కర్నూలు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు..?

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల నగరా మోగింది. శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో.. ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అధికార పార్టీ నుంచి అభ్యర్థిని ఖరారు చేయడం టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. మంగళవారం సాయంత్రానికి నామినేషన్ గడువు ముగుస్తుండటంతో అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలన్న దానిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. దీంతో పార్టీ సీనియర్ నేతలు.. కర్నూలు జిల్లా నాయకులతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.   టికెట్ కోసం చాలా మంది ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. కేఈ ప్రభాకర్, ఎం. శివానందరెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డిలో ఎవరిని ఎంపిక చేస్తారని జిల్లా మొత్తం ఉత్కంఠగా ఎదురచూస్తోంది. ఎమ్మెల్సీగా ఉన్న శిల్పాచక్రపాణి రెడ్డి నంద్యాల ఉపఎన్నికకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. పార్టీ సభ్యత్వంతో పాటు పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మల్సీ పదవికి కూడా శిల్పా రాజీనామా చేయడంతో.. ఈ స్థానంలో ఖాళీ అయ్యింది.   వైసీపీ బలంగా ఉన్న కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో నాడు దివంగత భూమా నాగిరెడ్డి అండతో శిల్పా గెలుపొందారు. అలాంటి చోట మరోసారి ఎన్నికలు రావడంతో ప్రతిపక్షం సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. అలాగే నంద్యాల ఉపఎన్నికతో డీలా పడిన శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాలని వైసీపీ అధినేత భావిస్తున్నారు. అయితే సరైన అభ్యర్థుల కోసం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ పదవిని కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన వారికే ఇవ్వాలని ఓ వర్గం.. గతంలో ప్రాతినిధ్యం వహించిన సామాజిక వర్గానికే ఇవ్వాలని మరో వర్గం గట్టిగా పట్టుబడుతున్నాయి. అయితే సీఎం మనసులో ఏముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

తెలుగు మహాసభల్లో ఎన్టీఆర్‌ను అందుకే గుర్తు చేయలేదట..?

  అంతరించిపోతున్న తెలుగు భాషను కాపాడటంతో పాటు .. తెలుగు భాష, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం.. ప్రపంచ తెలుగు మహా సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు గాను ఘనంగా ఏర్పాట్లు చేసింది. ప్రధాన వేదికతో పాటు భాగ్యనగరంలో ఏ మూల చూసినా తెలుగు కవులు, కళాకారుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 42 దేశాల్లోని తెలుగువారిని.. పలు రాష్ట్రాల్లోని వారిని.. ఒక కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన తెలుగువారిని ఆహ్వానించి.. వారిని ఘనంగా సత్కరించి పంపారు. ఇందుకోసం రూ.60 కోట్లకు పైనే ఖర్చు చేశారు.  ఇంతా చేసి కేసీఆర్ విమర్శలు మూట గట్టుకున్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పి.. తెలుగు భాష అనేది ఒకటి ఉందని.. తెలుగువారు తలచుకుంటే ఏదైనా సాధించగలరని చేతల్లో చూపించిన.. తెలుగుతల్లి ముద్దుబిడ్డ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పేరు మచ్చుకైనా ఎక్కడా తలచుకోలేదు. అంతేనా..? సోదర తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మాటవరసకు కూడా ఆహ్వానించకపోవడంతో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.   సోషల్ మీడియాలో అయితే కేసీఆర్‌ గారిపై ఏ రేంజ్‌లో కామెంట్లు పడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతమంది ఏమనుకున్నా.. లెక్క చేయని మనస్తత్వం కేసీఆర్‌ది.. ఆయన ఒకదానికి కమిట్ అయితే ఆరు నూరైనా వెనక్కు తగ్గరు.. తెలుగు మహాసభల విషయంలోనూ ఇదే జరిగింది. ఐదు రోజుల పాటు వేడుకలు నిర్వహించారు.. ముగింపు వేడుకలకు రాష్ట్రపతిని పిలిచారు.. ప్రతి ఏడాది తెలుగు పండుగ చేసుకుందామని ఒక పద్యంతో వేడుకలకు వీడ్కోలు పలికారు కేసీఆర్. అయితే ఇన్ని రోజుల తర్వాత తెలుగు మహాసభల వేళ ఎన్టీఆర్‌‌ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదో ఇప్పుడు తీరిగ్గా వివరణ ఇచ్చారు తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి. తెలుగు మహాసభలు భాషకు, సాహిత్యానికి సంబంధించినవి.. ఇవి రాజకీయ సభలు అయితే, ఎన్టీఆర్‌ని తప్పకుండా గుర్తుచేసుకుంటాం. ఎందుకంటే రామారావు రచయిత కాదు. సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి అంతవరకే తప్ప.. ఇక్కడ  ఎన్టీఆర్‌లు, ఏఎన్నార్‌లు ఉండరు అంటూ తనదైన స్టైల్లో ఘాటుగా సమాధానమిచ్చారు సిధారెడ్డి.

జగన్ రాత్రుళ్లు ఏం చేస్తున్నాడో తెలుసా..?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పేరుతో యాత్ర చేస్తున్నసంగతి తెలిసిందే కదా. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మాకొట్టి, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూ.. మళ్లీ వస్తూ పాదయాత్ర చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటివరకూ దాదాపు 500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. ఇక పగలంతా పాదయాత్ర చేస్తున్న జగన్..మరి రాత్రి పూట ఏం చేస్తున్నాడబ్బా.. ? ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడింది. పగలంతా పాదయాత్ర చేస్తున్న జగన్ రాత్రిళ్లు మాత్రం కొందరు నాయకులతో సీక్రెట్ గా మంతనాలు జరుపుతున్నారట. ఇంతకీ ఎవరో మంతనాలు జరుపుతున్నారు అనుకుంటున్నారా..? ఇంకెవరూ.. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ తోనే మాట్లాడుతారు..? ఆయన సలహాలే తీసుకుంటున్నారేమో అని అనుకుంటున్నారు కదా..? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. జగన్ మాట్లాడుతున్నాడంటే...  వైఎస్ స్నేహితుడు కేవీపీ రామచంద్రరావు, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో టెలికాన్ఫరెన్సులో మాట్లాడతారట. అయితే ఈ విషయం ఎలా తెలిసిందంటారా...?  శాసన మండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విజయవాడలో దీనిపై విమర్శలు గుప్పించారు. జగన్‌ ఓ పగటి వేషగాడని.. అతని పాదయాత్రకు ప్రజాస్పందన కరువైందని.. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు పై అవాకులు చవాకులు పేలుతున్నారని బుద్దా ఘాటుగా విమర్శించారు. దీంతో విషయం బయటపడింది. మరి జగన్ అండ్ కో బ్యాచ్ సీక్రెట్ టెలికాన్ఫరెన్సుల గురించి ఏమంటారో చూద్దాం మరి.

సచిన్ పై రేణుకా ఫైర్.. భారతరత్న లైసెన్స్ ఇచ్చిందా?

  భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్  దాదాపు చాలా రోజుల తరువాత రాజ్యసభకు వచ్చిన సంగతి తెలిసిందే. పాపం చాలా రోజుల తరువాత వచ్చినా కూడా ఆయనకు మాత్రం సభలో సరిగ్గా మాట్లాడే అవకాశం రాలేదు.  'రైట్ టు ప్లే అండ్ ఫ్యూచర్ ఆఫ్ స్పోర్ట్స్' అనే అంశంపై రాజ్యసభలో సచిన్ నిన్న మాట్లాడాల్సి ఉంది. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రధాని మోదీ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారంటూ రాస్యసభలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. సచిన్ దాదాపు 10 నిమిషాల పాటు నిలబడే ఉన్నా మాట్లాడే అవకాశం రాలేదు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ దిగ్గజ ఆటగాడికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ మండిపడ్డారు. ఇక బీజేపీ వ్యాఖ్యలపై స్పందించిన రేణుకా చౌదరి మండిపడ్డారు. 'భారతరత్న' పురస్కారం పార్లమెంట్ లో మీకు మాట్లాడేందుకు లైసెన్స్ ఇచ్చిందా? అని ప్రశ్నించారు.   కాగా రాజ్యసభ సభ్యుడిగా సచిన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి 348 రోజులపాటు సభ జరిగితే... ఆయన కేవలం 23 రోజులు మాత్రమే హాజరయ్యారు.

మోడీజీ బ్యాండ్ బాజా అవుతుందిగా...

  దేశంలో అవినీతి అనేదే లేకుండా చేస్తాం...మన దేశాన్ని చూసి గర్వపడేలా చేస్తాం అని ప్రగల్పాలు పలికిన మోడీ పైన ఉన్న నమ్మకం 2జీ స్కాం తీర్పుతో పోయినంత పనైంది. ఇప్పటికే ఆయన ప్రధాని అయిన తరువాత తీసుకున్న పలు నిర్ణయాల వల్ల ఉపయోగం ఎంత ఉన్నా.. చాలా మందిలో వ్యతిరేక భావం అయితే నెలకొంది. ఇప్పుడు 2జీ స్కాం తీర్పుతో ఆయనకు పూర్తి వ్యతిరేకంగా మారే పరిస్థితి ఏర్పడింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రచారం మొత్తం 2జీ స్కాం.. బొగ్గు కుంభకోణం మీదనే సాగింది. దీంతో మోడీ వస్తే దేశం ఇంకెంత బావుంటుందో అని అందరూ ఆయనకు పట్టం గట్టారు. కానీ అందరిలాగానే తాను కూడా అని..ఆయనేం మినహాయింపు కాదని ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు గమనిస్తే ఇట్టే అర్థమవుతుంది.   ఇక 2జీ స్కాం పై వచ్చిన తీర్పు చూసి కొంత మంది సంతోషిస్తున్నా...చాలా మంది మాత్రం మోడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఓ ఆట ఆడుకుంటున్నారు. మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆయన తీరు చూసి నెటిజన్లు కామెంట్లు చేసుకుంటున్నారు. ఆ కామెంట్లలో కొన్ని కామెంట్లు చూద్దాం..   * మోడీ జీ నోట్ల రద్దు అనంతరం విదేశాలకు తరలివెళ్లిన బ్లాక్ మనీని వెనక్కి తీసుకురాలేదు. 2జీ స్కాం నిందితులకు శిక్ష పడలేదు, గంగ ఇప్పటికి పరిశుభ్రం కాలేదు, వాద్రా మీద ఆరోపణలు నిరూపితం కాలేదు.   * ఇక విదేశాలకు వెళ్లిన మాల్యా కూడా ఇండియా రావడానికి ఏం భయపడడు. 1.76 లక్షల కోట్లు తిన్న వారినే వదిలేశారు. మాల్యా కేవలం తొమ్మిది వేల కోట్లేగా తిన్నది.. 2జీ తీర్పు విన్నాక విజయ్ మాల్యా ఇండియాకు తిరిగి రావటానికి  నిర్ణయించుకున్నారు.   *  2జీ స్కాం: క్లీన్ చిట్ బొగ్గు స్కాం:  కొందరు నిందితులకు మూడేళ్లు జైలు ఇది.. అవినీతిపై బీజేపీ బలంగా యుద్ధం చేయటమంటే..   * జెస్సికా లాల్ను ఎవరూ చంపలేదు.. కృష్ణ జింకలనూ ఎవరూ చంపలేదు. ఆరుషిని కూడా ఎవరూ హత్య చేయలేదు. ఇప్పుడు రూ.1.76లక్షల కోట్లను ఎవరూ దొంగలించలేదు. శభాష్ ఇండియా!!   * స్కాములను బయటపెట్టటం వినోద్ రాయ్ (కాగ్) పని కాదు. మోడీని అధికారంలోకి తేవటమే ఆయన డ్యూటీ. చాలా స్మూత్ గా పని పూర్తి చేశారు. అభినందనలు.   *  జడ్జి...మిమ్మల్ని ఎందుకు విడుదల చేయాలో ఒక్క కారణం చెబుతారా? దోషులు..సర్.. ప్రపంచమంతా 4జీ అంటోంది. మీరింకా 2జీ చుట్టూ తిరుగుతున్నారు. జడ్జి.. గుడ్.. బావుంది. విడుదల చేసేశాను పొండి   * డీఎంకే అంటే.. ద్రవిడ మోదీ కళగం   మరి ఇప్పటికైనా మోడీకి అర్ధమవుతుందో లేదో.. ఇలాంటి తీర్పులిస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో. ప్రజలు ఏం చెప్పినా వింటారు... అధికారంలో ఉన్నాం కదా... ఏం చేసినా ఊరుకుంటారు అని అనుకుంటున్నారేమో.. తేడా వస్తే నమ్మిన పార్టీనే పాతాళానికి తొక్కేయడానికి కూడా సిద్దపడతారని తెలీదు. బీజేపీకి కూడా త్వరలో అదే గతి పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మోడీ జీ ఇప్పటికైనా కాస్త కళ్లు తెరవండి సార్...

రాహుల్ వచ్చిన వేళ... నిన్న 2జీ స్కాం.. ఈరోజు ఆదర్శ్ స్కామ్

  2జీ స్కాం. యూపీఏ హయాంలో జరిగిన అతిపెద్ద స్కాం ఇదేనని చెప్పుకుంటారు. అంతేకాదు అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ పార్టీ దీనిని అడ్డపెట్టుకొని ప్రచారం చేసుకుంది. అధికారం చేపట్టింది. దేశంలోనే అతిపెద్ద స్కా అయిన దీనిపై నిన్న సంచనల తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇంత పెద్ద స్కాంలో కేవలం ఆధారాలు లేవన్న సింపులు రీజన్ తో దోషులుగా ఉన్న వారిని... నిర్దోషులుగా తేల్చేసింది. దీంతో అందరి సంగతేమో కానీ... కాంగ్రెస్ మాత్రం ఈ తీర్పుపై చాలా హ్యాపీగా ఉంది. తమకు అవినీతి అంటేనే అసలు తెలియదు అన్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా చర్చించుకుంటున్నారు.   అదేంటంటే... గుజరాత్ ఎన్నికల పుణ్యమా అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హీరో అయ్యాడు. కాంగ్రెస్ ఓడిపోయినా.. రాహుల్ కు సక్సెస్ అయ్యాడు. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చాడని.. మోడీకి చెమటలు పట్టించాడని అనుకున్నారు. ఇక ఇప్పుడు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వేళా విశేషం.. అతి పెద్ద 2జీ స్కాం నుండి బయటపడ్డామని అంటున్నారు. ఇక ఇవాళ, మహారాష్ట్రలో జరిగిన ఆదర్శ్ స్కామ్ లో మాజీ సీఎం అశోక్ చవాన్ ను విచారించరాదని చెబుతూ బాంబే హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో అప్పుడు సీఎంగా ఉన్న చవాన్ ను ప్రాసిక్యూట్ చేయాలని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆదేశించగా, వాటిని హైకోర్టు తోసిపుచ్చింది. దర్యాప్తులో సీబీఐ సాక్ష‍్యాలు సమర్పించకపోవటంతో ఆయన్ని తిరిగి విచారించేందుకు అనుమతి ఇస్తూ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ చవన్‌ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే 2జీ స్పెక్ట్రమ్ కేసు నుంచి విముక్తి చెందిన మరుసటి రోజునే ఆదర్శ్ కుంభకోణం నుంచి చవాన్ ఊరట పొందడం గమనార్హం. దీంతో రాహుల్ వచ్చిన వేళా విశేషం.. కాంగ్రెస్ పై ఉన్న మరకలు ఒక్కొక్కటిగా పోతున్నాయి అని అనుకుంటున్నారు. 

సాక్ష్యం కోసం 7ఏళ్లు ఎదురుచూశా..!

2జీ స్కాం దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో.. ఈ కేసు తీర్పు కూడా అంతే సంచలనం సృష్టిస్తోంది. కేవలం ఎటువంటి ఆధారాలు లేవన్న సింగిల్ లైన్ తో కేసులో దోషులుగా ఉన్న వారిని నిర్దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చారు. ఇప్పటికే ఈ కేసు తీర్పు చూసిన తరువాత అందరూ షాక్ లో ఉంటే... దీనికితోడు ఇప్పుడు సీబీఐ కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. ఈ కేసులో సాక్ష్యాల కోసం తాను ఏడేళ్లుగా ఎదురుచూశానని, అయినా తన ఎదురుచూపులు ఫలించలేదని అన్నారు. ఒక్కరు కూడా సాక్ష్యాన్ని తీసుకురాలేకపోయారని.. ప్రతి ఒక్కరూ పుకార్లు, ఊహాగానాలనే చెప్పారు తప్ప నేరాన్ని సాక్ష్యాలతో రుజువు చేయలేకపోయారని తెలిపారు. ఈ ఏడేళ్లలో ప్రతిరోజూ కోర్టుకు వచ్చా.. ప్రతిరోజూ ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు కోర్టు గదిలో కూర్చునే వాడిని.. సరైన సాక్ష్యాన్ని ఎవరైనా సమర్పిస్తారేమో అని ఎదురుచూసేవాడినని సైనీ అన్నారు.   అంతేకాదు సీబీఐ అధికారుల తీరుపై కూడా జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుకు అందించిన పత్రాల్లో సీనియర్‌ అధికారుల సంతకాలు లేవన్నారు. తుది విచారణ సమయంలో సమర్పించిన పత్రంలో అయితే అసలు ఎవరి సంతకమూ లేదన్నారు. ఎవరూ సంతకం చేయకపోతే ఆ డాక్యుమెంట్‌కు విలువ ఏమి ఉంటుందని జడ్జి ప్రశ్నించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో ఈ కేసులో చాలా లోపాలు ఉన్నాయని జడ్జి సైనీ తెలిపారు.   దీంతో జడ్జి గారిమాటలు ఆసక్తికరంగా మారాయి. మరి నిజంగానే సాక్ష్యాలు తేలేకపోయారా..? లేక సాక్ష్యాలు ఉన్నా రాజకీయ ప్రయోజనాల కోసం కనుమరుగు చేశారా..? అని అనుకుంటున్నారు. 1.76 కోట్లు అంటే ఏదో చిన్న విషయం అయినట్టు..చాలా సింపుల్ గా తీర్పు ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ధికి కావాల్సిన నిధులు ఇవ్వండ్రా బాబు అంటే తొక్కలో సాకులు చెప్పే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు.. ఇన్ని కోట్లు పోయినా ఏం పట్టనట్టు చూస్తూ కూర్చుందంటే.. ఏమనుకోవాలి. ఇలానే చూస్తూ పోతే... అన్ని స్కాంల్లో ఇలానే సాక్ష్యాలు లేవని చాలా ఈజీగా అవినీతి తిమింగలాలను వదిలిపెడతార్న ఆశ్చర్యపోనక్కర్లేదు..

పిచ్చి జనాలు.. నన్ను కూడా వదిలిపెడతారు..!

  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1.7 లక్షల కోట్ల భారీ స్కాం. దేశంలోనే అతిపెద్ద స్కాంగా సంచలనం సృష్టించిన 2జీస్కాం. ఒక్కముక్కలో ఎవరూ దోషులు కారని పటియాలా కోర్టు తేల్చిచెప్పింది. అది కూడా చాలా సింపుల్ రీజన్. సాక్ష్యాదారాలు లేవని. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అసలు ఈ స్కాంను బయటపట్టారు. ఇక కాగ్  1.7 లక్షల కోట్ల భారీ స్కాం జరిగిందని రిపోర్ట్ ఇచ్చింది. ఆ తరువాత రంగంలోకి దిగిన సీబీఐ, ఈడీ ఈకేసులో అప్పడు టెలికాం శాఖ మంత్రిగా వ్యవహరించిన ఎ.రాజా... కనిమొళితోపాటు మరి కొంతమందిపై కేసు నమోదు చేసింది. 2011 నుండి ఈ కేసుపై విచారణ జరుగుతుంది. ఈరోజు తుది తీర్పు వచ్చింది. ఇక ఇంత పెద్ద స్కాంలో ఇంత ఈజీగా తీర్పు వచ్చినందుకు కొంతమంది హ్యాపీగా ఉన్న... చాలామంది మాత్రం షాక్ లోనే ఉన్నారు. ఇంత పెద్ద కోట్ల స్కాంలో కేవలం ఆధారాలు లేవని చెప్పి తీర్పునిస్తారా అని అయోమయంలో పడ్డారు అందరూ. ఇది సీబీఐ చేతకాని తనమా లేక.. ప్రభుత్వానిదా..?   ఈ లెక్కన చూస్తే ప్రభుత్వలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్ని కోట్ల స్కాంలనైనా.. ఎన్ని కోట్లు తిన్న అవినీతి పరులనైనా ఈజీగా వదిలిపెట్టేస్తుందేమో అని సామాన్యులకు వస్తున్న డౌట్. ఎవరూ దోషులు కానప్పుడు, ఎవరూ స్కాం చేయ్యినప్పుడు,  1.7 లక్షల కోట్ల భారీ స్కాం జరిగిందని రిపోర్ట్ ఇచ్చింది.. కాగ్ 2012 ఫిబ్రవరిలో అపెక్స్ కోర్ట్, 122 టెలికాం లైసెన్స్ లు ఎందుకు రద్దు చేసింది ? 9 కంపెనీలకు అలాట్ చేసిన స్పెక్ట్రమ్ లు ఎందుకు రద్దు చేసింది ? చూస్తుంటే ఈ స్కాంలో జరిగినట్టే మిగిలిన కుంభకోణాల్లో కూడా అలానే జరుగుతుందేమో అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. బొగ్గు కుంబకోణం, కామన్ వెల్త్ స్కాం, గాలి జనార్ధన రెడ్డి స్కాం, జగన్ దోపిడీ, ఇవి కూడా జరగలేదు అని చెప్తారామో? ఏముంది ఇన్ని లక్షల కోట్ల స్కాంలోనే సాక్ష్యాలు లేవని చెప్పినట్టు.. ఈకేసుల్లో కూడా సాక్ష్యాలు లేవని చెప్పినా ఆశ్యర్యపోనక్కర్లేదు. అలా తయారయ్యాయి.   ఇక లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ కు ఈ తీర్పు చాలా సంతోషకరంగా ఉండొచ్చేమో. తాను కూడా సింపుల్ గా బయటకు రావచ్చన్న ధీమాతో ఉండొచ్చు. ఎలాగూ ప్రస్తుతం బీజేపీ-టీడీపీకి సరిగ్గా పడటంలేదు. ఇప్పుడు గుజరాత్ ఎన్నికల ఫలితాలు చూస్తే.. బీజేపీతో టీడీపీ పొత్తు డౌటే. ఒక పక్క చంద్రబాబు సైలెంట్ గా ఉన్నా...బీజేపీ నేతలు కష్టంగా గెలిచి కూడా ఎగిరిపడుతున్నారు. ఒకవేళ టీడీపీతో పొత్తు కుదరకపోతే.. బీజేపీ, వైసీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. ఇక బీజేపీతో పొత్తుకోసం జగన్ కూడా ఆరాటపడుతున్నాడు. ఒకవేళ అదే జరిగితే.. జగన్ పై ఉన్న లక్షకోట్ల అవినీతి కేసుపై కూడా సింపుల్ గా తీర్పు వచ్చేస్తుంది. ఏముంది సాక్ష్యాలు సరిగా లేవన్న రీజన్ చూపిస్తారు.   చెప్పేవాడికి.. వినేవాడు లోకువ అని ఊరకనే అనలేదు. కేంద్రప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా చెబితే ప్రజలు అలా చూస్తూ..వింటూ పోతున్నారు కాబట్టే..ప్రజలంటే ఇంత లోకువైపోయింది. ఇక ఈ తీర్పులు చూసి మళ్ళీ హై కోర్టులు అని, సుప్రీమ్ కోర్టులు అని తిరిగే సరికి పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది. అప్పుడెప్పుడో జయలలితపై అక్రమాస్తుల కేసు పెట్టారు. ఆ తీర్పు వచ్చే సమయానికి ఆమె లేకుండానే పోయారు. అలానే.. 2జీస్కాంలో తీర్పు కోసం హైకోర్టు.. సుప్రీంకోర్టు అంటూ తిరిగే సరికి ఇప్పుడు 4జీ లో ఉన్నా.. ఇంకొన్ని రోజుల్లో 5జీ రాబోతుంది.. ఈ కేసు తేలే సరికి, 10జి యుగంలో ఉంటావేమో. పాపం న్యాయం కోసం ఎదురుచూసే పిచ్చి జనాలు ఎవరిని నిందించాలి ? రాజకీయ నాయకులనా ? సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలనా ? కోర్ట్ లనా ?

2జీ స్కాం..మరి దోషులు ఎవరు ? 1.7 లక్షల కోట్లు ఏమయ్యాయి..?

  2జీ స్కాం... దేశంలో ఈ కుంభకోణం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ కుంభకోణం చోటుచేసుకుంది.  ఆ సమయంలో  టెలికాం శాఖ మంత్రిగా వ్యవహరించిన ఎ.రాజా..  2జీ స్పెక్ట్రం కేటాయింపులో భారీ అవినీతికి పాల్పడ్డారని.. ఈ అవినీతి వల్ల ప్రభుత్వానికి రూ.1.76లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. కాగ్‌ ఆరోపణలు చేయడంతో 2010లో ఎ. రాజాను అప్పటి ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది. ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టింది. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా 17 మంది నేతలు, కార్పొరేట్‌ సంస్థల అధికారులపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. 2011లో రాజాను అరెస్టు చేశారు. ఏడాది పాటు జైల్లో ఉన్న రాజా ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక ఇన్ని సంవత్సరాల తరువాత... పటియాలా సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పునిచ్చింది.  ఈ కేసులో దోషులుగా ఉన్న కరుణానిధి కూతురు, ఎంపీ కనిమొళి, మాజీ కేంద్ర టెలికాం మంత్రి ఎ.రాజాను కోర్టు నిర్దోషులుగా తేల్చుతూ  పటియాలా సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.  వీరితో పాటు ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది.   ఇక్కడి వరకూ బాగానే ఉంది.. అయితే ఇంత హంగామా చేసి ఇప్పుడు అసలు స్కాం అనేదే జరగనట్టు కోర్టు వారందరినీ నిర్దోషులని తేల్చిచెప్పేసింది. మరి ఇంతకీ స్కాం జరిగిందా లేదా..? అన్నది ఇప్పుడు అందరిలో మొదలవుతున్న ప్రశ్న. ఒకపక్క నాడు వినోద్ రాయ్ నేతృత్వంలోని కాగ్ 1.7 లక్షల కోట్ల భారీ స్కాం అని ఆరోపించింది. కాని కోర్టు మాత్రం సరైన ఆధారాలు లేవు అని, స్కాంలో ఎవరూ నిందుతులు కాదు అని సింగల్ లైన్ చాలా సింపుల్ గా తీర్పు ఇచ్చింది. కోర్టు అయితే తీర్పునిచ్చింది కానీ... ఎవరి డౌట్లు వారికి ఉన్నాయి. అవేంటంటే.. ఆ 1.7 లక్షల కోట్లు ఎవరు తిన్నారు ? వారు దోషులు కాకపొతే, మరి దోషులు ఎవరు ? ఇంతకీ స్కాం జరిగిందా ? తీర్పుని బట్టి చుస్తే, అసలు 2జీ స్కాం జరగనేలేదు అనే భావన వ్యక్తం అవుతుంది ? మరి ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు ? 1.7 లక్షల కోట్ల భారీ స్కాంలో, ఒక్కరు కూడా దొంగ కాదా ? ఒక్క ఆధారం కూడా సిబిఐ చూపించలేదా ? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రశ్నలు. మరి వీటికి సమాధానం ఎవరు చెపుతారంటే... అదికూడా సమాధానం లేని ప్రశ్నే అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే.. ఇంత జరుగుతున్నా అసలు బీజేపీ ఏం చేస్తుంది. ఈ స్కాం జరిగింది యూపీఏ హయాంలో.. అప్పుడంటే బీజేపీ అధికారంలో లేదు.. ప్రతిపక్షంలో ఉంది... అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది.. కోట్లకి కోట్లు లూటీ చేసింది అని ప్రచారాస్త్రంగా వాడుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఇప్పుడు తనే అధికారంలో ఉన్నా ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చుంది. తన చేతిలో సిబిఐని ఉంచుకుని కూడా సరైన ఆధారాలు ఎందుకు చూపించలేదు ? ఎందుకు ప్రూవ్ చెయ్యలేక పోయింది ? కనీసం ఒక్క ఆధారం కూడా చూపించలేక పోయిందా..? ఏదో ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు... ఏకంగా లక్షల కోట్లు.. అంత పెద్ద స్కాం ఎవరూ ఏం చేయకుండానే. మాయమైపోయిందా...?. అంతేకాదు ఇక్కడ కూడా అనుమానాలు రాక మానదు. ఎందుకంటే.. గత నెలలో మోడీ డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఇంటికి పరామర్శకు వెళ్లారు. ఆయనతో స్వయంగా మాట్లాడారు. 2జీ స్పెక్ట్రమ్ స్కాం కేసు తీర్పు వెలువడే ఒక్క రోజు ముందు మోడీ, కరుణానిధిని కలవడంతో అప్పట్లో తీవ్రస్థాయిలో చర్చకు దారి తీసింది. ఇప్పుడు చూస్తే ఇందులో ఏదో రాజకీయ కోణం ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంత పెద్ద స్కాం విషయంలో కూడా రాజకీయ ప్రయోజనాన్నే చూస్తున్నారా..? నేతలు రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి కేసును నీరుగార్చారా..?   ఇక అసలు ఈ 2జీ స్కాంను బయటపెట్టిన బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి గారు ఏం చేస్తున్నారు. ఆయన్నింటిలో వేలు పెట్టే ఆయన తాను బయటపెట్టిన స్కాం గురించి ఏమంటున్నారు..?ఆయన రియాక్షన్ ఏంటి? పాపం ఆయన మాత్రం అనేదేముంటుంది.. తీర్పును తప్పుబట్టడం తప్ప. అదే చేశారు. తీర్పుపై స్పందించిన ఆయన.. వెంటనే ప్రభుత్వం హైకోర్టులో తీర్పుపై అప్పీలు చేయాలని సూచించారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసునూ హైకోర్టు కొట్టివేస్తే కాంగ్రెస్, ఆ పార్టీ మిత్ర పక్షాలు పండగ చేసుకున్నాయని, కానీ, సుప్రీం కోర్టు మాత్రం హైకోర్టు తీర్పును ఖండించిందని, 2జీ స్కాంలోనూ అదే పునరావృతం అవుతుందని సుబ్రమణ్య స్వామి ట్వీట్ చేశారు. ఏది ఏమైనా.. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అయిన 2జీ స్కాం తీర్పు సగటు భారతీయుడికి షాకిచ్చింది. ఎవరూ దొంగలుకాకపోతే... అన్ని కోట్లు ఎవరు తిన్నట్టో..? ఈ స్కాం విషయంలో కాగ్ పొరపాటు పడిందా..? లేక సీబీఐ చతికిల పడిందా..?

మోడీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు.. షాకిచ్చిన బీజేపీ మంత్రి..

  "మోడీ ప్రపంచలోనే అత్యంత అవినీతిపరుడైన ప్రధాన మంత్రి అంటా".. ఇలా అన్నది ఎవరో కాదు.. స్వయంగా ఓ మంత్రిగారే.. రాజకీయ నాయకులు అప్పుడప్పుడు నోరు జారుతుండటం కామన్. ఒక్కోసారి ఆవేశంతో పక్క పార్టీల నేతలపై విమర్శలు చేయబోయి.. తమ పార్టీనే విమర్శిస్తారు. ఆ తరువాత నాలుక్కరుచుకొని.. తప్పుని గుర్తిస్తారు. ఈలోపు జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోతుంది. ఇప్పుడు అదే జరిగింది మోడీకి. అసలే గుజరాత్ ఎన్నికల్లో చచ్చి గెలిచినందుకు సంక్షోభంలో పడ్డారు. ఇలానే ఉంటే ముందు ముందు పరిస్థితి చాలా దారణంగా ఉంటుందని.. మోడీ-షా ద్వయం... ఆలోచనలో పడ్డారు. ప్రజలకు తమపై ఉన్న వ్యతిరేక భావాన్ని ఎలా పొగట్టాలా అని ఆలోచిస్తున్నారు.   ఇదిలా ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు...బీజేపీ నేతల అత్యుత్సాహం వల్ల మరిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆ అత్యుత్సాహం వల్లే ప్రధాని మోడీని  ఏకంగా అవినీతిపరుడు అని అన్నాడు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో బీజేపీ గెలుపు నేపథ్యంలో రాజస్తాన్ మంత్రి డాక్టర్ జస్వంత్ సింగ్ యాదవ్ ప్రధాని మోడీని ప్రశంసించాలనుకున్నారు. ఆ ఉద్వేగంలో ఈ రోజు ఎంతో మంచి రోజు అని, అత్యంత గౌరవనీయులైన, ఎంతో ఖ్యాతిగాంచిన మన ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు, ఆయన నాయకత్వంలో ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించాం అని వ్యాఖ్యానించారు. ఇంకేముంది ఇది మీడియాలో చర్చనీయాంశంగా మారింది. యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఉన్న వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా.. ఎప్పుడు ప్రతిపక్షాలపై విరుచుకుపడదామా అని పార్టీలకు ఇప్పుడు ఛాన్స్ దొరికింది.   విచిత్రం ఏంటంటే.. ఆయన పక్కన ఉన్న వారు కూడా గుర్తించలేకపోవడం. గుర్తించి ఆయనను వారించలేదు. అప్పటికి అంతా అయిపోయింది. మంత్రిగారు చేసిన మంత్రిగారు చేసిన వ్యాఖ్యలు మెయిన్ ఎడిషన్ లో పెద్ద పెద్ద అక్షరాలతో ప్రత్యక్షమయ్యాయి. అప్పటికిగానీ తెలయదు బీజేపీ నేతలకు ఎంత పెద్ద తప్పుచేశామో అని. ఏది ఏమైనా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం.. అలాగే ఇప్పుడు ఏం చేసినా లాభం లేదు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరి మంత్రిగారి భవిష్యత్ ఏంటో...? ఆయనపై యాక్షన్ తీసుకుంటారో.. వదిలేస్తారో..?

రాహుల్ ను హీరో చేసిన హీరోయిన్...

  గుజరాత్ ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాల్లో బీజేపీ గెలిచింది. రేపో మాపో అధికారం కూడా చేపట్టనుంది. ఇకపోతే ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ చచ్చీ చెడీ గెలిచిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వడంతో.. ఏదో పది పదిహేను సీట్లు అటూ ఇటూగా వచ్చి.. బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. లేకపోతే అప్పుడు మ్యాటర్ వేరేలా ఉండేది. మరి ఈ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఆనందంగా లేదు కానీ.. ఓడిపోయినా.. కాంగ్రెస్ పార్టీ చాలా హ్యాపీగా ఉంది. దీనికి కారణం కూడా లేకపోలేదు లేండి. ఇప్పటి వరకూ ఎక్కడ ఎన్నికలు జరిగినా.. బీజేపీ ఘన విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఓడిపోడింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కానీ... గతంలో జరిగిన ఎన్నికల్లో కంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి చుక్కలు చూపించింది. దేశానికే వణుకు పుట్టించే మోడీ సైతం భయపడ్డారంటేనే అర్ధం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎంత పోటీ ఇచ్చిందో.   ఇదిలా ఉండగా.. ఈ ఎన్నికల పుణ్యమా అని.. ఇప్పటివరకూ పప్పు, దద్ది అని ట్యాగ్ లైన్లు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఒకప్పుడు రాహుల్ గాంధీ మాటతీరు, సభల్లో సమావేశాల్లో అయన ఉండే తీరు, పార్లమెంట్ సభల్లో నిద్రపోవడం.. ఇవన్నీ చూసి రాహుల్ గాంధీ రాజకీయాలకు పనికిరాడు...ఆయన పప్పు అని ప్రతిపక్షపార్టీనేతలు కామెంట్లు చేసుకునేవారు. కానీ ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కానీ.. ఈ మధ్య రాహుల్ మాటలో తేడా వచ్చింది. రాజకీయాల్లో కాస్త చురుకుగా ఉంటున్నారు. అంతేకాదు మోడీపై మాత్రం ఘాటుగానే విమర్శలు గుప్పించారు. అందుకే రాహుల్ గాంధీ మార్పుపై వార్తలు కూడా వచ్చాయి. ఓ రకంగా చెప్పాలంటే మోడీ కూడా కాస్త భయపడ్డాడు.   ఇవన్నీ ఒకత్తైతే అసలు రాహుల్ గాంధీ హీరో అవ్వడానికి ఇదోక్కటే కారణం కాదని.. దీని వెనుక మరో వ్యక్తి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అది ఎవరో కాదు  ప్రముఖ కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య. ఈమెకు, రాహుల్ గాంధీ హీరో అవ్వడానికి సంబంధం ఏంటా అనుకుంటున్నారా..? ఏంటంటే... ఈ రోజుల్లో ఏ  విషయం అయినా క్షణాల్లో నలుగురికి చేరాలంటే సోషల్ మీడియా ఒకటి చాలు. అదే హీరోని చేస్తుంది.. అదే జీరోని కూడా చేస్తుంది. రాహుల్ గాంధీపై ఒకప్పుడు ఉన్న పప్పు బ్రాండ్ కు కూడా కారణం ఈ సోషల్ మీడియానే. అలాంటి ఇమేజ్ పోగట్టడంలోనే రమ్య సక్సెస్ అయింది. సోషల్ మీడియాలో బీజేపీ దూకుడుకి తట్టుకోలేకపోయిన కాంగ్రెస్ డిజిటల్ ప్రచారాన్ని ఆమె కొత్త పుంతలు తొక్కించారు. డిజిటల్ ప్రచార బాధ్యతలని తీసుకున్న వెంటనే ఆమె ఓ వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లారు. ముందుగా రాహుల్ గురించి చెప్పే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. మోడీ అధికారం చేపట్టాక తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పధకాల వల్ల జరుగుతున్న నష్టానికి విస్తృత ప్రచారం కల్పించారు. ఇంకేముంది అప్పటి దాకా సోషల్ మీడియాలో ఆఫెన్స్ తప్ప డిఫెన్స్ తెలియకుండా రెచ్చిపోతున్న బీజేపీ తొలిసారిగా రక్షణలో పడాల్సి వచ్చింది. దాంతో రాహుల్ మీద దాడి మాట అటుంచి మోడీ అండ్ కో నిర్ణయాల మీద వివరణలకే పరిమితం అయ్యేలా చేశారు.   అంతేకాదు గుజరాత్ ప్రచారంలో కూడా...ఇదే ఫార్ములానే నమ్ముకుంది. దీంతో ప్రధాని మోడీ సైతం తన నిర్ణయాల వల్ల ఇప్పుడు ఇబ్బందులు ఎదురైనా భవిష్యత్ బాగుంటుందని చెప్పుకోవాల్సి వచ్చింది. ఆఖరికి ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ బాధపడకుండా.. బీజేపీకి రాహుల్ గట్టి పోటీ ఇచ్చాడని...ఓ పది సీట్లు అటు ఇటు అయితే మోడీ కి ఎదురు దెబ్బ తగిలేదన్న విషయాన్ని దేశమంతటా విస్తృతంగా ప్రచారం చేయగలిగారు. నిజం చెప్పాలంటే ఈ విషయంలో కూడా ఆమె సక్సెస్ అయ్యారు. నిజంగానే రాహుల్ ను హీరోని చేశారు. మోడీకి చెమటలు పట్టించాడని... చుక్కలు చూపించాడని అందరూ పొగడ్తలు కురిపించారు. మొత్తానికి తెర వెనుక ఉండి నడిపించిన రమ్య.. రాహుల్ జాతకాన్ని మార్చేసింది అని చెప్పుకోవచ్చు.

బాబుపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం... చేతకానివాళ్లమా..!

  ఉరుము ఉరిమి మంగలం మీద పడిందట...అలా ఉంది ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి. అక్కడెక్కడో గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దాని ఎఫెక్ట్ ఇక్కడ ఏపీలో పడుతుంది. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సంగతి తెలిసిందే కదా. కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వడంతో ఏదో చచ్చీ చెడీ...బీజేపీ గెలిచింది. ఈ విషయం మోడీ-అమిత్ షా ద్వయానికి కూడా బాగా తెలుసు. అందుకే పై పైకి ఏదో గెలిచామని ఆనంద పడుతున్నా.. లోపల మాత్రం వారికి గుబులు మొదలైంది. మోడీ పై జనాల్లో ఉన్న వ్యతిరేక భావం  ఒక్కసారిగా బయటపడింది. నాలుగేళ్ల పాలనలో మోడీ తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణం. ఇక ఈ గెలుపు కోసం మోడీ చాలానే కష్టపడ్డారు. ఆఖరికి పాక్ ను తెరపైకి తీసుకొచ్చి విమర్శలపాలయ్యారు. ఏదోలాగ బీజేపీనైతే గెలిపించారు. గెలుపు అయితే దక్కింది కానీ దాన్ని సెలెబ్రేట్ చేసుకునే పరిస్థితి లేదు. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలుండగా వచ్చిన ఈ ఫలితాలతో ప్రధాని మోడీ, అమిత్ షా ఎలాగా అని కిందామీదా పడుతున్నారు. కానీ ఇక్కడ ఏపీలో బీజేపీ నేతలు మాత్రం రెచ్చిపోతున్నారు.  గుజరాత్ ఫలితాలు చూసి కాలర్ ఎగరేస్తున్నారు.   సోము వీర్రాజు లాంటి వాళ్లైతే ఏకంగా.. ఏపీలో ఈసారి అధికారం మాదే అని..దమ్ముంటే పొత్తు అక్కర్లేదని టీడీపీ ని చెప్పమని సవాల్ విసురుతున్నాడు. ఈయనగారి మాటలకు నవ్వుకోవాలో..లైట్ తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఇక సోము వీర్రాజు మాట్లాడిన మాటలకు టీడీపీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే.. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ సోము వీర్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. దీనిపై స్పందించిన చంద్రబాబు పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. భాజపాను పల్లెత్తు మాట అనవద్దంటూ నేతలకు ఆదేశాలిచ్చారు.   ఇక్కడే చంద్రబాబుకు చిక్కొచ్చి పడింది. చంద్రబాబు వారిని కంట్రోల్ చేయడం అస్సలు నచ్చడం లేదట. భాజపా నాయకులు మాటల్లో విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంటే మనం మాత్రం నోరుమూసుకుని కూర్చోవాలా అని పార్టీ నేతలు మధన పడుతున్నారట. బీజేపీ మిత్రపక్షమైనప్పటికీ పదే పదే టీడీపీపై విమర్శలు గుప్పిస్తుంది.. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కూడా కేంద్రం సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది... ఇలాంప్పుడు కూడా.. ఉన్నదున్నట్టుగా మొహం మీద దులిపేస్తే తప్పేంటని తెలుగుదేశం వర్గాలు ఉద్రేకపడుతున్నారట. ఒకవైపు తాము తప్ప తెలుగుదేశానికి గత్యంతరం లేదన్నట్టుగా భాజపా విర్రవీగుతోంటే.. దానికి కూడా కౌంటర్ ఇవ్వకపోతే.. తమను అసమర్థులు కింద జమకట్టేస్తారేమో అని తెలుగుతమ్ముళ్లు ఉగ్రులవుతున్నారు. భాజపా విషయంలో సంయమనం పాటించాలనే చంద్రబాబు డైలాగులు ఎవ్వరికీ రుచించడం లేదట. అంతేకాదు.. బీజేపీ పై ఉన్న కోపం ఇప్పుడు చంద్రబాబు పై మళ్లుతుందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. మొత్తానికి అటు బీజేపీ విమర్శలు.. ఇటు పార్టీ నేతల ఆగ్రహం.. అడకత్తెరలో పోక చెక్క మాదిరి అయింది. మరి బాబు గారు దీనిపై ఒక్కసారి ఆలోచిస్తే మంచిది.

నానికి దిమ్మతిరిగిందిగా..

  వైసీపీ అధినేత జగన్ కే కాదు... ఈమధ్య ఆ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నానికి కూడా ఈ మధ్య షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అది కూడా ఆయన నియోజక వర్గం అయిన గుడివాడలో. గుడివాడ అంటే టీడీపీకి కంచుకోట లాంటిది. అలాంటి గుడివాడలోనే.. చంద్ర‌బాబు ద‌య‌తో కొడాలి నాని 2004, 2009 ఎన్నిక‌ల్లో రెండుసార్లు వ‌రుస‌గా టీడీపీ నుంచి గెలిచారు. ఆ తరువాత టీడీపీని దెబ్బకొట్టి... వైసీపీలో చేరారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసి గెలిచాడు. ఇక వైసీపీ లో చేరిన తరువాత నాని గారి నోటికి రెక్కలు వచ్చినంత పనైంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా చంద్రబాబుపై విమర్సలు గుప్పిస్తూనే ఉన్నాడు.   ఇక చాలా ఆశతోనే వైసీపీ పార్టీలో చేరిన నానికి పాపం షాక్ తగిలింది. ఇంకేముంది టీడీపీ ఓడిపోతుంది.. వైసీపీ గెలుస్తుంది.. అని అనుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయింది. టీడీపీ గెలిచింది. దాంతో నాని మంత్రి ఛాన్స్ మిస్ అయిపోయింది. ఇంకేం చేస్తాడు.. పాపం ఆ కోపంతో... నాని స‌హ‌నం కోల్పోయి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా చంద్ర‌బాబును, టీడీపీని ప‌దే ప‌దే టార్గెట్‌గా చేసుకుని..తీవ్ర‌మైన ప‌దజాలం కూడా వాడుతున్నారు. అయితే నానిని టార్గెట్ చేసేందుకు కొద్ది రోజులుగా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ స్పెష‌ల్ ఆప‌రేష‌న్ చేస్తున్నారు. ఇది కొంత వరకూ సక్సెస్ కూడా అయింది. దీనిలోభాగంగానే.. వైసీపీ మునిసిప‌ల్ చైర్మ‌న్ య‌ల‌వ‌ర్తి శ్రీనివాస‌రావు టీడీపీలోకి జంప్ చేసేశారు. ఆయ‌న పార్టీ మార‌డంతో నానికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ త‌ర్వాత ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన గుడివాడ మునిసిపాలిటీ కౌన్సెల‌ర్ ఉప ఎన్నిక‌ల్లో కూడా నాని ద‌గ్గ‌రుండి మ‌రీ ప్ర‌చారం చేసి కోట్లు గుమ్మ‌రించినా వైసీపీ ఓడిపోయింది. తాజాగా మరో షాక్ తగిలింది. ఈ రోజు మునిసిప‌ల్ ప్ర‌తిప‌క్ష నేత చోర‌గుడి ర‌వికాంత్ టీడీపీలో చేరారు. దీంతో నానికి దిమ్మతిరిగిపోయింది. అంతేకాదు.. వైసీపీలోని కిందిస్థాయి నాయకులను కూడా టీడీపీలోకి రప్పించేందుకు అధినాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. మరి ముందు ముందు నానికి ఇంకెన్ని షాకులు తగులుతాయో చూడాలి.

పీకే పై పీకే సర్వే...జనసేన ఉందనే తెలీదట...

  ఈ మధ్య రాజకీయ పార్టీలు ఎలా తయారయ్యాయంటే.. తమ పార్టీల మీద కాన్సన్ ట్రేషన్ కంటే.. పక్క పార్టీల మీద కాన్సన్ ట్రేషన్ పెరిగిపోయింది. పక్క పార్టీల వాళ్లు ఏం చేస్తున్నారు.. వారికి ప్రజల మద్దతు ఎంత ఉంది.. ఇలా అన్నింటిమీద దృష్టిపెడుతున్నారు. దీనిలో భాగంగానే వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ ఓ సర్వే చేసిందట. అది కూడా ఎవరి మీదో కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై. అదేంటీ టీడీపీని వదిలేసి పవన్ పై చేయడం ఏంటి అనుకుంటున్నారా..? అక్కడే ఉంది మరి లాజిక్..   గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్, టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు పలికిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే ఆయన పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచింది. ఓ రకంగా టీడీపీ-బీజేపీ గెలవడంలో పవన్ కీలక పాత్ర పోషించారన్న మాట వాస్తవమే. దీంతో పవన్ కింగ్ మేకర్ అయ్యాడు. అయితే నంద్యాల, కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం పవన్ సహాయం లేకుండానే టీడీపీ ఘన విజయం సాధించింది. దీంతో రాబోయే ఎన్నికల్లో  పవన్ ప్రభావం ఏమిటి? ఆయన ప్రభావం ఎంత వరకూ ఉంటుంది అనే దానిపై ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ పరిశోధించిందట. ఈ పరిశోధనల్లో ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి తెలిసిందట. అదేంటంటే.. ఇంత వరకూ జనసేన అనే పార్టీ ఒకటి ఉందనేది రూరల్ ఆంధ్రాలో తెలీనే తెలియదట. పవన్ కల్యాణ్ పార్టీ గురించి  పేపర్లు, వెబ్ సైట్లు రాసుకోవడం, సోషల్ మీడియాలో పెయిడ్ పేజెస్ రన్ కావడమే కానీ.. సామాన్య ప్రజానీకానికి పవన్ పార్టీ ఒకటుందనేది తెలీదనేది.. ప్రశాంత్ కిషోర్ సర్వే ఫీడ్ బ్యాక్. అంతేకాదు.. ప్రస్తుత పరిస్థితే ఉంటే మాత్రం పవన్ కల్యాణ్ రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగానూ ప్రభావితం చేయలేదని ప్రశాంత్ కిషోర్ తేల్చేశారు.   మరి తమ పార్టీ సంగతి పక్కన పెట్టి పక్కన పార్టీ గురించి సర్వే చేయడం కామెడీగా ఉంది. పక్కన పార్టీ మీద పెట్టినంద శ్రద్ద.. ముందు తమ పార్టీలో ఉన్న వారు పక్క పార్టీలోకి పోకుండా చూసుకునే దానిపై పెడితే బావుండేది. అయినా సర్వేలపై ఆధారపడి రాజకీయాలు నడపడం అనేది చాలా కష్టం. ఎందుకంటే.. సర్వేలు కూడా ఒక్కోసారి మారిపోయి.. రాజకీయ నేతల తలరాతలే మారిపోయిన రోజులు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ ఈ విషయం తెలుసుకుంటే వారికే మంచిది.

ఇంత కామెడీ తట్టుకోలేరు.. మోకాలికి బోడిగుండుకు లింకు పెట్టకండి..

  గుజరాత్ ఎలక్షన్స్ లో గెలిచినా... మోడీ, అమిత్ షా లాంటి పెద్ద వాళ్లే కాస్త ఆలోచించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే.. ఈ ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అంత ఈజీగా రాలేదన్న సత్యం వాళ్లకు తెలుసు కాబట్టి. చాలా, చాలా కష్టపడి.. గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇవన్నీ మరిచిపోయి.. గుజరాత్ ఫలితాలను బట్టి ఏపీలో బీజేపీ గురించి గొప్పలు చెప్పడం చూస్తుంటే కామెడీగా అనిపిస్తోంది. ఇంతకీ అంత కామెడీ చేస్తుంది ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరూ.. ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు. అయినదానికి, కాని దానికి మిత్రపక్షం అని కూడా చూడకుండా.. ఎప్పుడు సందు దొరుకుతుందా.. ఎప్పుడు విమర్శలు చేద్దామా అని చూసే సోము వీర్రాజు.. గుజరాత్ ఫలితాల్లో బీజేపీ గెలుపుపై మాట్లాడుతూ.. చంద్రబాబుపై తనకున్న అక్కసును మరోసారి వెళ్లగక్కారు.   ఏదో చచ్చీ చెడీ గుజరాత్ లో గెలిస్తే...మోకాలికి బోడిగుండుకు లింకు పెట్టినట్టు.. ఇక్కడ బీజేపీతో లింక్ పెట్టారు రాజు గారు. అంతేకాదు మాంచి కామెడీ డైలాగ్స్ కూడా వేశారు. ఏపీలో బలపడే శక్తి బీజేపీకి ఉందని, ఏపీలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రత్యేక హోదాను తెరపైకి తెస్తున్నారని అన్నారు. అక్కడితో ఆగకుండా.. తెలుగుదేశం పార్టీకి ధైర్యం ఉంటే బీజేపీతో పొత్తు వద్దని చెప్పాలని డైలాగ్స్ వేశారు. పాపం రాజుగారికి తెలియని విషయం ఏంటంటే... టీడీపీ లేకపోతే బీజేపీ ని ప్రజలు పట్టించుకోరని. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే.. కనీసం ఆ నాలుగు సీట్లైనా వచ్చాయి. లేకపోతే కాంగ్రెస్ కు, బీజేపీకి పెద్ద తేడా ఏం ఉండేది కాదు. ఇక ఇటీవల జరిగిన కాకినాడ కార్పొరేష‌న్‌లో బీజేపీకి 9 సీట్లు ఇస్తే గెలిచింది 3 సీట్లు మాత్రమే. అక్క‌డ కూడా బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు ఘోరంగా ఓడిపోయాడు. అది కూడా వీర్రాజు సొంత జిల్లాలో. కనీసం తన జిల్లాలోనే తమ నేతను గెలిపించుకోలేక పోయిన రాజుగారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కామోడీ కాకపోతే ఇంకేంటి.   ఇప్పటికే ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వం, మోడీ చేస్తోన్న అన్యాయంతో ఏపీ ప్ర‌జ‌లు మోడీ అన్నా, బీజేపీ అన్నా ర‌గిలిపోతున్నారు. ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేషస్, ఇలా ఒకటికాదు రెండు కాదు పలు అంశాల విషయంలో బీజేపీపై ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ చేసినా బాబు గారు చూస్తూ ఊరుకున్నా.. రాజు గారు మాత్రం రెచ్చిపోతున్నారు. మరి ఆయన ఇలాగే రెచ్చిపోతే బీజేపీకి తప్పక నష్టం జరగకమానదు. ఏపీలో బీజేపీ నాయ‌కుడు అనేవాడు ఎవ‌రైనా జ‌నాల్లోకి వెళితే వాళ్లు జ‌నాగ్ర‌హానికి ఎలా గుర‌వ్వాల్సి ఉంటుందో ? త్వ‌ర‌లోనే రాజుగారికి అర్ధమయ్యే టైం వస్తుంది. మొత్తానికి  ఏపీ బీజేపీలో మంచి కామెడీ టైమింగ్ ఉన్న లీడ‌ర్ దొరికాడు.

బాబు ముందు మోడీ తగ్గాల్సిందేనా!

  ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయన్న సామెత అన్ని విషయాల్లో ఏమో కానీ...రాజకీయాల్లో మాత్రం నిజమని నమ్మల్సి ఉంటుంది కొన్ని పరిస్థితులు చూస్తుంటే. గుజరాత్ ఎలక్షన్ ఫలితాలు చూస్తుంటే అలానే ఉంది. నిన్న మొన్నటివరకూ అధికారంతో ఎగిసిపడ్డ బీజేపీ ఒక్కసారిగా గుజరాత్ ఫలితాలు చూసిన వెంటనే.. గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సాంకేతికంగా అయితే గెలిచారు కానీ... మానసికంగా మాత్రం బీజేపీ ఓడిపోయింది. ఆ విషయం వారికి కూడా తెలుసు. అందుకే గెలిచిన ఆనందం అంతగా కనిపించడంలేదు.   ఉత్తర భారతదేశంలో ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో దాదాపు ఘన విజయం సాధించి బీజేపీకి తిరుగులేదనిపించింది. కానీ గెలిచినా ఒక్క గుజరాత్ ఫలితాలు మాత్రం మోడీ పూసాలు ఒక్కసారిగా కదిలించింది. తన సొంత రాష్ట్రమైన గుజ‌రాత్‌లోనే బీజేపీ చ‌చ్చీ చెడీ గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిని బట్టి మోడీకి పరిస్థితి ఏంటో అర్ధమైపోయి ఉంటది. ఇక పంజాబ్‌లో జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా బీజేపీ చావు దెబ్బ‌తింది. రేపు క‌ర్ణాట‌క‌లోనూ ఇదే కొనసాగే పరిస్థితి.   మరి ఇప్పటివరకూ దక్షిణ భారత దేశంపై తమ పెత్తనాన్ని చూపిస్తూ... చిన్న చూపు చూస్తున్న మోడీపై గుజరాత్ ఎన్నికల ఫలితాల ప్రభావం పడుతుందా అంటే.. ఖచ్చితంగా పడుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ పేరు చెపితే ఒక్క క‌ర్ణాట‌క‌లో మిన‌హా మ‌రే రాష్ట్రంలోను ఆ పార్టీకి చెప్పుకునేందుకు ఏమీ లేదు. ఇక తెలంగాణ‌లో ఇప్పుడున్న ఐదు ఎమ్మెల్యే సీట్లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిల‌బెట్టుకునే ప‌రిస్థితి లేదు. ఇక త‌మిళ‌నాడులో జ‌య‌ల‌లిత మృతి త‌ర్వాత కేంద్ర ప్ర‌భుత్వం అక్క‌డ రాజ‌కీయాల మ‌ధ్య వైష‌మ్యం క్రియేట్ చేసేందుకు చేసిన ప్ర‌య‌త్నాలను త‌మిళ జ‌నాలు తీవ్రంగా వ్య‌తిరేకించారు.   అన్నింటికంటే ముఖ్యంగా... ఏపీలో టీడీపీ లేక‌పోతే బీజేపీ లేనట్టే.. అది అందరికీ తెలిసిందే. ఏదో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ నాలుగు సీట్లు అయినా వచ్చాయి కానీ.. లేకపోతే బీజేపీకి అంత సీన్ లేదు. ఏదో ఈ మధ్య సౌత్ లో గెలిచినందుకు కాస్త రెచ్చిపోయారు. దానికి నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలిచి బాబు గట్టిగా సమాధానం చెప్పారు. దాంతో బీజేపీ తోక ముడిచింది. మిత్రపక్షలన్న పేరుకే కానీ... తమ అధికార అహంకారంతో మిత్ర‌ప‌క్షాలను కూడా అణ‌గ‌దొక్కే ప్రయత్నం చేశారు ఇప్పటివరకూ. ఇక గుజరాత్ దెబ్బ‌తో ఇప్పుడు ఆ పప్పులేం ఉడకవని తేలిపోతుంది. మోడీ ఏపీలో చంద్ర‌బాబు లాంటి న‌మ్మ‌క‌మైన మిత్రుల‌కు జీ హుజూర్ అన‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. పోనీలే అని ఎన్ని విమర్శలు చేసినా.... ఏం మాట్లాడకుండా ఉంటున్న చంద్రబాబుది చేతకాని తనంగా చూస్తున్నారు... సోము వీర్రాజు లాంటి వాళ్లు. ఏదో చచ్చీ చెడీ గెలిచినా.. తామేదో ఘన విజయం సాధించినట్టు మాట్లాడే సోము వీర్రాజు లాంటి నోళ్లకి ఇప్పుడున్న పరిస్థితిలో మోడీ తాళం వేయకపోతే... భవిష్యత్తులో చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మరి. మొత్తానికి గుజరాత్ మోడీ తలరాతనే మార్చేలా కనిపిస్తోంది. చూద్దాం... ముందు ముందు ఏం జరుగుతుందో...

గుజరాత్ ఫలితాలు.. తలరాత మార్చిన "నోటా"..

  గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ సంగతి పక్కన పెడితే, గుజరాత్ ఫలితాలు మాత్రం బీజేపీకి చుక్కలు చూపించాయి. అసలు ఏం జరుగుతుందో కూడా ఎవ్వరిక అర్ధంకాని పరిస్థితిలో ఎన్నికలు ఫలితాలు వచ్చాయి. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో విజయం పరంపర కొనసాగించిన బీజేపీకి, గుజరాత్ ఎన్నికల్లో గెలుపు మాత్రం అంత ఈజీగా దక్కలేదు. ప్రతిపక్ష పార్టీని తక్కువగా అంచనా వేశారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి పోటా పోటీగా నిలిచింది. అందుకే బీజేపీ కేవలం 99 సీట్లు మాత్రమే దక్కించుకోవాల్సి వచ్చింది. ఇక కాంగ్రెస్ అయితే గత కొన్ని ఏళ్లుగా ఉన్న రికార్డును చెరిపి...గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలిచింది.   ఇక ఈ ఎన్నికల ఫలితాలు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం హీరో అయ్యాడు. బీజేపీపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకొని రాహుల్ ప్రసంగాల్లో పస పెంచడం వల్ల గట్టి పోటీనే ఎదురైంది. రాహుల్ కు తోడుగా.. పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హార్ధిక్ పటేల్.. ఇంకా ఓబీసీ రిజర్వేషన్ల కోసం అల్పేశ్‌ ఠాకూర్‌, దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ జిగ్నేష్‌ మెవాని అందరూ మోడీకి వ్యతిరేకంగా ప్రచారాలు చేసినవారే. దీంతో ఏదో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు.. గెలిచింది కానీ.. ఆ సంతోషం అయితే బీజేపీ నేతలకు లేదన్న విషయం అర్దమైపోతుంది. కానీ పైకి ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అంతే.   అంతేకాదు ఈ ఎన్నికల ఫలితాల్లో ఇంకో షాకింగ్ విషయం బయటపడింది. నోటా వల్ల కూడా రాజకీయ నేతల తలరాతలు మారిపోతాయన్న విషయం మరోసారి బయటపడింది. ఈ ఎన్నికల్లో కొందరి నేతల కంటే అత్యధికంగా నోటాకే ఓట్లు వచ్చాయట. మొత్తం 5 లక్షల 42వేల 196 ఓట్లు నోటాకే పడ్డాయట. అంటే గుజరాత్‌లో 2 శాతం ఓట్లు నోటాకే పడ్డాయి. ఇంకా అశ్చర్యకరమైన విషయం ఏంటంటే... బీఎస్‌పీ..ఎన్‌సీపీ పార్టీల నేతలు..ఇండిపెండెంట్‌ అభ్యర్థుల కంటే కూడా నోటాకే ఎక్కువగా ఓట్లు రావడంతో నేతలు షాకవుతున్నారు. ఈ నోటాని ఎక్కువగా ఉపయోగించుకున్న వారిలో ఎక్కువ మంది మెజారిటీ యంగ్ గుజారాతీలు అని తెలిసింది…యంగ్‌ పటీదార్‌ ఓటర్లు కూడా నోటాకే ఎక్కువగా ఓట్లు వేసినట్టు తెలిసింది. మొత్తానికి నోటా నేతల రాతలతో ఒక ఆట ఆడుకుంది అనే చెప్పాలి.

అమూల్ బేబీలా నువ్వు కూడా ఏంటి కేటీఆర్...

  సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎవరి అభిప్రాయాలను వారు పంచుకునే స్వాతంత్ర్యం వచ్చింది. ఏం జరిగినా.. జరుగుతున్నా ఒక్క సోషల్ మీడియాను ఫాలో అయితే చాలు...అన్ని విషయాలు తెలిసినట్టే. కంటెంట్ కాస్త వెరైటీగా ఉండాలే కానీ... చూడటానికి జనాలు రెడీగా ఉన్నారు. అయితే ఇది ఒక్కోసారి వర్కవుట్ అవుతుంది.. కానీ.. కొన్ని సార్లు మాత్రం బుక్కవ్వాల్సి వస్తుంది. ఇలాంటి విషయాల్లో సామాన్యుల సంగతేమో కానీ.. కాస్త ప్రముఖులు, రాజకీయ నేతలు లాంటి వాళ్లయితే చాలా కష్టం. వారిని బద్నాం చేస్తారు నెటిజన్లు. ఇప్పుడు అలాగే బుక్కయ్యాడు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.   నిన్న గురజాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే కదా. ఇక కౌంటింగ్ మొదలైన దగ్గర నుండి అందరూ టెన్షన్ తోనే గడిపారు. క్షణక్షణానికి ఫలితాలు మారుతూ చెమటలు పట్టించాయి. ఇక ఈ ఎన్నికల ఫలితాలపై.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ ఓ ట్వీట్ చేశాడు. గుజరాత్ ఎన్నికల ఫలితాలకు సంబందించి టీవీల్లో వస్తున్న న్యూస్ పై.. గుజరాత్.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు తనను కన్ప్యూజ్ అయ్యేలా చేస్తున్నాయని ఓ ట్వీట్ ట్వీటారు.  ఏ ప్రాంతంలో ఎవరు ముందంజలో ఉన్నారో.. ఎవరు వెనుకంజలో ఉన్నారో తనకు అస్సలు అర్థం కావటం లేదన్నారు. అంతే.. ఆయన చేసిన ట్వీట్ పెద్ద కామెడీగా మారింది నెటిజన్లకు. కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన కొందరు టీవీని స్విచాఫ్ చేయాలని అన్నారు. ఇంకా.. అన్నింటిని వదిలేసి ఈసీ ఫలితాల్ని ఫాలో కావాలన్నారు. ఎందుకు.. గంట.. రెండు గంటలు ఏదైనా పనిలో బిజీగా ఉంటే సరిపోతుంది కదా? అని మరికొందరు ఇలా కేటీఆర్ ట్వీట్ కు పంచ్ ల మీద పంచ్ లో వేశారు.   నిజానికి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో... ప్రజలు ఎవరిని అధికారంలో కూర్చోబెడతారో ఊహించడం చాలా కష్టం. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం చాలా చూశాం. అలాంటిది.. ఎన్నికల ఫలితాలప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్, టెన్షన్ అందరికీ ఉంటుంది. ఎందుకంటే.. రిజల్ట్ విడుదలయ్యే వేళ.. ఒక్కో మీడియా ఒక్కో అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటుంది. ఎవరి స్టైల్ వారిదే. కొందరు ఈసీ అధికారికంగా వెల్లడించిన సమాచారాన్ని మాత్రమే టెలికాస్ట్ చేస్తుంటారు.  ఇంకొంకదు ఇంకోలా. ఇలాంటి విషయాలన్నీ మీడియాలోని వారికి.. కేటీఆర్ లాంటి అన్ని తెలిసిన నేతలకు బాగా తెలిసిన విషయాలు. ఇన్ని తెలిసిన తర్వాత కూడా అమాయకంగా అమూల్ బేబీ మాదిరి గుజరాత్ ఫలితాలు కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయంటూ పోస్ట్ పెట్టటం చాలా కామెడీగా ఉందంటున్నారు. మొత్తానికి మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ఫ్యూచర్ లీడర్ గా తన ఇమేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్న కేటీఆర్... ఏదో కాసేపు సైలెంట్ గా ఉంటే సరిపోయేది. అలాకాకుండా.... ఇలాంటి ట్వీట్లు చేస్తే ఇలానే రియాక్ట్ అవుతారు. ఇది కేటీఆర్ కూడా అర్ధమయ్యే ఉంటుంది.