూ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉప్పల్‌, రామంతాపూర్‌, సరూర్‌నగర్‌, మలక్‌పేట్‌, నాంపల్లి, గన్‌ఫౌండ్రీ, మెహిదీపట్నం, గణాంకభవన్‌, ఆసి్‌ఫనగర్‌, అల్కాపురి కాలనీల్లో 7 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది.   నాంపల్లిలో 9.3 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షానికి  మూసారాంబాగ్‌ వంతెన నీట ముని  ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి.  

అసెంబ్లీ ఎన్నికల తర్వాత హస్తం గూటికి తెరాస !

జాతీయ స్థాయిలో బీజేపీ యేతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. సిద్ధాంత రాద్ధాంతాలను పక్కన పెట్టి 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా ఏకమయ్యేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రెండు రోజుల క్రితం హర్యానాలో మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఐఎన్ఎల్డీ బహిరంగ సభ వేదికగా  చేతులు కలిపిన ప్రాంతీయ పార్టీల నేతలు, కాంగ్రెస్, వామ పక్షాలతో కలిసే ముందుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు.  ఈ సమావేశంలో కీలక భూమిక పోషించిన, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయు అధ్యక్షుడు, నితీష్ కుమార్, కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా మూడవ ఫ్రంట్, నాల్గవ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పడే కూటమి మాత్రమే బీజేపీని ఓడించగలుగుతుందని, స్పష్టం చేశారు. బీజీపే, బీజేపీ యేతర పార్టీల ఏక  కూటమి ఒక్కటే ఉంటుందని మూడవ కూటమి వలన ప్రయోజనం ఉండదని  అది వృధా ప్రయాసే అవుతుందని, తెగేసి చెప్పారు. జేడీయు, ఆర్జేడీ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ తో కలిసి సాగుతాయని మిగిలిన పార్టీలు కూడా కాంగ్రెస్ తో చేతులు కలపాలని పిలుపు నిచ్చారు.  ఇప్పటికే కాంగ్రెస్ తో కలిసున్న ఎన్సీపీ, శివసేన, డిఎంకే, జేఎంఎం, ఆర్జేడీలతో పాటుగా, కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉన్న ఇతర పార్టీలు కుడా కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు సుముఖంగా ఉన్నాయని  నితీష్ కుమార్ పేర్కొన్నారు.  నితీష్ కుమార్ ఇక్కడ తెరాస పేరు ప్రస్తావించక పోయినా  ఇటీవల కేసీఆర్, పాట్నా వెళ్లి నితీష్ కుమార్ తో చర్చలు జరిపిన నేపధ్యంలో ఆయన పిలుపు ఇచ్చిన పార్టీలలో తెరాస కూడా ఉండవచ్చని అంటున్నారు.  అంతే కాదు  కాంగ్రెస్ ఫ్రంట్ కు బ్ఫ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న నితీష్ కుమార్ అంతకు ముందే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిసి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. బీజేపీని ఓడించేందుకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష పార్టీలు అన్నీ ఒకటిగా పోటీచేయాలని, అందుకు కాంగ్రెస్ సహకరించాలని కోరారు. అంతే కాదు విపక్షాలను ఏకం చేయడంలో సోనియా గాంధీ చొరవ చూపాలని లాలూ, నితీష్ విజ్ఞప్తి చేశారు. అందుకు సోనియా గాంధీ సానుకూలంగా స్పందించారని, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తర్వాత, 2024 సార్వత్రిక ఎన్నికల విషయం చర్చిద్దామని హామీ ఇచ్చినట్లు నితీష్ మీడియాకు తెలిపారు.  సరే  విపక్ష పార్టీలన్నీ నిజంగా ఒకటవుతాయా? మోడీని ఓడిస్తాయా? మోడీ చేతిలో ఓడి పోతాయా? అనే విషయాన్ని పక్కన పెడితే, కాంగ్రెస్సేతర, బీజేపీ యేతర, థర్డ్ ఫ్రంట్’/ప్రాతీయ పార్టీల కూటమి అంటూ చాలా కాలంగా, చాలాచాలా ప్రయత్నాలు చేస్తున్న, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) ఏమి చేస్తారు. జాతీయ రాజకీయాలలో ఏ గట్టునుంటారు? కాంగ్రెస్ తో చేతులు కలుపుతారా? సొంతగా జాతీయ పార్టీ పెట్టి, ఎన్నికల  అనంతరం సమయానుకూల నిర్ణయం తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ప్రధాన చర్చగా సాగుతోంది.  అయితే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు, కేసీఆర్ కు ఎలాంటి అభ్యతరం లేక పోయినా రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో చేతులు కలిపే విషయంలో అయన ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారని అంటున్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆగి  అవసరం అయితే కాంగ్రెస్ పార్టీతో కలిసి, బీహర్ తరహాలో తెరాస,కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్నిఏర్పాటు చేసి, ఆపైన లోక్ సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ సారధ్యంలోని జాతీయ కూటమిలో చేరాలనే, ‘ఉభయ తారక’ ఆలోచన చేస్తున్నారని. అంటున్నారు. నిజానికి ఈ మేరకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో ఆయన ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. అదలా ఉంటే, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో ఒక వర్గం తెరాసతో పొత్తు వైపు మొగ్గు చూపుతుంటే,మరో వర్గం పొత్తు వద్దని గట్టిగా పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెరాస ఇంటి మీద కాకి కాంగ్రెస్ గూటి మీద వాల రాదని కండిషన్ పెట్టారు. అయితే, ఇప్పటికే  కాంగ్రెస్, తెరాస ఒకటే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును దృష్టిలో ఉంచుకుని, పెద్ద ఎత్తున ఈ ప్రచారం సాగిస్తోంది. అయితే ఏది ఏమైనా, జాతీయ రాజకీయ అవసరాల కోసం తెరాస కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయంగానే కనిపోస్తోందని జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు సూచిస్తున్నాయి. అయితే అది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందా, తర్వాత అన్నదే ప్రశ్నగా పరిశీలకులు పేర్కొంటున్నారు.

పిఎఫ్ ఐ చొర‌బాటు.. ఎన్ ఐ ఏ వైఫ‌ల్యామేనా? 

దేశంలో హింస‌కు విద్రోహులు భారీ ఏర్పాట్ల‌తో పూనుకోవ‌డం, ఇటీవ‌ల నిఘా సంస్థ‌ల ద‌ర్యాప్తుల్లో బ‌య‌ట ప‌డింది. ద‌స‌రా ఉత్స‌వాల సంద‌ర్భంగా దేశంలో భారీ పేలుళ్లు చేపట్ట‌డానికి పీఎఫ్ ఐ కుట్ర ప‌న్నింద న్న‌ది ద‌ర్యాప్తులో వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌ధాని మోదీ హ‌త్య‌కు కుట్ర ప‌న్నిన సంగ‌తి తెలిసిన కొద్ది రోజు ల‌కే బీజే పీ ఆర్ ఎస్ ఎస్ నేత‌లే ల‌క్ష్యంగా వ్యూహ ర‌చ‌న జ‌రిగిన‌ట్టు తెలిసింది. ఇప్ప‌టికే  ఆ సంస్థకి సం బంధించి దేశంలో అనేక న‌గ‌రాల్లో ప‌ట్ట‌ణాల్లో ఎన్ ఐఏ ద‌ర్యాప్తు చేప‌ట్టి చాలామంది అనుమానితుల‌ను అదుపులోకి తీసుకుంది  నాగ్‌పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పీఎఫ్ఐ రెక్కీ నిర్వహించింద‌ని తెలిసింది. నవరాత్రి ఉత్సవాల్లో భారీ కుట్రకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. పీఎఫ్ఐ హిట్‌ లిస్టులో దర్యాప్తు సంస్థ అధికారులు సైతం ఉన్న ట్టు సమాచారం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. సంబంధిత కార్యాల యాల దగ్గర భద్రతను పెంచారు. కొద్దిరోజుల క్రితం అంటే బీహార్‌లోని పాట్నానగర పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హతమార్చేందుకు పీఎఫ్ ఐ కుట్ర పన్నిందని తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐ ఏ) దర్యాప్తులో వెల్లడైంది. పీఎఫ్ఐ కార్యాలయాలు, నేతల ఇళ్లపై ఇటీవల ఎన్ఐఏ, ఈడీ చేసిన దాడుల్లో ఈ విషయం వెలుగు చూసింది. ఈ ఏడాది జులై లో ప్రధాని మోదీ పాట్నా పర్యటన సందర్భంగా పీ ఎఫ్ఐ సభ్యులు దాడికి విఫల యత్నం చేశారని దర్యాప్తులో తేలింది. ప్రధానిపై దాడి చేసేందుకు పీ ఎఫ్ఐ పలువురు కార్యకర్తలకు శిక్షణ కూడా ఇచ్చింద‌ని వెల్లడైంది. ప్రధానితోపాటు యూపీలోని పలు వురు ప్రముఖులపై దాడికి పీఎఫ్ఐ మారణాయుధాలు కూడా సమకూర్చుకున్నారని తేలింది. ఎన్ఐఏ, ఈడీలు దేశ వ్యాప్తంగా  15 రాష్ట్రాల్లో సోదాలు జరిపి వంద మందిని అరెస్ట్ చేసింది. ఇదిలా ఉండ‌గా, దేశ‌ర‌క్ష‌ణ బాధ్య‌తల విష‌యంలో బీజేపీ స‌ర్కార్ పూర్తిగా విఫ‌ల‌మ‌యింద‌ని, విదేశీ శ‌క్తు లు దేశంలో  స్లీప‌ర్‌సెల్స్‌తో దాడుల‌కు దిగే ప‌రిస్థితులు వ‌చ్చాయ‌ని విప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇవాళ ఏకంగా పీఎంను హ‌త‌మార్చేందుకు కుట్ర‌పూనే స్థాయిలో విస్త‌రించ‌డం భ‌యాందోళ‌న‌కు గురిచే స్తోంద‌ని  విరుచుకుప‌డ్డాయి. దేశంలో  ప్ర‌జాసంక్షేమంతో పాటు ప్ర‌జా ర‌క్ష‌ణ‌ విష‌యంలోనూ కేంద్ర ప్ర‌భు త్వం, హోంమంత్రిత్వ‌శాఖ‌ మ‌రింత చొర‌వ‌చూపాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంద‌ని అంటున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో పీ ఎఫ్ ఐ విస్త‌రించ‌డం దాడుల‌కు సిద్ధ‌ప‌డ‌టం కేవ‌లం ర‌క్ష‌ణ రంగ వైఫ‌ల్యం గానే చూడాల్సి వ‌స్తుంద‌ని,  చివ‌రి నిమిషాల్లో దాడులు చేసి  కొంద‌రిని అదుపులోకి తీసుకున్నంత మా త్రాన ఎంతో జాగ్త‌త్త‌లు తీసుకు న్న‌ట్లు కాద‌ని వివ్లేష‌కులు అంటున్నారు. విదేశీ సంబంధాలు, పాల‌నాప‌ర ప్ర‌గ‌ల్భాలు ప్ర‌చారం చేసుకోవ డంతో కాలం గ‌డిపేయ‌డం కాకుడా వాస్త‌వంగా దేశంలో శాంతిభ‌ద్ర‌త‌ల అంశాన్ని ప‌ట్టించుకోవాల‌సిన అవ‌స‌రం ఎంతో ఉంద‌ని విప‌క్షాలు కేంద్రాన్ని హెచ్చ‌రిస్తున్నాయి. 

జగన్ సర్కార్ కు ఇక కౌంట్ డౌన్?!

జగన్  సర్కార్ పూర్తికాలం కొనసాగే పరిస్థితి లేదా? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు,  వైసీపీ అధినేత జగన్  తీరుతో ఆ పార్టీలోని పలువురు ప్రస్తుత ఎమ్మెలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? వైసీపీ అధినేత జగన్ కు గుణపాఠం చెప్పేందుకు   కాడి పడేసి, ఎవరిదారి వారు చూసుకుంటారా?   వైసీపీ సర్కార్ ను మైనార్టీలో పడేసేందుకు చాపకింద నీరులా వ్యూహాలు రచిస్తున్నారా? అంటే.. అలాంటి పరిణామాలేవో జరుగుతున్నట్లే అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతల్లో మూడున్నరేళ్ళుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న అధినేతపై అసంతృప్తి ఒక్క సారిగా బయటపడే అవకాశాలే మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. ఒక పక్కన అనాలోచిత ఆర్థిక నిర్ణయాలు, కనిపించని అభివృద్ధి.. అప్పుల ఊబి ఇత్యాది కారణాలతో జనంలో ఆగ్రహావేశాలు పెల్లుబు కుతుండటం..  ఆ ఆగ్రహం నేరుగా  వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను జనం నిలదీసేవరకూ వెళ్లడంతో  ప్రజల్లోకి వెళ్లాలంటేనే వైసీపీ నేతలు భయపడే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉంది. అదే సమయంలో విపక్ష నేతలకు జనం నిరాజనాలు పడుతుంటడంలో వైసీపీ ఎమ్మెల్యేలకు తమ రాజకీయ భవిష్యత్ భూతద్దంలో కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే  గతంలో సుమారు 20 మంది ఎమ్మెల్యే జగన్ పై నిరసనగళం ఎత్తారు. అలాగే  రెండోసారి మంత్రి వర్గంలో చోటు దక్కని ఆశావహులైన మరి కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురయ్యారు. ఒక దశలో బహిరంగంగానే తమ నిరసన గళం వినిపించారు. అప్పటికి ఏదో ఆ పరిస్థితి సద్దుమణిగినా ఇక ముందు  సందర్భం, అవకాశం దొరికినా తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు అసంతృప్తులు వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. వీటికి తోడు ఏపీకి ఒకే ఒక్క అమరావతి రాజధాని అంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగాపార్టీ అధినేత ఒత్తిడితో అనివార్యంగా పాదయాత్రకు వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పించాల్సిన పరిస్థితిలో ఉండటం కూడా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, క్యాడర్ లో అసంతృప్తిని ద్విగుణీకృతం చేస్తున్నదని పార్టీ వర్గాలే అంటున్నాయి.  ఇక ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చడానికి జగన్ తీసుకున్న నిర్ణయం ఆయనను ఇక ఎంత మాత్రం సహించలేమనీ, ఆయన అరాచకానికి ఈ నిర్ణయం పారాకాష్ట అని పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని అంటున్నారు. జగన్ వీర విధేయుడిగా పేరొందిన కొడాలి నాని కూడా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిర్ణయం తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా.. జగన్ ఆదేశాలను ధిక్కరించి మరీ మౌనం వహించడాన్ని ఈ సందర్బంగా పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు.  ఇలా ఒకరి తరువాత ఒకరుగా పార్టీలో సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులూ కూడా అధినేత తీరు పట్ల అసంతృప్తితో రగిలి పోతున్నారంటున్నారు. అంతే కాకుండా జగన్ కేబినెట్ లో సీనియర్ మంత్రులకు సరైన గుర్తింపు లేకపోవడం.. వారి ఆదేశాలను అధికారులు ఇసుమంతైనా లెక్క చేయని పరిస్థితి ఉండటంతో వారంతా రగిలిపోతున్న పరిస్థితి ఉందంటున్నారు. ఇలాంటి కారణలతోనే వైసీపీలో  తిరుగుబావుటా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.   ఇక వైఎస్ జగన్ కు ప్రశాంత్ కిశోర్ బృందం ఇచ్చిన నివేదిక, తాను స్వయంగా నియమించుకున్న మరో టీం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేల్లో 100 మంది పనితీరు బాగోలేదు. వారిలో 80 మంది వచ్చే ఎన్నికల్లో గెలిచే ఛాన్సే లేదంటున్నారు. అలా ఏమాత్రం గెలిచే అవకాశం ఉండదనే వారికి రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని జగన్ స్పష్టంగా చెప్పడం కూడా వారిలో అసంతృప్తికి, ఆవేదనకు కారణం అయింది. అందుకే వైసీపీలో ఉంటే టికెట్ ఎలాగూ రాదు కనుక అటు టీడీపీలోనూ, ఇటు జనసేన పార్టీలోనో లేదా బీజేపీలోనో చేరేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు చేసుకుంటున్నారంటున్నారు. అలా ఆ 80 మంది ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేయడం ఖాయమని మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు దేవినేని ఉమ  అంటున్నారు. తిరుగుబాటు చేసేందుకు సమాయత్తం అవుతున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేని పరిస్థితిలో జగన్ పడ్డారని ఆయన అంటున్నారు.  ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 50 శాతానికి పైగా ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు పూర్తికాలం కొనసాగలేదు. గతంలో ఎన్టీఆర్ సర్కార్, పీవీ ప్రభుత్వం 50 శాతానికి పైగా ఓటు బ్యాంకును సంపాదించుకున్నాయి. అయితే.. అవి పూర్తిగా ఐదేళ్లూ అధికారంలో కొనసాగలేదు. అలాగే 50 శాతానికి పైగా ఓట్లు తెచ్చుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా పూర్తి కాలం అధికారం చెలాయించే పరిస్థితులు లేవంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పలు సందర్భాలలో అన్నారు. ఈ విశ్లేషణలు, అభిప్రాయాల నేపథ్యంలోనే   వైసీపీ సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

హాయ్‌! ..పింకీ!

క్లాసులోకి వెళ్ల‌గానే మిన్నీ పుస్త‌కాలు తీసింది, చంటీ బ్యాగ్‌లోంచి లెక్క‌ల హోంవ‌ర్క్‌నోట్స్ తీశాడు, రెండు బెంచీల అవ‌త‌ల కూచున్న మ‌రో పిల్ల బ్యాగ్ తెర‌వ‌గానే హ‌లో అటూ ఏకంగా పాము ప‌ల‌క‌రిం చింది.. అంతే పిల్ల భ‌యంతో గ‌ట్టిగా అరిచింది! అస‌లు పుస్త‌కాల బ్యాగ్‌లోకి పెన్సిళ్లు, ర‌బ్బ‌ర్ల‌తో పాటు జామెట్రీ బాక్స్ ఉంటుందేగాని పాముగారు ఎలా వ‌చ్చార‌బ్బా అని అంతా భ‌యంతో కూడి ఆశ్చ‌ర్యంతో బ్యాగ్ వేపే చూస్తుండిపోయారు. అంత‌లో హెడ్ మాస్ట‌ర్‌కి తెలిసి ప‌రుగున వ‌చ్చారు. ఏమ‌యిందో అని. ఎందుకు అంద‌రూ అలా అరుస్తున్నా ర‌న్నారు. అంత‌లో బ్యాగ్‌లో పాము సంగ‌తి చెప్పేరు. ఆయ‌న నోరెళ్ల‌బెట్టారు. అవునా..! అన్నారు.  వెంట‌నే పాముల న‌ర్స‌య్య‌లాంటి హీరోకి ఫోన్ చేశారు. ఆయ‌న మెరుపు వేగంతో వ‌చ్చాడు. ఆయన మ‌రో మాస్ట‌రు స‌హాయంతో బ్యాగ్‌ని నెమ్మ‌దిగా స్కూలు కి కొంత దూరం తీసికెళ్లి  బాగా చెట్లు ఉన్న ప్రాంతంలో బ్యాగ్‌ని పూర్తిగా తెరిచి అలా ప‌డేశారు. అంతే అందులో అప్ప‌టిదాకా విశ్రాంతి తీసుకుంటున్న కోబ్రా కాస్తా ఎందుకు విసిగిస్తార‌ని ఠ‌పీమ‌ని త‌లెత్తి చూసింది. మాస్టారు క‌ర్ర‌తో క‌నిపించేస‌రికి అది కాస్తా చెట్ల‌లోకి పారిపోయింది. అది చిన్న‌ది కాదు ..కాటేస్తే ప్రాణాలే పోయేవి. పిల్ల అదృష్ట‌వంతురాలు అన్నా రంతా!  మ‌ధ్య‌ప్ర‌దేశ్ షాజాన్‌పూర్ బ‌దోనీ స్కూల్లో జ‌రిగింది ఈ  సంఘ‌ట‌న‌. మ‌రంచేత పిల్ల‌లూ, పుస్త‌కాలు పెట్టే సుకుని బ్యాగ్‌ని త‌గిలించుకోవ‌డం కాకుండా ముందే బ్యాగ్‌ని శుబ్భ‌రంగా దులిపి మ‌రీ పుస్త‌కాలు స‌ర్దుకోండి. లేదంటే క్లాస్‌రూమ్‌లో అంద‌రూ భ‌యంతో ప‌రిగెట్టాల్సి వ‌స్తుంది. బీ కేర్ ఫుల్!  అంత భ‌య‌ ప‌డాల్సిన స‌మ‌యంలోనూ ఓ కుర్రాడు వీడియో తీశాడు. అది ఇపుడు వైరల్ అయింది. 

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై సైలెన్స్ కొడాలి నాని ఫేటేంటి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. అసెంబ్లీ సాక్షిగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతోపాటు ఇతర పార్టీల నేతలలూ విమర్శలు గుప్పించారు.  చివరకు సీఎం   జగన్ తీసుకున్న నిర్ణయంపై ఆయన సోదరి, వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు   షర్మిల, జగనన్న వదిలిన బాణం సైతం    ముమ్మాటికి తప్పేనని విస్పష్టంగా చెప్పేశారు. అయితే ఈ వ్యతిరేకత అంతటితో ఆగలేదు. హెల్త్ యూనివర్శిటీకి వైయస్ఆర్ పేరు పెట్టడం వైసీపీలోని నాయకులు, కార్యకర్తలు సైతం అంగీకరించలేకపోతున్నట్లు సమాచారం.   మాజీ మంత్రి  కొడాలి నాని అయితే  ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిర్ణయంపై రగిలిపోతున్నారని తెలుస్తోంది.  ముఖ్యమంత్రి  జగన్‌వి పిల్ల చేష్టల్లా ఉన్నాయంటూ కొడాలి నాని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారని చెబుతున్నారు.   ఇన్నాళ్లు జగన్ ఏదీ మాట్లాడమంటే.. మీడియా ముందు మాట్లాడాననీ. కానీ తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు  ఎన్టీఆర్ పేరు మీద ఉన్న హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరు పెడతానంటే మాత్రం తాను సమర్ధించలేననీ, అయినా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల   జిల్లాలోనూ, సొంత నియోజకవర్గంలోనూ మొహం చూపుకునే  పరిస్థితి లేకుండా పోయిందని కొడాలి నాని వాపోతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ , జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరిపై జగన్ ఆదేశాల మేరకు విమర్శలు చేశాననీ, ఇంకా చేయమన్నా చేస్తాను కానీ, ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని సమర్థిస్తూ మాత్రం మాట్లాడటం తన వల్ల కాదని ఆయన స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.    వచ్చేది ఎన్నికల సీజన్.. కావడంతో  ఈ నేపథ్యంలో ఆచి తూచి అడుగులు వేయాలని.. కానీ ఇవేమి పట్టించుకోకుండా..  స్ జగన్ ఏ రోజు ఏ పిచ్చి నిర్ణయం తీసుకుని సమర్ధించమంటూ హుకుం జారీ చేస్తారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందని ఆయన తలకొట్టుకుంటున్నట్లు కొడాలి నాని సన్నిమితులు చెబుతున్నారు.   హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై ముందుగానే  కొడాలి నానికి సమాచారం ఉందని అంటున్నారు.  అసెంబ్లీ వర్షాకాల సమావేశాల చివరి రోజు.. ఈ పేరు మార్పు వ్యవహరంపై ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడాలంటూ..నానికి  తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి నేరుగా ఫోన్ కూడా వచ్చిందని చెబుతున్నారు.  కానీ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో జగన్ తో ఏకీభవించలేకపోతున్న కొడాలి నాని ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా మాట్లాడటం ఇష్టం లేకే అసెంబ్లీకి ఆ రోజు డుమ్మా కొట్టారని నాని సన్నిహితులు చెబుతున్నారు.  అంతేకాదు.. హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై ఇంత రచ్చ నడుస్తున్నా... కొడాలి నాని నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంపై తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు ఆగ్రహంతో ఉన్నారంటున్నారు. జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కొడాలి నాని విపక్ష నేతలపై ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయారు. అయితే మంత్రిపదవి పోగానే మాత్రం సైలెంటైపోయారు. మంత్రి పదవి ఊడిపోయిన తొలి రోజుల్లో తన నియోజకవర్గంలోని తన సొంత పశువుల పాకలో విశ్రాంతి తీసుకున్నారు. లేదా అజ్ణాత వాసం చేశారు. ఆ ఫొటోలు అప్పట్లో సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇటీవలి కాలంలో జగన్ మళ్లీ తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరిస్తారనీ, గత కేబినెట్ లో నోరున్న మంత్రిగా గుర్తింపు పొందిన నానికి చాన్స్ ఉంటుందనీ వార్తలు రావడంతో ఆయన మళ్లీ గొంతు సవరించుకున్నారు. వరుస మీడియా సమావేశాలలో విపక్ష నేతలపై గతం కంటే ఎక్కువగా బూతుల వర్షం కురిపించేశారు. ఇక మంత్రిపదవి పక్కా అనుకునే లోగానే ఉరుములేని పిడుగులా   ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు అంశం నాని ఆశలపై నీళ్లు చల్లిందని చెప్పాలి. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పునకు మద్దతుగా నాని నోరు విప్పకపోవడం.. సన్నిహితుల వద్ద జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతూ వ్యాఖ్యలు చేయడంతో ఇక కొడాలి నానికి మాజీ మంత్రి అనేది శాశ్వత హోదాగా మిగిలిపోక తప్పదని పార్టీ వర్గాలే అంటున్నాయి. నాడు కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ పేరే ఇప్పుడు ఆయన రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి కల్పించిందని.. ఇది ఆ(ఎన్టీఆర్) దేవుడి స్క్రిప్టేననీ నాని వ్యతిరేకులు సెటైర్లు వేస్తున్నారు.

ఇక చాలు ...పీకే ఇక సెలవు ..పీకే

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ వరసగా మూడవసారి గెలిచింది. హ్యాట్రిక్ సాధించింది. నిజానికి మమతా బెనర్జీ వరస  విజయాలకు ఇంకా చాలా కారణాలే ఉన్నా, బీజేపీ క్రియేట్ చేసిన హైప్ కారణంగాఆ క్రెడిట్  మొత్తం, ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్ కిశోర్(పీకే) ఖాతాలో చేరింది. పీకే వ్యూహాల కారణంగానే తృణమూల్ హ్యాట్రిక్ విజయం సాధించిందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీకి 200లకు పైగా సీట్లు ఖాయమంటూ ప్రచారం సాగించినా, బీజేపీ సంఖ్యాబలం 100కు చేరదని ముందుగా చెప్పి మరీ, బీజేపీని 70 ప్లస్ వద్ద కట్టడి చేయడంతో పీకే పేరు దేశమంతా మారుమోగిపోయింది. అయితే, అదే సమయంలో పీకేఎన్నికల వ్యూహకర్త రోల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు, కానీ తప్పుకోలేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలతో డీల్ కుదుర్చుకున్నారు. అప్పుడే ప్రత్యక్ష రాజకీయాలు తన వంటికి పడవని, ‘ఐయాం ఏ ఫెయిల్డ్ పోలిటిషియన్’.. విఫల రాజకీయ వేత్తను’ అని ప్రకటించుకున్నారు. కానీ మాట మీద నిలబడలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోనూ వేలు పెట్టారు. జోడు పడవల ప్రయాణం సాగిస్తున్నారు. అలాగే, తృణమూల్ తోనూ పరోక్ష బంధాలు కొనసాగించారు. తృణమూల్  జాతీయ ఆకాంక్షలను సొమ్ము చేసుకున్నారు.  కమిషన్ వ్యాపారాలు మారు బేరానికి సరుకులు అమ్మినట్లు, గోవా తదితర రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులను తృణమూల్ లో చేర్పించారు.  మరో వంక బీజేపీ యేతర పార్టీలను ఏకం చేసి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ఓడించే వ్యూహంతో ప్రతిపక్ష పార్టీలను  ఏకం చేసే ప్రయత్నాలు చాలానే చేశారు. మమతా బెనర్జీ మొదలు కేసీఆర్ వరకు వాళ్ళను వీళ్ళను ముందు పెట్టి, కథ నడిపించారు. కానీ వర్కౌట్ కాలేదు. మధ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ క్రమంలోనే కాంగ్రెస్ పునరుజ్జీవ ప్రణాలికను తయారు చేసి పార్టీ ముందుంచారు. అయితే ఏదైతే నేమి కానీ, పీటల దాకా వచ్చిన ప్రేమాయణం, పుటుక్కు మంది. పీకే కాంగ్రెస్ ఎంట్రీ పీటల మీదనే ఆగిపోయింది. అదలా ఉంటే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పీకే వ్యూహాలు బెడిసి కొత్డుతున్నాయనే నిజాన్ని కొంచెం ఆలస్యంగానే అయినా  గుర్తించినట్లున్నారు.అందుకే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  ఏపీ సీఎం జగన్మోహన రెడ్డి పీకేకు గుడ్బై చెప్పినట్లు తెలుస్తోంది.   నిజానికి, పీకే ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఐసీయులో ఉన్న పార్టీలను బతికించిన దాఖాలాలు లేవు. గెలుపు అంచున ఉన్న పార్టీలను ఆ గట్టుకు చేర్చడం వరకే  పీకే వ్యూహాలు పనిచేశాయని  ఆయన ట్రాక్ రికార్డే చెపుతోంది.  అదీ కాక  పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత, జరిగిన ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో పీకే ప్రత్యక్షంగా ఏ రాష్ట్రంలోనూ, ఏ పార్టీకి పనిచేయలేదు. గోవాలో మాత్రం పరోక్షంగా తృణమూల్ కాంగ్రీస్ కు పనిచేశారు. కానీ, గోవాలో మమతా బెనర్జీ పార్టీకి చేతి చమురు వదిలిందే కానీ,ఫలితం మాత్రం దక్కలేదు. బీజేపీ కంటే ఇంచు మించుగా మూడు రెట్లు ఎక్కువగా  చేసినా, తృణమూల్ కు సున్నా సీట్లే వచ్చాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సమర్పించిన లెక్కల ప్రకారం, బీజేపీ రూ.17 కోట్లు ఖర్చు చేస్తే, తృణమూల్  ఏకంగా రూ. 47 కోట్లు ఖర్చు చేసింది.  అయినా, ఒక్క సీటు కూడా దక్కలేదు. అందులో పదో వంతు కూడా చేయని ఆప్ కు రెండు సీట్లు వచ్చాయి.  అంతే కాకుండా, పీకే ఇటో కాలు అటో కాలు వేస్తున్నారు. ఓ వంక కేసీఆర్ ను జాతీయ నేతను చేసందుకు ఆయనతో డీల్ కుదుర్చుకున్నారు. అదే సమయంలో, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను పీఎం కాండిడేట్ గా ప్రొజెక్ట్ చేస్  డీల్ కుదురుచుకున్నట్లు తెలుస్తోంది. మరోవంక, తెలంగాణలో తెరాస పీకే తోక పట్టుకున్నప్పటి నుంచి, ఆ పార్టీకి అడుగడుగునా ఎదురు దెబ్బలే తగులు తున్నాయి. అందుకే, సెంటిమెంట్స్ కు ఎక్కువ ప్రధాన్యతను ఇచ్చే, కేసేఆర్ మొహమాటం  లేకుండా  ఇక చాలు ..పీకే ..అని ఆయనకు కటీఫ్ చెప్పారు.  అయితే, ఇచ్చిన కోట్లు వెనక్కి తెచ్చుకునే వీలు లేక పీకే ఉచిత సేవలు అందిస్తున్నారని కేసీఆర్ బహిరంగంగా ప్రకటించారు. సోషల్  మీడియా క్యాంపెయిన్ వరకు చాలని, సర్వేలు, వ్యూహాలకు చుక్క పెట్టేశారు. ఇక ఏపీ విషయానికొస్తే, గత ఎన్నికల్లో ప్రత్యక్షంగా రంగంలోకి దిగిన పీకే ఈసారి, ముందుగానే వైసేపీ ఓటమిని గుర్తించారో ఏమో కానీ, పీకే డైరెక్ట గా  రంగంలోకి దిగలేదు. ఆయన బదులుగా ఐ ప్యాక్ టీము సభ్యుడు రిషి రాజ్ కు బాధ్యతలు అప్పగించారు. ఆ రిష్ రాజ్, చావుకు పెళ్ళికి ఒకే డప్పు అన్నట్లుగా, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీకే ప్లే ట్యూన్సే రీప్లే చేస్తున్నారు. ఆశించిన ఫలితాలు రావడం లేదు సరికదా రిష్ రాజ్ వ్యూహాలు ఎదురు తంతున్నాయి. అందుకే పీకే టీమ్ పనితనం విషయంలో వైసీపీలో అసంతృప్తి మొదలైంది. అందుకే, జగన్ రెడ్డి కూడా ప్రత్యామ్నాయ ప్రయత్నాలలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆల్రెడీ ఐసీయూలో ఉన్నా వైసేపీ సర్కార్ ను సేవ్ చేయడం, సెకండ్ టైమ్ గెలిపించడం ఒక పీకే కాదు, పది మంది పీకేలు వచ్చిన అయ్యే పనికాదని పరిశీలకులు అంటున్నారు. అదెలా ఉన్నా, 2014 నుంచి దేశ రాజకీయాల్లో సంచలనంగా, రాజకీయ, ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఒక సవాలు మారిన పీకే .. దటీజ్ ప్రశాంత్ కిశోర్ అధ్యాయం ఇక ముగిసినట్లే కనిపిస్తోందని, అంటున్నారు.

ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన: ఎస్ జైశంకర్

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370  తాత్కాలిక నిబంధ‌నని,రద్దు తర్వాత జరిగిన రాజకీయాలను వాస్తవాల ను ఎలా వక్రీకరించారు, నిర్దిష్ట కథనాన్ని రూపొందించడానికి విషయాలు ఎలా కీల‌క‌పాత్ర వ‌హించాయో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం వివరించారు. వాషింగ్టన్ డీసీలో 'మోడీ 20' పుస్తక పఠనం సందర్భంగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 5, 2019న, ఆర్టికల్ 370 ప్రకారం మంజూరు చేయబడిన జమ్మూ మరియు కాశ్మీర్  ప్రత్యేక హోదా ను రద్దు చేస్తూ, ఆ ప్రాంతాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని కేంద్ర ప్రభు త్వం తన నిర్ణ యాన్ని ప్రకటించింది. డిసీ లో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో, జ‌మ్ముకాశ్మీర్ కి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370, భారత  రా జ్యాంగం తాత్కాలిక నిబంధనే అని మంత్రి స్ప‌ష్టం చేశారు. అయితే, ఆర్టికల్ 370 రద్దుకు సంబం ధించిన వాస్తవాలు పక్కదారి పట్టాయని, విషయాలు ఆడించబడ్డాయని ఎస్ జైశంకర్ వాదించారు. వాస్తవాలు వక్రీక రించార‌ని, ఏది సరైనది, ఏది తప్పు అనేది గందరగోళంగా ఉందని నేను భావిస్తు న్నాన‌న్నారు. ఆర్టికల్ 370లోని రాజకీయాలను తప్పనిసరిగా వ్యతిరేకించాలని, ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని విదేశాంగ మంత్రి అన్నారు. ప్రజలు ఈ సమస్యను విరమించుకోవద్దని, దానిని పోటీ చేసి కథనాన్ని రూపొందించడానికి సందేశాన్ని అందించాలని ఆయన అన్నారు. ఇది పోటీ ప్రపంచం. మనం మన సందేశాన్ని అందజేయాల‌ని చెప్పారు. ఈ చర్చల నుండి దూరంగా ఉండటం ద్వారా మనం మన దేశానికి లేదా మన నమ్మకాలకు బాగా సేవ చేయడం లేదు లేదా మన మంచి లేదా తప్పు అనే భావనను కూడా బాగా చేయడం లేదు. మనకు అభి ప్రాయాలు ఉంటే వాటిని వ్యక్తపరచాలి, మనం వాటిని ప్రజలతో పంచుకోవాలి మనం దేనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇది సరైనది మరియు ఏది తప్పు, అని మంత్రి కొనసాగించారు. ఆర్టికల్ 370 రద్దు గురించి మంత్రి ప్రస్తావిస్తూ, నాకు, ఇది మనస్సును కదిలించేది, ఎవరి మెరిట్ చాలా స్పష్టంగా ఉందో, వేరే విధంగా ఆలోచించే వ్యక్తులు కూడా ఉండాలని అన్నారు.

మునుగోడులో కమలం పార్టీకి ఎదురుగాలి.. అభ్యర్థి తీరే కారణమని బీజేపీ అసహనం

మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి గండంగా మారిందా? ట్రంప్ కార్డ్ అనుకున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కారణంగానే అక్కడ ఎదురుదెబ్బ తగలనుందా? కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బలాన్ని అతిగా ఊహించుకుని ఉప ఎన్నికకు తెరతీసిన కమలం పార్టీ బొక్కబోర్లా పడనుందా? అన్న ప్రశ్నలకు పరిశీలకులు ఔననే సమాధానం ఇస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ లా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ను తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలూ తెరాస, కాంగ్రెస్, బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ గెలుపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయానికి రాచబాట అవుతుందని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థి, మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి తన వ్యాఖ్యలతో సెల్ఫ్ గోల్ చేసుకోవడంతో బీజేపీ చిక్కుల్లో పడింది. ఆయన వ్యాఖ్యలకు మునుగోడు ఓటర్లు, రైతులు రగిలిపోతున్నారు. ఇక తెరాసకు అయితే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యాఖ్యలు అయితే పదునైన విమర్శనాస్త్రాలు సంధించడానికి ఒక అవకాశంగా అంది వచ్చాయి. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి నల్గొండ జిల్లాలో బలమైన నాయకుడు అనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ టికెట్ పై ఒక సారి ఎంపీగా, మరో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నిక రావడానికి కారణం అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేశాననీ, ఉఫ ఎన్నిక వస్తేనా నియోజకవర్గ అభివృద్ధికి తెరాస సర్కార్ నడుంబిగిస్తుందని ఆయన తన రాజీనామా సందర్భంగా చెప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి తెరాసను దీటుగా ఎదుర్కొనే పరిస్థితి లేదనీ అందుకే బీజేపీ తీర్ధం పుచ్చుకున్నాననీ కూడా చెప్పుకొచ్చారు. సరే బీజేపీలో చేరిన రాజగోపాలరెడ్డి అదే పార్టీ అభ్యర్థిగా మునుగోడు నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెరాస మునుగోడు ఉఫ ఎన్నికలో విజయం సాధించి కమలం స్పీడ్ కు బ్రేక్ వేయాలని, సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉన్నాయి. హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాన్ని ఇక్కడా రిపీట్ చేసి రాష్ట్రంలో తమకు తిరుగులేని మద్దతు ఉందని చాటాలని బీజేపీ విశ్వయత్నం చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చేసిన ఓ వ్యాఖ్య బీజేపీని డిఫెన్స్ లో పడేసింది. అధికార తెరాస మొదటి నుంచీ కూడా తెలంగాణ వ్యవసాయానికి తమ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టాలని ఒత్తిడి తెస్తోందంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెడితే నష్టమేమిటి? అంటూ చేసిన వ్యాఖ్యలు రైతాంగంలో ఆయన పట్ల, బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి. డిస్కంలను కాపాడుకునేందుకు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం తప్పేంటి అంటూ కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా సీన్ సితార అయిపోయిందని పరిశీలకులు అంటున్నారు.  ఉచిత కరెంటుకు తాను వ్యతిరేకం కాదంటూనే ఆయన మరో వ్యాఖ్య చేశారు. ఎవరు ఎంత కరెంట్‌ కాల్చుతున్నరో, ఏ రైతుకు ఎంత సబ్సిడీ వస్తున్నదో తెలుసుకొనేందుకే కేంద్రం మీటర్లు పెడుతామని చెప్పి ఉండవచ్చన్నారు. దీంతో మునుగోడుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఒక్కసారిగా షాక్ తగిలినట్లైంది. ఇప్పటికే మునుగోడు అభ్యర్థిగా రాజగోపాల రెడ్డి ఎంపిక పట్ల బీజేపీ అధిష్ఠానంలో ఒకింత అసంతృప్తి ఉంది. ఇంతన్నాడు అంతన్నాడు చివరికి తనతో పాటు క్యాడర్ ను తెచ్చుకోవడంలో విఫలమయ్యాడన్న అసంతృప్తి ఆ పార్టీ నేతలలో కనిపిస్తోంది. దుబ్బాక,  హుజురాబాద్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించడం, అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోను బిజెపి అనూహ్యంగా ఎక్కువ కార్పొరేటర్ లను గెలుచుకోవడంతో  మునుగోడు ఉప ఎన్నికల తో పాటు,  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోను  తెలంగాణలో కమలం జెండాయే ఎగురుతుందన్న విశ్వాసంతో ఉన్నారు.  ఈ నేపథ్యంలోనే ఆఘమేఘాల మీద రాజగోపాలరెడ్డి చేత రాజీనామా చేయించి, కమలం తీర్థం ఇచ్చి మరీ మునుగోడు ఉప ఎన్నికకు తెరలేపింది బీజేపీ. ఆయనకు  నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉందనీ, విజయం తథ్యమనీ బీజేపీ విశ్వాసంతో ఉంది. కోమటిరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కమలం తీర్థం పుచ్చుకుంటారని ఆశలు పెట్టుకుంది. అయితే అదేమీ జరగకపోవడంతో మునుగోడులో బీజేపీని గెలిపించుకునేందుకు పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులు మునుగోడులో మకాం వేసే ప్లాన్ లో ఉన్నారు. కానీ నియోజకవర్గంలో రాజగోపాలరెడ్డిని జనం ఎక్కడికక్కడ సమస్యలపై నిలదీస్తుండటంతో రాజగోపాలరెడ్డి బలాన్ని ఎక్కువగా ఊహించుకున్నాం అన్న భావన కమలం నేతలలో మొదలైందని అంటున్నారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మోటార్ల విషయంలో చేసిన వ్యాఖ్యలతో కమలం పార్టీ నేతలు తలపట్టుకుంటున్నారట. ఎరక్కపోయి ఉప ఎన్నికకు తెరతీసాం..ఇప్పుడు ఇరుక్కుపోయామా అని మధన పడుతున్నారట. మునుగోడులో ఫలితం కమలం పార్టీకి వ్యతిరేకంగా వస్తే  వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయంపై ఆశలకు నీళ్లొదిలేసుకోవలసిందేనన్న ఆందోళన బీజేపీ నేతలలో వ్యక్తమౌతోంది. అందుకే నష్ట నివారణ కోసం మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి బలంతో కాకుండా కమలం ఇమేజ్ తో విజయం సాధించేందుకు పావులు కదుపుతోందంటున్నారు. 16 మందితో వ్యూహ కమిటీని ఏర్పాటు చేసి మునుగోడుపై ప్రత్యేక దృష్టి పెట్టిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కోమటిరడ్డి రాజగోపాలరెడ్డికి మునుగోడు ప్రచార బాధ్యతలు అప్పగించకుండా అభ్యర్థిగా మాత్రమే ప్రజల ముందు నిలబెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. మునుగోడులో పార్టీ ప్రచారం సహా అన్నీఆ కమిటీయే చూసుకుంటుందని బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే రాజగోపాలరెడ్డికి విస్పష్టంగా చెప్పేసిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  

వీర విధేయ గెహ్లాట్ తిరుగు బాటు ?

రాజస్థాన్  ముఖ్యమంత్రి , సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లాట్‌... గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడు. విధేయతకు పర్యాయపదంగా నిలిచే  గెహ్లాట్  సోనియా గాంధీ ఆదేశాలను తూ..చ తప్పకుండా పాటిస్తారు. అందుకే ఆమె ఏరి కోరి పార్టీ అధ్యక్ష పదవికి, అధికార అభ్యర్ధిగా ఆయన్ని ఎంపిక చేశారు. ఆమె  ఆదేశాల మేరకే రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి వదులుకుని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసేందుకు గెహ్లాట్  అంగీకరించారు. అలాగే, రాహుల్ గాంధీ అన్నా గెహ్లాట్ కు చాలా చాలా గౌరవం. రాహుల్  గీత గీస్తే  గెహ్లాట్‌ ఆ గీత దాటరు గాక దాటరు. అందుకే పార్టీ అధ్యక్ష పదవితో పాటుగా  రాష్ట్ర ముఖ్యంత్రి పదవిలోనూ కొనసాగాలని మనసులో కోరిక ఉన్నా,రాహుల్ గాంధీ, నో.. కుదరదు అనగానే మనసులోని కోరికను మనసులోనే తుడి చేశారు. ఒకరికి ఒకే పదవి అనే సూత్రం పాటించాల్సిందేనని రాహుల్ హుకుం జారీ చేయగానే, గెహ్లాట్‌ మరో మాట లేకుండా, జీ హుజూర్  అని వచ్చేశారు.  ఆదివారం (సెప్టెంబర్ 25) సాయంత్రం వరకూ మీడియాలో ఇదే కథ నడిచింది . కానీ అ తర్వాతనే అసలు కథ మొదలైంది.  ఢిల్లీలో సోనియా గాంధీ వద్ద,  తిరువనంతపురం (కేరళ) లో రాహుల్ గాంధీ వద్ద తలూపి వచ్చిన, ‘వీర విధేయ’ గెహ్లాట్ తానేమిటో, తన సత్తా ఏమిటో చూపించారు. ముఖ్యమంత్రి కుర్చీ దిగిపోవలసిన సమయం వచ్చే సరికి, ఆయనలోని అపరిచితుడు బయటకు వచ్చారు. గెహ్లాట్ వారసుని ఎన్నిక/ఎంపిక కోసం వచ్చిన కేంద్ర పరిశీలకులకు ఒకసారిగా చుక్కలు చూపించారు. కాంగ్రెస్ సంస్కృతీ, ఆనవాయితీ ప్రకారం, గెహ్లాట్ వారసుని ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వదిలేస్తూ, రాజస్థాన్ సీఎల్పీ ఏక వాక్య తీర్మానం  చేస్తుందని భావించిన కేంద్ర పరిశీలకులు మల్లికార్జున ఖర్గే, అజయ్‌ మాకెన్‌లు అక్కడ జరుగతున్న పరిణామాలు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏకవాక్య తీర్మానం కోసం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశానికి గెహ్లాట్ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అంతే కాదు, అధిష్టానం సచిన్ పైలట్‌ కు అవకాశం ఇస్తే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామని ఎదురు తిరిగారు. పైలట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రిని  చేయడానికి వీల్లేదంటూ గెహ్లాట్  వర్గం ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. సీఎల్పీ భేటీ నిర్వహించి తదుపరి సీఎంను ఎన్నుకోవాలని నిర్ణయించగా.. అంతకుముందే గెహ్లాట్‌ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నివానికి వెళ్లి పదవులకు రాజీనామా లేఖలు అందించారు. దీంతో అధిష్ఠానం సీఎల్పీ భేటీని  రద్దు చేసి.. గెహ్లాట్,  పైలట్‌ సహా సీఎల్పీ భేటీకి పరిశీలకులుగా వెళ్లినవారిని వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది. అయితే, ఏది ఏమైనా గెహ్లాట్  అయన వర్గం సచిన్ పైలెట్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే ఆలోచన కూడా అంగీకరించదనే విషయం అయితే  ఈ పరిణామాలతో క్లియర్ కట్ గా స్పష్టమైందని, పరిశీలకులు అంటున్నారు.  అయితే, ఈ పరిణామం  రాజస్థాన్ కు సంబంధించినదే, అయినా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరుగతున్న వేళ అశోక్ గెహ్లాట్ అనూహ్యంగా ఎగరేసిన తిరుగు బాటు జెండా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి సవాలుగా మారిందని అంటున్నారు. ఈ ప్రభావం ఇతర రాష్ట్రాలలోనూ ఉంటుందని అంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం గెహ్లాట్ వర్గం తిరుగు బాటుకు తలోగ్గితే పార్టీపై అసలే అంతంత మాత్రంగా ఉన్న పట్టు మరింతగా సన్నగిల్లిపోతుంది, అలాగని చర్యలు తీసుకుంటే, మొదటికే మోస మొస్తుంది. మరో వంక పార్టీ అధ్యక్ష పదవికి ఒక తిరుగుబాటు నేతను ఎన్నుకుంటే అది పార్టీ  ప్రతిష్టను మరింత దిగజార్చి వేస్తుందని, పరిశీలకులు భావిస్తున్నారు.   మరో  సంవత్సర కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో పార్టీలో ఏర్పడిన సంక్షోభం ఎటు దారి తీస్తుందో ఉహించడం కూడా కష్టమే అంటున్నారు. ఒక విధంగా పంజాబ్ అసెంబ్లీ  ఎన్నికలు ముందు ఆ రాష్ట్రంలో ఎదురైన సమస్యలే, ఇప్పుడు రాజస్థాన్ లోనూ తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.  అలాగే, ఈ అన్నిటికీ ప్రధానంగా పార్టీ అధిష్టానమే బాధ్యత వహించవలసి ఉంటుందని అంటున్నారు. అలాగే సంక్షోభ సమయంలో, రంగంలోకి దిగి పరిస్థతిని చక్కదిద్దే సామర్ధ్యమున్న అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్ వంటి ట్రబుల్ షూటర్స్   లేక పోవడం కూడా ఒక్కొక రాష్ట్రం పార్టీ చేజారి పోవడానికి కారణంగా భావిస్తున్నారు.

దొంగ‌లు ప‌డ్డార‌నుకుని హోట‌ల్లోంచి పారిపోయారు!

అర్ధ‌రాత్రి దాటాకో, తెల్లారిగ‌ట్టో ఎవ‌రో వ‌చ్చిన‌ట్ట‌యింది.పెద్దావిడ త‌లుపు తీసింది. వ‌చ్చిన‌వాడి మొహం స‌రిగా క‌న‌ప‌డ‌లేదు. అంతే చేతి క‌ర్ర‌తొ నెత్తిన ఠ‌పీమ‌ని ఒక్క‌టిచ్చుకుంది.. నేనే మామ్మా.. అంటూ మ‌న‌వడు గుమ్మంలోనే ప‌డిపోయాడు! అయ్యో దొంగ‌నుకున్నార్రా..అంటూ త‌ర్వాత స‌ప‌రిచ‌ర్య‌లూ చేసింది మ‌నవ‌డికి. ఒక్కోసారి ఇలాంటి సంఘ‌ట‌న‌లూ జ‌రుగుతూంటాయి.  బ్రెజిల్ లోనూ జ‌రిగింది. జాగింగ్‌, ర‌న్నింగ్ చేసేవారు వాళ్లు ప‌రిగెత్తాల్సిన ట్రాక్‌లో వెళ్ల‌కుండా అలా ప‌రిగెడుతూంటారు.  రోడ్డు ప‌క్క నే స‌ర‌దాగా కాల‌క్షేపం చేస్తూ టిఫిన్ తిన‌డానికి ఈమ‌ధ్య అన్ని ప‌ట్ట‌ణాల్లోనూ ఓపెన్ రెస్టారెంట్లు వ‌చ్చేశాయి. బ్రెజిల్  రెకీఫీ లోని  ఒక న‌గ‌రంలో ఇలాంటిదే ఒక‌టి ఉంది. ఈమ‌ధ్య ఓ సాయింత్రం కొంత మంది అలా స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుంటూన్నారు. అంత‌లో ఎవ‌రో ప‌రిగెడుతూ రావ‌డం ఓ అమ్మాయి చూసింది. ముందు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఎదుటివారితో మాట్లాడుతూనే ఎందుకో భ‌యంతో వెన‌క్కి తిరిగి చూసింది. అంతే ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ప‌రుగున వ‌స్తుండ‌డం చూసి భ‌య‌ ప‌డింది.  ఎవ‌రో దొంగ‌లు పోలీసుల నుంచి త‌ప్పించుకుంటూ పారిపోయి రెస్టారెంట్లోకి వ‌చ్చేస్తున్నార‌నుకుంది. అంతే వెంట‌నే ప‌ర్సు చేతిలో కి తీసుకుని టిఫిన్‌, కాఫీలు వ‌దిలేసి రోడ్డుమీద‌కి ప‌రిగెట్టింది. ఆమె ను చూసి మిగ‌తా అంద‌రూ కూడా పారిపోయాడు. ఆ రెస్టారెంటువాడికి ఏమీ అర్ధంగాక ప‌రుగున లోప‌ల్నించి బ‌య టికి వ‌చ్చేస‌రికి ఈ న‌లుగురు ర‌న్న‌ర్స్ న‌వ్వుకుంటూ ప‌రిగెడుతూ వెళ్ల‌డం చూశాడు. ఓరి మీ దుంప తెగ మీ ర‌న్నింగ్‌కి ఈ దారే దొరికిందా.. కొంప‌లు ముంచేరుక‌ద‌రా! అని గోల్లుమ‌న్నాడు. పోలీసుల‌కు ఫోన్ చేశాడు. తీరావ‌చ్చి అక్క‌డి సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే, వారు దొంగ‌లు కాదు రోడ్డుకి అవ‌త‌లే ఉన్న జిమ్ స‌భ్యుల‌ని తేలింది. త‌ర్వాత ఏమ‌యిందీ త‌ర్వాత సంగ‌తి. ముంద‌యితే, పాపం ఆ రెస్టారెంట్‌వాడికి మాత్రం ఆ పూట న‌ష్ట‌మే వ‌చ్చింది. చాలామంది రోజూ వ‌స్తూపోతూంటారు. ఇటాంటి సంఘ‌ట‌న ఒక్క‌టి చాలు రెస్టా రెంట్ దెబ్బ‌తిన‌డానికి. రేప‌ట్నుంచీ జ‌నం వ‌చ్చినా వెన‌కా ముందూ చూసుకుంటూ, భ‌యం భ‌యంగానే టీ  కాఫీ తాగాలేమో!  అన్న‌ట్టు మీ వూళ్లో ర‌న్న‌ర్లు స‌రిగానే  వెళ్లాల్సిన దారిలోనే  ప‌రిగెడుతున్నారా? 

అజాద్ పార్టీ... డెమొక్ర‌టిక్ అజాద్ పార్టీ 

దేశ రాజ‌కీయాల్లోకి, ముఖ్యంగా కాశ్మీర్ రాజ‌కీయాల్లోకి మ‌రో పార్టీ ఆవిర్భ‌వించింది. చాలాకాలం కాంగ్రెస్ కొమ్ము కాసిన కాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి గులామ్ న‌బీ అజాద్ కాంగ్రెస్‌నుంచి ఇటీవ‌ల బ‌య‌ట‌ప‌డి కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. త‌మ‌ డెమొక్ర‌టిక్ అజాద్ పార్టీ ఎవ‌రి, ఏ ఇత‌ర పార్టీ ప్ర‌భావానికి అనుగుణంగా ఉండ‌ద‌ని అజాద్ ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు.  కాంగ్రెస్‌ను వీడిన‌ప్ప‌టికీ ఆయ‌న స్వంత‌గా పార్టీ నెల‌కొల్పుతార‌ని ఊరిస్తూ వ‌చ్చారు. కాశ్మీర్‌లో త‌న అభి మానులు, మ‌ద్ద‌తుదారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన త‌ర్వాత ఇప్ప‌టికి స్వంత పార్టీ ఏర్పాటు చేశారు. సోమ వారం మీడియా స‌మావేశంలో త‌న పార్టీ పేరు ప్ర‌క‌టించారు. త‌మ పార్టీ ఎవ‌రి భావ‌జాలానికి లొంగి ప‌ని చేయద‌ని, స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్నారు. పార్టీజెండాను కూడా ఆయ‌న ఆవిష్క‌రించారు. జండా కి నిలువుగా  నీలం, తెలుపు, ప‌సుపు రంగులు ఉన్నాయి.  కాశ్మీర్‌కు ప్ర‌త్యేక రాష్ట్ర హోదా సాధించ‌డ‌మే త‌మ పార్టీ ల‌క్ష్యంగా అజాద్ ప్ర‌క‌టించారు. పార్టీ పెడ‌తా న‌ని అంటున్నారే గాని దాని పేరు, జండాల గురించి కాశ్మీరీలు, ఇత‌ర పార్టీల‌వారూ గ‌త నెల రోజులుగా ఎదురు చూశారు. సోమ‌వారం పార్టీ పేరు, జండా కూడా ఆవిష్క‌రించ‌డంతో పాటు త‌మ పార్టీ ల‌క్ష్యాన్ని ప్ర‌జల సం క్షేమాన్ని దృష్టిలోపెట్టుకుని పార్టీ కార్య‌క‌లాపాలు ఉంటాయ‌ని అజాద్ అన్నారు. కాంగ్రెస్‌తో యాభ య్యేళ్ల అనుబంధాన్ని వ‌దులుకొని బ‌య‌ట‌ప‌డ‌గానే భారీ ర్యాలీలో ఆయ‌న ప్ర‌సంగిస్తూ పార్టీ పేరు, జండా కూడా ప్ర‌జ‌ల ఆకాంక్ష‌కు అనుగుణంగానే ఉంటుందని, వారే నిర్ణ‌యిస్తార‌ని అన్నారు. పార్టీ త‌ప్పకుండా కాశ్మీరీ ల నిరుద్యోగ స‌మ‌స్య ప‌రిష్కారంపై దృష్టి పెడుతుంద‌ని హామీ యిచ్చారు. త్వ‌ర‌లో రాష్ట్ర ఎన్నిక‌లు ఉన్న కార‌ణంగా త‌మ‌పార్టీ కార్యాల‌యం ఇక్క‌డే ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలి పారు. కాంగ్రెస్‌తో త‌మ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, పార్టీలో ఇపుడు ప‌రిస్థితులు ఎంతో మారి పోయాయ‌ని అన్నారు. రాహుల్ పార్టీ బాధ్య‌త‌లు మోసేంత శ‌క్తిమంతుడు కాద‌ని అన్నారు.