పొలిటికల్ కామెడీ.. పాల్ ను మించిపోయిన జగన్

పొలిటికల్ కామెడీడలో ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ను మించిపోయారు. ఇంత కాలం రోహిణీకార్తె ఎండలను మించి వేడెక్కిన రాజకీయ మంటల నుంచి పాల్ మాత్రమే తన ప్రసంగాలతో ఒకింత ఉపశమనం కలిగిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. అయితే ఇప్పడు ఇక  పాల్ ప్లేస్ ను జగన్ ఆక్రమించేసినట్లు కనిపిస్తోంది. ఏపీలో ఇలా ఎన్నికలు ముగిశాయో లేదో అలా పాల్ విశాఖ ఎంపీగా తన విజయం ఖాయమని ప్రకటించేయడమే కాకుండా... తాను ఎంపీగా తన పని కూడా ప్రారంభించేస్తున్నానని చెప్పి జనం పొట్టలు చెక్కలు చేశారు. ఇది  జరిగిన మరుసటి రోజునే జగన్ పాల్ ను మించిన కామెడీ చేశారు.  పనిమాలా అమరావతిలోని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి మరీ కామెడీ చేశారు. ముఖంలో ఇసుమంతైనా విశ్వాసం కనిపించకపోయినా, ఆయన వెనుక నిలుచుని ఉన్న మంత్రులు బొత్స సత్యానారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల ముఖాలలో నైరాశ్యం విస్పష్టంగా కనిపిస్తున్నా.. జగన్ మాత్రం ఎన్నికలలో ఘన విజయం గురించి ఐప్యాక్ సభ్యులకు గోప్పగా చెప్పారు. 151ని మించి అసెంబ్లీ స్థానాలలో వైసీపీ విజయం సాధించబోతోందని ఆయన చెబుతుంటే.. ఐ ప్యాక్ సభ్యులు  ఎగతాళిగా చప్పట్లు కొడుతూ 175 అని అరవడం వినిపించింది. కనిపించింది. పాల్ విశాఖ ఎంపీగా విజయం సాధించేశానని ప్రకటించడాన్ని మించి జగన్ గత ఎన్నికల కంటే అధిక స్థానాలు సాధిస్తామని చెప్పుకోవడమే జనాలను ఎక్కువగా నవ్వించింది.  సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా పోలింగ్ పూర్తయిన తరువాత గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంది. పార్టీ క్యాడర్ లో విశ్వాసం నింపడానికి, ఓట్ల లెక్కింపునకు ముందే వారు జారిపోయి.. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లే లేని పరిస్థితి రాకుండా ఉండటానికి విజయం సాధిస్తున్నామంటూ పార్టీల నాయకులు ప్రకటనలు చేయడం కొత్తేమీ కాదు. కానీ జగన్ విజయం సాధించబోతున్నామంటూ జగన్ చెప్పిన సంఖ్యే సొంత పార్టీ నేతలకు కూడా ఘోరంగా ఓడిపోబోతున్నామన్న సంకేతాన్ని పంపింది. ఐప్యాక్ కార్యాలయంలో జగన్ విజయంపై చేసిన ప్రకటన చూసిన తరువాత సొంత పార్టీ శ్రేణులే రివర్స్ పాలన అలవాటైన మా నాయకుడికి ఎన్నికల ఫలితాలను కూడా రివర్స్ లో అంచనా వేయడం అలవాటైపోయిందని సెటైర్లు వేసుకుంటున్నారంటే ఆయన పొలిటికల్ కామెడీ ఏ స్థాయికి చేరిందో అర్ధమైపోతుంది.  ఒక వైపు సొంత పార్టీకి చెందిన తన ఆంతరింగుకుడి లాంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ.. సాక్షాత్తూ కేంద్ర ఎన్నికల సంఘం తెలుగుదేశం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలను పాటించిందని ప్రకటించి ఓటమిని పరోక్షంగా అంగీకరించేశారు. ఆయన దాకా ఎందుకు పోలింగ్ కు ముందే ఓటమి పసిగట్టిన జగన్ ఈ సారి ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న విశ్వాసం తనకు లేదని ప్రకటించి చేతులెత్తేశారు. ఇలా ఇప్పటి వరకూ వైసీపీ ఓటమి ఖాయమన్న సంకేతాలిచ్చి.. ఇప్పుడు పార్టీకి ఎన్నికల వ్యూహాలు అందించి, నివేదికలు అందించిన ఐప్యాక్ కార్యాలయంలో ఘన విజయం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు మించిన కామెడీ ఏముంటుందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  

సీఎస్ జవహర్ రెడ్డి సేఫేనా?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రోజు, ఆ తరువాత యథేచ్ఛగా సాగిన హింసాకాండకు సంబంధించి కొందరు పోలీసు అధికారులు, కలెక్టర్లపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. పల్నాడు కలెక్టర్ ను బదిలీ చేసింది. పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. వారందరిపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఇందు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ను నియమించి 48 గంటల లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకోవడానికి వీలుగా నివేదికలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి. ఆయన నివేదిక ఆధారంగానే కేంద్ర ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది.  అయితే అధికారులపై నెపం నెట్టేసి జవహర్ రెడ్డి సేఫ్ గేమ్ ఆడి తప్పించుకున్నారా, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో సర్వం సీఎస్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. అటువంటి సీఎస్ కు రాష్ట్రంలో జరిగిన సంఘటనలకు సంబంధించి బాధ్యత ఉండదా?  అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఏపీలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన క్షణం నుంచీ అధికార యంత్రాంగం అంతా అధికార పార్టీ సేవలో తరించడానికే పరిమితమైందన్న ఆరోపణలు ఉన్నాయి. సామాజిక పెన్షన్ల పంపిణీ విషయంలో ఎన్నికల సంఘం ఆదేశాలను సైతం బుట్టదాఖలు చేసి సీఎస్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు విపక్ష తెలుగుదేశం కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ముందు నుంచీ సీఎస్ వ్యవహారశైలిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎన్నికల ప్రక్రియ అపహాస్యం పాలయ్యేలా జరిగిన సంఘటనలకు సీఎస్ బాధ్యుడు కాడా అని ప్రశ్నిస్తున్నారు.  జగన్ కు మేలు చేయడమే లక్ష్యంగా ఆయన ప్రతి అడుగూ ఉందని సామాన్య జనం కూడా బాహాటంగానే చర్చింకుకుంటున్న పరిస్థితి.   ఇప్పుడు కూడా ఎన్నికల అనంతర హింస విషయంలో సీఎస్ పై ఈసీ చర్య తీసుకుంటుందా లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈసీ  ఆదేశాలను అమలు చేయాల్సిన సీఎస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చు కునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఆయన సీఎస్ గా ఉండగా  ఓట్ల లెక్కింపు  జరిగితే  అది సక్రమంగా జరుగుతుందన్న నమ్మకం లేదని విపక్ష తెలుగుదేశం కూటమే కాదు, సామాన్య ప్రజలు కూడా అంటున్న పరిస్థితి. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఏం చర్యలు తీసుకుటుందో చూడాల్సి ఉంది. 

ఏపీ ఎన్నికల హింసపై ఈసీ సీరియస్.. బదలీ వేట్లు.. సస్పెన్షన్లు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ వివరణ కోరింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానం కావడానికి బాధ్యులెవరని నిలదీసింది. హింస ప్రజ్వరిల్లిన పల్నాడు ఎస్పీపై బదిలీ వేటు వేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. అలాగే పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది. తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది. వీరిపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. మొత్తంగా ఎన్నికల సంఘం ఏపీలో పరిస్థితులపై ఆలస్యంగానైనా స్పందించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో మొత్తం 12 మంది పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. అంతే కాకుండా ఈ విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది. హింసాత్మక ఘటనలపై 48 గంటలలోగా నివేదిక ఇవ్వాలని, ఇపీసీ సెక్షన్ల ప్రకారం ఎఫ్ ఐఆర్ అప్డేట్ చేయాలనీ ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ఏపీలో  కౌంటింగ్ ముగిసిన పదిహేను రోజుల వరకూ రాష్ట్రంలో పాతిక కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను కొనసాగించాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రోజునూ, ఆ తరువాత కూడా జరిగిన హింసాత్మక ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. పక్కా ప్రణాళిక ప్రకారం అధికార వైసీపీ మూకలు దాడులకు తెగబడుతుంటే పోలీసులు చోద్యం చూశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. విపక్ష కూటమి అభ్యర్థులపై హత్యాయత్నాలకు పాల్పడేందుకు కూడా వైసీపీ మూకలు వెనుకాడలేదంటే రాష్ట్రంలో పోలీసుల వైఫల్యం ప్రస్ఫుటంగా కళ్లకుకట్టింది. పోలింగ్ ముగిసి నాలుగు రోజులు గడిచినా ఇప్పటికీ పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈసీ కన్నెర్ర చేసింది.  ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రాష్ట్రంలో ప్రతీకార దాడులకు ఆస్కారం ఉందంటూ ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీఎస్పీ బలగాలను పంపుతామనీ, అవసరాన్ని బట్టి కేంద్ర సాయుధ బలగాలనూ మోహరించాల్సి ఉంటుందని ఇంటెలిజెన్స్ విభాగం సూచించింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అవసమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొంది.  

జగన్ ‘ద్వంద్వ మతతత్వం’ గోల!

కొంతమందికి రెండు దేశాల్లో పౌరసత్వం వుంటుంది. దాన్ని ‘ద్వంద్వ పౌరసత్వం’ అంటారు. ఇప్పుడు వైఎస్ జగన్ వ్యవహారాన్ని చూస్తుంటే ‘ద్వంద్వ మతతత్వం’ అనే పదాన్ని సృష్టించాలని అనిపిస్తోంది. జగన్ పూర్వికులు ఏనాడో హిందూ మతాన్ని వదిలి క్రైస్తవాన్ని స్వీకరించారు. జగన్ కుటుంబం మొత్తం నిరంతరం ఏసు ప్రభువుకి ప్రార్థన చేసుకుంటూ వుంటారు. మంచిదే.. ఎవరి మత విశ్వాసాలు వారివి. అమెరికా పారిపోయిన విజయమ్మ అయితే, గత ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చినప్పుడు చేతిలో బైబిల్ లేకుండా ఏనాడూ కనిపించలేదు. హిందూ మతానికి దూరమైపోయినప్పటికీ ఈ కుటుంబం ‘రెడ్డి’ అనే హిందూ కులాన్ని మాత్రం అక్కున చేర్చుకుంది. ఇది వీరి పెద్ద మనసుకు నిదర్శనం. అసలు ఈ కుటుంబం రెడ్లే కాదని, రెడ్ల ఓట్ల కోసమే ఆ మకుటం తగిలించుకున్నారని కొంతమంది నిఖార్సయిన రెడ్లు వాదిస్తూ వుంటారుగానీ, ఆ వాదనలోకి ఇప్పుడు వెళ్ళడం అనవసరం. అటు క్రైస్తవ మతానికి, ఇటు హిందూ కులానికి న్యాయం చేస్తూ ఈ కుటుంబం చాలా అభివృద్ధిలోకి వచ్చింది.. సంతోషం! అయితే, ఆమధ్య... అంటే, 2019 ఎన్నికలకు ముందు విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి అండ్ జగన్ రాసుకుని పూసుకుని తిరిగిన రోజుల్లో ఆయన ఓ ఫైన్ మార్నింగ్ జగన్‌ని నీళ్ళలో ముంచి, పైకి లేపి హిందువుగా మార్చేశారు. దాంతో హిందుత్వ భావాలు వున్నవాళ్ళందరూ మురిసిపోయారు. అయితే ఆ మురిపెం ఎక్కువకాలం మిగల్లేదు. ఆ తర్వాత జగన్ ఏనాడూ వ్యక్తిగత హోదాలో ఏనాడూ ఏ హిందూ దేవాలయానికి వెళ్ళిన ధాఖలాలు లేవు. యథాతథంగా క్రైస్తవ మత ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొనడం, జెరూసలేం వెళ్ళడం లాంటివి జరిగిపోతూనే వున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా హిందూ దేవాలయాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు జగన్ ప్రవర్తించే తీరు జగద్విదితమే. దేవాలయంలో ఇచ్చే ప్రసాదాలు, తీర్థాలు తీసుకుంటున్నప్పుడు ఆయనలో అయిష్టత స్పష్టంగా కనిపిస్తూనే వుండేది. హిందూ మత విశ్వాసాలను పాటించకపోయినప్పటికీ, హిందూ దేవాలయాల నుంచి వచ్చిన ఆదాయాన్ని ఇతర మతాల వారికి మళ్ళించినప్పటికీ, హిందూ దేవాలయాల్లో ఇతర మతస్తులకు ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ ఎవరూ ఏమీ చేయలేక సర్వం మూసుకున్న పరిస్థితి. జగన్ తన క్రైస్తవంలోనే కొనసాగుతున్న యథాతథ పరిస్థితి. అదేంటో, ఎన్నికల సమయం రాగానే మరోసారి జగన్‌ మనసు హిందూ విశ్వాసాల మీదకి మళ్ళింది. అధికారాన్ని వచ్చేలా చేసే రాజశ్యామల యాగం మీద మక్కువతో ఆయన గత 41 రోజులకు పైగా తాడేపల్లి నివాసంలో సీక్రెట్‌గా రాజశ్యామల యాగం క్రతువులు పూర్తి చేశారు. యాగం చివరిరోజైన బుధవారం నాడు జరిగిన పూర్ణాహుతిలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా కూడా విశాఖ శారదాపీఠంలోని ఆలయంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో జగన్ రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ యాగం ఫలితంగానే తనకు అధికారం దక్కిందని జగన్ నమ్ముతున్నట్టున్నారు. అందుకు ఈసారి కూడా రాజశ్యామల యాగం ప్లాన్ చేశారు. కాకపోతే, స్వరూపానందేంద్ర సరస్వతితో జగన్‌కి చెడింది కాబట్టి, ఇప్పుడు ఆ బాధ్యత మరెవరో స్వీకరించి పూర్తి చేశారు. అంతా బాగుందిగానీ, ఇంతకీ జగన్ హిందువా, క్రైస్తవుడా అనే సందేహం, అయోమయం అటు హిందువులలో, క్రైస్తవులలో పెరిగిపోతోంది. సర్లే, ఏ మతం అయితే ఏం గానీ, వున్నది ఒకే దేవుడు.. కనిపించేవనీ దేవుడి రకరకాల రూపాలు అంతే.. ఇంతకీ ఆయన చేసిన రాజశ్యామల యాగం ఈసారి ఫలిస్తుందా? కచ్చితంగా ఫలించదు. ఎందుకంటే, రాజశ్యామల దేవత కూడా ఓటరు దేవుళ్ళ లాంటిదే. అప్పట్లో జగన్ ‘ఒక్క ఛాన్స్’ అని ప్రాధేయపడ్డాడు కాబట్టి, ఓటరు దేవుళ్ళ తరహాలోనే రాజశ్యామల దేవత కూడా కరుణించి అధికారం ఇచ్చింది. ఈ ఐదేళ్ళ పాలనలో జగన్ నిజ స్వరూపం ఏమిటో తెలిసిపోయింది కాబట్టి, ఇటు ఓటరు ఓటు వేయలేదు.. అటు రాజశ్యామలా దేవి కూడా కరుణించదు.  రాజశ్యామలా దేవి కూడా ఓటరు దేవుడి లాంటిదే జగనప్పా.. ఓటరు బూత్‌కి వచ్చి ఓటు వేస్తాడు.. రాజశ్యామలాదేవి అలా ఓటు వేయకుండానే అనుగ్రహిస్తుంది. మిగతా అంతా సేమ్ టు సేమ్.. అయినా, జగన్ అంటే పడిచచ్చే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొన్నటి ఎన్నికల ముందు కూడా రాజశ్యామల యాగం చేశాడు.. ఏమైంది? చెత్తగా పరిపాలించడం వల్ల దారుణంగా ఓడిపోయాడు. ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అవబోతోంది.

సర్వం ‘సిద్ధం’ చేసుకుంటున్న సీబీఐ, ఈడీ

ఎన్నికల ముందు జగన్ అండ్ దండుపాళెం బ్యాచ్ ‘సిద్ధం’, ‘సిద్ధం’ అని అరిచారు. ఎన్నికలు ముగిశాయి. వైసీపీ ఖేల్ ఖతం అయిపోయినట్టేనని అర్థమైపోతున్న నేపథ్యంలో జగన్ యూరప్ వెళ్ళడానికో, వెళ్ళిపోవడానికో ‘సిద్ధం’ అవుతున్నారు. జగన్ యూరప్ వెళ్ళకుండా ఆపాలని సీబీఐ కోర్టు ముందు సీబీఐ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్‌ని దేశం విడిచి వెళ్ళనివ్వకూడదని విజ్ఞప్తి కూడా చేసింది. అయినప్పటికీ, జగన్ జూన్ 1 వరకు యూరప్‌లో వుండటానికి సీబీఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇక చేసేదేమీ లేక సీబీఐ, ఈడీ చాలా పవిత్రమైన, అమోఘమైన తేదీ అయిన జూన్ 4వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ, జగన్‌కి తమ సత్తా చూపించడానికి అవసరమనవన్నీ ‘సిద్ధం’ చేసుకుంటున్నాయి. జగన్ మీద పదికి పైగా ఆర్థిక నేరాల కేసులు వున్నాయి. ముఖ్యమంత్రి హోదాని అడ్డు పెట్టుకుని ఆ కేసుల నుంచి జగన్ తప్పించుకుని తిరుగుతున్నారు. జూన్ 4 తర్వాత ఆ హోదా ఎలాగూ వుండదు కాబట్టి అప్పుడు తమ డ్యూటీని స్వేచ్చగా చేయడానికి సీబీఐ, ఈడీ సమాయత్తం అవుతున్నాయి. అలాగే బాబాయ్ మర్డర్ కేసు విషయంలో కూడా సీబీఐకి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి వెళ్ళి మరీ, ఖాళీ చేతులతో తిరిగి రావలసి వచ్చింది. జూన్ నాలుగు తర్వాత జగన్‌కి ముఖ్యమంత్రి హోదా వుండదు, అవినాష్ రెడ్డికి ఎంపీ హోదా వుండదు. అప్పుడు ప్రభుత్వ వ్యవస్థల శక్తిని చూడటానికి జగన్‌ అండ్ బ్యాచ్‌కి  అవకాశం దొరుకుతుంది.

జగన్ ప్రభుత్వ రికార్డుల ధ్వంసం జరుగుతోంది

ఆమధ్య తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన రోజున, ఆ ప్రభుత్వం చేయించిన ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన హార్డ్ డిస్క్లులు, ఆధారాలు ధ్వంసం చేయడం జరిగింది కదా.. అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ‘ధ్వంసం’ కార్యక్రమం ‘ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్’ రూపంలో జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ‘ఈ-ఆఫీస్’ని మూసేశారు. మే 17 నుంచి 25 వరకు  ‘అప్‌గ్రేడ్’ చేసే నెపంతో ఈ-ఆఫీస్‌ని మూశారు. ఈ వ్యవహారంపై తెలుగుదేశం అధినేత  చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కి చంద్రబాబు లేఖ రాశారు. త్వరలో కొత్త ప్రభుత్వం వస్తున్నందున, ఆ అప్ గ్రేడ్ వ్యవహారాన్ని కొత్త ప్రభుత్వం చూసుకుంటుందని, ఈ ప్రభుత్వమే అప్‌గ్రేడ్ చేయడం వల్ల అక్రమాలు జరిగే అవకాశం వుందని చంద్రబాబు ఆ లేఖలో రాశారు. ఇలా ఈ-ఆఫీస్‌ని అప్‌గ్రేడ్ చేయడం వల్ల జగన్ ప్రభుత్వం చేసిన అక్రమాలు సమాధి అయ్యే ప్రమాదం వుంది.

ఐప్యాక్ ఆఫీసుకి జగన్.. మతలబేంటి?

ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ జగన్ తనకు సహకారం అందిస్తున్న ఐప్యాక్ సంస్థ కార్యాలయానికి వెళ్ళే ఛాన్సే లేదు. ఓటమి కన్ఫమ్ అయిన బాధ ఒక వైపు, యూరప్ వెళ్ళడానికి తట్టాబుట్టా సర్దుకునే బిజీ మరో వైపు. అయినప్పటికీ, జగన్ తీరిక చేసుకుని మరీ ఐప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) కార్యాలయానికి ఎందుకు వెళ్ళారా అనే సందేహాలు కలగటం సహజం. విజయవాడలో వున్న ఐప్యాక్ కార్యాలయానికి జగన్ వెళ్ళడం అనేది హండ్రెడ్ పర్సెంట్ అనధికార పర్యటన అయినప్పటికీ, అన్ని రకాల అధికారిక ఖర్చులతో ఆయన అక్కడకి వెళ్ళారు. ఐప్యాక్ కార్యాలయంలో జగన్ రాకకోసం ఎదురుచూస్తున్న వందలాది మంది ఐప్యాక్ ఉద్యోగులు జగన్‌ని చూసి ఉత్సాహంతో ఉరకలు వేశారు. షేక్ హ్యాండ్స్ ఇచ్చారు. సెల్ఫీలు దిగారు. అన్నికంటే వింత ఏమిటంలే, జగనే స్వయంగా ఒక సెల్ఫీ క్లిక్ చేశారు. తర్వాత ఐ ప్యాక్ సభ్యులు మీరు మళ్ళీ ఘన విజయం సాధిస్తారు అని ముక్తకంఠంతో అరిచారు. జగన్ కూడా, అంతకు ముందుకంటే భారీ విజయం సాధిస్తాను అని చెప్పారు. అది విని అందరూ ఆనందంగా చప్పట్లు చరిచారు... సీఎం.. సీఎం అని అరిచారు.. ఈ ప్రహసనం అయిపోగానే జగన్ తిరిగి తాడేపల్లి ప్యాలెస్‌కి చేరుకున్నారు. అసలింతకీ జగన్ ఐ ప్యాక్ కార్యాలయానికి ఎందుకు వెళ్ళినట్టు? ఎందుకంటే, గత ఎన్నికల తర్వాత జగన్ ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్ళారు. వాళ్ళకి థాంక్స్ చెప్పారు. ఇప్పుడు వెళ్ళాలన్న ఉద్దేశం లేకపోయినా, వెళ్ళక తప్పని పరిస్థితి.. ఎందుకంటే, ఇప్పటికే జగన్ ప్రభుత్వం చాపచుట్టేసినట్టే అనే పాయింట్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు కనుక జగన్ గత ఎన్నికల తరహాలో కాకుండా, ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్ళకుండా ఊరుకుంటే, జగన్ కూడా చేతులు ఎత్తేశాడనే మెసేజ్ వెళ్ళే అవకాశం వుంది కాబట్టి ఆయనకి వెళ్ళక తప్పలేదు. ఐపాక్‌తో గత ఎన్నికల వరకు అనుబంధం వున్న ప్రశాంత్ కిషోర్ దానిని కొంతకాలం క్రితం తెంచుకున్నారు. ఈమధ్య జర్నలిస్టు రవిప్రకాష్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్‌ని ప్రశాంత్ కిషోర్ భారీగా విమర్శించారు. చేసిన మేలును మరచిపోవడం కంటే పెద్ద పాపం మరొకటి వుండదని భగవద్గీతలో చెప్పారని, జగన్ తాను చేసిన మేలును మరచిపోయారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ నేపథ్యంలో, ఐప్యాక్ సంస్థకి వెళ్లి మరీ థాంక్స్ చెప్పాల్సిన పరిస్థితి జగన్‌ది. ఒకవేళ జగన్ వెళ్ళకపోతే, చూశారా.. జగన్ ఈసారి ఐప్యాక్ ఆఫీసుకు వెళ్ళలేదు. జగన్‌కి కృతజ్ఞత లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాట నిజమే అనే లోకనింద వస్తుందని భయపడి జగన్ ఆ సంస్థ కార్యాలయానికి వెళ్ళారు. ఓ పనైపోయింది బాబూ అనిపించుకున్నారు.

 తెలంగాణలో మళ్లీ భారీవర్షం 

తెలంగాణలో చాలావరకు వేడి తగ్గింది. వాతావరణం చల్లబడింది. ఈనెల మొదటి వారంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని చోట్ల 47 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి. వాతావరణం చల్లబడటంతో 40 డిగ్రీలకు పడిపోయింది. ఉపరితల ఆవర్తనమే కారణమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అవర్తనం ఏర్పడమే దీనికి కారణం. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మూడురోజులు వర్షాలు కురవనున్నాయి.పిడుగులు పడే అవకాశం రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మే 17 వరకు తేలిక నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవనున్నాయి. జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణ పేట జిల్లాల్లో బుధవారం రోజు వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో వర్షం పడే అవకాశం ఉంది.ఉదయం ఎండ ఉన్నప్పటికీ సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుందని అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతల విషయానికి వస్తే 38 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్యలో నమోదవుతుందని, ఉరుములు, మెరుపులతో పాటు పిడిగులు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ మరికొన్ని జిల్లాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. ఇలా రాష్ట్రమంతా భిన్నమైన వాతావరణం నెలకొనడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. వేడి ఉన్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎండవేడిమికి ముఖ్యమైన పనులుంటే ఉదయం సమయంలోనే పూర్తిచేసుకోవాలని, ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటలకు బయటకు వెళ్లొద్దని, ఒకవేళ వెళ్లినా గొడుగు తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు.

విశాఖ చెవిలో చెవిరెడ్డి వెయ్యి కోట్ల పువ్వు!!

ఎక్కడ రాయలసీమలోని చంద్రగిరి.. ఎక్కడ విశాఖపట్నం. చంద్రగిరి నుంచి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విశాఖపట్నంలో వెయ్యి కోట్ల స్కామ్ చేశాడు. అక్రమ మైనింగ్‌తో  అందినంత దండుకున్నాడు. జగన్ ఆశీస్సులతో రాష్ట్రమంతటా రెచ్చిపోతున్న దండుపాళెం బ్యాచ్‌లో ముఖ్య సభ్యుడైన చెవిరెడ్డి, అడ్డగోలుగా సంపాదించడంలో ఆరితేరాడు. తనకెవరైనాఅడ్డు వస్తే భౌతికంగా అడ్డు తొలగించుకోవడానికి కూడా వెనుకాడడు. నిన్నగాక మొన్న చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిని హత్య చేయడానికి చెవిరెడ్డి చేసినప్రయత్నాలు చూశాం. ఇప్పుడు వైజాగ్‌లో చట్టాలు, నిబంధనల చెవుల్లో పూలు పెట్టి, ఆయనగారు  చేసిన వెయ్యి కోట్ల స్కామ్ వివరాలేంటో చూద్దాం.  చెవిరెడ్డి చేసేవన్నీ నేరాలు, మోసాలు. పైకి బిల్డప్పు మాత్రం పరమభక్త శిఖామణిలా వుంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దండుపాళెం బ్యాచ్‌లో కీలక మెంబర్ అనే విషయం ఆల్రెడీ చెప్పుకున్నాం. తనకు ఎంతమాత్రం సంబంధంలేని విశాఖలో మకాం వేసి ఏకంగా వెయ్యికోట్లకు పైగా నొక్కేశాడు. క్రైస్తవుడైన ముఖ్యమంత్రి  వైయస్ జగన్‌ను హిందువులు వ్యతిరేకించకుండా చెవిరెడ్డి మంచి ప్లాన్ వేశారు. ఆయన ఇంట్లో గోశాల ఏర్పాటు చేసి, దేవాలయ సెట్లు నిర్మించి ఆ పలుకుబడితో విశాఖలో భారీ స్కాములు చేసేశారు.  ఋషికొండ విధ్వంసకారుడు చెవిరెడ్డి బినామీలతో  ఋషికొండను విధ్వంసం చేయించిన చెవిరెడ్డి వేల లారీల గ్రావెల్‌తో  వందల కోట్లు సంపాదించారు. ఋషికొండను తవ్వగా వచ్చిన గ్రావెల్ రాళ్లను నిబంధనలకు విరుద్ధంగా సముద్రం ఒడ్డున సి.ఆర్.జెడ్. ప్రాంతంలో డంప్ చేయించిన చెవిరెడ్డి అక్కడి ఎర్ర మట్టిని మాత్రం విశాఖ పోర్టుకు తరలించి భారీగా లబ్ధి పొందారు. ముఖ్యమంత్రి జగన్‌కి గంగవరం పోర్టు అధినేత సన్నిహితులు కావడంతో, పోర్ట్.లోని మట్టిని విక్రయించడానికి చెవిరెడ్డి కాంట్రాక్ట్ తెచ్చుకున్నారు. ఆ కారణంగానే ఋషికొండపై అవసరం లేని చోట, నిర్మాణాలు లేని చోట కూడా లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి  అమ్ముకున్నారు. విశాఖ పోర్ట్ ట్రస్టులో అదానీ నిర్మిస్తున్న బెర్తులు, ఇతర అవసరాల కోసం వందల కోట్ల విలువైన ఈ మట్టిని తరలించి అమ్ముకొని సొమ్ముచేసుకున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో భారీ స్కాం పెందుర్తి నియోజకవర్గం గుర్రంపాలెంలో 200 ఎకరాల్లో క్వారియింగ్ చేసి వందల కోట్లు చెవిరెడ్డి సంపాదించారు. ప్రభుత్వం పరిశ్రమలకని కేటాయించిన ఈ భూమిలో చాలా తెలివిగా మైనింగ్ చేశారు. ఈ ప్రాంతం పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం కాదని ప్రభుత్వ అధికారులతోనే సర్టిఫై చేయించి తన మైనింగ్ అవసరాలకు వాడుకున్నారు. కేవలం మైనింగ్ చేసేందుకే ఈ భూమిని పరిశ్రమలకు పనికి రాదని పలుకుబడితో సర్టిఫై చేయించారు. ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి రోజా ఏపీఐఐసీ చైర్మన్‌గా ఉండగా ఈ భూములకు నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీస్ అనే సర్టిఫికెట్ మంజూరు చేయించి దాని ఆధారంగా ఆ భూముల్లో మైనింగ్ చేసి  సొమ్ము చేసుకున్నారు. బక్కన్నపాలెంలో 208 కోట్ల టిడిఆర్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో  తాను చేస్తున్న సర్వేలకు డబ్బు కావాలంటూ మధురవాడ సమీపంలోని బక్కన్నపాలెం సర్వే నెంబర్ 2లో 208 కోట్ల టిడిఆర్ బాండ్లను తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడితో దక్కించుకున్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కేవలం చెవిరెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు టి.డి.ఆర్ బాండ్లు మంజూరు చేశారు. ఇది అక్రమమంటూ ఫిర్యాదుల వెళ్లినా, తమకూ తెలిసినా తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడికి తలొగ్గారు.  ఫార్మాసిటీలో డంపుల వ్యాపారం పరవాడలోని ఫార్మాసిటీలో పలువురు పారిశ్రామికవేత్తలను బెదిరించి, భయపెట్టి రసాయన వ్యర్ధాల డంపులను చెవిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్చార్జిగా పనిచేసిన రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి ద్వారా ఈ డంపులతో ఎంచక్కా వ్యాపారం చేసుకొంటున్నారు. ఈ కారణంగానే  ఫార్మీ సిటీలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా, అధికారులు ధైర్యంగా ఎవరిపైనా చర్యలు తీసుకోలేక పోతున్నారు. ఒక 20 రోజుల ఆగితే, ఎన్డీయే గవర్నమెంట్ వచ్చాక చెవిరెడ్డికి భారీ సత్కారం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలుగుదేశం మహానాడు వాయిదా!

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ సరళిని బట్టి తెలుగుదేశం భారీ విజయం సాధించడం ఖాయమన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా స్వయంగా నిర్వమించుకున్న పోస్ట్ పోల్ సర్వే ఫలితం కూడా భారీ విజయాన్ని ఖరారు చేసిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమేన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి.  తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పార్టీ మహానాడు ఘనంగా నిర్వహించుకుందామని చంద్రబాబు పార్టీ శ్రేణులకు చెప్పారు.  పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని  ఏటా మే 27, 28 తేదీలలో  పార్టీ మహానాడు జరుగుతుంది. అయితే ఆ మహానాడును వాయిదా వేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.  జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో  ప్రభుత్వ ఏర్పాటు, ఎన్నికల ఫలితాలకు ముందు  ఓట్ల లెక్కింపు ముందు చేప్టటాల్సిన కార్యక్రమాలు, ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించాల్సి ఉన్న నేపథ్యంలో మహానాడును వాయిదా వేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయించారు.   ఈ విషయాన్ని చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రకటించారు. అయితే  ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఎన్టీఆర్ కు నివాళులర్పించడం, పార్టీ జెండా ఆవిష్కరించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు.   ఇక మహానాడు ఎప్పుడు నిర్వహించాలన్నది ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ప్రకటించనున్నట్లు తెలిపారు.   

పవన్ కళ్యాణ్ సెక్యురిటీ గార్డ్ ఇంటిపై దాడి 

ఎపిలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ మామూలుగా లేదు. ఈ సారి పిఠాపురం లోకసభ స్థానం నుంచి పోటీ  చేస్తున్న పవన్ కళ్యాణ్ టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. ఆయన సెక్యురిటీ గార్డ్ ఇంటిపై దాడి జరగడం చర్చనీయాంశమైంది.  హైదరాబాద్ మీర్‌పేట్‌లోని లెనిన్ నగర్‌లో జ‌న‌సేనాని పవన్ కల్యాణ్ పర్సనల్ సెక్యూరిటీ వెంకట్ ఇంటిపై కొంద‌రు దాడికి పాల్ప‌డ్డారు. ఇంటిపైన రాళ్లు, రాడ్లు, కత్తులతో దాడి చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. పాత కక్షలతోనే రాజు అనే వ్యక్తి వెంకట్ ఇంటి ముందు ఉన్న ద్విచ‌క్ర‌వాహ‌నానికి నిప్పుపెట్టి ఇంటిపై రాళ్లతో దాడి చేసిన‌ట్లు స‌మాచారం. బైక్‌ను ధ్వంసం చేసి వెంక‌ట్‌పై కూడా దాడి చేయడానికి ప్రయత్నించ‌డంతో స్థానికులు అడ్డుకున్నారు.  వెంకట్ తన భార్య సరిత, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో కలసి ఐదేళ్లుగా లెనిన్ నగర్‌లోనే నివాసం ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో ఇంటి ఎదురుగా ఉండే రాజు వారి బంధువులు పాత గొడవల నేపథ్యంలో ఈ నెల 15న‌ రాత్రి ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఇంటి ప‌క్క‌న‌ ఉండే అబ్బాయి వెంకట్ కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో వెంకట్ భార్య సరిత అబ్బాయిని కొట్టడంతో వివాదం మొదలైంది.   మే 15న వెంకట్ ఇంటిపై కర్రలు, ఇటుకలు, ఇనుప రాడ్లతో దాడి చేసి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. వెంకట్ కుటుంబ సభ్యులపై దాడికి పాల్ప‌పడ్డారు. దీంతో వెంక‌ట్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మీర్‌పేట్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ వివాదంపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చెంపదెబ్బ ఘటనపై శివకుమార్ కొత్త స్క్రీన్ ప్లే!

తెనాలి ప్రస్తుత ఎమ్మెల్యే, ఘోర పరాజయం పాలవబోతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కేవలం ఫైట్ మాస్టరే అని ఇప్పటి వరకూ అనుకుంటూ వచ్చాం కదా.. ఆయన కేవలం ఫైట్ మాస్టర్ మాత్రమే కాదు.. కథ, స్క్రీన్ ప్లే, మాటల రచయితగా కూడా మంచి టాలెండెడ్ అని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది.  గొట్టిముక్కల సుధాకర్ అనే తెనాలి ఓటర్ కొట్టిన గాఠ్ఠి చెంపదెబ్బ నుంచి కాస్త కోలుకున్న అన్నాబత్తుని శివకుమార్ ఇప్పుడు కొత్త స్క్రీన్ ప్లేతో జనం ముందుకు వచ్చారు. వాస్తవానికి పోలింగ్ రోజు జరిగిందేమిటంటే, తెనాలి ఐతానగర్లో వున్న పోలింగ్ స్టేషన్‌కి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తన భార్యతో కలసి ఓటు వేయడానికి వచ్చారు. డైరెక్ట్.గా పోలింగ్ బూత్ దగ్గరకి వెళ్ళబోయారు.  అప్పటికే క్యూలో నిరీక్షిస్తున్న గొట్టిముక్కల సుధాకర్ మీరెలా డైరెక్ట్.గా  బూత్ దగ్గరకి వెళ్తారు. మీరు కూడా క్యూలో రావాలి అన్నారు. అంతే, శివకుమార్ శివాలెత్తిపోయారు. గొట్టిముక్కల సుధాకర్ దగరకి వెళ్ళి ఆయన చెంప మీద కొట్టారు. దాంతో గొట్టిముక్కల సుధాకర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. శివకుమార్ కొట్టినదానికంటే డబుల్ కోటాలో రివర్స్ గిఫ్ట్.గా చెంప ఛెళ్ళుమనిపించారు. దాంతో శివకుమార్ అనుచరులు సుధాకర్ మీదపడి చావగొట్టారు. ఆ తర్వాత పోలీసులు సుధాకర్ మీద కేసు పెట్టారు. ఎన్నికల కమిషన్ జోక్యంతో శివకుమార్‌ని హౌస్ అరెస్టు చేశారు. సుధాకర్‌ని శివకుమార్ చెంపదెబ్బ కొట్టిన సంగతేమోగానీ, శివకుమార్‌ని సుధాకర్ లాగిపెట్టి కొట్టడం హైలైట్ అయింది. ఓటర్ని కొట్టినందుకు శివకుమార్‌కి తిక్క కుదిరిందన్న అభిప్రాయం అంతటా వ్యాపించింది. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఈ వార్త దావానలంలా వ్యాపించి, ఓటింగ్ మీద తీవ్ర ప్రభావం చూపించింది. అసలే ఓటమి బాటలో వున్న శివకుమార్ ఈ ఘటన పుణ్యమా అని ఓటమి కన్ఫమ్ చేసుకున్నారు. ఓటర్ని కొట్టి, ఓటర్ చేత కొట్టించుకున్న ఘటనలో పరువు పూర్తిగా పోగొట్టుకున్న శివకుమార్ ఇప్పుడు సరికొత్త స్క్రీన్ ప్లేతో రిపేరింగ్ వర్క్ మొదలుపెట్టారు. ‘‘నేను, నా భార్య ఓటు వేయడానికి వెళ్ళాం. అక్కడ గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి నన్ను దూషించడం మొదలుపెట్టాడు. ఎమ్మెల్యేగా మాల, మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్నావంటూ నన్ను దుర్భాషలాడాడు. వైసీపీపై ద్వేషంతో రగిలిపోయాడు. నా భార్య ముందే నన్ను తిట్టాడు. నేను పోలింగ్ బూత్‌లోకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు తిడుతూనే వున్నాడు. తాను కూడా నా సామాజిక వర్గం వాడే అయినప్పటికీ, నువ్వు మన సామాజిక వర్గం వాడినేనా అని తిట్టాడు. పోలింగ్ బూత్ దగ్గర మద్యం మత్తులో అతను చాలామందితో దురుసుగా ప్రవర్తించాడు. ఇదంతా అక్కడున్న ఓటర్లే చెప్పారు’’ అని కొత్త స్టోరీ అల్లి చెబుతున్నారు. తన అహంకారంతో జరిగిన సంఘటన మధ్యలోకి శివకుమార్ కులాలని కూడా లాక్కొచ్చారు. తన భార్యని కూడా ఇన్వాల్వ్ చేశారు. మిస్టర్ శివకుమార్.. ఓటర్ని కొట్టి నువ్వు చేసింది పెద్ద తప్పు. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడం కోసం కొత్త స్క్రీన్ ప్లే క్రియేట్ చేయడం, కులాలని, మీ భార్యని ఈ ఇష్యూలోకి లాగడం ఇంకా పెద్ద తప్పు. అర్థమవుతోందా?

అర్భన్ ఓటింగ్ భారీగా పెరిగింది.. సంకేతమేంటి?

సాధారణంగా ఓట్ల పండుగ పట్ల అర్బన్ ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపరు. ఇన్నేళ్లుగా మనం చూస్తున్న ట్రెండ్ అదే. అయితే అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి అర్బన్ ఓటింగ్ భారీగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 81.80 శాతం పోలింగ్ నమోదైంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఇది రెండు శాతం అధికం. ఇక అర్బన్ ఓటింగ్ లో   పెరుగుదల  విస్మయం గొలిపే విధంగా ఉంది. విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో అర్బన్ ఓటింగ్  అత్యధికంగా అత్యధికంగా 11.59శాతం పెరిగింది. అలాగే  విజయవాడ సెంట్రల్ లో 7.18శాతం, నెల్లూరు సిటీలో 6.3శాతం, కాకినాడ సిటీలో 5.78శాతం, విజయవాడ ఈస్ట్ లో 5.21శాతం ఇక గాజువాకలో 4.5శాతం చొప్పున ఓటింగ్ అధికంగా నమోదైంది. మొత్తం మీద రాష్ట్రంలో 35 అర్బన్ నియోజకవర్గాలు ఉంటే వాటిలో పాతికపైన నియోజకవర్గాలలో ఓటింగ్ శాతం పెరిగింది. అర్బన్ ఓట్లలో పెరుగుదల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఈ సారి ఒక కొత్త రికార్డు నమోదు చేసిందని చెప్పవచ్చు. ఇక ఓవరాల్ పోలింగ్ విషయంలో కూడా సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన నాలుగు దశలలో దేశం మొత్తంలోనే ఓటింగ్ శాతంలో ఏపీ నంబర్ వన్ గా నిలిచింది. అదొకటి అలా ఉంచితే అనూహ్యంగా అర్బన్ ఓటింగ్ పెరగడం పరిశీలకులనే విస్మయపరిచింది.  జగన్ సర్కార్ పై తీవ్ర ప్రజా వ్యతిరేకత కారణంగా ఓటింగ్ శాతం భారీగా పెరిగే అవకాశాలున్నాయని ముందునుంచీ అందరూ ఊహించిందే అయినా అర్బన్ ఓటింగ్ పెరుగుదల మాత్రం ఎవరి ఊహలకూ అందలేదనే చెప్పాలి.  ఎందుకంటే అర్భన్ ఓటర్లలో అత్యధికులు ఉద్యోగులు, వ్యాపారులు ఉంటారు. వారు సాధారణంగా పోలింగ్ బూత్ లకు వచ్చి క్యూలైన్ లో నిలుచుని ఓటు వేయడానికి పెద్దగా ఉత్సాహం చూపరు. కానీ ఈ సారి మాత్రం పొద్దుటే పోలింగ్ బూత్ లకు తరలివచ్చి గంటల తరబడి క్యూలైన్ లో తమ వంతు వచ్చే వరకూ ఓపికగా వెయిట్ చేసి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అన్న ప్రశ్నకు పట్టణ ప్రజలలో జగన్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆగ్రహం, వ్యతిరేకత వ్యక్తం కావడం వల్లనేనని పరిశీలకులు బదులిస్తున్నారు. అర్బన్ ఓటర్లలో అత్యధికులు వ్యాపారాలు చేసుకునే వారు, ఉద్యోగులు, యువత ఉంటారు. వీళ్లందరిలో వైసీపీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, విద్యుత్, పెట్రోల్ చార్జీల పెరుగుదల, అలవిమాలిన పన్నులు ఇవన్నీ పట్ణణ ప్రాంత ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను ప్రోది చేశారు. దీంతో వారు ఎలాగైనా జగన్ ను ఓడించాలన్న కంకణం కట్టుకున్నారు. దీంతో గతానికి భిన్నంగా వారు పట్టుదలగా బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  సాధారణంగా ఓటింగ్ శాతంలో పెరుగుదల  ప్రజలలో తీవ్రంగా ఉన్న ప్రజా వ్యతిరేకతను సూచిస్తుంది. ఏపీలో కూడా అదే జరిగింది.  

పల్నాడుజిల్లాలో పెట్రో బాంబుల కలకలం 

ఎపి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోజరిగిన శాంతిభద్రతల సమస్యలు ఇప్పట్లో సమసే అవకాశం  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో వైసీపీ, టీడీపీ నేతలు కార్యకర్తల మధ్య గొడవలు చెలరేగాయి. దీంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఇరు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొనగా.. పోలీసులు రంగప్రవేశం చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు. అయితే, ఇరు పార్టీల నేతల ఫిర్యాదుతో గొడవకు కారణమైన నాయకులను అరెస్టు చేసేందుకు గ్రామంలో గురువారం సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వైసీపీ నేతల ఇళ్లల్లో పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు బయటపడడంతో పోలీసులు నివ్వెరపోయారు. పెద్ద సంఖ్యలో ఉన్న ఆ బాంబులను కనుక పోలింగ్ రోజు ఉపయోగించి ఉంటే గ్రామంలో భారీ విధ్వంసం జరిగేదని తెలిపారు.  మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామం అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతమని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గ్రామంలో గొడవలు పెరిగాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య తరచూ ఘర్షణలు మొదలయ్యాయి. టీడీపీ నేతలపై దాడులు పెరిగాయి. పోలీసులు కూడా రక్షణ కల్పించలేక పోవడడంతో టీడీపీ నేతలు పలువురు గ్రామంలో ఉండలేక హైదరాబాద్, గుంటూరు వెళ్లిపోయారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో పోలీసులు రక్షణ కల్పించాక టీడీపీ నేతలు గ్రామానికి తిరిగి వచ్చారు.

హిందూపురంలో తక్కువ ఓటింగ్.. కారణమేంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసి మూడు రోజులైంది. రాష్ట్రంలో పోలింగ్ శాతం ఎంతన్నది అధికారికంగా ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 81.86శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2019 ఎన్నికలలో నమోదైన పోలింగ్ కంటే రెండు శాతం ఎక్కువ. సాధారణంగా అధిక ఓటింగ్ యాంటీఇంకంబెన్సీకి తార్కానమని రాజకీయ పండితులు చెబుతారు. ఫలితాలు కూడా అలాగే వస్తుంటాయి. ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర సగటు ఓటింగ్ కంటే కీలక నియోజకవర్గాలలో అధిక పోలింగ్ జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే తెలుగుదేశం అధినేత పోటీ చేసిన కుప్పంలో, వైసీపీ అధినేత పోటీ చేసిన పులివెందులలో, అలాగే జనసేనాని పోటీలో ఉన్న పిఠాపురంలో, తెలుగుదేశం జాతీయ కార్యదర్శి పోటీలో ఉన్న మంగళగిరిలో రాష్ట్ర సగటు కంటే అధిక పోలింగ్ నమోదైంది.  అయితే ఆశ్చర్యకరంగా నందమూరి బాలకృష్ణ పోటీ చేసిన హిందుపూర్ నియోజకవర్గంలో మాత్రం ఓటింగ్ తగ్గింది. హిందూపూర్ లో ఈ సారి 77.82 శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2019 ఎన్నికలలో నమోదైన పోలంగ్ కంటే కూడా స్వల్పంగా తక్కువ. దీంతో హిందూపూర్ లో తక్కువ ఓటింగ్ నమోదు కావడానికి కారణాలపై విస్తృత చర్చ జరుగుతోంది. ఇక్కడ నుంచి 2014, 2019 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి బాలకృష్ణ విజయం సాధించారు. ఈ సారి ముచ్చటగా మూడో సారి కూడా విజయకేతం ఎగురవేసి హ్యాట్రిక్ కొట్టాలన్న ఉత్సాహంతో ఉన్నారు. అయితే హిందూపూర్ లో రాష్ట్ర సగటు కంటే పోలింగ్ తక్కువ నమోదు కావడానికి కారణం ఏమిటి? ఇక్కడ పరిస్థితి వైసీపీకి అనుకూలంగా ఏమైనా ఉందా అన్న సందేహాలు కొందరిలో వ్యక్తం అయ్యాయి. అయితే హిందూపుర్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ ఇక్కడ ఆ పార్టీ ఓడిపోయిన పరిస్థితి లేదు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన హిందూపూర్ నుంచి 2014, 2019 ఎన్నికలలో విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలి వీచిన 2019 ఎన్నికలలో కూడా ఆయన ఘన విజయం సాధించారు. అంతే కాదు 2014 ఎన్నికలలో సాధించిన మెజారిటీ కంటే ఎక్కువ సాధించారు. ఆ ఎన్నికలలో రాయలసీమ మొత్తంలో తెలుగుదేశం కేవలం మూడంటే మూడు స్థానాలలోనే విజయం సాధించింది. అంతే కాదు ఆ ఎన్నికలలో చంద్రబాబు మెజారిటీ కూడా భారీగా తగ్గింది. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా బాలకృష్ణకు హిందుపూర్ ఓటర్లు బ్రహ్మరథం పట్టారు.  మరి అటువంటిది అంతా సానుకూలంగా ఉన్న ఈ సమయంలో హిందుపూర్ లో ఓటింగ్ శాతం తక్కువ నమోదు కావడమేమిటన్న ప్రశ్నకు పరిశీలకులు హేతుబద్ధంగా ఇస్తున్న విశ్లేషణ ఏమిటంటే.. హిందుపూర్ లో వైసీపీ ప్రచారం సమయంలోనే కాడె వదిలేసింది. ఈ నియోజకవర్గంలో విజయంపై వైసీపీకి ఆశల్లేకపోవడంతో ఆ పార్టీ ప్రచారం కూడా పేలవంగా సాగింది.  ఇక్కడ బాలకృష్ణ ప్రత్యర్థిగా దీపిక నిలబడ్డారు. నియోజకవర్గంలో ఆమె ప్రచారం అత్యంత పేలవంగా ఉంది. అంతే కాకుండా హిందుపూర్ నియోజకవర్గ వైసీపీలో గ్రూపు విబేదాలు తీవ్రంగా ఉన్నాయి. ఆ పార్టీ నేతల మధ్య ఐక్యత లేదు. తన విజయం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్న బాలకృష్ణ హిందూపూర్ తో పాటు కూటమి అభ్యర్థుల విజయానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు.  ఇక షెడ్యూల్ ప్రకటనకు ముందు వెలువడిన దాదాపు డజనుకు పైగా సర్వేలన్నీ కూడా హిందూపూర్ లో బాలకృష్ణ విజయం నల్లేరు మీద బండినడకేనని పేర్కొన్నాయి.   ఇక పోల్ మేనేజ్ మెంట్ విషయంలో కూడా హిందుపూర్ లో వైసీపీ ఘోరంగా విఫలమైంది. ఓటర్లను పోలింగ్ బూత్ లకు తీసుకువచ్చే ప్రయత్నం కూడా ఆ పార్టీ చేయలేదు.  ఇక పోలింగ్ శాతం తక్కువగా ఉండడానికి హిందూపురం అర్బన్ ఓటర్లు పోలింగ్ బూత్ లకు రాలేదనీ, అలాగే ఇక్కడ నుంచి వలస వెళ్లిన వారికి ఓటింగ్ కు వచ్చేలా చేయడానికి పెద్దగా ప్రయత్నాలు జరగలేదనీ అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే విజయంపై ధీమా ఉండటంతో తెలుగుదేశం పార్టీ కూడా వలస వెళ్లిన వారిని రప్పించేందుకు పెద్దగా కృషి చేయలేదని అంటున్నారు.  హిందుపూర్ లో బాలయ్య పై ఎలాంటి వ్యతిరేకతా లేకపోవడం వల్లనే ఓటింగ్ శాతం పెరగలేదనీ, పడిన ఓటంతా సానుకూల ఓటేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఎపిలో నలుగురు ఎస్ పీలపై వేటు? 

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై ఈసీ సీరియస్ అయ్యింది. తిరుపతిలో టిడిపి నేత పులివర్తినానిపై దాడి, తాడిపత్రిలో హింసాత్మక సంఘటనలు, పల్నాడులో చెలరేగిన హింస ఎన్నికల కమిషన్కు  చెడ్డ పేరు తీసుకొచ్చింది. వైసీపీ అధికార యంత్రాంగమంతా ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది. ఈ కారణంగా ఎన్నికల కమిషన్ ఇబ్బందుల్లో పడింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా నలుగురు ఎస్ పిలను ఏరివేయడానికి సిద్దమైంది.   ఎపిలో పోలింగ్ పూర్తయింది.  కౌంటిగ్ కు  మాత్రం వచ్చే నెల నాలుగో తేదీన ఉండటంతో అప్పటి వరకు రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే ఉద్దేశ్యంతో ఎన్నికల కమిషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో మరో నలుగురు ఎస్పీలపై ఎన్నికల సంఘం కత్తి వేలాడుతోంది. ఎన్నికల విధుల్లో వైఫల్యం.. హింసను కట్టడి చేయలేక పోవడంపై చర్యలు తీసుకోబోతోంది. బుధవారం రాత్రి పోలీసు ఉన్నత స్థాయి అధికారులకు అందిన సమాచారం మేరకు గురువారం రాయలసీమలో ముగ్గురు, పల్నాడులో ఒకరిపై వేటుపడే అవకాశం ఉంది. పోలింగ్‌ సందర్భంగా జరిగిన హింసపై సీరియస్‌ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్‌... ఆ తర్వాతా కొనసాగడాన్ని క్షమించలేక పోతోంది. ఎప్పుడూ గొడవలు జరిగే పల్నాడు జిల్లాలో విధ్వంసాన్ని ఉపేక్షించే ప్రసక్తేలేదని ఢిల్లీ ఈసీ వర్గాలు రాష్ట్ర పోలీసు పెద్దలకు హెచ్చరిక చేసినట్లు తెలుస్తోంది.