మే 15న బాబుకు షాక్ తగలనుందా...!

  మే 15 న ఏపీ ముఖ్యమంత్రికి షాక్ తగలనుందా... ? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఈ భయంకరమైన నిజం చెప్పింది ఎవరో కాదు బీజేపీ  ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. మిత్రపక్షంగా ఉన్నప్పుడే టీడీపీ, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకునేవారు. ఇప్పుడు ఏకంగా విడిపోవడంతో.. మాటలతో యుద్దాలే చేసుకుంటున్నారు. ఒకపక్క చంద్రబాబు మోడీపై, బీజేపీ చురకలు అంటిస్తుంటే.. మరోపక్క బీజేపీ నేతలు కూడా చంద్రబాబు పై విమర్సలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీడియా మాట్లాడిన ఆయన.. పట్టిసీమపై అవకతవకలు జరిగాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కావాలంటే విచారణను జరిపించి రుజువుచేయమని టీడీపీ నేతలు అడుగుతున్నారని, పట్టిసీమ ప్రాజెక్టులో వారు చేసిన గోల్ మాల్  లపై ఒక నివేదికను తయారుచేసి, దానిని సీబీఐకి అప్పగించి టీడీపీ నేతల భరతం పడతానని హెచ్చరించాడు. విచారణను జరిపించమని జూపూడి గారు సరదా పడుతున్నప్పుడు ఆయన సరదాను తీరుస్తానని ఎద్దేవా చేసాడు. అంతేకాదు... టీడీపీ తో తాము పొత్తు పెట్టుకోకున్నట్లయితే మరిన్ని సీట్లు గెలిచే వారిమని తెలిపాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలవలేదని జోస్యం చెప్పాడు. మే15 లోపు చంద్రబాబుకు షాక్ తగలనుందని.. టీడీపీ లోని చాలామంది నేతలు వైసీపీలోకి జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి బాంబు పేల్చాడు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మే 15 వరకూ ఆగాల్సిందే...

సహసం కోల్పోయిన సహనశీలి...నచ్చకపోతే బయటకు వెళ్లిపోండి..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎంత సహనం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆయన సహనాన్ని కాస్త పక్కన పెట్టేశారు. ఇప్పటికే తన సహనాన్ని పక్కన పెట్టి.. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, ప్రధాని మోడీ మీదే యుద్ధం ప్రకటించారు. గత నాలుగేళ్లు ఎంతో ఓపికగా ఎదురుచూశారు... కానీ కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తున్న నేపథ్యంలో మోడీకే ఎదురుతిరిగారు. దీని వల్ల తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడతారని తెలిసినా, రాష్ట్రం కోసం తప్పలేదు. అయితే ఒకపక్క చంద్రబాబు అలా చేస్తుంటే మరోపక్క సొంత పార్టీ నేతలే ఆయనకు  తలనొప్పిగా తయారయ్యారు. కానీ ఇది వరకు లాగా చంద్రబాబు వారికి నచ్చజెప్పే పరిస్థితిలో లేరు. వారికి లెఫ్ట్ అండ్ రైట్ వాయించి... క్లాస్ పీకి పంపిస్తున్నారు. నేను గతంలో మాదిరిగా, నచ్చజెప్పే ధోరణిలో ఉండను, ప్రజల్లో పలుచన అయ్యే చర్యలు సహించను, మీకు ఇష్టమైతే క్రమశిక్షణగా ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అంటూ, సీనియర్ నాయకులని కూడా చూడకుండా, వాయిస్తున్నారు.   బస్సు మీద చంద్రబాబు బొమ్మ చిరిగినందుకు దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఏకంగా బస్సునే ఆపేసి.. ప్రయాణికులను దించేసి నానా యాగి చేశారు. ఇందుకుగాను... చంద్రబాబు ప్రభాకర్‌ను పిలిపించి క్లాస్ తీసుకున్నారట. బస్సు మీద బొమ్మ చిరిగితే, ఇంత రచ్చ చెయ్యటం ఏంటి, ప్రతి సారి మీరు ఇలా చేస్తే ఎలా ? బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రోడ్డుమీద ఈ తగాదాలు, గొడవలేంటి? నా చాకిరీ అంతా మీ చర్యలతో కొట్టుకుపోతోంది. నీ విషయంలో ఇప్పటికి రెండు మూడుసార్లు ఓపిక పట్టాను. అయినా మార్పు లేదు. ఇంకోసారి ఇలాంటి గొడవల్లో తలదూర్చితే ఎంత కఠిన నిర్ణయానికైనా వెనుకాడను. ఒక నియోజకవర్గం పోయునా ఫర్వాలేదు. పార్టీ ప్రతిష్ఠ నాకు ముఖ్యం అంటూ చింతమనేని పై ఫైర్ అయ్యారట.   ఇక అఖిల ప్రియకు, ఏవీ సుబ్బారెడ్డి కి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ గురించి చెప్పనక్కర్లేదు. గత కొద్దికాలంగా వీరి మధ్య మాటల యుద్దం జరుగుతున్నా.. ఇటీవల ఏపీ సబ్బురాడ్డిపై జరిగిన రాళ్ల దాడి వల్ల ఈ పంచాయితీ కూడా చంద్రబాబు దగ్గరకు వెళ్లింది. ఇద్దరినీ చంద్రబాబు పిలిపించి.. హెచ్చరించారు..ఎన్ని సార్లు మీకు రాజీ కుదిర్చాను, దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆళ్లగడ్డలో వేలు పెట్టవద్దు, మీకు ఎదో ఒక అవకాసం ఇస్తాను, పని చెయ్యండి అంటే, మీరు ఆగారు.. కానీ నీ తొందరపాటుతో పాడు చేసుకుంటున్నావు, మీ వల్ల పార్టీకి చెడ్డ పేరు.. వింటే బాగుపడతారు. లేకపోతే మీ కర్మ అంటూ సుబ్బారెడ్డిని మందలించారట. ఇక అఖిలప్రియ పై ఎప్పుడూ లేని విధంగా, ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ‘మీ అమ్మకు, నాన్నకు రాని అవకాశం నీకు వచ్చింది. దానిని సద్వినియోగం చేసుకోవాలి. మీరు చిన్న పిల్లలు. రాజకీయంగా ఇంకా అనుభవం రాలేదు. సుబ్బారెడ్డికి, మీకు సమస్యలేవైనా ఉంటే ఎవరైనా మధ్యవర్తిని పెట్టి పరిష్కరించుకోండి. అంతేతప్ప పార్టీ వేదికగా వాటిపై పోరాటం చేయవద్దు’ అని ఆయన సూటిగా చెప్పేశారట. అంతేకాదు... ఎమ్మెల్యే పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబు చేస్తున్న రచ్చ పై కూడా, ఇద్దరినీ పిలిచి హెచ్చరించారు... మీరు మారకపోతే మిమ్మల్నే మార్చాల్సి వస్తుంది. నేను చెప్పింది నచ్చకపోతే బయటకు వెళ్లిపొండి. నాకేమీ అభ్యంతరం లేదు అని తెగేసి చెప్పారట. మరి చంద్రబాబుకు సహనం ఎంత కోల్పేతే ఇలా వార్నింగ్ లు ఇస్తారు పాపం. అసలే ప్రత్యేహోదా విషయంలో కేంద్రంతో యుద్దానికి దిగి ఆ తలనొప్పులే భరించలేకపోతుంటే మధ్యలో పార్టీ నేతల తలనొప్పులు ఒకటి. అందుకే ఉన్న ఓపిక పోయినట్టుంది... అందరికీ వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇచ్చేస్తున్నారు.

ఇవేం పార్టీ ఫిరాయింపులు... వీరేం నేతలు

  ఏపీ ప్రస్తుతం వలసల పర్వం సాగుతోంది. ఒక పార్టీలో ఉన్న నేత మరో పార్టీలోకి వరుసపెట్టి జంప్ జిలానీలు అవుతున్నారు. ఇప్పటికే వైసీపీ నుండి ఎంతో మంది నేతలు అధికార పార్టీలోకి జంపు అయ్యారు. మరోవైపు పలువురు బీజేపీ నేతలు కూడా వైసీపీలోకి జంప్ అవ్వాలని చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా బీజేపీ నుండి కన్నీ లక్ష్మీ నారాయణ. పార్టీ అధ్యక్ష పదవి వస్తుందనుకున్న కన్నాకు పార్టీ అధిష్టానం షాకిచ్చి.. ఆపదవిలో సోము వీర్రాజును నియమించాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. అయతే ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు కానీ...బీజేపీ ఆ నిర్ణయం మార్చుకున్నారు. దీంతో పార్టీమీద అసంతృప్తితో ఉన్న కన్నా వైసీపీలోకి మారాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు అమిత్ షా. జగన్ కు ఫోన్ మా వాళ్లని పార్టీలోకి తీసుకోవద్దని చెప్పారు. అంతేకాదు కన్నాకు కూడా ఫోన్ చేసి...పార్టీ మారొద్దని చెప్పారు. దీంతో ఆయన మనసు మార్చుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాను టీడీపీలోకి వెళుతున్నట్టు రాజకీయ వర్గాల నుండి టాక్స్ వినిపిస్తున్నాయి.   ఇదిలా ఉండగా.. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నానని విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కన్నబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 5వ తేదీన జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నానని చెప్పారు. టీడీపీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని... కానీ, తనను పార్టీ చిన్న చూపు చూసిందని అన్నారు. స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబే తనను నమ్మించి, మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేష్ కూడా తనకు హామీ ఇచ్చి, దగా చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే, తాను టీడీపీని వీడి వైసీపీలో చేరాలని నిర్ణయించానని... తన నిర్ణయంలో మార్పు ఉండదని, భగవంతుడు చెప్పినా తాను వినబోనని చెప్పారు.   మొత్తానికి త్వరలో ఏపీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు కూడా బాగానే పుంజుకున్నాయి. తమకు అనుకూలంగా లేకపోతే చాలు తమ భవిష్యత్తు కోసం కొంచం కూడా ఆలోచించకుండ తమ దారి తాము చూసుకుంటున్నారు. మరి వేరే పార్టీలో కూడా పరిస్థితి ఇలా ఉంటే.. మళ్లీ జంప్ అయిన పార్టీలోకే వచ్చేస్తారు. మరి వాళ్లకి ఇవన్నీ కామనే కదా.. ఒకప్పుడు ఏ పార్టీలో ఎవరున్నారో చెప్పడం ఈజీగా ఉండేది... కానీ ఇప్పుడు ఏ  పార్టీలో ఎవరున్నారో... చెప్పడం కష్టమే..ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే నేతలందరూ ఆపార్టీలోకే వచ్చేస్తున్నారు..

టీడీపీలోకి కన్నా... ఇప్పుడెవరికి ఫోన్ చేస్తారు షా జీ..

ఏపీ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరిగి ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా తయారయ్యాయి. ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. నిన్న మొన్నటి వరకూ బీజేపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ చేరుతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా ఫోన్ చేశారని.. కన్నా వైసీపీలోకి తీసుకోవద్దని చెప్పారన్న టాక్స్ వినిపించాయి. అంతేకాదు... కన్నా కు కూడా షా ఫోన్ చేసి వైసీపీలోకి వెళ్లొద్దని.. పార్టీలోనే ఉండాలని చెప్పినట్టు తెలిసింది. అందుకే కన్నా కూడా వెనక్కి తగ్గారని... తన మనసును మార్చుకున్నారని... అందుకనే.. ఆరోగ్యం బాలేదని.. ఏదో సాకు చెప్పి వైసీపీలో చేరే కార్యక్రమాన్ని ఆపేసి, ఆసుపత్రిలో చేరారని అంటున్నారు.   ఇవి నిన్నటి వరకూ వచ్చిన ఆరోపణలు.. కానీ ఈరోజు మరో ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. క‌న్నా టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారట. నిజానికి క‌న్నా వైసీపీ కంటే ముందు టీడీపీలోకే వ‌చ్చేందుకే ఆస‌క్తి క‌న‌ప‌రిచారట. కానీ టీడీపీ నుంచి స‌రిగా స్పందన రాకపోవడంతో... వెంట‌నే వైసీపీ నాయ‌కుల‌తో ట‌చ్‌లోకి వెళ్ల‌ారట. ఇక  వాళ్లు క‌న్నా కోరుకున్న సీటుతో పాటు ఆయ‌న అనుచ‌రుడుకి కూడా ఓ సీటు ఇచ్చేందుకు ఓకే చెప్ప‌డంతో క‌న్నా వైసీపీలోకి వెళ్లేందుకు ముహూర్తం పెట్టేసుకున్నారు. కానీ బీజేపీ నుండి వ్యతిరేకత రావడంతో.. ఆయన టీడీపీలోకే రావాలని నిర్ణయించుకున్నారట. దీంతో కాపు సామాజిక వర్గంలో గట్టి పట్టు ఉన్న కన్నా లక్ష్మీనారాయణ వంటి బలమైన నాయకుడిని వైసీపీలోకి వెళ్లనివ్వకుండా చూడటానికి టీడీపీ నాయకులు రంగంలోకి దిగారట.  విశాఖపట్నానికి చెందిన ఓ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి, కొంతమంది గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు కన్నాతో మంతనాలు జరిపారని తెలిసింది. ఇక క‌న్నా కూడా వైసీపీ కంటే టీడీపీయే బెట‌ర్ అని ఆలోచిస్తున్నారట. అయితే ఆయన డిమాండ్లు ఒప్పుకుంటే ప‌సుపు కండువా క‌ప్పుకునేందుకు పెద్ద అభ్యంత‌రం లేద‌న్న‌ట్టుగా తెలుస్తోంది. మ‌రి క‌న్నా పెద‌కూర‌పాడు సీటు అడుగుతారా ? లేదా ? గుంటూరు వెస్ట్ సీటు అడుగుతారా ? అన్న‌ది చూడాల్సి ఉంది.  దీనిపై క్లారిటీ రావాలంటే  వెయిట్ చేయాల్సిందే...మరి  కన్నా వైసీపీ వెళ్లాలనుకున్నప్పుడు షా జగన్ కు ఫోన్ చేసి పార్టీలోకి తీసుకోవద్దని చెప్పారు. మరి ఇప్పుడు ఎవరికీ ఫోన్ చేస్తారో..

పాత కక్షలు పక్కన పెట్టి...

  ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఓ చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. అదేంటనుకుటున్నారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 65 సంవత్సరాల తరువాత ఉత్తర కొరియా, దక్షిణ కొరియా  దేశాధినేతలు పాత కక్ష్యలకు పక్కన పెట్టి.. కరచాలనం చేసుకుని ఒకరి భూభాగంలోకి మరొకరు అడుగుపెట్టారు. కొరియా యుద్ధం అనంతరం దాదాపు 65ఏళ్ల తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు దక్షిణ కొరియాలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. ఈరోజు ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, ద.కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ల మధ్య  సమావేశం జరిగింది. ఇరు దేశాలను వేరు చేసే సైనిక విభజన లైన్‌ వద్ద కిమ్‌ చిరునవ్వుతో మూన్‌ జే ఇన్‌తో కరచాలనం చేశారు. మూన్‌ కూడా చిరునవ్వుతో కరచాలనం చేస్తూ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.   అనంతరం కిమ్‌ జోంగ్‌ ద.కొరియా అధ్యక్షుడిని తమ దేశంలోకి ఆహ్వానించడంతో మొదట మూన్‌ జే ఉ.కొరియా భూభాగంలోకి వెళ్లారు. ఇరువురు నేతలు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడిచారు. తర్వాత కిమ్‌ ద.కొరియాలో అడుగుపెట్టారు. ఉభయ కొరియాల సరిహద్దులోని శాంతి గ్రామం పన్‌ముంజుమ్‌లోని మూడంతస్థుల భవనం ‘పీస్‌ హౌస్‌’లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. యుద్ధం తర్వాత కొరియా దేశాల మధ్య చర్చలు జరగడం ఇది మూడోసారి. సమావేశం ప్రారంభానికి ముందు కిమ్‌ తాను ఎంతో ఉద్వేగానికి గురవుతున్నానని మూన్‌ జే ఇన్‌తో అన్నారు. ఇరు దేశాల మధ్య గొప్ప ఒప్పందం జరిగే అవకాశం ఉందని, ఇది కొరియా ప్రజలందరికీ చక్కటి బహుమతి అవుతుందని మూన్‌ అన్నారు. కిమ్‌తో పాటు ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్‌ కూడా సదస్సుకు హాజరయ్యారు. ఇక ఇన్ని ఏళ్ల తరువాత వీరు కలవడంతో.. ఇరువురు నేతలు కరచాలనం చేసుకున్న ఫొటోలను ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి అంతర్జాతీయ మీడియాలు.  ఇదిలా ఉండగా మే లేదా జూన్‌ నెలలో లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు కూడా సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు చెపుతున్నాయి అంతర్జాతీయ మీడియాలు. మొత్తానికి నేను మోనార్క్ ని.. నేను ఎవరి మాట వినను అన్న పంథాలో నియంతలా ఉండే కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఈ విధమైన శాంతి చర్చలకు సహకరించడం గొప్ప విషయమే. మరి వారి శాంతి చర్చలు సఫలీకృతమవ్వాలని కోరుకుందాం..

పిచ్చికుక్కలా మాట్లాడకు.. నోరు కంట్రోల్ లో పెట్టుకో

  యధా రాజ.. తధా ప్రజా అన్న సామెత వినే ఉంటారు కదా... ఇప్పుడు ఈ సామెత వైసీపీ నేతలకు బాగా సూటయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. తమ అధినేత ఎలా ఉంటే.. అనుచరులు కూడా అలానే ఉంటారు కదా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై జగన్ ఏ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తారో తెలుసుకదా. కనీసం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని కానీ..వయసులో పెద్ద అని కానీ ఆలోచించకుండా.. ఆయనను నడిరోడ్డుపైనే కాల్చిపారేయాలని.. ఉరితీయాలని అబ్బో నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తుంటారు. మరి ఒక పార్టీ అధినేత స్థానంలో ఉన్న ఆయనే అలా మాట్లాడితే.. మిగిలిన నేతలు మాత్రం ఎందుకు ఉంటారు. వారు కూడా చంద్రబాబును కనీసం మర్యాద కూడా లేకుండా మాట్లాడేస్తున్నారు.   ఇంతకీ అసలు సంగేతంటంటే...వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా గన్నవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మాములుగా కొంత మంది వైసీపీ నేతలకు మైకు చూస్తే పూనకాలు వచ్చేస్తుంటాయి కదా. ఏం మాట్లాడుతున్నాం.. ఎలా మాట్లాడుతున్నాం అని ఒక్కసారి కూడా ఆలోచించకుండా మైకు దొరికింది కదా అని తమ నోటికి పని చెప్పేస్తుంటారు. అలా నాని కూడా జగన్ పాదయాత్రలో భాగంగా మాట్లాడుతూ.. టీడీపీ పై ముఖ్యంగా చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా..  ఆడు ఈడు అంటూ, బూతులు తిట్టారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. ఒక పక్క చంద్రబాబును తిడుతూ... మరోపక్క వంశీ నా సన్నిహితుడని చెప్పుకొచ్చారు.   అంతే నాని చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వంశీ... ‘నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని వార్నింగ్ ఇచ్చారు.  ఒకప్పుడు ఇద్దరం స్నేహితులమే కావచ్చు.. ఇప్పుడు కాదు.. టీడీపీ, చంద్రబాబుతో తప్పితే నానితో స్నేహమే లేదు..  పిచ్చికుక్కలా మాట్లాడితే సహించబోమని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న నానిని, వైసీపీలో బరితెగించి మాట్లాడేవారిని జగన్‌ కంట్రోల్‌ చేయాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మరి చూద్దాం.. వంశీ మాటలకు నాని ఎలా రియాక్ట్ అవుతాడో..

రాధాకృష్ణ వార్నింగ్... లైట్ తీసుకుంటాడా..!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాపై పెద్ద యుద్దమే చేస్తున్నారు. తన తల్లిని దూషించినందుకుగాను... ఆ విషయాన్ని మీడియాలో పదే పదే డిబెట్లు బెట్టి చర్చించినందుకు గాను.. పవన్ మీడియాపై వార్ ప్రకటించారు. ఇప్పటికే పవన్ పిలుపు ప్రకారం ఆయన అభిమానులు పలు ఛానళ్లను బ్యాన్ చేశారు. అంతేకాదు పవన్ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్లు పెడుతూ మీడియాపై దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తనపై అనవసరమై ఆరోపణలు చేశారని శ్రీనిరాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లీగల్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటీసులు అందుకున్న పవన్.. చేయాల్సింది అంతా చేసి ఇప్పుడు నోటీసులు పంపించినా ఏం లాభం... ఆల్ ద బెస్ట్ అని చెప్పి లైట్ తీసుకున్నారు.   ఇక ఇప్పుడు తాజాగా ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ కూడా పవన్ చేసిన ఆరోపణలపై స్పందించారు. ఈయన కూడా పవన్ కు లీగల్ నోటీసులు పంపించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాదు.. త‌ననూ త‌న సంస్థ‌నూ ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌ను వెంట‌నే ట్విట్ట‌ర్ నుంచి తొల‌గించాల‌నీ,బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌నీ, లేని ప‌క్షంలో తాను చ‌ట్ట‌ప‌రంగా ముందుకు వెళ్తాన‌ని కూడా హెచ్చ‌రించారు. త‌న వ్య‌క్తిగ‌త, రాజ‌కీయ లోపాల‌ను క‌ప్పిపుచ్చుకోవ‌డం కోస‌మే విచ్చ‌ల‌విడిగా ప‌వ‌న్ ట్వీట్లు చేస్తున్నార‌నీ, ఆ వ్యాఖ్య‌ల్లో వాస్త‌వాలు లేవ‌నీ, అన్నీ ఊహాజ‌నితాలే అని అన్నారు. మీడియాపై చుల‌క‌న‌గా వ్యాఖ్యానాలు చేయ‌డం ఈ మ‌ధ్య కొంత‌మంది నాయ‌కుల‌కు అల‌వాటైపోయింద‌న్నారు. బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పి, ట్విట‌ర్ లో వ్యాఖ్య‌లు తొల‌గించ‌క‌పోతే తాను వేయబోయే సివిల్‌, క్రిమిన‌ల్ ప‌రువు న‌ష్టం దావాను ఎదుర్కొన‌డానికి సిద్ధంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. మరి ఇప్పుడు ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి…? శ్రీనిరాజు నోటీసులను లైట్ తీసుకున్నట్టే రాధాకృష్ణ నోటీసులను లైట్ తీసుకొని దానికి కౌంటర్ ఏదైనా ఇస్తారా..?లేక సీరియస్ గా తీసుకుంటారా..? చూద్దాం ఏం జరుగుతుందో..

చంద్రబాబుతో కష్టం సార్... ఒప్పుకోవట్లేదు..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కు మధ్య ఉన్న విబేధాల గురించి తెలిసిందే. అసలు మోడీ చంద్రబాబుపై అంత కోపంగా ఉండటానికి ఓ రకంగా గవర్నరే కారణమని ఇటీవల పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి గవర్నర్ అన్నీ పక్కన పెట్టి చంద్రబాబును కలిశారు. ఊరకనే చంద్రబాబును కలవలేదులెండి. మోడీగారికి మధ్యవర్తిగా ఆయన రాయబారానికి వచ్చారు. అందుకే చంద్రబాబుతో ఉన్న వైరాన్ని పక్కన పెట్టి మరీ విజయవాడ వచ్చి, చంద్రబాబుని కలిసారు. ఇంతకీ గవర్నర్ ఏం చెప్పారంటే.. కర్ణాటక ఎన్నికలు అయ్యే వరకు, కేంద్రం పై దూకుడు తగ్గించమని, గవర్నర్ కోరినట్టు సమాచారం.   చంద్రబాబు విమర్శలు దాడి, కేంద్రంలోని పెద్దలు తట్టుకోలేకపోతున్నారు అని, చంద్రబాబు దీక్ష జాతీయ స్థాయులో చర్చ కావటం, 30వ తారీఖు చంద్రబాబు తిరుపతిలో పెట్టే సభ, ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం పై జాతీయ స్థాయిలో అన్ని పార్టీల నాయకులతో మోడీకి లెటర్ రాయాలి అనుకోవటం వంటివి ఇబ్బందికరంగా ఉన్నాయని, కేంద్రం పై దాడి తగ్గించమని, గవర్నర్ చంద్రబాబుని కోరినట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ టార్గెట్ గా చంద్రబాబు విమర్ళలు చేయడం సరికాదనే అభిప్రాయాన్ని గవర్నర్ చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.   ఇక దీనిపై స్పందించిన చంద్రబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా డ్రామాలాడుతోంది..విభజన హామీలు అమలు చేయకపోవడం, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తోందని, హోదాతోపాటు ఏపీకి ఇవ్వాల్సిన 18 అంశాలను కేంద్రం అమలు చేయలేదని, ఇక్కడ కొన్ని పార్టీలతో నాటకాలు ఆడిస్తుందని, ప్రజల అభిప్రాయం మేరకే నేను నడుచుకుంటున్నా అని, ఎక్కడా రాజకీయాలు చెయ్యటం లేదు అని, మాకు మా సమస్యల కంటే ఏది ముఖ్యం కాదని చంద్రబాబు తెగేసి చెప్పారట. ఇక ఎంత చెప్పినా చంద్రబాబు వినకపోవడంతో చేసేది లేక, గవర్నర్ అక్కడి నుండి వెళ్ళిపోయారట.   మరి ఇక ఈ విషయాన్ని కేంద్రానికి చేరవేయాలి కదా. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ బయలుదేరారట. చంద్రబాబు దూకుడు తగ్గేలా లేదని, గవర్నర్ కేంద్ర పెద్దలకు చెప్పనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇక్కడ ఉన్న రాజకీయాల గురించి కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరి చంద్రబాబు స్పీడ్ తగ్గించడానికి ఢిల్లీ పెద్దలు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారో చూద్దాం.. 

పవన్ పై మీడియా వార్.. సంచలన నిర్ణయం...

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాపై యుద్దం ప్రకటించిన సంగతి తెలిసిందే. తనపై వ్యక్తిగత దూషణలు చేసినందుకుగాను..ఆఖరికి ఏ సంబంధం లేని విషయంలో తన తల్లిని సైతం దూషించి... దానిపై పలు ఛానళ్లలో గంటల కొద్దీ డిబెట్లు పెట్టినందుకుగాను పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పలు ఛానళ్లపై మండి పడ్డారు. అంతేకాదు ఆ ఛానళ్లను బ్యాన్ చేయమని.. చూడొద్దని.. తమ అభిమానులకు సైతం పిలుపునిచ్చారు. ఆరు నెలలుగా నన్ను తిట్టీ..తిట్టీ ఇప్పుడు ఆఖరికి మా తల్లి దగ్గరకు వచ్చారా.. ఇప్పుడు నేను మీకు ఇస్తాను న్యూస్ అంటూ.... ఆరోజు ఈరోజు వరకూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా మీడియా వార్ చేస్తున్నారు. అంతేకాదు పలు ఛానళ్ల పేర్లు.. ఈ రాజకీయ కుట్ర వెనుక కొంత మంది ఉన్నారంటూ వారి పేర్లు కూడా బయట పెట్టారు. ఇంకా పలు సంచలన ట్వీట్లు పెడుతూనే ఉన్నారు.   అయితే ఇప్పుడు మీడియా పవన్ పై యుద్దం ప్రకటించిందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. తెలుగు టీవీచానళ్లన్నీ ఆయనపై అనధికార బహిష్కరణ వేటు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మీడియాపై యుద్ధం ప్రకటించి.. ట్విట్టర్ లో అదే పనిగా ఆరోపణలు.. చేస్తూ.. ఏవేవో వీడియోలు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్న పవన్ కల్యాణ్ వ్యవహారాన్ని … లైట్ తీసుకోవాలని మీడియా సంస్థలు నిర్ణయించుకున్నాయట. ఇక నుంచి… పవన్ రాజకీయాన్ని, ఆయన మాటలను పట్టించుకోకూడదని డిసైడయ్యాయట. పవన్ కల్యాణ్ ను పట్టించుకోకపోతే.. సమస్య పరిష్కారమవుతుందని… టీవీ చానళ్ల యజమానులందరూ నిర్ణయించుకున్నారట. దీంతో పవన్ కల్యాణ్ ఇక ఏ ఛానల్ లో కనపించరు.. ఆయన మాట ఏ ఛానల్ లో వినిపించదు అని అంటున్నారు. మరి మీడియా తీసుకున్న ఈ నిర్ణయంతో ట్విట్టర్, తన యూట్యూబ్ చానల్ లో మాత్రమే .. తన గురించి ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. మరి చూద్దాం ఎన్ని రోజులు మీడియా పవన్ ను దూరం పెడుతుందో..

పవన్ కు జగన్ సపోర్ట్.. కానీ...!

  ఉరుము ఉరిమి మంగలం మీద పడింది అన్న సామెత లాగ... అటు పోయి ఇటు పోయి క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పవన్ కళ్యాణ్ కుటుంబంపై వ్యక్తిగత దూషణకు దిగేవిధంగా మారింది.దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. పవన్ కళ్యాణ్ ని, అతని కుటుంబాన్ని టార్గెట్ చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగుందని.. పవన్ అభిమానులతో పాటు పలువురు అనుమానాలు వ్యక్తపరిచారు. ఇక దీనిపై పవన్ కూడా స్పందించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ఆరునెలలుగా తన గురించి టీవీ ఛానళ్లలో డిబెట్లు పెట్టి తిట్టిపోశారని.. ఇప్పుడు ఏకంగా తన తల్లినే తిట్టించే స్ధాయికి దిగజారారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న పవన్... ఈ విషయం వెనుక ఎవరెవరు ఉన్నారో నాకు తెలుసని.. తనపై జరుగుతున్న కుట్రను, అవమానాలకు కొందరు వ్యక్తులు కారణమని.. కొంత మంది పేర్లను కూడా బహిరంగంగానే ట్విట్టర్లో వారి ఫొటోలు పోస్ట్ చేశారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకూ ట్విట్లర్లో పోస్ట్ లు చేస్తూ..  టీవీ9, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. ఇక ఈ విషయంలో పవన్ కు చాలా మంది సపోర్ట్ గా కూడా వస్తున్నారు. ఏదైనా ఉంటే విమర్శలు చేయవచ్చు కానీ.. వ్యక్తిగత దూషణలు చేయడం ఏంటీ.. అందులో తల్లిని తీసుకురావడం ఇంకా దిగుజారుడుతనానికి నిదర్శనం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.   ఇక ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కు మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది. నిజానికి పవన్ అంటే జగన్ కాస్త కోపం. ఎందుకంటే.. 2014లో పవన్ లేకపోతే తానే ముఖ్యమంత్రి అయ్యేవాడిని అని ఆయన భావన. అందుకే అప్పుడప్పుడు పవన్ పై విమర్సలు గుప్పించేవాళ్లు. అయితే ఎప్పుడైతే టీడీపీకి వ్యతిరేకంగా కామెంట్లు విసిరారో... అప్పటి నుండి కాస్త విమర్సలు తగ్గించారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ వివాదంపై కూడా జగన్ స్పందించి పవన్ కు మద్దతు పలికినట్టు తెలుస్తోంది. అయితే డైరెక్ట్ గా కాదు కానీ.. ఇన్ డైరెక్ట్ గా. పాదయాత్ర డైరీ అనే పేరుతో జగన్ రాస్తున్నట్టుగా సాక్షిలో ప్రచురితం అవుతున్న కాలమ్ లో దీనిపై జగన్ స్పందించారు. “ఢిల్లీకి రాజు అయినా అమ్మకు కొడుకే.. అన్నారు మన పెద్దలు. సృష్టిలో జీవులన్నిటికీ అమ్మే తొలి గురువు.. దైవం. అందుకే మాతృదేవోభవ అంటారు. అమ్మ స్థానం అంతటి ఉన్నతమైనది.. పవిత్రమైనది. కొద్ది రోజులుగా అమ్మ స్థానాన్ని దిగజార్చేలా.. అవమానపరిచేలా రాజకీయాలు సాగడం అత్యంత దారుణం.. మహాపాపం. అలాంటి దిగజారుడు రాజకీయాలు ఏమాత్రం సమర్థనీయం కాదు. గత 141 రోజులుగా చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో ఎందరో అమ్మలు నన్ను సొంత బిడ్డలా చూసుకున్నారు. వారి ఆప్యాయత, అనురాగాలు అనిర్వచనీయం. అందుకే మాది ఎప్పుడూ ఒకటే సిద్ధాంతం.. ‘అమ్మ ఎవరికైనా అమ్మే.. అమ్మకు నా వందనం” అని అన్నారు. మరి ఇప్పటికే రోజా పవన్ కు తన సపోర్ట్ ఉంటదని చెప్పారు. ఇప్పుడు జగన్ కూడా పవన్ కు మద్దతు పలికారు. మొత్తానికి చంద్రబాబు కోపంతో.. ఇదే ఛాన్స్ అని భావించి పవన్ కు మద్దతు పలికినట్టున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ కలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..

ఆ పేపర్లు ఎందుకు చదవాలి?.. ఆ టీవీలు ఎందుకు చూడాలి?

  గత మూడు నాలుగు రోజుల నుండి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా మీడియా ఛానెళ్లపై వార్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ దగ్గర మొదలైన ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి పవన్ కళ్యాణ్ కుటుంబంపై వ్యక్తిగత దూషణకు దిగేవిధంగా మారింది. దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా రాజకీయం దిశగా మారింది. పవన్ కళ్యాణ్ ని, అతని కుటుంబాన్ని టార్గెట్ చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగుందని.. పవన్ అభిమానులతో పాటు పలువురు అనుమానాలు వ్యక్తపరిచారు. ఇక దీనిపై పవన్ కూడా స్పందించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ఆరునెలలుగా తన గురించి టీవీ ఛానళ్లలో డిబెట్లు పెట్టి తిట్టిపోశారని.. ఇప్పుడు ఏకంగా తన తల్లినే తిట్టించే స్ధాయికి దిగజారారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న పవన్... ఈ విషయం వెనుక ఎవరెవరు ఉన్నారో నాకు తెలుసని.. తనపై జరుగుతున్న కుట్రను, అవమానాలకు కొందరు వ్యక్తులు కారణమని.. కొంత మంది పేర్లను కూడా బహిరంగంగానే ట్విట్టర్లో వారి ఫొటోలు పోస్ట్ చేశారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకూ ట్విట్లర్లో పోస్ట్ లు చేస్తూ..  టీవీ9, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. ఇక ఈరోజు తాజగా పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమలో మహిళలకు అండగా నిలిచేందుకు సంచలన ప్రకటన చేశారు. "మనలని, మన తల్లులని, ఆడపడుచులని తిట్టే పేపర్లు ఎందుకు చదవాలి?.. వాళ్ళ టీవీలు ఎందుకు చూడాలి?.. జర్నలిజం విలువలతో ఉన్న చానెల్స్, పత్రికలు, సమదృష్టికోణంతో ఉండాలని అన్నారు. ఇంకా కాస్టింగ్ కౌచ్ పై కూడా స్పందించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరుపున త్వరలోనే ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి ఏర్పడుతోందని దీనికి జనసేన పార్టీ "వీర మహిళా" విభాగం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. మరి ముందు ముందు ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటూరో.. చూద్దాం..

పవన్ కు లీగల్ నోటీసులు...ఆల్ ద బెస్ట్

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్ట్ గానే మీడియాపై యుద్దం ప్రకటించేశారు. అంతేకాదు కొంత మంది పేర్లు కూడా బయటపెట్టారు. ఆ పేర్లలో ఓ మీడియా సంస్థ యజమాని శ్రీని రాజు పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పవన్‌కల్యాణ్‌కు శ్రీని రాజు నోటీసులు పంపారు.  తనను ఉద్దేశించి ట్విటర్‌లో అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ..  పవన్‌ చేసిన వ్యాఖ్యలు నిరాధారం, అసత్యాలని ఆరోపించారు. ఈ నేపథ్యంలో శ్రీనిరాజు తన తరఫు న్యాయవాది నుంచి పవన్‌కు నోటీసులు పంపారు. ఈ సందర్భంగా శ్రీని రాజు తరపు న్యాయవాది మాట్లాడుతూ.... పవన్‌ తనపై ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యలు తెలిసి శ్రీనిరాజు షాక్‌ అయ్యారని.. నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే.. మిగిలిన రాజకీయ నాయకులకూ పవన్‌కు తేడా ఏంటని ప్రశ్నించారు. అంతేకాదు... శ్రీనిరాజుకు ప్రత్యక్షంగానూ, పరోక్ష్యంగానూ చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో ఎటువంటి బంధం లేదని.. వర్మ, రవి ప్రకాశ్‌తో కలిసి శ్రీనిరాజు టీడీపీ నేతలకు సాయం చేస్తూ.. తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి సహకరించారని చెప్పడం కేవలం ఊహాజనితమేనని తన క్లయింట్‌ అన్నట్లు నోటీసులో పేర్కొన్నారు. ప్రజలు తనపై ఆరోపణలు చేసినప్పుడు పవన్ ఎంత బాధపడ్డారో.. ఇప్పుడు పవన్ చేసిన ఈ నిరాధార వ్యాఖ్యలకు తన క్లయింట్‌ కూడా అంతే బాధపడ్డారని చెప్పారు.   ఇక దీనిపై పవన్ కూడా స్పందించి రాజుగారికి కౌంటర్ ఇచ్చారు. చేసిందంతా చేసి ఇప్పుడు తనకు లీగల్ నోటీసులు పంపించినా ఉపయోగం ఏం లేదని అన్నారు. అంతేకాదు.. సంబంధం లేని విషయాల్లోకి తనను లాగి, తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనుక ఉన్న నిజమైన ‘అజ్ఞాతవాసి’ ఎవరో తెలుసా? అంటూ  ట్వీట్ చేసిన పవన్ దానికి సమాధానం కూడా ఇచ్చారు. నిజమైన ‘అజ్ఞాతవాసి’ టీవీ 9 చానెల్ సీఈఓ రవిప్రకాష్ అని టీవీ 9 చానెల్ తమ రాజకీయ బాసులతో కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని నడిపిందని, రవిప్రకాష్ మార్గదర్శకత్వంలో తన తల్లిని చెప్పరాని మాటలతో పదే పదే తిట్టించారని అన్నారు.  శ్రీ సిటీలో వాటాల కోసం రాజకీయ బాసులతో కుమ్మక్కైన రవి ప్రకాశ్ ఈ చర్యకు ఒడిగట్టాడని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిందంతా చేసి ఇప్పుడు తనకు లీగల్ నోటీసులు పంపించడమేంటని శ్రీనిరాజుని ప్రశ్నించారు. మరి ప్రస్తుతం దుమారం రేపుతున్న ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూద్దాం..  

పవన్ కొత్త ఛానల్.. జేటీవీ..!

  పవన్ కళ్యాణ్ ఓ ఛానల్ ను పెట్టనున్నారా..? అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి ఇప్పుడు. తన తల్లిపై చేసిన వ్యాఖ్యలకు గాను పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహంలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే తన ట్విట్టర్ ద్వారా వరుస ట్వీట్లు పెట్టి ఇదంతా ఎవరు చేయిస్తున్నారు అని వారి పేర్లు బయట పెట్టి.. ఏకిపారేశారు. అంతేకాదు మీడియా ఛానల్స్ కూడా ఓ రేంజ్ లో తిట్టిపారేశారు. ఈ క్రమంలోనే ఆయన ఈరోజు ఫిలిం ఛాంబర్ కు వెళ్లి తన తల్లిని అంత దారుణంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని... వారికి ఒక రోజు డెడ్ లైన్ కూడా విధించినట్టు తెలుస్తోంది.   ఇక దీనిలో భాగంగానే మరో వార్త కూడా బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో ఓ టీవీ ఛానల్ రాబోతుందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ లో జే టీవీ అనే ఓ బ్యానర్ చక్కర్లు కొడుతోంది. 'జనం కోసం' ఇది ఛానల్ పేరు కాగా.. 'మీ కోసం.. మీ తోడుగా..' ఈ క్యాప్షన్ తో జే టీవీ అనే ఛానల్ రాబోతోందని ఈ పోస్టర్ సారాంశం. జనసేనకు అండగా నిలబడే ఉద్దేశ్యమే ఈ ఛానల్ అని... పవన్ కు సన్నిహితుడు.. గతంలో ఛానల్ నిర్వహించిన అనుభవం ఉన్న వ్యక్తితో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన తర్వాత.. పవన్ కళ్యాణ్ సపోర్ట్ తోనే జే టీవీ రాబోతోందనే టాక్ అయితే గట్టిగానే ఉంది. మరి ఈ జేటీవీ లో వాస్తవం ఎంతో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.   అయితే ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ... అసలు పవన్ అభిమానులు ఎప్పటినుండో కోరుకునేది కూడా ఇదే. తమకు ఓ ఛానల్ లేకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుందని.. ఛానల్ లేకపోవడం వల్ల తమమీద చాలా ఈజీగా బురద చల్లుతున్నారని... మనకంటూ ఓ ఛానల్ ఉండాలని పవన్ అభిమానలు ఎప్పటినుండో కోరుకుంటున్నారు. ఉన్న ఛానల్స్ లో ఏ ఒక్కటీ పవన్ అండగా ఉన్న దాఖలాలు లేవు. ఆ లోటు విషయం పవన్ కు కూడా ముందే తెలుసు కానీ.. ఓ మీడియా ఛానల్ ప్రారంభించాలనే పాయింట్ ను మాత్రం ఇన్నాళ్లు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఆలోచన ఓ కొలిక్కి వచ్చేసిందనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ టీవీ విషయంలో కూడా క్లారిటీ వచ్చేంత వరకూ ఆగాల్సిందే..

ఒక్క రోజు గడువిస్తున్నా...మీ ఇష్టం..

  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ దగ్గర మొదలైన రచ్చ.. అటు పోయి ఇటు పోయి అఖరికి జనసేన అధినేత పవన్ దగ్గరకి వచ్చి ఆగింది. శ్రీరెడ్డి పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. దాని సూత్రధారి రాం గోపాల్ వర్మ అని బయటకు రావడం.. వర్మ కూడా పవన్ ని అలా తిట్టమని శ్రీరెడ్డికి చెప్పింది నేనే అని చెప్పడం.. మరోవైపు వైసీపీ పేరు కూడా వినిపించడం అబ్బో ఒక ట్విస్టా.. రెండు ట్విస్ట్ లా.. ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉన్నాయి.   ఇక పవన్ ను అంత మాట అన్నందుకు పవన్ అభిమానులు అయితే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇక పవన్ కూడా దీనిపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వంపై, మీడియా ఛానల్స్ పై విరుచుకుపడ్డారు. తనపై కుట్ర జరుగుతోందని.. తన తల్లిని దారుణంగా అవమానిస్తారా? అంటూ తీవ్ర ఆగ్రహంతో ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. అంతేకాదు తన తల్లి గురించి అంత మాట అన్నందుకు చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఈ రోజు ఉదయం నుంచి ఫిలిం ఛాంబర్ వద్దకు వచ్చారు. పవన్ కు తోడుగా మెగా ఫ్యామిలీ తో పాటు అల్లు ఫ్యామిలీ.. ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా ఫిలిం ఛాంబర్ కు వెళ్లారు. ఇక పవన్ ఫిలిం ఛాంబర్ కు వచ్చారని తెలియడంతో మెగా అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. పవన్ కు మద్దతుగా నిలిచారు. ఉదయం నుంచి నినాదాలు ఇస్తున్న పవన్ అభిమానులు.. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో తమ నినాదాల హోరును పెంచారు. ఫిలిం ఛాంబర్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని  పోలీసులు అతి కష్టమ్మీద నిలువరించారు. మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఫిలిం ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన పవన్.. తన క్యారవాన్ లో ఉండిపోయారు. అనంతరం వెళ్లిపోయారు.   అయితే దాదాపు ఐదు గంటలు ఫిలింఛాంబర్ లో ఉన్న పవన్... తన తల్లిని అవమానించేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దానికి తమకు ఒకరోజు గడువు ఇవ్వాలని ఫిలింఛాంబర్ సభ్యలు కోరగా... దానికి పవన్ ఏకీభించినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ.. ఒక్కరోజు వ్యవధిలో నిర్ణయం తీసుకోకుంటే తన కార్యాచరణను ప్రకటిస్తానని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. మరి  చూద్దాం ఏం జరుగుతుందో..

లోయాది సహజ మరణమే.. అనుమానం అవసరం లేదు..

సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్‌ లోయా మృతిపై స్వతంత్ర విచారణ జరపాలంటూ పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. సొహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసుకు విచారణ న్యాయమూర్తిగా ఉన్న సమయంలో లోయా 2014, డిసెంబర్‌ 1న గుండెపోటుతో మృతిచెందారు. అయితే ఆయనది సహజ మరణం కాదని, లోయా మృతి వెనుక కుట్ర ఉన్నట్లు ఆయన సోదరి ఆరోపించారు. ఇక ఈ కేసుపై విచారించిన సుప్రీంకోర్టు..  బీహెచ్‌ లోయాది సహజ మరణమేనని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో ఎలాంటి స్వతంత్ర విచారణ అవసరం లేదని పేర్కొంటూ పిటిషన్లను కొట్టివేసింది. ‘ఈ పిటిషన్లకు ఎలాంటి అర్హత లేదు. లోయాతో పనిచేసిన నలుగురు జడ్డీల వ్యాఖ్యలను అనుమానించడం అవసరంలేదు. పిటిషన్లలో విచారించదగ్గ అంశాలేవీ లేవు. న్యాయవ్యవస్థను నిందించడానికే ఈ పిటిషన్లు వేశారు. లోయా మృతి కేసులో సిట్‌ దర్యాప్తు అనవసరం’ అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పిటిషనర్లపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లు న్యాయవ్యవస్థ స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని.. వ్యాపార లేదా రాజకీయ విభేదాలను పరిష్కరించుకునేందుకు కోర్టులు వేదిక కాకూడదని హెచ్చరించింది.

మోడీ నాకు సలహా ఇవ్వడం కాదు... మీరు కూడా పాటించండి..

  మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కూడా సెటైర్లు వేసేస్తున్నారుగా. అది కూడా ఎవరికో కాదు.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారికి. ఎందుకంటే.. మన్మోహన్ సింగ్ గురించి తెలిసిందే. ఆయన పెద్దగా మాట్లాడే వ్యక్తి కాదు. చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తి. అందుకే ఆయనపై బీజేపీ నేతలు కామెంట్లు చేస్తుండేవారు. మన్మోహన్ సింగ్ మౌనముని అని... ఆయన సోనియ గాంధీ చేతిలో కీలుబొమ్మ అని.. రబ్బరు స్టాంప్ అని ఇలా చాలా విమర్శలే చేసేవారు. అలా అనీ మన్మోహన్ సింగ్ ఎప్పుడూ వారిపై తిరిగి కామెంట్ చేసిందీ లేదు. తన పనేదో తాను చేసుకుంటూ పోయేవారు. కానీ టైం ఎంప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు మన్మోహన్ సింగ్ కు టైం వచ్చింది. ఇప్పుడు తనకు ఇచ్చిన సలహానే తిరిగి ఆయన మోడీకి ఇచ్చారు. ఇంతకీ మోడీ మన్మోహన్ సింగ్ కు ఇచ్చిన సలహా ఏంటంటే... తనను మోడీ తరచూ మాట్లాడమంటూ సలహా ఇచ్చేవారిని... ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు కనుక తరచూ మాట్లాడాలని మన్మోహన్ సింగ్ అన్నారు.   ఎందుకంటే కథువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై దేశ నలుమూలల నుండి పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు తలెత్తాయి. అయితే ఆశ్చర్యం ఏంటంటే... ఈ కేసులపై ప్రధాని నరేంద్ర మోడీ చాలాకాలం స్పందించలేదు. ఎట్టకేలకు గత శుక్రవారం ఆయన స్పందించారు. ఇక దీనిపై ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్య్వూలో పాల్గొన్న మన్మోహన్ సింగ్ స్పందించి... యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తనను మౌన్.. మోహన్ సింగ్ అనేవారని.. కానీ ఇప్పుడు ఆయన ఆ సలహాను తానే స్వయంగా పాటించాలన్నారు. అంతేకాదు... అంతకు ముందు కూడా మోడీపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సభల్లో కూడా ఆయన పెద్ద నోట్ల రద్దు గురించి మాట్లాడుతూ మోడీపై విరుచుకుపడ్డారు. పెద్ద నోట్ల రద్దు చరిత్రలో నిలిచిపోయే నిర్వహణ వైఫల్యమని.. ఏదోశంలోనైనా ప్రజలు తాము డిపాజిట్ చేసిన నగదును విత్ డ్రా చేసుకునేందుకు ఆంక్షలు ఉన్నాయా..? అలాంటి దేశం పేరు ఒక్కటి చెప్పండి అంటూ సూటిగా మోడీని ప్రశ్నించారు. ఇప్పుడు మరోసారి మోడీపై కామెంట్ విసిరారు. దీంతో ఇప్పుడు మన్మోహాన్ సింగ్ కూడా బాగానే సెటైర్లు వేస్తున్నారుగా అని అంటున్నారు. అంతేకాదు.. మన్మోహన్ సింగ్ అన్నదాంట్లో కూడా నిజముంది.. అప్పడు ఆయన్ని మౌనముని అనేవారు.. ఇప్పుడు ఆయన కూడా మౌన మునిలా తయారయ్యారని అంటున్నారు. మరి మాజీ ప్రధాని సలహాను.. ఇప్పటి ప్రధాని పాటిస్తారో లేదో..? చూద్దాం..

పాపం రాజుగారి పరువు తీసేశారుగా...

  పాపం టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి 'అశోక్‌గజపతిరాజు' పరువు అడ్డంగా తీసేశారు టీడీపీ కార్యకర్తలు. వాళ్లు చేసిన పనికి ఆయన పరువు మొత్తం పోయినట్టైంది. ఇంతకీ అంతలా టీడీపీ కార్యకర్తలు ఏం చేశారనుకుంటున్నారా...? అసలు మ్యాటరేంటంటే... ఏపీ ప్రత్యేక హోదా పోరాటం నేపథ్యంలో మిత్ర పక్షాలుగా ఉన్న టీడీపీ-బీజేపీ పార్టీలు తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు పార్లమెంట్లో సైతం మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇక ఈ పోరాటంలో భాగంగానే కేంద్రమంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు.   అయితే మంత్రి పదవి వదిలేసిన తరువాత తొలిసారి 'అశోక్‌గజపతిరాజు' విజయనగరం జిల్లాకు వచ్చారు. ఇక ఆయన రాకను స్వాగతిస్తూ కార్యకర్తలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక్కడే కార్యకర్తలు ఓ ఘనకార్యం చేశారు. రాజు గారిని పొగిడే క్రమంలో అసలు ఏం రాస్తున్నామో.. ఏంటో అని కూడా చూడకుండా ఫెక్సీలు పెట్టారు. ఇంతకీ ఫెక్సీల్లో ఏం రాశారనుకుంటున్నారా..? చూడండి మీరు కూడా ఆ ఘనకార్యం... 'రాజు కళంకితుడు'...రతిరాజు,శరీర విహీనుడు, దిగంబరుడు, గుహంతరవాసి.. ఇవి రాజుగారిని పొడుగుతున్నామనుకుంటూ టీడీపీ కార్యకర్తలు చూపించిన వెర్రితనం. ఇక ఈ ఫ్లెక్సీలు చూసినా.. వాళ్లందరూ అసలు వీరికి తెలుగు వచ్చా...? రాదా..? అసలు తామేం రాస్తున్నారో...ఏమి రాయించారో కూడా చూడలేదా..? 'వీళ్ల'కు పై పదాల అర్థాలు తెలుసా..? తెలిసే..రాశారా..? లేక...తెలియక రాశారా..? వీళ్ల తెలివితక్కువ తనానికి రాజుగారి పరువును గంగలో కలిపేశారని సెటైర్లు విసురుతున్నారు.  

నాకు వద్దు మీ సెక్యూరిటీ...

  ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్క్యూరిటీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన భద్రతా సిబ్బంది తనకు వద్దంటూ వెనక్కి పంపించేశారు. మార్చి 14వ తేదిన గుంటూరులో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  తనపై దాడి చేసే అవకాశం ఉందని.... తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పవన్ ఏపీ డీజీపికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దాంతో పవన్ కు రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్‌కు 2+2 గన్‌మెన్లను కేటాయించింది. ప్రతి షిప్టులో ఇద్దరు గన్‌మెన్లు పవన్ కళ్యాణ్‌తోనే ఉంటారు. మిగిలిన ఇద్దరూ గన్‌మెన్లు రెస్ట్‌ తీసుకొంటారు. అయితే ఇప్పుడు ఈ సెక్యూరిటీ నాకు వద్ద అని పవన్ వారిని వెనక్కి పంపించేశారు.   దీనికి కారణం ఏంటంటే... తనకు నియమించిన సెక్యూరిటీని ప్రభుత్వం తనపై నిఘా కోసం ఉపయోగించుకొంటుందని పవన్ కళ్యాణ్ అనుమానిస్తున్నారు. పార్టీ అంతర్గత విషయాలు లీకయ్యాయని... జనసేన రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాలతో పాటు ఇతర విషయాలపై పార్టీ చేసిన చర్చలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి చేరిపోయిందని భావిస్తున్నారు. నెల రోజుల కాలంలో పార్టీకి సంబందించిన కీలక చర్చలకు సంబంధించిన సమాచారం బయటకు వెల్లడైందని జనసేన చీఫ్ భావిస్తున్నారు. ఈ తరుణంలో సెక్యూరిటీ కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని ఆయన భావిస్తున్నారు. ఈ కారణంగానే సెక్యూరిటీని వెనక్కు పంపించారన్న టాక్స్ వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ సెక్యూరిటీ వెనక్కు వెళ్ళడంతో ప్రైవెట్ సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ రక్షణ బాధ్యతను చూసుకొనే అవకాశం ఉంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం...

అమిత్ జీ.. ఏంటి ఈ మార్పు..

  టీడీపీ-బీజేపీకి మధ్య నడుస్తున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పచ్చగడ్డి వేస్తేనే బగ్గుమనే పరిస్థితి వచ్చింది రెండు పార్టీల మధ్య. ప్రత్యేక హోదా విషయంలో ఒకపక్క బీజేపీ ఏపీ ఏంతో చేశాం అని అంటుంటే.. మీరు చేసింది ఏం లేదు అని మరోపక్క టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వంపై మోడీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో ఈ వివాదం ఇంకా ముదిరింది. ఇక ఈపని చేసినందుకుగాను.... మోడీ, అమిత్ షా గుర్రుగానే ఉన్నారు. చంద్రబాబునాయుడి సంగతైతే చెప్పక్కర్లేదు.. ఎప్పుడైతే బీజేపీ నుండి విడిపోయారో ఆరోజు నుండి మోడీ, అమిత్ షా పై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ఇక ఇది ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఒకటి చోటుచేసుకుంది.   టీడీపీ.. బీజేపీతో విడిపోయిన తరువాత దీనిపై స్పందించిన అమిత్ షా మీ ఇష్టం.. మీరు విడిపోతానంటే మాకేం ప్రాబ్లమ్ లేదు అని చాలా ఈజీగా చెప్పి చేతులు దులుపుకున్నారు. ఇక విడిపోయిన తరువాతే అసలు రచ్చ మొదలైంది. దాంతో ఇప్పుడు అమిత్ షాకు తెలుసొచ్చినట్టుంది. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ...ఏపీలో తెదేపాతో తెగదెంపుల తర్వాతే పార్టీ అధ్యక్షుడి మార్పు అనివార్యమైందన్నారు. త్వరలోనే ఏపీ భాజపా అధ్యక్షుడిని ప్రకటిస్తామన్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసమే ఏపీ భాజపా అధ్యక్షుడు హరిబాబు రాజీనామా చేశారని... త్వరలోనే కొత్త అధ్యక్షుడు ఎవరనేది ప్రకటిస్తామని తెలిపాయి. అంతేకాదు టీడీపీతో బ్రేకప్ గురించి మాట్లాడుతూ... కూల్ గా స్పందిస్తూ..కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసారు. చంద్రబాబుతో తమకు ఎలాంటి గొడవ లేదని.. పెట్టుకోవాలని కూడా అనుకోలేదని.. మా నుండే చంద్రబాబే వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. దీంతో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే, అమిత్ షా, విపక్షాల మీద ఇంత సాఫ్ట్ గా మాట్లాడరు. మోడీ-షా పాలన గురించి తెలిసిందే. విపక్షాలను ఎదుర్కోవడానికి ఎంత దూరమైన వెళతారు. అలాంటిది.. అమిత్ షా ఇలా మాట్లాడేసరికి... అమిత్ షా చంద్రబాబుకి ఇన్ డైరెక్ట్గ్ గా సిగ్నల్ పంపిస్తున్నారా అని అనుకుంటున్నారు. మరోపక్క దీనిపై స్పందించిన టీడీపీ నేతలు.... ఇవన్నీ మీడియా ముందు ఎదో హడావిడి అని, కర్ణాటకలో తెలుగువారి ఓట్లు పోకుండా, అమిత్ షా ఎదో కవర్ చేస్తున్నారని మండిపడుతున్నారు. మరి అమిత్ షా ఏ ఉద్దేశంతో ఇలా వ్యాఖ్యానించారో ఆయనకే తెలియాలి మరి..!