తెదేపా ఏపీ, తెలంగాణా, కేంద్ర కమిటీల ప్రకటన

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఆంద్రప్రదేశ్, తెలంగాణా, కేంద్ర పోలిట్ బ్యూరో కమిటీల వివరాలను విజయవాడలో ప్రకటించారు. తెదేపా ఆంద్రప్రదేశ్ అధ్యక్షుడిగా కళా వెంకట్రావును, తెలంగాణా అధ్యక్షుడిగా మళ్ళీ యల్. రమణను నియమించారు. చంద్రబాబు నాయుడు తెదేపా జాతీయ అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. నారా లోకేష్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమింపబడ్డారు.   ఆంద్రప్రదేశ్ : ఈ కమిటీలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మొత్తం 70మంది సభ్యులను నియమించారు. అధ్యక్షుడు: కళా వెంకట్రావు, ఉపాధ్యక్షులు: కారణం బలరామ్,బండారు సత్యనారాయణ, వెంకటేశ్వర చౌదరి, జె.ఆర్. పుష్పరాజ్, ఎం. సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు: వార్ల రామయ్య, బుచ్చయ్య చౌదరి, రెడ్డి సుబ్రహ్మణ్యం, నాగేశ్వర్ రెడ్డి, రామానాయుడు, అధికార ప్రతినిధులు: డొక్కా మాణిక్యవర ప్రసాద్, జూపూడి ప్రభాకర్, వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్, ముళ్ళపూడి రేణుక,ముత్తం శెట్టి శ్రీనివాస రావు, అనురాధ, లింగారెడ్డి, కోశాధికారి: బిసి. జనార్ధన్ రెడ్డి.   తెలంగాణా: ఆంద్రప్రదేశ్ కంటే తక్కువ జిల్లాలు ఉన్నప్పటికీ తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణా రాష్ట్ర కమిటీలో 93మంది సభ్యులను నియమించారు. అధ్యక్షుడు: ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్: రేవంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు:ఎం. వెంకటేశ్వర రావు, సాయన్న, స్వామీ గౌడ్, యూసఫ్ ఆలి, కృష్ణ యాదవ్, ఎ. గాంధీ, సి.హెచ్. సురేష్ రెడ్డి, అన్నపూర్ణమ్మ. తెలుగు యువత అధ్యక్షుడు: వీరేందర్ గౌడ్, తెలుగు మహిళ అధ్యక్షురాలు: శోభారాణి   కేంద్ర కమిటీ: కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు: నందమూరి హరికృష్ణ, యనమల, అయ్యన్న, ప్రతిభా భారతి, అశోక్ గజపతి రాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చిన్న రాజప్ప, కాల్వ శ్రీనివాసులు, మోత్కుపల్లి, ఎర్రబెల్లి, దేవేందర్ గౌడ్, నామా నాగేశ్వర రావు, రమేష్ రాథోడ్, ఉమా మాధవ రెడ్డి, తదితరులు. అధికార ప్రతినిధులు: కే.రామ్మోహన్ నాయుడు, అరవింద్ కుమార్ గౌడ్, బోండా ఉమా.

అక్బరుద్దీన్ రియాక్ట్ వెనుక కారణం అదా?

  తెలంగాణ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై జరిగిన చర్చలో ఐఏఎంపార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అధికార పార్టీని కడిగేసిన సంగతి తెలిసిందే. రైతు ఆత్మహత్యలపై ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు వచ్చిన కేటీఆర్ కు కూడా ఘాటుగా సమాధానం చెప్పి కేటీఆర్ నోరు మూయించాడు.. దాంతో మంత్రి హరీశ్ రావు కూడా కల్పించుకొని అక్బరుద్దీన్ వాగ్దాటికి బ్రేక్ వేద్దామని చూసినా కూడా అది వర్కవుట్ కాలేదు. ఆవిధంగా మొత్తానికి ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా రైతు ఆత్మహత్యల విషయంపై అధికార పార్టీని ఇరుకున పెడదామని అనుకున్న నేపథ్యంలో ఆ పని అక్బరుద్దీన్ ఒకరే చేసి చూపించారు. అయితే రైతు ఆత్మహత్యలపై అక్బరుద్దీన్ అంతలా రియాక్ట్ అవ్వడానికి అసలు కారణం వేరే ఉందట. అదేంటంటే.. గతంలో ఒకసారి అక్బరుద్దీన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన దాని గురించి చెపుతూ మృత్యుముఖం వరకూ వెళ్లి వచ్చిన నాకు ఆ బాధ ఏంటో తెలుసని.. నేను రైతును కాకపోయినా.. ఆ రైతు కుటుంబం బాధ ఏలా ఉంటుందో తెలుసని ఆవేదన వ్యక్తం చేశారు. చావు వరకూ వెళ్లిన నాకు ఆ బాధ తెలుసు ఇంటి పెద్దకు ఏదైనా అయితే కుటుంబ సభ్యులు ఎలాంటి బాధ అనుభవిస్తారో నేను ప్రత్యక్షంగా చూశానని వ్యాఖ్యానించారు. మొత్తానికి అక్బరుద్దీన్ అంతలా రియాక్ట్ అవడానికి పర్సనల్ ఎక్స్ పీరియన్స్ కారణం అన్నమాట..

నయనతార, సమంత ఇళ్ళపై ఐటీ దాడులు

  ప్రముఖ హీరోయిన్లు నయనతార, సమంత ఇళ్ళపై ఐటి శాఖ అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. వారేగాక ప్రముఖ తమిళహీరో విజయ్ ఆయన చేసిన ‘పులి’ సినిమా నిర్మాత షిబు సెల్వ కుమార్ ఇళ్ళపై ఐటి శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. తమిళనాడులో చెన్నై, మధురై, కేరళ రాష్ట్రంలో నయనతార ఉంటున్న కొచ్చి నివాసంపై ఏక కాలంలో ఇళ్ళపై ఐటి శాఖ అధికారులు దాడులు నిర్వహించి సోదాలు చేస్తున్నారు. దేశంలో మరో 32 ప్రాంతాలలో కూడా ఇళ్ళపై ఐటి శాఖ అధికారులు ఈరోజే దాడులు నిర్వహించారు. అంటే దేశంలో ఇతర సినీ పరిశ్రమలకు చెందినవారి ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు నిర్వహించినట్లు స్పష్టం అవుతోంది. ఐటి అధికారులు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శక, నిర్మాతల ఇళ్ళు కార్యాలాలపై దాడులు చేయడం కొత్తేమీ కాకపోయినప్పటికీ చాలా కాలంగా దాడులు చేయకపోవడం వలన ఇవి సంచలనం కలిగిస్తున్నాయి.

లోకేశ్, రేవంత్ కు కీలక పదవులు

టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ జాతీయ, తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల కమిటీలను ప్రకటించారు. ఈసందర్భంగా కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయ కర్త నారా లోకేశ్ కు.. తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కీలక పదవులు దక్కినట్టు తెలుస్తోంది. ఎవరెవరికి ఏ పదవులు దక్కనున్నాయి... * కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శులుగా రేవూరి ప్రకాశ్ రెడ్డి, కొనకళ్ల నారాయణ, నారా లోకేష్‌లు ఉండనున్నారని తెలుస్తోంది. * ఉపాధ్యక్షులుగా రాములు, మాగుంట, డి సత్యప్రభ ఉండనున్నారని తెలుస్తోంది. * అధికార ప్రతినిధులుగా బొండా ఉమమహేశ్వర రావు, పెద్దిరెడ్డి, రామ్మోహన్ నాయుడు, పయ్యావుల కేశవ్ ఉండనున్నారని సమాచారం. * తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇంతకముందు కొనసాగిన ఎల్ రమణనే కొనసాగనున్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి ఉండనున్నారు. * ఏపీ అధ్యక్షులుగా కళా వెంకట్రావు ఉంటారు.

ఏపీ, తెలంగాణ.. ఈసారి సరిహద్దు వివాదం..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య ఎప్పుడూ ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంటది. ఇప్పటికే ఈరెండు రాష్ట్రాల మధ్య ఉన్న గొడవలలో కొన్ని సమస్యలు తీరినా.. కొన్ని సమస్యలు మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ ఇంకో కొత్త సమస్య మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి ఇది వివాదం సరిహద్దు సమస్యగా మారబోతుందా అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అసలు వివాదం ఏంటంటే నాగార్జున సాగర్ సమీపంలో అనువు దగ్గర కొత్త బోట్లు తయారీకి గాను మొత్త మూడు లారీల్లో తయారీ సామాగ్రితో తెలంగాణ టూరిజం సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే ఆంధ్రాభూభాగంలో బోట్లు ఎలా నడుపుతారు అంటూ వారిని ఏపీ టూరిజం అధికారులు అడ్డుకున్నారు. అదే తెలంగాణ హుస్సేన్ సాగర్ లో నడిపితే ఊరుకుంటారా అని ఎదురు ప్రశ్నించారు. అంతే దీంతో తెలంగాణ టూరిజం అధికారులకు.. ఏపీ టూరిజం అధికారులకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఇప్పుడు సరిహద్దు వివాదానికి దారితీస్తుందేమోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్ పట్టించుకోరు.. చంద్రబాబుకు 3 కోట్లిస్తా.. తలసాని

టీడీపీ పార్టీలో గెలుపొంది టీఆర్ఎస్ పార్టీలో పదవి అనుభవిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీడ్రామాపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అలాంటిది ఇప్పుడు తాను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దే గెలుపని.. సనత్ నగర్ నియోజక వర్గం నుండి తానే గెలుస్తానని.. తాను ఇంట్లో ఉండి కూర్చొని గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ఓటములను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పట్టించుకోరని తలసాని చెప్పారు. అంతేకాదు నారా లోకేశ్ తమ ఆస్తి వివరాలు తెలిపిన నేపథ్యంలో తలసాని దాని గురించి ప్రస్తావించారు. చంద్రబాబు ఇంటి విలువ కేవలం రూ 23 లక్షలేనా.. నేను రూ.3 కోట్లు ఇస్తాను చంద్రబాబు తన ఇంటిని అమ్మేస్తారా అని ప్రశ్నించారు. వారు తెలిపిన ఆస్తుల వివరాలు అంతా ఒట్టిదే అని విమర్శించారు.

అసెంబ్లీ ముందే రైతు ఆత్మహత్యాయత్నం

అన్నదాతల ఆత్మహత్యలపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంటే, ఓ రైతు ఏకంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న సెల్ టవర్ పైకెక్కి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు, వ్యవసాయంలో నష్టం రావడంతో తనకు రెండు లక్షల రూపాయలు అప్పు అయ్యిందని, దాన్ని ఎలా తీర్చాలో తెలియడం లేదని, అందుకే ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తెలిపాడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రులకు తన గోడును వెళ్లబోసుకోవడానికి వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని, ఇక తనకు చావే శరణ్యమంటూ సెల్ టవర్ పైనే పురుగుల మందు తాగేశాడు, దాంతో అసెంబ్లీ పరిసరాల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది, అయితే పురుగుమందు తాగిన రైతు సమ్మయ్యను అతికష్టంమీద కిందికి దించిన పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు, సమ్మయ్య...వరంగల్ జిల్లా నెక్కొండ వాసిగా గుర్తించారు.

కేటీఆర్ కు అక్బరుద్దీన్ కౌంటర్.. కాపాడిన హరీశ్ రావు

తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు రైతుల ఆత్మహత్యలపై చర్చ జరుపుతున్న నేపథ్యంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ప్రతిపక్షాలన్నీ కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతు ఆత్మహత్యల అంశంపై ఇరుకున పెడదామని అనుకున్న నేపథ్యంలో ఆపని ఒక్క అక్బరుద్దీనే చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై అక్బరుద్దీన్ మాట్లాడుతూ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మూడు ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది అంటున్నారు.. ప్రతి ప్రాంతంలో పంట పొలాలకు నీరందితే అత్మహత్యలు ఎందుకు చేసుకుంటారని నిలదీశారుయ. అయినా రైతుల ఆత్మహత్యలను ప్రకృతి మీద నెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు.. మరి వర్షాలు పడిన ప్రాంతంలో రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని ప్రశ్నించారు. అంతేకాదు ఏ మంత్రి నియోజక వర్గంలో ఎంత మంది రైతులు చనిపోయారో కూడా చెప్పారు. కేటీఆర్ నియోజకవర్గంలో 18 ఆత్మహత్యలు - ఈటెల రాజేందర్ నియోజకవర్గంలో 15 - హరీష్ రావు నియోజకవర్గంలో 11 - చందూలాల్ నియోజకవర్గంలో 11 మంది - మహేందర్ రెడ్డి నియోజకవర్గంలో 10 - జూపల్లి ప్రభాకర్ నియోజకవర్గంలో 10 - లక్ష్మారెడ్డి నియోజకవర్గంలో 15 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు దీంతో మంత్రులు ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. అయితే అక్బరుద్దీన్ రైతు ఆత్మహత్యల గురించి మాట్లడుతున్న సమయంలో టీఆర్ఎస్ నాయకులు నవ్వుతుండగా.. అక్బరుద్దీన్ నేను రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతుంటే మీకు నవ్వు వస్తుందా.. మీ వ్యవహారాన్ని ప్రజలు చూస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఐటీ మంత్రి కేటీఆర్ కల్పించుకొని మేమేమి నవ్వడంలేదు..రైతుల ఆత్మహత్యలపై మేము కూడా సీరియస్ గానే ఉన్నామని.. మీరేం మాట్లాడినా సూటిగా మాట్లాడాలని అన్నారు. దీనికి అక్బరుద్దీన్ కూడా కేటీఆర్ కు ఘాటుగా సమాధానమిచ్చారు. తామేమి సూటిగా మాట్లాడలేదో చెప్పండి అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. అంతేకాదు కేటీఆర్ అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మీ నేతలకు చెప్పుకోండి అంటూ చురకలు అంటించారు. దీంతో కేటీఆర్ కు ఏం సమాధానం చెప్పాలో తెలియక అవస్తపడుతుండగా ఇంతలో హరీశ్ రావు కల్పించుకొని ఒక్క నేతకు ఇంత సమయం ఇస్తే ఎలా అంటూ స్పీకర్ ను కోరడంతో స్పీకర్ అక్బరుద్దీన్ ను త్వరగా ముగించాలని కోరారు. మొత్తానికి బావ పడుతున్న అవస్త చూసి హరీశ్ ముందే తేరుకొని చాలా చక్కగా పరిస్థితిని చక్కదిద్దారు.  

అక్బరుద్దీన్ ఓవైసీ - మంత్రి కేటీఆర్ మధ్య గొడవ

తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, ఐటీశాఖా మంత్రి కేటీఆర్ మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది, తాను మాట్లాడుతుండగా కొందరు సభ్యులు నవ్వుతున్నారంటూ అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తంచేయడంతో వివాదం మొదలైంది. అంతేకాకుండా రైతు ఆత్మహత్యలపై మీడియాలో వస్తున్న వార్తలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఓవైసీ చేసిన విమర్శలపై తీవ్రంగా స్పందించిన మంత్రి కేటీఆర్.... మీడియా కోసమో, ప్రజలను అట్రాక్ట్ చేయడం కోసమో అక్బరుద్దీన్ మాట్లాడుతున్నట్లుందని కౌంటర్ ఇచ్చారు. పెద్ద గొంతేసుకుని మాట్లాడినంత మాత్రాన అవన్నీ నిజాలైపోవని అన్నారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు అక్బర్ తీవ్ర అభ్యంతరం చెప్పారు, స్పీకర్ అధికారాలను కేటీఆర్ తీసుకుంటున్నారని విమర్శించారు, దానికి కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చిన కేటీఆర్... రైతు ఆత్మహత్యల సమస్యపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, మిగతా పక్షాలు మాట్లాడుతున్నప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, అక్బర్ వ్యాఖ్యలపైనే వివాదం వచ్చిందన్నారు, అయితే ఎంఐఎం, టీఆర్ఎస్ పరోక్షంగా మిత్రపక్షాలంటూ బీజేపీ విమర్శలు చేసిన తరుణంలో అక్బర్-కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరగడంతో ఈ రెండు పార్టీల మధ్యా ఎక్కడో సత్సంబంధాలు దెబ్బతిన్నాయేమోనని చెవులు కొరుక్కుంటున్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీలోకి?

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ టీడీపి తీర్ధం పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆయనకు ప్రశంసలు సంగతి దేవుడెరుగుకాని విమర్శలే ఎక్కువ మోశారు. దానికి తోడు అప్పుడే రాష్ట్రవిభజన జరగడం.. ఒకవైపు తాను సమైక్యాంధ్ర అంటూ ఉన్నా కాని రాష్ట్రం విడిపోవడంలో కేంద్రానికి సపోర్టు చేశారనే ప్రజలు తిట్టిపోసుకున్నారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కిషోర్ కుమార్ అన్నీ తానై చూసుకునేవారు. తరువాత రాష్ట్రం విడిపోవడం ఆయన వేరే పార్టీ పెట్టడం జరిగాయి. అప్పుడు  పీలేరు అసెంబ్లీ బరిలో నిలిచి  వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. ఆతరువాత ఇద్దరూ దాదాపు రాజకీయాలకు దూరమయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ కిషోర్ కుమార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆయన టీడీపీలోకి చేరే ప్రయత్నాలు చేస్తున్నట్టు.. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈవార్తల నేపథ్యంలో మరో వార్త షికారు చేస్తుంది.  తమ్ముడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా మళ్లీ రాజకీయాల్లోకి రావాలని తన పార్టీని వేరే పార్టీలో విలీనం చేసి మళ్లీ తన సత్తా చాటాలని చూస్తున్నారట. చూద్దాం ఇందులో ఎంత నిజముందో.

మోడీని రాష్ట్రపతి చేసిన ఒబామా

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత ప్రధాని నరేంద్ర మోడీని రాష్ట్రపతిని చేశారు. ఎప్పుడు ఎలా అనుకుంటున్నారా. నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయనకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వాగతం పలికారు. అయితే ఆయన మోడీకి స్వాగతం పలికే క్రమంలో ‘వెల్‌కమ్ ప్రెసిడెంట్ మోడీ' అన్నారు. వెంటనే పక్కన ఉన్న అధికారులు ఇది గమనించి తప్పును సరిచేశారు. అయితే భేటీ సందర్భంగా మళ్లీ మోడీ ప్రెసిడెంట్ అనే సంబోధించడం జరిగింది.. ‘ప్రెసిడెంట్ మోడీకి స్వచ్ఛ ఇంధనం విషయంలో ఉన్న నిబద్ధత మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోంది' అని ఒబామా చెప్పారు.. అయితే ఈ వీడియోను వైట్‌హౌస్ వెబ్ సైట్ లో పోస్ట్ చేయగా అప్పుడు ఆవ్యాఖ్యలు విన్న సిబ్బంది నాలుక కరుచుకొని అందులో 'ప్రెసిడెంట్' అనే పదాన్ని 'ప్రధానమంత్రి'గా మార్చారు.

అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పై ఎర్రబెల్లి సెటైర్లు

రైతు ఆత్మహత్యలపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు... ముఖ్యమంత్రి కేసీఆర్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ ఫాంహౌస్ ను తాము చూడాలనుకుంటున్నామన్న ఎర్రబెల్లి... దేశంలోనే ఆయన ఆదర్శ రైతు అంటూ సెటైర్లేశారు, తనకు ఎకరానికి కోటి రూపాయలు ఆదాయం వస్తుందన్న కేసీఆర్... మళ్లీ ఇజ్రాయెల్ ఎందుకు వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు, ఇజ్రాయెల్, చైనా టూర్లకు రైతులను కూడా తీసుకెళితే వ్యవసాయ మెళకువలు తెలుసుకుని మంచి రాబడి సాధిస్తారు కదా అంటూ వ్యాఖ్యానించారు. తక్కువ పొలంలో ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్న కేసీఆర్... తన ఫాంహౌస్ ను రైతులకు, ఎమ్మెల్యేలకూ చూపిస్తే, ఆయన పాటించే వ్యవసాయ పద్ధతులను తామూ నేర్చుకుంటామంటూ చమత్కరించారు

కేసీఆర్ కాదు... వరుణుడే ఆత్మహత్యలకు కారణం

తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రకటన చేసిన వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి... బాధిత కుటుంబాలన్నింటికీ పరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు, తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన సూసైడ్స్ కు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని, బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని పోచారం ప్రకటించారు, రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ ప్రభుత్వం కారణం కాదన్న ఆయన... వరుణదేవుడిపై నెపం నెట్టేశారు, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాలేదని, మరోవైపు వర్షాభావ పరిస్థితులు, రుణభారం కారణంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. రుణమాఫీ కింద ఇప్పటివరకు 8వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చామన్న పోచారం... మొత్తం రుణమాఫీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.

కేసీఆర్ లాగా అందరూ టోపీ పెట్టుకోవాలన్న ఓవైసీ

రైతు ఆత్మహత్యలపై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు, ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాంహౌస్ లో ఎప్పుడూ టోపీ పెట్టుకుని అందంగా కనిపిస్తారని, అలాగే తెలంగాణలోని ప్రతి రైతు.. కేసీఆర్ మాదిరిగా టోపీ పెట్టుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫాంహౌస్ పచ్చగా ఉన్నట్లే ప్రతి రైతు పొలం పచ్చగా ఉండాలని ఓవైసీ ఆకాంక్షించారు. రైతుల ఆత్మహత్యలకు అందరూ బాధ్యత వహించాలన్న అక్బరుద్దీన్...మంత్రుల నియోజకవర్గాల్లోనే సూసైడ్స్ ఎక్కువగా ఉన్నాయంటూ రికార్డులతో సహా వివరించారు. అన్నదాతల ఆత్మహత్యలకు వరుణదేవుడే కారణమని వ్యవసాయ మంత్రి పోచారం తప్పించుకోవాలని చూస్తున్నారని, కనీసం ఇప్పటికైనా సూసైడ్స్ కు మూలకారణాలేంటో విశ్లేషించి... నివారణా చర్యలు చేపట్టాలని కోరారు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు హైకోర్టు నోటీసులు

ఏపీ, తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై హైకోర్టు సీరియస్ అయ్యింది, బలవన్మరణాలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకోకుండా ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో అన్నదాల ఆత్మహత్యలపై జన చైతన్య వేదిక వేసిన పిల్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ మేరకు ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. బాధిత రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వడమే పరిష్కారం కాదన్న హైకోర్టు.... సరైన పరిష్కారం కోసం ఎందుకు అన్వేషించడం లేదని ఇరు ప్రభుత్వాలను ప్రశ్నించింది. చనిపోయాక పరిహారం ఇస్తే ఏం లాభం, బతికున్నప్పుడే రైతును కాపాడుకోవాలంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కి వాయిదా వేసిన ధర్మాసనం... రైతుల ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకున్నారో నివేదికలు ఇవ్వాలంటూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. రైతు ఆత్మహత్యలపై ఇరు రాష్ట్రల్లో రాజకీయ దుమారం రేగుతున్న సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు కీలకంగా మారాయి

ఏపీకి కళా వెంకట్రావు, తెలంగాణకి మళ్లీ ఎల్.రమణే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీల నియామకానికి కసరత్తు పూర్తయింది, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే స్వయంగా రేపు కొత్త కమిటీలను ప్రకటించనున్నారు. ఏపీ, తెలంగాణ కమిటీలతోపాటు కేంద్ర కమిటీని కూడా బాబు అనౌన్స్ చేయనున్నారు, టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉండనుండగా, ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేష్, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ, రేవూరి ప్రకాష్ రెడ్డి, నామా నాగేశ్వర్రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ప్రధాన కార్యదర్శులుగా బోండా ఉమ, జయనాగేశ్వర్ రెడ్డి, వర్ల రామయ్యలను నియమిస్తారని తెలుస్తోంది, తీవ్ర పోటీ నెలకొనడంతో ఐవీఆర్ఎస్ విధానాన్ని అమలుచేసినా మళ్లీ ఎల్.రమణకే తెలంగాణ పగ్గాలు దక్కనున్నాయి , వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డిని ప్రధాన కార్యదర్శులుగా కేపీ వివేకానంద, సండ్ర వెంకటవీరయ్య, మల్లయ్యయాదవ్,  సీతక్కలను నియమిస్తారని తెలుస్తోంది. అధికార ప్రతినిధులుగా నన్నూరి నర్సిరెడ్డి, కర్నాటి విద్యాసాగర్, ప్రతాప్ రెడ్డి పేర్లు వినిపిస్తుండగా, ఢిల్లీలో జాతీయ అధికార ప్రతినిధులుగా గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, సీఎం రమేష్ లను నియమిస్తారని తెలుస్తోంది,

మన్మోహన్ పై తగిన ఆధారాలు లేవు..

యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం వ్యవహారంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ కు కోర్టులో ఊరట లభించింది. ఈ కుంభకోణంలో ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు..మధు కోడాల మీద కూడా కేసులు నమోదయ్యాయి. అయతే సీబీఐ మన్మోహన్ సింగ్ ను విచారించవలసిన నేపథ్యంలో తాను సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దీనిపై కోడా ఈ కుంభకోణం వ్యవహారంలో మన్మోహన్ సింగ్ ను కూడా ప్రశ్నించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపగా సిబిఐ తరపు న్యాయవాది ఆర్‌ ఎస్‌ చీమా మాట్లాడుతూ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ బొగ్గు గనుల కేటాయింపులో కుట్రకు పాల్పడినట్లు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. మధు కోడా కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉన్నారని ఆయన తెలిపారు. కాగా గతంలో కూడా దాసరి బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ సింగ్ పాత్ర ఉందని చెప్పిన సంగతి తెలిసిందే.

అసెంబ్లీలో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా రేవంత్.. కేసీఆర్ ఆగ్రహం

రైతు ఆత్మహత్యల అంశంపై చర్చలో అసెంబ్లీలో వేడి రాజుకుంటుంది.  చాలా వాడీవేడీగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం తెలంగాణ టీడీపీ నేత.. కొడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారారు. ఓటుకు నోటు కేసు తర్వాత కేవలం తన నియోజక వర్గానికే పరిమితమైన రేవంత్ రెడ్డి కోర్టు తనకు విధించిన షరతులను సడలింపజేయటం వల్ల కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ కు వచ్చారు. ఇప్పుడు ఆసెంబ్లీ సమావేశాలకు హాజరైన రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎప్పటిలాగానే తన దైన శైలిలో అధికార పార్టీపై.. ముఖ్యంగా కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల వైఖరి పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వహిస్తేచాలు.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అధికారంలో ఉండదని..అదేమి శాశ్వతం కాదని హెచ్చరించారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో సాకు చెప్పి రేవంత్ రెడ్డిని సభలో మాట్లాడనివ్వకుండా చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మరి ఎలాంటి వ్యూహం వేస్తుందో.. లేక అసలే ఫుల్ ఫైర్ మీద ఉన్న రేవంత్ రెడ్డి ఈసారి వారి వ్యూహాలను తిప్పికొడతారో చూడాలి. ఇదిలా ఉండగా అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ నేపథ్యంలో గందరగోళం నెలకొంది. రైతుల ఆత్మహత్యలపై చర్చించాలని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుబట్టడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలపై చర్చించాలని బీఏసీలో నిర్ణయించామని.. ఇప్పుడు ఆత్మహత్యల పైనే చర్చించాలని ఎందుకు పట్టుబడుతున్నారంటూ.. ఎప్పుడూ నెగెటివ్ ఆలోచనలేనా? అంటూ ప్రశ్నించారు.

ఇంకా ఆంధ్రోళ్లేనా.. నవ్వుకుంటారు.. ఎర్రబెల్లి

  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ జరుగుతుంది. రైతుల ఆత్మహత్యలపై టీడీపీ నేత ఎర్రబెల్లి మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నా ప్రభుత్వం మాత్రం ఏం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రం విడిపోయి తెలంగాణ ధనిక రాష్ట్రం అని అనిపించుకున్నా రైతలు మాత్రం ఇంకా పేదవారిగానే ఉన్నారని అన్నారు. ఎప్పుడు చూడు ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లు అంటూ తిట్టడం.. గత ప్రభుత్వాల తీరును విమర్సించడం.. ముందు తిట్టడం ఆపి అసలు ఇప్పుడు మీరేం చేస్తున్నారో చెప్పండి అంటూ ప్రశ్నించారు. ఇంకా వాళ్లనే తిట్టుకుంటూ పబ్బం గడుపుతుంటే ప్రజలు నవ్వుకుంటారని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య ప్రభుత్వం ఎందుకు తగ్గిస్తుందని నిలదీశారు. పౌల్ట్రీ రైతుల కంటే మామూలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. కేంద్రానికి సర్కారు నివేదిక ఎందుకు పంపించడం లేదో చెప్పాలన్నారు.