నన్ను ఏదైనా అంటే వెంకన్న ఊరుకోడు..

  తిరుమల ప్రధానార్చకుడు రమణ దీక్షితులు ఏపీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో ఇప్పటికే రమణ దీక్షితులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఇప్పుడు ఈ విషయంపై స్పందించిన చంద్రబాబు.. తనపై బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే  రమణ దీక్షితులు ఆరోపణలు చేస్తున్నారని, అమిత్ షా, మోదీలు దగ్గరుండి ఆయనతో మాట్లాడిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని, తనను అప్రదిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతో రమణ దీక్షితులుని ఢిల్లీకి పిలిపించుకుని, తనపై లేనిపోని ఆరోపణలు చేయించిందని అన్నారు. అంతేకాదు పరమ పవిత్రమైన, దేశంలోనే నంబర్ వన్ ఆలయంగా ఉన్న టీటీడీని తమ అధీనంలోకి తీసుకోవాలన్నదే బీజేపీ అభిమతమని, బీజేపీ పార్టీ అనుకున్నది ఎప్పటికీ జరగబోదని.. నేను దాన్ని ఎన్నటికీ జరగనీయబోనని హెచ్చరించారు.   ఇంకా రమణ దీక్షితులు గురించి మాట్లాడుతూ.. "ఈయన (రమణ దీక్షితులు) కూడా ఈయనింట్లో వెంకటేశ్వరస్వామి పక్కనే రాజశేఖరరెడ్డి ఫొటో పెట్టుకునే పరిస్థితికి వచ్చాడంటే, ఈయన ఎలాంటి స్వామో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను మీకు తెలియజేసుకుంటున్నాను" అని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ప్రతి ఆరోపణలపైనా తాను టీటీడీ ఈఓ నుంచి వివరణ కోరానని, అన్నీ బాగున్నాయని, స్వామిని ఎన్నడూ పస్తు పెట్టలేదని అనిల్ సింఘాల్ తనకు చెప్పారని చంద్రబాబు అన్నారు. తనపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే వెంకన్న ఊరుకోబోడని హెచ్చరించారు. మరి ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందో... దీనిపై కేంద్రం ఏం స్టెప్ తీసుకుంటుందో చూద్దాం..

కుమారస్వామి పదవి ఎన్నాళ్లుంటుందో!

  కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ కూటమి తరపున కుమారస్వామి ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దేశంలోని ప్రాంతీయ పార్టీల ముఖ్యులంతా సంబరపడిపోతున్నారు. కానీ ఈ సంబరాలు ఎన్నాళ్లు నిలుస్తాయన్నదే అసలు ప్రశ్న. అందుకు కుమారస్వామే కారణం. అధికారం కోసం ఎలాంటి ఎత్తుగడకైనా సిద్ధపడతారన్నది కుమారస్వామి మీద ఉన్న ఓ ఆరోపణ. ఆయన గతాన్ని చూస్తే, ఈ ఆరోపణని ఏమంత తేలికగా కొట్టి పారేయలేం అనిపిస్తుంది. 2004లో కర్ణాటకలో మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటిలాగానే అది కూడా జేడీఎస్- కాంగ్రెస్ పొత్తుతోనే ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో భాగంగా ఉన్న కుమారస్వామి తన తండ్రిని సైతం కాదని 2006లో ప్రభుత్వాన్ని కూలదోశాడు. అంతటితో ఊరుకోలేదు. బీజేపీతో కలిసి మరో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు. ఆ ప్రభుత్వంలో జేడీఎస్ తరపున 20 నెలలు కుమారస్వామి, 20 నెలలు బీజేపీ తరపున యడ్యూరప్ప ముఖ్యమంత్రులుగా ఉండాలన్నది ఒప్పందం. కానీ తన పదవీకాలం ముగియగానే, ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకునేందుకు కుమారస్వామి ఒప్పుకోలేదు. ఆ నిర్ణయమే 2014 ఎన్నికలలో బీజేపీకి లాభించి యెడ్యూరప్పను ముఖ్యమంత్రిగా నిలబెట్టింది. కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠం మీద ఇంత మోజు ఉండబట్టే కాంగ్రెస్‌ పార్టీ తనకు ఎక్కువ సీట్లు వచ్చినా కూడా అతనికే సీఎం పదవిని వదులుకుంది. ఇక సిద్ధరామయ్యతో కూడా కుమారస్వామిది ఉప్పూనిప్పూ వ్యవహారమే! ఒకప్పుడు సిద్ధరామయ్య దేవగౌడకి వీరవిధేయుడిగా ఉంది అన్ని సందర్భాలలో చేదోడుగా నిలిచాడు. కానీ కుమారస్వామి రాకతో అతని ప్రాధాన్యత తగ్గిపోవడమే కాకుండా పార్టీ నుంచి కూడా వెలివేయబడ్డాడు. ఎన్నికల ముందు వరకూ సిద్ధరామయ్య కుమారస్వామి మీదా, కుమారస్వామి సిద్ధరామయ్య మీదా నిప్పులు చెరిగారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకోవైపు బీజేపీ కూడా కుమారస్వామి ప్రభుత్వాన్ని ఎలాగొలా అస్థిరపరచాలనే ఆలోచనలో ఉండక మానదు. మోదీ- షా ద్వయం తమకు జరిగిన గర్వభంగాన్ని అంత తేలికగా మర్చిపోతారనుకోలేం. ఇన్ని పడగల నడుమ కుమారస్వామి ప్రభుత్వం నిండు ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపించగలదా అన్నదే కోటి రూపాయల ప్రశ్న!

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న బూచాడి భయం

    వాళ్లు మనకి అర్థం కాని భాషలో మాట్లాడుకుంటారు. ఎవరన్నా మనుషులు ఒంటరిగా కనిపిస్తే దాడి చేస్తారు. ఆ తర్వాత అతని మెదడుని ఒలుచుకుని తినేస్తారు. ఇదేదో ఇంగ్లిష్‌ హారర్‌ మూవీ కాదు! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యమేలుతోన్న బూచాళ్ల భయం. బీహార్‌ నుంచి వచ్చిన కొంతమంది సైకోలు ఇలా దాడులకు పాల్పడుతున్నారంటూ కొద్ది రోజులుగా వాట్సప్‌లో సందేశాలు వ్యాపిస్తున్నాయి. దాంతో చాలా గ్రామాల్లో పిల్లలను గదుల్లో ఉంచి తాళం వేసేస్తున్నారు. కొత్తవాళ్లు ఎవరన్నా కనిపిస్తే చితకబాదేస్తున్నారు. వింతగా ఎవరు ఉన్నా వెంటపడుతున్నారు. చివరికి పోలీసులు రంగంలోకి తిరిగి ఊరూరా తిరిగి ప్రజలను సముదాయించాల్సి వస్తోంది. తమిళనాడులో ఇలాగే ఓ కారులో దిగినవారిని, పిల్లలు ఎత్తుకుపోయేవారుగా స్థానికులు అనుమానించారు. ఈ విషయాన్ని వాట్సప్‌లో షేర్‌ చేసుకుని, ఊరు బయట వాళ్లని అడ్డగించారు. అమాయకులం అని మొత్తుకున్నా వినకుండా వాళ్లలో ముగ్గురిని కొట్టి చంపేశారు. బూచాడి భయంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని పోలీసులు భయపడుతున్నారు. అందుకే ఓ పక్క బూచాడి భయం లేదని బుజ్జగిస్తూనే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించాల్సి వస్తోంది. మనిషి సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్లినా, ఆలోచన మాత్రం ఆటవిక స్థాయిలోనే మిగిలిపోతే ఎలా ఉంటుందో బూచాడి భయం మరోసారి నిరూపిస్తోంది. వెర్రితనానికి వాట్సప్‌ తోడై విచక్షణను మంటకలిపేస్తోంది.

"జనసేన"లోకి సుజనా.. అందుకే ఇలా..!

  గత కొద్దిరోజులుగా సుజనా చౌదరి పార్టీ మార్పుపై వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి పదవికి తాను ఎప్పుడైతే రాజీనామా చేశారో అప్పటినుండి  ఆయన టీడీపీని వీడి బీజేపీలోకి చేరుతున్నారన్న వార్తలు తెగ హల్ చల్ చేశాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అదేంటంటే 'సుజనాచౌదరి' పవన్‌ కళ్యాణ్‌ పార్టీలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే..దీనికి సంబంధించి...చర్చలు పూర్తి అయ్యాయని...ఆయన త్వరలో అధికారికంగా 'జనసేన' పార్టీలోకి చేరతారని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. నిజానికి తన పదవికి రాజీనామా చేసిన తరువాత సుజనాచౌదరి పార్టీ కార్యక్రమాల్లో మునుపటిలా పాల్గొనటంలేదనే చెప్పొచ్చు. టిడిపి కార్యక్రమాల్లో 'సుజనా' మొక్కుబడిగా పాల్గొంటున్నారు.ఏ కార్యక్రమంలోనూ..ఆయన పాల్లోవడం లేదు. టిడిపి విజయవాడలో నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలోనూ 'సుజనా' పాల్గొనలేదు. ఇక తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో కూడా ఏదో నామ్ కే వాస్త్ పాల్గొని చంద్రబాబు రాకముందే ప్రసంగించి... ఆయన రాకముందే వెళ్లిపోయారు.   దీనికి పలు కారణాలు కూడా వినిపిస్తున్నాయి. బిజెపితో...పొత్తు తెంచుకోవడం 'సుజనా'కు ఇష్టం లేదట. వారితోనే కలసి వెళ్లాలనేది ఆయన ఉద్దేశ్యమట. కానీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా.. ఇంకా బీజేపీతో ఉంటే ఏపీ ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత ఇంకా పెరుగుతుందని భావించి చంద్రబాబు వారితో తెగదెంపులు తెంచుకున్నారు. అందుకే సుజనా కాస్త అసంతృప్తితో ఉన్నారట. అందుకే పార్టీ కార్యక్రమాల్లో గతంలో పాల్గొన్నంత ఇంట్రస్టింగ్ గా పాల్గొనడం లేదట. ప్రస్తుతం తనకు సంబందించిన వ్యాపార విషయాలపై ఎక్కువ శ్రద్దపెడుతున్నారని, ఢిల్లీలో బిజెపి నాయకులతో కలసి తిరుగుతున్నారని... ఆయన పార్టీలో ఉండడం కష్టమేనని..ఓ సీనియర్‌ టిడిపి నేత వ్యాఖ్యానించారు. ఇక ఆయన మాటలను నిజం చేస్తూ... .'సుజనా' 'జనసేన' పార్టీలోకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపిలోకి ఆయన వెళ్లలేరు...అందుకే 'జనసేన'ను ఎంపిక చేసుకున్నారని... ఇప్పటికే..తనకు చెందిన ఛానెల్‌ను..'జనసేన'కు అనుకూలంగా మార్చారని...'ప్రస్తుతం 'పవన్‌' సభలకు, కార్యక్రమాలకు ఆయన ఆర్థిక సహాయం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

శ్రీకృష్ణుని ఆలయంపై పాకిస్తాన్ సంచలన నిర్ణయం....

పాకిస్తాన్ లో ఉన్న శ్రీకృష్ణుని ఆలయంపై ఆదేశం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం అక్కడి హిందువులను షాక్‌తో పాటు, ఒకింత ఆనందానికి గురిచేసింది. అదేంటంటే..  రావల్పిండి, ఇస్లామాబాద్‌ జంటనగరాల్లో పురాతన శ్రీకృష్ణుడి ఆలయం ఉంది ఒక్కటే. శ్రీకృష్ణుడి ఆలయ అభివృద్ధికి దాదాపు 20 మిలియన్ల రూపాయలు కేటాయించి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రావిన్స్‌ అసెంబ్లీలో హిందూ సభ్యుడి సిఫార్సు మేరకు ఈ నిధులు మంజూరు చేసినట్లు అదనపు పరిపాలనాధికారి మహ్మద్‌ ఆసిఫ్‌ తెలిపారు. నూతన ఆలయ నిర్మాణం పూర్తైయ్యంత వరకూ విగ్రహాలను భద్రపరుస్తామని ఆసిఫ్‌ పేర్కొన్నారు.   కాగా 1897లో కంజీమాల్, రామ్‌ రచ్‌పాల్‌ అనే ఇద్దరు ఈ గుడిని నిర్మించారు. 1970లో పాక్‌ ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ట్రస్టు ప్రాపర్టీ బోర్డు పరిధిలోకి ఈ ఆలయం వెళ్లింది. ఇక్కడ ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ఈ దేవాలయంలో పూజలు జరుగుతుంటాయి. ఈ గుడికి సంబంధించిన ప్రాంత పరిధిని పెంచాలని స్థానిక హిందువులు గత కొంత కాలంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్న నేపథ్యంలో పాక్‌ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ అభివృద్ధికి త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గుడి  కనీసం 100 మంది భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉందని, దాన్ని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు వెల్లడించారు.

యాడ్యురప్ప బేరసారాలు.. బయటపెట్టిన కాంగ్రెస్

ఇప్పటికే కర్ణాటకలో బలపరీక్షలో ఏం జరగుతుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక బలపరీక్ష సమయం దగ్గర పడుతున్న కొద్ది కొత్త కొత్త ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా యడ్యూరప్ప కాంగ్రెస్ పార్టీ నేతలపై బేరాసారాలకు దిగిన ఆడియో టేపులు బయటపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఆడియో టేపులను బయటపెడుతోంది. ఆడియో టేపులో ఉందంటే.. యడ్యూరప్ప: ఎక్కడున్నారు? పాటిల్: బస్సులో ఉన్నాం. కొచ్చికి వెళుతున్నాం. యడ్యూరప్ప: కొచ్చికి వెళ్లకు. వెనక్కి వచ్చేయ్. పాటిల్: నా పొజిషన్ ఏమిటో ముందు చెప్పండి. యడ్యూరప్ప: యూ విల్ బికమ్ మినిస్టర్. కావాల్సినంత సాయం కూడా చేస్తాం. పాటిల్: నాతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. యడ్యూరప్ప: వాళ్లను కూడా పిలుచుకుని రా. ఇంకా ఏమైనా కావాలంటే శ్రీరాములుతో మాట్లాడతా. పాటిల్: అలాగే అన్నా. యడ్యూరప్ప: ఏం చేయాలనుకుంటున్నావు? పాటిల్:  మీరు చెప్పినట్టే చేద్దాం. ఐదు నిమిషాల్లో మళ్లీ ఫోన్ చేస్తా.

కర్ణాటకలో బీజేపీ నెగ్గేస్తుందా!

  ఇప్పుడు దేశం అంతా కర్ణాటక వైపే చూస్తోంది. అక్కడ ప్రజాస్వామ్యం ఎన్ని మెలికలు తిరుగుతోందో గమనిస్తోంది. మోదీ ప్రచారం పుణ్యమా అని బీజేపీ 100 మార్కుల దాటేసింది. కానీ మ్యాజిక్‌ ఫిగర్‌కు మరో 8 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీనికి తెలుగువారి ఓట్లే కారణం అన్న చర్చ లేకపోలేదు. అయినా బీజేపీ పెద్దలు ప్రజా తీర్పుని ఆమోదించే పరిస్థితుల్లో లేరు. ఎలాగైనా దక్షిణాదిన పాగా వేయాలనే పట్టుదలతో వారు సామదానబేధదండోపాయాలను అమ్ములపొదిలోంచి బయటకు తీస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శిబిరం నుంచి జంప్‌ అయిపోయినట్లు వార్తలు వచ్చేశాయి. మరికొంతమంది తీరు కూడా అనుమానాస్పదంగానే ఉంది. దీనికి తోడు కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను మభ్యపెట్టేందుకు గాలిలాంటి దళారులు రంగంలోకి దిగారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే పక్షపాతిగా పేర్కొన్న బోపయ్యను స్పీకర్‌గా నియమించడం మరో ఎత్తు. బోపయ్య యడ్యూరప్పకు వీరవిధేయుడు. యడ్యూరప్పను కాపాడేందుకు ఉచ్చనీచాలను పెద్దగా పట్టించుకోనివాడు. ఇలాంటి దశలో ఎలాగొలా తమను బోపయ్య కాపాడేస్తాడనే నమ్మకంలో బీజేపీ శ్రేణులు ఉన్నాయి. అప్పటికప్పుడు ఏదో ఒక వంకతో కొందరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి పరిస్థితులను తిరగతిప్పేయడంలో బోపయ్య సిద్ధహస్తుడు. కొందరు ఎమ్మెల్యేలు గట్టు దాటినా, కొందరు గైర్హాజరైనా ఆయన పని మరింత సులువైపోతుంది. ఇలాంటి వాతావరణం మధ్య ఇవాళ తలపెట్టే కర్ణటక బలపరీక్షలో బీజేపీనే నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఆ తర్వాత మళ్లీ రచ్చ మొదలవ్వకా తప్పదు. సుప్రీం తలుపులు బాదకా తప్పదు! ప్రజాస్వామ్యానికి ఎన్ని కష్టాలో!

బీజేపీ గుట్టు రట్టు... గోడ దూకేయ్.. బయటే కారుంది

  కన్నడ రాజకీయాల్లో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీజేపీ అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. అలా అధికారం చేపట్టారో లేదో అప్పుడే బల నిరూపణ కోసం కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు గాలం వేయడం స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరు నగర శివారులోని ఈగల్టన్‌ రిసార్టులో బస చేస్తున్న జేడీఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు పోలీసులు ఆకస్మికంగా భద్రత ఉపసంహరించుకున్నారు. ఇదంతా బీజేపీ కుట్రలో భాగమే అని.. తమ ఎమ్మెల్యేలను తమవైపుకు లాక్కోవడానికే ఇలాంటి చర్యలు చేపడుతున్నరాని ఆరోపించాయి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు. ఈ ఆరోపణలు నిజమని తాజాగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.   కాంగ్రెస్ చెప్పిన దాని ప్రకారం.. నేను రిసార్టులో ఉండగా.. నన్ను గోడ దూకి ఎలాగైనా బయటికి రావాలని ఓ ఫోన్ వచ్చింది. అంతేగాక. రిసార్టు బయటే ఓ కారు మీ కోసం వేచి ఉందని చెప్పారు' అని తనకు వచ్చిన ఫోన్ కాల్ గురించి చెప్పారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన రెండు పార్టీలు వెంటనే..  తమ ఎమ్మెల్యేలను కేరళకు తరలించాలనుకున్నారు. ప్రత్యేక విమానంలో కేరళకు తరలించాలనుకున్నారు కానీ.. పౌరవిమానయాన శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో ప్లాన్‌ మార్చారు. ఎమ్మెల్యేలందరినీ ప్రత్యేక బస్సుల్లో ఎక్కించి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య హైదరాబాద్‌కు తరలించారు. ఎమ్మెల్యేలను సురక్షితంగా కాపాడుకోవడానికి హైదరాబాదే సరైన ప్రదేశమని కాంగ్రెస్‌, జేడీఎస్‌ భావించి ఇక్కడికి తరలించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముందుగా పార్క్‌ హయత్‌కు వెళ్లాలని భావించిన ఎమ్మెల్యేలు.. భద్రతా పరంగా అనుమానాలు వ్యక్తం కావడంలో ప్లాన్‌ మార్చుకున్నారు. దీంతో జేడీఎస్‌ ఎమ్మెల్యేలు నోవాటెల్‌ హోటల్‌కు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తాజ్‌కృష్ణకు చేరుకున్నారు. కర్ణాటక ఎమ్మెల్యేలు బస చేసిన హోటళ్ల‌ వద్ద హైదరాబాద్‌ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. హోటళ్లలోకి ఇతరులెవరినీ పంపించడం లేదు. ముఖ్యమైన వారిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. మొత్తానికి బీజేపీ బలనిరూపణలో ఎలాగైనా గెలవాలని అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు బాగానే కష్టపడుతున్నాయి. బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇంకా ఏడుగురు ఎమ్మెల్యేలను ఎలాగైనా తమ వైపుకు లాక్కోవాలని విశ్వ ప్రయత్నాలే చేస్తోంది. మరోపక్క కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలు బీజేపీకి ప్రలోభపడకుండా.. వారిని కాపాడుకునే పనిలో ఉన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో..

కర్ణాటక బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై పవన్...నాకు ముందే తెలుసు..

  కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దాంతో జేడీఎస్ పార్టీ కీలకంగా మారిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు జేడీఎస్ తో పొత్తుపెట్టుకోవడానికి బాగానే ప్రయత్నాలు చేసింది. అయితే జేడీఎస్ మాత్రం బీజేపీకి షాకిచ్చి.. కాంగ్రెస్ కు మద్దతిచ్చిందనుకోండి. కాంగ్రెస్ కూడా తాము అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు.. బీజేపీ మాత్రం రాకూడదూ అన్న నేపథ్యంలో కుమార స్వామికి ఏకంగా ముఖ్యమంత్రి పదవినే ఆఫర్ చేశారు. దాంతో జేడీఎస్ కూడా కాంగ్రెస్ కు మద్దతిచ్చింది. కానీ కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు మొత్తం బూడిదలో పోసిన పన్నీరైపోయాయి. కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉంది కాబట్టి.. బీజేపీ పెద్దలు చక్రం తిప్పారు. మ్యాజిక్ ఫిగర్ దాటకపోయినా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు చేయడానికి గవర్నర్ గారు అనుమతిచ్చేశారు. ఇక బీజేపీ చేసిన పనికి ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలతో పాటు.. బీజేపీ విపక్ష పార్టీలన్నీ మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ఇదిలా ఉండగా ఇప్పుడు కర్ణటాకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ విషయం తనకు ముందే తెలుసని అన్నారు. ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... నెల రోజుల క్రితమే తాను కొంత మంది అధికారులను కలిసినప్పుడు తనతో ఈ విషయంపై పలు విషయాలు పంచుకున్నారని అన్నారు. కర్ణాటకలో బీజేపీకి 90లోపు సీట్లు వచ్చినప్పటికీ బీజేపీయే అధికారంలోకి వస్తుందని అన్నారని, వారి విధానాలు వారికి ఉన్నాయని...అవేంటో అందరికీ తెలుసని, దాని గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదని అన్నారు. అంతేకాదు... దీనిని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు.. ఎందుకంటే.. అన్ని పార్టీల్లోనూ లోపాలు ఉన్నాయి..ఎమ్మెల్యేల కొనుగోలు అనేది అన్ని పార్టీలు అనుసరిస్తున్నాయని..దశాబ్దాల నుంచి ప్రజాస్వామ్య పద్ధతులని నీరు గార్చుతూ తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఒక్క బీజేపీ మాత్రమే కాదని, టీడీపీ, వైసీపీ కూడా ఎమ్మెల్యేలను కొంటున్నాయని, అన్ని పార్టీలు బేరసారాలు చేస్తూనే ఉన్నాయని, ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని కోరుకునే వారిలో తానూ ఒకరినని అన్నారు.

చంద్రబాబు, కేసీఆర్ సహకరించాలి..

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఎంత ఉత్కంఠ రేకెత్తించాయో తెలుసు. ఇక ఫలితాలు వచ్చిన తరువాత హంగ్ ఏర్పడటంతో ఎవరు అధికారం పడుతారో కూడా అందరూ ఆసక్తికరంగా ఎదురుచూశారు. బీజేపీ 104 స్థానాలు, కాంగ్రెస్ 78 స్థానాలు, జేడీఎస్ 38 రావడంతో.. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోకపోవడంతో హంగ్ ఏర్పిడింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేశారు. కానీ జేడీఎస్ మాత్రం బీజేపీకి షాకిచ్చి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది. దీంతో ఇంకేముంది కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది అనుకున్నారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీదే హవా కాబట్టి.. వాళ్లు చక్రం తిప్పేశారు. దానిలో భాగంగానే గవర్నర్ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కూడా ఇచ్చేశారు. దీంతో యడ్యూరప్ప సీఎంగా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు.  బెంగళూరులోని రాజ్ భవన్ లో గవర్నర్ వాజూభాయ్ ఆయనతో ప్రమాణం చేయించారు.   ఇదిలా ఉండగా బీజేపీ చేసిన పనికి జేడీఎస్ నేత కుమారస్వామి కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ కలసి ఐకమత్యంతో పోరాడాల్సిన సమయం వచ్చిందని, తమ పోరాటానికి కలసి రావాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, టీఆర్ఎస్ నేత కేసీఆర్ తమకు సహకరించాలని జేడీఎస్ నేత కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. ఇటీవల కేసీఆర్ స్వయంగా బెంగళూరుకు వెళ్లి కుమారస్వామి, దేవెగౌడలతో తృతీయ కూటమిపై చర్చలు జరిపి వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా కలసి పోరాడాలని నిర్ణయించుకున్నందునే ఇప్పుడు తమకు మద్దతివ్వాలని కేసీఆర్ ను కుమారస్వామి కోరినట్టు తెలుస్తోంది. ఇక చంద్రబాబు కూడా బీజేపీతో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో, ఆయన వైపు నుంచి కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కుమారస్వామి భావిస్తున్నట్టు సమాచారం. మరి కేసీఆర్, చంద్రబాబు దీనిపై ఎలా స్పందిస్తారో మరి చూద్దాం..

ఇవి సర్కారు హత్యలే...

  తూర్పుగోదావరి జిల్లా మంటూరు పశ్చిమగోదావరి జిల్లా కోండ్రుకోట సమీపంలోని వాడపల్లి మధ్య గోదావరి నదిలో పడవ మునిగిపోయి ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ భారీ వర్షం, గాలుల ధాటికి నీట మునిగింది. ఇక ఈ ప్రమాదంలో 40మందికి పైగా గల్లంతయ్యారు. లాంచీ అరవై అడుగుల లోతులో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నీటిలో ఉన్న లాంచీ అద్దాలు పగలగొట్టినా దాని లోపలకి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని, లాంచీ తలుపులు తెరిచేందుకు ఎంత యత్నించినా సాధ్యం కాలేదని కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. మృతదేహాలు కూడా పడవలోనే చిక్కుకుని ఉండిపోవడంతో సహాయ బృందాలకు సవాల్‌గా మారింది. అయితే  పడవకు తాళ్లు కట్టి భారీ క్రేన్ల సాయంతో దాన్ని ఎట్టకేలకు ఒడ్డుకు తీసుకొచ్చారు. అందులో చిక్కుకుని ఉన్న మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికితీస్తున్నారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దసేపటి క్రితం హెలికాప్టర్లో ప్రమాద స్థలానికి చేరుకుని సహాయచర్యలను పరిశీలిస్తున్నారు. ఆయన వెంట పలువురు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.     ఇక ఈఘటనపై స్పందించిన ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి ఎప్పటిలాగే  ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన ఆయన... "ఇది చాలా బాధ కలిగించిన ఘటన. దాదాపు 40 మంది మృతి చెందారు. వీటిని సర్కారు హత్యలుగానే పరిగణించాలి. గతేడాది నవంబరులో కృష్ణా జిల్లాలో చంద్రబాబు ఇంటికి కొద్ది దూరంలోనే ఓ బోటు మునిగింది. అప్పట్లో 20 మందికి పైగా చనిపోయారు. ఇప్పటికీ ప్రభుత్వం మేల్కోలేదు. లైసెన్సులు లేకుండా బోట్లను తిప్పుతున్నారు. వారు లంచాలు ఇస్తున్నారు... అందుకే ముఖ్యమంత్రి ఇటువంటి ఘటనలపై స్పందించరు. ఐదు రోజుల కిందటే ఓ బోటులో అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎవ్వరూ చనిపోలేదు. అది జరిగిన ఐదురోజులకే మళ్లీ మరో బోటు నీళ్లలో మునిగిపోయింది. దాదాపు 40 మంది చనిపోయారు. మంత్రుల దగ్గరనుంచి చంద్రబాబు వరకు లంచాలు అందుతున్నాయని మండిపడ్డారు.

ఆళ్లకు ఏసీబీ నోటీసులు.. ఇప్పుడేమంటావ్ సామి...!

  బినామీ ఆస్తుల కేసుల విచారణలో భాగంగా ఏపీ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఏసీబీకి అది కామన్ ధింగే కదా అని అనుకుంటున్నారా..? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇంతకీ నోటీసులు పంపించింది ఎవరికి అనుకుంటున్నారా..? ఆయనెవరో కాదు.. తానో సత్య హరిశ్చంద్రుడిలా.. అసలు ఏ తప్పు చేయనివాడిలా మాట్లాడే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. బినామీ ఆస్తుల కేసులో విచారణలో హాజరు కావాలంటూ ఏపీ ఏసీబీ ఈయనకు నోటీసులు జారీ చేసింది. అసలు సంగతేంటంటే..   డీఎస్పీ దుర్గాప్రసాద్ ఆస్తులపై తనిఖీలు జరిపిన ఏసీబీ పలు అక్రమాస్తులను వెలికి తీసిన సంగతి తెలిసిందే. గుంటూర, చీరాల, ఒంగోలు, హైదరాబాద్ సహా 14 చోట్ల తనిఖీలు చేసి.. ఇళ్లు, ఫ్లాట్లతో పాటు కార్లు, బంగారం 3 కిలోల వెండి ఇంకా పలు అక్రమాస్తులు బయటకు తీశారు. అంతేకాదు.. ఈ తనిఖీల్లో పలు ఆసక్తికర విషయాలు కూడా బయటపడ్డాయి. ఆయన తిరిగే కారు ఆ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడి పేరుతో ఉంటే.. ఆయన బినామీ ఆస్తులు ప్రతిపక్ష ఎమ్మెల్యే భార్య పేరిట ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దుర్గాప్రసాద్ కు చెందిన పలు ఆస్తులకు ఆళ్ల బినామీగా ఉన్నారని ఏసీబీకి సమాచారం ఉంది. దీంతో విచారణకు హాజరుకావాలని ఐపీసీ సెక్షన్ 160 కింద అళ్లకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. మొత్తానికి ఇన్ని రోజులు నీతి కబుర్లు చెబుతూ.. జగన్ కు బినామీగా కోర్టుల్లో.. ట్రిబ్యునళ్లలో పిటీషన్లు వేసి ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్న ఆళ్ల ఇప్పుడు అవినీతి అధికారులకు కూడా బినామీ అని తేలిపోయింది. మరి ఇప్పుడు దీనిపై ఆళ్ల ఎలా స్పందిస్తాడో.. ఎలా కవర్ చేస్తాడో చూద్దాం...

బీజేపీ చెప్పేదంతా అబద్దం.. మేమంతా ఒకటే...

  అనుకున్నట్టుగానే కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో జేడీఎస్ కీలకంగా మారిన సంగతి కూడా విదితమే. మరోపక్క బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జేడీఎస్ పార్టీని తమవైపు లాక్కునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఇప్పటికే జేడీఎస్ తో సంప్రదింపులు జరిపిన కాంగ్రెస్ జేడీఎస్ కు బయట నుంచి మద్దతు ఇస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పేశారు. అంతేకాదు కుమార స్వామిని ముక్యమంత్రిగా చేసేందుకు కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసింది.  బీజేపీ కూడా రంగంలోకి దిగి ఎలాగైన అధికారం చేపట్టాలని చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేస్తే  బీజేపీ దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణకు డిప్యూటీ సీఎం పదవిని ఇస్తామని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. రేవణ్ణ వెనకాల దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన 12 మంది ఎమ్మెల్యేలతో తమకు మద్దతు ఇస్తున్నారని కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిసిన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప ప్రకటించారు. దీంతో ఇప్పుడు జేడీఎస్ లో చీలిక ఏర్పడే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి.   అయితే ఇప్పుడు ఈ వార్తలపై స్పందించిన జేడీఎస్ అధినేత దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ మీడియాతో మాట్లాడుతూ... తామంతా ఒక్కటేనని, తమలో చీలిక లేదని రేవణ్ణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి కూడా మాట్లాడుతూ... తనను జేడీఎస్ శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు. మత విద్వేషాలు రెచ్చకొట్టి బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందిందని చెప్పారు. ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీతో కలవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వైపు రాకపోతే ఇన్కమ్ టాక్స్ రైడ్ లు వంటివి చేయిస్తామని కేంద్రప్రభుత్వ సంస్థలతో తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీజేపీని నిరోధించేందుకు తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తామన్నారు. మరి దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూద్దాం...

కాంగ్రెస్, బీజేపీ వార్... ముఖ్యమంత్రిగా కుమారస్వామి..!

  నిన్నటి వరకూ కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ కనుక గెలిస్తే యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని... కాంగ్రెస్ కనుక గెలిస్తే సిద్ద రామయ్య ముఖ్యమంత్రి అవుతారన్న అభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ప్రధాన పార్టీలు ఆ రెండే కాబట్టి.. ఆ రెండు పార్టీలకే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఇద్దరిలోనే ఎవరో ఒకరు ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలా అనుకోవడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా మరో వ్యక్తి తెరపైకి వచ్చారు. అది ఎవరో కాదు కుమార స్వామి.   నిజానికి ఈరోజు ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తరువాత.. కొద్దిసేపటికే బీజేపీ హవా కొనసాగించింది. దాదాపు అన్ని చోట్లా ఆధిక్యంలోకి వచ్చి మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసింది. కానీ ఓట్ల లెక్కింపు జరిగేకొద్ది క్షణ క్షణానికి ఫలితాలు మారుతూ.. అందరిలో ఆసక్తి రేకెత్తించాయి. దాంతో నిన్నటి వరకూ కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందీ అనున్నారు కానీ.. ఆ పరిస్థితి లేదు.. బీజేపీనే అధికారం చేపడుతుందని అందరూ ఊహించారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ   చిన్న చిన్నగా కాంగ్రెస్ కూడా పుంజుకోవడం మొదలుపెట్టిందో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చాలా చోట్ల బీజేపీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ దూసుకొచ్చింది. దాంతో బీజేపీ కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయింది. ముందునుండి అనుకున్నట్టుగానే హంగ్ ఏర్పడింది. దాంతో ఇప్పుడు జేడీఎస్ కీలకంగా మారింది.   మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జేడీఎస్ తో మంతనాలు మొదలుపెట్టేశాయి. కాంగ్రెస్ కు అధికారం రాకూడదని బీజేపీ... ఏమైనా సరే.. కర్ణాటక పీఠం బీజేపీకి దక్కకూడదన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పటికే కాంగ్రెస్ నుండి గులాం నబీ అజాద్ వంటి పెద్దలు వచ్చి పావులు కదపటం మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే... జేడీఎస్ కు బయట నుంచి మద్దతు ఇస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పినట్టు సమాచారం. తమకు అధికారం అక్కర్లేదని.. జేడీఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని.. కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.  దీంతో.. కాంగ్రెస్ తో కలుద్దామా?  వద్దా?  అన్న ఆలోచనలో ఉన్న కుమారస్వామి... వెతుక్కుంటూ వచ్చిన సీఎం పదవిని ఓకే చేసే అవకాశం ఉందంటున్నారు. వరుస దెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జేడీఎస్.. తానే అధికారం చేపట్టే ఛాన్స్ వస్తే.. ఆ అద్భుత అవకాశాన్ని వదులుకునేది లేదు అంటున్నారు. దీంతో.. కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా మారింది. ఇక బీజేపీ కూడా తమ వంతు తాము ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. మరి చూద్దాం ఆఖరికి ఏం జరుగుతుందో..

జేడీఎస్ కింగ్ మేకర్ అవ్వనుందా..?

  కర్ణాటక ఎన్నికలు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇక ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గెలుపు ఎవరిదో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒక్క ఆ రెండు పార్టీలు మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీలు.. సామాన్య ప్రజల చూపు కూడా ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలపై పడింది. ఇక ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం మొదలైన కౌంటింగ్ క్షణ క్షణానికి తారుమారు అవుతున్నాయి. కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బీజేపీదే హవా అన్నటాక్ వచ్చేసింది. అన్ని చోట్ల దాదాపు బేజీపీనే ఆధిక్యంలో ఉంది. దాంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు అప్పుడే. అయితే క్రమ క్రమంగా కాంగ్రెస్ పుంజుకుంటోంది. బీజేపీ ఆధిక్యత చిన్నచిన్నగా తగ్గుతోంది. 222 స్థానాలకు ఎన్నికలు జరుగగా, 112 స్థానాల్లో గెలిస్తే అధికారం ఖాయమవుతుంది. ఈ నేపథ్యంలో ఒకానొక దశలో 118 స్థానాల్లో ఆధిక్యాన్ని చూపిన బీజేపీ ఇప్పుడు చాలా స్థానాల్లో ఆధిక్యాన్ని కోల్పోయింది. ఇక ఇవే ఫలితాలు కనుక చివరి వరకూ కొనసాగితే మాత్రం హంగ్ ఏర్పడక తప్పదు. అలా ఏర్పడితే కనుక జేడీఎస్ కింగ్ మేకర్ గా మారాల్సిందే. మరి ఒకవేళ హంగ్ కునుక వస్తే తమ మద్దతు కాంగ్రెస్ కే ఇస్తామని ఇప్పటికే జేడీఎస్ అధికార ప్రతినిధి డానిష్ అలీ స్పష్టం చేశారు.  కాంగ్రెస్ కనుక ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు గెలవకుంటే తమ మద్దతు ఆ పార్టీకేనని.. మేం కాంగ్రెస్‌తోనే వెళ్తాం. అది మా బాధ్యత కూడా.. బీజేపీతో మేం వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు.   ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో అంశం కూడా తెరపైకి వస్తుంది. గతంలో గోవా, మణిపూర్ ఎన్నికల సమయంలో బీజేపీ... ఫిరాయింపుదారులను ప్రోత్సహించి, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమవైపు లాక్కుని  లో అధికారానికి దగ్గరైనట్టే, కర్ణాటకలోనూ ఓ ఐదారుగురు ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో.. బేడీఏస్ కింగ్ మేకర్ గా మారుతుందో..? లేదో..? ఏ జరుగుతుందో తెలుసుకోవాలంటే ఫలితాలు ఆఖరి వరకూ ఆగాల్సిందే.

అనిల్ అంబానీ, చంద్రబాబు భేటీ వెనుక ఆంతర్యం అదేనా..!

  ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ ‌అంబానీ ఏపీ రాజధాని అమరావతిని సందర్శించారు. ముందు ఆయన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు అంబానీకి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబుతో ఆయన అమరావతి సచివాలయంలో భేటీ అయ్యారు. నెల్లూరు జిల్లాలో పవర్‌ప్రాజెక్టు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఏర్పాటు తదితర అంశాలపై అనిల్ అంబానీ సీఎంతో చర్చించినట్టు సమాచారం. అయితే ఇక్కడివరకూ బాగానే ఉన్నా.... రేపు కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రం నుంచి వైదొలగిన తరవాత మోడీ పై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని పిలుపు ఇచ్చారు కూడా.   కాగా కొన్ని రోజుల క్రితం అనిల్‌ అంబానీ అన్న ముకేష్‌ అంబానీ చంద్రబాబుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ముకేష్ అంబానీ చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన సంగతి కూడా విదితమే. చంద్రబాబు ఇప్పుడు ఉన్న స్థాయి కంటే ఇంకా పెద్ద స్థాయిలో ఉండాలని ఉన్నారు. దీంతో ఇన్ డైరెక్ట్ గా చంద్రబాబుకు పీఎం పదవి కరెక్ట్ అని ముకేష్ అంబానీ అన్నారని పలు వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు బాబు, ముకేష్ భేటీ తరవాతే చంద్రబాబు వైఖరిలో పూర్తి మార్పు వచ్చిందని..మోడీ పై బాబు దాడి తీవ్రం చేశారని... అన్నారు. ఇక ఇప్పుడు అనిల్‌ అంబానీతో భేటీ అయ్యారు. రాఫెల్‌ డీల్‌ విషయంలో మోడీ-అనిల్ బంధం పై కాంగ్రెస్‌ ఇప్పటికే తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే పక్షంలో మోడీ వ్యతిరేక వర్గం మరింత బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు వైపు కాంగ్రెస్, బీజేపీ యేతర పక్షాలు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబు-అనిల్‌ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మోడీ తరఫున అనిల్‌ అంబానీ రాయబారం నెరుపుతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. కానీ..  అధికారులు చెప్తున్న విషయం ఏంటంటే... అనిల్ దీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) గ్రూప్ నెల్లూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో విద్యుత్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను చేపట్టారు. అయితే, ఈ ప్రాజెక్టుల్లో పురోగతి కనిపించడం లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం సదరు భూమిని వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ, చంద్రబాబుతో భేటీ అవుతున్నారని చెబుతున్నారు. చూద్దాం మరి వీరి భేటీ వెనుక అసలు రహస్యం ఏంటో..

కర్ణాటక ఎన్నికల్లో హంగ్...జేడీఎస్ కీలకం.. ఆపార్టీకే మద్దతు..

  ఎట్టకేలకు కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అందరి చూపు ఎన్నికల ఫలితాల మీద పడింది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అని అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే ఎన్నో సంస్దలు సర్వేలు కూడా చేశాయి. అయితే ఒక్కో సంస్థ ఒక్కో రకంగా చెబుతుండటంతో అసలు ఏ పార్టీ గెలుస్తుందా అని అందరూ ఆసక్తికరంగా మారింది. ఒకానొక సందర్భంలో హంగ్ కూడా ఏర్పడుతుందన్న వార్తలు కూడా వచ్చాయి. ఒకవేళ హంగ్ కనుక ఏర్పడితే పరిస్థితి ఏంటన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో జేడీఎస్ అధికార ప్రతినిధి డానిష్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.   ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో చాలా వరకు బీజేపీ సుమారు 97 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని...  బీజేపీ తర్వాతి స్థానంలో 90 సీట్లతో కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని.. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 112 సీట్లు అవసరం.. దీంతో జేడీఎస్ కీలకంగా మారింది.  జేడీఎస్‌కు 31 సీట్లు రావచ్చని అంచనా. ఆ పార్టీ మద్దతు ఇచ్చే వారే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలను బట్టి జేడీఎస్ మద్దతు బీజేపీకేనని అందరూ భావించారు. కానీ.. ఆ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, కాంగ్రెస్ కనుక ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు గెలవకుంటే తమ మద్దతు ఆ పార్టీకేనని, అది తమ బాధ్యత అని జేడీఎస్ అధికార ప్రతినిధి డానిష్ అలీ తెలిపారు. ఇక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, జేడీఎస్‌ను బీజేపీ-బి టీమ్‌గా అభివర్ణించారు. రాహుల్ ఆరోపణలను దేవెగౌడ కొట్టివేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు తాము మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ తర్వాత జేడీఎస్ ప్రధాన కార్యదర్శి, ముఖ్య అధికార ప్రతినిధి అయిన డానిష్ అలీ మాట్లాడుతూ.. ‘‘బీజేపీతో మేం వెళ్లే ప్రసక్తే లేదు. కాంగ్రెస్‌కు ఒకవేళ మెజారిటీ రాకుంటే, ఆ పార్టీకి వంద లోపు సీట్లు వస్తే… అప్పుడు మేం కాంగ్రెస్‌తోనే వెళ్తాం. అది మా బాధ్యత కూడా’’ అని పేర్కొన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో...హంగ్ ఏర్పడుతుందో.. లేదో..!

ఏకంగా బెదిరింపులకే దిగారుగా..!

  మీకు అమరావతి ఎందుకు, మయసభ కట్టుకుంటారా అని గతంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఎగతాళి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా బెదిరింపు చర్యలకే దిగుతున్నారు. కర్ణాటక ఎన్నికలు ముగియగానే, ఆంధ్రప్రదేశ్ సంగతి చూస్తాం అంటూ గత కొన్ని రోజులుగా బీజేపీ పెద్దలు మాట్లాడుతున్న నేపథ్యంలో అలా ఎన్నికలు ముగిశాయో లేదో అప్పుడే తమ నోటికి పని చెప్పారు. ముఖ్యంగా జీవీఎల్ నర్సింహారావు అయితే కాస్త ఎక్కువే మాట్లాడారు.  కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తున్నామని, ఎడ్యూర‌ప్ప‌పై ఏ అభియోగాలు లేవ‌ని, ఆయన చాలా క్లీన్ అని, అందుకే ఆయన్ను ముఖ్యమంత్రిని చేసాం అంటూ, చెప్పుకొచ్చిన ఆయన.. ఆంధ్రాలో రాబోయే ఆరు నెల‌ల్లో భాజ‌పాకి మ‌హ‌ర్ద‌శ రాబోతోంద‌ని..ఆంధ్రప్రదేశ్ లో, కొన్ని రోజుల్లోన్నే అనూహ్య పరిణామాలు ఉంటాయని... ఆంధ్రప్రదేశ్ ని ఏలేది మేమే అంటూ, జోస్యం చెప్పారు.రాజకీయంగా అన్ని పార్టీలు, ఈ అనూహ్య పరిణామాలు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై కూడా విపరీత వ్యాఖ్యలు చేసారు... చంద్రబాబు నాయుడు అవినీతి చేసారని, దాని అంతు చూస్తాం అంటూ పాత పాటే పాడారు.. కర్ణాటక రాష్ట్రంలో భాజ‌పా అధికారంలోకి వ‌చ్చాక సిద్ధరామయ్య పై విచార‌ణ జ‌రుగుతుంద‌న్నారు. ఎడ్యూర‌ప్ప జైలుకి వెళ్లొచ్చినంత మాత్రాన అవినీతిప‌రుడు అయిపోతారా అంటూనే, జగన్ కూడా ఇదే బాపతు అనే విధంగా, మాట్లాడి వీరి బంధాన్ని బయట పెట్టారు..

చంద్రబాబు ఆదేశం కూడా లెక్కచేయలేదుగా...

  గత కొద్దిరోజులుగా టీడీపీ నేత సుజనా చౌదరి బీజేపీలో చేరుతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పందించిన సుజనా చౌదరి..అబ్బే అదేం లేదు... తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని చెప్పుకొచ్చారు. కానీ సుజనా అలా చెపుతున్నా ఆయన చేసే పనులు.. వైఖరి చూస్తుంటే మాత్రం ఈవార్తల్లో ఎంతో కొంత నిజం ఉందన్న అనుమానాలు రాక తప్పదు. ఇప్పుడు చంద్రబాబు మాటలు కూడా సుజనా లెక్కచేయట్లేదన్న వార్తలు వస్తున్నాయి. తెలుగు దేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఎట్టి పరిస్థితిల్లోనూ పార్టీలోని ముఖ్య నేతలు రావాల్సిందేనని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారట. కానీ సుజనా మాత్రం ఆయన ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ సమావేశానికి డుమ్మా కొట్టారట. దీంతో బీజేపీతో టీడీపీ కలిసున్నంత కాలం ఇరు పార్టీల మధ్య కీలకంగా వ్యహిరించిన సుజనా.. ఇప్పుడు భేటీకి రాకపోవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్డీయేలో టీడీపీ ఉన్నప్పుడు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన సుజనా.. ఎప్పుడైతే టీడీపీ బీజేపీతో కటీఫ్ అయిందో అప్పటినుండి పార్టీ కి సంబంధించిన సమావేశాల్లో పెద్దగా కనిపించకుండా పోయారు. ఇక ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ఆదేశాన్నే పట్టించుకోకుండా ఇలా చేయడంతో.. రేపో మాపో తాను బీజేపీలో చేరుతున్నానని చెప్పడానికే సుజనా ఇలా చేస్తున్నాడేమో అని అనుకుంటున్నారు.