షరీఫ్, అజీజ్‌లతో సుష్మ భేటీ.. సుష్మా ఆ వ్యాఖ్యలు చేయలేదు..
విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ బృందం పాక్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తోను, ఆయన విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్‌తోను భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు భారత్-పాక్ దేశాల మధ్య సమగ్ర ద్వైపాక్షిక చర్చలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇరుదేశాల మధ్య విశ్వాస నిర్మాణ చర్యలు, శాంతి సామరస్యవాతావరణం, జమ్మూ కాశ్మీర్, సహా పలుఅంశాలపై చర్చించేందుకు అనుసరించాల్సిన పద్ధతులను ఖరారు చేయాల్సిందిగా ఇరు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శులను ఈ ప్రకటన కోరింది.
ఇదిలా ఉండగా మోడీ పర్యటనపై పాక్ మీడియా అత్యుత్సాహం చూపినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉన్న సుష్మా స్వరాజ్.. వచ్చే ఏడాది పాక్ లో జరిగే సార్క్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ..వస్తున్నారంటూ చెప్పినట్లుగా వార్తలు ప్రసారం చేశారు. దీంతో ఇప్పుడిది వివాదాస్పదమైంది. దీనికి స్పందించిన భారత బృందంలోని అధికారులు సుష్మా స్వరాజ్ అలాంటి వ్యాఖ్యలు ఏం చేయలేదని.. స్పష్టం చేసింది.