ఏపీలో కూటమి సునామీ ఖాయం.. తేల్చేసిన వైబ్రెంట్ సర్వే

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం,  జనసేన, బీజేపీ కూటమి సునామీ సృష్టించడం ఖాయమని ఇప్పటికే పలు  సర్వేలు స్పష్టం చేశాయి. ఇప్పటికే జాతీయ స్థాయిలో పేరుపొందిన పలు  సంస్థల  సర్వేల్లో ఏపీలో కూటమి విజయం ఖాయమని తేలింది.   వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలు, కక్షపూరిత రాజకీయాలు వైసీపీ ఓటమిలో కీలక భూమిక పోషించబోతున్నాయని సర్వే సంస్థలు పేర్కొన్నాయి. దీంతో వైసీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో తాజాగా మరో ప్రముఖ సంస్థ  వైబ్రెంట్ ఇండియా సర్వేలో కూటమి అలాంటిలాంటి విజయం కాదు.. భారీ విజయం ఖాయమని పేర్కొంది. స్పష్టంగా చెప్పాలంటే ఏపీలో తెలుగుదేశం కూటమి సునామీ సృష్టించబోతున్నదని వైబ్రెంట్ ఇండియా పేర్కొంది.  వైబ్రెంట్ ఇండియా గతంలో 14 సార్లు ఎన్నికల సమయంలో ఆయా రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహించింది. ఈ సంస్థ ఇచ్చిన సర్వే ఫలితాలు 12 సార్లు నిజమయ్యాయి. దీంతో వైబ్రెంట్ ఇండియా సర్వే ఫలితాలంటే చాలా రాజకీయ పార్టీలు  ఆవే తుది ఫలితాలుగా  భావిస్తుంటాయి. వైబ్రెంట్ ఇండియా సర్వే  వెలుగులోకి రాగానే వైసీపీ నేతల్లో ఆందోళన మరింత పెరిగిందని  రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సొంత నియోజకవర్గాలను వదిలి వైసీపీ అధిష్టానం సూచన మేరకు కొత్త నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు వెళ్లిన వైసీపీ అభ్యర్థులు తమ ఓటమి ఖాయమన్న భావనకు వచ్చినట్లు చెబుతున్నారు, అనవసరంగా నియోజకవర్గం మారామని తమకు దగ్గర వ్యక్తుల వద్ద చెప్పుకొని బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. వైబ్రెంట్ ఇండియా ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23వ తేదీ వరకు సర్వే నిర్వహించింది. ఈ సర్వే కోసం 50,236 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఫోన్ కాల్స్ ద్వారా  మరో 50వేల మంది అభిప్రాయాలు సేకరించింది. వైబ్రెంట్ ఇండియా సర్వే ఫలితాల ప్రకారం.. టీడీపీ, జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు 79 నియోజకవర్గాల్లో కచ్చితంగా విజయం సాధిస్తారు. మరో 20 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఎడ్జ్ లో ఉన్నారు.  అంటే దాదాపు 99 సీట్లలో కూటమి అభ్యర్థులు విజయం పక్కా అని వైబ్రెంట్ సర్వే తేల్చేసింది. అధికార వైసీపీకి ఓటమి ఖాయమని, ఆ పార్టీ 29 సీట్లకే పరిమితమవుతుందని, ప్రజల్లో పోలింగ్ సమయం నాటికి ఏమైనా సానుభూతి, ఇతర అంశాలను ప్రభావితం చేస్తే మరో 18 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉందని వైబ్రెంట్ సర్వే పేర్కొంది.  మరో 29 నియోజకవర్గాల్లో కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని,   వైబ్రెంట్ ఇండియా సర్వే  పేర్కొంది. పూర్తి ఫలితాలను పరిశీలిస్తే తెలుగుదేశం కూటమి 115 - 120 స్థానాలు,  వైసీపీ 55 - 60 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. పార్టీల వారిగా ఓటింగ్ శాశం పరిశీలిస్తే.. తెలుగుదేశం కూటమికి 42.26శాతం, వైసీపీకి 38.11శాతం ఓటింగ్ నమోదవుతుంది. 13.47శాతం ఓటింగ్ మాత్రం కూటమి, వైసీపీ అభ్యర్థుల్లో ఎవరికైనా పడే అవకాశం ఉందని, ఇతరులకు 6.16శాతం ఓటింగ్ నమోదవుతుందని వైబ్రెంట్ ఇండియా సర్వే పేర్కొంది.  వైబ్రెంట్ ఇండియా గతంలో నిర్వహించిన కొన్ని సర్వే ఫలితాలను పరిశీలిస్తే..  తెలంగాణలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైబ్రెంట్ ఇండియా సర్వే నిర్వహించింది. సర్వే ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీకి 72-78 స్థానాలు వస్తాయని తేలింది. ఎన్నికల ఫలితాల్లో 88 సీట్లలో  టీఆర్ఎస్ విజయం సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చింది.  2023  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 67 - 75 స్థానాలు వస్తాయని వైబ్రెంట్ ఇండియా సర్వే పేర్కొంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలు వచ్చాయి. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  కర్ణాటకలో 2023  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 118-130  స్థానాలు వస్తాయని వైబ్రెంట్ ఇండియా సర్వే పేర్కొంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ వైబ్రెంట్ ఇండియా సర్వే నిర్వహించింది. సర్వే ఫలితాల్లో డీఎంకే 167 - 178 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. ఆ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే 159 నియోజకవర్గాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  2019లో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైబ్రెంట్ ఇండియా  సర్వేలో వైసీపీకి 129 -139 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఫలితాల్లో వైసీపీకి 151 స్థానాలు వచ్చాయి. వైబ్రెంట్ ఇండియా  తాజా సర్వే ప్రకారం.. రాయలసీమలోని చిత్తూరు, కడప, ఉమ్మడి విజయనగరం  జిల్లాల్లో వైసీపీకి మెజార్టీ స్థానాలు వస్తాయని, శ్రీకాకుళం, విశాఖపట్టణం, తుర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూల్    జిల్లాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధిస్తారని పేర్కొంది.  వైబ్రెంట్ ఇండియా సర్వే ఫలితాలు గతంలో 90శాతం నిజం కావటం, ఆ సర్వే ఈసారి వైసీపీ ఓటమి ఖాయమని స్పష్టం చేయడంతో వైసీపీ అభ్యర్థులను ఓటమి భయం వెంటాడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

కేసీఆర్‌, జ‌గ‌న్ కుట్ర‌ల‌కు చెక్ పెట్టిన చంద్రబాబు విజన్!

చంద్ర‌బాబు నాయుడు పేరు చెబితే తెలుగు ప్ర‌జ‌లు గ‌ర్వంతో ఉప్పొంగిపోతారు.. ఆయ‌న ముందు చూపుతో యువ‌త భ‌విష్య‌త్తుకు బ‌ల‌మైన పునాది పడింది. రాబోయే ప‌దేళ్ల‌లో ప్ర‌పంచం ఏ రంగంవైపు ప‌రుగులు తీస్తుందో ముందుగానే ప‌సిగ‌ట్ట‌గ‌లినే విజనరీ పొలిటీషియన్ చంద్ర‌బాబు అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ లో  ఆయ‌న  ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో సైబ‌ర్ ట‌వ‌ర్స్ నిర్మించి, ప్ర‌పంచంలోనే అగ్ర‌గామిగా పేరున్న కంపెనీల‌ను హైద‌రాబాద్ న‌డిబొడ్డుకు తీసుకొచ్చారు. దీంతో హైద‌రాబాద్ ను ప్ర‌పంచ ప‌టంలో నిల‌వడంతో పాటు తెలుగు యువ‌త భ‌విష్య‌త్తుకు భరోసా ఏర్పడింది. ఇదంతా చంద్ర‌బాబు ముందు చూపు, కృషితో నే జరిగింది. తెలుగు యువ‌త నేడు ఐటీ రంగంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న‌త స్థానాల్లో స్థిర‌ప‌డ్డారంటే అందుకు చంద్రబాబు విజన్ కారణమనడంలో సందేహం లేదు. చంద్ర‌బాబు చేసిన కృషి కార‌ణంగా ఆ త‌రువాత కాలంలో ముఖ్య‌మంత్రులు ఎవ‌రు మారినా, రాష్ట్రం విడిపోయినా హైద‌రాబాద్ అభివృద్ధి ఆగ‌లేదు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విడిపోయిన త‌రువాత కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్ర‌బాబు ఎన‌లేని కృషి చేశారు. అలాగే చంద్ర‌బాబు తన ముందుచూపుతో  పొరుగురాష్ట్రం తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్, ఏపీలోని అప్ప‌టి ప్ర‌తిప‌క్ష‌  వైసీపీ అధినేత జగన్ కుట్ర‌ల‌ను తిప్పికొట్టారు. ఫ‌లితంగా నేడు ఏపీలోని డెల్టా ప్రాంతానికి, నాలుగైదు జిల్లాల‌కు తాగు,సాగునీటికి ఎటువంటి ఇంబ్బందీ లేకుండా పోయింది.  అదంతా చంద్రబాబు విజన్ చలవే. రాష్ట్రం విడిపోయిన త‌రువాత ఏపీకి తొలి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ చంద్ర‌బాబు నాయుడు త‌న ముందుచూపుతో ఏపీకి అనేక ప్ర‌యోజ‌నాలు క‌లిగేలా చేశారు. 1956లో కృష్ణా న‌దిపై ఆధార‌ప‌డిన సాగు ఆయ‌క‌ట్టు ఎంతో తేల్చి, దానికి అనుగుణంగా మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల మ‌ధ్య నీటి పంపిణీకి, వివాదాల ప‌రిష్కారానికి నాటి దేశ ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ కృష్ణా వాట‌ర్ డిస్బ్యూట్స్ ట్రిబ్యున‌ల్ ఏర్పాటు చేశారు. నాటి సుప్రీంకోర్టు జ‌స్టిస్ ర‌ణ‌ధీర్ సింగ్ బ‌చావ‌త్ ను ట్రిబ్యున‌ల్ చైర్మ‌న్ గా నియ‌మించారు. దాని ప్ర‌కారం ఏపీలో 7,278 చ‌ద‌ర‌పు కిలో మీట‌ర్ల స్థిర ఆయ‌క‌ట్టును నిర్ధారించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎగువ‌న ఉన్న తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర ఎన్నికథలు పడ్డా ఏపీ ఆయ‌క‌ట్టుకు నాటి చ‌ట్టం ప్ర‌కారం కృష్ణా జ‌లాల‌ను ఇవ్వాల్సిందే. 58ఏళ్ల త‌రువాత ఏపీ విడిపోవ‌టంతో.. తెలంగాణ ప్ర‌భుత్వం, ఆంధ్రాలోని అప్ప‌టి ప్ర‌తిప‌క్ష పార్టీ కుట్ర‌ల వ‌ల్ల ఆంధ్ర డెల్టా ఆయ‌క‌ట్టుకు పొంచిఉన్న పెను ప్ర‌మాదాన్ని చంద్ర‌బాబు నాయుడు ముందుగానే ప‌సిగ‌ట్టారు. ముందుగా పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తికావాలంటే ప్రాజెక్టు ప‌రిధిలోని ముంపు మండ‌లాల‌ను ఆంధ్రా భూభాగంలో క‌లిపితేనే సీఎంగా బాధ్య‌త‌ల‌ను చేప‌డ‌తాన‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి చంద్ర‌బాబు తెగేసి చెప్పారు. ఫ‌లితంగా పోల‌వ‌రం నిర్మాణానికి ఎలాంటి అడ్డంకి లేకుండా చూశారు. ఆ త‌రువాత చంద్ర‌బాబు పోల‌వ‌రాన్ని ప‌రుగులు పెట్టించారు. ప్ర‌తి సోమ‌వారాన్ని పోల‌వారంగా మార్చేశారు. కానీ,  జ‌గ‌న్ హ‌యాంలో పోల‌వ‌రం నిర్మాణం ఎలా మ‌రుగున ప‌డిపోయిందో ఏపీ ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.   పోల‌వ‌రం ప్రాజెక్టు ఆల‌స్య‌మైతే.. కృష్ణా న‌ది నీళ్లు నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ ద్వారా, లేదా సాగ‌ర్ డ్యామ్ గేట్లు ఎత్త‌డం ద్వారా మాత్ర‌మే విజ‌య‌వాడ ప్ర‌కాశం బ్యారేజ్ కు చేరుకుంటాయి. విజ‌య‌వాడ నుంచి కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి, గుంటూరు, ప్ర‌కాశంలో కొంత భూభాగానికి తాగు, సాగునీరు అందుతుంది. అయితే, చంద్ర‌బాబు నాయుడు ఊహించిన‌ట్లే జ‌రిగింది. హ‌క్కుగా మ‌న‌కు రావాల్సిన నీళ్లు ఒక్క చుక్క కింద‌కు రాకుండా అప్ప‌టి తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్ర చేశారు. దీన్ని ముందుగానే ప‌సిగ‌ట్టిన చంద్రాబు నాయుడు.. పోల‌వ‌రం పూర్త‌య్యే నాటికి స‌మ‌యం ప‌డుతుంద‌ని భావించి.. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం చేప‌ట్టారు. గోదావరి నదిని, కృష్ణా నదిని కలుపుతూ నదులను అనుసంధానించే ప్రాజెక్టే ప‌ట్టిసీమ‌.  దీనిని చంద్ర‌బాబు ఏడాదిలో పూర్తి చేశారు. పోలవరం కుడి కాలువను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తవ్వారు. గోదావరి నది నుండి ప‌ట్టిసీమ‌ద్వారా  కాలువలోకి పంప్ చేయబడిన నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతుంది. సీఎంగా చంద్రబాబు తీసుకున్న సాహసోపేత నిర్ణ‌యం వ‌ల్ల జూన్ నుండి ఆగస్టు మధ్య కాలంలో నీటి కొరతను ఎదుర్కొంటున్న డెల్టాలో 1.3 మిలియన్ ఎకరాలు సాగుచేసే వేలాది మంది రైతులకు సహాయపడింది. తాగునీటికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింది. చంద్ర‌బాబు ముందుచూపు ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టిసీమ నీటి ద్వారా జ‌రిగిన సంప‌ద సృష్టి రూ. 25వేల కోట్ల‌పైమాటే.  చంద్ర‌బాబు కృషితో ఏడాదిలో రూ. 1,660 కోట్ల ఖ‌ర్చుతో ప‌ట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేశారు. అయితే, ఇందులో అవినీతి జ‌రిగింద‌ని అప్ప‌టి ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ తీవ్ర‌స్థాయి ఆరోప‌ణ‌లు చేసింది. ప‌ట్టిసీమ వ‌ద్దంటూ సుప్రీం కోర్టుకు వెళ్లిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి నేటి వ‌ర‌కు ప‌ట్టిసీమ మోట‌ర్ బ‌ట‌న్ నొక్క‌క‌పోతే కృష్ణా ఆయ‌క‌ట్టు లేదు.. నాలుగు జిల్లాల‌కు తాగునీరు లేదు. చంద్ర‌బాబు ఏ ప‌ని చేసినా ముందు చూపుతో చేస్తారు.. ప్ర‌జ‌ల బాగుకోసం చేస్తార‌ని ప‌ట్టిసీమ ద్వారా మ‌రోసారి నిరూపిత‌మైంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప‌ట్టిసీమ అవ‌స‌రం లేదు, అదో దండ‌గ ప్రాజెక్టు అంటూ రంకెలేసిన జ‌గ‌న్ అండ్ కో..  అధికారంలోకి వ‌చ్చిన తవాత  డెల్డా ప్రాంతానికి నీళ్లివ్వాలంటే వారికి ప‌ట్టిసీమే దిక్కైంది. ఇలా భవిష్యత్ అవసరాలను, ప్రత్యర్థుల కుట్రలను ముందుగానే పసిగట్టి  అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బందులు ఎదురు కాకుండా చూడటంలో  చంద్రబాబు ఎప్పుడూ నంబర్ వన్ గా ఉంటారు. అందుకే ప్రజలు తాము ఇబ్బందుల్లో ఉన్న ప్రతి సారీ చంద్రబాబు వైపే చూస్తారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. 

నరసాపురం బరిలో ఆర్ఆర్ఆర్? .. ఫ్రెండ్లీ కంటెస్ట్ కే బీజేపీ అభ్యర్థి పరిమితం?

ఎన్నికలు అనగానే అసమ్మతులు, అసంతృప్తులు సహజం. అదీ రెండు మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని కూటమిగా బరిలోకి దిగుతున్నప్పుడు సహజంగానే అసమ్మతి గళాల సంఖ్య ఒకింత ఎక్కువ ఉంటుంది. అయతే  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల సర్దుబాటు ఒకింత సజావుగానే సాగిపోయింది. పొత్తులో భాగంగా బలాన్ని మించి స్థానాలు కోరిన బీజేపీని సంతృప్తి పరుస్తూనే.. బీజేపీ ఎవరిని అభ్యర్థులుగా నిలపకూడదో తెలుగుదేశం, జనసేనలు ముందుగానే ఆ పార్టీకి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై అవగాహన ఉన్న బీజేపీ మిత్రపక్షాల డిమాండ్ ను మన్నించింది. ఆ మేరకు ఆ పార్టీ జీవీఎల్, సోము వీర్రాజు, మాధవ్ వంటి వారిని పోటీ నుంచి దూరంగా పెట్టింది. దీంతో పెద్దగా అలకలూ, అసంతృులూ, అసమ్మతులూ లేకుండానే పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు జరిగిపోయింది. సీట్ల సర్దుబాటు తరువాత సహజంగానే పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన వారిలో అసంతృప్తి ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం ఆ అసమ్మతి, అసంతృప్తి పార్టీల విజయావకాశాలను దెబ్బతీసేంత తీవ్రంగా లేకపోవడం పొత్తుకు జనం మద్దతు ఉండటమే కారణమన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది. అయితే ఒకటి రెండు స్థానాలలో మాత్రం బీజేపీ అభ్యర్థుల ఎంపిక పట్ల తెలుగుదేశం, జనసేనలలో తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం అవుతోంది. దానికి బీజేపీ శ్రేణుల మద్దతు కూడా లభిస్తోంది. వాటిల్లో ముఖ్యంగా నరసాపురం లోక్ సభ నియోజకవర్గం. ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణం రాజు పోటీలో ఉంటారని అంతా భావించారు. అయితే సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ కోటాలోకి వెళ్లిన ఈ స్థానం నుంచి ఆ పార్టీ రఘురామకృష్ణం రాజును కాకుండా ప్రజలలో అంతగా గుర్తింపులేని బలహీన అభ్యర్థిని బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించింది.  దీంతో కూటమి పార్టీల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.  మొత్తంగా ఏపీలో తెలుగుదేశం పోటీ చేసే నియోజకవర్గాలలో అభ్యర్థుల ప్రకటన పూర్తైపోయింది.  బీజేపీ  బీజేపీ  తమ పార్టీ  తరఫున ఎన్నికల బరిలో నిలిచే అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించేయగా, జనసేన మాత్రం రెండు అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. అక్కడక్కడా అలకలు తప్ప మొత్తంగా కూటమి మధ్య సీట్ల సర్దుబాటు బైఆండ్ లార్జ్ సజావుగానే సాగిపోయింది. అయితే నరసాపురం లోక్ సభ నియోజకవర్గం మాత్రం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా నరసాపురం సీటు విషయంలో  బీజేపీ ప్రకటించిన అభ్యర్థిపై అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. ఇక్కడ రఘురామకృష్ణం రాజును కాదని ప్రజలకు పెద్దగా పరిచయం లేని భూపతి రాజు శ్రీనివాసవర్మ ను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టడంపట్ల సామాన్య జనంలో కూడా అసంతృప్తి వ్యక్తం  అవుతున్నది. సర్వత్రా రఘురామకృష్ణం రాజు పట్ల సానుభూతి వ్యక్తం అవుతున్నది. ఇక నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూటమి అభ్యర్థులు కూడా రఘురామకృష్ణం రాజును లోక్ సభ అభ్యర్థిగా ఎంపిక చేయకపోవడం సరి కాదన్న అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించిన ప్రభావం నరసాపురం లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నిటిపైనా  పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నరసాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులు రహస్యంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు రఘురామకృష్ణం రాజునే కూటమి అభ్యర్థిగా నరసాపురం ఎంపీ స్థానంలో నిలబెట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విజ్ణప్తి చేయాలని తీర్మానించారు. ఇలా వారి రహస్య భేటీకి ముందు బీజేపీ అభ్యర్థి  భూపతి రాజు శ్రీనివాసవర్మ నిర్వహించిన ఒక ర్యాలీలో తెలుగుదేశం, జనసేన శ్రేణులు పాల్గొనలేదు. ఆ ర్యాలీలో కొద్ది మంది బీజేపీ కార్యకర్తలు మాత్రమే పాల్గొనడం స్థానికంగా గుర్తింపు ఉన్న కమలం నేతలు కూడా దూరంగానే ఉండటం గమనార్హం. ఆ ర్యాలీలో ఎక్కడా తెలుగుదేశం, జనసేన జెండాలు కనిపించకలేదు. దీంతో నరసాపురం ఎంపీ అభ్యర్థిని మార్చకుంటే కూటమి ఐక్యత ప్రశ్నార్ధకంగా మారుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే  ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల రహస్య భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీరి భేటీకి ముందే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కూడా నరసాపురం ఎంపీ అభ్యర్థిగా   అభ్యర్థిగా భూపతి రాజు శ్రీనివాసవర్మ ను నిలబెట్లాలన్న నిర్ణయంపై పునరాలోచించాల్సిందిగా బీజేపీ అధిష్ఠానాన్ని కోరినట్లు తెలుస్తున్నది.  మొత్తం మీద కూటమిలోని ప్రధాన పక్షాలైన తెలుగుదేశం, జనసేనలు నరసాపురం విషయంలో బీజేపీ తన నిర్ణయాన్నిమార్చుకోవాలని బలంగా కోరుతున్నాయి. విస్తృత రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ కంటే బలంగా ఉన్న తాము కొన్ని త్యాగాలు చేశామనీ, మిత్ర ధర్మం ప్రకారం తాము ఒకింత తగ్గి బీజేపీ కోరిన మేరకు ఆ పార్టీకి టికెట్లు కేటాయించామనీ అయితే ఒక్క రఘురామకృష్ణం రాజు విషయంలో బీజేపీ ఎందుకు ఇంత పట్టుదలతో ఉందో అర్ధం కావడం లేదనీ తెలుగుదేశం, జనసేనలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే  నరసాపురం నియోజకవర్గం విషయంలో కూటమి శ్రేణుల ఐక్యత దెబ్బతినకుండా ఓట్ల బదలాయింపు సజావుగా సాగేందుకు మధ్యే మార్గంగా ఒక ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తున్నది.  ఇప్పటికే బీజేపీ అభ్యర్థిని ప్రకటించేసినందున.. రఘురామకృష్ణం రాజు చేత స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయించి కూటమి ఆయనకు మద్దతుగా నిలవాలన్నదే ఆ ప్రతిపాదన. బీజేపీ అధికారిక అభ్యర్థి నామమాత్రంగానే రంగంలో ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనది ఫ్రెండ్లీ కంటెస్ట్ గా ఉంటుందన్నమాట. అలా జరిగితే మిత్రపక్షాల ఒత్తిడికి తలొగ్గి అభ్యర్థిని మార్చిందన్న విమర్శ నుంచి బీజేపీ బయటపడుతుంది. అలాగే కూటమి పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సజావుగా సాగేందుకు ఎటువంటి ఆటంకం ఉండదు. ఈ ప్రతిపాదనపైనే కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీరియస్ గా చర్చ జరుగిందని, ఈ ప్రతిపాదనకు బీజేపీ హైకమాండ్ కూడా ఓకే చెప్పిందని తెలియవస్తోంది. మొత్తం మీద నరసాపురం లోక్ సభ నియోజకవర్గంలో రఘురామకృష్ణం రాజు పోటీ చేస్తారనీ, ఆయనకు కూటమి మద్దతు గట్టిగా ఉంటుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.   

ఎపిలో 9 గ్యారెంటీలను అనౌన్స్ చేసిన షర్మిల 

తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల వాగ్దానంలో పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది  గ్యారెంటీలను అమలుచేస్తామని వాగ్దానం చేస్తుంది. ఇవాళ విజయవాడలో కాంగ్రెస్ నేతల సమావేశానికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హాజరయ్యారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ  పేరిట కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా 9 గ్యారెంటీలను ప్రకటించారు.  కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీలు 1. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే హోదా అమలు 2. మహిళా వరలక్ష్మి పథకం పేరిట ప్రతి పేద మహిళకు నెలకు రూ.8,500 3. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ 4. రైతులకు పెట్టుబడిపై 50 శాతం లాభంతో కొత్త మద్దతు ధర 5. ఉపాధి హామీ కూలీల కనీస వేతనం రూ.400 అందజేత 6. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య  7. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ 8. ఇల్లు లేని ప్రతి పేద మహిళకు రూ.5 లక్షల పక్కా ఇల్లు 9. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.4 వేల పింఛను... ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అందరికీ పింఛను

డబ్బులు పంచినా రాని జనం.. జగన్ బస్సుయాత్ర తుస్సు!

ముఖ్యమంత్రి సభలకు కూడా జనం మొహం చాటేస్తున్నారు. దీంతో వైసీపీ ఎన్నికల ప్రచారం ఆరంభంలోనే హంసపాదు అన్నట్లుగా తయారైంది. జగన్ ఆర్భాటంగా ఆరంభించిన బస్సు యాత్ర తుస్సు మంటోదన్న భావన వైసీపీ క్యాడర్ లోనే వ్యక్తం అవుతోంది. బస్సు యాత్ర కు జన స్పందన అమోంగా ఉందన్న బిల్డప్ ఇవ్వడానికి వైసీపీ సోషల్ మీడియా వింగ్ చేసిన ప్రయత్నాలు నవ్వుల పాలయ్యాయి. మరో వైపు ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి ప్రసంగం వినడానికి కూడా జనం ఇష్టపడటం లేదనడానికి  నిలువెత్తు నిదర్శనంగా  నెల్లూరు జిల్లా సీతారామపురంలో  జరిగిన సంఘటన నిలుస్తోంది. ఉదయగిరి లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం (మార్చి 28) సీతారాంపురంలో పర్యటించారు. తన ప్రచార రథంపై పర్యటించిన ఆయన జనాలను ఉద్దేశించి ప్రసంగం ప్రారంభించారో  లేదో జనం లేచి వెళ్లిపోవడం మొదలెట్టారు. దీంతో నేతలు మైకుల్లోనే నాయకుడి ప్రసంగం వినండి, సభ అయిపోయిన తరువాత భోజనాలు కూడా ఉన్నాయి. దయచేసి వెళ్లిపోకండి అని వేడుకోవలసి వచ్చింది. ఇందుకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయిపోయింది.  దీనిపై అధినేత సభలే జనం లేక వెలవెలబోతుంటే ఇంక ఆ పార్టీ నేతల సభల సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవడమెందుకు అంటూ పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. ఇక విషయానికి వస్తే... తొలి రెండు రోజులూ బస్సు యాత్ర తుస్సు మనడంతో వైసీపీ అలర్ట్ అయ్యింది. సీఎం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగన్ బస్సు యాత్రను విజయవంతం చేయడానికి వారు డబ్బు పంపిణీపై ఆధారపడ్డారు. ఎమ్మిగనూరు సభకు వచ్చిన మహిళలకు వైసీపీ నాయకులు డబ్బులు పంచుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి.  సీఎం సభ కోసం వచ్చిన మహిళలను వైసీపీ నాయకులు ఓ చోటుకి చేర్చారు. డబ్బులు ఉంచిన కవర్‌లను మహిళలకు పంచారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు బెదరించ బెల్లించో, సొమ్ములు పంచో, మందు సరఫరా చేసో జనాలను తరలించిన వైసీపీ నేతలకు కోడ్ అమలులోకి వచ్చిన తరువాత అది అంత  ఈజీ టాస్క్ గా కనిపించడం లేదు. కోడ్ అమలుకు ముందు సభకు రాకపోతే పథకాలు ఇవ్వరనో, అక్రమ కేసులు బనాయిస్తారనో, దాడులకు పాల్పడతారనో భయంతో ఇష్టం లేకపోయినా బలవంతపు బ్రాహ్మణార్ధం అన్నట్లు జనం సభలకు వచ్చే వారు. ఎప్పుడైతే కోడ్ అమలులోకి వచ్చిందో జగన్ సభ అంటే చాలా జనమే కాదు, వైసీపీ క్యాడర్ కూడా లైట్ తీసుకుంటోంది.  దీంతో  సీఎం ఎమ్మిగనూరు సభకు ఎలాగైనా సరే జనాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో   బహిరంగంగానే  డబ్బులు పంచుతూ వైసీపీ నేతలు వీడియోకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఈ దృశ్యాలు  వైరల్ గా మారాయి. ఇక ఆ పంపిణీ కూడా సరిగ్గా జరగలేదంటూ పలువురు మహిళలు ఆందోళనకు దిగడంతో వైసీపీ పరువు గంగలో కలిసింది. వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి.. కొందరికి మాత్రమే వెయ్యి ఇచ్చి మిగిలిన వారికి తక్కువ డబ్బులు ఇచ్చారంటూ మహిళలు ఆందోళనకు దిగారు. దీంతో వైసీపీ నేతలు ఎలాగోలా వారికి సర్ది చెప్పి సముదాయించారు.   బస్సులు పెట్టినా, డబ్బులు పంచినామద్యం పారించినా జగన్ సభలకు జనం అంతంత మాత్రంగానే వస్తున్నారు. ఆ వచ్చిన జనం కూడా జగన్ ప్రసంగం వినడానికి ఇష్టపడటం లేదు. డబ్బులు పుచ్చుకున్నాం కనుక వచ్చాం, హాజరు వేయించుకున్నాం ఇక చాలు అన్నట్లు మధ్యలోనే లేచి వెళ్లిపోతున్నారు.   మరో వైపు పరదాలు లేకుండా జగన్ చేస్తున్న రోడ్ షోలో ఆయన ప్రజా నిరసనను ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నారు. సీఎం ముఖ్యమంత్రి జగన్​కు కర్నూలు జిల్లాలో నిరసన సెగ తగిలింది. కోడుమూరు మండలం రామచంద్రాపురం వాసులు బిందెలతో నిరసన తెలిపారు. ఎమ్మిగనూరు బహిరంగ సభకు వెళుతుండగా మార్గమధ్యంలో  ప్రజలు ఖాళీ బిందెలతో నిరసనకు దిగా ఆయన బస్సును అడ్డుకున్నారు.  అలాగే వామపక్షాలు కూడా బస్సు యాత్ర సందర్భంగా నిరసనకు దిగి తాగునీటి సమస్య పరిష్కారం కోసం డిమాండ్ చేశాయి. కాగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.    కాగా ఒక వైపు జగన్ సభకు జనం రావడం లేదు. అదే సమయంలో నిరసనలకు కూడా దిగుతుంటే మరో వైపు విపక్ష నేత చంద్రబాబు సభలకు జనం స్వచ్ఛందంగా లక్షల సంఖ్యలో తరలిరావడం చూస్తుంటే.. మే 13న జరిగే ఎన్నికలలో జనం   ఓటు ఎవరికో ఇప్పటికే నిర్ణయించేసుకున్నారని తేటతెల్లమౌతోంది. జగన్ ఓటమికి ఆయన బస్సుయాత్ర తుస్సుమనడమే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరో వైపు చంద్రబాబు సభలకు తండోపతండాలుగా జనం వెల్లువెత్తడం చూస్తుంటూ వచ్చే ఎన్నికలలో విజయం ఎవరిని వరించబోతోందన్నది అర్ధమైపోతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కడియం  శ్రీహరిపై అనర్హత వేటు? 

తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్న కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయించే దిశగా బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన కూతురు కడియం కావ్యకు టిక్కెట్ కూడా ఇప్పించుకున్నారు. కానీ కొన్ని రోజులకే వారు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చేందుకు అసెంబ్లీకి వచ్చారు. బిఆర్ఎస్  పార్టీ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్ శనివారం అసెంబ్లీకి వచ్చారు. అయితే స్పీకర్ అందుబాటులో లేరని సిబ్బంది చెప్పడంతో అసెంబ్లీ కార్యదర్శికి పిటిషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆయన కూడా లేరని చెప్పడంతో ఎమ్మెల్యేలు అక్కడి నుంచి వెనుదిరిగారు. కడియం శ్రీహరి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని వారు కోరనున్నారు. స్పీకర్ అపాయింటుమెంట్ తీసుకొని అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇవ్వాలని నిర్ణయించారు. కడియం శ్రీహరి చాలా కాలం పాటు టీడీపీలో ఉండి ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి వంటి సీనియర్ పదవుల్లో పనిచేశారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరి 2014లో వరంగల్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఏడాదిన్నర తర్వాత ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి శాసనమండలికి ఎన్నికయ్యేలా చేసి ఉప ముఖ్యమంత్రిని చేశారు అప్పటి టిఆర్ఎస్ అధినేత కేసీఆర్. శ్రీహరి నిష్క్రమణ, అతని కుమార్తె కావ్య పోటీ నుండి వైదొలగడం నిజంగా బిఆర్ఎస్ కు షాక్‌ అనే చెప్పాలి.

కేటీఆర్ పై మరో కేసు

లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. అసలే అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి తేరుకోలేక సతమతమౌతున్న పార్టీకి  ఒకదాని వెంట ఒకటిగా కష్టాలు చుట్టుముట్టేస్తున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు,  సీనియర్లే పార్టీ నుంచి జంప్ కొట్టేయడం. లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకకపోవడం, అభ్యర్థిగా ప్రకటించిన తరువాత పోటీ నుంచి వైదొగడంతో పార్టీ ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి. ఈ తరుణంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై వరుసగా కేసులు నమోదు కావడం బీఆర్ఎస్ ను మరిన్ని కష్టాల్లోకి నెట్టివేసినట్లైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ హన్మకొండయ పీఎస్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తాజాగా శనివారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పీఎస్‌లో మరో కేసు నమోదు అయింది. బత్తిన శ్రీనివాస్ రావు అనే కాంగ్రెస్ నేత ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేటీఆర్ పై ఐ పీసీ 504,505(2) కింద కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పలువురు కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద సుమారు రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపించారంటూ  కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఈ కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలు బీఆర్ఎస్   నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

షర్మిల ఎక్కడ? కాంగ్రెస్ లో అయోమయం.. అనుమానం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికే నామమాత్రంగా మిగిలిపోయింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచినా ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఆ పార్టీ పట్ల ఆగ్రహం చల్లారిన దాఖలాలు కనిపించడం లేదు. రాష్ట్ర విభజన అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్.. తెలంగాణలో బలంగా పుంజుకుంది. అధికారపగ్గాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని తన పోరాటం ద్వారా సాధించానని చెప్పుకుంటూ తెలంగాణ పితగా తనకు తానే కితాబులిచ్చేసుకున్న కేసీఆర్ పార్టీని ఆ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేసేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు పట్టం కట్టారు. అయితే ఇది జరగడానికి పదేళ్లు పట్టింది. అయితే ఏపీలో మాత్రం అడ్డగోలు విభజన ఆగ్రహం ప్రజలలో ఇంకా చల్లారినట్లు కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే దక్షిణాదిలో కర్నాటక, తెలంగాణలలో అధకారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏపీపై దృష్టి సారించింది. ఏపీలో పుంజుకోవాలంటే వైఎస్ బ్రాండ్ ను జగన్ నుంచి తమ పార్టీకి బదలాయించుకోవడమొక్కటే మార్గమని భావించింది. అందుకే వైఎస్ కుమార్తె వైఎస్ షర్మిలకు పార్టీ  ఏపీ పగ్గాలు అప్పగించింది. షర్మిల అన్న జగన్ తో విభేదించి తెలంగాణలో తన తండ్రి పేరు మీద వైఎస్సార్టీపీ పార్టీని ఏర్పాటు చేసుకుని తన స్థాయిలో తాను రాజకీయం చేసుకున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్యంగా ఆమె కాంగ్రెస్ కు మద్దతుగా ఎన్నికలలో తన పార్టీని పోటీ నుంచి పక్కన పెట్టేశారు.  ఆ తరువాత ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ పార్టీ ఏపీ పగ్గాలు అందుకున్నారు. ఇలా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న షర్మిల అలా తన అన్నపై విమర్శల బాణాలు సంధించారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ మైలేజీ పెరిగిందని పరిశీలకులు సైతం విశ్లేషించారు. సూటిగా జగన్ పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తూ, తన తండ్రి వైఎస్ ఆశయాల సాధన కోసమే తాను కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ ఏపీ పగ్గాలు పట్టుకున్నానని కూడా గట్టిగా చెప్పారు. అంతేనా సొంత బాబాయ్ వివేకా హత్య కేసు ఛేదనలోలో కూడా జగన్ దర్యాప్తు సంస్థలకు అడుగడుగునా అడ్డుపడింది కూడా జగనేనని ఆమె విస్పష్టంగా ప్రకటించేశారు. వివేకా 5వ వర్ధంతి సభలో వివేకా కుమార్తె సునీతతో కలిసి వేదిక పంచుకుని, ఆ వేదిక సాక్షిగా తన అన్నకు ఓటు వేయవద్దని ప్రజలకు పిలుపు కూడా ఇచ్చారు. తాను కడప లోక్ సభ, లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తాననీ ప్రకటించారు. ఇందు కోసం ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కడప నేతలతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అంతే ఆ తరువాత నుంచీ ఆమె అనూహ్యంగా మౌనముద్ర వహించారు. అంతే కాదు బహిరంగంగా ఎక్కడా సభలు సమావేశాలలో కనిపించడం లేదు. ఒక పక్క ఎన్నికల షెడ్యూల్ విడుదలై అన్ని పార్టీలూ ప్రచారంలో పరుగులు పెడుతుంటే.. ఏపీ కాంగ్రెస్ లో  మాత్రం ఎన్నికల హడావుడి ఏమీ కనిపించడం లేదు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కనిపించడం లేదు. వినిపించడం లేదు. దీంతో రాజకీయవర్గాలలోనే కాకుండా కాంగ్రెస్ శ్రేణులలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. షర్మిల కాడె వదిలేశారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  సరిగ్గా ఈ సమయంలోనే ఇంత కాలం కుమారుడు జగన్ కు  దూరంగా కుమార్తె షర్మిలతో ఉన్న వైఎస్ సతీమణి విజయమ్మ ఇడుపుల పాయలో జగన్ పక్కన ప్రత్యక్షమయ్యారు. జగన్ తన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ఇడుపులపాయ నుంచి బస్సుయాత్ర ద్వారా ప్రారంభించారు.  ఆ సందర్భంగా ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన సమావేశంలో విజయమ్మ పాల్గొన్నారు. కొడుకును బైబిల్ సాక్షిగా దీవించారు. దీంతో షర్మిల కూడా తన స్టాండ్ మార్చుకున్నారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా పార్టీలో ఉత్సాహం కలిగించేలా వరుస సభలూ సమావేశాలతో దూసుకుపోవాల్సిన తరుణంలో షర్మిల సైలెంట్ కావడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక వంటి కార్యక్రమాలకు ఇంకా శ్రీకారం చుట్టకపోవడంతో తెరవెనుక ఏదైనా జరిగిందా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.  తల్లి విజయలక్ష్మిని తనకు అనుకూలంగా చేసుకున్న జగన్  చెల్లి షర్మిలను తన వైపు తిప్పుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటన్నిటినీ నివృత్తి చేయాల్సిన షర్మిల ఇకనైనా మౌనం వీడాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు? 

జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధం 

త్వరలో జరిగే లోక్‌సభ, నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల సంఘం ఎగ్జిట్‌ పోల్స్‌పై ఆంక్షలు విధించింది. కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలు 2024లో ప్రారంభ దశ ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి ఏడవ దశ పోలింగ్ జరగాల్సిన జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి వీల్లేదని సూచించింది. లోక్‌సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ, ఉపఎన్నికలకు ఓటింగ్ పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచురించడం నిషిద్ధమని హెచ్చరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం పోలింగ్ సమయంలో ఒపీనియన్ పోల్, పోల్ సర్వే ఫలితాలను ప్రచురించడం నిషిద్ధమని హెచ్చరించింది.  కాగా లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా వేర్వేరు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.  

వలస నేతలపై విసుర్లు.. నవ్వుల పాలౌతున్న కేసీఆర్

బీఆర్ఎస్ రాజకీయం అలాగే ఉంటుంది. అధికారంలో ఉన్నంత కాలం తాము చేసిందే రైట్ అన్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు విపక్షంలో ఉండి తాము నాడు చేసిన పనులలో తప్పిదాలను అంగీకరిస్తూనే వాటి వల్ల కొంపలేం మునిగిపోయాయని మమ్మల్ని ఓడించారంటూ ప్రజలను దబాయించడానికి ప్రయత్ని స్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ కుమారుడు  కల్వకుంట్ల తారకరామారావు మాటలు, చేతలూ సొంత పార్టీ నేతలూ కేడర్ నే విస్మయానికి గురి చేస్తున్నాయి. ఓటమిని దిగమింగుకోలేక అసలే సతమతమౌతుంటే.. పార్టీ నుంచి జోరందుకున్న వలసలు ఆయనను మరింత అసహనానికి గురి చేస్తున్నట్లున్నాయి. అధికారంలో ఉండగా కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఒక హోదా, ఒక అధికారం, కాబోయే సీఎంను అన్న ధీమా ఇచ్చిన పదవి. ఇప్పుడు విపక్షంలో ఉండగా అదే  పదవి కేటీఆర్ కు ముళ్ల కిరీటంగా మారింది. పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ వ్యవహారాలపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో లోక్ సభ ఎన్నికలకు పార్టిని సమాయత్త పరచాల్సిన బాధ్యత కేటీఆర్ పైనే పడింది. ఆయన కూడా ఆ సమన్వయ కార్యక్రమాలను ఏదో మమ అన్నట్లుగానే నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది.  తప్పని సరి అన్నట్లుగానే కేటీఆర్  పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది. అలా నిర్వహిస్తున్న సమావేశాల్లో సమీక్షకు అవకాశమే లేదన్నట్లుగా కేటీఆర్ తీరు ఉంది. ప్రతి సమావేశంలో ఆయన మాట్లాడుతున్న తీరు పార్టీ శ్రేణులలో కూడా అసహనానికి కారణమౌతోంది.  రెండు పిల్లర్లు కుంగితే  బ్రహ్మాండం బద్దలైపోతుందా? ఒకరిద్దరి ఫోన్ ట్యాపింగ్ జరగితే జరిగుండొచ్చు..? దానికి ఇంత యాగీ చేయాలా? అంటూ ఆయన చేస్తున్న ప్రసంగాలు ప్రజలలో పార్టీ ప్రతిష్టను, పలుకుబడిని మరింత దిగజారుస్తున్నాయని పార్టీ క్యాడరే అంటోంది.   ఇక పార్టీని వీడి వెడుతున్న వారిపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, పెడుతున్న శాపనార్ధాలూ పార్టీని ఇన్ టాక్ట్ గా ఉంచడంతో తన ఫెయిల్యూర్ ను ఎత్తి చేపుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీని కష్టకాలంలో వీడి వెడుతున్న వారికి పార్టీ తలుపులు ఎప్పటికీ మూసుకుపోయినట్లేనని ఆయన అనడంపై పార్టీ శ్రేణులే నవ్వుకుంటున్నాయి. అధికారంలో ఉండగా పార్టీలోకి పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకున్న పాపమే ఇప్పుడు పార్టీకి శాపంగా మారిందని అంటున్నారు. అప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను వదిలి వచ్చిన వారంతా  ఆయా పార్టీలు కష్టకాలంలో ఉండగా వదిలేసి వచ్చిన వారే కదా.. ఇప్పుడు పార్టీని వదిలి వెడుతున్న వారిలో అత్యధికులు అటువంటి వారే కదా అని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  ప్రత్యర్థి పార్టీలను నామరూపాల్లేకుండా చేయాలన్న ఉద్దేశంతో నాడు చేసిన సర్పయాగమే ఇప్పుడు బీఆర్ఎస్ ను ఖాళీ చేసేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కు అండగా నిలిచిన ఉద్యమ కారులందరినీ పక్కన పెట్టేసి ఇక బీఆర్ఎస్ ఎంత మాత్రం ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించి మరీ  పక్క పార్టీల నుంచి  వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక  అలా వచ్చిన వారంతా వలసబాట పడుతుంటే వారిని తప్పపట్టడం వింతగా ఉందని అంటున్నారు. అయినా అధికారం శాశ్వతం అన్న భ్రమల్లో ఊరేగిన వారికి ఆ అధికారం కోల్పోయిన తర్వాత అసహనం సహజమేనని సెటైర్లు వేస్తున్నారు.   

ఐపీఎల్ -17..బెంగళూరుకు మరో ఓటమి.. కోల్ కతా చేతిలో చిత్తు

ఐపీఎల్ సీజన్ - 17లో భాగంగా  బెంగళూరు వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన  మ్యాచ్ లో కోల్ కత నైట్  రైడర్స్ విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో  ఆరు వికెట్లు కోల్పోయి 182  పరుగులు చేసింది. 183 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ 16.5 ఓవర్లకు కోల్ కతా లక్ష్యాన్ని ఛేదించింది.   తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నైట్ రైడర్స్ కు శుభారంభం దక్కలేదు. మాంఛి ఫాంలో ఉన్న డుప్లెసిస్ హర్షిత్ రాణా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే మిచెల్ స్టార్క్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే కింగ్ కోహ్లీ మాత్రం పట్టుదలగా బ్యాటింగ్ చేశారు. ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా పరుగుల వరద పారించాడు.  డుప్లెసిస్ ఔటవ్వడంతో క్రీజ్ లోకి వచ్చిన గ్రీన్ తో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన కోహ్లీ దూకుడు పెంచాడు. వీరిద్దరూ కోల్ కతా బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి బెంగళూరు వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది.  ఇన్నింగ్స్ సజావుగా సాగుతోందనుకుంటున్న తరుణంలో  రస్సెల్ బౌలింగ్ లో గ్రీస్ ఔటయ్యాడు. గ్రీస్ 21 బంతుల్లో నాలుగు ఫోర్లు 2 సిక్సర్లతో 33 పరుగులు చేశారు. గ్రీస్ ఔట్ అవ్వడంతో మ్యాక్స్ వెల్ క్రీజ్ లోకి వచ్చాడు. అయితే మ్యాక్స్ వెల్ ఆరంభం నుంచీ కూడా తడబడుతూనే ఆడాడు. తనదైన శైలిలో స్ట్రోక్ ప్లే చేయడంలో విఫలమయ్యాడు. రెండు లైఫ్ లు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరో వైపు కోహ్లీ సాధికారికంగా ఆడుతూ 36  బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.  మాక్స్ వెల్ మాత్రం 19 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్ తో 28 పరుగులు చేసి నరైన్ బౌలింగ్ లో రింకూ సింగ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తరువాత బెంగళూరు వరుసగా పటేదార్, అనూజ్ రావత్ లు వెంటవెంటనే ఔటయ్యారు.  కోహ్లీ అద్భుత బ్యాటింగ్ కారణంగా  బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. కోహ్లీ 59 బంతుల్లో   4 ఫోర్లు, 4 సిక్సర్లతో  83 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.    183 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా మొదటి ఓవర్ నుంచే పరుగుల వేట మొదలెట్టేసింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే ఏకంగా 15 పరుగులు సాధించింది.  యశ్ దయాల్ వేసిన రెండో ఓవర్ లో 14 పరుగులు రాబట్టింది. మొత్తం మీద కొల్ కతా దూకుడుకు మయాంక్ బ్రేక్ వేశాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో దూకుడు మీద ఉన్న నరేన్ ను క్లీన్ బౌల్డ్ చేశారు. నరేన్ 22 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు.  ఆ తరువాత 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన ఫిలిప్ సాల్ట్ గ్రీన్ పట్టిన అద్భుత క్యాచ్ కు వెనుదిరిగాడు. అయితే ఆ తరువాత వచ్చిన వెంకటేశ్ అయ్యరే చెలరేగి ఆడటంతో కోల్ కతా  పరుగుల వరద పారించగలిగింది. ఈ క్రమంలో 29 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అయ్యర్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  అయితే  శ్రేయస్ అయ్యర్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి బెంగళూరును చిత్తు చేసింది.  

రేపు కెసీఆర్ మూడు జిల్లాల పర్యటన 

గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్  నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారు. బిఆర్ఎస్ నుంచి ఎక్కువమంది ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం బిఆర్ ఎస్ ను కలవరపెడుతోంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం (మార్చి 31) పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. నీరు లేక ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం, బాధిత రైతులతో సమావేశమవుతారు. జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.  సాగునీరు అందక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నూరిపోసేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం  ఆయన నేరుగా రైతుల వద్దకు వెళ్లి, మీకు మేము అండగా ఉంటామన్న భరోసా కల్పించనున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, సభలు, సమావేశాలతో బిజీగా ఉంటే, కేసీఆర్‌ మాత్రం రైతులకు మనోధైర్యం కల్పించేందుకు  ప్రాధాన్యం ఇస్తున్నారు. తమకు ఎన్నికల కన్నా రైతుల కన్నీళ్లు తుడవటమే అత్యంత ముఖ్యమని బీఆర్‌ఎస్‌ కార్యాచరణ నిరూపిస్తున్నదని ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. పదేళ్ల బిఆర్ఎస్  హాయంలో చిక్కిశల్యమైపోయిన వ్యవసాయాన్ని  కఠోర శ్రమతో దరికి చేర్చి బాధ్యతాయుతమైన పార్టీగా, ఆ పార్టీకి సారధ్యం వహిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  రైతులకు ధైర్యాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారని అందుకే జిల్లాల పర్యటన తలపెట్టారని కాంగ్రెస్  నేతలు చెప్తున్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్‌ పార్టీ  చెబుతోంది.  రాష్ట్ర రైతాంగం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ఈ తరుణంలో రైతులకు బాసటగా నిలవాలని తెలంగాణ కాంగ్రెస్  నిర్ణయించింది. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని నమ్మించిన కాంగ్రెస్‌, అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా హామీలను అమలు చేయకపోగా మరింత కుంగదీసే చర్యలకు పాల్పడుతున్నదని బీఆర్‌ఎస్‌ విమర్శిస్తున్నది. రైతులకు అండగా నిలిచేందుకు ఆదివారం నుంచి కేసీఆర్‌ జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ స్పష్టం చేసింది. ఇప్పటికే రైతుల కోసం అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడంతోపాటు రైతులను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పొలాల పరిస్థితిని పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రంలో చూస్తున్న నీటి కొరతకు ప్రకృతి కారణం కాదని, పాలక పక్షమే కారణమని మండిపడ్డారు. 

దానం బ్యాక్ టు బీఆర్ఎస్?

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి యూటర్న్ కు రెడీ అవుతున్నారా?  ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరుకుని సికిందరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే ఖరారైన ఆయన మరో సారి యూటర్న్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారా? కాంగ్రెస్ కు జెల్ల కొట్టి మళ్లీ బీఆర్ఎస్ కండువా కప్పుకుని ఎమ్మెల్యేగా కొనసాగాలని భావిస్తున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఔననక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న తొలి బీఆర్ఎస్ సిట్టింగ్ దానం నాగేందర్. ఆయన కాంగ్రెస్ గూటికి చేరడంపై ఎవరూ ఆశ్చర్యం వ్యక్తం చేయలేదు. దానంకు అది అలవాటే అన్నట్లుగా నిర్లిప్తంగా తీసుకున్నారు. చివరికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆయనపై పెద్దగా విమర్శలు రాలేదు. గతంలో కూడా ఆయన నిముషాలు, గంటలు, రోజుల వ్యవధిలో పార్టీలు మార్చేసిన చరిత్ర ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్ ను సికిందరాబాద్ లోక్ సభ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అలా ప్రకటించే ముందు ఒక కండీషన్ పెట్టింది. అదేమిటంటే ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని. తొలుత అందుకు అంగీకరించిన దానం నాగేందర్ ఆ తరువాత ఎందుకో ముందు వెనుకలాడుతున్నారు. బహుశా  సికిందరాబాద్ నుంచి గెలిచే అవకాశాలు లేవని భావిస్తున్నారో ఏమో  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి వెనుకాడుతున్నారు. ఆయన తీరుతో కాంగ్రెస్ ఆగ్రహంగా ఉంది. ఒక వేళ  సికిందరాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నిక కాకుండా ఖైరతాబాద్ ఉప ఎన్నికలో దానంకే పార్టీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇచ్చినా ఆయన రాజీనామాకు సరే అనడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లోగా దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ దాఖలైంది. దీంతో  కాంగ్రెస్ సికిందరాబాద్ నుంచి దానం బదులు మరో వ్యక్తిని నిలబెట్టాలని భావిస్తోంది. ఈ తరుణంలో దానం నాగేందర్  కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. కేసీఆర్ చాలా మంచి నేత ఆయన చుట్టూ చేరిన వారు ఆయనను భ్రష్టుపట్టించారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో  చర్చనీయాంశంగా మారాయి. దానం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి మళ్లీ కారెక్కేందుకు సిద్ధపడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం బెటరన్నట్లు.. కాంగ్రెస్ అభ్యర్థిగా సికిందరాబాద్ నుంచి లోక్ సభకు పోటీ చేసి రిస్క్ తీసుకోవడం కంటే ఉన్న ఎమ్మెల్యే పదవిని కాపాడుకుంటే బెటర్ అని దానం భావిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.  

లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కనీస పోటీ కూడా అనుమానమే!?

బీఆర్ఎస్ (ఆవిర్బావ సమయంలో టీఆర్ఎస్) ఆవిర్బావం నుంచీ కూడా  ఇంతటి దయనీయ స్థితిలో ఎన్నడూ లేదు. ఉద్యమ సమయంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడి లక్ష్య సాధన దిశగా జయంబు నిశ్చయంబు అంటూ సాగిన పార్టీ... ఇప్పుడు ఒక్క ఒకే ఒక్క ఓటమితో అధ: పాతాళానికి పడిపోయింది. రాష్ట్ర ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ విపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఎదురుకాగానే చతికిల పడిపోయింది. పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. పార్టీ పరాజయం పాలై మూడు నెలలు పూర్తిగా అయ్యాయో లేదో అప్పుడే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు బైబై చెప్పేసి కాంగ్రెస్ గూటికే, కమలం చెంతకో చేరిపోతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పటికే  బీఆర్ఎస్ కు చెందిన 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారు. వీరంతా ఏ క్షణంలోనైనా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. పార్టీ మారిన వారిపై విమర్శలు చేయడానికి కూడా నైతిక అర్హత లేని స్థితిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. అధికారంలో ఉండగా కేసీఆర్ విపక్షాలను నిర్వీర్యం చేయడానికి ఆ పార్టీల నుంచి ఎమ్మెల్యేలనూ నేతలనూ గంపగుత్తగా బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అప్పుడు ఒప్పు అయినది.. ఇప్పుడు తప్పు అని చెప్పలేని స్థితిలో బీఆర్ఎస్ అధినేత ఉన్నారు.  నిన్న మొన్నటి వరకూ రాష్ట్రంలో తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్ అధినేత ఇప్పుడు సొంత పార్టీ నేతలను కూడా కట్టడి చేయలేనంత బలహీనంగా మారడానికి కారణం అధికారంలో ఉండగా ఆయన వ్యవహరించిన తీరు, అనుసరించిన ఒంటెత్తు పోకడలే అని చెప్పాలి. ఎన్నడూ విపక్షాలను అంత వరకూ ఎందుకు సొంత పార్టీ నేతలను కూడా విశ్వాసంలోకి తీసుకోకుండా అంతా తానే అన్నట్లుగా వ్యవహరించారు. కేబినెట్ సహచరులకు కూడా ప్రగతి భవన్ గేట్లు మూసే ఉండేవి. ఆయన కలవాలని భావిస్తేనే ఎవరికైనా ప్రగతి భవన్ ప్రవేశం. లేకుంటే లేదు అన్నట్లుగా కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం ఒక నియంతలా వ్యవహరించారన్న విమర్శలు అప్పట్లోనే ఉండేవి. అయితే అప్పుడు అధికారం చేతిలో ఉండటంతో ఆ విమర్శలను ఆయన ఖాతరు చేయలేదు. అంతెందుకు అసెంబ్లీలో విపక్ష నేతల ప్రజెన్స్ నే భరించలేను అన్నట్లుగా ఆయన వ్యవహరించిన తీరు ఉందని పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు. తన విధానాలను వ్యతిరేకించే ఎవరినీ ఆయన అసెంబ్లీలో కూర్చోనీయలేదు. రేవంత్ రెడ్డి, పార్టీ నుంచి బయటక వెళ్లిన తరువాత ఈటల లను అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా సస్పెన్షన్ వేట్లతో సభకు దూరంగా ఉంచడమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు ఉదహరిస్తున్నారు.  ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా తయారైందంటే ఆయన పిలిచి టికెట్ ఇచ్చినా లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ కడియం కావ్యను ప్రకటించిన తరువాత ఆమె ఓ బహిరంగ లేఖ రాసి పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రకటించడమే కాకుండా కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు సంకేతాలిచ్చారు.  ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న నేతలు కూడా ఏ క్షణాన బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి మరక తమ మీద పడుతుందా అన్న భయంతో వణికిపోతున్నారు. అందుకే కేసీఆర్ కుటుంబ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలను ఖండించేందుకు కూడా పార్టీ నేతలు ముందుకు రావడం లేదని అంటున్నారు. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేస్తే రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు నిచ్చినా పార్టీ క్యాడర్ నుంచి కానీ, ప్రజల నుంచి కానీ కనీస స్పందన కరవైంది. అంతెందుకు కవితను రాజకీయ వేధింపుల కోసమే అరెస్టు చేశారంటూ కేసీఆర్ ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా చేయలేకపోయారు. అదే కేజ్రీవాల్ ను ఇదే మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేసినప్పుడు కేసీఆర్ ఖండించారు. అటువంటి ఖండన తన కూతురి విషయంలో చేయలేకపోయారు. సొంత తండ్రే స్పందించలేదంటే కవితకు కుంభకోణంలో పాత్ర ఉందనే కదా అని జనం చర్చించుకుంటున్నారు. ఇక కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యంగా చేస్తున్న విమర్శలు, సవాళ్లు ఆయనలోని అసహనాన్ని బయటపెడుతున్నాయే తప్ప ప్రజల నుంచి స్పందన మాత్రం కానరావడం లేదు. ఈ పరిస్థితుల్లో రానున్న లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఏ మేరకు కాంగ్రెస్, బీజేపీలకు పోటీ ఇవ్వగలదు అన్నది ప్రశ్నార్ధకమేనని పరిశీలకులు అంటున్నారు. 

కులం ముద్రకు తెలుగుదేశం అతీతం

కులం పేరుతో రాజకీయాలు చేసి తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టాలన్న వైసీపీ యత్నాలు ఫలించలేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు కులం రంగు అంటని పార్టీగా తనను తాను రుజువు చేసుకుంటూనే వస్తోంది. అసలు తెలుగుదేశం పార్టీపై కులం ముద్ర వేయాలన్న ప్రయత్నాలు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ప్రయత్నాలు జరిగాయి. ఎప్పటికప్పుడు సామాజిక సమీకరణాల విషయంలో తన నిష్పాక్షికతను తెలుగుదేశం పార్టీ రుజువు చేసుకుంటూ వస్తూనే ఉంది.  అయితే జగన్ సొంతంగా వైసీపీ పార్టీని ఏర్పాటు చేసుకున్న తరువాత ఆ ప్రయత్నాలు మరింత ముమ్మరమయ్యాయి. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో అంటే 2014 ఎన్నికల్లో  ఓటమి తరువాత  తెలుగుదేశం పార్టీని  కులతత్వ పార్టీగా చిత్రీకరించగలిగితేనే తమకు రాజకీయ ఉనికి ఉంటుందని జగన్ భావించారు. ఒక అక్కడ నుంచి అదే పనిగా రాజకీయ వ్యూహకర్తలు, సోషల్ మీడియా ప్రచారం, మీడియా మేనేజ్‌మెంట్  ఇలా ఒకటేమిటి అన్ని మార్గాల ద్వారా తెలుగుదేశంకు కుల ముద్ర అంటగట్టడమే లక్ష్యంగా ముందుకు సాగిన జగన్ ఆ దిశగా ఓ మేరకు సఫలీకృతులయ్యారనే చెప్పాలి.   అయితే తెలుగుదేశం పార్టీ సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ అని  నిరూపించుకుంది.   2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ  జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుని పోటీలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా సీట్ల పంపకం విషయంలో తెలుగుదేశం ఒకింత ఇబ్బందులు ఎదుర్కొంది. జనసేన పార్టీతో సీట్ల సర్దుబాటు విషయంలో ఎటువంటి ఇబ్బందులూ ఎదురు కాలేదు. కానీ బీజేపీ విషయానికి వచ్చేసరికి రాష్ట్రంలో ఏ మాత్రం ఓటు స్టేక్ లేని ఆ పార్టీకి పది అసెంబ్లీ, ఆరు లోక్ సభ స్థానాలు కేటాయించడంపై పార్టీ వర్గాల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తం అయిన మాట వాస్తవం. అయితే రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు అంతం పలకాలన్న లక్ష్యంతో నడుస్తున్న పార్టీ అధిష్ఠానం అభిప్రాయాలకు విలువ ఇచ్చిన క్యాడర్ ఓ మూడు స్థానాల విషయంలో మాత్రం సర్దుకు పోలేకపోతున్నది.  ఆ మూడు స్థానాలూ అరకు, అనపర్తి, నరసాపురం. ఆ మూడు స్థానాలనూ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ త్యాగం చేయడాన్ని పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నది. ఇక్కడే తెలుగుదేశం పార్టీకి ఒక కులం రంగుపులమడానికి వైసీపీ చేసిన ప్రచారం ఎంతటి అవాస్తవమో తేటతెల్లమైంది. ఒక వైపు వైసీపీలో రెడ్డి సామాజకి వర్గానికి ఉన్న ప్రాధాన్యత మరే సామాజిక వర్గానికీ లేదని  అధికారుల నియామకం నుంచి పార్టీ టికెట్ల కేటాయింపు వరకూ ప్రతి విషయంలోనూ రుజువు అవుతున్నది. అదే తెలుగుదేశం విషయానికి వచ్చేసరికి అన్ని సమాజిక వర్గాలకూ సమప్రాధాన్యత కనిపిస్తున్నది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అసంతృప్తితో రగిలిపోతున్న మూడు స్థానాలలోనూ కూడా తెలుగుదేశంకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు లేరు. పొత్తులో భాగంగా ఆయా స్థానాలలో తెలుగుదేశం టికెట్ దక్కక నిరాశ చెందిన అభ్యర్థులెవరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కారు.  ఆరకు ఎస్టీ రిజర్వుడు స్థానం. ఆ స్థానంలో గత మూడున్నరేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేసిన దన్నుదొర పొత్తులో భాగంగా సీటు త్యాగం చేయాల్సిరావడాన్ని క్యాడర్ అంగీకరించలేకపోతున్నది. పార్టీ కోసం నిలబడిన దొన్నుదొరకే ఇక్కడ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.  ఇక అనపర్తి విషయానికి వస్తే ఇక్కడ  పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిని సమర్ధించడానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అన్యాయం జరిగిందని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నది. తమ మద్దతు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే అని స్పష్టం చేస్తోంది. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే ఆయన వెంటే ఉంటామని స్పష్టం చేస్తోంది. ఇందుకు కారణం గత ఐదేళ్లుగా నల్లమిల్లి పార్టీ కోసం నిలబడ్డారు. జగన్ ప్రభుత్వం నుంచి ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నారు.  ఇక నరసాపురంలో క్షత్రియ సామాజికవర్గానికి చెందిన రఘు రామకృష్ణంరాజు కు తెలుగుదేశం క్యాడర్ మద్దతుగా నిలబడింది.  జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనపై   అలుపెరగని పోరాటం చేసిన రఘురామకృష్ణం రాజుకు అన్యాయం జరగడానికి వీల్లేదని పట్టుబడుతోంది. ఈ మూడు సీట్ల విషయంలో తెలుగుదేశం క్యాడర్ గట్టిగా నిలబడింది. వీరి విషయంలో పునరాలోచించాలని అధిష్ఠానాన్ని కోరుతోంది.   పొత్తులో భాగంగా సీటు కోల్పోయిన వారిలో దేవినేని ఉమ, పరిటాల శ్రీరామ్‌, ఆలపాటి రాజా తదితర కమ్మ నేతలూ ఉన్నారు. క్యాడర్ వారి పట్ల సానుభూతి చూపుతున్నది, అయితే  అరకు, అనపర్తి, నరసాపురం సీట్ల విషయంలో మాత్రం పోరాడుతోంది.  ఈ ఉదాహరణ చాలు తెలుగుదేశం పార్టీకి కులం రంగు పులమడానికి అవకాశం లేదని చెప్పడానికి.   పార్టీపై కులం ముద్ర వేయడానికి గత పదేళ్లుగా (విపక్షంలో ఉన్న ఐదేళ్లు, అధికార పార్టీగా ఐదేళ్లు) వైసీపీ చేసిన దుష్టపన్నాగాలు, ప్రయత్నాలూ ఫలించలేదనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలి. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల దర్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం (మార్చి 30) శ్రీవారి ఉచిత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో  కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూలైన్ సాగింది. టోకెన్లు లేని భక్తలకు స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ దర్శనం కోసం భక్తులు పది కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టైమ్ స్లాట్ భక్తులకు శ్రీవారి దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది.   అలాగే మూడువందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడుతోంది. శుక్రవారం (మార్చి 29) శ్రీవారిని 60,958 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో  31,245 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 41 లక్షల రూపాయలు వచ్చింది. 

పవన్ తొలి విడత   ఎన్నికల షెడ్యూల్ ఖరారు 

జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30 నుంచి ఆయన ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు. ఈ ప్రచార కార్యక్రమానికి 'వారాహి విజయభేరి' అని నామకరణం చేశారు. తాను అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే పవన్ తన వారాహి విజయభేరి ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. తొలి సభ ఈ నెల 30న చేబ్రోలు రామాలయం సెంటర్ లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది.  కాగా, పవన్ ప్రచార కార్యక్రమాల్లో భద్రతా వ్యవహారాల సమన్వయకర్తలుగా అందె నరేన్, మిథిల్ జైన్ లను నియమించారు. వీరి నియామకానికి పవన్ ఆమోద ముద్ర వేశారు.  జనసేన ఈ ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో, మూడు విడతల్లో పవన్ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ ఎన్నికల ప్రచార బరిలో కత్తులు దూస్తుండగా, ఇక పవన్, నారా లోకేశ్ ఎంట్రీ ఇవ్వడమే మిగిలుంది. చంద్రబాబు ప్రజాగళం యాత్ర పేరిట ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుండగా, సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట సభలకు హాజరవుతున్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు  పిఠాపురంలో పవన్ పర్యటించనున్నారు.  మళ్లీ వచ్చే నెల 9వ తేదీన పిఠాపురానికి  పవన్ రానున్నారు. ఏప్రిల్ 3 - తెనాలి, ఏప్రిల్ 4 - నెల్లిమర్ల, ఏప్రిల్ 5 - అనకాపల్లి, ఏప్రిల్ 6 - యలమంచిలి, ఏప్రిల్ 7 - పెందుర్తి,ఏప్రిల్ 8 - కాకినాడ రూరల్ ,ఏప్రిల్ 10-రాజోలు, ఏప్రిల్ 11 - పి.గన్నవరం, ఏప్రిల్ 12 - రాజానగరం లో పవన్ పర్యటించనున్నారు. 

సికిందరాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం.. కాదు కాదు బొంతు!

లోక్ సభ  ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బబీజేపీ, బీఆర్ఎస్ లు ఇప్పుడు ఆ ప్రకటించిన అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులపై మల్లగుల్లాలు పడుతున్నాయి. బీఆర్ఎస్ వరంగల్  లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య పోటీ నుంచి వైదొలగడంతో అక్కడ మరో అభ్యర్థిని నిలబెట్టక తప్పని పరిస్థితి బీఆర్ఎస్ కు ఏర్పడింది. దీంతో బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థిగా బాబూమోహన్ ను నిలబెట్టాలని భావిస్తున్నది. బీఆర్ఎస్ కు రాజీనమా చేసి బీజేపీలోకి అక్కడ నుంచి కేఏపీల్ విశ్వశాంతి పార్టీలోకీ మారిన బాబూమోహన్ ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరనున్నట్లు సమాచారం. వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ బామూమోహన్ ను నిలబెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులే చెబుతున్నాయి. ఇక సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారైన దానం నాగేందర్ ను మార్చాలన్న యోచనలో ఆ పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన దానం నాగేందర్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్  గూటికి చేరారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ హైకోర్టులు పిటిషన్ దాఖలైంది. అది అలా ఉంచితే కాంగ్రెస్ అధిష్ఠానం దానం నాగేందర్ ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆదేశించింది. ఆయన రాజీనామా చేస్తేనే సికిందరాబాద్ ఎంపీగా టికెట్ ఇస్తామని చెప్పినా కూడా రాజీనామాకు దానం ససేమిరా అంటుండడంతో  కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ గా ఉందనీ, సికిందరాబాద్ నియోజకవర్గంలో దానం కు బదులుగా మరో వ్యక్తిని నిలపాలని భావిస్తున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయ. తాజా సమాచారం మేరకు దానం నాగేందర్ ను సికిందరాబాద్ అభ్యర్థిగా తప్పించి ఆయన స్థానంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును కాంగ్రెస్ పరిశీలిస్తున్నది.  

తాడికొండ రాజయ్య యూటర్న్.. బీఆర్ఎస్ కు చేసిన రాజీనామా ఉపసంహరణ

మాజీ మంత్రి తాడికొండ రాజయ్య యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టకి రాజీనామా చేసిన తాడికొండ రాజయ్య తన రాజీనామా లేఖను ఉపసంహరించుకున్నారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీగా  కడియం కావ్య పోటీకి దూరంగా ఉంటున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో తాడికొండ రాజయ్య రాజీనామా ఉపసంహరణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ వైపు బీఆర్ఎస్ ను సీనియర్లందూ వీడిపోతున్న తరుణంలో పార్టీని వీడిన తాడికొండ రాజయ్య తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరడం విశేషం. అయితే కడియం శ్రీహరితో విభేదాల కారణంగానే పార్టీని వీడినట్లు చెప్పిన రాజయ్య, ఇప్పుడు కడియం శ్రీహరే స్వయంగా బీఆర్ఎస్ ను వీడటంతో తాను పార్టీకి చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు రాజయ్య తెలిపారు. కేసీఆర్ అనుమతిస్తే వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కడియం ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. రం.