విశాఖలో సన్ ఇంటర్నేషనల్ రూ.150 కోట్ల ఇన్వెస్ట్ మెంట్
posted on Nov 16, 2025 @ 1:50PM
విశాఖ వేదికగా జరిగిన భాగస్వామ్య సదస్సు సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సదస్సులో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకుంది. అందులో భాగంగానే సన్ ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్ మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం మేరకు సన్ ఇన్ టర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్ మెంట్ 150 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖలో తమ మేనేజ్ మెంట్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.
ఈ మేరకు సన్ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్ మెంట్ చైర్మన్ జాస్తి శ్రీకాంత్ ఏపీ ప్రభుత్వ ఆర్థిక అభివృద్ధి బోర్డుతో మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ పై సంతకం చేశారు. ఈ ఒప్పందం మేరకు 150 కోట్ల రూపాయల ఇన్ వెస్ట్ మెంట్ తో తమ సంస్థ ఏర్పాటు చేయనున్న మేనేజ్ మెంట్ ఇనిస్టిట్యూట్ ద్వారా దాదాపు రెండు వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ఒప్పందం మూడు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది.
ఈ ఒప్పందం మేరకు సన్ ఇన్ టర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్ మెంట్ విశాఖలో హోటల్ ప్రాజెక్టుల అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డు శాఖల నుంచి హోటల్స్ రంగంలో అవసరమైన అనుమతులు, ఆమోదాలు, క్లయరెన్స్ ల విషయంలో సహకారం అందిస్తుంది. అలాగే హోటల్ రంగం అభివృద్ధి నిర్దిష్ట కాలవ్యవధిలో ఎలాంటి ఆటంకాలూ సజావుగా సాదేందుకు దోహదం చేస్తుంది.