2015: A bad year of Tollywood
Publish Date:Dec 30, 2015
ఫన్ బక్కెట్ కామెడీ - 13
Publish Date:Dec 28, 2015
‘సౌఖ్యం’ సక్కుబాయి రివ్యూ
Publish Date:Dec 27, 2015
ఈవారం మీ గ్రహబలం
Publish Date:Dec 27, 2015
ఫన్ బక్కెట్ -12
Publish Date:Dec 24, 2015
2015 టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ ఇవే...
Publish Date:Dec 23, 2015
సైనా కేరెక్టర్లో అలియా భట్?
Publish Date:Dec 23, 2015
2015... టాప్ 10 ఫ్లాపులివే...
Publish Date:Dec 23, 2015
టాలీవుడ్ ఐరన్‌లెగ్స్ ఎవరంటే...
Publish Date:Dec 23, 2015
‘భలే మంచి రోజు’ గురించి ప్రభాస్...
Publish Date:Dec 21, 2015
ఈవారం గ్రహబలం
Publish Date:Dec 21, 2015
ఈవారం మీ గ్రహబలం ఇదిగో...
Publish Date:Dec 13, 2015
త్రిషా... నువ్వు సూపరు...
Publish Date:Dec 12, 2015
హద్దులు దాటుతున్న రాం గోపాల్ వర్మ వ్యాఖ్యలు
Publish Date:Dec 3, 2015
ఈవారం మీ గ్రహబలం తెలుసుకోండి
Publish Date:Nov 29, 2015
ఇదిగో మీ గ్రహబలం
Publish Date:Nov 22, 2015
ఈవారం మీ గ్రహబలం
Publish Date:Nov 8, 2015
‘త్రిపుర’ వీడియో రివ్యూ
Publish Date:Nov 6, 2015
Veteran actress Manorama passes away
Publish Date:Oct 11, 2015
ఏపీలో ఏం జరగబోతోంది? రాజ్యాంగ సంక్షోభం తప్పదా?
స్థానిక సంస్థల ఎన్నిక అంశం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపుతోంది. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం.. తన పని తాను చేసుకుపోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్థానిక సంస్థల ఎన్నికలకూ సహకరించేది లేదని చెబుతోంది వైసీపీ ప్రభుత్వం. రాజ్యాంగ బద్ద ఎన్నికల సంఘానికి రాష్ట్ర సర్కార్ సహకరించకపోతే తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో ఎన్నికల కమిషనర్, ఏపీ సర్కార్ వివాదం ఎటు వైపు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. షెడ్యూల్ విడుదలయ్యాక ఎన్నికలను వాయిదా వేసిన సందర్భా లు మన రాష్ట్రంలో తప్ప దేశంగా ఇంతవరకు ఎక్కడా జరగలేదని చెబుతున్నారు. కరోనా కారణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గత మార్చిలో వాయిదా వేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్ రెడ్డి సర్కార్ కోర్టుకెళ్లినా.. ఎస్ఈసీ నిర్ణయాన్నే సుప్రీంకోర్టు సమర్థించింది. షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగమంతా ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుంది. ఎన్నికలు వాయిదా వేయాలన్నా, నిలిపివేయాలన్నా.. ఎస్ఈసీ చేతిలోనే ఉంది. రెండేళ్ల కింద పశ్చిమ బెంగాల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ఎస్ఈసీకి వ్యతిరేకంగా ఆ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టు కు వెళ్లింది. అయితే రాజ్యాంగంలోని 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక ఎన్నికలు సకాలంలో జరగాల్సిందేనని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇటీవల కేరళ స్థానిక ఎన్నికల విషయంలోనూ జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేయడంతో ఈ నెల 9వ తేదీ నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్రప్రభుత్వ యంత్రాంగమంతా ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చినట్లయింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. అయితే జగన్ ప్రభుత్వం ఇందుకు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని అధికార యంత్రాంగాన్ని కూడా వారు ఆదేశించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రాజ్యాంగ సంక్షోభ పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. కేంద్ర ఎన్నికల కమిషన్‌తో సమాన అధికారాలు కలిగి ఉంది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఎన్నికల ప్రక్రియకు సహకరించని ఉద్యోగులు, అధికారులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకోవచ్చని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఏపీ సర్కార్ తీరుతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దూకుడుగా వెళ్లే అవకాశాలే కన్పిస్తున్నాయి. గత ఏడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో విఫలమయ్యారంటూ గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేయాలని, ఓ సీఐను సస్పెండ్ చేయాలని అప్పట్లో ప్రభుత్వాన్ని ఎస్ఈసీ ఆదేశించింది. అయితే రాష్ట్రప్రభుత్వం పట్టించుకోలేదు. గుంటూరు రూరల్ ఎస్సీని మాత్రం ఇటీవల బదిలీ చేశారు. దీంతో కమిషనర్ నిమ్మగడ్డ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు తాజాగా లేఖ రాశారు. ఎస్ఈసీ ఆదేశాలను అమలు చేయాలని, ఆ అధికారులను బదిలీ చేయాలని మరోసారి గుర్తుచేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించే తీరును బట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు ఉంటాయని అంటున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు కొందరు ఎస్ఈసీపై విమర్శలు చేశారు. . ఎన్నికలకు సహకరించబోమని కొంత మంది ఉద్యోగ నేతలు ప్రకటించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎస్ఈసీ వారిపై చర్యలు తీసుకునే అవకాశముందంటున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఉద్యోగులంతా తన పరిధిలోకి వచ్చినందున.. గీత దాటిన ఉద్యోగ సంఘాల నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎస్ఈసీ పరిశీలిస్తోందని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీకి రాష్ట్ర యంత్రాంగం సహకరించకపోతే ఏం జరగబోతుందన్న చర్చ ఏపీలో జోరుగా జరుగుతోంది. ఎస్ఈసీ తనకున్న అధికారాలను వినియోగించి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని.. ఈ ఆదేశాలను అమలు చేయకుంటే గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అదే జరిగితే రాజ్యాంగ బద్ధ విధుల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైనట్లు అవుతుందని.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి సీటుపై పంచాయితి! కుటుంబ సభ్యులతో కేసీఆర్ కు తలనొప్పి?
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో కోల్డ్ వార్ నడుస్తుందా ? పదవుల విషయంలో కేటీఆర్, కవిత ఢీ అంటే ఢీ అంటున్నారా? పాలనలో మార్పులకు సిద్దమైన కేసీఆర్ వెనక్కి తగ్గడానికి కారణం ఏంటీ? ఇవే ఇప్పుడు తెలంగాణతో పాటు టీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. పదవుల విషయంలో కేటీఆర్, కవిత మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని చెబుతున్నారు. ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్ కూడా ఏమి చేయలేకపోతున్నారని చెబుతున్నారు. అందుకే పాలనలో ప్రక్షాళనకు సిద్దమైన గులాబీ బాస్.. ఇప్పుడా ప్రయత్నాలను విరమించుకున్నారని సమాచారం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్.. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు. కీలకమైన మున్సిపల్, కమర్షియల్, ఐటీ శాఖల మంత్రిగా ఉన్న కేటీఆర్.. పాలనలో అంతా తానే వ్యవహరిస్తున్నారనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. విదేశీ రాయబారులు, పెట్టుబడిదారులు, ఇతరత్రా ప్రముఖులు కూడా ప్రగతి భవన్ లో కేటీఆర్ తోనే సమావేశమై చర్చిస్తున్నారు. బదిలీలు, ప్రమోషన్లు, పోస్టింగులన్ని కేటీఆర్ చెప్పినట్లే సాగుతుండటంతో ఉన్నతాధికారులంతా కేసీఆర్ కంటే కేటీఆర్ కే ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నారు. షాడో ముఖ్యమంత్రిగా విమర్శలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలని కేసీఆర్ భావించారట. అయితే తన పదవిపై క్లారిటీ ఇవ్వాలని కవిత కోరుతుండటంతో ఇంట్లో గొడవ జరుగుతుందని తెలుస్తోంది. 2014లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు కల్వకుంట్ల కవిత. ఆ సమయంలోనే మోడీ ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరుతుందని, కవితకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగింది. కాని ఎందుకో అది జరగలేదు. 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎవరొచ్చినా కవితకు కేబినెట్ బెర్త్ ఖాయమనుకున్నారు. కాని అనూహ్యాంగా ఆమె ఎంపీగా ఓడిపోయారు. దీంతో షాకైన కవిత.. దాదాపు ఏడాది పాటు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. దీంతో కవితను రాజ్యసభకు పంపించి మళ్లీ యాక్టివ్ చేస్తారని, అవసరమైతే కేంద్ర కేబినెట్ లో చేరుస్తారని చర్చ జరిగినా.. అది కూడా జరగలేదు. కేటీఆర్ వ్యతిరేకించడం వల్లే కవితను రాజ్యసభకు పంపలేదని టీఆర్ఎస్ లోనే చర్చ జరిగింది. కవిత కేంద్ర మంత్రి అయితే .. తర్వాత సీఎం రేసులో ఆమె తనకు పోటీగా వస్తారని భావించడం వల్లే కేటీఆర్ ఆమెకు మద్దతు ఇవ్వలేదనే ప్రచారం జరిగింది. అప్పటి నుంచి కేటీఆర్ ,కవిత మధ్య గ్యాప్ వచ్చిందంటున్నారు. ఇటీవలే నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించింది కవిత. ఆమె ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు ఖాయమన్న చర్చ మొదలైంది. ఇక్కడే కేసీఆర్ కుటుంబలో అసలు సమస్య వచ్చిందంటున్నారు. ఇప్పటికే కేసీఆర్ కుటుంబానికి పదవులన్ని ఇచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జనాల్లోనూ అలాంటి చర్చే జరుగుతోంది. ఈ సమయంలో కవితను కేబినెట్ లోకి తీసుకుంటే మరిన్ని ఇబ్బందులు వస్తాయని కేసీఆర్ తో కేటీఆర్ వాదిస్తున్నారని చెబుతున్నారు. దీంతో కవితకు మంత్రివర్గంలో చోటుపై ఎటూ తేల్చుకోలేకపోతున్న కేసీఆర్.. కేబినెట్ ప్రక్షాళనకు వెనుకంజ వేస్తున్నారని భావిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు మంత్రులను తొలగించి కొత్త వారిని తీసుకోవాలని దాదాపుగా నిర్ణయించినా.. కవిత విషయం తేలకపోవడం వల్లే మంత్రివర్గ ప్రక్షాళన విషయాన్ని కేసీఆర్ పక్కన పెట్టారని టీఆర్ఎస్ నేతలే చెబుతున్నారు. తనకు మంత్రిపదవి రాకుండా కేటీఆరే అడ్డుకుంటున్నారన్న భావనలో ఉన్న కవిత.. ఇప్పుడు ముఖ్యమంత్రి సీటుపైనా పేచీ పెడుతున్నారని చెబుతున్నారు. కేటీఆర్ కు పాలనా పగ్గాలు ఇవ్వడానికి ఆమె అంగీకరించడం లేదని తెలుస్తోంది. అందుకే మార్చిలోపు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెబుతున్నా.. అలాంటిదేమి ఉండకపోవచ్చని తెలుస్తోంది. నిఘా సంస్థలు, సర్వేల పేర్లతో కొంత కాలం కేసీఆర్ సాగదీస్తారని చెబుతున్నారు. ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా కమలం కీలక నేతలు.. కేటీఆర్ కు ఇప్పట్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంత మాత్రం లేదని బల్లగుద్ది మరీ చెబుతున్నారని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. మొత్తంగా పదవుల విషయంలో కేసీఆర్ ఫ్యామిలీలో పెద్ద పంచాయతీ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మరీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి మరీ..
50 వేల కోట్ల విలువైన భూ వివాదానికి 80 ఏండ్ల చరిత్ర!
8 దశాబ్దాలు... 12 హత్యలు.. 80 సర్వే నెంబర్ .. 867 ఎకరాల ల్యాండ్ .. 50,000 కోట్ల రూపాయలు. హైదరాబాద్ లో సంచలనం బోయినపల్లి కిడ్నాప్ కేసుకు కారణమైన న్యూహఫీజ్‌పేట భూ వివాదం చరిత్ర ఇది. హఫీజ్‌పేట్ సర్వే నంబర్ 80లోని భూమి దశాబ్దాలుగా వివాదాల్లో ఉంది. కోర్టు కేసులతో కొనసాగుతూనే ఉంది. హత్యలు-ప్రతి హత్యలతో దాదాపు డజను మందిని ఈ భూమి బలిగొన్నది. దశాబ్దాల క్రితం రూ. వేలల్లో విలువ ఉన్నప్పుడు ప్రారంభమైన వివాదం.. ఇప్పుడు ఆస్తి విలువ వేల కోట్లకు చేరుకున్నా కొలిక్కి రాలేదు. శేరిలింగంపల్లి మండలం న్యూహఫీజ్‌పేట సర్వే నంబర్ 80లోని భూములపై ప్రభుత్వానికి, ప్రైవేట్ వ్యక్తులకు మధ్య మొదట వివాదం కొనసాగింది. మార్తాండ్‌నగర్ వెనుకవైపు, కొండాపూర్ అంతర్గత రహదారి మధ్యలో ఉన్న ఓ 40 నుంచి 50 ఎకరాల భూమి తమదేనంటూ దివంగత మాజీ మంత్రి భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి గతంలో చుట్టూ ప్రహరీ నిర్మించి రేకులతో ఫెన్సింగ్ వేశారు. భూముల చుట్టూ వేసిన ఫెన్సింగ్ రేకులపై తొలుత ఏవీ ఎస్టేట్స్ అని బోర్డులు పెట్టారు. ఆ తరువాత కొన్నేళ్లకు ఆ బోర్డులు తొలగించి కేపీ ఎస్టేట్స్ అని పేరు మార్చారు. ఈ బోర్డుల ప్రకారం ప్రస్తుతం కిడ్నాపునకు గురైన కె.ప్రవీణ్‌రావు పొజిషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు ఏవీ ఎస్టేట్స్‌గా ఉన్న పేరు ఆయన చనిపోయాక కేపీ ఎస్టేట్స్‌గా మారిందని స్థానికులు అంటున్నారు. హఫీజ్‌పేట్‌లోని 50 ఎకరాల భూమి తమదేనని మాజీ మంత్రి భూమా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భూమా కుటుంబాన్ని ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమపై ఏపీ, తెలంగాణలో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చెబుతున్నారు. తమ భూమిని కబ్జా చేసి మైహోమ్స్‌కు లీజ్‌కు ఇచ్చారని భూమా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వివాదం జరుగుతున్న హఫీజ్‌పేట స్థలంలో తనకు 40 శాతం వాటా ఉన్నట్లు పోలీసుల విచారణలో భూమా అఖిలప్రియ చెప్పినట్లు తెలిసింది. మిగతా భూమిలో 30 శాతం సుబ్బారెడ్డికి, మిగతా 30 శాతం ప్రవీణ్‌కు చెందుతుందని ఆమె వివరించినట్లు సమాచారం. నిజాం రాష్ట్ర రైల్వే నిర్మాణ సమయంలో ఇబ్రహీంపట్నం, పటాన్చెరు ప్రాంతాల్లో ఖుర్షీద్ జాహీ పాయ్‌గా, చావూస్, నవాబ్ వంశీయులకు చెందిన భూములను నిజాం ప్రభుత్వం సేకరించింది. ఆ ఆస్తులకు ప్రత్యామ్నాయంగా.. హఫీజ్‌పేట్ సర్వేనంబర్ 80, హైదర్‌నగర్‌లో భూములను కేటాయిస్తూ.. 1929లో ఏడో నిజాం మీర్-ఉస్మాన్ అలీఖాన్ ఫర్మాన్ జారీ చేశారు. జాగీర్దారీ వ్యవస్థ రద్దయ్యాక ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిపై 1958లో పాయ్‌గా వారసుల్లో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇంకొందరు తమ వాటా భూములను గ్రేటర్ గోల్కొండ వారసులకు అగ్రిమెంట్ చేశారు. ఆ సమయంలో నిజాం ప్రభువే ఈ భూమిని కొనుగోలు చేసినట్లు ఉన్న లింక్ డాక్యుమెంట్‌ను జత చేశారు. అప్పటినుంచే ఈ భూమిపై సీఎస్-14/1958 కేసు న్యాయస్థానంలో మొదలైంది. 1968 జూన్ 28న హైకోర్టు ఈ భూములపై ప్రిలిమినరీ డిక్రీని ఇచ్చింది. అయితే ప్రిలిమినరీ డిక్రీ వచ్చాక.. హక్కుదారులెవరూ భూములను స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రాలేదు. కొండలు, గుట్టలు, అడవి మాదిరిగా ఉన్న ఈ భూముల్లో అసైన్మెంట్ డీడ్ చేసుకునేందుకూ ఆసక్తి చూపలేదు. దాంతో. ఆ సర్వే నంబర్-80లోని భూములన్నీ సర్కారువేనని ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. ఈ మేరకు పలు కోర్టుల్లో అఫిడవిట్లు దాఖలు చేసింది. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో కూడా ఈ భూములన్నీ సర్కారువేనని పేర్కొంటూ వాటిని నిషేధిత జాబితాలో పెట్టింది. పాత ముంబై జాతీయ రహదారి, కొత్త ముంబై జాతీయ రహదారికి మధ్య ఈ ప్రాంతం వారధిగా ఉండడం.. కొండాపూర్‌లో 8వ బెటాలియన్ ప్రత్యేక పోలీసు బెటాలియన్ ఏర్పాటవడంతో పాయ్‌గా, చావూస్ వారసులు సర్వే నంబర్-80లోని భూముల్లో ఎవరికి వారుగా కాలనీలు, ప్లాట్లు ఏర్పాటు చేసి, విక్రయాలు సాగించారు. అలా 1983-84లో సుభాష్ చంద్రబోస్ నగర్ పేరుతో వెంచర్‌ను అభివృద్ధి చేసిన కబీరుద్దీన్ ఖాన్ రూ. 15లకు గజం చొప్పున భూములను విక్రయించారు. అదే సమయంలో.. ప్రేమ్‌నగర్, మార్తాండనగర్ పేరుతో ఇస్మాయిల్, పాయ్‌గా కాలనీ పేరుతో పాయ్‌గా వారసులు, మరికొన్ని పేర్లతో చావూస్ వారసులు ప్లాట్లను విక్రయించారు. 30.31 ఎకరాలను ఓ 30 మంది వ్యక్తులు క్లెయిమ్ చేస్తూ రాగా.. 116 ఎకరాలను బి.శివరామకృష్ణ, సి.కల్యాణ్, మరో వ్యక్తి, ముంబైకి చెందిన సైరస్ ఇన్వె్‌స్టమెంట్స్ క్లెయిమ్ చేస్తూ వచ్చింది. కొన్ని భూములు చేతులు మారుతూ వచ్చాయి. కొండాపూర్ ప్రాంతంలో 1990 తొలినాళ్లలో శిల్పారామం రావడం.. ఆ తర్వాత హైటెక్‌సిటీ నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో ఇక్కడి భూములకు డిమాండ్ పెరిగింది. దీంతో కోర్టుల్లో వివాదాలకు పరిమితమైన ఈ భూమి.. హత్యలు-ప్రతి హత్యలకు వేదికగా మారింది. ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాకుండా.. అధికార, ప్రతిపక్షాల నేతలు కబ్జాలకు పాల్పడ్డారు. 1989లో సాబేర్ చావూ్‌సను అతడి ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. సాబేర్ తండ్రి.. తన ప్రత్యర్థులపై బేగంబజార్‌లో బాంబుతో దాడి చేయించాడు. తుపాకీతో ఫైర్ చేయించారు. 1997లో రియల్టర్ హరిబాబు హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత మాదాపూర్‌లో అబూబకా్‌సను ప్రత్యర్థులు దారుణంగా చంపారు. ఇప్పుడు భూమా అఖిలప్రియ-ప్రవీణ్‌కుమార్ మధ్య వివాదంలో ఉన్న భూమిలో.. శేఖర్‌నాయుడు అనే రియల్టర్‌ను ప్రభాకర్‌రాయుడు అనే వ్యక్తి 2005లో హత్య చేయించాడు. ఆ తర్వాత ప్రభాకర్ రాయుడు పంజాగుట్టలో హత్యకు గురయ్యాడు. తాజాగా ప్రవీణ్‌కుమార్, అతడి సోదరుల కిడ్నాపయ్యారు. కొందరు రియల్టర్లల ఈ భూములను క్లెయిమ్ చేసుకోవడానికి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. తప్పుడు కేసులతో.. సెటిల్మెంట్ డిక్రీలు పొంది.. వాటి ఆధారంగా మ్యుటేషన్లు చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందినదని 2003లో సుప్రీంకోర్టు తేల్చిచెప్పడంతో వివాదం రాజుకుందంటున్నారు. ప్రవీణ్ రావు కిడ్నాప్ తో హఫీజ్ పేట భూములు మళ్లీ తెరపైకి రావడంతో కొత్త కొత్త విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య సంచలన ఆరోపణలు చేశారు. మియాపూర్, హఫీజ్ పేటలోని వేల కోట్ల రూపాయల విలువైన భూములు రాజకీయ నేతల కబ్జాల్లో ఉన్నాయన్నారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్. సినీ నిర్మాత సీ కల్యాణ్, ఐ సుదర్శన్ రావులు ఈ భూముల కబ్జా వెనక ఉన్న పెద్దలని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రికి భూకబ్జాల్లో పాత్ర ఉందని గాదె ఇన్నయ్య ఆరోపించారు. మెదక్, మహబూబ్ నగర్ , రంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 మంది వెలమ దొరలు.. 50 వేల కోట్ల విలువైన భూములను తమ చేతుల్లో ఉంచుకున్నారని గాదె ఇన్నయ్య సంచలన ఆరోపణలు చేశారు.
మనం వంటి మెమరబుల్ మూవీ తరువాత యువ సామ్రాట్ నాగచైతన్య, వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం థాంక్యూ. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో నాగచైతన్య సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తారని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. థాంక్యూ స్టోరీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల విడుదల సమయంలో థియేటర్ల దగ్గర కటౌట్ కట్టే స్థాయి నుంచి విదేశాల్లో బడా వ్యాపారవేత్త స్థాయికి ఎదిగిన ఓ యువకుడు.. తన ఎదుగుదలకు దోహదపడ్డ వారందరికీ థాంక్స్ చెప్పుకుంటూ రావడమే ఈ సినిమా థీమ్ అని సమాచారం. అలాగే హాకీ ప్లేయర్ గా చైతూ కనిపించడం అనేది కూడా సబ్జెక్ట్ తో ముడిపడి ఉంటుందట. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. ఈ ఏడాది ద్వితీయార్ధంలో థాంక్యూ థియేటర్స్ లో సందడి చేసే అవకాశముందని టాక్.
వెంకీకి కూడా వర్కవుట్ అవుతుందా?
తెలుగునాట రీమేక్స్ తో సంచలన విజయాలు అందుకున్న కథానాయకుల్లో విక్టరీ వెంకటేష్ ముందుంటారు. ఈ సీనియర్ స్టార్ చేసిన రీమేక్స్ లో సింహభాగం సక్సెస్ అయ్యాయి. అంతేకాదు.. వెంకీ చేసిన స్ట్రయిట్ సబ్టెక్ట్స్ వేరే భాషల్లో రీమేక్ అయి విజయం సాధించిన వైనాలు కూడా ఉన్నాయి. అలా విజయం సాధించిన సినిమాల్లో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఒకటి. తమిళంలో ఈ సినిమాని యారాడి నీ మోహిని పేరుతో కోలీవుడ్ స్టార్ ధనుష్ రీమేక్ చేశాడు. నయనతార హీరోయిన్ గా నటించిన సదరు సినిమా తమిళ తంబీల ఆదరణ పొందింది. వెంకీ సినిమాని ధనుష్ రీమేక్ చేసిన సందర్భం ఇదొక్కటే కావడం గమనార్హం. కట్ చేస్తే.. ఇప్పుడు ధనుష్ నటించిన అసురన్ ని తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ చేస్తున్నాడు వెంకీ. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ వేసవిలో సందడి చేయనుంది. మరి.. ధనుష్ కి వెంకీ సబ్జెక్ట్ అచ్చొచ్చినట్టే.. వెంకీకి ధనుష్ సినిమా కూడా వర్కవుట్ అవుతుందేమో చూడాలి. నారప్పలో ప్రియమణి నాయికగా నటిస్తుండగా.. మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.
క్రాక్‌తో హ్యాట్రిక్ కొట్టిన టెక్నీషియన్
క్రాక్.. ఈ సంక్రాంతి సీజన్ విన్నర్. ఈ ఏడాదిలో తొలి బ్లాక్ బస్టర్. మాస్ మహారాజా రవితేజని, టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తెచ్చిన చిత్రం. శ్రుతి హాసన్ రి-ఎంట్రీ మూవీ. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ క్రేజ్ ని మాస్ ఆడియన్స్ లో మరింత పెంచిన బొమ్మ. అంతేకాదు.. ఓ టెక్నీషియన్ కి హ్యాట్రిక్ ని అందించిన మూవీ కూడా. ఇంతకీ అతనెవరంటే.. ఈ సినిమాని తన విజువల్స్ తో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళిన ఛాయాగ్రాహకుడు జి. కె. విష్ణు. ఈ సూపర్ టాలెంటెడ్ కెమెరామెన్ కి తెలుగులో ఇదే తొలి చిత్రం. అయితే తమిళంలో మాత్రం మెర్సల్, బిగిల్ చేశాడు. తమిళంలో ఈ రెండు సినిమాలు కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. తెలుగులో అదిరింది, విజిల్ పేర్లతో అనువాదమయ్యాయి. రెండు తమిళ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న విష్ణు.. క్రాక్ తో హ్యాట్రిక్ అంకాన్ని పూర్తిచేసుకున్నాడు. క్రాక్ విజయంతో విష్ణు ఖాతాలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేరుతున్నాయని టాక్. త్వరలోనే విష్ణు నెక్స్ట్ తెలుగు ప్రాజెక్ట్ పై క్లారిటీ వస్తుంది.
ఈ సంక్రాంతికి విడుదలైన మూడు స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్స్ కి సంబంధించి కామన్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే.. అది ఐటమ్ సాంగ్ ఉండడం అనే చెప్పాలి. క్రాక్, రెడ్, అల్లుడు అదుర్స్.. ఇలా ఈ ముగ్గుల పండక్కి వచ్చిన మూడు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్స్ లోనే తెరకెక్కాయి. అయితే, అన్నింటిలోనూ ఐటమ్ సాంగ్ కి స్థానం దక్కింది. విశేషమేమిటంటే.. ఆయా చిత్రాల టాక్ తో సంబంధం లేకుండా అన్ని సినిమాల్లోనూ ఐటమ్ సాంగ్స్ క్లిక్ అయ్యాయి. క్రాక్ లో బూమ్ బద్ధల్ అంటూ మాస్ మహారాజా రవితేజతో కలసి అప్సర రాణి చిందేసిన ఐటమ్ సాంగ్.. ఆ సినిమా ప్రత్యేక ఆకర్షణలలో ఒకటిగా నిలిస్తే.. రెడ్ చిత్రంలో డించక్ డించక్ అంటూ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో హెబ్బా పటేల్ ఆడిపాడిన ప్రత్యేక గీతం కుర్రకారుని ఊపేస్తోంది. ఇక అల్లుడు అదుర్స్ లో బిగ్ బాస్ సీజన్ 4 బ్యూటీ మోనాల్ గజ్జర్.. రంభ ఊర్వశి మేనక అందర్నీ కలిపితే నేనిక అంటూ చిందులేసి.. ఆ ఐటమ్ సాంగ్ ని సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలిపింది. మొత్తంగా.. 2021 సంక్రాంతి కోడిపుంజులు.. ఐటమ్ సాంగ్స్ తో రచ్చ చేశాయనే చెప్పాలి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫస్ట్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్. యాక్షన్ సాగాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. కాగా, ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేజీఎఫ్ స్టార్ యశ్ హాజరయ్యారు. కాగా, సలార్ కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. ఇందులో యశ్ అతిథి పాత్రలో కనిపిస్తారట. పాత్ర నిడివి తక్కువే అయినా.. చాలా ప్రత్యేకంగా ఉంటుందని వినిపిస్తోంది. మరి.. సలార్ లో యశ్ అతిథి పాత్ర వార్తలకే పరిమితమో కాదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. జనవరి నెలాఖరు నుంచి సలార్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని.. ఈ సంవత్సరం దసరాకి సలార్ తెరపైకి వచ్చే అవకాశముందని ప్రచారం సాగుతోంది.
రాజకీయాలకు బలౌతున్న ఐఏఎస్ అధికారులు
ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.
ఆంధ్ర లో బీజేపీ 'పంచ్' తంత్రం...
* దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో.... * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా.... * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు.. * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం .... జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు. రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి , ఇలా మాయమైపోయే జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్ ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు. ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు బీ జె పి, జన సేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి. ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం. ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
ఏపీలో వంద కోట్ల దందా.. రియల్ క్రైమ్ స్టోరీ
సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్‌లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.
కవిత, షర్మిలా రాజ్యసభకు వెళ్తారా?
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచనే ఎలా వుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? కవితా రాజ్యసభకు వెళ్తారా? అయితే హరిష్‌రావు ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్యకర్తల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు. రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్ఎస్ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్ కె.ఆర్.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం. కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది. షర్మిల ఆపద సమయంలో జగన్‌కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట. కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.
అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా... వైజాగ్ ఎపిసోడ్ నీతి ఏంటి?
రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి. అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.
రాజీవ్ గాంధీ మరణించాక ఆ సీక్రెట్ బయటపెట్టిన వాజపేయి!!
అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!
కాలాన్ని జయించే ‘POSEC Method’
ప్రపంచంలో ఎవరికైనా రోజుకి 24 గంటలే ఉంటాయి. కానీ ఆ 24 గంటలని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారు అనేదాని మీద వారి జీవితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే 20వ శతాబ్దంలో ‘Time Management’కి చాలా ప్రాధాన్యతని ఇస్తున్నారు. వాటికోసం రకరకాల వ్యూహాలూ ప్రచారంలో ఉన్నాయి. అలాంటి ఒక పద్ధతే ‘POSEC Method’. 1943లో Maslow అనే ఆయన Hierarchy of needs అనే సిద్ధాంతాన్ని రూపొందించారు. ఒక మనిషి సంతోషంగా ఉండేందుకు ఎలాంటి అవసరాలు తీరాలో ఇందులో పేర్కొన్నారు. దీని ఆధారంగానే ‘POSEC Method’ని రూపొందించారు. మన అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఈ పద్ధతిలో సూచించే ప్రయత్నం చేశారు. అవేమిటంటే... Prioritize – మీ జీవితంలో అతిముఖ్యమైన లక్ష్యాలు ఏమిటి. వాటిని సాధించేందుకు ఏం చేయాలి. వాటి కోసం ఎంత సమయం కేటాయించాలి అన్న విషయాలన్నీ ఈ Prioritize కోవలోకి వస్తాయి. Organize – జీవితం స్థిరంగా ఉండేందుకు ఎలాంటి పరిస్థితులు అవసరం అన్న అంశాలు ఈ విభాగంలోకి వస్తాయి. ఉదాహరణకు కుటుంబం, ఉద్యోగం, ఆరోగ్యం... లాంటి అంశాలన్నమాట. Streamline – చేసే ప్రతి పనీ మనకి ఇష్టం లేకపోవచ్చు. కానీ జీవితం సాఫీగా సాగిపోవాలంటే వాటిని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. సమయానికి బండిని సర్వీస్ చేయించుకోవడం దగ్గర నుంచీ, బీమా ప్రీమియం చెల్లించడం వరకు మన చుట్టూ ఉంటే పరిస్థితులను సక్రమంగా ఉంచుకోవడం వల్ల సమయం, శ్రమా రెండూ ఆదా అవుతాయి. Economize – కొన్ని పనుల వల్ల ఉపయోగం ఉండదు. అవి అత్యవసరమూ కాదు. కానీ ఇవి లేకపోతే జీవితం మరీ బోర్ కొట్టేయవచ్చు. స్నేహితులతో పార్టీ చేసుకోవడం, బంధువులు ఇంటికి వెళ్లడం, సినిమా చూడటం... లాంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. Contribute – పక్కవారికి ఏదో సాయం కావాలి! తోటి మనిషిగా ఆ బాధ్యతలో పాలు పంచుకోవడం మన కర్తవ్యం. వీధిలో జనం అంతా కలిసి రోడ్డుని శుభ్రం చేసుకుంటున్నారు! పౌరుడిగా పాల్గోవడం మన ధర్మం. ఎన్నికలు జరుగుతున్నాయి. పౌరుడిగా ఓటు వేసేందుకు లైనులో నిలబడటం మన బాధ్యత. ఇవన్నీ చేయాలని ఎవరూ అనరు. ఇలాంటి పనులు చేయడం వల్ల మనకి సమయం, శ్రమ వృధాగానే తోచవచ్చు. కానీ వీటి ఫలితం భవిష్యత్తులో కనిపించి తీరుతుంది. సమాజాన్ని ముందుకు నడిపించడంలో, మనం అశ్రద్ధ చేయలేదన్న తృప్తిని అందిస్తుంది. ఇలాంటి పనులన్నీ Contribute విభాగంలోకి వస్తాయి. ఇవండీ ‘POSEC Method’ లక్షణాలు. మన జీవితంలో పనులన్నింటినీ ఈ దృక్పథంతో చూస్తే... వేటికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఎంత సమయం కేటాయించాలి అన్న స్పష్టత ఏర్పడుతుంది. - నిర్జర.
దేశంలో సంక్రాంతి – ఒకోచోట ఒకోలా!
సంక్రాంతి తెలుగువారికి ముఖ్యమైన పండుగ అన్న విషయం తెలిసిందే! మన పక్కనే ఉన్న తమిళనాడులో కూడా పొంగల్ పేరుతో దీనిని ఘనంగా జరుపుకుంటారనే విషయమూ చాలామందికి తెలుసు. కానీ దేశంలోని అనేక రాష్ట్రాలలో దీనిని వేర్వేరు పేర్లతో ఘనంగా చేసుకుంటారు. వాటిలో కొన్ని... పౌష్ సంక్రాంతి (పశ్చిమబెంగాల్) - పుష్య మాసంలో వస్తుంది కాబట్టి బెంగాలీయులు ఈ పండుగను పౌష్ సంక్రాంతి అని పిలుచుకుంటారు. వీరి పంటలు కూడా ఇప్పుడే ఇళ్లకు చేరుకుంటాయి. అలా ఇంటికి చేరిన కొత్త బియ్యానికి, ఖర్జూరపు బెల్లాన్ని కలిపి రకరకాల పిండివంటలు చేసుకుంటారు. మూడురోజులపాటు జరుపుకొనే ఈ పండుగ రోజుల్లో వీరు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఇక మకరసంక్రాంతి రోజునే గంగావతరణ జరిగిందని ఓ నమ్మకం. అది జరిగింది కోల్‌కతాకు సమీపంలో ఉన్న గంగాసాగర్ అనే ప్రాంతంలో కాబట్టి, అక్కడ ఉన్న గంగానదిలో స్నానామాచరించేందుకు లక్షలమంది తరలివెళ్తారు. పంజాబ్ (మాఘి) – తెలుగువారు భోగి జరుపుకొనే రోజునే పంజాబీయులు లోరి అనే పండుగ చేసుకుంటారు. ఈ రోజున విశాలమైన మైదానాలలో మంటలు వేసుకుని దాని చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ భాంగ్రా అనే సంప్రదాయ నృత్యం చేస్తారు. దీనికి అనుగుణమైన భాంగ్రా పాటలు పాడుతూ, డోలు వాయిస్తూ సాగే కోలాహలం చూసి తీరాల్సిందే! ఇక లోరి మర్నాడు ‘మాఘి’ పేరుతో పండుగ చేసుకుంటారు. పంజాబీల కాలమానం ప్రకారం మాఘి, మాఘమాసంలోని తొలిరోజు. మాఘినాడు పాలు, చెరుకురసంతో ఖీర్ చేసుకుంటారు. ఘుఘుటి (ఉత్తరాఖండ్) – ఉత్తరాఖండ్‌లోని కుమావ్ వంటి ప్రాంతాలలో సంక్రాంతిని భలే చిత్రంగా జరుపుకొంటారు. ఈ రోజుని వారు ఉత్తరాయణంలో మొదటి రోజుగా భావిస్తారు. చలికాలంలో వలస వెళ్లిపోయిన పక్షులన్నీ ఈ రోజు తిరిగివస్తాయని నమ్ముతారు. బహుశా పూర్వీకుల ఆత్మలకు ప్రతిరూపాలన్న నమ్మకం అనో ఏమో నల్లకాకులను కూడా ఈ రోజు స్వాగతిస్తారు. వాటి కోసం వెతికి మరీ రకరకాల తీపిపదార్థాలను అందిస్తారు. అందుకనే ఈ పండుగకు ‘కాలా కవ్వా’ (నల్లకాకి) అన్న పేరు కూడా ఉంది. సుగ్గి (కర్ణాటక) – కన్నడ భాషలో సుగ్గి అంటే పంట లేదా విందు అన్న అర్థం వస్తుంది. ఈ రోజున కన్నడిగులు కొత్తబట్టలు, పూజాపునస్కారాలతో పండుగన ఘనంగా చేసుకుంటారు. దీనికి తోడుగా అక్కడ ఓ చిత్రమైన సంప్రదాయం కూడా కొనసాగుతూ వస్తోంది. ఎల్లు బిరోదు పేరుతో నువ్వుల ఉండలను ఇచ్చిపుచ్చుకుంటారు. కర్ణాటకలోని స్త్రీలు ఈ నువ్వుల ఉండలతో పాటుగా, అరటిపళ్లు, చెరుకుగడలు, పసుపుకుంకుమలను ముత్తయిదువలకు పంచుతారు. మాఘ బిహు (అసోం) – అసోంలో సంక్రాంతి కూడా చాలా చిత్రంగా సాగుతుంది. సంక్రాంతి ముందురోజున వెదురు, ఎండుగడ్డి వంటివాటితో గుడిసెలను నిర్మించుకుంటారు. ఆ రోజంతా ఈ పాకలలో ఆడుతూపాడుతూ గడిపేస్తారు. మర్నాడు ఉదయం వీటిని తగలబెట్టేస్తారు. మన గోదావరి జిల్లాలలో కనిపించే కోడిపందాలు, ఎడ్లపందాల వంటి ఆటలు అసోంలో కూడా జరుగుతాయి. కొబ్బరి, నువ్వులతో రకరకాల పిండిపదార్థాలను చేసుకుంటారు. పైన చెప్పుకొన్న రాష్ట్రాలే కాదు! బీహార్, హర్యానా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్... ఇలా ప్రతి రాష్ట్రంలోనూ సంక్రాంతి ఏదో ఒక పేరున విభిన్నంగా జరుగుతూనే ఉంటుంది. దేశం ఒక్కటే అయినా అందులోని ప్రతి ప్రాంతానికీ తనదైన సంప్రదాయం ఉందన్న విషయాన్ని రుజువు చేస్తుంటుంది. - నిర్జర.
సంక్రాంతి కేవలం ఒక సంప్రదాయం కాదు. అది ఓ జీవన విధానం. పంటలు ఇళ్లకి చేరుకున్నాయన్న సంబరానికి సూచన. సూర్యుని గమనం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారనుందన్న విషయానికి ప్రతీక. అందుకనే సంక్రాంతిని పోలిన పంటల పండుగలు ప్రపంచంలో అనేక చోట్ల కనిపిస్తాయి. ‘హార్వస్ట్ ఫెస్టివల్స్’ పేరుతో వీటిని ప్రతి జాతివారూ జరుపుకొంటారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవిగో... ఇండోనేషియా ఇండోనేషియాలో పంటల పండుగ ఎప్పుడో మేలో వస్తుంది. మే 31, జూన్ 1.. ఈ రెండు తేదీలలోనూ వారు ఈ పండుగను జరుపుకొంటారు. మనం సంపదకీ, సమృద్ధికీ లక్ష్మీదేవిని ఎలా కొలుచుకుంటామో ఇండోనేషియా ప్రజలు దేవిశ్రీ అనే దేవతను కొలుస్తారు. ఈ పంటల పండుగనాడు ఆ దేవతను ప్రత్యేకంగా ఆరాధిస్తారు. వీధుల్లో రంగురంగుల జెండాలను ఎగరవేస్తారు. పంటపొలాల్లో దిష్టిబొమ్మలను నిలుపుతారు. మన రాష్ట్రంలోలాగానే ఎడ్లపందాలను ఆడి సంబరపడిపోతారు. ఆఫ్రికా ఆఫ్రికా ఖండంలో అందునా ఘనా, నైజీరియా వంటి దేశాలలో యామ్ పండుగ అనే పంటల పండుని చేసుకుంటారు. యామ్ అనేది మన పెండలంలాంటి ఒక దుంప. ఆఫ్రికా ప్రజల ఆకలి తీర్చడంలో యామ్ది ముఖ్యపాత్ర. వర్షాకాలం ముగిసి ఆ యామ్ పంట చేతికి వచ్చే సమయంలో యామ్ ప్రజలు ఈ పండుగ జరుపుకొంటారు. ఇందులో పండుగ ముందురోజు పాత యామ్లని తిన్నంతగా తిని పారేస్తారు. ఇక యామ్ పండుగ రోజుని కొత్త పంటతోనే ప్రారంభిస్తారు. వీటికి తోడుగా ఆటపాటలూ, విచిత్ర వేషధారణలూ ఎలాగూ ఉంటాయనుకోండి. ఇంగ్లండ్ ఉత్తర ధృవంలోని ఇంగ్లండ్, ఐర్లాండ్ వంటి దేశాలలో లామాస్ పేరుతో పంటల పండుగను జరుపుకొంటారు. ఈ సమయంలో చేతికి వచ్చే గోధుమలతో రొట్టెలను చేసి వాటిని చర్చికి తీసుకువెళ్తారు. మన దేశంలో ఉత్తరాయణంతో పాటుగా మొదలయ్యే ఎండాకాలపు ప్రారంభంలో సంక్రాంతిని జరుపుకుంటాం. కానీ లామాస్ పండుగ మాత్రం ఇంగ్లండులో వేసవి ముగిసిపోయే సందర్భానికి సూచనగా భావిస్తారు. చైనా పంటల పండుగ గురించి చెప్పుకోవాలంటే చైనా, వియత్నాం దేశ ప్రజలు చేసుకునే లామాస్ గురించే చెప్పుకోవాలి. చైనీస్ కేలండర్లోన ఎనిమిదో నెలలోని పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకొంటారు. ఇది సుమారుగా ఆగస్టు లేదా సెప్టెంబరు మాసాలలో వస్తుంది. ప్రాచీన సంప్రదాయాలలో చంద్రుని పంటలకు అధిపతిగా భావిస్తారు కాబట్టి, చైనీయులు ఈ రోజుల్లో చంద్రుని ఆరాధిస్తారు. చంద్రుని ఆకారంలో చేసిన రొట్టెలను పంచుకుంటారు. రకరకాల చైనా లాంతర్లలో దీపాలను వెలిగించి ప్రతి ఇంటి ముందరా వేలాడదీస్తారు. ఇజ్రాయేల్ ఇజ్రాయేల్ కాలమానం ప్రకారం వారి ఏడో నెలలో పదిహేనవ రోజున సుకోత్ అనే పంటల పండుగను చేసుకుంటారు. ఇది సాధారణంగా సెప్టెంబరు, అక్టోబరు మాసాల మధ్య వస్తుంది. వారంరోజుల పాటు ధూంధాంగా జరుపుకొనే ఈ పండుగకు మరో పరమార్థం కూడా ఉంది. ఈజిప్టు సామ్రాజ్యం కింద యూదులు దాస్య విముక్తిని సాధించిన ఘట్టానికి ప్రతీకగా కూడా ఈ పండుగను జరుపుకొంటారు. ఆ కాలంనాటి సంస్కృతిని ప్రతిబింబించే గుడారాలను వేసుకుని, ఆ కాలంనాటి దుస్తులను ధరించి గత స్మృతులలోకి జారిపోతారు. - నిర్జర.
అగ్గి మీద గుగ్గిలం అయిన మిస్టర్ కూల్ సీఎం.. సంగతేంటంటే...
మిస్టర్ కూల్ సీఎం గా పేరు తెచ్చుకున్న నితీశ్ కుమార్ ఈ మధ్య మండి పడుతున్నారు. తాజాగా అయన ఒక్క సారిగా సహనం కోల్పోయి.. మీడియాపై చిందులు తొక్కారు. ఇందుకు కారణం.. ఒక రిపోర్టర్ అడిగిన ఒకే ఒక ప్రశ్న. ఇండిగో ఎయిర్ లైన్స్ మేనేజర్ రూపేశ్ కుమార్ సింగ్ హత్య విషయంలో ఒక మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సీఎం నితీశ్ ఒక్కసారిగా తన సహనం కోల్పోయారు. "మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే, దయచేసి పోలీసులతో పంచుకోండి. నేరాన్ని రుజువు చేయడంలో వారికి సహాయపడండి. మీరంతా చాలా గొప్పవారు. నేను సూటిగా అడుగుతున్నా. అసలు మీరెవరికి మద్దతిస్తున్నారు చెప్పండి?’’ అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో అయన పరోక్షంగా లాలూ, రబ్రీదేవీ పాలనపై కూడా తీవ్రంగా మండిపడ్డారు. ‘‘పదిహేనేళ్లు వారు పాలించారు. భార్యా భర్తల పాలనలో ఎన్నో నేరాలు జరిగాయి. వాటినెందుకు మీరు హైలెట్ చేయరు?’’ అని సూటిగా ప్రశ్నించారు. ఇది ఇలా ఉండగా ఇండిగో ఎయిర్ లైన్స్ మేనేజర్ రూపేశ్ కుమార్ హత్య సాక్షాత్తు సీఎం నితీశ్ నివాసానికి సమీపంలోనే జరగడంతో దీనికి రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే మీడియా అడిగిన ప్రశ్న పూర్తిగా తప్పని, పూర్తిగా నిరాధారమని అయన మండిపడ్డారు. ఓ హత్య జరగడానికి పలు ప్రేరేపణలు ఉంటాయని, వాటికి గల కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నితీష్ అన్నారు.
ఏపీలో ఓటర్ల జాబితా విడుదల.. తన పని తాను చేసుకుపోతున్న ఎస్ఈసీ!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఒకవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంటే.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికలు వద్దంటోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేయగా.. జగన్ సర్కార్ హైకోర్టుకు ఆశ్రయించడంతో ఎన్నికల షెడ్యూల్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో ఎన్నికల సంఘం ఈ కేసును డివిజన్ బెంచ్ కు బదిలీ చేయాలని కోరింది. దీనిపై విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే, ఒకవైపు ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా, హైకోర్టులో విచారణ జరగనున్నా.. మరోవైపు ఎన్నికల సంఘం మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఏపీలో ఓటర్ల జాబితాను తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో 2021 జనవరి 15 నాటికి 4,04,41,378 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారని తెలిపింది. మహిళా ఓటర్లు 2,04,71,506 కాగా.. పురుషులు 1,99,66,737 ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 4,135 మంది ఉన్నట్లు తెలిపింది. 2021 జనవరికి కొత్తగా 4,25,860 మంది ఓటర్లు పెరిగారని ఎన్నికల సంఘం పేర్కొంది.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 4 రోజుల్లోనే 10 మంది మృతి!
కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించుకునేందుకు బ్రిటన్ సహా పలు దేశాలు తమ ప్రజలకు అత్యవసర వ్యాక్సినేషన్ ప్రోగ్రాం మొదలు పెట్టిన సంగతి తెల్సిందే. తాజాగా జర్మనీలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నాలుగు రోజుల వ్యవధిలో 10 మంది మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ మరణాలకు కారణమేంటో తెలుసుకునేందుకు జర్మనీ పాల్ ఎర్లిచ్ ఇన్స్టిట్యూట్ నిపుణుల బృందం విచారణ మొదలుపెట్టింది. ఈ నిపుణుల చెప్పిన దాని ప్రకారం.. చనిపోయిన పది మంది 79 నుంచి 93 సంవత్సరాల మధ్య వయసులోని వ్యక్తులని తెలిపారు. అయితే వారికి వ్యాక్సిన్ ఇచ్చిన సమయం నుండి వారు చనిపోయిన సమయం మధ్య వ్యత్యాసం నాలుగు రోజులని వారు తెలిపారు. అంతేకాకుండా చనిపోయిన వారికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, బహుశా ఆ సమస్యల కారణంగానే చనిపోయారన్న ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు నిపుణుల బృందంలో ఒకరైన కెల్లర్ తెలిపారు. గడచిన డిసెంబర్ నుండి వ్యాక్సినేషన్ పై జర్మనీ ప్రభుత్వం విస్తృతమైన ప్రచారం చేసింది. అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్‌ను జర్మనీలో కూడా ప్రజలకు ఇచ్చారు. ఇప్పటివరకు మొత్తం 8,42,000 మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. మొదటి దశలో 80 సంవత్సరాల పైన వయసున్న వారికి వ్యాక్సిన్ ఇచ్చారు. వీరిలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఐన వైద్య సిబ్బందితో పాటు కొందరు దేశ సాధారణ ప్రజలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే వీరిలోని 325 మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కు లోనయ్యారు. ఇది ఇలా ఉండగా వ్యాక్సిన్ తీసుకున్న నాలుగు రోజుల్లోనే మరణించిన 10 మంది మృతికి కరోనా వ్యాక్సిన్ కారణమని ఆ దేశం ఇంకా నిర్ధారించలేదు.
ముక్క లేనిదే ముద్ద దిగదు.. కొందరికి రోజూ ఉంటే, కొందరికి వారానికి ఒక్కసారైనా నాన్ వెజ్ లేనిదే ఆ వారం గడవదు. సండే వచ్చిందా పిల్లలకి పెద్దలకి పండగే. సండే వస్తే నాన్ వెజ్ ఉండాలి. పుట్టినరోజు పార్టీకి నాన్ వెజ్ ఉండాలి. పండగ వచ్చిందా నాన్ వెజ్ ఉండాల్సిందే. ఇంకొన్ని చోట్ల ఆయా సంప్రదాయాలు అలవాట్లని బట్టి నాన్ వెజ్ తప్పనిసరిగా వండుకుంటారు. ఇలా ప్రతి సారీ అవకాశం దొరికినప్పుడల్లా ఈదేవి, ఎగిరేవి, పాకేవి అనే తేడా లేకుండా.. పిట్ట మాంసం, జింక మాంసం, పంది మాంసం, కుందేలు మాంసం ఇలా దొరికిందల్లా మీ పొట్టలోకి తోసేస్తే కొవ్వుపెరిగి గుండెలో కొలెస్ట్రాల్ చేరి, రక్తనాళాలు మూసుకు పోయి స్టెంట్లు వేసుకోడం ఒకబాధ. అసలు గుండె నొప్పి వచ్చినట్టు కూడా తెలియకుండా మనిషిని తీసుకుపోయే హృద్రోగ సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముక్కకోసం కాస్త కక్కుర్తి పడ్డారో గుండె లో సమస్యలు ఖాయమని నిపుణులు హెచ్చ్రరిస్తున్నారు. మాంసాహారము తినే వారిలో కార్డియో వాస్క్యులర్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్డియో వాస్క్యులర్ సమస్యలతోపాటు చనిపోయే అవకాశం ఉందని కార్డియో సర్జన్లు హెచ్చరిస్తున్నారు. అయితే చేపలు కొంత ప్రమాదం తక్కువే అని పేర్కొన్నారు . మాంసాహారము తింటున్న వారిపై ఇటీవల జరిపిన పరిశోధనలో చికెన్ ఇతర మాంస పదార్ధాల వల్ల కార్డియో వాస్క్యులర్ వ్యాధులు వచ్చే అవకావం ఉందని సాచురేటెడ్ ఫాట్స్ ఉంటాయని కార్డియో సమస్యకు దారితీస్తాయని హృద్రోగనిపుణులు తెలిపారు. న్యూయార్క్ కు చెందిన కర్నాల్ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో ఈ విషయం బయట పడిందని తెలిపారు.
యాంటీ స్నోరింగ్ డివైజ్ తో గురకకు చెక్
ఎన్ని మందులు వాడినా, చికిత్స తీసుకున్నా గురక మిమ్మల్ని వదలడం లేదా? గుర్రు గుర్రు అంటూ చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు ఎందరినో కుటుంబ సభ్యుసభ్యులకు సైతం దూరం చేసిన సందర్భాలు, గురకవల్ల విడిపోయిన కుటుంబాలు ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు. అంతే కాదు సుదీర్ఘ ప్రయాణంలో సైతం మనలని ఇబ్బంది పెట్టే గురకకు పలు అనారోగ్య కారణాలు ఉన్నాయి. ఒకటి ఊబకాయం, హృద్రోగ సమస్య, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిని గురక పెద్ద సమస్యని వైద్యులు పేర్కొన్నారు. అయితే ఒక చిన్న డివైజ్ తో గురకకు నియంత్రించవచ్చని దాంతో మీరు మీ కుటుంబసభ్యులు, జీవిత భాగస్వామి సైతం ప్రశాంతంగ నిద్రపోవచ్చని నిపుణులు అంటున్నారు. దీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న గురక సమస్యతో బాధ పడుతున్న మిలియన్ల ప్రజలకు ఎట్టకేలకు ముక్తి ప్రసాదించినట్లు అయింది. ముక్కులోని గాలిమార్గం బ్లాక్ కాకుండా నియంత్రిస్తుంది. దీనివల్ల శ్వాస సులభంగా తీసుకోవచ్చు. స్లీప్ క్వైట్ వల్ల శ్వాస తీస్కోడమే కాదు గురక చాలా తక్కువగా వస్తుంది నిద్రలోకి జారుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇక దీనిని ఉపయోగించడం సులభమని అంటున్నారు. దీనిని సైలెన్స్ రింగ్ అని కూడా అంటారు. రింగ్ చాలా సులభం ప్రభావవంతమైనదని అంటున్నారు. ముక్కులో దీనిని సులభంగా అమర్చవచ్చు. దీని ద్వారా వచ్చే మాగ్నెటిక్ టిప్స్ వాటిని యధా స్థానంలో ఉంచుతుంది. అనేక పరిశోధనలు చేసిన తరువాతే దీనిని మార్కెట్లోకి తెచ్చినట్లు ఉత్పత్తి దారులు తెలిపారు. స్లీప్ క్వైట్ ఏ వయస్సుల వారైనావాడచ్చు. వాడిన కొద్దిసేపటికే మీముక్కుకు ఏమైందో గమనిస్తారు. స్లీప్ క్వైట్ వల్ల శరీరం, మెదడు ప్రశాంతంగా నిద్రపోతుంది. అనారోగ్యం తగ్గినట్లు కనిపిస్తుంది. ఊపిరితిత్తులలోకి ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోడం వల్ల ఎక్కువసేపు నిద్రపోగలరు. 100% శాతం రక్షణకల్పిస్తుంది. ఇందులో ఎటువంటి మత్తుమందు లేదు. స్లీప్ క్వైట్ వల్ల ఎటువంటి బ్యాక్టీరియా రాదు. నీటిలో ముంచడం తోనే పరిశుభ్రం చేసుకుని మరలావాడచ్చు. అయితే దీనిని స్టెరిలైజ్ చేసిన ప్లాస్టిక్ కేసులో భద్రంగా ఉంచితే చాలని ఉత్పత్తిదారులు సూచించారు.
కొత్తిమీర…. ఖర్చు తక్కువ…. ఆరోగ్యం ఎక్కువ ...