రేవంత్ మీద దృష్టిపెట్టిన టీఆర్ఎస్ నాయకులు
తెలంగాణలో అధికారంలో వున్న తెరాస నాయకులు అధికారంలోకి రాకముందు ఎవర్నయినా, ఎంత దారుణంగా అయినా విమర్శించేవారు. వారి విమర్శలకు హద్దు, అదుపు వుండేది కాదు. వారికి వ్యతిరేకంగా ఎవరు పల్లెత్తు మాట మాట్లాడినా వారి మీద ‘తెలంగాణ ద్రోహి’ ముద్ర వేసి నెట్టుకొచ్చేవారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా తెరాస నాయకులు అదే బాటలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, తమ నాయకులు కేసీఆర్, కేటీఆర్ తదితరుల మీద సునిశితమైన విమర్శలు చేస్తూ, పదునైన వాగ్బాణాలను వదులుతున్న తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులకు కంట్లో నలుసు, కాలిలో ముల్లు, పంటికింద రాయిలా తయారయ్యారు. తాజాగా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులను చేసిన విమర్శలు టీఆర్ఎస్ నాయకులకు పదునైన బాణాల్లా గుచ్చుకున్నాయి. దాంతో ఇప్పుడు వారంతా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డి, ఇతర టీటీడీపీ నేతల మీద ఘాటుగా ఎదురుదాడి ప్రారంభించారు.రేవంత్‌రెడ్డి.. బ్లాక్‌మెయిలర్ అని, ఆయన కాంట్రాక్టర్లను బెదిరించి ఇళ్లు, ఆస్తులు పెంచుకుంటున్నారు ఆరోపించారు. అలాగే పనిలోపనిగా ఇతర టీడీడీపీ నేతలను కూడా విమర్శించారు.మోత్కుపల్లి, ఎర్రబెల్లి.. ఏపీ సీఎం చంద్రబాబు పెంపుడు కుక్కలని దుయ్యబట్టారు. పెద్ద మనుషుల పేర్లు తీసుకొని సీఎం కేసీఆర్ తనయుడికి కేటీఆర్ అని పేరు పెట్టారని, దీనిని రాజకీయం చేయడం సరికాదన్నారు.