కేశినేని చిన్ని ఆధ్వర్యంలో హోమం, యాగం
విజయవాడ గురునానక్ కాలనీ అన్న క్యాంటీన్ ప్రాంగణంలో తెలుగుదేశం నాయకుడు కేశినేని చిన్ని ఆధ్వర్యంలో శ్రీ చక్ర ఆరాధన, సుదర్శన శతక హోమం, నారసింహ హోమం, ఆయుత చండీ యాగాలు నిర్వహించగా అందులో ఆఖరి ఘట్టం ఈరోజు పూర్ణాహుతి హోమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశంనాయకులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమా, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, నందిగామ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శావల దేవదత్, గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్ (అన్న), జంపాల సీతారామయ్య, నవనీతం సాంబశివరావు, చెన్నుపాటి గాంధీ, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, అంగన్వాడి యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్, కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, జాస్తి సాంబశివరావు, దేవినేని అపర్ణ, ఉమ్మడి చంటి నాయకులు బొప్పన బావ కుమార్, మహమ్మద్ ఫతావుల్లా, షేక్ ఆషా, సొంగ సంజయ్ వర్మ, రేపాకుల శ్రీనివాస్, దివి ఉమామహేశ్వరరావు, చలసాని రమణ మరియు తదితరులు పాల్గొన్నారు