Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాదం బంక తింటే ముఖం మీద మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుందా? నిజం ఏమిటంటే..!
posted on: Jun 15, 2026 3:07PM

ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. చర్మాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి రకరకాల ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయితే, ఈ ఉత్పత్తులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. ఈ సమస్యను చాలామంది ఎదుర్కుంటూ ఉంటారు. కానీ ముఖం మీద మొటిమలు తగ్గాలన్నా, గొండ్ కటీరా లేదా బాదం బంక చాలా బాగా పనిచేస్తుందని అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
ఖరీదైన ఉత్పత్తులు ఎందుకు పనిచేయవంటే..
ఖరీదైన ఉత్పత్తులు చర్మంపై ఎందుకు పనిచేయడం లేదని చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. దానికి సమాధానం ఏమిటంటే ఆ ఉత్పత్తులలో అనేక రకాల రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలను తరచుగా చర్మానికి మేలు చేయడానికి కలుపుతారు, కానీ అవి ప్రయోజనాలను అందించడానికి బదులుగా హాని కలిగించే అవకాశం ఎక్కువ.
బాదం బంక ఎలా పనిచేస్తుందంటే..
శరీరంలో వేడి చర్మంపై ఎర్రటి బొబ్బల రూపంలో కనిపిస్తుంది. దీన్ని తగ్గించడానికి బాదం బంకను ఉపయోగించవచ్చు. బాదం బంకను రాత్రంతా నానబెట్టాలి. ఉదయం పూట, ఆ స్ఫటికాలు జెల్లీలా కనిపిస్తాయి. దీనికి కొంచెం చల్లటి నీరు కలపాలి. ఇప్పుడు సగం నిమ్మకాయ రసాన్ని కలపాలి. ఈ పానీయాన్ని తాగాలి. దీనిని 3 నుండి 4 రోజుల పాటు తాగడం వల్ల ఫలితాలు కనిపిస్తాయి.
బాదం బంక ప్రయోజనాలు..
బాదం బంక తినడం వల్ల శరీరం సహజంగా చల్లబడుతుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది, దాని వృద్ధాప్యాన్ని నెమ్మదించే లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేస్తుంది. మొటిమలు, ముడతలు, ఎండదెబ్బ వంటి సమస్యలను తగ్గించగలదు. దీని ఫలితంగా కాంతివంతమైన , యవ్వనమైన చర్మం లభిస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
*రూపశ్రీ.






