జూబ్లీహిల్స్ రేప్ కేసు... నిందితుల్లో న‌లుగురు మేజర్లే!

ఈ ఏడాది మే 28న జూబ్లీహిల్స్ ఆమ్నేషియా ప‌బ్ గ్యాంగ్‌రేప్ కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. హైద‌రా బాద్‌లో  సంచ‌ల‌నం సృష్టించిన బాలిక రేప్ కేసులో  జువైనెల్ కోర్టు నిందితులుగా పేర్కొన్న ఐదుగురు మైన‌ర్ల‌లో న‌లుగురిని  మేజ‌ర్లుగా ప‌రిగ‌ణిస్తూ తీర్పునిచ్చింది. విచార‌ణ స‌మ‌యంలో న‌లుగురు మైన‌ర్ల‌ నూ మేజ‌ర్లు గానే తీసుకోవాల‌న్నారు. అయితే సైకియాట్రిస్ట్ నివేదిక ప్ర‌కారం వారు నేర‌స‌మ‌య‌లో ప‌ద‌హారు నుంచి 18 ఏళ్ల లోపువారే కావ‌డ‌తో  పోలీసులు జువైన‌ల్ కోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింది.  ఈ ఏడాది మే 28న ఓ పార్టీలో పాల్గొనేందుకు జూబ్లీహిల్స్‌ అమ్నేషియా పబ్‌కు వచ్చిన రొమేనియా మైనర్‌ బాలికపై సాదుద్దీన్‌ అనే యువకుడితో పాటు ఐదుగురు మైనర్లు సామూహిక అత్యాచారం జరిపిన విష యం తెలిసిందే. బాలికను రోడ్డు నెంబర్‌ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో గ్యాంగ్‌ రేప్‌ చేసి ఆ తర్వాత సాయం త్రం మళ్లీ పబ్ దగ్గర వదిలిపెట్టగా..ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మే 31న పోక్సో యాక్ట్‌ ప్రకారం.. జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. అయితే, నిందితులు తీవ్ర‌నేరానికి పాల్ప‌డ్డారు గ‌నుక మేజ‌ర్లుగానే ప‌రిగ‌ణించాల‌ని కోర్టును పోలీసులు కోరారు. ఈ కార‌ణంగా జువెనైల్ బోర్డు విచార‌ణ చేపట్టింది. నిందితులు న‌లుగురికి మ‌ద్యం అల‌వాటు లేద‌ని, నేర స‌మ‌యంలో మ‌ద్యం తాగ‌లేద‌ని బోర్డు నిర్ధారించింది. చివరికి ఐదుగురు మైనర్‌ నిందితుల్లో నలుగురిని మేజర్లుగా పరిగణిస్తూ జడ్జిమెంట్‌ ఇచ్చింది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఓ ఎమ్మెల్యే కొడుకు విష యంలో మాత్రం ప్రాథమిక అంచనాకి రాలేకపోయింది బోర్డు. ఎమ్మెల్యే కొడుకుపై ఉన్న అభియోగం తీవ్ర మైనది కాకపోవడంతో మైనర్‌గా పరిగణించాలని జువెనైల్‌ జస్టిస్ బోర్డు నిర్ణయించింది.

తెరాసకు ఎంఐఎం తలాక్ ?

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు  కేసీఆర్ విజయ దశమి రోజున జాతీయ పార్టీ ఏర్పాటుకు సిద్దమవుతున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని అంటున్నారు. అయితే  ఆ రోజున పార్టీ ప్రకటన వరకే ఉంటుందా లేక ఇంకా ఏమైనా సంచలన నిర్ణయాలు ఉంటాయా  అనే విషయంలో ఇంతవరకు అయితే ఎలాంటి స్పష్టత రాలేదు. నిజానికి ఇంతవరకు, జాతీయ పార్టీ ప్రకటనకు సంబంధించి కూడా తెరాస పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.  కానీ తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసన సభా పక్షం, విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందనే సమాచారం అయితే  ఉందని అంటున్నారు. అయితే, పండగ పూట జరిగే సమావేశంలో జాతీయ పార్టీ ప్రకటనతో పాటుగా తెరాస పార్టీ  పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది.  అయితే  అది ఎలా ఉన్నప్పటికీ, కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా తెరాస ఏకైక మిత్రపక్షం  ఎంఐఎం గులాబీ పార్టీకి తలాక్  చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి, ముందు నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వచ్చిన ఎంఐఎం. కేసీఆర్ సారథ్యంలో జరిగిన తెలంగాణ మలి విడత ఉద్యమాన్నీ వ్యతిరేకించింది. రాష్ట్ర విభజ జరిగితే  బీజేపీ బలపడుతుందని  ఎంఐఎం అధ్యక్షుడు  హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్  లోపలా వెలుపలా కూడా పలు సందర్భాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేకించారు.  అయితే  రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్, ఒవైసీ జిగ్నీదోస్తులై పోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభ వేదిక నుంచే, ‘అవును. ఎంఐఎం మా మిత్ర పక్షం’ అని ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి వారు పోటీ చేసినా, ఫలితాలు వచ్చిన తర్వాత  ఒకటై పోయారు. చివరకు మొన్నటికి మొన్న  సెప్టెంబర్ 17న  అనివార్యంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపవలసి వచ్చినప్పుడు కూడా  తెలంగాణ విమోచన దినాన్ని, విమోచన దినంగా కాకుండా ఒవైసీ సూచించిన విధంగా జాతీయ సమైక్యతా దినంగా జరిపించారు.  అయినా ఇద్దరి మధ్య స్నేహ సంబంధాలున్నా ఇప్పటికే జాతీయ రాజకీయాలలో వేలు పెట్టిన ఎంఐఎం అధినేత ఒవైసీకి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కాలు పెట్టడం ఏమాత్రం  ఇష్టం లేదని అంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వేలు పెడితే, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస గెలుపు అవకాశాలు దెబ్బతింటాయని ఒవైసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా  కేసీఆర్  తప్పుడు రాజకీయ ఎత్తుగడల వల్లనే, రాష్ట్రంలో బీజేపీ బలం పుంజు కుంటోందని ఒవైసీ గుస్సా అవుతున్నారని అంటున్నారు. రాష్ట్రంలో కాషాయ దళం అధికారంలోకి వచ్చే ప్రమాదకర పరిస్థితులను కూడా కేసీఆర్ సృష్టిస్తున్నారని  ఒవైసీ  భావిస్తున్నట్లు తెలుస్తోంది.   తెరాసతో ఉన్న రాజకీయ అవగాహన కారణంగా  ఎంఐఎం ఇంతవరకూ పాత బస్తీలోని ఏడు అసెంబ్లీ,  హైదరాబాద్ లోక్ సభ స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఇక ఇప్పుడు తెరాసకు తలాక్ చెప్పిన నేపధ్యంలో రాష్ట్రంలో ముస్లిం జనాభా అధికగా ఉన్న ఇతర జిల్లాలు, నియోజక వర్గాల నుంచి కూడా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎంఐఎం కేవలం పాత బస్తీకే పరిమితమైతే  పాత బస్తీ పరిధిలోని ఏడుకు ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచినా, బీజేపీ మోడీ ప్రభుత్వ సహకారంతో తమ గొంతు నొక్కేస్తుందని,  అదే ఓ 15 మంది ఎంఐఎం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే, తెలంగాణలో యూపీ ( యోగీ) బుల్దోజర్ పాలనను అడ్డుకోగలుగుతామని ఒవైసీ భావిస్తున్నారని తెలుస్తోంది.  ఈ నేపధ్యంలోనే ఉమ్మడి అధిలాబాద్, నిజాబాబాద్, కరీంనగర్ జిల్లాలలోని ముస్లిం ఆధిపత్యం ఉన్న నియోజక వర్గాల నుంచి పోటీ చేయాలని ఎంఐఎం నాయకత్వం నిర్ణయానికి వచ్చి నట్లు తెసుస్తోంది. నిజామాబాద్, నిర్మల్, అదిలాబాద్ మున్సిపాలిటీలలో ఎంఐఎం ఇప్పటికే ఒకటీ అరా సీట్లు గెలుచుకుంది.  అలాగే, ఓబీసీలు, దళితులను కలుపుకుని రాష్ట్రంలో విస్తరించే, ప్రణాళికకు ఒవైసీ పదును పెడుతున్నారు. అలాగే  అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధిక స్థానాలు గెలిచి హాంగ్ అసెంబ్లీ ఏర్పడితే, ఎంఐఎం కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు సిద్ధమవుతుందని అంటున్నారు.  అందుకే ఎంఐఎం తెరాసతో తలాక్ కు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎంఐఎంతో తెరాస దోస్తానాను బూచిగా చూపించి  హిందూ ఓటు బ్యాంక్ ను పటిష్టం చేసుకునేందుకు, బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కేసీఆర్, ఒవైసీ ‘తలాక్’ వ్యూహాన్ని తెర  మీదకు తెచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

సెలవులో తెలంగాణ సీఎస్.. విదేశీ పర్యటన సాకేనా?

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్  నైరోబీలో జరగనున్న ఇక్రిసాట్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సోమేష్ కుమార్ బాధ్యతలను స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయ పార్టీ ప్రకటన మరో మూడు నాలుగు రోజులలో ఉన్న సమయంలో ఇలా హఠాత్తుగా ఇక్రిసాట్ సమావేశం అంటూ సోమేష్ కుమార్ విదేశీ పర్యటనకు వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయినా ఇక్రిసాట్ సమావేశం సీఎస్ అనివార్యంగా హాజరవ్వాల్సినంత ముఖ్యమైన సమావేశం ఏమీ కాదు. ఆయన మరో అధికారిని ఇందుకు డిప్యూట్ చేసే అవకాశాలు ఉన్నా.. ఆలా చేయకుండా కీలక సమయంలో సోమేష్ కుమార్ విదేశీ పర్యటన పేరుతో వెళ్లడంపైనే పరిశీలకులు పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవలి కాలంలో తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా తెరాసలో అంత కంటే ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులలో ఈడీ దాడుల గాబరా ఎక్కువగా ఉంది. అంతే కాకుండా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఫీనిక్స్ వ్యవహారంలో తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ప్రమేయంపై ఈడీ కూపీలాగుతున్నదన్న సమాచారంతో తెలంగాణ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయడానికి అన్నీ సిద్ధమైన తరుణంలో సీఎస్ సోమేష్ కుమార్ విదేశీ పర్యటన పేరుతో హైదరాబాద్ వీడి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన వెళ్లేది ఇక్రిసాట్ సమావేశంలో పాల్గొనేందుకు కాదనీ, అయినా ఆయన విదేశాలకు వెళ్లడం లేదనీ అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.  ఫీనిక్స్ వ్యవహారంలో తన ప్రమేయంపై ఈడీ దర్యాప్తు చేస్తున్నదన్న వార్తల నేపథ్యంలో ఆయన హస్తినకో, మరో ప్రాంతానికో వెళ్లనున్నారని అంటున్నారు. ఫీనిక్స్ వ్యవహారంలో తెలంగాణ సర్కార్ ఢిఫెన్స్ లో పడిన నేపథ్యంలో సీఎస్ తాను కొంత కాలం అధికారిక కార్యకలాపాలకు దూరంగా ఉండటం మేలని భావించడమే ఇందుకు కారణమని అంటున్నారు. ఇంతకీ ఆంధ్రా కేడ‌ర్ కి చెందిన సోమేష్ పట్టుబట్టి కోర్టు ఆదేశాలను ధిక్కరించడానికి కూడా సిద్ధపడి తెలంగాణాలో ఉండాల‌నుకున్నారు. అటువంటి సోమేష్ కుమార్ కు  ఫీనిక్స్ కుంభ‌కోణంలో ప్రమేయంపై ఈడీ కూపీలాగుతుండటంతో   ఇబ్బందుల ఊబిలో కూరుకుపోయారని అంటున్నారు. ఈడీ దర్యాప్తు కారణంగా ప్రభుత్వం ఇబ్బందులలో పడటం, కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటన సమయంలో ఈడీ దాడులు జరిగితే ప్రభుత్వ పరువుతో పాటు సీఎం కు కూడా ఇబ్బందులు తప్పవన్న కారణంతో స్వయంగా సీఎం కేసీఆర్  సూచించడంతోనే ఆయన విదేశీ పర్యటన నెపంతో దూరంగా వెడుతున్నారని పరిశీలకులు అంటున్నారు. అధికార వర్గాలలో కూడా ఇదే వాదన వినవస్తున్నది. మొత్తం మీద దసరా ముందు.. అంటే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముందు సీఎస్ దూరంగా ఉండటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఢిల్లీ నుంచి యూర‌ప్‌లో కారు న‌డిపిన మోదీ...5జీ మ‌హిమ‌!

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ మూడురోజుల‌పాటు జ‌రిగే మొబైల్ ఇండియా  కాంగ్రెస్ 2022 ను  ప్రధాని శ‌ని వారం ఆరంభించారు.  అందులో భాగంగా  5జీ  టెలిక‌మ్యూనికేష‌న్ సేవ‌లు ఆరంభించారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఎరిక్‌స‌న్ బూత్ నుంచి 5జీ టెక్నాల‌జీ ఉప‌యోగించి స్వీడ‌న్‌లో ఉన్న కారును న‌డిపారు.   రిమోట్ కంట్రోల్ కారులో స్టీరింగ్ చేస్తూ ప్ర‌ధాని ఉన్న ఫోటో ను కేంద్ర వాణిజ్య‌శాఖ మంత్రి పీయూష్ గో యెల్ ట్వీట్ చేశారు. భార‌త మొబైల్ కాంగ్రెస్ 2022 ఆసియాలోకెల్లా అతి పెద్ద డిజిట‌ల్ టెక్నాల‌జీ వేది క‌ల్లో ఒక‌టిగా పేర్కొన్నారు. కాగా, న్యూఢిల్లీ ప్ర‌గ‌తీమైదాన్‌లో ఆరంభ‌మైన స‌ద‌స్సు ఈ నెల 4వ తేదీ వ‌ర‌కూ జ‌రుగు తుంది.  రిమోట్‌గా కారును నడపడమే కాకుండా, కార్యక్రమంలో ప్రదర్శించిన  అనేక ఇతర సాంకేతిక ఆవిష్క రణలను కూడా మోదీ ప్ర‌యోగించారు. 5G టెక్నాలజీ మొబైల్ కమ్యూనికేషన్, డేటా ట్రాన్స్‌మిషన్ కోసం 4జీ కంటే చాలా వేగవంతమైన వేగాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. 5G రోల్ అవుట్ ఇతర ప్రయోజ నాలతోపాటు వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను వేగవంతం చేస్తుం దని నమ్ముతారు. 5జీ మొదటి దశ 13 నగరాల్లో ప్రారంభించబడుతుంది. 2024 నాటికి దేశవ్యాప్తంగా పూర్తి  5G  కవరేజీ  పూర్త వుతుంది.

2024లో ఏపీలో అధికారం ఎవరిదంటే.. రాయపాటి సెన్సేషన్!

రాయపాటి సాంబశివరాలు. ఏపీ రాజకీయాలలో ఢక్కామెక్కీలు తిన్న నేత. మాజీ ఎంపీ. రాజకీయ నాడి తెలిసిన నాయకుడిగా ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. గత కొద్ది కాలంగా ఆయన క్రియా శీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గత ఎన్నికలలో ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా నరసరావు పేట నియోజకవర్గం నుంచి లోక్ సభ స్థానానికి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయినా ఆయన రాజకీయ విశ్లేషణలకు విశ్వసనీయత ఉందని రాజకీయనాయకులు చెబుతుంటారు. అనారోగ్యం కారణంగానే ఆయన గత కొంత కాలంగా క్రియాశీల రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. అయితే ఆయన అంచనాలపైన మాత్రం రాజకీయ వర్గాలలో విశ్వసనీయత మెండుగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచే పార్టీ ఏదన్నది బయటపెట్టేశారు. ఏపీలో వచ్చే ఎన్నికలపై తన సర్వే ఇదంటూ ఆయన వెల్లడించిన వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని రాయపాటి చెప్పారు. ఆ వ్యతిరేక పవనాలలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని ఆయన తన సర్వే ఫలితంగా చెప్పారు. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే.. తెలుగుదేశం ఘన విజయం తధ్యమన్నది రాయపాటి సర్వే సారాంశం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తక్కువలో తక్కువ తెలుగుదేశం 125 స్థానాలలో విజయం సాధిస్తుందని రాయపాటి పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనీ, ఆ మార్పు ప్రగతి కోసమేననీ ఆయన వివరించారు. దార్శనికుడిగా, అభివృద్ధి కాముకుడిగా చంద్రబాబుకు ఉన్న గుర్తింపే ప్రజలను ఆయనవైపు చూసేలా చేస్తోందని రాయపాటి వివరించారు. గత కొంత కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న రాయపాటి వచ్చే ఎన్నికలలో తన పోటీ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పొత్తుల విషయం కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయమే అంతిమమని స్పష్టం చేశారు. ఇలా ఉండగా ఏపీలో వచ్చే ఎన్నికలలో గెలుపు ఎవరిదన్న అంశంపై ఇప్పటికే పలు రకాల సర్వేలు వెలువడ్డాయి. అన్ని సర్వేలూ కూడా జగన్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందనే పేర్కొన్న సంగతి ఇక్కడ గమనార్హం. ఆఖరికి జగన్ తన ఐప్యాక్ టీమ్ తో చేయించుకున్న సర్వేలో కూడా వైసీపీ ఓటమి చ్ఛాయలు ప్రస్ఫుటంగా కనిపించాయని చెబుతున్నారు. అందుకే జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలపై, మంత్రులపై గరం అవుతున్నారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలలో ఉన్న సానుకూలతను మరింత పెంచుకునే దిశగా  తెలుగుదేశం పార్టీ వేగంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు కూడా సిద్ధమౌతున్నారు. అలాగే పార్టీ అధినేత చంద్రబాబు బస్సు యాత్రకు సమాయత్తమౌతున్నారు. ఈ నేపథ్యంలోనే రాయపాటి కూడా తన సర్వే అంటూ వెల్లడించిన వివరాలు తెలుగుదేశం పార్టీలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయనడంలో సందేహం లేదు.

5జీ సేవ‌లు ఆరంభించిన ప్ర‌ధాని

భార‌త్ మొబైల్ కాంగ్రెస్ 2022ను ఢిల్లీలో భార‌త్ ప్రధాని న‌రేంద్ర‌మోదీ  5జీ  సేవ‌లు ప్రారంభించారు. దీంతో చాలా కాలం నుంచి అంద‌రూ ఎదురుచూస్తున్న 5జీ సేవ‌లు 13 ప్ర‌ధాన న‌గ‌రాల్లో అమ‌ల్లోకి వ‌స్తా యి. 5జీని ప్రారంభించిన వెంట‌నే ప్ర‌ధాని రెలియ‌న్స్ జీయో పెవిలియ‌న్ పైకి వెళ్లి ట్రూ 5జీ ప‌రిక‌రాన్ని ధ‌రించి ఆ అనుభ‌వాన్ని ఆస్వాదించారు. 5జీ ప‌రిక‌రం వినియోగం గురించి ప్ర‌ధానికి రెలియ‌న్స్ ఛీఫ్ ముకేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ వివ‌రించారు. జియో సంస్థ‌కు ఆకాష్ ఇటీవ‌లే ఛైర్మ‌న్ అయిన సంగ‌తి తెలిసిందే. 5జీ ప్రారంభోత్స‌వంలో టెలికాం మంత్రి అశ్విని వైష్ణ‌వ‌; స‌హాయ‌మంత్రి టెలికాం మంత్రి దేవుసింహ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు.  ఇన్నాళ్లుగా మనం వాడుతున్న 4జీ సేవలకు అనేక రెట్ల వేగంతో 5జీ నెట్‌వర్క్‌లు పనిచేస్తాయి. ఈ రెం డింటికీ మధ్య ఉన్న తేడాల్లో అత్యంత ప్రధానమైనది.. లాటెన్సీ. అంటే.. స్పందించే వేగం. ఉదాహర ణకు మనం గూగుల్‌ ఏదైనా సెర్చ్‌ చేయాలనుకుంటే సెర్చ్‌బార్‌లో సంబంధిత పదాన్ని టైప్‌ చేసి ఎంటర్‌ కీని నొక్కుతాం. మనం ఇచ్చిన ఆ ఆదేశానికి 4జీ నెట్‌వర్క్‌ అయితే.. 60 మిల్లీ సెకన్ల నుంచి  80 మిల్లీ సెకన్లలో స్పందించి సెర్చ్‌ చేయడం మొదలుపెడుతుంది. అంటే 4జీలో లాటెన్సీ 60-80 మిల్లీసెకన్లు ఉంటుంది. అదే 5జీలో ఈ సమయం 5 మిల్లీసెకన్ల కన్నా తక్కువగా ఉంటుంది. దీనివల్ల వేగం పెరుగు తుంది.  4జీలో గరిష్ఠ డౌన్‌లోడ్‌ వేగం 1జీబీపీఎస్‌ (గిగాబిట్స్‌ పర్‌ సెకన్‌)  5జీలో అది 10 జీబీపీఎస్‌. దీనివల్ల అత్య ధిక నాణ్యత, నిడివి కలిగిన వీడియోలను, సినిమాలను సైతం సెకన్ల వ్యవధిలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 4జీ-5జీ సేవల మధ్య ఉన్న మరో ప్రధానమైన తేడా సమాచార ప్రసార విధానం. 4జీలో సమాచార సంకే తాలు సెల్‌టవర్ల నుంచి ప్రసారమవుతాయి. 5జీలో అయితే.. ఇందుకు స్మాల్‌ సెల్‌ టెక్నాలజీని వాడుతా రు. అంటే.. పిజ్జాబాక్సుల సైజులో ఉండే చిన్న సెల్స్‌ ద్వారా హైబ్యాండ్‌ 5జీ సేవలను అందుబాటులోకి తెస్తారు. అలాంటి బాక్సులను అమర్చలేని చోట, తక్కువ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్‌లున్న చోట.. సెల్‌ టవర్లనే వినియోగిస్తారు.

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ బతుకు బస్టాండే!

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. భార్యకు నెల నెలా ఎనిమిది లక్షల రూపాయలు భరణం ఇవ్వాల్సిందేనని విజయవాడ కోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇప్పటికే అటు రాజకీయాలలోనూ.. ఇటు సినిమాలలోనూ ప్రాభవం కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న పృధ్వికి కోర్టు తీర్పు ములిగే నక్కమీద తాటి పండు పడ్డ చందం అయ్యింది.  సినిమాల్లోకి రావడానికి ముందే పృధ్వికి వివాహమైంది. ఆ తరువాత ఆయన సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించే సమయంలో భార్య కుటుంబం నుంచి ఆర్థిక సహాయాన్ని పొందాడు. సరే సినిమా అవకాశాలు వచ్చి బాగానే స్థిరపడ్డాడు. అయితే సినిమాల్లో స్థిరపడి సంపాదన రావడం మొదలయ్యాకా.. భార్యను దూరం పెట్టాడు. దీంతో ఆమె కోర్టులో కేసు వేశారు. ఆ కేసులో ఇప్పుడు తీర్పు వచ్చింది. ప్రతి నెలా అదీ పదో తేదీలోగా భార్యకు 8లక్షల చొప్పున భరణం ఇవ్వాలంటూ విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. దీంతో ఫృధ్వి ఇక తేరుకోవడం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.   సినిమాలలో మంచి క్రేజ్ ఉన్న సమయంలో ఆయన జగన్ పంచన చేరి రాజకీయాలలో ప్రవేశించారు. అదేం పెద్ద విషయం కాదు..  పృధ్వి కంటే ముందూ, తరువాతా కూడా అనేక మంది సినీ పరిశ్రమ నుంచి రాజకీయాలలోకి ప్రవేశించారు. అయితే వారందరికీ భిన్నంగా పృధ్వి ముందు వెనుకలు చూసుకోకుండా.. ఇష్టారీతిన చెలరేగిపోయారు. జగన్ మెప్పు పొందడమే లక్ష్యంగా వీళ్లూ, వాళ్లే అని చూడకుండా జగన్ ప్రత్యర్థులందరినీ విమర్శలతో చెరిగి పారేశారు. అక్కడితో ఆగకుండా సినిమా ఇండస్ట్రీలోని పెద్దలందరినీ దూషించడం ద్వారా జగన్ వద్ద అదనపు మైలేజీ పొందడానికి ప్రయత్నించారు. అందులో భాగంగా  వ్యక్తిగత విమర్శలకూ వెనుకాడలేదు. అయితే ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కినట్టే దక్కినే వెంటనే అంటే చాలా వేగంగా జగన్ నుంచి ఛీత్కారమూ ఎదురైంది. ఏ జగన్ ను మెప్పించడానికైతే ఆయన ఇదంతా చేశాడో చివరికి ఆ జగనే దూరం పెట్టేశారు. దీంతో పృధ్వి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. సినిమాలూ లేవు, రాజకీయంగానే భ్రష్టుపట్టిపోయారు. దానికి తోడు ఇప్పుడు గోరుచుట్టుపై రోకటి పోటులా భార్యకు నెలకు 8లక్షల రూపాయల భరణం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి.  కట్టకపోతే కోర్టు ధిక్కారం కింద జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. పోనీ కట్టేద్దామా అంటే సినిమాల్లో అవకాశాలే లేని పృధ్వి అంత సొమ్ము నెలనెలా కట్టడం అంటే సాధ్యమయ్యే పని కాదని ఆయన పరిస్థితి తెలిసిన వారు చెబుతున్నారు. దీంతో  పృధ్వి బతుకు బస్టాండ్ అయిపోయిందని పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది.. పదవీ కాంక్షతో పృధ్వి వేసిన ఒక్క అడుగు ఆయన జీవితాన్ని తల్లకిందులు చేసేసింది. ఇప్పుడు పృధ్వి  రాజకీయాల్లో వేలు పెట్టి వైసీపీ ట్రాప్‌లో ఇరుక్కుని భ్రష్టుపట్టిపోయానని బాధపడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో లబోదిబో మంటున్నాడు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా!

బుగ్గ‌నా.. ఇది త‌గునా!

చిన్న మ‌న‌వ‌డి పెళ్లికి ఏర్పాట్లు స‌రిగా ఉన్నాయో లేదో చూసుకోవ‌డంలో నానా హైరానా ప‌డుతోంది పెద్దా విడ‌. అన్నీ బాగానే ఉన్నాయి, అందరూ గొప్ప‌గా ఉన్నాయ‌ని కొడుకు అంటూన్నా ఆమెకు న‌చ్చ‌లేదెం దుకో, అన్న‌ట్టు స్టీలీ బిందిలో పంచ‌దార నీళ్లు తెప్పించాను ఇచ్చార్రా.. అస‌లే ఎండ‌గా ఉంది కూడా నూ..అని ఎవ‌ర్నో పుర‌మాయించింది పెద్దావిడ‌. చిత్ర‌మేమంటే స్టీలు బిందెల్లో డోన్‌లో మాత్రం వైసీపీ అభిమానుల‌కు ఇచ్చింది మాత్రం పంచ‌దార నీళ్ల‌యితే కాదు! అస‌లే జ‌నాల్లో ప‌రువు పోతున్న స‌మ‌యంలో క‌ర్నూలు జిల్లా డోన్ మండ‌లంలో వైసీపీ లోకి చేర‌డానికి కొం ద‌రు ఉత్సాహప‌డి ఆ పార్టీ అధినేత, రాష్ట్ర‌ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌ట్ల వీరాభిమానంతో వ‌చ్చారు.  ఆ అభి మానులను పార్టీలోకి ఆహ్వాని స్తున్న మంత్రి బుగ్గ‌న ఆనందానికి అంతేలేదు. బుగ్గ‌న స‌మ‌క్షంలోనే డోన్ ప‌రిధిలో చాలామంది వైసీపీలోకి చేర‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. పెద్ద స‌భే జ‌రిగింది. వ‌చ్చిన‌వారంతా బుగ్గ‌న‌కి బొకేలిచ్చి పార్టీలో స‌భ్య‌త్వం తీసు కున్నారు.  కానీ స‌భ అక్క‌డితో ముగియ‌లేదు. వ‌చ్చిన‌వారు బ‌ళ్లు వేసుకుని ఎండ‌న‌ప‌డి వ‌చ్చార‌ని మ‌జ్జిగ ఇచ్చి నంత సులువుగా క‌ర్ణాట‌క మ‌ద్యాన్ని అందించి వారిని ఆనంద‌ప‌రిచారు. పార్టీలోకి చేర‌డానికి కంటే ఎక్కువమంది ఈ ఊహించ‌ని ఆహ్వానానికి సంత‌సించి అభిమానులు విర‌గ‌బ‌డిన‌ట్టు స‌మాచారం. రాష్ట్రంలో మ‌ద్య నిషేధం అమ‌లులోకి వ‌చ్చిన స‌మ‌యంలోనే ప‌క్క రాష్ట్రం నుంచి తెప్పించి మ‌రీ వేడు క‌గా చేసుకోవ‌డంలో ఆంత‌ర్య‌ర్య‌మేమిటి? 

తెలంగాణాలో ఎస్టీ కోటా పెంపు...న్యాయ‌ప‌రీక్ష‌కు నిలిచేనా?

తెలంగాణాలో షెడ్యూల్డ్ తెగ‌ల‌(ఎస్టీ) ల‌కు రిజ‌ర్వేష‌న్లు ప‌దిశాతం పెంచారు. జ‌నాభా దామాషా ప్ర‌కారం ఎస్టీల‌కు ఈ రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం జీవో 33 జారీ చేసింది. దీనితో రాష్ట్రంలో గిరిజ‌నుల‌కు శ‌ని వారం న‌వంబ‌ర్ 1 నుంచే  ఈ కొత్త రిజర్వేష‌న్ అమ‌లులోకి వ‌చ్చాయి. వాస్త‌వానికి తెలంగాణాలోనే ఇత‌ర రాష్ట్రాల‌కంటే గిరిజ‌న జ‌నాభా ఎక్కువ‌. ఇటీవ‌లి కాలంలో 6 నుంచి 10 శాతానికి ఆ జ‌నాభా పెరిగింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో గిరిజ‌నుల‌కు జ‌రిగిన అన్యాయాల దృష్ట్యా వారికి ప్ర‌త్యేక నిధిని కేసీఆర్ స‌ర్కార్ ఏర్పాటు చేసి భారీ నిధులు కేటాయించింది.  రిజ‌ర్వేష‌న్ల పెంపు విష‌యంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎస్‌.చెల్ల‌ప్ప నేతృత్వంలో క‌మిష‌న్ వేశారు. ఈ క‌మిష‌న్ ఇచ్చిన నివేదిక‌ను 2017లో రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదించిన రోజునే అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి కేంద్ర‌ప్ర‌భుత్వానికి పంప‌డం జ‌రిగింది. కానీ కేంద్రం చాలాకాలం దాన్ని తొక్కిపెట్టింది. ఈ కార‌ణంగా నే రాష్ట్ర‌ప్ర‌భుత్వం చొర‌వ‌తీసుకుని స్వ‌యంగా ఈ రిజ‌ర్వేష‌న్ల పెంపు నిర్ణ‌యం తీసుకుంది.  నిధులు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఖర్చు చేయాలని, ఒకవేళ ఖర్చు చేయలేకపోతే  తర్వాతి సంత్సరానికి బదిలీ (క్యారీ ఫార్వర్డ్‌) చేయాలని నిర్ణయించి ప్ర‌భుత్వం అమలు చేసింది. ఎస్టీలకు గురు కులాలు ఏర్పాటుచేసి వారి విద్యాభివృద్ధికి కృషిచేసింది. అనేక ఇతర సౌకర్యాలు, భరోసా కల్పించినప్ప టికీ విద్య, ఉద్యోగాల్లో వెనకబడిపోయిన గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు అంశం అలాగే ఉండి పోయింది.  కాగా తెలంగాణాలో గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉండటం తో వారికి  రిజర్వేషన్‌ కోటా పెంచాలని చెల్లప్ప కమిటీ సూచించటం ఇంకో ప్రత్యేక సందర్భం. సుప్రీంకోర్టు తీర్పులోని ‘ప్రత్యేక సందర్భం’ అనే మాటకు రాష్ట్రంలోని ఈ ప్రత్యేక సందర్భాలు కచ్చితంగా సరిపోలుతున్నాయి. 1994లో తమిళనాడులో రిజర్వేష న్లను 50 శాతానికి మించి అమలు చేస్తే, అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చి రాజ్యాంగ రక్షణ కల్పించింది. 28  ఏళ్లుగా అక్కడ 69 శాతం రిజర్వేషన్లు నిరాఘా టంగా అమలవుతున్నాయి.  ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పులోని ‘ప్రత్యేక’ వెసులుబాటు ఆధారంగా తెలం గాణ ప్రభుత్వం ఆరేళ్ల క్రితమే గిరిజనుల రిజర్వేషన్‌పెంపు బిల్లును శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపింది. పార్లమెం టులోనూ టీఆర్‌ఎస్‌ నేతలు గిరిజన రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్‌ చేశారు. అయినా కేం ద్రం స్పందించలేదు. దీంతో రాష్ట్రప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ శుక్రవారం జీవో జారీ చేసింది. 

ఐఎస్బీ చంద్రబాబు ఫొటో లేకపోవడమేంటి.. వెంటనే ఏర్పాటు చేయండి.. మాజీ సీజేఐ

ఒక దార్శనికుడిని రాజకీయ వైరంతో మరుగున పడేయడం ఎవరి వల్లా కాదు. ఆ విషయం చంద్రబాబు విషయంలో పదే పదే రుజువు అవుతోంది. రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్టం ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తే కలిగించొచ్చు కానీ.. నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారూ మాత్రం చంద్రబాబు దార్శనికతపై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. కేవలం చంద్రబాబు దూరదృష్టితో చేసిన ప్రయత్నం వల్లనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి) హైదరాబాద్ కు వచ్చింది. కేవలం రెండు దశాబ్దాలలోనే ఐఎస్ బి హైదరాబాద్ అంతర్జాతీయంగా ఎనలేని గుర్తింపు పొందింది. ఇదే విషయాన్ని ఇటీవల మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మరోమారు చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. నాడు ఆయన చేసిన బృహత్ప్రయత్నానికి కొందరు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారనీ, చివరికి కేసులు వేసి మరీ అడ్డుకునేందుకు ప్రయత్నించారనీ చెప్పారు.   హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)లో ఇటీవల  నిర్వహించిన ‘లీడర్‌షిప్‌ సమ్మిట్‌-22’ను జస్టిస్‌ రమణ ప్రారంభించి, కీలకోపన్యాసం చేశారు. ఆ సందర్భంగా ఐఎస్బీకి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం భూ కేటాయింపులను సవాల్ చేస్తూ దాఖలైన కేసును తానే వాదించానని గుర్తు చేసుకున్నారు. ఆ కేసు తీర్పు చారిత్రాత్మకమని అన్నారు. ఎక్కడైనా, ఎప్పుడైనా అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నించే వారు ఉంటారనీ, ఐఎస్బీ విషయంలో కూడా అలాగే జరిగిందనీ పేర్కొన్న జస్టిస్ ఎన్వీ రమణ.. చంద్రబాబు దార్శనికతతో, పట్టుదలతో ఐఎస్బీ హైదరాబాద్ కు రావడానికి ప్రయత్నించి సఫలికృతులయ్యారని పేర్కొన్నారు. అటువంటి చంద్రబాబు ఫొటో ఐఎస్బీలో లేకపోవడం బాధాకరమని చెప్పిన జస్టిస్ ఎన్వీ రమణ వెంటనే ఆయన ఫొటో ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు.    నిజమే హైదరాబాద్ కు ఐఎస్బీ రావడానికి చంద్రబాబు దార్శనికత, సమర్ధత కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు. అటువంటి చంద్రబాబుకు మూడు నెలల కిందట జరిగిన ఐఎస్బీ ద్విశతాబ్ది వేడుకలకు కనీసం ఆహ్వానం కూడా అందలేదు. రాజకీయ కారణాలతో ఒక దార్శనికుడిని మరగున పడేద్దామన్న ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలించదనడానికి జస్టిస్ రమణ ప్రసంగమే ప్రత్యక్ష నిదర్శనం.  ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ క్యాంపస్ ఆవిర్బావానికి కర్త, కర్మ, క్రియ అన్నీ  అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం ఉండటానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే  ఆసియాలో ఇండియన్ బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేయాలన్న యోచనతో ప్రపంచంలోని 500 పరిశ్రమలు ఉమ్మడి భాగస్వామ్యంతో ముందుకు వచ్చారని తెలిసిన క్షణం నుంచీ దానిని ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావాలని చంద్రబాబు పడిన తపన, పడిన శ్రమ, చూపిన పట్టుదల, అందుకోసం కాలికి బలపం కట్టుకుని తిరిగిన తీరూ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ తరాల ఉన్నతిని కాంక్షించి చూపిన చొరవ చరిత్ర ఎన్నటికీ విస్మరించదు. అయితే కేవలం రాజకీయాలే పరమావధిగా భావిస్తున్న కొందరు రాజకీయ నాయకులు, మేధావులుగా గుర్తింపు పొంది పాలకుల కాళ్ల కింద బానిసల్లా బతుకుతున్న కొందరు విద్యావంతులూ మాత్రం ఆయన విస్మరించి ద్విశతాబ్ది వేడుకలు నిర్వహించారు. అలా చేయడం ఆకాశంపై ఉమ్మి వేయడం వంటి ప్రయత్నమేనని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగం మరోసారి తేటతెల్లం చేసింది.  అసలు ఐఎస్ బీ హైదరాబాద్ లో ఏర్పాటు కావడానికి చంద్రబాబు చేసిన కృషి చూపిన చొరవలను ఒక సారి గుర్తు చేసుకుంటే.. అప్పటికే ఐటీ హడ్ గా అమెరికా తరువాత అంతటి గుర్తింపు పొందిన బెంగళూరు (కర్నాటక)ను, భారత వాణిజ్య రాజధాని ముంబై అప్పటి బొంబై ( మహారాష్ట్ర)లను కాదని ఐఎస్ బీని హైదరాబాద్ ( అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని)కు తీసుకువచ్చిన చంద్రబాబు సమర్థత కళ్లకు కడుతుంది. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రగతి, పురోగతికే ప్రాధాన్యత ఇచ్చి, వర్తమానంతో పాటు భవిష్యత్ తరాల బాగును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు  తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలే.. ఆయనకు ఒక ప్రత్యేక నేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి.    ఆసియాలో ఒక బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రపంచంలోని 500 కంపెనీలు ఉమ్మడి భాగస్వామ్యంతో ముందుకు వచ్చిన తరుణంలో  నాడు అంటే 1988లో ఇండియన్ బిజినెస్ స్కూల్ ను తమ రాష్ట్రంలో ప్రారంభించాలంటే తమ రాష్ట్రంలో ప్రారంభించాలంటూ అప్పటికే ఐటీ హబ్ గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన కర్నాటక సహా పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. తొలుత బిజినెస్ స్కూల్ ఏర్పాటు కోసం పరిశీలించినది కూడా బెంగళూరునే.. ఏపీలో ఐఎస్ బీ అనే ఉద్దేశమే   బిజినెస్ స్కూల్ ఏర్పాటు కోసం అనువైన నగరం కోసం అన్వేషించేందుకు వచ్చిన ప్రతినిథి బృందానికి లేదు. అయితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనలో పారదర్శకతకు, మెరుగైన ప్రజాసేవకు ఐటీని వినియోగించుకుంటున్న తీరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సుపరిపానల అందిస్తున్నవిధానంపై  దేశంలోనే కాదు, ప్రపంచంలోని పారిశ్రామిక వేత్తలు సైతం  గుర్తించారు. అయినా కూడా అప్పటికి ఐఎస్ బీ ప్రమోటర్లు బిజినెస్ స్కూల్ ను బెంగళూరులో ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు. అప్పుడప్పుడే హైదరాబాద్ బెంగళూరుకు పోటీగా ఐటీ హబ్ గా ఎదుగుతున్న దశ.  దక్షిణాదిన ప్రతిష్టాత్మక ఇండియన్ బిజినెస్ స్కూల్ ఏర్పాటుకు ప్రమోటర్లు ముందుకు వస్తున్నారన్న సంగతి తెలిసిన వెంటనే చంద్రబాబు స్వయంగా వారిని సంప్రదించారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రమోటర్లతో సంప్రదింపులకు ఆయన వెనుకాడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన సీఎంగా కంటే ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానే ఎక్కువ కష్టపడ్డారు.  ఆ చొరవతోనే ఆయన ఇండియన్ బిజినెస్ స్కూల్ ప్రమోటర్లతో స్వయంగా మాట్లాడారు. హైదరాబాద్ ఆలోచనే లేదు..మా తొలి ప్రాధాన్యత బెంగళూరే అంటూ వారు కుండబద్దలు కొట్టినట్టు ముఖం మీదే చెప్పినా ఆయన నిరుత్సాహ పడలేదు.  ఆ బృందాన్ని హైదరాబాద్ కు ఆహ్వానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారిని ఆయన తేనేటి విందుకు ఆహ్వానించారు. బిజినెస్ స్కూల్ ప్రమోటర్లు అప్పటి వరకూ పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపారు. కానీ ఏపీ నుంచి సంప్రదింపుల ప్రతిపాదన ముఖ్యమంత్రి నుంచే రావడం వారికి ఒకింత ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అప్పటి వరకూ వారితో సంప్రదింపులకు వచ్చింది అధికారులే. అందుకు భిన్నంగా సీఎం స్వయంగా ఆహ్వానించడంతో వారు కాదనలేక కేవలం మొహమాటంతోనే హైదరాబాద్ వచ్చారు. అలా వచ్చినంత మాత్రాన    హైదరాబాద్ లో ఐఎస్ బీ ఏర్పాటు  గ్యారంటీ అని భావించవద్దని వారు ముందుగానే చంద్రబాబుకు చెప్పారు.  అందుకు సమ్మతించే చంద్రబాబు వారిని ఆహ్వానించారు.  అలా వచ్చిన వారిని  ప్రొటోకాల్ ను సైతం కాదని ఎదురేగి ఆహ్వానించారు.   స్వయంగా  బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేశారు. తన నివాసంలోనే ఐఎస్ బీ ఏర్పాటు చేస్తే తమ ప్రభుత్వం ఇచ్చే రాయతీలు, కల్పించే సౌకర్యాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రం ప్రగతి దారిలో దూసుకుపోతున్న తీరును కళ్లకు కట్టారు. ఐటీని స్మార్ట్ గవర్నెన్స్ కోసం వినియోగించుకుంటున్న తీరునూ సవివరంగా వారికి ఎరుకపరిచారు.  చంద్రబాబు వ్యవహార శైలి, అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపన, ఆయన దార్శనికత ఆ బృందాన్ని మెస్మరైజ్ చేశాయి. చంద్రబాబు నివాసంలో తేనీటి విందు తరువాత కొన్ని రోజులకే హైదరాబాద్ లోనే బిజినస్ స్కూల్ ఏర్పాటు కార్యరూపం దాల్చింది.  బెంగళూరును కాదని హైదరాబాద్ ను ఎంచుకోవడానికి కారణం ఐఎస్ బి బృందం మీడియా సమావేశంలో వివరిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రోచ్, విజన్, అద్భుతం అని ప్రశంసించారు.  అయితే అంతటితో  పని అయిపోలేదు. అభివృద్ధిని అడ్డుకునే శక్తులు, రాజకీయంగా చంద్రబాబును ఇబ్బందులు పెట్టాలన్న శక్తులు తమతమ ప్రయత్నాలను కొనసాగించాయి. ఐఎస్బికి హైదరాబాద్‌ గచ్చిబౌలిలో 260 ఎకరాల స్థలాన్ని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది.  స్టాంపు డ్యూటీ మినహాయింపుతో పాటు కొన్ని రాయితీలూ కల్పించింది. దీనిపై నాడు ఏపీలో విపక్షం అయిన   కాంగ్రెస్‌ పలు విమర్శలు చేసింది.  ఆరోపణలు గుప్పించింది.   కొందరు నాయకులైతే కేసులు పెట్టారు. కానీ న్యాయస్థానం  సదుద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఐఎస్ బికి రాయతీలు ఇవ్వడంలో  రాష్ట్ర ప్రభుత్వం  ఎటువంటి అధికార దుర్వినియోగానికీ పాల్పడలేదని విస్పష్టంగా తీర్పు చెప్పింది.  అదిగో ఆ విషయాన్నే తాజాగా  మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఐఎస్బీ లీడర్ షిప్ సమ్మిట్లో చెప్పారు.  సరే అదలా ఉంచితే రాష్ట్రంలో ఐఎస్బీకి   రాయతీలు ఇవ్వడాన్ని అప్పట్లో ఇక్కడ విపక్షంలో ఉన్న కాంగ్రెస్ విమర్శలు, ఆరోపణలూ గుప్పిస్తే కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు తమ రాష్ట్రానికి ఐఎస్ బీని సాధించలేకపోయినందుకు తమ రాష్ట్ర ముఖ్యమంత్రిపై విమర్శలు చేశారు. చంద్రబాబు ఐఎస్ బీని సాధించడం ద్వారా ఏపీకి గొప్ప మేలు చేకూరిందంటూ జాతీయ పత్రికలు అప్పట్లో సంపాదకీయాలు రాశాయి. ఆయన దార్శనికత దేశానికి అవసరమంటూ ప్రశంసలతో ముంచెత్తాయి. 1999లో  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఐఎస్‌బి హైదరాబాద్‌ క్యాంపస్‌కు పునాదిరాయి పడింది.  2001లో నాటి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా, సీఎం చంద్రబాబు సమక్షంలో ఐఎస్‌బి హైదరాబాద్‌ క్యాంపస్‌ ప్రారంభోత్సవ వేడుక   ఘనంగా జరిగింది.   

పిఎఫ్ ఐ పై నిషేధం అశాంతిని ప్రేరేపిస్తుంది...మాయావ‌తి

దేశంలో పిఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థ‌ల‌ను కేంద్రం నిషేధించ‌డం పై బ‌హుజ‌న‌స‌మాజ్‌పార్టీ (బీఎస్‌ పీ) జాతీయ అధ్య‌క్షురాలు మాయావ‌తి మండిప‌డ్డారు. పిఎఫ్ ఐ పై అనేక విధాలుగా ఆంక్ష‌లు విధిస్తూ వ‌చ్చిన కేంద్రం ఇపుడు ఏకంగా నిషేధించింద‌ని ఆమె ట్విట‌ర్‌లో పేర్కొన్నారు. మున్ముందు విధాన స‌భ ఎన్నిక‌ల దృష్ట్యానే కేంద్రం త‌న స్వార్ధ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను ఈవిధంగా ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని ఆమె ఎద్దేవా చేశారు.  పిఎఫ్ఐ ని నిషేధించ‌డంతో దేశంలో శాంతి కంటే అశాంతి రేకెత్త‌డానికే అవ‌కాశాలున్నాయ‌ని మాయా వ‌తి అభిప్రాయ‌ప‌డ్డారు. ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహ‌న్ భ‌గ‌త్ ఢిల్లీలో మ‌జీద్ మ‌ద‌ర‌సా ద‌ర్శించి అక్క‌డి ముస్లిం నాయ‌కుల‌తో చ‌ర్చించ‌డాన్ని కూడా ఇటీవ‌ల ఆమె కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. భ‌గ‌త్ చ‌ర్యతో  దేశంలో ముస్లింలు, మ‌ద‌ర‌సాల పై బీజేపీ అభిప్రాయాలు, వ్య‌వ‌హ‌రిస్తున్న తీరులో మార్పు వ‌స్తుందా అని ఆమె ప్ర‌శ్నించారు. ఇత‌రులు త‌మ విష‌యాల్లో చొర‌బ‌డుతున్నార‌న్న భావ‌న‌ను మాను కోవాల‌ని, బీజేపీ కూడా ఇత‌రుల కార్య‌క‌లాపాలు, మ‌త విష‌యాల్లోకి చొర‌బ‌డ‌టం ఎంత‌వ‌ర‌కూ స‌మం జ‌సం అని ప్ర‌శ్నించారు.  అనేక సంద‌ర్భాల్లో యోగి ప్ర‌భుత్వం ముస్లింల‌ను చుల‌క‌న‌గా చూడ‌డం వారి పై బుర‌ద జ‌ల్లే కార్య‌ క్ర‌మాలు చేప‌ట్ట‌డంప‌ట్ల బిఎస్‌పి నేత విరుచుక‌ప‌డ్డారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వం అనాలోచితంగానే వారి ఆస్తులు, నివాసాల పై బుల్‌డోజ‌ర్ల‌తో దాడి చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్య‌తిరేకించారు. రెండేళ్లుగా జైలు శిక్ష అనుభ‌విస్తున్న ఎస్ పి పార్టీ నాయ‌కుడు అజామ్ ఖాన్ కేవ‌లం కేంద్ర ప్ర‌బుత్వం పై ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డం వ‌ల్ల‌నే ఆయ‌న్ను జైలుపాలు చేశార‌ని ఆమె ఆగ్ర‌హించారు.

జగన్ లో భయం.. బాబులో ఆత్మవిశ్వాసం.. గడప గడపకూ వర్క్ షాప్ తేల్చిందిదే!

వచ్చే ఎన్నికల్లో యవతకు సీట్లు ఇవ్వనున్నట్లు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించేశారు. ఆ క్రమంలో అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు పార్టీలోని సీనియర్లు, సూపర్ సీనియర్లు.. ఇప్పటికే తన వారసులను ఎన్నికల బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.   ఏ ప్రాంతంలో..... ఏ నియోజకవర్గంలో యువతను బరిలో దింపితే..  పార్టీ గెలుపు తథ్యం అనే కోణంలో చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఆ క్రమంలో చంద్రబాబు పార్టీలో పలువురు సీనియర్ల నేతల వారసుల పేర్లతో ఓ జాబితా ఇప్పటికే సిద్దం చేశారని తెలుస్తోంది. మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్‌ ఇద్దరూ పోటీ చేయాలని చంద్రబాబు వారికి సూచించారు. అయితే గత ఎన్నికల్లో వారి కుమారులు జేసీ పవన్ కుమార్ రెడ్డి, జేసీ ఆస్మిత్ రెడ్డిలను బరిలోకి దింపిగా.. వారు ఓటమి పాలైయ్యారు. మళ్లీ అలాంటి పరిస్థితి  రాకుండా ఉండేందుకు చంద్రబాబు.. తనదైన శైలిలో పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 70 సీట్లు యువతకు కేటాయించినా.. మిగిలిన సీట్లు పార్టీ కోసం కష్టించిన వారికి కేటాయించినా.. పార్టీకి మేలు జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు 2024 ఎన్నికల్లో యువత ఓట్లు భారీగా పెరగనున్నాయని సమాచారం. ఇవి టీడీపీ గెలుపునకు దోహదపడతాయని అంటున్నారు. మరో వైపు కొన్ని జిల్లాల్లో ఇప్పటికే చంద్రబాబు అసెంబ్లీ అభ్యర్థులను నిర్ణయించేసిన సంగతి విదితమే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత  జగన్  గడప గడపకు కార్యక్రమంపై నిర్వహించిన  వర్క్ షాపులో   వచ్చే ఎన్నికలు చాలా టఫ్‌గా ఉంటాయని.. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల్లో మళ్లీ మీరే పోటీ చేయాల్సి ఉంటుందని సీనియర్లకు సీఎం జగన్ ముఖం మీదే చెప్పాశారు. అలాగే నాయకుల వారసులకు మాత్రం నో ఛాన్స్ అని స్పష్ఠం చేసేశారు. అయితే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి వారసులను మాత్రం పంపవద్దని... కావాలంటే మీతోపాటు వారిని  వెంట తీసుకు వెళ్లాలని అంతేకాని వారసులను రంగంలోకి దింపి.. మీరు మాత్రం సైలెంట్‌గా ఇంటి వద్ద ఉంటే.. పరిస్థితులు మరోలా మారే అవకాశం లేకపోలేదని వివిధ నియోజకవర్గ ఇన్‌చార్జులకు సీఎం జగన్ కర్తవ్య బోధ చేశారు. అయితే వైయస్ జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి సంక్షేమ పథకాల పేరిట.. లబ్దిదారుల ఖాతాల్లో నగదు వేయడమే కానీ.. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అభివద్ధి పని జరగలేదన్న సంగతి ప్రజలందరికీ తెలిసిందేనని  సరిగ్గా ఇదే విషయాన్ని ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ రైట్ హ్యాండ్ రిష్ రాజ్ సింగ్... సైతం స్వయంగా సీఎం జగన్‌కు అందించిన నివేదికలో ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. అంతేకాదు.. జగన్ తొలి కేబినెట్‌లోనే కాదు.. మలి కేబినెట్‌లో సైతం పలువురు మంత్రులు ప్రెస్‌మీట్ పెట్టి.. చేసిన వ్యాఖ్యలు సైతం   ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మారాయని వారు చెబుతున్నారు. అలాగే వైయస్ జగన్ ప్రతిపక్షంలో  ఉండగా.. రాజధాని అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇచ్చి... ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులంటూ ప్రకటించడం.. దీంతో అమరావతి ప్రాంత రైతులు.. ఆందోళనలు, దీక్షలతోపాటు మహాపాదయాత్రులు.. చేస్తున్నారని.. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్ పార్టీ పుట్టిముంచుతాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ లిక్కర్ పాలసీ షేమ్ టు షేమ్

దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం.. జగన్ వాగ్దానాలలో అతి ముఖ్యమైనది. అయితే వాగ్దానాలను నెరవేర్చి తీరాలన్న నియమమేమీ ఏపీ సీఎంకు లేదు. అందుకే అధికారానికి ముందో మాట.. తరువాత మరో మాట అన్నది ఈ మూడేళ్ల పాలనలో అందరికీ ప్రస్ఫేటంగా తెలిసేలాగే ఆయన వ్యవహార శైలి ఉంది. సంపూర్ణ మద్య నిషేధం విషయం కూడా అంతే.  ఈ విషయంపై ఆయన నోరు మెదపకపోయినా.. ఆయన చేష్టలు మాత్రం మద్యం ఆదాయంతో పబ్బం గడిపేసుకోవాలన్న చందంగానే ఉంది. పైగా ఆయన పార్టీ నేతలు, కేబినెట్ సహచరులూ కూడా అవకాశం దొరికిప్పుడల్లా మద్య నిషేధం మా మేనిఫెస్టోలో ఎక్కడుందో చెప్పండి అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. సరే అది పక్కన పెడితే వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ స్టైలే వేరు.. ఎవరేమనుకున్న ఆయన పెద్దగా పట్టించుకోరు. అందుకే సంపూర్ణ నిషేధం మాటే ఎత్తకుండా మద్యం పాలసీని మరో ఏడాది పాటు యథాతథంగా కొనసాగిస్తూ జగన్ ప్రభుత్వం శుక్రవారం సెప్టెంబర్ 30) ఉత్తర్వ్యులు జారీ చేసింది. అబ్కారీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ బార్గవ్  జారీ చేసిన ఉత్వర్వులలో ప్రస్తుతం రాష్ట్రంలో అమలు అవుతున్న మద్యం విధానమే మరో ఏడాది మాటు అంటే 2023 సెప్టెంబర్ 30దాకా కొనసాగుతుంది.   రాష్ట్రంలో తాము అధికారంలోకి వ‌స్తే ద‌శ‌ల వారీగా సంపూర్ణ మ‌ద్య నిషేధం అమ‌లు చేస్తామ‌ని 2019 ఎన్నిక‌ల‌కు ముందు   జ‌గ‌న్  హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందు కోసమే అంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం… మ‌ద్యం విక్ర‌యాల‌ను ప్రైవేట్ వ్యాపారుల చేతి నుంచి ప్ర‌భుత్వ అధీనంలోకి తీసుకుంది. గ‌త ఏడాది మ‌ద్యం పాల‌సీ ప్ర‌కారం రాష్ట్రంలో 2,934 మ‌ద్యం షాపులు కొనసాగుతున్నాయి. వీటి సంఖ్య‌ను ఏమాత్రం త‌గ్గించ‌కుండానే య‌ధాత‌థంగా కొన‌సాగించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అంటే మద్య నిషేధం అన్న మాటను కాదు కాదు హామీని అటకెక్కించేసిందన్న మాట.

వాస‌వీ అమ్మ‌వారికి నోట్ల అలంక‌ర‌ణ‌!

భ‌క్తికి అంతేలేకుండా పోతోంది. చాలాకాలం కేవ‌లం పూల‌తో దేవాల‌యాలు అలంక‌రించేవారు. గుడి ద్వారం లోప‌లి  గోడ‌లు అంతా చ‌క్క‌గా పూల‌దండ‌ల‌తో దివ్యంగా క‌నుల విందుగా చేసేవారు. ఇప్పుడు కూడా చాలా దేవాల‌యాల్లో చేస్తున్నారు. కానీ విశాఖ‌ప‌ట్నం వాస‌వీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి  దేవాల‌యంలో మాత్రం ఈసారి శ‌ర‌న్న‌వ‌రాత్రుల‌కు భ‌క్తులు, దాత‌లు ఇచ్చిన నోట్ల‌తో దేవాల‌యం లోప‌లంతా అలంక రించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌ను చేశారు.  విశాఖ‌ప‌ట్నంలో 135ఏళ్ల నాటి ఈ  దేవాల‌యంలో ఈ ప‌ర్యాయం న‌వ‌రాత్రులు ఎంతో కొత్త‌గా నిర్వహిం చాల‌ని ఆలోచించారు ఆల‌య‌క‌మిటివారు. అమ్మ‌వారి విగ్ర‌హం బంగారుపూత‌తో అలంక‌రించారు. గోడ‌లు, నేల అంతా నోట్లు అతికించ‌డ‌మే అంద‌రినీ  చ‌కితుల‌ను చేస్తోంది.ఈ మొత్తం చేప‌ట్ట‌డానికి సుమారు ఎని మిది కోట్ల అయింద‌ని ఆల‌య‌క‌మిటీ తెలిపింది.  అయితే న‌వ‌రాత్రుల త‌ర్వాత  ఆ సొమ్మంతా  ఏమి చేస్తా ర‌ని అడిగితే అలంక‌ర‌ణ‌కు దాత‌లు ఇచ్చారు. ఆ సొమ్మ ఆల‌య ట్ర‌స్ట్ తీసుకోద‌ని, దాత‌ల‌కే మ‌ళ్లీ తిరిగి ఇచ్చేస్తామ‌న్నారు. గుడి ఆవ‌ర‌ణ‌లో, ద్వారం వ‌ద్ద‌ తోర‌ణాలు కూడా నోట్ల‌నే అమ‌ర్చ‌డం గ‌మ‌నార్హం. గుడి ఆవ‌ర‌ణ‌లో చెట్ల‌మీంచి కూడా నోట్ల తీవెలే వేలాడుతూ ఎంతో ఆక‌ట్టు కుంటున్నాయి. 

కేదార్‌నాథ్  ద‌గ్గ‌రి పర్వతాల పై భారీ హిమపాతం

ఉత్తరాఖండ్లో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి, రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన సంఘట నలు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం వెనుక ఉన్న పర్వతాలపై శనివారం భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం లేదా ప్రాణనష్టం జరగలేదని ఆలయ కమిటీ తెలిపింది. శ‌నివారం ఉదయం హిమాలయ ప్రాంతంలో హిమపాతం సంభవించింది, అయితే కేదార్‌నాథ్ ఆలయా నికి ఎటువంటి నష్టం జరగలేదు" అని శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ తెలిపారు. కేదార్‌నాథ్ ఆలయం వెనుక ఉన్న భారీ హిమానీనదం గత పది రోజుల్లో పగుళ్లు రావడం ఇది రెండోసారి. సెప్టెంబరు 22న, కేదార్‌నాథ్ ఆలయానికి 5 కిలోమీటర్ల వెనుక ఉన్న చోరాబరి గ్లేసియర్ పరీవా హక ప్రాంతంలో హిమపాతం సంభవించింది. ఉత్తరాఖండ్‌లో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి, రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన సంఘట నలు నమోదయ్యాయి. గురువారం, రుద్రప్రయాగ్ వద్ద జాతీయ రహదారి  109 అకస్మాత్తుగా కొండ చరి యలు విరిగిపడటంతో బ్లాక్ చేయబడింది, ఫలితంగా రహదారిపై వాహనాలు చాలా క్యూలో ఉన్నాయి.

ముంబైలో కాల్పుల కలకలం.. ఒకరి మృతి

అమెరికాకే పరిమితం అనుకున్న కాల్పుల సంస్కృతి ఇప్పువు విశ్వవ్యాప్తం అయిపోతోంది. భారత దేశంలోనూ కాల్పుల సంస్కృతి పెచ్చరిల్లుతోంది.  చిన్న చిన్న విభేదాలే కాల్పులకు దారి తీస్తున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో రియల్టర్ పై ప్రత్యర్థులు కాల్పులు జరిపిన సంఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక విషయానికి వస్తే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో శుక్రవారం (సెప్టెంబర్ 30) అర్ధరాత్రి దాటిన తరువాత కాల్పుల కలకలం రేగింది.  ముంబైలోకి కండివాలి పోలీసు స్టేషన్ పరిధిలో  ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు తమ ప్రత్యర్థులపై కాల్పుల వర్షం కురిపించారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు కారణమేమిటన్నది వెంటనే తెలియరాలేదు. పాతకక్షలే ఇందుకు కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.  కాల్పులు జరిపిన అనంతరం దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.  

రోజాకు ‘జబర్దస్త్’ సెగే తగిలిందా?

రోజా పరిచయం అక్కర్లేని పేరు. సినీ  నటిగా, రాజకీయ నేతగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆమె ఎప్పుడూ సుపరిచితురాలే. వివాదాలు ఆమె వెంట ఉంటాయో, వివాదాలనే ఆమె ఆహ్వానిస్తారో తెలియదు కానీ  ఆమె పేరుతోనే పాటే వివాదాలూ గుర్తుకు వస్తాయి. సరే రోజా చిరకాల వాంఛ అయిన మంత్రి పదవి ఎట్టకేలకు దక్కింది. జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రోజాకు అవకాశం  కల్పించారు. అందు కోసం జగన్ సామాజికవర్గ సమీకరణాలను కూడా పక్కన పెట్టి చిత్తూరు జిల్లా నుంచి అప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నా కూడా మరో మంత్రిగా రోజారెడ్డికి అవకాశం ఇచ్చారు. ఒక జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కడమే అరుదైతే.. అలా మంత్రి పదవులు పొందిన వారిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం మరీ అరుదు. కానీ జగన్ రెడ్డి రో  ఆ సామాజిక వర్గ సమీకరణాలను సైతం పట్టించుకోకుండా రోజాను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంత వరకూ బానే ఉంది. కానీ మంత్రి పదవి దక్కిన ఆనందం పూర్తిగా అనుభవించకుండానే రోజాకు పదవీ గండం తప్పదన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఎందుకంటే గడప గడపకూ టెస్ట్ లో ఫెయిలయ్యారనీ, అధిష్ఠానం సూచనలు పట్టించుకోవడం లేదనీ, ప్రజాదరణ కోల్పోయారనీ ఇలా పలు కారణాలు చూపుతూ జగన్ వచ్చే నెలలో (నవంబర్) మరో సారి మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ఆ విషయాన్ని ఇటీవల జరిగిన వర్క్ షాపులో కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అంతే కాదు తన ప్రస్తుత కేబినెట్ లో కనీసం ఐదో వంతు మందికి ఉద్వాసన తప్పదన్న సూచనలు కూడా ఇచ్చారు. ఇదిగో అక్కడ నుంచీ రోజా మంత్రి పదవికి ఎసరు వచ్చేసిందన్న వార్తలు సమాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఉద్వాసనకు గురయ్యే మంత్రులలో మొదటి పేరు రోజాదే అన్న స్థాయిలో వార్తలు వినవస్తున్నాయి. అందుకు కారణాలను కూడా ఎవరికి తోచిన విధంగా వారు చెప్పేస్తున్నారు. ఆ కారణాలలో మొదటిది ఆమెకు జబర్ దస్త్ కార్యక్రమం మీద ఉన్న మమకారంగా చెబుతున్నారు. చాలా సంవత్సరాల పాటు జబర్దస్త్ జడ్జి పొజిషన్ లో విరగబడి, పగలబడి నవ్వినందుకే  ఆమెకు సినీ నటిగా, రాజకీయ నాయకురాలిగా ఉన్నందువల్ల వచ్చిన పాపులారిటీని మించి ఎన్నో రెట్లు గుర్తింపు వచ్చింది. అందులో సందేహం లేదు. ఎందుకంటే ఆ విషయాన్ని పలు సందర్భాలలో ఎన్నో మార్లు ఆమే స్వయంగా చెప్పారు. తనకు అంత పాపులారిటీ తీసుకువచ్చిన షోను మంత్రి పదవి రాగానే వదిలేశారు. అయితే అంతటి పాపులారిటీ తీసుకువచ్చిన షో నిర్వాహకులు దసరా ఈవెంట్ కు ఆహ్వానిస్తే ఎలా కాదనగలరు? అందుకే వెళ్లారు. ఇదిగో ఇప్పుడు ఆ షోకు హాజరైన కారణంగానే రోజా పదవికి ఎసరు వచ్చిందన్న వార్తలు సామాజిక మాధ్యమంలో షికార్లు చేస్తున్నాయి. ఎందుకంటే.. ఆ షో వచ్చేది జగన్ నిత్యం ఆగ్రహంతో చెప్పే దుష్టచతుష్టయంలోని ఒకరికి చెందిన చానెల్ లో.. చెప్పాపెట్టకుండా ఆ షోలో రోజా ప్రత్యక్షం కావడంపై జగన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయనీ, జగన్ కూడా ఆగ్రహంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ రోజాను ఫైర్ చేయాలని అనుకోవడానికి ఇది ఒక కారణం.. కాగా మంత్రిగా పదవీ స్వీకారం చేసిన క్షణం నుంచీ ఆమె పార్టీ హై కమాండ్ ఆదేశాలు, సూచనలను ఖాతరు చేయడం మానేశారని పార్టీ వర్గాలే అంటున్నాయి. మంత్రిగా ఇలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో అలా హైదరాబాద్ వెళ్లి ‘జగన్’మాత విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. అప్పట్లోనే ఈ విషయంపై పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. అప్పటికే జగన్ తల్లిని, చెల్లిని దూరం పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత కూడా రోజా తన చిత్తం వచ్చిన తీరులోనే వ్యవహరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి వచ్చారు. సరిగ్గా ఆమె కేసీఆర్ ను కలిసిన సమయంలోనే మంత్రి కేటీఆర్ క్రెడాయ్ సదస్సులో ఏపీలో జగన్ హయాంలో కరెంటు కష్టాలు, రోడ్ల దుస్థితిపై హేళన చేస్తూ మాట్లాడారు. ఇక మంత్రిగా రోజా పనితీరుపై కూడా జగన్ లో అసంతృప్తి ఉందని అంటున్నారు. మంత్రిగా గత ఐదు నెలల కాలంలో తన నియోజకవర్గం విషయంలో కానీ, తన శాఖ విషయంలో కానీ ఏ మాత్రం పట్టింపు లేని ధోరణిలో వ్యవహరిస్తున్నారని  జగన్ చేయించిన సర్వేలలో తేలిందని అంటున్నారు. అందుకే తాజాగా గడప గడపకు కార్యక్రమంపై  నిర్వహించిన వర్క్ షాపులో జగన్ మంత్రి రోజా పేరు ప్రస్తావిస్తూ వార్నింగ్ ఇచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రోజా మంత్రి అయిన తరువాత ఆ స్థాయిలో విపక్షాన్ని విమర్శిస్తూ విరుచుకుపడటంలేదని కూడా జగన్ భావిస్తున్నారంటున్నారు. ఇక సొంత నియోజకవర్గంలో కూడా ఆమె పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతున్నదని వివిధ సర్వేలలో తేలిందని కూడా అంటున్నారు. ఎమ్మెల్యేగానే కాదు, మంత్రిగా కూడా ఆమె తన స్వంత నియోజకవర్గం నగరిపై పెద్దగా దృష్టి పెట్టలేదని చెబుతున్నారు. ఈ కారణాలన్నిటినీ ప్రస్తావిస్తూ వైసీపీ వర్గాలే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఉద్వాసనకు గురయ్యే మంత్రుల జాబితాలో తొలి పేరు రోజాదే అని అంటున్నారు. 

అభిమాని డేటింగ్‌కి రూ.500 ఇచ్చిన క్రికెట‌ర్ అమిత్‌

ప్ర‌భాస్ వీరాభిమాని సెల్ఫీ అడిగాడు, రిటైర్ అయ్యే ఉద్యోగి తోటివాళ్ల‌తో టీపార్టీ చేసుకున్నాడు, ఒక కుర్రాడు త‌న ల‌వ‌ర్ కోసం వేరే స్నేహితుడి ద‌గ్గ‌ర అప్పు తీసుకున్నాడు. ఇవి విన‌డానికి స‌ర‌దాగా ఉంటాయి, కానీ వాటిలో చిన్న ఆనందం కూడా ఉంది. చాలా కాలం గుర్తుండే  జ్ఞాప‌క‌మే అవుతుంది ప్ర‌తీదీ!  ఓ కొంటె కుర్రాడు త‌న ల‌వ‌ర్‌తో ఓ పూట స‌ర‌దాగా గ‌డ‌పాల‌ని అనుకున్నాడు. కానీ అందుకు ప‌ర్సు ఫుల్‌గా లేదు. ఆమెను స‌ర‌దాగా అలా షికారుకి తీసికెళ్ల‌డం, హోట‌ల్‌లో తిన‌డం, వీల‌యితే సినిమాకి తీసికెళ్ల‌డానికి దేనికి అత‌ని ద‌గ్గ‌ర త‌గినంత డ‌బ్బు లేదు. క‌నీసం మంచి హోట‌ల్లో కొద్దిసేపు క‌బుర్లు చెప్పుకోవ‌డానికి కాఫీ తాగ‌డానికీ లేవు. అత‌ను క్రికెట్ వీరాభిమాని. క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి స్కూల్లో ఉన్న‌పుడు ఫ్రెండ్స్‌తో క‌లిసి చాలా స‌ర‌దాగా గ‌డిపాడు. అత‌నికి భార‌త్ మాజీ టెస్ట్‌ప్లేయ‌ర్‌, స్పిన్న‌ర్ అమిత్ మిశ్రా అంటే వీరాభిమానం. అంతే వెంట‌నే.. అన్నా! జ‌ర ఓ మూడొంద‌లు గూగుల్ పే చేస్తావా? అని అడిగాడు. అంతే కాదు వీల‌యినంత త్వ‌ర‌లో వాస‌స్ ఇస్తాన‌న్నాడు. స‌రే బాగే ఉంది, ఇంత‌కీ మూడొంద‌ల‌తో ఏం చేస్తావ‌ని స్పిన్న‌ర్ అమిత్ అడిగాడు. ఆ కుర్రాడు త‌న ల‌వ‌ర్‌ని అలా షికారుకి తీసికెళ్లాలి అని స‌మాధానం చెప్పాడు.. ఆ కుర్రాడు చాలా సిన్సియ‌ర్‌గా! అంతే అమిత్ ఆ స‌మాధానం న‌చ్చి ఒకే  అని డ‌బ్బులు పంపాడు. అత‌ని అభ్య‌ర్ధ‌న‌లో సిన్సియారిటీ గుర్తించాన‌న్నాడు అమిత్‌. ఇదంతా ట్విట‌ర్‌లో జ‌రిగిన సంభాష‌ణ‌. కానీ లెగ్ స్పిన్న‌ర్ వెంట‌నే సానుకూల స్పంద‌న ఇస్తాడ‌ని ఆ వీరాభిమాని అనుకోలేదు. పైగా మ‌రో ట్విస్ట్ ఏమిటంటే, రూ.300 లు మాత్రమే కాదు, అమిత్ మ‌రో రూ.200 కూడా అద‌నంగా ఇచ్చాడు.. మ‌రింత ఆనందంగా గ‌డ‌ప‌మ‌ని! ఆ కుర్రాడి ఆనందానికి అంతే లేదు. అమిత్ పంపిన డ‌బ్బు క్ష‌ణాల్లో అందాయి. ఆ స్క్రీన్ షాట్ ను అమిత్‌కి పంపాడు ఆ కుర్రాడు. ఇదో ఊహించ‌ని అభిమానం. భార‌త్ మాజీ ప్లేయ‌ర్ అమిత్‌కి మ‌రింత ఆనంద‌దాయ‌క సంఘ‌ట‌నే!  అందేరూ మీ డేటింగ్‌కి ఆల్ ది బెస్ట్  అంటూ మెసేజ్ పెట్టాడు!

చేప‌ల‌కు వ‌ల‌వేస్తే....పురాత‌న క్యూబ్స్ బ‌య‌ట‌పడ్డాయి!

మత్స్యకారుడు త‌న స్నేహితుల‌తో క‌లిసి రోజూ వెళ్లిన‌ట్టే స‌ముద్రం మీద‌కు వెళ్లి వ‌ల విసిరాడు. లాగితే వ‌ల అంత సుల‌భంగా క‌ద‌ల్లేదు. తీరా ఇద్ద‌రు ముగ్గురు క‌లిసి లాగారు. వారంతా పెద్ద చేప దొరికింది మంచి తిండి దొరికింది అనుకున్నారు. కానీ ఎన లేని నిధి బ‌య‌ట‌ప‌డింది.  సెంట్రల్ ఇంగ్లండ్‌లోని కోవెంట్రీలో సోవ్ నది నుండి తీయబడిన 60 విస్తృతంగా చెక్కబడిన వెండి మెటల్ క్యూబ్‌లను లాగడం ద్వారా స్థానికులు ఆశ్చర్యపోయారు. స్థానికులు వాటిని ప్రత్యేక హిందూ ప్రార్థనలో ఉపయోగించే అదృష్టాన్ని చెప్పే రాళ్లుగా గుర్తిం చారు. మిగిలిన వివరాల విషయానికొస్తే-వారు అక్కడికి ఎలా చేరుకున్నారు, ఆచారం తర్వాత ఎవరూ వాటిని ఎందుకు తిరిగి పొందలేదు. అయితే వాటి కాలం .. అంటే అవి ఎప్ప‌టివ‌న్న‌ది తెలియ‌లేదు.  విల్ రీడ్ క్యూబ్ ల‌ను కనుగొన్నప్పుడు తన చిన్న పిల్లలతో కలిసి మాగ్నెట్ ఫిషింగ్ చేస్తున్నాడు. నిపుణులు కొన్నిసార్లు అయ స్కాంత చేపలను ఉపయోగించవద్దని ప్రజలను హెచ్చరిస్తారు, ఇది కేవలం శబ్దం వలె ఉంటుంది, ఎందుకంటే అయస్కాం తాలు నీటి  దిగువ నుండి ఖర్చు చేయని మందుగుండు సామగ్రి లేదా గ్రెనేడ్ల వంటి వస్తువులను లాగ గలవు. ఈ సంద ర్భంలో, రీడ్ అత‌ని పిల్లలు లోతులేని నీటిలో సీసం బ్లాక్‌లను కనుగొన్నారు, అయస్కాంతాలు అవసరం లేదు. (సీసం ఏమై నప్పటికీ నిజంగా అయస్కాంతం కాదు.) తెలిసిన అత్యంత పురాతన సీసం కళాఖండాలు 6,000 సంవత్సరాల నాటివి, నదిలో కనిపించే కొన్ని యాదృచ్ఛిక సీసం వస్తు వులను డేటింగ్ చేయడానికి నిపుణుడు అవసరం. వారు హిందువులు అనే వాస్తవం తేడాను కలిగిస్తుంది, కానీ భారత దేశం నుండి ఇంగ్లండ్‌కు వెళ్లే వ్యక్తులు ఎలిజబెత్ కాలం నుండి 500 సంవత్సరాల క్రితం ఉన్నారు. పిహెచ్‌, ఉష్ణోగ్రత, పైపుల పాతవి వంటి అనేక అంశాల ఆధారంగా త్రాగునీటిలోకి సీసం లీచ్ అయితే, చల్లని, మంచినీటిలో ఉన్న‌ కొన్ని సీసం వస్తువులు చాలా  కాలంపాటు ఉంటాయి. కాబట్టి ఈ రహస్యమైన ఘనాల ఏమిటి? రెడ్డిట్‌లోని ఒక సమగ్ర సమాధానం అవి ఒక విధమైన ప్రార్థన టోకెన్‌లుగా కనిపిస్తా యని వివరిస్తుంది. హిందూజ్యోతిషశాస్త్రంలో, గ్రీకో-రోమన్ , ఇతరులలో వలె, సాంప్రదాయ గ్రహాలకు ప్రతి ప్రాతినిధ్యం ఉంటుం ది. శాస్త్రీయ అంశాలు గ్రహాలతో కూడా ముడిపడి ఉన్నాయి, రసవాదం, అదృష్ట చరిత్రలలో ముడిపడి ఉన్నాయి. రోమన్ జ్యోతి ష శాస్త్రంలో, సీసం అనేది శనితో ముడిపడి ఉన్న మూలకం-గ్రహం, దేవుడు. హిందూ జ్యోతిషశాస్త్రంలో, చంద్రుని కక్ష్యలో ఒక వైపు సీసం ముడిపడి ఉంటుంది, దీనిని రాహు అని పిలుస్తారు. క్యూబ్‌ల గురించి వ్యక్తులు గుర్తించిన విషయం ఏమిటంటే, అవి మ్యాజిక్ స్క్వేర్‌లతో చెక్కబడి ఉన్నాయి. ఇవి సుడోకు గ్రిడ్‌ లను పోలి ఉండే, మించిన లక్షణాలతో కూడిన పూర్ణాంకాల గ్రిడ్‌లు ప్రతి అడ్డు వరుస, నిలువు వరుస,  హిందూ ఆరాధనలో, వీటిని యంత్రంగా లేదా పవిత్ర గ్రిడ్‌లుగా లేదా జ్యామెట్రీగా ఉపయోగించ వచ్చు. రాహువు యంత్రం ఈ ఘనాలపై కని పిస్తుం ది, అవి రాహువుకు ప్రార్థనలు లేదా అర్పణలుగా లేదా మరొక ఆచారంలో భాగంగా ఉపయోగించేందుకు రూపొందించ బడ్డా యి. (హిందూదేవత దుర్గా, మాతృ దేవత, ఆమె వాహనాన్ని, సింహాన్ని స్వారీ చేయడం షోలలో మరొక అంశాన్ని చెప్పడానికి ఒక పాఠకుడు వ్రాసాడు, కనుక ఇది ఆమెకు ప్రార్థన కావచ్చు.) ఎటువంటి సందర్భోచిత సమాచారం లేకుండా, శాస్త్రవేత్తలు ఈ ఘనాల వయస్సు ఎంత అని ఎలా చెప్పగలరు? చాలా కాలం గా, నిపుణులు కూడా సీసం కళాఖండాల వయస్సును ఖచ్చితంగా అంచనా వేయలేరు. సీసం మానవ చరిత్రలో చాలా కాలం నాటిది కాబట్టి ఇది నిరాశకు మూలం. వోల్టామెట్రీ అని పిలువబడే ఒక ప్రక్రియ ఇప్పుడు సీసానికి సంబంధించిన ప్రక్రి యల కోసం ఉప యోగించబడుతుంది, నీటిలో స్థాయిలను గుర్తించడం,150 సంవత్సరాలలోపు కళాఖండాలను గుర్తించడం.