జయలలిత పథకం ‘అమ్మ బేబీ కేర్ కిట్’
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. అమ్మ బేబీ కేర్ కిట్ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఇప్పటికే అమ్మ క్యాంటీన్లు, అమ్మ చౌక వస్తు సరఫరా, అమ్మ నూనె, అమ్మ మంచినీరు, అమ్మ మందుల షాపు, అమ్మ ఉప్పు, అమ్మ విత్తనాలు తదితరాలు ఉన్నాయి. కొత్తగా పుట్టిన పిల్లల కోసం ఈ ‘అమ్మ బేబీ కేర్ కిట్’ పథకాన్ని ప్రారంభించారు. శిశువులకు అవసరమయ్యే వెయ్యి రూపాయల విలువ చేసే 16 వస్తువులను ఈ పథకం ద్వారా ఇస్తారు. ఈ పథకం కారణంగా తమిళనాడు రాష్ట్రంలో ఏడు లక్షల కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. ఈ పథకం కోసం 67 కోట్లను కేటాయించారు. బేబీ కేర్ కిట్‌లో టవల్, బేబీ డ్రెస్, బేబీ బెడ్, ప్రొటెక్షన్ నెట్, న్యాప్ కిన్, బేబీ ఆయిల్, షాంపూ సాచెట్, సోప్ బాక్స్, నెయిల్ క్లిప్పర్, టాయ్, ఓ గిలక్కాయ్‌తో పాటు తల్లికి లిక్విడ్ హ్యాండ్ వాష్ సోప్ వుంటాయి.