ఏపీ తాత్కాలిక రాజధాని విజయవాడ...
posted on Aug 12, 2014 @ 5:17PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిగా విజయవాడని ఎంపిక చేశారు. మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని సలహా మండలితో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం జరిగేలోపు ఒక తాత్కాలిక రాజధాని వుండాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు. సకల హంగులతో అంతర్జాతీయ స్థాయి నగరం నిర్మాణం జరిగేలోపు ఒక తాత్కాలిక రాజధాని అవసరమని ఆయన భావించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తాత్కాలకి రాజధానిగా విజయవాడను ఎంపిక చేశారు. విజయవాడకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖాధిపతుల కార్యాలయాలను విజయవాడకు తరలించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు విజయవాడలోని గన్నవరం సమీపంలోని ఐటీపార్క్ భవన సముదాయాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. అలాగే విజయవాడలో అందుబాటులో వున్న భవనాలను కూడా పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.