గెలిచినా కిక్ లేదు.. మోడీకి గుణపాఠమే..

  ఒకసారి కాదు.. రెండోసారి కాదు.. ఏకంగా ఆరోసారి గుజరాత్ లో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. అయితే ఇక్కడ ఓ చిన్న తేడా ఉంది. గతంలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి...ఇప్పుడు అధికారంలోకి వచ్చిన బీజేపీకి తేడా ఉంది. ఎందుకంటే.. అసలు ఈసారి ఎన్నికల్లో గెలుస్తామా అని బీజేపీకే అనుమానాలు ఉన్నాయి కాబట్టి. దీనికి కారణం అందరికీ తెలిసిందే. బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేక భావనే. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో అంతా బాగానే ఉండేది. ఎక్కడ చూసినా నమో మోడీనే కనిపించేది. ఆతరువాత రాను రాను పరిస్థితిలో మార్పు వచ్చింది. ఈ నాలుగేళ్లలో మోడీ  తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయనపై వ్యతిరేక భావాన్ని కలిగించాయి. పటేల్ రిజర్వేషన్ ఉద్యమం, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, దళితులపై దాడి ఇవన్నీ మోడీకి ప్రతికూల అంశాలుగా నిలిచాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ అంశాలనే ప్రజలముందు లేవనెత్తాయి. దీంతో బీజేపీ కూడా తమ గెలుపు మీద సందేహ పడ్డాయి. కానీ చాలా కష్టపడి అధికారం చేజిక్కించుకుంది.   ఏ మాటకి ఆ మాట కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా.. బీజేపీకి మాత్రం చెమటలు పట్టించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధాని మోడీకి తొలిసారిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెమటలు పెట్టించారు. ఎప్పుడూ ప్రత్యర్థులకు వణుకు పుట్టించే మోడీ ఈసారి తానే కంగారుపడ్డారు. చచ్చి బతికినట్టు అన్న సామెత ప్రకారం.. ఎట్టకేలకు బీజేపీ అధికారాన్ని అయితే చేజిక్కించుకుంది కానీ.. మరి గెలిచిన తరువాత ఎలా ఉండాలి. ఫుల్ జోష్ లో ఉండాలి.. కానీ ఆ గెలువు వెలుగు మాత్రం ఎక్కడా కనిపించనట్టే తెలుస్తోంది. ఏదో గెలిచాం.. హమ్మయ్యా గట్టెక్కాం అని అనుకుంటున్నారు తప్పా.. ఆ కిక్ , జోష్ మాత్రం ఎక్కడా లేదు. మరి ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇంకా ఏడాదిన్నరలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాల్సిందే. మొత్తానికి గుజరాత్ ఎన్నికలు బీజేపీకి ఓ గుణపాఠం అనే చెప్పొచ్చు. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి, మోదీకి ఒక వార్నింగ్ బెల్  లాంటిదే అని చెప్పొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఏం మాయ చేశాడో..

  ఎంతో ఉత్కంఠగా గుజరాత్ ఎన్నికలు జరిగాయి...ఇప్పుడు అంతే ఉత్కంఠగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇక ఈ ఎన్నికల కౌంటింగ్ మాత్రం మునుపెన్నడూ లేని విధంగా..క్షణానికో రకంగా మారుతూ.. అందరికీ చెమటలు పట్టిస్తుంది. అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. నిమిషాలు గడిచే కొద్దీ ట్రెండింగ్ మారుతుండటంతో ఫలితం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ మరింత పెరుగుతోంది. అయితే మొదట కాంగ్రెస్ కాస్త జోరు చూపించినా... ఒక్కసారిగా బీజేపీ పుంజుకొని కాంగ్రెస్ ను వెనక్కి నెట్టింది. ఓ రకంగా చూసుకుంటే ప్రస్తుతానికి.. గుజరాత్ లో బీజేపీనే ఆధిక్యంలో కొనసాగుతుంది. హిమాచల్ ప్రదేశ్ కూడా బీజేపీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.   అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. బీజేపీ మాత్రం ఈసారి బాగానే కష్టపడినట్టు తెలుస్తోంది. గతంలో చాలా తేలికగా అధికారం చేపట్టిన బీజేపీకి.. ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీనే ఇచ్చిందని చెప్పొచ్చు. బీజేపీ పై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకోవడంలో ఫలితం సాధించింది. తన సొంత గడ్డమీద.. ఎన్నో సీఎంగా అధికారం చేసిన మోడీనే.. ఈసారి గుతరాత్ ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలవుతామనే భయంతో ఉన్నారన్న వార్తలు చాలానే విన్నాం. దీనికి కారణం బీజేపీపై ఉన్న వ్యతిరేకత..ఒకవైపు రాహుల్ గాంధీ, మరోవైపు హార్దిక్ పటేల్ ల పోటీ. గుజరాత్‌ అభివృద్ధిని భాజపా గాలికొదిలేసిందని, రాష్ట్ర భవిష్యత్‌ ప్రశ్నార్థంగా మారిందని, కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు గుప్పించింది. దీనితో పాటు పటిదార్‌ రిజర్వేషన్‌, ఓబీసీ వంటి అంశాలతో పాటు, కుల సంఘాల అండతో భాజపాను ఎలాగైనా అధికారం నుంచి తప్పించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌ అడుగులు వేసింది. ఇక హార్దిక్ పటేల్ కూడా గత కొంత కాలంగా పటిదార్‌లకు రిజర్వేషన్లు కల్పించాలని బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాడు. దీంతో ఈ సామాజిక వర్గానికి చెందిన వారు బీజేపీకి ఓట్లు వేయడం కష్టం. అంతేకాదు.. ఓబీసీ రిజర్వేషన్ల కోసం అల్పేశ్‌ ఠాకూర్‌, దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ జిగ్నేష్‌ మెవాని భాజపాకు సవాల్‌ విసిరారు. ఇక వీరందరినీ కలుపుకొని.. కాంగ్రెస్..ఎలాగైనా భాజపాను అధికారం నుంచి తప్పించాలని వీరితో చేతులు కలిపి ఎన్నికలకు వెళ్లింది. కానీ కాంగ్రెస్ కు నిరాశే మిగిలింది.    అలా అని బీజేపీ గెలవడం అంతా ఈజీగా ఏం జరగలేదు. కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీనే ఇచ్చింది. గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే ఈసారి కాంగ్రెస్ ఎక్కువ సీట్లే గెలుచుకునే అవకాశం ఉంది. అయితే.. కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఎన్ని సీట్లను గెయిన్ అయ్యిందో స్పష్టత వస్తుంది. అలాగే ఓటింగ్ శాతంలో ఎంత మేరకు మెరుగయ్యిందో కూడా కాసేపట్లో క్లారిటీ వస్తుంది. అధికారం అందకపోయినా.. బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడం.. భవిష్యత్తులో పోరాడటానికి కొత్త శక్తిని సాధించడం.. అనేవి కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరటను ఇచ్చే అంశాలు. బీజేపీ దశాబ్దాలుగా పాతుకుపోయిన రాష్ట్రంలో గెలవడం అంటే కాంగ్రెస్ పార్టీకి అంతకన్నా గొప్ప ఏముంటుంది? అదే కనుక జరిగుంటే... కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చేది.   మొత్తానికి మోడీ ఏం మాయ చేశాడో తెలియదు కానీ...గుజరాత్ లో ఈసారి అధికారంలోకి రావడం కష్టమే అనుకున్నా..అదేం జరగలేదు. ఈ నాలుగేళ్లలో బీజేపీపై చాలా మంది వ్యతిరేక భావంతో ఉన్నారు. నోట్ల రద్దు విషయంలో కానీ, జీఎస్టీ విషయంలో కానీ, ముఖ్యంగా దళితులపై జరుగుతున్న దాడులు, దేశంలో బీజేపీ వచ్చిన తరువాతే అసహనం పెరిగింది అని వార్తలు.. ఇలా చాలా విషయాల్లో బీజేపీకి వ్యతిరేకం ఏర్పడింది. కానీ అవన్నీ మోడీ ముందు పటాపంచలై పోయాయి. ప్రజలు మోడీకే పట్టం గట్టారు. మోడీ తన మార్క్ ను మరోసారి చూపించారు...

తెలుగు మహాసభలకు బాబు రాను అన్నారా..?

ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవంతో పాటు జీఈఎస్-2017 సదస్సును విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అయితే ఇంతటి ప్రెస్టేజీయస్ ఈవెంట్స్‌కు తోటి తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించకపోవడంతో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అప్పుడు ఏదోలే అని సరిపెట్టుకున్నప్పటికీ తాజాగా జరుగుతున్న తెలుగు మహాసభల్లో కూడా చంద్రబాబు పేరు ఎక్కడ వినిపించకపోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రిపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వేడుకల్ని ఇంత బాగా చేసి సోదరుడిని అవమానించారు అంటూ టీ సర్కార్‌ తీరుపై మండిపడుతున్నారు. దీంతో రెండు రాష్ట్రాల అధికార వర్గాలు స్పందించాయి. ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ హాజరవుతున్న 19వ తేదీన రావాల్సిందిగా .. చంద్రబాబును స్వయంగా ఆహ్వానించాలని కేసీఆర్ భావించారట.. అందుకు తగ్గట్టుగానే ఎప్పుడు కుదురుతుందో తెలుసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారట. కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ సీఎంవో అధికారులు.. ఏపీ సీఎంవోను సంప్రదించగా.. తన ప్రోగ్రామ్స్ అన్ని అప్పటికే ఫిక్స్ అయిపోయాయని, 17వ తేదీ నుంచి తాను ఇండియాలో ఉండటం లేదని అధికారులు వర్తమానం పంపారు. అంతే తప్పించి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇరు రాష్ట్రాల అధికారులు అంటున్నారు.

ఏపీ అసెంబ్లీ ఇదే..దీనిలో ప్రత్యేకతలు..

  ఏపీ రాజధాని అమరావతిలో అసెంబ్లీ నిర్మాణానికి పలు డిజైన్లును రూపొందించిన నేపథ్యంలో ఎట్టకేలకు ఒక డిజైన్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి అసెంబ్లీకి సంబంధించి ఓ వీడియో విడుదల చేయగా...దానికే అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పుడు అసెంబ్లీ డిజైన్ కూడా దాదాపు అందిరికీ నచ్చేసింది. ఈరోజు  విజయవాడలోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో శాసనసభ, హైకోర్టు ఆకృతులను పరిశీలించారు. గతంలో ప్రభుత్వం సూచించిన మార్పుచేర్పుల గురించి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించినట్టు తెలుస్తోంది. 1350 ఎకరాల్లో నిర్మించే పరిపాలనా నగర ప్రణాళికలను ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేసింది. ఇప్పుడు అందులో పార్కులు, రహదారుల ప్రణాళికలో స్వల్ప మార్పులు చేశారు. శాసనసభ, సచివాలయం, ప్రభుత్వాధికారుల కార్యాలయాలన్నీ ఈ బ్లాక్‌లోకే వస్తాయి. గతంలో శాసనసభ భవనాన్ని ప్రత్యేకంగా ఈ బ్లాక్‌ చివరన కేటాయించారు. ఇప్పుడు దానిని బ్లాక్ మధ్యలోకి తీసుకొచ్చారు. బ్లాక్ మొత్తం 250 ఎకరాలు కాగా, అందులో 120 ఎకరాల్లో ఓ తటాకంలా ఏర్పాటు చేసి, దాని మధ్యలో శాసనసభ భవనాన్ని టవర్ ఆకృతిలో నిర్మించనున్నారు.   ఇంకా దీని ప్రత్యేకతలు ఏంటంటే...   * తటాకంలో భవనం ప్రతిబింబంలా కనిపిస్తుంది * ఈ భవనం ఎత్తు 250 మీటర్లు కాగా, 40 మీటర్ల వరకు పైకి వెళ్లి నగరాన్ని వీక్షించవచ్చు. * మొత్తం నాలుగు విభాగాలుగా ఉంటుంది. శాసనసభ, శాసనమండలి సమావేశ మందిరాలు, సెంట్రల్ హాల్, పరిపాలనా భవనం తదితర విభాగాలుంటాయి.   ఇక “టవర్ ఆకృతి”నే ఫైనల్ చేసిన ప్రభుత్వం మంత్రివర్గంతో చర్చించిన అనంతరం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అంతేకాదు.. దీనిపై ప్రజాభిప్రాయం కోరగా... 68 శాతం మంది ఈ టవర్ ఆక్సతినే ఓకే చేసినట్టు తెలుస్తోంది. మరి ఫైనల్ గా ఏం డిసైడ్ చేస్తారో చూడాలి.

పవన్ కు ఫ్యాన్స్ వల్లే నష్టమా.. ఒకసారి ఆలోచించండి..

  రాజకీయాలు అంటే ఒకప్పుడు ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీపై విమర్శలు గుప్పించడం.. లేదా..ఒకపార్టీపై మరొక పార్టీ విమర్శలు గుప్పించడం ఉండేది. అదంతా ఒకప్పుడు ఇప్పుడు కాలంతో పాటు రాజకీయాల్లో మార్పులు వచ్చాయి.. మాటల్లో కూడా మార్పులు వచ్చాయి. విమర్శల స్థానంలో తిట్లు చేరాయి. ఒకరినొకరు విమర్శించుకోవడం మరిచిపోయి.. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా తిట్టుకొనే స్థాయికి చేరాయి. తాజాగా ఈ పరిస్థితి మరీ గోరంగా తయారైంది.   పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ గత కొంత కాలంగా కత్తి మహేష్ చేస్తున్న ఎదురుదాడి చుట్టూ ప్రస్తుతం బూతు రాజకీయం నడుస్తుంది. తానొక ఫిలిం క్రిటిక్ అని చెప్పుకునే కత్తి మహేశ్ ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించారో... ఓ రకంగా అప్పటినుండి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కత్తి మహేశ్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కత్తి గట్టారు. ఒక పక్క కత్తి మహేశ్.. మరోపక్క పవన్ ప్యాన్స్ యే రచ్చ రచ్చ చేస్తుంటే.. వీరికి తోడు రోజా లాంటి వాళ్లు వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా.. చంద్రబాబుపై ఎన్నో కామెంట్లు చేసిన రోజాకి.. మిగిలిన వాళ్లు అంటే లెక్కేముంది. ఏది నోటికి వస్తే అది మాట్లాడుతుంది. అందుకే లైవ్ ప్రోగ్రాంలో బండ్ల రోజా మధ్య జరిగిన సంభాషణ అందరిని సిగ్గుపడేలా చేసింది.   మరోవైపు విమర్శలను అస్సలు తట్టుకోలేని జనసేన పార్టీ అభిమానుల్లో కొంతమంది రోజా, కత్తి మహేష్ పై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇక తాను  ఏ పార్టీకు చెందను అని చెప్పుకుంటూ వైకాపాకు సపోర్ట్ చేస్తున్న కత్తి మహేష్, రోజా వారిని ఉడికించి ఇరికిస్తున్నారు. రోజా, కత్తి మహేష్ లను ఎదురుకోవడంలో ఒకరకంగా జనసేన ఇబ్బంది పడుతుందనే చెప్పుకోవాలి. వారు సైలెంట్ గా విమర్శలు చేస్తూ రెచ్చగొడుతుంటే.. పవన్ అభిమానులు రెచ్చిపోయి.. అందరి ముందు చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే పవన్ ను ఏదైనా అంటే... ఫ్యాన్స్ ఊరుకోరు.. ఇప్పుడే ఇలా ఉంటే అధికారంలోకి వస్తే ఎలా అని మాట్లాడుకునే స్థాయికి వచ్చింది. పవన్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ వల్ల అది ఇంకా తారాస్థాయికి చేరింది. దీంతో పవన్ అభిమానులు ఆయనకు లాభం చేకూర్చడం సంగతేమో కానీ... ఆయనకు నష్టం చేకూర్చడంలో మాత్రం పరోక్షపాత్ర పోషిస్తున్నారు. మరి అన్నీ గమనించుకొని.. ఆవేశపడకుండా.. ఆలోచించి ముందడుగు వేస్తేనే.. పవన్ కు మంచి జరుగుతుంది తప్పా... లేకపోతే ఎవరైతే తనకు కొండంత బలం అని పవన్ నమ్ముతున్నారో.. వారే పవన్ కు చెడ్డ పేరు తెచ్చినట్టువుతుంది. ఈ విషయంలో పవన్ అభిమానులు ఆలోచించుకోవాల్సిందే...

జగన్ కు చెల్లెలి పోరు....వెనక్కు తగ్గేది లేదంటున్న షర్మిల...

  పాపం జగన్ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది. ఇప్పటికే ఎన్నోసమస్యలతో సతమతమవుతున్న జగన్ కు మరో కొత్త సమస్య ఎదురైంది. ఈసారి ఆయన చెల్లెలు షర్మిల రూపంలో సమస్య వచ్చిపడింది. గత కొద్దికాలంగా.. జగన్ కు కుటుంబ సభ్యలకు మధ్య అంత సఖ్యత లేదన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఎందుకంటే.. తన కుటుంబ సభ్యలను పక్కన పెట్టి.. వేరే వాళ్లకు పార్టీలో పదవులు ఇవ్వడమే.   దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణానంతరం.. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో జగన్ కొత్త పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు అతని కుటుంబమే అతనికి అండగా నిలిచింది. ఇక సార్వత్రిక ఎన్నికల సమయంలో.. జగన్ తన సోదరి షర్మిలను బాగానే వాడుకున్నారు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు కూడా  వైసీపీ పార్టీకి మద్దతుగా అన్నయ్యకు చేదోడు వాదోడుగా తన వంతు సహాయం చేయడానికి పాదయాత్రలు, ఓదార్పు యాత్రల‌ు చేసింది. ఇక జగన్ బయటకు వచ్చిన తరువాత షర్మిలకు ఉన్న క్రేజ్ ను చూసి...ఇలా అయితే తనకే నష్టమని భావించి.. చెల్లి అని కూడా చూడకుండా.. చాలా తెలివిగా సైడ్ చేసేశారు. ఇక అప్పటినుండి షర్మిల రాజకీయాల్లో కనిపించకుండా పోయారు. ఆ తరువాత తనకు ఎంపీ సీటు ఇస్తానని చెప్పడం.. ఇవ్వకపోవడం.. అన్నీ జరిగిపోయాయి. ఈ కారణాల వల్ల అన్నా చెల్లి మ‌ధ్య చిన్న మనస్పర్థలు వచ్చాయని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు జగన్ కి కొత్త సమస్యలు వచ్చి పడ్డాయా అంటే అవుననే అనుమానాలు వచ్చిపడుతున్నాయి.   అదేంటంటే కడప ఎంపీ అవినాష్ పనితీరు సరిగా లేదని జగన్ ఈ సారి అవినాష్ స్థానంలో తన సోదరి షర్మిలను పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారట. దీంతో వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులు దూరం కావడానికి సిద్దమవుతున్నట్టు జగన్ దృష్టికి వెళ్లడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందట. అవినాష్ విష‌యంలో జ‌గ‌న్ డెసిష‌న్ మార‌డం వెన‌క చాలా కార‌ణాలే క‌నిపిస్తున్నాయి. అవినాష్‌కు జిల్లాలో పార్టీ కార్య‌క‌ర్త‌ల నుంచి, నాయ‌కుల‌తో పాటు అధికార వ‌ర్గాల్లో కూడా మంచి పేరు ఉంది. దీంతో అవినాష్‌ను త‌ప్పించేందుకు పార్టీ కేడర్ కూడా ఒప్పుకోవ‌డం లేదట. మరో వైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో కడప నుండి తాను పోటీ చేస్తాన‌ని షర్మిల జగన్ ను అడిగిందట. అంతేకాదు షర్మిల కూడా ఎక్కడా తగ్గడం లేదట..  ఈసారి ఎవరు ఏం చెప్పినా… తాను వెనక్కు తగ్గేది లేదని అంటున్నారట. దీంతో  ఏం చేయాలో తెలియని పరిస్థితిలో జగన్ పడ్డాడట. మొత్తానికి ఇప్పటికే నేతల పోరుతోనే తట్టుకోలేకపోతున్న జగన్ కు ఇంటి పోరు కూడా తోడైంది. మరి గతంలో అంటే షర్మిల సైలెంట్ అయిపోయింది కానీ.. ఈసారి మాత్రం గట్టిగా పట్టుబడుతుందట.. జగన్ ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి....

ఎంతైనా చంద్రబాబు గ్రేటే...

  వైసీపీ పార్టీలో అందరి సంగతేమో కానీ... ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి...ఫైర్ బ్రాండ్ రోజా మాత్రం ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా... ఎప్పుడు చంద్రబాబుపై విరుచుకుపడదామా అని చూస్తుంటారు. ఇద్దరూ పోటీ పడి మరీ చంద్రబాబును ఏకి పారేస్తారు. అలాంటి వారి నోట చంద్రబాబును పొగడాలంటే .. మామూలు విషయం కాదు. కానీ అలాంటిదే జరిగింది. ఏ నోటితో అయితే చంద్రబాబుపై దుమ్మెత్తి పోసిందో.. అదే నోటితో రోజా చంద్రబాబును గ్రేట్ అని అన్నదట. షాకింగ్ గా ఉంది కదా... అదేంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీ లోకి వెళ్లాల్సిందే.   ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాల్లో పోలవరం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే కదా. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏపీ టూర్ లో భాగంగా.. పోలవరం సందర్శించారు. అంతేకాదు... పోలవరం పై శ్వేత పత్రం కూడా విడుదుల చేయమని ప్రభుత్వాన్ని కోరారు. ఇక వైసీపీ విషయానికొస్తే.. పోలవరంపై ఎప్పటినుండో ఏపీ ప్రభుత్వంపై....చంద్రబాబుపై అయిన‌దానికి, కానిదానికి ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనికి కారణం కూడా ఉంది లేండి.. పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్త‌యితే ఎక్క‌డ ఆ క్రెడిట్ చంద్ర‌బాబుకు వెళ్లిపోతుందో ? మ‌రో ఐదేళ్ల పాటు తాము అధికారానికి దూరంగా ఉండాల్సి వ‌స్తుందో ? అన్న టెన్ష‌న్ వాళ్లది. ఈ నేపథ్యంలోనే పోలవరంలో అసలు పనులు ఎక్కడి వరకూ వచ్చాయి...అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని కట్టగట్టుకొని ఎమ్మెల్యేలు అందరూ వెళ్లారు. ఇంకేముంది.. అక్కడ జరుగుతున్న పనులను చూసి ముక్కున వేలువేసుకోవాల్సి వచ్చిందట.  అక్క‌డ ప‌నులు చూసిన వైసీపీ నాయ‌కులు షాక్ అయ్యారట. ఇప్పటివరకు పోలవరం పనులు జరగడం లేదని చెప్పిన వైసీపీ నాయకులే, గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వడానికి ఇంకా 26 నెలలు పడుతుందని అంచనాకు వచ్చారట. ఈ విష‌యాన్ని స‌ద‌రు వైసీపీ టీం మొత్తం మీడియా ముందే చెప్పారట.  ఎన్నిక‌ల‌కు మ‌రో యేడాదిన్న‌ర టైం ఉండ‌డంతో అప్ప‌టి వ‌ర‌కు చాలా వ‌ర‌కు ప‌ని పూర్త‌యిపోతుంద‌ని వాళ్లే ఓ అంచ‌నాకు వ‌చ్చారట. ఇదంతా మీడియా స‌మ‌క్షంలోనే వాళ్ల‌లో వాళ్లే చ‌ర్చించుకున్నారట. ట్విస్ట్ ఏంటంటే.. అక్కడ పనులు చూసి రోజా నోటి నుండి ఒక్కమాట కూడా రాలేదట. అంతేకాదు పక్కన ఉన్నవాళ్లతో... పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు ఇంత స్పీడ్‌గా జ‌రుగుతున్నాయ‌ని తాను అనుకోలేద‌ని అన్నార‌ట‌. మొత్తానికి రోజా కూడా బాబు గొప్పతనాన్ని గుర్తించింది. రోజా కూడా పోలవరం ప్రాజెక్టు పురోగతి చూసిన తరువాత ఏం మాట్లాడలేదు అంటే.. మరి వారే ప్రాజెక్టు ప‌నులు స్పీడ్‌గా జ‌రుగుతున్నాయ‌ని ఒప్పుకున్నట్టే కదా..

జబర్దస్త్ కామెడీ చేస్తే ఇలానే ఉంటుంది..ఇంత కామెడీనా..!

  వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా నోటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నిసార్లు బుక్ అయినా.. ఆమె మాత్రం తన నోటిని కంట్రోల్ లో పెట్టుకోలేదు. ఏదో ఆ మధ్య జగన్ కాస్త వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి రోజా సైలెంట్ అయి కాస్త మీడియా సమావేశాలకు దూరంగా ఉంటూ.. నోటిని తాళం వేసింది. దాంతో వాతావరణం ప్రశాంతంగా ఉంది అనుకున్నారు. కానీ మీడియా ముందు గట్టిగా మాట్లాడటం... విమర్శలు చేయడం ఆమెకి అలవాటైన పని.. ప్రాణం ఎలా ఊరుకుంటుంది. అందుకే ఏదో కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నా.. మళ్లీ మామూలైపోయింది. మళ్లీ యాక్టివ్ అయ్యారు. కాకపోతే అప్పట్లో లాగ కాకుండా.. కాస్త ఆచితూచి మాట్లాడటం నేర్చుకుంది. అయితే అలా అనుకోవడం మన తప్పే అని మరోసారి రుజువు చేసింది రోజా. బండ్ల గణేష్ తో టీవీ 9 ఎపిసోడ్ లో ఆమె నోటిదూకుడు ఇంకోసారి ప్రూవ్ అయ్యింది. ఇంకేముంది మరోసారి రోజాగారి నోటి దూకుడుపై విమర్శలు మొదలయ్యాయి. ఇంత రచ్చ రచ్చ అయిన ఎపిసోడ్ నుంచి బయటపడేందుకు రోజా తాజాగా కాస్త కామెడీ మాటలే చెబుతున్నారు.   అది కూడా ఎవరి గురించి అనుకుంటున్నారా.. ఇంకెవరు గురించి... తాను అన్నగా భావించే జగన్ గురించి. గతంలోనే... జగన్ ఎలాంటి అవినీతి చేయలేదని ఆయనపై కేసులన్నీ రాజకీయ కోణంలోవే అని కామెడీ చేసిన ఆమె తాజాగా మరోసారి కామెడీ చేశారు. ఇంతకీ రోజా అంతలా ఏ విషయంలో కామెడీ చేస్తున్నారనుకుంటున్నారా..? పార్టీ ఫిరాయింపుల గురించి. వైసీపీ పార్టీ నుండి... ఇప్పటికీ చాలామంది నేతలు అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీలోకి చేరారు. ఇంకా పలువురు నేతలు టీడీపీ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. సరిగ్గా ఈ విషయంపైనే ప్రెస్ మీట్ లో టీడీపీపై రోజా తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు. ప్రజాస్వామిక విలువలకు సీఎం చంద్రబాబు పాతర వేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంలో ఓ జర్నలిస్ట్ మిత్రుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే టీడీపీ ని దెబ్బ తీయడానికి వలసలు ప్రోత్సహించరా అని అడిగారు. దానికి సమాధానం ఇచ్చిన రోజా జగన్ సీఎం అయితే ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఫిరాయింపులు ఉండబోవని మాంచి కామెడీ చేశారు. ఇక జగన్ తరపున రోజా చేస్తున్న కామెంట్స్ చూసి ఆమె సీరియస్ గా భలే కామెడీ చేస్తున్నారు అనుకుంటూ  విలేకరులు నవ్వుకున్నారట. నిజంగా ఏదైనా అద్భుతం జరిగి జగన్ సీఎం అయితే.. మరి రోజా గారికి ఈ మాటలు గుర్తుంటాయా..? అయినా జగన్ గురించి జనం ఏం నమ్ముతారో వాటి మీద రోజా కామెడీ చేస్తే బావుంటుంది. అలా కాకుండా.. జబర్దస్త్ లో చేయాల్సిన కామెడీ.. ఇలాంటి మీడియా సమావేశాల్లో కూడా వేస్తే ఎలా మరి.

ప్రాంక్ పేరుతో సోదరుడి హత్య...ప్రపంచానికే ప్రమాదం....?

  ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నియంత్రుత్వ పరిపాలన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే పలు ఉదంతాలు ఆయన ఎంత క్రూర స్వభావం కలవాడో నిరూపించాయి. సొంత మనుషులనే క్రూరంగా చంపించిన కిమ్ జాంగ్ ఉన్ గురించి మరో భయంకర విషయం బయటపడింది. దీంతో ఆయనెంతో క్రూరుడో మరోసారి రుజవైంది.   తన సోదరుడు కిమ్ జోంగ్ నామ్ ఈ ఏడాది ఫిబ్రవరి 13న  అత్యంత దారుణంగా మరణించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ హత్య అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. పోలీసులకు ఇదో పెద్ద మిస్టరీగా మారింది. అయితే ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు కొన్ని దిమ్మతిరిగే  నిజాలు తెలిశాయి. ఈ హత్య వెనుక  కిమ్ జాంగ్ ఉన్ హస్తం ఉన్నట్టు తెలిసింది. అంతేకాదు.. ఈ హత్య ఎలా చేశారో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే. దానికి కిమ్ జాంగ్ ఉన్ వేసిన ప్లాన్ చూసి ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే..   కిమ్ జోంగ్ నామ్ హత్యకు కిమ్ జాంగ్ ఉన్ పెద్ద ప్లానే వేశారు. ఇందుకోసం ఇద్దరు మలేషియా యువతులను ఎంచుకున్నారు. ఈ ఇద్దరికీ ఒకరితో మరొకరికి సంబంధం లేదు. ఒకరు మసాజ్ పార్లర్ లో పనిచేసే యువతి కాగా.. మరొకరు ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి. టీవీ ప్రాంక్ పేరిట కిమ్ జాంగ్ ఉన్ మనుషులు వీరిని సంప్రదించారు. ఒక ప్రాంక్ వీడియో చేస్తున్నామని, అందులో నటిస్తే 90డాలర్లు ఇస్తామని చెప్పారు. టీవీ ప్రోగ్రామ్ అని చెప్పడంతో వారు ఓకె చెప్పారు. ప్లాన్ లో భాగంగా.. ఇద్దరు యువతులకు కిమ్ జోంగ్ నామ్ ముఖంపై ఆయిల్ చల్లి పారిపోవాలి. అనుకున్నట్టే..  ఆ ఇద్దరు మహిళలు కిమ్ జోంగ్ నామ్ ముఖంపై కెమికల్స్ చల్లి పారిపోయారు. ఇంకేముంది... వాటి ప్రభావంతో మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాలు పూర్తిగా దెబ్బతిని కిమ్ జోంగ్ నామ్ కన్నుమూశాడు. అప్పట్లో ఈ హత్య ఎవరికీ అంతుచిక్కలేదు.   ఆయిల్ చల్లినందుకే చనిపోయాడా అని డౌట్ రావచ్చు.. ఇక్కడే ఉంది మరి అసలు ట్విస్ట్...  బైనరీ ఫామ్ అనే కెమికల్ ప్రయోగం చేశారు. ఇద్దరు  యువతులకు ఇచ్చింది వేరు వేరు రసాయనాలు. కానీ ఆ రెండు కలిస్తే... అత్యంత వీఎక్స్ అనే ప్రమాదకర కెమికల్ గా మారుతుంది. ఈ ప్రయోగమే కిమ్ జోంగ్ నామ్ పై చేశారు. మొత్తానికి హత్య చేస్తున్నామన్న సంగతి కూడా హంతకులకు తెలియకుండా... కిమ్ ఈ ప్లాన్ వేశాడు. కిమ్ జోంగ్ నామ్ హత్య జరిగిన తీరు పోలీసులనే విస్మయపరిచింది. ఇక ఈ హత్య ఉదంతం ఇప్పుడు వెలుగు చూడటంతో.. ప్రజలు వణికిపోతున్నారు. సొంత సోదరుడినే ఇలా చంపాడంటే... ఇంక తనకు శత్రువులుగా భావించే వాళ్లని ఎలా చంపుతాడో అని భయపడుతున్నారు. అంతేకాదు దీని ద్వారా  కిమ్ జాంగ్ ఉన్ అందరికీ వార్నింగ్ లు ఇచ్చినట్టైంది అని అంటున్నారు. నాతో పెట్టుకుంటే ఇలా ఉంటుందని కిమ్ జాంగ్ ఉన్ వార్నింగ్ ఇచ్చారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తమకు శత్రుదేశంగా తయారైన అమెరికాను ఈ రకంగా భయపెట్టాలని... తమ దగ్గర అణు ఆయుధాలతో పాటు..  శక్తివంతమైన రసాయనాలను కలిగి ఉందని చెప్పడానికే కిమ్ జోంగ్ నామ్ ను ఇలా బహిరంగంగా హత్య చేయించి ఉంటారని భావిస్తున్నారు. ఏది ఏమైనా పక్క దేశాన్ని భయపెట్టడానికి ఇలా సొంత మనిషినే చంపించాడంటే.. కిమ్ జాంగ్ ఉన్ ఎంత క్రూరుడో అర్ధమవుతుంది...

తెలుగు తల్లిపై కూడా అవసరమా..?

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తూ.. ఒక్కసారిగా అందరికి దృష్టిలో పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ కత్తి మహేశ్ లా తయారైంది పరిస్థితి. పవన్ పైనే కాదు.. పలువురి మీద కామెంట్లు వేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక ఎప్పటిలాగే తన వృత్తిలో భాగంగా.. రాజమౌళిపై కత్తి మహేశ్ ఓ ప్రశ్న సంధించాడు. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల డిజైన్ల విషయంలో చంద్రబాబు రాజమౌళి సలహాలు కోరిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే రాజమౌళి  అసెంబ్లీలో తెలుగు తల్లి విగ్రహం యొక్క డిజైన్ ను రూపొందించి.. దాని వీడియోను విడుదల చేశారు. ఇక బాహుబలి సినిమాతో వండర్ సృష్టించిన రాజమౌళి.. ఈ విషయంలో కూడా తన క్రియేటివిటీ చూపించాడు. ఈ వీడియోను చూసిన వారందరూ రాజమౌళికి ఫిదా అయిపోతున్నారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామిపై సూర్య కిరణాలు ఎలా అయితే ప్రతిబింభించి దర్శనమిస్తాడో, అలాగే ఏపీ అసెంబ్లీలో కూడా కంప్యూటరైజ్ద్ పరిజ్ఞానంతో అసెంబ్లీలోని తెలుగు తల్లిపై సూర్యకిరణాలు పడే విధంగా ఈ డిజైన్ ను సిద్ధం చేసారు. ఉదయం 9.15 గంటలకు సూర్యకిరణాలు పడేలా డిజైన్ ఉంటే బావుంటుందని ఆయన సూచించారు.   మరి నిజంగా ఇది ఇప్లిమెంట్ చేస్తారో లేదో తెలయదుకానీ.. అప్పుడే దీనిపై కత్తి మహేశ్ స్పందించి ఆవేశంగా రాజమౌళిపై కామెంట్లు చేశాడు. ‘‘తొలి కిరణం.. తెలుగు తల్లి పాదాలను తాకకపోతే వచ్చే నష్టం ఏదైనా ఉందా..?’’ అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఎప్పటిలాగే ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. ఏదో తనను సలహాలు అడిగినందుకు.. చంద్రబాబు గారి మీద ఉన్న గౌరవంతో రాజమౌళి ఈ బాధ్యతను తీసుకున్నారు. తనకు తోచిన సలహాలు ఇస్తున్నారు. దీనిలో భాగంగానే ఓ వీడియో విడుదుల చేశారు. అది ఇంకా ఏపీ ప్రభుత్వం ఆమోదించలేదనూ లేదు. అసలు అది జరగుతుందో లేదో కూడా తెలియదు.. మరి అప్పుడే కత్తి మహేశ్ కు ఇంత ఆవేశం అవసరమా అని అంటున్నారు. ఏదో విమర్సలు చేయాలని కాకపోతే ఏంటిది.. క్రిటిక్ కదా ఏ విషయంపైన అయినా విమర్శలు చేయోచ్చు అని అనుకుంటున్నాడు.. తెలుగు తల్లి విగ్రహంపై కూడా ఇలాంటి కామెంట్లు చేస్తున్నాడంటే అది కత్తి మహేశ్ విజ్ఞతకే వదిలేయాలి. మరి ఇలాంటి మనిషి మాటలు కూడా పట్టించుకోవాల్సిన విషయం ఏమన్నా ఉందా.. ఆలోచించుకోవాలి...

మళ్లీ పిలవలేదుగా.. చంద్రబాబు అంటే చులకనా..?

  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఎప్పటినుండో దీనిపై చర్చలు జరుగుతున్నాయి కనుక ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఇక ఈ మహా సభలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదిక అయింది. స్టేడియాన్ని సర్వాంగ సుదరంగా సిద్దం చేసింది ప్రభుత్వం. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేసింది. ఈరోజు సాయంత్రం ఈ తెలుగు పండుగ ఆరంభంకానుంది.  ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ వేడుకకు ముఖ్యఅతిధిగా రానున్నారు. ఆయన ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. ఇక మహారాష్ట్ర గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందినీ సిధారెడ్డిలు వేదికపై ఆశీనులు అవుతారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యఅతిథులు పాల్గొంటారు. ఇక తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగు మహాసభలను నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం ఈ వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈనెల 19వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల ద్వారా తెలంగాణలో తెలుగు భాషావికాసం, సాహితీమూర్తుల ప్రతిభా విశేషాలను ప్రపంచానికి చాటనుంది. అయితే ఇక్కడి  వరకూ బాగానే ఉంది. మరి ఈ తెలుగు మహా సభలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారా అంటే.. లేదనే తెలుస్తోంది. తెలుగు రాష్ట్రమై ఉంది.. పక్క తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆహ్వనం పంపకపోవడంపై.. పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి మాత్రమే కాదు.. ఒక మెట్రో ప్రారంభానికి గాని.. జీఈఎస్ సదస్సుకు కానీ చంద్రబాబు ను ఆహ్వానించలేదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆహ్వానించకపోగా.. మళ్లీ చంద్రబాబుకు జెలసీ అన్న రూమర్లు పుట్టించడం మళ్లీ. రాష్ట్రం విడిపోయిన తరువాత.. కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి... చంద్రబాబే స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లి.. ఆయనకు కార్డు ఇచ్చి మరీ ఆహ్వానించారు. అది కూడా కేసీఆర్ కు గుర్తులేదమో మరి. రాష్ట్ర విడిపోయినా.. తెలుగు ప్రజలు అంతా ఒకటే.. అన్నా దమ్ముళ్లు... అక్కా చెల్లళ్లలాగా కలిసిఉందాం అని చెప్పిన మాటలు ఏమయ్యాయో..   అసలు ఈ సభలను ఎందుకు నిర్వహిస్తున్నారు.. తెలుగు జాతి అంతా ఒక్కటే, తెలుగు ఖ్యాతి విశ్వవ్యాప్తం అన్న సందేశాన్ని చాటి చెప్పాలని నిర్వహిస్తున్నారు. అలాంటిది.. ఎక్కడెక్కడో ఉన్న ప్రముఖులు అందరినీ పిలిచారు. వారిని సగౌరవంగా సత్కరించాలని చూస్తున్నారు కేసీఆర్. ఎక్కడో ఉన్నవాళ్లు గుర్తున్నారు కానీ... పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం.. అది కూడా ఓ తెలుగు రాష్ట్ర సీఎం చంద్రబాబు మాత్రం కేసీఆర్ గారికి కనిపించలేదు. అసలు కనిపించలేదా..చంద్రబాబును మర్చిపోయారా? లేక కావాలనే విస్మరించారా? అన్నది ఇప్పుడు అందరి డౌట్. ఏది ఏమైనా.. కేసీఆర్ గారు ఈ విషయంలో మరోసారి ఆలోచించి ఉండే బావుండేదేమో అని పలువురు అనుకుంటున్నారు. తెలుగు మహా సభలు పెడుతూ.. తెలుగు రాష్ట్ర సీఎం ను ఆహ్వానించకపోవడం అనేది సముచితం కాదు అన్నది పలువురు అభిప్రాయం.. మరి ఎందుకు పిలవలేదన్నది తెలంగాణ సర్కారుకే తెలియాలి.

చంద్రబాబుపై కేటీఆర్ పొగడ్తలు.. నా గొప్పతనం కాదు.. చంద్రబాబుది..

  మన గొప్పతనాన్ని మనం చెప్పుకోవడం కంటే... పక్కన వాళ్లు చెప్పుకొని పొగిడితేనే అందులో అర్ధం ఉంటుంది. అది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో నిజమైంది. చంద్రబాబు గొప్పతనాన్ని పొగిడారు. అది ఎవరో కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆరే ఎకంగా చంద్రబాబు గొప్పతనాన్ని మెచ్చుకున్నాడు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా...? హైటెక్ సిటీ విషయంలో..   హైటెక్ సిటీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే హైటెక్ సిటీ అని చెప్పుకునేవారు ఒకప్పుడు. చెప్పుకోవడం కాదు కానీ.. ఓ రకంగా హైటెక్ సిటీ డెవలెప్ మెంట్ కు చంద్రబాబు బాగానే కష్టపడ్డారు. హైదరాబాద్ ఐటీ హబ్ గా మారిందంటే అది చంద్రబాబు చలవే అని చెప్పొచ్చు. ఒక్క హైటెక్ సిటీనే కాదు... ఇక రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా చంద్రబాబు సందర్భం వచ్చినప్పుడల్లా.. నా వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని.. హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి కేవలం తాను, టీడీపీ ప్రభుత్వాలే కారణమని.. హైటెక్ సిటీ నిర్మాణం చేపట్టింది తమ హయంలోనేనని... ఎయిర్ పోర్టు నిర్మాణం, రహదారుల అభివృద్ధి, రింగ్ రోడ్ ఇవన్నీ తనే చేశానని... హైదరాబాద్ ప్రపంచపటంలో నిలిపామని చెబుతుండేవారు. అది నిజమే అయినప్పటికీ.. ఆయనపై విమర్శలు కూడా వస్తుంటాయి.   కానీ ఈసారి మాత్రం చంద్రబాబు గొప్పతనాన్ని కేటీఆరే స్వయంగా ఒప్పుకోవడంతో అందరూ షాకవుతున్నారు.  హైటెక్స్‌ సిటీలోటెక్‌ మహీంద్రా ఎంఐ-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్‌కు స్థానం కల్పించిన ఘనత చంద్రబాబుదేనని.. హైదరాబాద్‌కు ఐటీ పరిశ్రమలు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్థలు హైదరాబాద్‌కు రావడంతో నా కృషి ఏమీ లేదు. ఆ క్రెడిట్‌ అంతా చంద్రబాబుకే దక్కుతుంది' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి చంద్రబాబు గొప్పతనం ఇన్ని రోజులకు బయటకు చెప్పారు కేటీఆర్. చంద్రబాబును పక్క రాష్ట్రంలో మెచ్చుకోవడం గొప్ప విషయమే మరి. ఏది ఏమైనా కేటీఆర్ మాటలకు చంద్రబాబు హ్యాపీగా ఫీలవుతారేమో...

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇదేనా.... పవన్ ను చంపేస్తా..

  ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్... ఈ స్టేట్ మెంట్ ఒకప్పుడు ఎవరికి అంతగా తెలిసిఉండకపోవచ్చు కానీ... ఓ సినిమా క్రిటిక్ పుణ్యమా అని అందరికీ దాని డెఫినేషన్ ఏంటో అర్థమయిపోయింది. ఇక సోషల్ మీడియా ద్వారా ఈ ఫ్రీడమ్ మరీ ఎక్కువైపోయింది. ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడటం... వీడియో తీయడం సోషల్ మీడీయాలో పెట్టడం.. ఎమన్నా అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పడం. గత కొద్ది రోజులుగా.. ఈ హంగామా మరీ ఎక్కువైపోయింది. అలాంటి నిర్వాకమే చేసి ఓ పెద్ద మనిషి ఆఖరికి అరెస్ట్ కావాల్సి వచ్చింది.   జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ... వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇక అప్పటినుండి పవన్ కళ్యాణ్ పై వైసీపీ పార్టీ నేతలు, ఆయన అభిమానులు పవన్ పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక వెంకటరెడ్డి అనే ఓ అభిమాని అయితే ఏకంగా పవన్ ను చంపడానికైనా సిద్ధమంటూ ఆవేశంగా నోరు పారేసుకున్నాడు. “జగన్ తో పోలిస్తే పవన్ కల్యాణ్ కోన్ కిస్కా గొట్టంగాడని, జగనన్నను ఏమైనా అంటే చంపడానికైనా, చావడానికైనా సిద్ధమేనని, పవన్ అనే వ్యక్తి బబర్దస్త్ హైపర్ ఆదితో సమానమని… జగన్ అయితే ప్రజలకు దేవుడితో సమానమని, ఆయన ఫొటోలను ఇంట్లో పెట్టుకుంటారని, తనది గుంటూరని, చేతనైతే పవన్ సైన్యం వచ్చి తనను ఎదుర్కోవాలంటూ సవాల్ విసురుతూ” ఓ సెల్ఫీ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసాడు. ఇంకేముంది వ్యాఖ్యలపై గుంటూరు శివార్లలోని నల్లపాడు పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బాబు కటకటాలు లెక్కిస్తున్నాడు. మొత్తానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్.. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటూ.. ఎవరికి వారు దాని అర్ధాన్నే మార్చేస్తున్నారు. మరి ఓ హద్దు వరకూ మాట్లాడితే ఓకే కానీ... ఇవి హద్దులు దాటితేనే చాలా కష్టం. అవి తిరిగి తమ మెడకే చుట్టుకుంటాయన్న విషయం నేటి యువత అర్ధం చేసుకుంటే మంచిది...

ఇలా ఇరుక్కుపోయానేంటి సామి....

  పాపం రాజమౌళికి బలే చిక్కు వచ్చి పడింది. సినిమాలు తప్ప ఇంకో ప్రపంచం తెలియని రాజమౌళి..పాపం అనవసరంగా రాజకీయాల్లో చిక్కుకున్నారు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? బాహుబలి సినిమాకు రాజమౌళి ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే కదా. సినిమా గ్రాఫిక్స్ విషయంలో కానీ, సినిమా సెట్ ల విషయంలో కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బాహుబలిని తీసి ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించాడు. అందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాజమౌళి సలహా కోరారు. ఏ విషయంలో మీకు కూడా తెలిసిందే కదా. అమరావతి విషయంలో. రాజధాని డిజైన్ లలో సలహాలు, సూచనల కోసం రాజమౌళి సాయం కోరారు. అయితే ముందు రాజమౌళికి అంత ఇంట్రస్ట్ లేకపోయినా చెప్పింది ఏకంగా ముఖ్యమంత్రి గారు చెప్పడంతో... రాజమౌళి సరే అని ఒప్పుకున్నారు. ఇక ఒప్పుకున్నందుకు సలహాలు ఇవ్వాలి కదా... అందుకే ఈ డిజైన్ల రూపకల్పనలో భాగంగా.. ఆయన విదేశాలకు కూడా వెళ్లాడు. అమరావతి ఆకృతుల్లో భారతీయ, ఆంధ్ర సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేంచే కొన్ని సలహాలు ఇచ్చారు. ఇక దీనిపై మాట్లాడిన రాజమౌళి.. ఈ వ్యవహారం అంతా రామసేతు నిర్మాణంలో ఉడత సాయం లాంటిదని తాను చిన్నవాడినని చెప్పకనే చెప్పాడు కూడా.   అయితే పాపం రాజమౌళిని కూడా వదిలిపెట్టలేదు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు మీద ఎలాగూ ఆయన 24 గంటలు.. విమర్శలు గుప్పిస్తుంటాడు. ఇక ఇటీవల చంద్రబాబుకి అండగా నిలుస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓ యాక్టర్ గా సంబోధిస్తూ ఆయనపై కూడా విరుచుకుపడుతున్నాడు. ఇవన్నీ ఓకే కానీ... ఇప్పుడు ఈ సీన్ లోకి  రాజమౌళిని కూడా లాగుతున్నారు. సినిమా యాక్టర్లు, డైరెక్టర్లను పక్కన పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటేనని.. అమరావతిలో ఓ ఇటుక కూడా వేయని చంద్రబాబు దానిపై సినిమా తీయమని ఓ దర్శకుడుని పిలిచారని జగన్ కామెంట్ చేశారు. ఆ సినిమాలో తన పాత్ర , నారాయణ పాత్ర బాగా వుండాలని కూడా చంద్రబాబు కోరినట్టు జగన్ అన్నారు. చంద్రబాబు ఏమీ చేయకపోయినా ఈ యాక్టర్లు, దర్శకులు భలే చేస్తున్నారని మనలను నమ్మిస్తారు అని జగన్ చేసిన కామెంట్స్ లో పవన్ తో రాజమౌళిని కలిపి కామెంట్స్ చేశారు. పాపం జగన్ చేసిన కామెంట్స్ పై రాజమౌళి హర్ట్ అయ్యారట. అమరావతికి సంబంధించి తన పాత్ర ఎంత పరిమితమో చెప్పాక కూడా జగన్ ఇలా అనడం మీద రాజమౌళి ఫ్యామిలీ కూడా ఫీల్ అవుతోందట. మొత్తానికి విడవమంటే పాముకి కోపం, కరవమంటే కప్పకి కోపం అన్న సామెత ప్రకారం... రాజమౌళి జగన్, చంద్రబాబు మధ్య ఇరుక్కుపోయారు. ఈ ఎక్స్ పీరియన్స్ తో రాజమౌళి ఇలాంటి విషయాల్లో వేలు పెట్టరేమో...

బలే కామెడీ జగన్.. మరి రోజా ఎంటమ్మా..?

ఏపీలో నాలుగు రోజుల టూర్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. నాలుగు రోజుల్లో ఆయన చేసిన ప్రసంగాలు ఏపీ రాజకీయాల్లోనే వేడిని పుట్టించాయి. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి మొదలు పెట్టి... అందరిపైనా కౌంటర్లు వేశారు. ఇంకా ఎప్పటినుండో మరుగుపడిన కొన్ని విషయాలను కూడా ఆయన ప్రస్తావించి.. అందరికీ షాకిచ్చాడు. అంతేకాదు వారసత్వ రాజకీయాలపై కూడా ఆయన కామెంట్లు చేశారు. ఇక సునామి వచ్చి వెళ్ళినట్టుగా.. ఎప్పటిలాగే నాలుగు రోజులు హడావుడి చేసి వెళ్లిపోయాడు. అయితే ఈసారి మాత్రం పవన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. పెద్ద పెద్ద డిబేట్ లే జరుగుతున్నాయి.   అయితే ఇక్కడివరకూ ఓకే.. కానీ పవన్ వారసత్వ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలనే అందరికంటే ఎక్కువ వైసీపీ జీర్ణించుకోలేకపోతుంది. ఇక రోజా సంగతి అయితే చెప్పనవసరం లేదు. తన అన్న జగన్ ను అన్నందుకు.. రెచ్చిపోయి మరీ పవన్ పై తిట్ల పురాణం దండుకుంది. పవన్ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడేముందు.. తాను వారసత్వ సినిమాల గురించి మాట్లాడాలని.. తన అన్న చిరంజీవి లేనిదే పవన్ కళ్యాణ్ లేడని.. చిరంజీవి వల్లే పవన్ రాగలిగాడని అబ్బో ఒకటా రెండా ఎన్నో డైలాగ్స్ వేసింది. ఇక జగన్ కూడా పవన్ వ్యాఖ్యలపై స్పందించి కౌంటర్లు విసిరాడు. తాజాగా మరోసారి పవన్, చంద్రబాబు పై సెటైర్లు విసిరాడు. సినిమా యాక్టర్లు, డైరెక్టర్లను పక్కన పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటేనని.. ప్రస్తుత పరిస్థితుల్లో మీ ముందుకు వస్తున్న సినీ నటులను నిలదీయాలంటూ పరోక్షంగా పవన్ కల్యాణ్ ను విమర్శించారు. మనలో చైతన్యం రావాలని, అప్పుడు చంద్రబాబులాంటి వాళ్లు బంగాళాఖాతంలో కలసిపోతారని చెప్పారు. తాను చాలా కష్టపడుతున్నా, కేంద్రమే సహకరించడం లేదని చంద్రబాబు చెబుతుంటారని అన్నారు.   మరి చంద్రబాబుపై, పవన్ పై జగన్ విమర్శలు గుప్పించాడు సరే. బాగానే ఉంది. ఇక్కడ ఓ చిన్న లాజిక్ ను ఎందుకు మర్చిపోయినట్టు ఉన్నాడు జగన్ అని అంటున్నారు. అదేంటంటే.. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడినందుకే రోజా, జగన్ ఓ గింజుకుంటూ.. వారిపై కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారసత్వ సినిమా రంగ ప్రవేశం గురించి చెబుతున్నారు. అలాంటిది.. జగన్ సినిమా యాక్టర్లు, డైరెక్టర్లను పక్కన పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటేనని అంటున్నారు.. మరి రోజా ఎవరు..? సినిమా యాక్టర్ కాదా జగను అని ప్రశ్నిస్తున్నారు...? పవన్ అంటే ఆవేశంలో ఏదో మాట్లాడాడు అనుకుందాం... మరి మీరు తెలివిగల్లవాళ్లు కదా... అన్ని తెలిసినవారు కదా.. మీ పక్కనే ఓ సినిమా యాక్టర్ ని పెట్టుకొని.. పక్కన వాళ్లను అనడం.. మీ అమాయకత్వమా.. లేక ఇంకేదైనా అని అంటున్నారు. మరి నిజమే కదా.. చంద్రబాబు పక్కనేమో కానీ... రోజానే పక్కనే పెట్టుకొని జగన్ ఇలా మాట్లాడటం కామెడీనే..

జగన్ కోసం చంద్రబాబు వెయిటింగ్.. కరుణించని జగన్...

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నారు.. ఏంటిది.. అనుకుంటున్నారా..? మీరు చదువుతుంది నిజమే.. జగన్ కోసం చంద్రబాబు ఎదురచూస్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో జగన్ కోసం చంద్రబాబు అంతలా ఎదురుచూస్తున్నారు...? అసలు జగన్ కోసం చంద్రబాబు వెయిట్ చేయాల్సినంత అవసరం ఏముంది..? అసెంబ్లీ సమావేశాలే ప్రతిపక్షం లేకుండా.. జగన్ తో పనిలేకుండానే జరుపుతున్నారు.. బిల్లులు ప్రవేశపెడుతున్నారు.. ఆమోదిస్తున్నారు... అన్నీ జరిగి పోతున్నాయి.. ఇంకా జగన్ తో ఏం పనుంది అని డౌట్లు వస్తున్నాయి కదా. అదేంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే..   ఏపీలో ఒక సమాచార ప్రధాన కమిషనర్, ముగ్గురు కమిషనర్ల నియామకం కోసం అక్టోబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే కదా. దీనికి గాను మొత్తం 290 దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. ఈ సమాచార కమిషనర్ల నియామకం పై ఏపీ సర్కారు త్వరలో ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరి దీనికి జగన్ కు సంబంధం ఏంటంటారా..? ఉంది మరి.. నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీలో ప్రతిపక్షనేత కూడా ఉంటారు. ఏపీలోని ఎంపిక కమిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్, ఆర్థిక మంత్రి యనమల ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు..జగన్ కు సమాచారం కూడా అందించారట కానీ... జగన్ నుండి సరైన రెస్పాన్స్ రావడం లేదట. ఇప్పుడేమో పాదయాత్రలో బిజీగా ఉన్నాడు. అందుకే.. ఓ ఆఫర్ కూడా ఇచ్చాడట. తాను సమావేశానికి హాజరుకాలేనని తన బదులు వేరొక ప్రతినిధిని పంపుతానని చెప్పారట. కానీ జగన్ నుంచి మాత్రం ఆశించిన స్పందన కనిపించడంలేదు. రూల్స్ ప్రకారం ప్రతిపక్షనేత స్వయంగా రావాలి.. అంతే తప్ప వేరొకరిని పంపటానికి వీళ్లేదట. దీంతో జగన్ ఎప్పుడొస్తాడా అని చంద్రబాబు ఎదురుచూస్తున్నారట. మరి జగన్ ఎప్పుడొస్తాడో..ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో... అసలు ఆయన లేకుండానే డెసిషన్ తీసుకుంటారా..?చూద్దాం ఏం జరుగుతుందో...