చంద్రబాబుని కలిసిన కేసీఆర్..
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు.ప్రధాన ద్వారం వద్దకు వచ్చి చంద్రబాబు కేసీఆర్ కు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా తాను నిర్వహించనున్న ఆయుత చండీయాగానికి కుటుంబ సమేతంగా రావాలని కేసీఆర్ చంద్రబాబుని ఆహ్వానించారు.దీంతో చంద్రబాబు తాను తప్పకుండా యాగానికి వస్తానని కేసీఆర్ కి చెప్పినట్టు తెలస్తోంది.కేసీఆర్ వెంట ఈటెల,ఎంపీ బాల్క సుమన్ ఉన్నారు.
ఇదిలా ఉండగా చంద్రబాబు కేసీఆర్ కోసం పదిహేను రకాల వంటకాలు సిద్ధం చేయించినట్టు తెలుస్తోంది.అందులో నాటుకోడి, చేపల పులుసు, గోంగూర, ముద్దపప్పు, కాకినాడ ఖాజా, ఉలవచారు, టమోటా పప్పు, మునక్కాయ సాంబారు, బిర్యానీ, గడ్డ పెరుగు, పూతరేకులు వంటి మిఠాయిలు, వివిధ రకాల పండ్లు సిద్ధం చేసినట్టు సమాచారం.