జేసీ చెప్పాడు... చంద్రబాబు పాటించాడు....
దేవుడు శాసించాడు...నేను పాటించాను అని ఓ సినిమాలో డైలాగ్ లాగా... ఇక్కడ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పిన సలహాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటించాడు. ఇంతకీ జేసీ ఇచ్చిన సలహా ఏంటీ... చంద్రబాబు పాటించింది ఏంటీ అనుకుంటున్నారా...? అసలు సంగతేంటంటే.. జేసీ దివాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ విషయాన్నైనా సరే మొహం మీదే చెప్పేస్తుంటారు. ప్రతిపక్ష పార్టీయే కాదు... సొంత పార్టీపైన కూడా విమర్శలు చేయడానికి ఏ మాత్రం వెనకాడరు. తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు.
అలా అమరావతికి చంద్రబాబును కలిసిన జేసీ తన మనసులో మాటను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేశారట. చంద్రబాబుతో భేటీ అయిన జేసీ..ఒక అరగంట సేపు, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థుతులు, చంద్రబాబు తీసుకోవాల్సిన తక్షణ చర్యల గురించి చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఆయనతో చర్చించినట్టు సమాచారం. మీరు ఏమైనా అనుకోండి, ఈ పనులు గురించి మీరు ఆలోచించాలి, నా సలహా పాటించాలి అంటూ, మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని.. 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినప్పటికీ వారికి సంతృప్తి లేదని....ప్రతిరోజూ ఏదో ఒక పని చేయమని అనడం.. బయోమెట్రిక్ అడెండెన్స్.. ఇలాంటివి వారికి కంటగింపుగా మారాయని...ఇది మీరు వెంటనే కరెక్ట్ చేసుకోపోతే, చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందని, దీని పై అలోచించి, అందరితో మాట్లాడి, ఒక నిర్ణయం తీసుకోండి అంటూ సీఎంకు దివాకర్‌రెడ్డి చెప్పారు.
దీంతో చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగి... బయోమెట్రిక్ హాజరుకు, జీతాలకూ మధ్య లింకు పెట్టనే పెట్టవద్దని ఉన్నతాధికారులను ఆదేశించారట. సమయం అటూ ఇటూ అయినా పర్వాలేదు.. కానీ... ప్రజల పట్ల అంకితభావంతో, చిత్తశుద్ధితో పని చేయాలన్నది నా ఉద్దేశం...తప్పుగా అర్థం చేసుకుని బయోమెట్రిక్‌కు జీతాలకు లింకు పెట్టారనే భావన కల్పించారు...దీని ఆధారంగా ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూడాలని... అధికారులందరినీ ఆదేశించారట. మరి జేసీ చెప్పడం.. చంద్రబాబు పాటించడం ఏమో కానీ.. దీనివల్ల ప్రభుత్వం ఉద్యోగులు మాత్రం హ్యాపీ...