Home

»

Latest News

Dragon Intro Song: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్‌.. డ్రాగన్ ఊరమాస్ ఇంట్రో సాంగ్ లోడింగ్!

Jun 16, 2026 12:47PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'డ్రాగన్' (Dragon) నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు సోషల్ మీడియాను షేక్ చేసిన 'దేవర' సినిమాలోని 'ఫియర్ సాంగ్' హంగామాను అభిమానులు ఇక పక్కన పెట్టేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే, అంతకు మించిన ఒక పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ ఇంట్రో సాంగ్‌ను 'డ్రాగన్' చిత్రం కోసం మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. 

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండటంతో ఈ ఇంట్రో సాంగ్ ఏ రేంజ్‌లో ఉండబోతోందోనని ఇండస్ట్రీ వర్గాలతో పాటు నందమూరి అభిమానుల్లో అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రవి బస్రూర్ మార్క్ ఊరమాస్ బీట్స్ ఎన్టీఆర్ ఎనర్జీకి తోడైతే థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అని చెప్పొచ్చు.

ఈ క్రేజీ సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రస్తుతం లాక్ అయింది. రాబోయే జూలై నెలలో శ్రీలంకలోని అందమైన, వైవిధ్యభరితమైన లొకేషన్లలో ఈ పాటను చాలా గ్రాండ్‌గా చిత్రీకరించనున్నారు. కేవలం ఇంట్రో సాంగ్ మాత్రమే కాకుండా, సినిమాలోనే అత్యంత కీలకమైన, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా అదే షెడ్యూల్‌లో శ్రీలంకలోనే ప్లాన్ చేశారు. ఈ ఫైట్ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇదొక బెస్ట్ యాక్షన్ బ్లాక్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. పాటతో పాటు ఈ ఫైట్ సీక్వెన్స్‌ను కూడా జూలై నెలలోనే పూర్తి చేసి, సినిమా మేజర్ టాకీ పార్ట్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com