అధికారులను బదిలీ చేసిన ఈసీ 

ఎపి రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది.ఏపీలో మరి కొన్ని వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఎన్నికల సంఘం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్ అధికారులను, ముగ్గురు ఐఏఎస్ అధికారులను నేడు బదిలీ చేస్తూ, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.  చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిలను, గుంటూరు రేంజి ఐజీ పాలరాజును బదిలీ చేసింది. కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి గౌతమి, తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషాను బదిలీ చేసింది. అంతేకాదు, బదిలీ అయిన వారు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది.

 బిఆర్ఎస్ స్కాంలకు కడియం అప్రూవర్ పాత్ర ? 

బీఆర్‌ఎస్‌ నేతలు అందరి చిట్టాలు తన వద్ద ఉన్నాయని, వాటిని బయటపెడితే తట్టుకోలేరని కడియం శ్రీహరి వార్నింగ్‌ ఇచ్చారు. తాను పార్టీ మారడంపై విమర్శలు చేస్తున్న వారి చరిత్ర తనకు తెలుసన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ను వీడటం బాధగానే ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరక తప్పలేదని వివరించారు. బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఆర్థిక నేరాల చిట్టా రేవంత్ రెడ్డి సర్కార్ విప్పుతోంది. అయితే ఆర్థిక నేరాల మీద కాంగ్రెస్ సీరియస్ గానే ఉంది. ఫోన్ ట్యాపింగ్ స్కాం ద్వారా బిఆర్ఎస్ సర్కార్ చేసిన అవినీతి చిట్టా బయటపడనుంది. నేరాలు కోర్టుల్లో రుజువు కావడానికి అప్రూవర్ లు ముఖ్య భూమిక వహిస్తారు. రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేయడంతో బిఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరారు. 80 ఏళ్లు దాటిన కె. కేశవ్ రావ్ వంటి సీనియర్ నేతలు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. బిఆర్ఎస్ పాపాల చిట్టా ఈ ముఖ్య నేతల వద్ద ఉంది. కాబట్టి ఈ చిట్టాన్నిబయట పెట్టడానికే కడియం శ్రీహరి వంటి నేతలు రేవంత్ రెడ్డికి అవసరముంది. కాబట్టే తండ్రీ కూతుళ్ల చేరికలను రేవంత్ ప్రోత్సహిస్తున్నారు. గద్వాల్ విజయలక్ష్మి, కె. కేశవ్ రావ్, డాక్టర్ కావ్య , కడియం శ్రీహరి వంటి నేతలను కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. వీళ్లంతా బిఆర్ఎస్ నేతల నేరాలకు అప్రూవర్ గా మారనున్నారు. కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నేతలు బిఆర్ఎస్ సుప్రీం అయిన కెసీఆర్ ను పల్లెత్తు మాట అనలేదు. కానీ బిఆర్ఎస్  అవినీతి  పాలనపై తూర్పారబట్టారు. కడియం వంటి నేతలు బిఆర్ఎస్ స్కాంల వల్ల తన కూతురు బలి కావొద్దన్న ఉద్దేశ్యంతో   కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వివరించారు. రాజకీయాల్లో కొత్తగా చేరిన తన కూతురు బిఆర్ఎస్ తరపున పోటీ చేస్తే   పరాజయం చెందడం ఖామని  కడియంకు అర్థమైంది.   కాబట్టే తనతో బాటు కూతురును కాంగ్రెస్ లో చేర్చారు.  కాంగ్రెస్ లో చేరిన వెంటనే  అదే వరంగల్ టికెట్ తెచ్చుకున్నారు. డిసెంబర్ లో కాంగ్రెస పార్టీ పై  ఒంటికాలితో లేచిన కడియం చివరకు అదే పార్టీ చేరారు. కేవలం మూడు నెలల కాలంలో తెలంగాణ రాజకీయాల్లో విపరీత  మార్పు చోటు చేసుకుంది. మెజారిటీ బిఆర్ ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ సర్కార్ ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఆరునెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పిన నేతల్లో కడియం ముందు వరసలో ఉన్నారు. విధి బలీయమైనది. బిఆర్ఎస్ నేతలు తమ పదవులకు రాజీనామా చేసి. కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై తనకు గౌరవం ఉందని, ప్రత్యేకంగా ఆయనపై ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదని  కడియం ఇప్పటికే క్లారిటి ఇచ్చారు. బిఆర్ఎస్ నేతలు పదుల సంఖ్యలో పార్టీ మారుతున్నా ఎవరిపైనా స్పందించని బీఆర్ఎస్ నేతలు కడియంపై ఫోకస్ పెట్టారు. అందరిని వదిలేసి తనను  మాత్రం ఎందుకు టార్గెట్ చేసినట్లు మాట్లాడుతున్నారని కడియం అడిగారు. నా విషయంలో వారు మాట్లాడే పద్దతి బాగోలేదన్నారు. జిల్లా స్థాయి నేతలు కూడా తనపై అనవసర కామెంట్స్‌ చేయడాన్ని కడియం ఆరోపించారు.  పాలకుర్తి ప్రజలు చీకొట్టినా ఎర్రబెల్లి దయాకర్ కు బుద్ధి రాలేదని, ఆయన ఏంమాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదని కడియం ఎద్దేవా చేశారు. అహంకారపు మాటలు తగ్గించుకుంటే ఆయనకే మంచిదని హితవు పలికారు. బీఆర్‌ఎస్‌ కు ఇలాంటి దుస్థితి రావడానికి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి వంటి నేతలే కారణమని కడియం ఆరోపించారు. పల్లా  చేసినవన్నీ అసత్య ఆరోపణలేనని కొట్టిపారేశారు. పల్లా ఆరోపణలకు ఆధారాలు చూపించకుంటే ఆయనను జనగామలో బట్టలు ఊడదీసి నిలబెడతానని కడియం శ్రీహరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్‌కు కూడా కడియం వార్నింగ్‌ ఇచ్చారు. మానుకొండూరు ప్రజలు చిత్తుగా ఓడించినా బుద్ధి లేకుండా అనవసర మాటలు మాట్లాడుతున్నాడని కడియం  మండిపడ్డారు.  

కాకతీయుల శిల్పాలను కాపాడుకోవాలి!

800 ఏళ్ల నాటి సప్తమాతల శిల్పాలను కాపాడుకోవాలి!  చారిత్రక శిల్పాలపై రంగులు వెయ్యొద్దు  - ప్రాచీనతకు భంగం అంటున్న పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి 800 సంవత్సరాల నాటి కాకతీయుల శిల్పాలపై రంగుల వేసి ప్రాచీనతకు భంగం కలిగించవద్దని, రంగులు తొలగించి కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, ఈమని శివనాగిరెడ్డి అన్నారు. మాల్ శివారులోనున్న గొడగండ్ల గ్రామంలోని వేణుగోపాలస్వామి దేవాలయ ప్రాంగణంలోని సప్తమాతృకల శిలాఫలకం రెండు ముక్కలై, ఒకటి ప్రాకారం గోడకు బిగించి ఉండగా, మరొకటి మండప ద్వారానికి ఎడమవైపున బిగించి ఉన్నాయని, వాటిపై వేసిన నలుపు రంగు చరిత్రను చెరిపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నాడు ఆ విగ్రహాలను పరిశీలించిన శివనాగిరెడ్డి ఆలయ ధర్మకర్తల  మండలి ఛైర్మన్, అంగిరేకుల గోపాల్, సభ్యులు ఇరుకుల రామ్మోహన్, కడారి జంగయ్య, గ్యారా ఉమా యాదయ్య, తుగిరి వెంకటయ్య, వంగూరు శ్యాంసుందర్, అర్చకులు వైద్యుల ప్రవీణ్ శర్మ, బాపతు సత్యనారాయణ రెడ్డిలకు శిల్పాల చారిత్రక ప్రాధాన్యతను వివరించి అవగాహన కల్పించారు.  

పిఠాపురం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన పవన్

రానున్న ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఉదయం స్థానిక ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం యు. కొత్తపల్లి మండలం పొన్నాడలో బషీర్ బీబీ దర్గాకు బయలుదేరారు. ఆ తర్వాత ఉప్పాడ కొత్తపల్లిలో మహిళలతో సమావేశం అవుతారు. కాగా, పిఠాపురంలో పవన్ నాలుగో రోజు పర్యటనలో బీజీగా గడుపుతున్నారు. పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకోవడానికే ఇక్కడకు వచ్చా. నియోజకవర్గంలోని 54 గ్రామాల్లో ఏదో ఒకచోట ఇల్లు తీసుకుని ఉంటా. నన్ను ఒక్కసారి గెలిపించమని భగవంతుడిని కోరితే పిఠాపురం పిలిచింది. మనం భారీ మెజార్టీతో గెలవబోతున్నామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. పిఠాపురం మండలం కుమారపురంలోని గోకులం గ్రాండ్‌ లో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వైద్యులు, న్యాయవాదులు, వివిధ వర్గాల ప్రముఖులు, వైసీపీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీల చైర్మన్లు, నాయకులు జనసేన పార్టీలో చేరారు. వారందరికీ పవన్‌ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పిఠాపురం నియోజకవర్గంలోని అందరినీ వ్యక్తిగతంగా కలవాలన్న ఆశ తనకు ఉన్నప్పటికీ భద్రతాపరమైన కారణాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పవన్‌ తెలిపారు. ప్రత్యర్థుల పన్నాగాలు గమనిస్తూ మనమంతా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. భద్రతాపరమైన ప్రొటోకాల్‌ పాటిస్తూ రోజుకి 200 మందిని కలిసి వారితో ఫొటోలు తీసుకుంటానని తెలిపారు. శ్రీపాదశ్రీవల్లభుడు, పురుహూతికా అమ్మవారు, బషీర్‌ బీబీ (బంగారు పాప) దర్గా, ఆంధ్రా బాప్టిస్టు చర్చి సాక్షిగా ప్రజలందరికీ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తాను భగవంతుడినీ ఏదీ కావాలని కోరుకోనని, అయితే సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అవుతున్న సమయంలో నల్గొండకు చెం దిన అభిమాని వచ్చి ఒక్క హిట్‌ ఇవ్వు అన్నా అని అడిగాడు. అప్పుడు ఒక్క హిట్‌ ఇవ్వమని, భీమవరంలో ఓడిపోయిన తర్వాత గెలుపు ఇవ్వమని భగవంతుడిని కోరానని, ఆ మేరకు తనను పిఠాపురం పిలిచిందని చెప్పారు. నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో ఉండాలన్నదీ త్వరలో నిర్ణయించుకుంటాని, పురుహూతికా అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడే ఏదో ఒక గ్రామంలో ఇల్లు తీసుకుని ఉంటానన్నారు. పగిలే గాజు గ్లాసుకు పదును ఎక్కువన్నారు. అందరినీ ప్రత్యేకించి కలుస్తానని, ప్రతి ఒక్కరి సమస్యలనూ తెలుసుకుంటానని తెలిపారు.పవన్ నేడు పిఠాపురం పర్యటనను ముగించుకుని రేపు తెనాలి వెళ్తారు. 4న  నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. 9న ఉగాది సందర్భంగా పిఠాపురంలో నిర్వహించే వేడుకల్లో పాల్గొంటారు. 10న రాజోలు, 11న గన్నవరం, 12న రాజానగరం బహిరంగ సభల్లో పాల్గొంటారు. 

చత్తీస్ ఘఢ్ లో మరోసారి ఎన్ కౌంటర్ 

ఇటీవలే చత్తీస్ గఢ్ లో చోటుచేసుకున్న భారీ ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలకు భారీ ప్రాణనష్టం జరిగింది. ఆ ఘటన మరువకముందే చత్తీస్ గఢ్ లోని దంతెవాడలో మరోసారి కాల్పులు జరిగాయి. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో  ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. బీజాపూర్ జిల్లా అట‌వీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందారు. మంగ‌ళ‌వారం ఉద‌యం ఆరు గంట‌ల ప్రాంతంలో గాంగ్లూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో కుంబింగ్ కోసం వెళ్లిన భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఓ సీనియ‌ర్ పోలీస్ అధికారి పీటీఐకి తెలిపారు. దాంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు.. మావోయిస్టుల‌పై ఎదురుకాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు చ‌నిపోగా, ఘ‌ట‌నాస్థ‌లి నుంచి పోలీసులు ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మ‌రోవైపు పోలీసులు గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్నారు. ఈ ఘటనతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు బీజాపూర్‌తో సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 34 మంది నక్సలైట్లు హ‌త‌మ‌య్యార‌ని పోలీసులు తెలిపారు. కాగా, బీజాపూర్ జిల్లా బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మొదటి దశ సాధారణ ఎన్నికలలో భాగంగా ఇక్క‌డ‌ ఏప్రిల్ 19వ తేదీన‌ పోలింగ్ జరగనుంది.

వైసీపీ తప్పుడు ప్రచారం: చంద్రబాబు 

ఎపిలో పెన్షన్ల విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో  ఆ పార్టీ అధ్యక్షుడు స్పందించారు.    తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందే నీచమైన తీరు జగన్ డీఎన్ఏలోనే ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. వైసీపీ నేతలు, జగన్‌రెడ్డి బతుకే ఓ ఫేక్ బతుకని దుమ్మెత్తి పోశారు. తప్పుడు ప్రచారంతో, అవాస్తవాలతో రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం, నీచమైన తీరు వారి డీఎన్ఏలోనే ఉందని ఆరోపించారు. పెన్షన్లు పంచవద్దని తెలుగుదేశం పార్టీ ఎక్కడా అభ్యంతరం చెప్పలేదని పేర్కొన్నారు. ఇంటింటికీ పెన్షన్ ఇవ్వకూడదని ఎన్నికల సంఘం కూడా ఎక్కడా ఆదేశించలేదని తెలిపారు. పెన్షన్ల విషయంలో జరుగుతున్నది అంతా పెద్ద రాజకీయ కుట్ర అని చంద్రబాబు పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం వృద్ధులు, వికలాంగులను కూడా ఇబ్బందులు పెట్టే పాలకులు మనకు అవసరం లేదని తేల్చి చెప్పారు. కుట్రలు ఛేదించి దుర్మార్గ రాజకీయాలను ప్రజలు ఎండగట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి రాగానే పెన్షన్‌ను రూ. 4 వేలకు పెంచి, ఆంక్షలు ఎత్తివేసి ఇంటివద్దే పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు.                          

ఆంధ్రా లిక్కర్ స్కాం ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం బ‌లాదూర్ - మాజీ సి.ఎం. కిర‌ణ్‌కుమార్‌రెడ్డి.

ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల పేరుతో సాగుతోన్న మ‌ద్యం దందాలో బ్రాండ్లుదే కీల‌క‌పాత్ర‌. ఊరూ పేరు లేని మ‌ద్యం బ్రాండ్లు దాదాపు 2725 ర‌కాల‌వి అమ్ముతున్నారు. వీటిలో 70 శాతం బ్రాండ్ల పేర్లు గ‌తంలో ఎవ‌రూ విన‌లేదు. ఇవ్వ‌న్నీ ఎవ‌రు త‌యారు చేస్తున్నారు. ఎందుకు త‌యారు చేస్తున్నారు. ఎలా త‌యారు చేస్తున్నారు? ఇదో పెద్ద స్కాం అంటారు మాజీ సి.ఎం. కిర‌ణ్‌కుమార్‌రెడ్డి.  ఆంధ్రా లిక్క‌ర్ స్కాం ముందు ఢిల్లీలో వెలుగుచూసిన లిక్క‌ర్ కుంభ‌కోణం బ‌లాదూర్ అంటారాయ‌న‌. ప్ర‌భుత్వ మ‌ద్యం,  వైన్‌షాపుల్లో అమ్మేది మ‌ద్యం కాదు విషం అని లేబ‌రేట‌రీ నివేదిక‌ల్లో తేల‌డంతో ఏపీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.  మీకు గుర్తుందా అప్ప‌ట్లో ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా వున్న సోము వీర్రాజు ఏమ‌న్నారంటే ఏపీలో బీజేపీ అధికారంలోకి వ‌స్తే కేవ‌లం 50 రూపాల‌కే చీప్ లిక్క‌ర్ ఇస్తామ‌న్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం తక్కువ ధరకే ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. సి.ఎం. జ‌గ‌న్ ఏమో ప్ర‌భుత్వ మ‌ద్యాన్ని పేద‌లు కొన‌లేనంత రేట్లు పెంచానంటున్నారు. ఎందుకంటే అది మ‌ద్య‌నిషేధంలో భాగ‌మ‌ని క‌ల‌రిచ్చారు.  తాజాగా మాజీ సి.ఎం. కిర‌ణ్‌కుమారెడ్డి రాజంపేట ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో మాట్లాడుతూ ఆంధ్రా లిక్క‌ర్ స్కాం ముందు ఢిల్లీలో వెలుగుచూసిన లిక్క‌ర్ కుంభ‌కోణం బ‌లాదూర్ అంటూ జే సిండికేట్ గుట్టు ర‌ట్టు చేశారు. దీంతో ఏపీ రాజ‌కీయాల్లో లిక్క‌ర్ హాట్ హాట్‌గా మారింది.   ఏపీలో దేశంలోనే మ‌రెక్క‌డా లేనివిధంగా 2725 బ్రాండ్లు మార్కెట్‌లో ఉన్నాయి. ఊరూపేరూలేని వేలాది బ్రాండ్ల‌న్నీ పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, అనిల్‌రెడ్డి సిండికేట్ ఉత్ప‌త్తులేన‌ట‌. జ‌గ‌న్ ఆయ‌న మ‌నుషులు త‌యారు చేస్తున్న ఈ మ‌ద్యం బ్రాండ్ల‌న్నీ..  కేంద్ర ప్ర‌భుత్వం నిర్దేశించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌కి విరుద్ధంగా వున్నాయ‌ని  కెమిక‌ల్ ప‌రీక్ష‌ల్లో తేలిపోయింది.  ఏపీ వైన్ షాపుల్లో కొనే బ్రాందీ, విస్కీల్లో సైనైడ్ వుంద‌ట‌.  ఓల్డ్ టైమ‌ర్ ,చాంపియ‌న్, రాయ‌ల్‌సింహ,  గ్రీన్ చాయిస్‌, సెల‌బ్రిటీ బ్రాండ్ల‌లో  ప్ర‌మాద‌క‌ర ర‌సాయ‌నాలున్నాయ‌ని త‌మిళ‌నాడులోని ఎస్ జీ సి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై ల్యాబ్‌కి ప‌రీక్ష‌ల్లో తేలింది. ఈ మద్యంలో... బెంజోక్వినోన్‌, స్కోపారోన్‌, డైమితోక్సినామిక్‌ యాసిడ్‌,  పైరోగలాల్‌, వొల్కెనిన్‌,  వంటి రసాయనాలు కనిపించాయి. జ‌గ‌న్ బ్రాండ్లు తాగితే ఆయుష్షు తీరిన‌ట్టేన‌ని ల్యాబ్ రిపోర్ట్ స్ప‌ష్టం చేస్తోంది.  1. దేశ‌మంతా డిజిట‌ల్ లావాదేవీలైతే ఏపీ మ‌ద్యం షాపుల్లో ఓన్లీ క్యాష్‌...నో బిల్‌ 2. మ‌ద్యం త‌యారీకి కావాల్సిన‌ ఇథైల్ ఆల్క‌హాల్ దేశంలో ఉత్ప‌త్తి లేదు.. విదేశాల నుంచి దిగుమ‌తీ లేదు 3. 10 రూపాయ‌లు క్వార్ట‌ర్ ఖ‌రీదైన ప్రెసిడెంట్ మెడ‌ల్ ని 150 అమ్ముతున్నారు 4. ఎక్స్‌ట‌ర్న‌ల్ యూజ్ మెడిసిన్స్ కోసం వాడే కెమిక‌ల్స్‌తోనే ఏపీ లిక్క‌ర్ త‌యారౌతోంది5.  మ‌ద్యం మ‌ర‌ణాల‌కు జె బ్రాండ్ మ‌ద్యమే కార‌ణ‌మ‌ని తేలిపోయింది. మద్యం త‌యారీలో 1. ఈఎన్ ఏ, 2. లిక్విడ్ ఇథైల్ అనేవి కీల‌కం. అయితే వీటికి ప్ర‌త్యామ్నాయంగా జే సిండికేట్ సైనేడ్ తో పాటు ఇత‌ర ప్ర‌మాద‌క‌ర‌మైన ర‌సాయ‌నాలు వాడి మ‌ద్యం త‌యారు చేసి ఏపీ ప్ర‌భుత్వ షాపుల్లో అమ్ముతున్నారు.  ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌(ఈఎన్‌ఏ) ఎలా త‌యారు చేస్తారంటే.....  బియ్యం, బియ్యం నూకలు, మొక్క‌జొన్న‌ ప్రాసెసింగ్‌ చేయడం ద్వారా తొలుత రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ తయారు చేస్తారు. దాన్ని మరింత శుద్ధి చేస్తే ఈఎన్‌ఏగా మారుతుంది. స్పిరిట్‌లో ప్యూరిటీ 66శాతం దాటితే ఈఎన్‌ఏగా పిలుస్తారు. ఎక్సైజ్‌ నిబంధనల ప్రకారం కనీసం 66 శాతం ప్యూరిటీ ఉన్న ఈఎన్‌ఏతోనే మద్యం తయారు చేయాలి. ఆ తర్వాత ఈఎన్‌ఏకు నీరు, రంగు, ఫ్లేవర్‌, మాల్ట్ లాంటివి కలిపి మద్యం ఉత్పత్తి చేస్తారు.  కానీ...జ‌గ‌న్  బ్రాండ్లను ఈఎన్‌ఏ కాకుండా నేరుగా రెక్టిఫైడ్‌ స్పిరిట్‌తోనే ఉత్పత్తి చేస్తున్నారు.  ఇక మ‌ద్యం త‌యారీలో కీల‌కమైన లిక్విడ్ ఇథైల్ ఆల్క‌హాల్ ను ఎలా త‌యారు చేస్తున్నారో చూస్తే....  జ‌గ‌న్ సిండికేట్‌ ఉత్ప‌త్తి చేస్తోన్న ల‌క్ష‌ల లీట‌ర్ల మ‌ద్యానికి స‌రిప‌డా  ఇథైల్ ఆల్క‌హాల్ రాష్ట్రంలో ఉత్ప‌త్తి కాలేదు. దేశంలోనూ లేదు.  ఇథైల్ ఆల్క‌హాల్ ఎంత దిగుమ‌తి చేసుకున్నారు అని ఒక స‌మాచార హ‌క్కు కార్య‌క‌ర్త అడిగితే అస‌లు దిగుమ‌తి చేసుకోలేద‌ని సంబంధిత శాఖ నుంచి స‌మాచారం అందింది.  మ‌ద్యం తయారీ అత్య‌వ‌స‌ర‌మైన ఇథైల్ ఆల్క‌హాల్ దేశీయంగా ఉత్ప‌త్తి లేకుండా,  దిగుమ‌తి చేసుకోకుండా ఏపీలో ప్ర‌మాద‌క‌ర బ్రాండ్ల త‌యారీకి వాడుతున్న ర‌సాయ‌నాలు ఏంట‌నేది ఎస్ జీ ఎస్ ల్యాబ్ ప‌రీక్ష‌ల్లో తేట‌తెల్ల‌మైంది.  ఇథైల్ ఆల్క‌హాల్‌కి బ‌దులుగా  ఎక్స్‌టెర్న‌ల్ మెడిసిన్ త‌యారు చేసేందుకు వాడే కెమిక‌ల్స్‌ని మ‌ద్యం త‌యారీకి వాడుతున్నారు.  ఆయిట్మెంట్లు, టాబ్లెట్లు, క్రీములు త‌యారు చేసుకునేందుకు త‌మ ఫార్మా కంపెనీలు దిగుమ‌తి చేసుకున్న కెమిక‌ల్స్‌నే మ‌ద్యం తయారీకి వాడేస్తున్నారు.  గ‌తంలో మండ‌లానికి ఓ మ‌ద్యం సిండికేట్‌వుండేది. ఇప్పుడు రాష్ట్ర‌మంతా జ‌గ‌న్ అనుచ‌రులు  సిండికేట్‌గా ఏర్ప‌డ్డారు. అమ్మేది ప్ర‌భుత్వం పేరుతోనైనా, త‌యారు చేసేది మాత్రం జె. సిండికేట్ డిస్టిల‌రీల్లోనే అనేది బ‌హిరంగ ర‌హ‌స్యం.  ఎస్పీవై  డిస్టలరీ వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేతిలో వుంది. ఇందులోంచి  ఎస్పీవై గెలాక్సీ బ్రాందీ, ఎస్పీవై చాంపియన్ విస్కీ, ఎస్పీవై, సెలబ్రిటీ బ్రాందీ,  వైట్ టస్కర్, దారు హౌస్ బ్రాండ్లు త‌యారు చేస్తున్నారు.  మంత్రి బొత్స సత్యనారాయణకు చెందిన  అదాన్, లీల డిస్టలరీలు  సుప్రీం విస్కీ, బ్రిలియంట్ విస్కీ త‌యారు చేసి ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల ద్వారా అమ్ముతున్నారు.  క‌మీష‌న్లు ఇచ్చుకోలేని డిస్టిల‌రీలు జ‌గ‌న్ అనుచ‌రుల‌కే లీజుకిచ్చేశారు. 2 వేల‌కి పైగా బ్రాండ్ల‌న్నీ వీరే త‌యారు చేస్తూ అమ్ముతున్నారు. అన్నీ క్యాష్ ట్రాన్సాక్ష‌న్స్‌, నో బిల్‌. దేశ‌మంతా డిజిట‌ల్ లావాదేవీలు జ‌రుపుతుంటే ఏపీ ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల‌లో ఓన్లీ క్యాష్. నో బిల్‌. అతి పెద్ద దోపిడీ ఇలా సాగుతోంది.  టిడిపి హ‌యాంలో ఏడాదికి 6 వేల‌కోట్లు... అమ్మాకాలుండేవి. వైసీపీ ప్ర‌భుత్వం 20 వేల కోట్ల మ‌ద్యం ఏడాదికి అమ్ముతోంది. సిండికేట్ త‌యారుచేసిన ఈ మ‌ద్యం అమ్మ‌కాల నుంచి నెల‌కి 200 కోట్లు నేరుగా జ‌గ‌న్ కు అందేలా  వైఎస్ అనిల్ రెడ్డి చూసుకుంటార‌ట‌.  ఏపీ లిక్క‌ర్ స్కాం సంబంధించిన కీల‌క ఆధారాలు త‌న వ‌ద్ద వున్నాయ‌ని మాజీ సి.ఎం. చెబుతున్నారు. ఈ స్కాంలో మిథున్‌రెడ్డి పాత్ర గురించి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఏం చెబుతారోన‌నే ఉత్కంఠ‌త నెల‌కొంది.

జనసేన తీర్థం పుచ్చుకున్న మండలి బుద్ద ప్రసాద్..  పొత్తులో భాగంగా అవనిగడ్డ నుంచి పోటీ 

రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్ దక్కని నేతలు పక్క పార్టీలోకి చేరి టికెట్ దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు ఇద్దరు జనసేనలో చేరిపోయారు. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న మండలి బుద్ధ ప్రసాద్, నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో వీరు జనసేన పార్టీలో చేరారు. మరోవైపు జనసేన తరుఫున మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పాలకొండ, అవనిగడ్డ స్థానాల కోసం జనసేన గెలుపు గుర్రాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో పాలకొండ టికెట్ నిమ్మక జయకృష్ణకు, అవనిగడ్డ సీటు మండలి బుద్ధ ప్రసాద్‌కు ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. పొత్తులో భాగంగా అవనిగడ్డ, పాలకొండ స్థానాలు జనసేనకు వెళ్లాయి. దీంతో గతంలో ఇక్కడి నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసిన మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణకు నిరాశ ఎదురైంది. దీంతో టీడీపీకి గుడ్ బై చెప్పిన ఇద్దరు నేతలు జనసేన కండువా కప్పుకున్నారు. అవనిగడ్డ, పాలకొండ స్థానాలలో పలువురు పేర్లతో జనసేన సర్వేలు చేయించింది. 21 స్థానాల్లోనూ కచ్చితంగా గెలవాలని పట్టుదలగా ఉన్న పవన్ కళ్యాణ్.. సరైన అభ్యర్థిని ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆ రెండు స్థానాలకూ అభ్యర్థుల ప్రకటనను పెండింగ్ పెడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే సీనియర్ నేతలైన వీరికి అవకాశం ఇవ్వాలని పవన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోం

కాంగ్రెస్ 117 అసెంబ్లీ, 17 లోకసభ స్థానాలు ఖరారు... కడప నుంచి షర్మిల పోటీ

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేసే స్థానం పై దాదాపు స్పష్టత  వచ్చేసింది. ముందుగా ఊహించినట్టే  ఆమె కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. ఢిల్లీలో సోమవారం ఉదయం జరిగిన కాంగ్రెస్ సీడబ్ల్యుసి  సమావేశంలో ఆమేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  అయితే అధికారికంగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వవైభవాన్ని తీసుకురావాలని ఉవ్విళ్లూరుతోంది.  ఉమ్మడి రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉండేది. ఆ తర్వాత మళ్లీ పగ్గాలు చేపట్టలేదు. ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ వారసురాలు వైఎస్ షర్మిలను  కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‎లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా సిద్దం చేసింది అధిష్ఠానం. గత దశాబ్ధంగా పోటీ చేసినప్పటికీ నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా హస్తం పార్టీకి రాలేదు. ఈ నేపథ్యంలోనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాలకు గట్టిపోటీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. మొత్తం ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. అయితే 58 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలను పెండింగ్‎లో ఉంచింది. వీటిని మినహా మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనకు సానుకూలంగా ఉంది సీఈసీ. 117 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కూడా ఖరారు చేసింది. రేపు అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇదిలా ఉంటే విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఎవరు ఏ ఏ స్థానాల నుంచి బరిలో నిలువనున్నారో ఇప్పుడ చూద్దాం. కడప పార్లమెంట్‌ బరిలో వైఎస్ షర్మిల నిలబడనున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ నుంచి తన కుటుంబసభ్యుడు అవినాశ్ రెడ్డిపై పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. రాజమండ్రి పార్లమెంట్‌ బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నట్లు సమాచారం. అలాగే కాకినాడ బరిలో మాజీ ఎంపీ పల్లంరాజు, విశాఖ పార్లమెంట్ బరిలో సినీ నిర్మాత సత్యారెడ్డి, ఏలూరు లోక్‌సభ ఎన్నికల బరిలో లావణ్య పోటీ చేయనున్నారు. ఇక అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్‌, రాజంపేట నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో నజీర్‌ అహ్మద్, చిత్తూరు నుంచి చిట్టిబాబు, హిందూపురం నుంచి షాహీన్ పేర్లు వినిపిస్తున్నాయి.  

ఫ్రస్ట్రేషన్ లో కేశినేని నాని.. మూడు నెలలు పెన్షన్లు రావంటూ బెదరింపులు

తెలుగుదేశంతో కేశినేని నాని పొలిటికల్ జర్నీ బ్రేక్ అయిన క్షణం నుంచీ ఆయన తన రాజకీయ భవిష్యత్ పై ఆందోళనలో ఉన్నారు. వరుసగా రెండు సార్లు ఎంపీ కావడానికి కారణమైన తెలుగుదేశం పార్టీని అహంభావంతో వీడి.. వైసీపీ గూటికి చేరిన కేశినేని నానికి... ఇప్పుడు భవిష్యత్ గందరగోళంగా కనిపిస్తోంది. పార్టీని వీడి విజయవాడ ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేయడానికి  టికెట్ సంపాదించుకున్నా.. గెలిచే అవకాశాలు ఇసుమంతైనా కనిపించకపోవడంతో ఫస్ట్రేషన్ పీక్స్ కు చేరింది. దీంతో ఈసీ ఆదేశాలకు సైతం వక్రభాష్యాలు చెబుతూ జనాలను బెదరించడానికి కూడా వెనుకాడటం లేదు.   విజయవాడ లోక్ సభ నియోజకవర్గంలో తెలుగుదేశంను కాదని విజయం సాధించడం సాధ్యం కాదన్న విషయం రోజు రోజుకూ విస్పష్టంగా అర్ధమౌతుండటంతో ఆయనలో నిరాశ నిస్ఫృహలు నెలకొన్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు ఆయన మాటలను ఉటంకిస్తూ విశ్లేషణలు చేస్తున్నారు. తాజాగా వాలంటీర్లను పించన్ల పంపిణీకి దూరంగా ఉంచాల్సిందేనంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై నాని చేసిన వ్యాఖ్యలకు ఆయన నమ్ముకుని వచ్చిన వైసీపీ నుంచీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వచ్చే మూడు నెలల వరకూ వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు రావనీ, వాళ్లు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనీ కేశినేని నాని హెచ్చరిస్తున్నారు. ఒక విధంగా వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలంటూ ఈసీ ఆదేశాలకు  తెలుగుదేశం పార్టీ వాలంటీర్లపై ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులే కారణమని చెబుతున్నారు.  పేదులు ఇబ్బందులు పడతారు, మూడు నెలలు పింఛన్లు అందకపోతే  మందులు, ఇతర నిత్యావసరాల కొనుగోలుకు వారి వద్ద డబ్బులు ఉండవు అంటూ మీడియా సమావేశంలో కేశినేని చెప్పారు.  అయితే పింఛన్ల పంపిణీని నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించలేదు. ఆ పంపిణీ నుంచి వాలంటీర్లను మాత్రమే దూరం పెట్టింది. అలాగే పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరం చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులలో  వీటిని ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని విస్పష్టంగా పేర్కొంది.    ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండేందుకు వాలంటీర్లను మాత్రమే నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆ ఆదేశాలకు కేశినేని నాని వక్రభాష్యం చెబుతున్నారు.  కేశినేని నాని చెప్పిన దాని ప్రకారం  జగన్ పింఛన్లు నిలిపివేయాలని లేదా పంపిణీలో మరిన్ని ఇబ్బందులు సృష్టించాలని అధికారులను ఆదేశించారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్ కు అలా   ఆదేశాలిచ్చే అధికారాలు లేవు. అయినా అధికారులలో తనకు తొత్తులుగా ఉన్నవారి ద్వారా ఇటువంటి ఆదేశాలు అమలు అయ్యేలా ఏమైనా కుట్రలకు తెరతీశారా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యేలా కేశినేని మాటలు ఉన్నాయి.    పింఛన్లు సక్రమంగా అందకుండా అవరోధాలు సృష్టించడం ద్వారా వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందని , కుట్రపూరితంగా ప్రతిపక్షాలు వాలంటీర్లపై ఆరోపణలు, ఫిర్యాదులు గుప్పించి, ఆ వ్యవస్థను స్తంభింప చేసి ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశారనీ జనం అనుకునేలా చేయాలన్న లక్ష్యంతో జగన్  కుట్రలు చేస్తున్నారా అన్న అనుమానాలు తావిచ్చేలా కేశినేని నాని మాటలు ఉన్నాయన్న విమర్శలు అన్ని వర్గాల నుంచీ వ్యక్తం అవుతున్నాయి. కేశినేని తన వ్యాఖ్యల ద్వారా.. జగన్ ప్లాన్ బయటపెట్టేసినట్లైందని వైసీపీ వర్గాలు సైతం నానిపై గుర్రుగా ఉన్నారు. మొత్తం మీద వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు అందవంటూ కేశినేని చేసిన వ్యాఖ్యలు ఒక విధంగా జగన్ సర్కార్ ఎత్తుగడను దెబ్బ తీశాయని పరిశీలకులు అంటున్నారు. ఈ విషయమై ఇప్పుడు తెలుగుదేశం సీరియస్ గా  సీఎస్ కు, ఎన్నికల సంఘానికి లేఖలు రాయడం ద్వారా విషయాన్ని పబ్లిక్ చేశాయనీ, ఇప్పుడు ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని అర్హులందరికీ పింఛన్లు నేరుగా ఇళ్ల వద్దనే అందించాలంటూ ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయనీ అంటున్నారు.  

కూతుళ్లే  బంగారం...తండ్రుల రాజకీయం వర్కవుట్ అవుతోందా? 

దేశంలో వారసత్వ రాజకీయాలు ఇప్పటివి కావు. దాదాపు అర్థ శతాబ్ది క్రితం నుంచే కొనసాగుతున్నాయి. తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఎందరో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే వారసత్వాన్ని కొనసాగించినంత మాత్రాన అందరూ పదవుల్లో రాణించలేరు. స్వయం ప్రతిభ ఉంటే తప్ప రాజకీయ చదరంగంలో నిచ్చెనలు ఎక్కలేరు. సుదీర్ఘ కాలం మనలేరు. స్వయం ప్రతిభలేని చాలామంది రాజకీయాల్లోకి వచ్చిన కొద్ధి కాలానికే తెరమరుగైన ఉదంతాలు ఉన్నాయి. భారత రాజకీయాల్లో ఒకరు ముఖ్యమంత్రి  అయ్యారు.  సీఎం పీఠాలు అధిష్టించిన కొడుకుల సంగతి పక్కన పెడితే.. కుమార్తెలు కూడా తండ్రి వారసత్వాన్ని అందుకొని పార్టీ  అందలం ఎక్కారు. వారసత్వంగా జమ్ము కశ్మిర్ లో     మెహబూబ్ ముఫ్తి  సీఎం అయ్యారు.  తెలంగాణ రాజకీయాల్లో ఇపుడు తండ్రి, కూతుళ్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీళ్లంతా బిఆర్ ఎస్ ముఖ్య నేతలు, వారి కూతుళ్లే కావడం గమనార్హం.మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయ, గారాల పట్టీ కల్వకుంట్ల కవిత తెలంగాణ మలిదశ  ఉద్యమ సమయంలో రాజకీయాల్లో వచ్చి, జాగృతి సంస్థను స్థాపించి అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టి వార్తల్లోకెక్కారు. అంతకుముందు ఆమె  అమెరికాలో సాప్ట్ వేర్  ఉద్యోగిగా పని చేశారు. 2014 లోకసభ ఎన్నికల్లో కవిత నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైనప్పటికీ 2019 లోకసభ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. దీంతో  తండ్రి కెసీఆర్  ఆమెకు ఎంఎల్సి పదవి ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  కవిత  ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. తన కూతురు ను అరెస్ట్ కాకుండా గతంలో చక్రం తిప్పిన కెసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత అరెస్ట్ ను అడ్డుకోలేకపోయారు.  బిజెపి ప్రభుత్వాన్ని నిందించడం వంటివి చేయలేదు. కవిత విషయంలోతన అన్న, మాజీ మంత్రి  కెటీఆర్  వెన్నెంటే ఉన్నప్పటికీ కెసీఆర్ నోరు మెదపకపోవడం గమనార్హం.  మరో బిఆర్ఎస్ నేత, మాజీ డిప్యూటి సీఎం  కడియం కూతురు కడియం కావ్య రాజకీయాల్లో కొత్తగా పరిచయం అయ్యారు. తండ్రి ఇన్ ఫ్లూయెన్స్ తో ఆమెకు ఈ ఎన్నికల్లో వరంగల్ లోకసభ స్థానం టికెట్ ను బిఆర్ఎస్ పార్టీ ఇచ్చింది.  కెసీఆర్ ఫోన్ ట్యాపింగ్ , అవినీతివార్తలు వెలువడటంతో ఇటీవలికాలంలో  బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరికలు ఎక్కువయ్యాయి.  తండ్రితో బాటు  ఆమె కూడ  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కడియం కావ్య   ఎంబిబిఎస్ పూర్తి చేసి ఉస్మానియా మెడికల్ కాలేజి నుంచి పాథాలజీ ఎండీ పూర్తి చేశారు.  అయినప్పటికీ కడియం ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం  కాకతీయ మెడికల్ కాలేజి రెసిడెంట్ డాక్టర్ గా పని చేస్తున్నారు.  కడియం కావ్య తండ్రి వారసత్వంగా రాజకీయాల్లో వచ్చారు బిఆర్ఎస్ లో అనేకమంది వరంగల్ టికెట్ కోసం పోటీ పడినప్పటికీ కెసీఆర్ కడియం కావ్యకు పెద్ద పీట వేస్తూ వరంగల్ లోకసభ నుంచి కావ్య పోటీ చేస్తుందని అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్ అయిన కొద్దిగంటలకే ఆమె బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తాను బిఆర్ఎస్ నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించారు. కావ్య తండ్రి కడియం శ్రీహరి వల్లే తాను బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన మరో మాజీ  డిప్యూటిసీఎం తాటికొండ రాజయ్య తన రాజీనామా ఉపసంహరించుకుని తాను వరంగల్ స్థానం ఆశిస్తున్నట్లు ప్రకటించారు.   రెండు సార్లు బిఆర్ఎస్ నుంచి రాజ్య సభ సభ్యులుగా ఉన్న కె. కేశవరావ్ బిఆర్ఎస్ అధ్యక్షుడైన కెసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఈ కారణంగా ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మికి మేయర్ అవకాశం ఇచ్చారు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన గద్వాల విజయ లక్ష్మి రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. కేశవరావ్ కుమారుడు విప్లవ్ కుమార్ పై  మర్డర్ కేసు ఆరోపణలున్నప్పటికీ కెసీఆర్ కెకె ఫ్యామిలీకి పూర్తి సహకారం అందించారు. మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కెకె తన మాతృ సంస్థలో చేరడానికే బిఆర్ఎస్ కు  కూతురుతో సహా రాజీనామా చేశారు. కెసీఆర్ ఉంటున్న ఫామ్ హౌజ్ కు వెళ్లి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. తన తండ్రి బిఆర్ఎస్ కు రాజీనామా చేయడం పట్ల కొడుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వయసులో రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడం ఎందుకని ప్రశ్నించారు. కొడుకు వ్యతిరేకిస్తున్నప్పటికీ కేశవరావ్ కూతురుతో సహా  కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. ఒక నాన్నకు కూతుళ్లే బంగారం అని నిరూపించారు ఈ ముగ్గురు రాజకీయ నేతలు. తెలంగాణ రాజకీయాల్లో ఇపుడు తండ్రి, కూతుళ్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి పుత్రికల కోసం తండ్రులు చేసే ఈ రాజకీయం వర్కవుట్ అవుతోందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. 

కేసీఆర్ ది బస్సు యాత్రా.. బల ప్రదర్శనా.. రైతులతో అసహనం!

పదేళ్ల పాటు అధికారంలో ఉండి.. తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన కేసీఆర్ ఇప్పుడు ప్రతి విషయంలోనూ ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ ఓటమి తరువాత ఆయనకు ఏదీ కలిసిరావడం లేదు. జాతీయ రాజకీయా ఆకాంక్షలతో ఆకాశానికి నిచ్చెన వేసిన ఫలితం వ్రతమూ చెడింది. ఫలమూ దక్కలేదన్నట్లుగా తయారైంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయంతో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. దీంతో జాతీయ రాజకీయాల ఊసెత్తడానికి కూడా కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు భయపడే పరిస్థితి ఏర్పడింది. అసలు లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలలో నిలబెట్టేందుకు అభ్యర్థులే కరవైన పరిస్థితి. పిలిచి టికెట్టిచ్చినా పోటీ నుంచి నేతలు తప్పుకుంటున్న పరిస్థితి.  ఎలాగోలా తంటాలు పడి అభ్యర్థులను నిలబెట్టినా.. రాష్ట్రంలో ఒకటి రెండు లోక్ సభ స్థానాలలో విజయం సాధించడమే గగనమంటూ సర్వేలు చెబుతున్నాయి. ఈ స్థితిలో అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత ఇప్పటి వరకూ పెద్దగా ప్రజల ముందుకు రాని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరువు కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు అంటూ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించారు. అయితే  ఆయన బస్సు యాత్ర ఆద్యంతమ జనంతో సంబంధం లేకుండానే సాగింది. వంద కార్ల భారీ ర్యాలీతో సాగిన కేసీఆర్ బస్సు యాత్రను రైతులు పెద్దగా పట్టించుకోలేదు. ఎల్ నినో కారణంగా వర్షాలు పడక నీటి వనరులు తగ్గిపోయి, రిజర్వాయర్లు ఎండిపోయి సాగుకు నీరందకుండా పోయింది. వాస్తవమే. అయితే  ఇంతటి కరవుకు కారణం రేవంత్ పాలనే అంటూ కేసీఆర్ చేసిన విమర్శలను రైతులు పట్టించుకోలేదు. రేవంత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి పట్టుమని ఆరు నెలలు కూడా కాలేదు. అయినా ప్రభుత్వ పని తీరును అంచనా వేయడానికి కొంత సమయం ఇవ్వాలి కదా? అన్న చర్చ రైతుల్లోనే జరుగుతోంది. అందుకే కేసీఆర్ రేవంత్ సర్కార్ పై సంధించిన విమర్శనాస్త్రాలను రైతులు పట్టించుకోలేదు. కేసీఆర్ ప్రసంగాలకు, విమర్శలకు జనం నుంచి స్పందనే కనిపించలేదు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్న పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకుని రేవంత్ సర్కార్ ను ఎండగట్టాలన్న కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టినట్లుగానే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తన  పదేళ్ల పాలనలో నీటి కష్టాలు లేవని, రైతులు సంతోషంగా ఉన్నారనీ, అధికదిగుబడి సాధించారనీ, ఇప్పుడు  రైతులకు అన్ని రకాల సమస్యలు తెచ్చిపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ రైతులను రెచ్చగొట్టి తద్వారా  లోక్ సభ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించాలన్న కేసీఆర్ వ్యూహం ఫలించినట్లు కనిపించడం లేదు.  ఏసీ, ఫ్రిజ్, సౌకర్యవంతమైన పడకలు, సోఫాలు వంటి అన్ని హంగులూ ఉన్న బస్సులో కూర్చుని వందకు పైగా కార్లు వెనుక కాన్వాయ్ గా వస్తుండగా సాగిన కేసీఆర్ బస్సు యాత్ర ఆయన అహానికి అద్దం పట్టింది కానీ, రైతులను ఆకట్టుకోలేకపోయింది.  అసలు కేసీఆర్ పాలనను జనం వ్యతిరేకించి గద్దె దింపడానికి ప్రధాన కారణాలలో ఒకటి అహంకారపూరితమైన ఆయన తీరు. అధికారంలో ఉండగా ఎన్నడూ ప్రజలతో మమేకం కావడానికి ఆయన ఇష్టపడలేదు. ప్రజాసమస్యలపై నిర్లక్ష్యంగా స్పందించారు. ప్రజాందోళనలను అణచివేశారు. ఈ కారణాలతోనే కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు విపక్ష నేతగా కూడా ఆయన అధికారంలో ఉన్నప్పటి దర్పాన్ని ప్రదర్శించడం, కష్టాలలో ఉన్న రైతల పరామర్శకు కూడా మంది మార్బలంతో రావడంతో జనంలొ  కేసీఆర్ బల ప్రదర్శనకు వచ్చారు తప్ప, తమ కష్టాలను చూసి ఓదార్చి స్వాంతన చేకూర్చేందుకు కాదన్న అభిప్రాయం కలిగేలా చేసింది.    

చెన్నై ఓడింది కానీ ధోనీ గెలిచాడు!

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు, ఎంఎస్ ధోనీకి ఉన్న ప్రాధాన్యత, ప్రాముఖ్యత తెలియంది కాదు. 16 సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా జట్టును ముందుండి నడిపించిన ధోనీ.. ఈ సారి మాత్రం సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. జట్టు భవిష్యత్ అవసరాల కోసం ధోనీ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగి అందరి మనసులనూ గెలుచుకున్నాడు. కొత్త సారథి గైక్వాడ్ జట్టును ధోనీ సలహాలూ సూచనలతో విజయ పథంలో నడిపిస్తూ మన్ననలు అందుకుంటున్నాడు. ముంబై ఇండియన్స్ కూడా తన జట్టు కేప్టెన్ ను మార్చింది. కొత్త సారథిగా బాధ్యతలు చేపట్టిన హార్ధిక్ పాండ్యా మాత్రం తన ఆటిట్యూడ్ తో జట్టు సహచరులు, అభిమానుల ఆదరణకు దూరమయ్యాడు.  జట్టు అభిమానులు కూడా ఓటమిని కోరుకుంటున్నారంటే సారథిగా పాండ్యా వైఫల్యం ఏమిటో ఇట్టే అవగతమౌతుంది.  సరే విషయానికి వస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో తొలి పరాజయాన్ని ఆదివారం (మార్చి 31) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో అందుకుంది. అయితే ధోనీ మాత్రం ప్రేక్షకుల మనస్సులను గెలుచుకున్నాడు. నాలుగు పదులు పైబడిన వయస్సులో కూడా తనలోని బ్యాటింగ్ పటిమ ఇసుమంతైనా తగ్గలేదని నిరూపించుకున్నాడు.   వైజాగ్  వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో  చెన్నై సూప‌ర్ కింగ్స్ పై  ఢిల్లీ క్యాపిట‌ల్స్ 20 ప‌రుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.  బ్యాటింగ్ లో పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్, మిచెల్ మార్ష్ రాణించారు.  దీంతో ఢిల్లీ క్యాపిటల్ నర్ణీత 20 ఓవర్లలో  191 పరుగుల భారీ స్కోరు సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 171 పరుగులు మాత్రమే చేసి ఈ సీజన్ లో తొలి ఓటమిని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో పరాజయం పాలైన ధోనీ ఫామ్ లోకి రావడంపై చెన్నై అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సీజన్ లో తొలి సారిగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కిన ధోనీ తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించాడు. ఆడినంత సేపూ పాత ధోనీని తలపించాడు. ధోనీ హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ మొత్తం అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన తొలి రోజుల నాటి ధోనీని తలపింపచేశాయి. ఈ మ్యాచ్ లో ధోనీ తాను ఎదుర్కొన్న 16 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 37 పరుగులు సాధించి అజేయంగా  నిలిచాడు.   

ఖ‌మ్మం బ‌రిలో నంద‌మూరి సుహాసిని..? నామాకు బిగ్‌షాక్ ?!

తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలోకి రోజురోజుకు వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్ గూటికి చేరేందుకు పోటీలు పడుతున్నారు.  ఇప్ప‌టికే ప‌లువురు సిట్టింగ్ ఎంపీలు  బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు.  తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి, ఆయ‌న కుమార్తె క‌డియం కావ్య‌, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీలు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత ద‌గ్గ‌రి వ్య‌క్తిగా పేరున్న కె.కేశ‌వ‌రావుసైతం బీఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో నంద‌మూరి సుహాసిని సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు  రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతున్నది.  రెండు రోజుల క్రితం నంద‌మూరి సుహాసిని సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్ మున్షీల‌తో భేటీ అయ్యారు. కేవ‌లం మ‌ర్యాద‌పూర్వ‌క భేటీ అని చెబుతున్న‌ప్ప‌టికీ.. ఆమె త్వ‌ర‌లో కాంగ్రెస్ గూటికి చేర‌నున్నారనీ,  ఖ‌మ్మం లోక్ సభ  నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నార‌ని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృత ప్ర‌చారం జ‌రుగుతున్నది. సార్వత్రిక ఎన్నిక‌ల్లో భాగంగా మే13న తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్ స‌భ స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే అధికార కాంగ్రెస్‌, విప‌క్ష బీఆర్ ఎస్‌, బీజేపీలు ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంకా.. ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ తోపాటు మరి కొన్ని పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. ఖ‌మ్మం పార్ల‌మెంట్ స్థానం నుంచి ఆశావ‌హుల సంఖ్య భారీగా ఉంది. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి త‌మ్ముడు పొంగులేటి ప్ర‌సాద్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క స‌తీమ‌ణి నందినితో పాటు మ‌రో మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కుమారుడు, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్ హ‌నుమంత‌రావు కూడా ఖ‌మ్మం పార్ల‌మెంట్ స్థానం నుంచి పోటీచేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో నంద‌మూరి సుహాసిని పేరు తెర‌పైకి రావ‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నంద‌మూరి సుహాసిని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.  2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా  తెలుగుదేశం అభ్యర్థిగా   కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేసి  ఓట‌మి పాల‌య్యారు. సుహాసిని ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఇటీవ‌ల ఆమె సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీని క‌లిశారు.   ఖచ్చితంగా రాజకీయ ఎజెండాతోనే సమావేశం జరిగి ఉంటుందని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ రాష్ట్రంలోని లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జిల‌ను ఆదివారం నియ‌మించారు. ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జిగా మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డిని నియ‌మించారు. దీంతో పొంగులేటి త‌మ్ముడు ప్ర‌సాద్ రెడ్డి పార్ల‌మెంట్ స్థానం నుంచి బ‌రిలోకి దిగ‌బోతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల స‌మాచారం. అయితే, నంద‌మూరి సుహాసినీ పేరుకూడా అధిష్టానం ప‌రిశీల‌నలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఖ‌మ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు ఉమ్మ‌డి ఖ‌మ్మం  జిల్లాలో ప‌ది స్థానాల‌కు తొమ్మిది స్థానాల్లో విజ‌యం సాధించ‌డానికి తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల మద్దతే  ఓ కార‌ణమ‌ని అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌లోనే కాుండా, ప్ర‌స్తుత  పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌లో కూడా  తెలంగాణ‌లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది.  ఒక అంచనా ప్రకారం ఖ‌మ్మంలో కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ పార్టీ అభ్య‌ర్థుల‌ మ‌ధ్య‌నే పోరు ఉండే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే బీఆర్ఎస్   సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావుకే మ‌రోసారి టికెట్ కేటాయించింది. నామా నాగేశ్వ‌ర‌రావు  తెలుగుదేశం నుంచి వ‌చ్చిన వ్య‌క్తే కావ‌డంతో ఆయ‌నకు తెలుగుదేశం క్యాడ‌ర్ తో ద‌గ్గ‌రి సంబంధాలు ఉన్నాయి. ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ క్యాడ‌ర్ తో పాటు, తెలుగుదేశం క్యాడ‌ర్ కూడా నామాకు మ‌ద్ద‌తుగా నిలిచే అవ‌కాశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో కేసీఆర్ నామాకే టికెుట్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ వ్యూహం మార్చి తెలుగుదేశం క్యాడర్ నామా వెంట వెళ్ల‌కుండా ఉండేందుకు నందమూరి  సుహాసినీని ఖ‌మ్మం బ‌రిలో నిలపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  నందమూరి సుహాసినీని ఖ‌మ్మం బ‌రిలో నిలిపితే కాంగ్రెస్ క్యాడ‌ర్ తో పాటు టీడీపీ బ‌లం కూడా తోడ‌వుతుంద‌ని, త‌ద్వారా కాంగ్రెస్ విజ‌యం న‌ల్లేరుపై బండిన‌డ‌క అవుతుంద‌ని పార్టీ అధిష్టానం భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే, ఇప్ప‌టికే ఖ‌మ్మం పార్ల‌మెంట్ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ నేత‌లే పోటీప‌డుతున్నారు. వీరంద‌రినీ కాద‌ని సుహాసినీని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇస్తే.. పార్టీలో ఉన్న నేత‌ల స‌హ‌కారం ఎంత‌మేర‌కు ఆమెకు ఉంటుంద‌నేది కూడా ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. అయితే, నంద‌మూరి సుహాసిని తెలుగుదేశం పార్టీని వీడే అవ‌కాశాలు లేవ‌ని, కేవ‌లం  రేవంత్ రెడ్డితో నంద‌మూరి కుటుంబానికి ఉన్న సత్సంబంధాల కార‌ణంగానే మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఆమె సీఎంను క‌లిశార‌ని తెలుగుదేశం వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఖ‌మ్మం ఎంపీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేంత వ‌ర‌కు ఇలాంటి ఊహాగానాలు తెర‌పైకి వ‌స్తూనే ఉంటాయ‌ని ప‌లువురు పార్టీ సీనియ‌ర్ నేత‌లు పేర్కొంటున్నారు.

లోకేష్ కు జడ్ భద్రత.. వైసీపీకి ఉలుకెందుకు?

కింద పడ్డా పై చేయి మాదేనని వాదిస్తారు కొందరు. తమ తప్పిదాలన్నిటినీ ఇతరుల మీద నెట్టేసి పబ్బం గడిపేయాలని ప్రయత్నిస్తుంటారు ఇంకొందరు. ఇప్పుడు వైసీపీ సరిగ్గా అదే చేస్తోంది. అధికారంలో ఇన్న ఈ ఐదేళ్ల కాలంలో విపక్ష నేతల భద్రతను కుదించి, వారిపై దాడులకు దారులు తెరిచేసింది. జడ్ ప్లస్ భద్రత ఉన్న తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపైనే పలు మార్పు దాడులు జరిగాయి. ఆయన తరచుగా వెళ్లే  తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైనే వైసీపీ దాడికి పాల్పడింది. కర్రలు, రాడ్లతో బీభత్సం సృష్టించింది. అలాగే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా జరిగిన దాడియత్నాల గురించైతే చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి  అనంతరం కేంద్ర హోం శాఖ, చంద్రబాబు భద్రత చూసే ఎస్పీజీ రాష్ట్రంలో పర్యటించి ఆయన భద్రతపై సమీక్ష జరిపి అదనపు భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పడు లోకేష్ కు కూడా జడ్ కేటగరి భద్రతను కల్పిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది.  రాష్ట్రంలో విపక్ష నేతలకు భద్రత లేని పరిస్థితి ఉందని కేంద్ర హోం శాఖ భావిస్తున్నదంటే అర్ధం ఏమిటి? ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లే కదా? అయితే వైసీపీ మాత్రం అలా చెప్పదు. ఆ పార్టీ అధినేత నుంచి నేతల వరకూ అందరిదీ ఒకే బాణి తమ తప్పులన్నీ ఎదుటి వారికి ఆపాదించేసి తాము సుద్దపూసలమన్నట్లు చెబుతారు. వైఎస్ వివేకా హత్య నుంచి మొదలు పెడితే.. ఈ ఐదేళ్ల కాలంలో వైసీపీ తాను చేసిన అరాచకాలు, అఘాయిత్యాలూ, అక్రమాలు అన్నిటినీ తెలుగుదేశం పార్టీకి ఆపాదించి, తన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకోవడమే. తాజాగా లోకేష్ కు జడ్ కేటగరి భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించడంపై కూడా ఘనత వహించిన మంత్రి బొత్స సత్యనారాయణ అదే చేశారు. వైసీపీకి ఉన్న జనాదరణ చూసి తెలుగుదేశం వణికిపోతోందన్నట్లుగా మాట్లాడారు. రాష్ట్రంలో మరో సారి జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమనీ, అది జరిగితే తమకు ముప్పు అన్న భయంతోనే కేంద్రంలో తమకున్న పలుకుబడిని ఉపయోగించి చంద్రబాబు తనయుడికి జడ్ కేటగరి భద్రత కల్పించుకున్నారని బొత్స అంటున్నారు. అదే సమయంలో మంత్రిగా ఉన్న తనకే ఆ స్థాయి భద్రత లేదని చెప్పుకున్నారు. ఆయన మాటలను బట్టే రాష్ట్రంలో వైసీపీ వారి భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదనీ, ఉన్న ముప్పల్లా విపక్ష నేతలకేననీ ఎవరికైనా సులువుగా అర్ధం అయిపోతుంది. కానీ వైసీపీకీ మాత్రం అన్నీ రివర్స్ లోనే అవగతమౌతాయి. బొత్స మాటల తీరు కూడా అలాగే ఉంది.   

జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ

అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి బెయిలు రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం (ఏప్రిల్ 1) విచారించనుంది. అలాగే జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయనే దాఖలు చేసిన మరో పిటిషన్ కూడా సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. రెండు పిటిషన్లనూ కలిసి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం (ఏప్రిల్ 1) సోమవారం విచారించనుంది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్  గత పదేళ్లుగా బెయిలు మీదే ఉన్నారనీ, ఆయన  బెయిలు రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేయాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం గత జనవరిలోనే తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో  రఘురామకృష్ణం రాజుపై అనర్హత పిటిషన్ వేసినందునే ఆయన జగన్ బెయిలు రద్దు చేయాలన్న పటిషన్ వేశారంటూ ముకుల్ రోహత్గి చేసిన వాదనను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం, ఈ కేసు విషయంలో తాము రాజకీయాల జోలికి పోవడం లేదనీ, కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఆ సందర్భంగా జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యంపై సీబీఐని నిలదీసింది. విచారణ జాప్యానికి బాధ్యులెవరని ప్రశ్నించింది. దీనికి సీబీఐ తరఫు న్యాయవాది విచారణలో జాప్యం, వాయిదాలతో తమకు సంబంధం లేదని చెప్పారు. దాంతో  సీరియస్ అయిన సుప్రీం అయితే ఎవరికి సంబంధం ఉంటుందని సూటిగా ప్రశ్నించింది. ఆ సమయంలో జోక్యం చేసుకున్న రఘురామకృష్ణం రాజు తరఫు న్యాయవాది సీబీఐ, జగన్ కుమ్మక్కై కేసు విచారణను జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హై ప్రొఫైల్ కేసుల విచారణను త్వరిత గతిన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన ఆదేశాలు ఇచ్చిన అంశాన్ని జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టులో ప్రస్తావించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జగన్ కేసుల విచారణ ఎంత త్వరగా తేలుతుందో చూద్దామని సుప్రీం ధర్మాసనం  వ్యాఖ్యానించింది. కాగా ఏపీ సీఎం జగన్ బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామరాజు సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు పిటిషన్లను  సుప్రీం ధర్మాసనం జనవరి 19 విచారణ జరిపింది. జగన్ బెయిల్ రద్దు, ట్రాన్స్ ఫర్ పిటిషన్లపై సీబీఐకి గతంలోనే సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసిన సంగతి విదితమే.  జగన్ బెయిలు రద్దు, ట్రాన్స్ ఫర్ పిటిషన్ల  విచారణను ఏప్రిల్ కు 1కు వాయిదా వేసింది. దీంతో ఆ పిటిషన్ ఇప్పుడు విచారణకు వచ్చింది. 

పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు దూరం.. ఎన్నికల సంఘం అదేశాలతో వైసీపీ ఆటకట్టేనా?

జగన్ చేత జగన్ కొరను జగనే ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థ సేవలు ఇప్పుడు జగన్ కు అందకుండా పోతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన ఇన్ని రోజులకు  ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలన్న ఆదేశాలివ్వడమే కాకుండా వారి ఫోన్లలో ఉన్న సిమ్ కార్డులను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.  పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై   వైసీపీ నేతలు తెలుగుదేశంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. వాలంటీర్లపై ఫిర్యాదు చేసి సామాజిక పింఛన్ల పంపిణీని తెలుగుదేశం అడ్డుకుంటోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  వాలంటీర్లకు పింఛన్ల పంపిణీ బాధ్యతలు వద్దని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందే కానీ పింఛన్ల పంపిణీని ఆపమని కాదు. కానీ అ నెపం పెట్టుకుని పింఛన్లను ఆపేయడానికి జగన్ సర్కార్ కుట్రపన్నుతున్నట్లుగా వారి మాటలను బట్టి అవగతమౌతోంది.   ప్రభుత్వం ఇస్తున్న సామాజిక పించన్లు ఇకపై వాలంటీర్ల ద్వారా కాకుండా, ఉద్యోగులే పంపిణీ చేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలతో వైసీపీకి కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే  వారు నానా యాగీ చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటివరకూ వాలంటీర్లే పించనర్లకు డబ్బులు నేరుగా ఇచ్చేవారు.  ఎన్నికల కోడ్ లేదు కాబట్టి  అది సాగింది. కానీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత  నిబంధనల ప్రకారమే జరగాలి. అలా జరిగేలా చూసే బాధ్యత  ఎన్నికల సంఘానిది.  రాష్ట్రంలో కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు వెల్లువెత్తున్న నేపథ్యంలో కేందా్ర ఎన్నికల సంఘం  ఢిల్లీ నుంచి ముగ్గురు పరిశీలకులను కూడా రాష్ట్రానికి పంపింది. సరే అదలా ఉంచితే.. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు.  ఈ విషయాన్ని  హైకోర్టు స్పష్టంగా చెప్పింది. దీనికి తోడు  వాలంటీర్లంతా వైసీపీ వాళ్లేనని పలు సందర్బాలలో మంత్రులే చెప్పారి. వారి సేవలను ఎన్నికలలో వాడుకుంటామని ప్రకటనలు కూడా చేశారు. అంతెందుకు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాలలో చెప్పారు.  వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకున్న ఎన్నికల సంఘం వలంటీర్లనూ ఎన్నికల సమయంలో పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని ఆదేశించింది. అంతే కాకుండా వారి ఫోన్ల నుంచి సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకోమని చెప్పింది. వాలంటీర్ల స్థానంలో ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే పించన్లు పంపిణీ చేయాలని విస్పష్టంగా ఆదేశించింది.  ఇప్పుడు ఆ పని ప్రభుత్వోద్యోగులకు అప్పగించమని నిర్దేశించింది.  దీనిపై వైసీపీ ఇంతగా గగ్గోలు పెట్టడం ఎందుకో అర్ధం కావడం లేదు. సామాజిక పింఛన్లు అందకుండా తెలుగుదేశం కుట్రలు చేస్తోందన్న వైసీపీ విమర్శలు చూస్తుంటే.. పించన్లు పంపిణీ చేయకుండా, అందుకు కారణం తెలుగుదేశం అని ప్రచారం చేయడానికి వైసీపీ రెడీ అయిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయినా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం నుంచి ప్రభుత్వోద్యోగుల ద్వారా పించన్ల పంపిణీ సక్రమంగా సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత సీఎస్ జవహర్ రెడ్డిదే. ఇప్పుడు ఆయన ఆపద్ధమర్మ ముఖ్యమంత్రి జగన్  ఆదేశాలకు తలొగ్గాల్సిన అవసరం లేదు.   ఎలాగూ పెన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బు ఖజానాలో  రెడీగా ఉంటే పంపిణీకి అడ్డేముంటుంది. అయితే వైసీపీ యాగీ వెనుక, గగ్గోలు వెనుక పింఛన్ల సొమ్ము ఖజానాలో లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విపక్షాలు ఆరోపిస్తున్నట్లు  ఆ సొమ్ములను వైసీపీ అనుకూల కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల పంపిణీకి వాడేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, మాజీ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదు వల్లే వాలంటీర్ల సేవలు నిలిచిపోయాయని.. అధికార పార్టీ  చేస్తున్న విమర్శలు ఆ అనుమానాలను బలపరుస్తున్నాయి.   సీఈసీ పెన్షనర్లకు డబ్బులు ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఇవ్వాలని ఆదేశించిందే తప్ప, అసలు పెన్షన్లు ఇవ్వవద్దని అనలేదు. ఎన్నికల కోడ్ కాబట్టి వాలంటీర్ల బదులు, ప్రభుత్వ సిబ్బందితో పెన్షన్ డబ్బులు అందచేయాలని చెప్పిందే తప్ప, సంక్షేమపథకాలు ఆపమనలేదు. కానీ వైసీపీ మాత్రం ఎన్నికల సంఘం  పింఛన్లు నిలిపివేయాలనీ, సంక్షేమ పథకాలు ఆపేయాలని ఆదేశించిందన్నట్లుగా మాట్లాడటం విస్తుగొలుపుతోంది. వైసీపీ బాధంతా   ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా పెన్షన్లు ఇస్తున్నందుకా? లేక వాలంటీర్ల ద్వారా ఇవ్వనందుకా?  ఎవరిస్తే ఏమిటి?  సొమ్ము లబ్థిదారులకు అందడమేగా కావాల్సింది?   ఇప్పుడు వైసీపీ ఆరోపణలు, విమర్శలు చూస్తుంటే..  వాలంటీర్లద్వారా పింఛన్ల పంపిణీ జరిగితే.. ఆ డబ్బులు ఇస్తున్నది జగనే అని వారు ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రభుత్వోద్యోగులైతే.. ఆ సొమ్ము పంపిణీకి జగన్ కు ఎటువంటి సంబంధం లేదని అందరికీ అర్ధమైపోతుంది. ఇదీ వైసీపీ బాధ.   తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ  అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలూ సంక్షేమ పథకాలను అమలు చేశాయి.  అయితే జగన్ సర్కార్ వచ్చే వరకూ సంక్షేమ పథకాల అమలు  ప్రభుత్వ సిబ్బంది ద్వారానే అమలయ్యాయి.  వైసీపీ సర్కార్ వచ్చిన తరువాత మాత్రమే వాలంటీర్ల చేతికి సొమ్ములిచ్చి పంపిణీ చేసింది. ఇప్పుడు అది కూడదనే సరికి.. పెన్షనర్లకు సొమ్ములెలా అందుతాయంటూ గగ్గోలు పెట్టేస్తోంది.  ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న పార్టీ కోడ్ ఉల్లంఘనలపై వచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించడం సహజం. గత ఎన్నికల సమయంలో విపక్షంలో ఉన్న వైసీపీ ఫిర్యాదులపైనే పై అప్పటి  డీజీపీ, సీఎస్, ఏడీజీని ఈసీ ఎన్నికల విధులకు దూరంగా ఉంచింది. ఎల్వీని ఈసీనే నేరుగా సీఎస్‌గా నియమించింది. అప్పుడు ఒప్పైన ఎన్నికల సంఘం నిర్ణయం ఇప్పుడు వైసీపీకి ఎందుకు తప్పు అవుతోందన్నది ఆ పార్టీయే చెప్పాలి.