పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్‌ఐఏ ఛార్జిషీట్ దాఖలు
posted on Dec 15, 2025 @ 7:27PM
పహల్గామ్ ఉగ్రదాడి కేసులో పాకిస్థాన్‌కు చెందిన లష్కర్-ఈ-తోయిబా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రసంస్థతో పాటు మరో ఆరుగురు నిందితులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోమవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. పాక్ కుట్ర, నిందితుల పాత్రలు, ఆధారాలతో కూడిన ఈ ఛార్జిషీట్‌లో నిషేధిత ఉగ్రసంస్థను ఒక చట్టబద్ధ సంస్థగా గుర్తించి, పహల్గామ్ దాడిని ప్రణాళికాబద్ధంగా రూపొందిం చడం, సహకరిం చడం, అమలు చేయడంలో వారి పాత్ర ఉందని ఎన్‌ఐఏ పేర్కొంది.
పాక్ మద్దతు తో జరిగిన ఈ ఉగ్రదాడిలో మత ఆధారిత లక్ష్య హత్యలు చోటు చేసుకోగా, 25 మంది పర్యాటకులు, ఒక స్థానిక పౌరుడు ప్రాణాలు కోల్పో యారు.1,597 పేజీలతో కూడిన ఈ ఛార్జిషీట్‌ను జమ్మూలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేశారు. ఇందులో పాకిస్థాన్ హ్యాండ్లర్ ఉగ్రవాది సజీద్ జట్ పేరును కూడా నిందితుడిగా చేర్చారు. అలాగే, 2025 జూలైలో శ్రీనగర్‌లోని డాచిగాం ప్రాంతంలో ‘ఆపరేషన్ మహాదేవ్’లో భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదుల పేర్లను కూడా ఛార్జిషీట్‌లో పొందుపరి చారు.
వారు ఫైసల్ జట్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ జిబ్రాన్, హమ్జా అఫ్గానీగా గుర్తించారు. తో పాటు పై నలుగురు ఉగ్రవాదులపై భారతీయ న్యాయ సంహిత, ఆయుధాల చట్టం–1959, అక్రమ కార్య కలాపాల నివారణ చట్టం 1967 కింద అభియోగాలు నమోదు చేశారు. అంతేకాకుండా, భారత్‌పై యుద్ధం ప్రకటించిన నేరం కింద కూడా శిక్షార్హ సెక్షన్లను ఎన్‌ఐఏ ప్రయోగించింది. గత దాదాపు ఎనిమిది నెలల పాటు సాగిన శాస్త్రీయ, సుదీర్ఘ దర్యాప్తులో కేసులోని ఉగ్ర కుట్ర పాకిస్థాన్ నుంచే రూపుదిద్దుకున్నదని ఎన్‌ఐఏ తేల్చింది.
భారత్‌పై నిరంతరం ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతిస్తున్నట్లు ఆధారాలతో వెల్లడించింది.ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఆరోపణలపై 2025 జూన్ 22న అరెస్టయిన పర్వైజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ జొథాత్ద్‌లపై కూడా ఛార్జిషీట్ దాఖలైంది. విచారణలో వారు దాడిలో పాల్గొన్న ముగ్గురు ఆయుధధారుల వివరాలు వెల్లడించడంతో పాటు, వారు నిషేధిత ఉగ్రసంస్థకు చెందిన పాకిస్థాన్ పౌరులేనని నిర్ధా రించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది.