Publish Date:Mar 19, 2013
Publish Date:Mar 19, 2013
Publish Date:Mar 19, 2013
Publish Date:Mar 18, 2013
Publish Date:Mar 18, 2013
Publish Date:Mar 18, 2013
Publish Date:Mar 17, 2013
Publish Date:Mar 17, 2013
Publish Date:Mar 17, 2013
Publish Date:Mar 16, 2013
Publish Date:Mar 15, 2013
Publish Date:Mar 15, 2013
Publish Date:Mar 15, 2013

EDITORIAL SPECIAL
  తీవ్ర నిరాశా నిస్పృహలు.. ఆవేదన.. కూడకట్టుకున్న ఆర్టీసీ కార్మికులకు ముఖ్య మంత్రి కేసీఆర్ ఎట్టకేలకు తీపి కబురు చెప్పారు. భేషరతుగా ఉద్యోగాల్లో చేరొచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వం తలచుకుంటే సమ్మెను లేబర్ కోర్టుకు పంపగలదని అలా చేస్తే కార్మికుల ఉద్యోగాలు ఊడిపోతాయి కాబట్టి తాము అలా చేయటం లేదని ఊరటనిచ్చారు. ఆర్టీసీ మనుగడకు తక్షణమే రూ.100 కోట్ల రూపాయల ఇస్తున్నారని కూడా ప్రకటించారు. సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ పేరిట చార్జీలనూ కిలో మీటరుకు 20 పైసల చొప్పున పెంచేశారు. డిసెంబర్ 2 నుంచి పెంచిన చార్జీలు అమలులోకి వస్తాయని ప్రకటించారు. సమ్మె కాలంలో తాత్కాలికంగా పని చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు బెదిరించినా.. అవమానించినా.. భరిస్తూ కష్టకాలంలో పని చేశారని భవిష్యత్తులో తప్పకుండా వారి గురుంచి ప్రభుత్వం ఆలోచిస్తుందని హామీ ఇచ్చారు. క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో కలిసి కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు.  ప్రభుత్వం ఎన్నో సంస్థలను కాపాడింది.. ఎంతో మందికి అన్నం పెట్టింది.. అలాంటిది ఆర్టీసీ కార్మికులను బజారున పడేస్తే ప్రభుత్వానికి వచ్చేది ఏముందని..చివరిగా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని కేబినెట్ చర్చల్లో మంత్రులు తెలిపినట్లుగా కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున.. ఆర్టీసీ సంస్థ తరుపున.. సదరు కార్మికుడికి చెబుతున్నా.. " ఇక ఇప్పటికైనా మీరు తెలుసుకోండి.. అందరి మాటలు నమ్మి మీరు మోసపోకండి.. ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నాను వెళ్లి ఉద్యోగాల్లో చేరి మంచిగ బ్రతకండి.. మీ సంస్థను బ్రతికించుకోండి " అని పిలుపునిచ్చారు కేసీఆర్. మీరు మా బిడ్డలని ఎన్నడో చెప్పాము అలానే చూసుకుంటాము. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల పొట్టనింపామే కానీ పొట్టలు కొట్టిన దాఖలాలు లేవని అన్నారు. దేశ వ్యాప్తంగా ఆశా వర్కర్లకు,హోమ్ గార్డులకు ఇలా చాలా మందికి ఎక్కువ వేతనం ఇస్తుంది కేవలం తెలంగాణలోనే అని స్పష్టం చేశారు. ట్రాఫిక్ పోలీసులకు 30% శాతం రిస్క్ అలవెన్సు ఇస్తున్నామని.. ఇండియాలో తెలంగాణ ఒక్కటే దీనిని ఇస్తోందన్నారు. ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా వారికి పింఛను ఇవ్వట్లేదని, ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఇవ్వడం లేదని వివరించారు. యూనియన్ల మాటలు నమ్మి కార్మికులు పెడదారి పట్టారని సంస్థను దెబ్బతీస్తున్నారని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు.
# (అక్టోబర్‌ 21)న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగగా... బీజేపీ-శివసేన ఒక కూటమిగా, కాంగ్రెస్-ఎన్సీపీ మరో కూటమిగా బరిలోకి దిగాయి. # (అక్టోబర్‌ 24)న మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 288 స్థానాలకు బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే, కూటమిగా బరిలోకి దిగిన బీజేపీ-శివసేనకు కలిపి 161 స్థానాలు రావడంతో... ఎప్పటిలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అంతా భావించారు.  # (అక్టోబర్‌ 25)న బీజేపీ, శివసేన మధ్య విభేదాలు బయటపడ్డాయి. 50-50 ఫార్ములాను తెరపైకి తెచ్చిన శివసేన... ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందం మేరకు ము‌ఖ్యమంత్రి పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందేనంటూ పట్టుబట్టింది. అయితే, శివసేన డిమాండ్‌ను బీజేపీ తిరస్కరించడంతో మహా డ్రామా మొదలైంది. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన శివసేన... ఎన్సీపీ అండ్ కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపింది. మరోవైపు, శివసేనను చీల్చి, ఇండిపెండెంట్ల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పావులు కదిపింది. ఇలా అక్టోబర్ 25నుంచి నవంబర్ 9వరకు మహారాష్ట్రలో నెంబర్ గేమ్ సాగింది. # (నవంబర్ 9) మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియడంతో, ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించారు.  # (నవంబర్ 10) తగినంత సంఖ్యాబలం లేనందున తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ తేల్చిచెప్పడంతో, సెకండ్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన శివసేనను ఆహ్వానిస్తూ, 24గంటల గడువిచ్చారు. # (నవంబర్ 11) అయితే, ఎన్సీపీ-కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికొచ్చిన శివసేన... చర్చల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటుకు 3రోజులు గడువు ఇవ్వాలని గవర్నర్‌ను కోరింది. శివసేన విజ్ఞప్తిని తిరస్కరించిన గవర్నర్... మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన ‎ఎన్సీపీకి ఆహ్వానం పలికారు.  # (నవంబర్ 12) అయితే, ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగియకముందే, రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేయడంతో... కేంద్రం, రాష్ట్రపతి ఆమోదంతో ఆగమేఘాల మీద, ప్రెసిడెంట్‌ రూల్ విధించారు. # (నవంబర్ 13) గవర్నర్‌ నిర్ణయంపై మండిపడ్డ శివసేన... ప్రభుత్వ ఏర్పాటుకు తాము గడువు కోరినా, ఇవ్వలేదంటూ, సుప్రీంను ఆశ్రయించింది. # (నవంబర్ 13-21) ఒకవైపు సుప్రీంలో కేసు నడుస్తుండగానే... మరోవైపు కాంగ్రెస్‌, ఎన్సీపీలతో శివసేన సంప్రదింపులు సాగించింది. అయితే, శరద్ పవార్‌‌ను మోడీ ప్రశంసించడం... వెంటనే ప్రధానితో పవార్ సమావేశం కావడంతో... బీజేపీ-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయేమోనంటూ ప్రచారం జరిగింది. # (నవంబర్ 22) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ మధ్య చర్చలు కొలిక్కిరావడంతో, ఉద్ధవ్‌కు మద్దతిచ్చేందుకు సోనియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహారాష్ట్ర వికాస్ అఘాడీ పేరుతో కూటమిని ఏర్పాటు చేశారు. # (నవంబర్ 23) అయితే, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవడంతో... బీజేపీ రాత్రికి రాత్రే వేగంగా పావులు కదిపింది. ఎవరూ ఊహించనివిధంగా ఉదయం 5:47కి రాష్ట్రపతి పాలన ఎత్తేయగా, ఆ కొద్దిసేపటికే ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా... ఎన్సీపీ-శాసనసభాపక్షనేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. దాంతో, దేశం మొత్తం నివ్వెరపోయింది. ఇక, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ అయితే ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాయి. ఎన్సీపీ-శాసనసభాపక్షనేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడంతో... ఎన్సీపీలో చీలిక వచ్చిందేమోనని భావించారు. అయితే, అజిత్ వెంట ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని శరద్ పవార్ ప్రకటించడంతో మహా డ్రామా మరో కొత్త మలుపు తిరిగింది. అదే సమయంలో, గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సుప్రీంను ఆశ్రయించాయి.  # (నవంబర్ 24) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పిటిషన్లపై అత్యవసర విచారణ జరిపిన సుప్రీం... గవర్నర్‌కు బీజేపీ సమర్పించిన మద్దతు లేఖలను తమ ముందు పెట్టాలని ఆదేశించింది. # (నవంబర్ 25) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌లు బల ప్రదర్శనకు దిగాయి. 162మంది ఎమ్మెల్యేలతో మహా పరేడ్ నిర్వహించాయి.  # (నవంబర్ 26) మహారాష్ట్ర వివాదంపై తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.... బలనిరూపణ చేసుకోవాలంటూ ఫడ్నవిస్ ప్రభుత్వానికి ఒక్కరోజు టైమిచ్చింది. అయితే, సుప్రీం తీర్పు తర్వాత మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. అయితే, బలపరీక్షకు ముందే చేతులెత్తేసిన ఫడ్నవిస్‌... ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.  # (నవంబర్ 26-27) బలపరీక్షకు ముందే బీజేపీ చేతులెత్తేయడంతో... ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి ముందడుగు వేసింది. మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమి నేతగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్‌ను కలిసి ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖను అందజేశారు. దాంతో, డిసెంబర్ ఒకటిన శివాజీ పార్క్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే‌.... డిప్యూటీ సీఎంలుగా ఎన్సీపీ నేత జయంత్ పాటిల్... కాంగ్రెస్ లీడర్‌ బాలా సాహెబ్‌ థోరాట్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో పోరుబాట పట్టిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ పోరాటానికి ముగింపు పలికారు. డిమాండ్ల సాధన కోసం 52రోజులుగా చేస్తోన్న సమ్మెను విరమించారు. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్... విధులకు హాజరవుతామని ప్రకటించింది. ఒకవైపు హైకోర్టులో ఆశించిన న్యాయం జరగకపోవడం... మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో... విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు ముగింపు పలికారు. అయితే, లేబర్ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని అశ్వద్ధామరెడ్డి వ్యక్తంచేశారు. ప్రభుత్వం గెలవలేదు... కార్మికులు ఓడిపోలేదంటోన్న అశ్వద్ధామరెడ్డి.... ఆర్టీసీని కాపాడుకునేందుకే సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. కార్మికులెవరూ నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటివరకు చరిత్రలో లేనివిధంగా 52రోజులపాటు పోరాటంచేసి కార్మికులు నైతిక విజయం సాధించారని అన్నారు. ఇక, సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు జేఏసీ అండంగా ఉంటుందని, అన్నివిధాలా ఆదుకుంటుందని ప్రకటించారు. అయితే, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు రేపట్నుంచి విధులకు రావొద్దని కోరిన అశ్వద్ధామరెడ్డి... కార్మికులను అడ్డుకోవద్దని ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. అయితే, నాలుగైదు రోజులుగా తిరిగి విధుల్లో చేరేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నిస్తున్నా... అధికారులు మాత్రం తిప్పిపంపుతున్నారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దాంతో పలు డిపోల దగ్గర ఆర్టీసీ కార్మికులు పడిగాపులు పడుతున్నారు. అయితే, సమ్మె విరమించి విధుల్లోకి చేరతామని ప్రకటించినందున... కార్మికులను అడ్డుకోవద్దని ఆర్టీసీ యాజమాన్యానికి అశ్వద్ధామరెడ్డి విజ్ఞప్తి చేశారు. కానీ, ఇప్పటికిప్పుడు విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదంటూ ఆర్టీసీ యాజమాన్యం ఊహించని షాక్ ఇచ్చింది.
ALSO ON TELUGUONE N E W S
  "దిశపై జరిగిన అమానుష ఘటనల లాంటివి ఆగాలంటే ఆడవాళ్లు పెప్పర్ స్ప్రే వాడాలి. ఎవరైనా మగవాళ్లు మీ దగ్గరకు వస్తే, ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని స్ప్రే చెయ్యాలి. అదిప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్తున్నా ఆడవాళ్లు తమతో పెప్పర్ స్ప్రే తీసుకుపోవాలి. దానివల్ల మగవాళ్ల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుంది. అలాగే ఇళ్లల్లో ఎదుటివాళ్లను గౌరవించాలని పిల్లలకు పెద్దలు నేర్పాలి" అంటోంది రాశీ ఖన్నా. 'వెంకీమామ'లో ఆమె ఒక హీరోయిన్‌గా నటించింది. వెంకటేశ్, నాగచైతన్య మేనమామ మేనల్లుళ్లుగా నటించిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ మరో నాయికగా చేసింది. బాబీ (కె.ఎస్. రవీంద్ర) డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 13న రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఆ సినిమాతో పాటు, పలు ఇతర అంశాల గురించీ మాట్లాడింది రాశి. ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ... తెలుగు బాగా మాట్లాడుతున్నారే? ఇప్పుడు నేను తెలుగమ్మాయిని అయిపోయాను. వెయిట్ లాస్ అయినట్లున్నారు? అవును. జింలో చాలా కష్టపడ్డాను. షూటింగ్, జిం.. ఇవే నా లైఫ్ అయిపోయాయి. వెయిట్ తగ్గించుకోవాలనే దానికంటే ఫిట్‌గా ఉండాలనే దానిపై దృష్టి పెట్టాను. ఫ్యాట్‌ను తగ్గించుకొని, మజిల్‌ను స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. ఇదివరకటితో పోల్చుకుంటే ఇప్పుడు నేను చాలా ఫిట్టయ్యాను. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తప్ప ఇలాగే ఉండాలనుకుంటున్నా. 'వెంకీమామ'లో మీ క్యారెక్టర్ ఏమిటి? అందులో నా రోల్ పేరు హారిక. ఒక ఫిలింమేకర్. అనుకోకుండా ఒకరోజు మా మేనేజర్‌కు సురేశ్‌బాబు ఫోన్ చేసి తమ సినిమాలో రాశి కావాలని అడిగారు. అప్పుడు నేను తమిళ్ ఫిల్మ్ 'అయోగ్య' షూటింగ్‌లో ఉన్నాను. అదివరకు నేను చైతూతో కలిసి 'మనం'లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాను. ఆ సినిమాకి ఒక రోజే పనిచేశాను. అతనితో కలిసి పనిచెయ్యాలంటే ఇంటెన్స్ లవ్ స్టోరీ అయితే బాగుంటుందనేది అప్పటి దాకా నాలో ఉన్న అభిప్రాయం. అయితే ఈ సినిమా ఆఫర్ వచ్చినా కూడా నేను చాలా సంతోషించాను. ఎందుకంటే వెంకటేశ్ గారు, చైతూ కలిసి నటిస్తున్న సినిమా కావడం, ఆ ఇద్దరూ మేనమామ మేనల్లుళ్లు కావడం. 'ప్రేమం'లో కూడా ఆ ఇద్దరూ కలిసి ఒక సీన్‌లో నటించారు. ఆ ఇద్దరూ కలిసి నటించాలని వాళ్ల ఫ్యాన్స్ కోరుకుంటూ ఉన్నారు. 'జై లవ కుశ'లో ఇదివరకే నేను డైరెక్టర్ బాబీతో పనిచేశాను. అందువల్ల కంఫర్ట్ లెవల్ బాగుంటుందనుకుని వచ్చేశాను. నా సీన్లు ఎక్కువగా ఫస్టాఫ్‌లో వస్తాయి. సెకండాఫ్ కథ ఎక్కువగా మామా అల్లుళ్ల మధ్య ఎమోషనల్ సీన్స్‌తో నడుస్తుంది. రియల్ లైఫ్‌లో కూడా ఆ ఇద్దరూ ఒకరిపై ఒకరు ఎంత ప్రేమ చూపించుకుంటారో సెట్స్‌పై నేను ప్రత్యక్షంగా చూశాను. అలాంటి వాళ్లను ఇండస్ట్రీలో నేనింత దాకా చూడలేదు. బహుత్ అచ్చే లోగ్ హై. ఫస్టాఫ్‌లో సందర్భానుసారం వచ్చే కామెడీ ఎక్కువ. నాది కామెడీ క్యారెక్టర్ కాదు కానీ, నవ్వించే సీన్లు ఎక్కువగా ఉంటాయి. వెంకీ సార్‌తోనూ నాకెక్కువ సీన్లు ఉంటాయి. ఈ సినిమా షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశాను. వెంకీ సార్‌కి నేను బిగ్ ఫ్యాన్. 'ఎఫ్2' ని రెండు మూడు సార్లు చూశాను. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ చాలా యూనిక్‌గా ఉంటాయి. ఆయన కామిక్ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆయనతో కలిసి పనిచెయ్యడం వల్ల చాలా నేర్చుకున్నాను.  ఇద్దరు హీరోలుంటే హీరోయిన్లకు ఏం చాన్స్ ఉంటుందని అనిపించలేదా? ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమాలు ఇప్పటికే నేను చేశాను. అది ప్రాబ్లెమే కాదు. నాకు మంచి క్యారెక్టర్ ఉంటే చెయ్యడానికి నాకేం అభ్యంతరం ఉండదు. ప్రేక్షకులు నా క్యారెక్టర్‌ను గుర్తుంచుకుంటే చాలు. ఎవరేం క్యారెక్టర్ చేస్తున్నారనేది చూడ్డం నా పని కాదు. మలయాళంలో హీరోయిన్ కాకపోయినా మంచి రోల్ చేశాను. నటనకు అవకాశమున్న పాత్రా, కాదా.. అనేదే నేను చూసుకుంటా. గ్లామరస్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తుందనో, లేకపోతే గ్లామరస్‌గా ఉండని పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ మాత్రమే చేస్తుందనో అనిపించుకోవడం నాకిష్టం లేదు. ఆ రెండు రకాల పాత్రలూ చెయ్యాలనుకుంటాను. 'వెంకీమామ'లో మా నలుగురి క్యారెక్టర్లనూ బాబీ బాగా తీర్చిదిద్దారు. నాది కానీ, పాయల్‌ది కానీ ఇలా వచ్చి అలా పోయే క్యారెక్టర్స్ కావు. నేను సిటీ నుంచి విలేజ్‌కు వచ్చే అమ్మాయిగా కనిపిస్తాను. వెంకీ సార్, చైతూ, నాకూ మధ్య సీన్లు చాలా సరదాగా ఉంటాయి. ఒక ఇబ్బందికర పరిస్థితిలో చిక్కుకొని ఎలా తిప్పలు పడతాననేది ఫన్నీగా ఉంటుంది. ఎప్పట్నుంచి మీరు వెంకటేశ్ గారికి ఫ్యాన్ అయ్యారు? నా చిన్నప్పట్నుంచే టీవీలో ఆయన హిందీ డబ్బింగ్ సినిమాలు చూస్తూ ఉండేదాన్ని. అప్పట్నుంచే ఆయన సినిమాలంటే ఇష్టం. అయితే అంతకంటే ఒక వ్యక్తిగా ఆయనంటే నాకు చాలా అభిమానం. ఆయన వెరీ స్పిరుచ్యువల్, వెరీ నైస్ పర్సన్. ఆయనతో మాట్లాడే సమయం నాకు లభించింది. ఒకేసారి రెండు మూడు సినిమాలు చెయ్యడం వల్ల క్యారెక్టర్స్‌లో కన్‌ఫ్యూజన్ ఉంటుందా? అలాంటిదేమీ ఉండదు. నేను ఒకేసారి 'ప్రతిరోజూ పండగే', 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలు చేశాను. రెండూ ఒకదానికొకటి భిన్నమైన పాత్రలు. 'వరల్డ్ ఫేమస్ లవర్' మోర్ ఇంటెన్స్ ఫిల్మ్. ఆ కథ నా క్యారెక్టర్ నుంచి చాలా డిమాండ్ చేస్తుంది. 'ప్రతిరోజూ పండగే'లో నాది బాగా బబ్లీగా ఉండే రోల్. డబ్బింగ్ చెప్పడానికి టైం దొరుకుతోందా? 'వెంకీమామ'కు చెప్పలేదు కానీ, 'వరల్డ్ ఫేమస్ లవర్'కు డబ్బింగ్ చెప్పాను. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ రావడం వల్ల ఆ టైంలో డబ్బింగ్ చెప్పడం కుదరలేదు. ఇక నుంచీ డబ్బింగ్ నేనే చెప్పాలనుకుంటున్నా. నా గొంతు కూడా డబ్బింగ్‌కి సూటవుతుంది. క్యారెక్టర్‌కు మేం డబ్బింగ్ చెబితేనే న్యాయం జరుగుతుంది. పాట కూడా పాడబోతున్నారని వినిపిస్తోంది? అవును. ఏ సినిమా కోసం ఎప్పుడు పాడుతున్నాననేది తర్వాత చెప్తాను. అది తెలుగులోనే ఉంటుంది. చిన్నప్పుడు నాకు సింగర్ అవ్వాలని ఉండేది. ఏడేళ్ల వయసులో పాడటం నేర్చుకొని, పాటల పోటీల్లో పాల్గొనే దాన్ని. ప్రొఫెషనల్‌గా పాడే చాన్స్ రావడం లక్కీ అనుకుంటున్నా. మీరు ముంబై నుంచి వచ్చారు కదా. హిందీ సినిమాల్లో ట్రై చెయ్యట్లేదా? ఇక్కడే చాలా బిజీగా ఉన్నానండీ. ఇవాళ సౌత్ సినిమాలకు చాలా రీచ్ ఉంటోంది. అందువల్ల బాలీవుడ్‌కో లేదా హాలీవుడ్‌కో వెళ్లాలనే ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. మంచి క్యారెక్టర్ వస్తే, హిందీ అయినా, మలయాళమైనా చేస్తాను. అంతే కానీ హిందీ సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన చెయ్యట్లేదు. నాకు ఎక్కడ మంచి పని దొరికితే అక్కడకు వెళ్తాను. మిగతా హీరోయిన్లతో పోటీ ఉందని ఫీలవుతుంటారా? పోటీ ప్రతి ఫీల్డులో ఉంది. పోటీ చాలా అవసరం. లేకపోతే రిలాక్స్ అయిపోతాం. పోటీ ఉంటేనే బాగా చెయ్యాలనే తపన కూడా ఉంటుంది. ఏ హీరోయిన్లతో మీరెక్కువ సన్నిహితంగా ఉంటారు? రకుల్ ప్రీత్ నాకు వెరీ గుడ్ ఫ్రెండ్. మీ అంచనాలకు తగ్గట్లు ఆఫర్స్ వస్తున్నాయా? నాకు చాలా అంచనాలే ఉన్నాయి. 'వెంకీమామ', 'ప్రతిరోజూ పండగే'లో మంచి కమర్షియల్ క్యారెక్టర్స్ చేశాను. అయితే 'వరల్డ్ ఫేమస్ లవర్'లో ఇప్పటి దాకా చెయ్యని టఫెస్ట్ క్యారెక్టర్ చేశాను. చాలామందికి 'తొలిప్రేమ'లో నేను చేసిన పాత్ర బాగా నచ్చింది. దాని తర్వాత 'వరల్డ్ ఫేమస్ లవర్'లో క్యారెక్టర్ బాగా నచ్చుతుందని అనుకుంటున్నా. 'శ్రీనివాస్ కల్యాణం'లో మంచి క్యారెక్టర్ చేశారు. దాని రిజల్ట్ డిజప్పాయింట్ చేసిందా? హిట్టూ ఫ్లాపూ నా చేతుల్లో లేవు. ప్రతి ఒక్కరికీ చేసే సినిమా స్పెషలే. సినిమా రిలీజయ్యాకే అదెందుకు వర్కవుట్ అయ్యింది, ఎందుకు అవ్వలేదు?.. అనే ప్రశ్నలు వస్తాయి. ప్రేక్షకులు ఆ సినిమాలో నన్ను ఇష్టపడ్డారు. వాళ్లు సినిమాని ఇష్టపడకపోవడం వేరే సంగతి. నేనేమీ డిజప్పాయింట్ కాలేదు. అది ఇండస్ట్రీలో ఒక భాగం. హిట్లూ, ఫ్లాపులూ కామన్. ఐ లైక్డ్ ద ఫిల్మ్. ఎక్కడో ఎమోషనల్‌గా దానికి కనెక్టయ్యాను. వెబ్ సిరీస్ చేసే ఆలోచనేమన్నా ఉందా? మంచి రోల్ వస్తే కచ్చితంగా చేస్తాను. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ స్టోరీస్ మీ వద్దకు వస్తున్నాయా? వస్తున్నాయి కానీ, అవి నన్ను మెప్పించలేకపోతున్నాయి. ప్రభావవంతమైన స్క్రిప్ట్ వస్తే చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను. ఇటీవల హైదరాబాద్‌లో దిశపై జరిగిన అమానుష ఘటన తలచుకుంటే ఏమనిపిస్తుంది? కోపం, భయం.. రెండూ కలుగుతాయి. ఆ నీచానికి పాల్పడినవాళ్లను జనం మధ్యలో ఉరి తియ్యాలనిపించేంత కోపం వచ్చింది. కానీ మనం మన అభిప్రాయాలు మాత్రమే చెప్పగలం. అంతకు మించి ఏం చెయ్యగలం? నేను మాట్లాడగలను కానీ, వాళ్లను నేను చంపలేనుగా. ఆ పని చెయ్యాల్సింది జ్యూరీ. వ్యక్తులుగా మనం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. చాలామంది సినిమాలను పాయింట్ ఔట్ చేస్తున్నారు కదా.. స్త్రీలను కించపరిచేలా సన్నివేశాలు తీస్తుంటారని? అది మీ తలలో ఉన్న అభిప్రాయమంతే. ఏం కించపరుస్తున్నారు? మీరెలా దాన్ని నిర్వచిస్తారు? డ్రస్సుల గురించి కూడా మాట్లాడుతుంటారు. అది మీ ఆలోచనాధోరణిలో ఉంటుంది. మీ అమ్మ పెంపకంలో ఉంటుంది. ఒకరికి కరెక్టనిపించేది, ఇంకొకరికి తప్పనిపిస్తుంది. ఈ ప్రశ్నకు ఒకే జవాబు ఉండదు. ఇదివరకటితో పోలిస్తే, తెలుగు సినిమాల్లో హీరోయిన్ రోల్స్ ఇంప్రూవ్ అయ్యాయనుకుటున్నారా? కచ్చితంగా ఇంప్రూవ్ అయ్యాయి. మంచి మంచి రోల్స్ వస్తున్నాయి. ఇలా వచ్చి అలా పోయే, డాన్సులకు పరిమితమయ్యే హీరోయిన్ క్యారెక్టర్లు తగ్గాయి. ఇవాళ ప్రాపర్ రోల్స్ లభిస్తున్నాయి. పెళ్లి తర్వాత కూడా సమంత ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నదో మనం చూస్తున్నాం. ఇప్పుడు వెస్ సిరీస్ కూడా చేస్తోంది. ఆమెలాంటి వాళ్లంటే నాకెంతో గౌరవం. ఇదివరకు పెళ్లయితే కెరీర్ ఖతం. ఇప్పుడలా లేదు. ఇండస్ట్రీ బెటర్ అయ్యింది. మంచి మెసేస్‌తో వస్తున్న సినిమాలు హిట్టవుతున్నాయి కానీ, వాటి ప్రభావం జనంపై ఎందుకు కనిపించడం లేదంటారు? మంచి మెసేజ్ ఉన్న సినిమా చూస్తాం. తర్వాత ఆ మెసేజ్‌ని మర్చిపోతాం. అలా ఉండకూడదు. ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ఈ విషయంలో బాగా పనిచేస్తున్నాయి. దేని గురించైనా మాట్లాడుకొనే సౌలభ్యాన్ని అవి కల్పిస్తున్నాయి. నేను నటించగలను, మీరు రాయగలరు. శిక్షలు మనం వెయ్యలేం. చెడు జరిగినప్పుడల్లా మనమేం చెయ్యలేమనే విషయం ఫ్రస్ట్రేట్ చేస్తుంటుంది. 'శ్రీనివాస కల్యాణం' తర్వాత ఎందుకింత గ్యాప్ తీసుకున్నారు? నేను గ్యాప్ తీసుకోలేదండీ. ఆ సినిమా చేసిన వెంటనే నేను 'వరల్డ్ ఫేమస్ లవర్'కు సంతకం చేశాను. అయితే అది రావడం లేటవుతుండటం వల్ల గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తోంది. నేనైతే ఖాళీగా లేను. 'వెంకీమామ'కు జనవరిలోనే సంతకం చేశాను. సినిమాల రిలీజ్‌లు నా చేతుల్లో లేవు కదా. కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటారా? యాక్టర్స్‌కు ప్లాన్ అనేది ఏముండదు. మన దగ్గరకు ఏ డైరెక్టర్ వస్తాడనేది మన నిర్ణయంపై ఆధారపడి ఉండదు. వచ్చిన ఆఫర్స్‌లో బాగా ఉన్నాయనుకున్నవి చూసుకొని చేస్తుంటాం. మంచి స్క్రిప్ట్స్ కోసం ఎదురు చూస్తుంటాం. ఆరు నెల్ల నుంచి బ్రేక్ లేకుండా పనిచేస్తూ వచ్చాను. అందుకే ఇప్పుడు 15 రోజులు బ్రేక్ తీసుకుంటున్నా. తర్వాత మళ్లీ పనిలో పడటమే. - బుద్ధి యజ్ఞమూర్తి
  విజయ్ దేవరకొండ మునుపటి సినిమా 'డియర్ కామ్రేడ్' సరిగా ఆడకపోయినా యూత్‌లో అతని క్రేజేమీ పడిపోలేదు. టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ అతనికి ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి)లో అతనిని ట్రెండ్‌సెట్టర్‌గా పరిగణించారు కూడా. అలియా భట్ అంతటి పాపులర్ బాలీవుడ్ హీరోయిన్ సైతం తనకు విజయ్ స్టైల్ అంటే బాగా ఇష్టమని చెప్పిందంటే మనవాడి పాపులారిటీ దేశవ్యాప్తంగా ఎలా ఉందో ఊహించుకోవాల్సిందే. అయితే విచిత్రంగా అతని లేటెస్ట్ ఫిల్మ్ 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీపై బజ్ కనిపించడం లేదు! క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో విజయ్ ఏకంగా నలుగురు భామలతో రొమాన్స్ చేస్తున్నప్పటికీ, ఎందుకనో ఆ పాయింట్ కూడా సినిమాపై ఊహించినంత క్రేజ్ తీసుకు రావడం లేదు. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరిన్ ట్రెసా, 'మిస్టర్ మజ్ను' ఫేం ఇసాబెల్లే లీటే లతో ఈ మూవీలో అతను ప్రేమలో పడతాడు. ఈ నలుగురిలో ఎవరికి అతను దక్కుతాడనేది ఇంట్రెస్టింగ్.  అదివరకు యూత్‌లోనే క్రేజ్ ఉన్న విజయ్‌ను 'గీత గోవిందం' సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కూ దగ్గర చేసింది. 2018 ఆగస్టులో వచ్చిన ఆ మూవీ తర్వాత విజయ్ పాపులారిటీ నాలుగింతలు పెరిగింది. అయితే, దానికి తగ్గట్లుగా పెరిగిన అంచనాలను అతని తర్వాతి సినిమాలు అందుకోలేకపోయాయి. 'నోటా' సినిమా ఫ్లాపవగా, 'టాక్సీవాలా' హిట్ అనిపించుకుంది కానీ, దానికి వచ్చిన కలెక్షన్లు కానీ, ఆ మూవీలో విజయ్ క్యారెక్టర్ కానీ అతని ఇమేజ్‌కు తగ్గట్లు లేవనేది నిజం. ఇక 'గీత గోవిందం' హీరోయిన్ రష్మికా మందన్నతో కలిసి అతను నటించిన 'డియర్ కామ్రేడ్' మూవీకి వచ్చిన బజ్ చూస్తే, విజయ్ కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందేమో అనిపించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి రిలీజైన ఆ మూవీ అంచనాలను అందుకోలేక చతికిలపడింది.  ఈ నేపథ్యంలో విజయ్‌పై ఒత్తిడి పెరిగింది. నెక్స్ట్ వచ్చే సినిమా పెద్ద హిట్టవ్వకపోతే.. అతనికి వచ్చిన క్రేజ్ అంతా గాలివాటమనే విమర్శలకు బలం చేకూరుతుంది. అందుకు తగ్గట్లే విశ్లేషకులు, విమర్శకులు 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీపై దృష్టి సారిస్తున్నారు. అయితే ఫిబ్రవరి 14న 'ప్రేమికుల రోజు' సందర్భంగా ఆ సినిమా విడుదలవుతుందని నిర్మాతలు ప్రకటించినా, ఇంతదాకా దానిపై బజ్ స్టార్ట్ కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దానికి తగ్గట్లే ఆ సినిమా థియేట్రికల్ రైట్స్ కొనడానికి అగ్రిమెంట్ చేసుకున్న ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ చదలవాడ శ్రీనివాసరావు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని చదలవాడ 24 కోట్ల రూపాయలకు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ హక్కుల్ని కొనుగోలు చెయ్యడానికి ఒప్పందం చేసుకున్నారని తెలిసింది. అడ్వాన్స్ కింద 4 కోట్ల రూపాయలను కూడా ఆయన చెల్లించినట్లు సమాచారం. అయితే ఆంధ్ర, రాయలసీమ ఏరియాల నుంచి ఈ మూవీని కొనేందుకు బయ్యర్స్ ఆసక్తి చూపించకపోవడంతో ఆయన పునరాలోచనలో పడ్డారనీ, అందుకే పూర్తిగా చేతులు కాలక ముందే బయటపడటం మంచిదనుకొని తను ఆ సినిమాని రిలీజ్ చెయ్యలేనని చిత్ర నిర్మాత కె.ఎస్. రామారావుకు చెప్పేసినట్లు ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.  దీన్ని బట్టి 'వరల్డ్ ఫేమస్ లవర్'కు మార్కెట్‌లో క్రేజ్ రాలేదని తెలుస్తోంది. ఈ మూవీ డైరెక్టర్ క్రాంతిమాధవ్ ట్రాక్ రికార్డ్ కూడా దీనికి దోహదం చేస్తున్నదనే మాట వినిపిస్తోంది. నిజానికి క్రాంతిమాధవ్‌కు సెన్సిబుల్ డైరెక్టర్ అనే పేరుంది. ఆయన ఇదివరకు 'ఓనమాలు', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'ఉంగరాల రాంబాబు' సినిమాలను డైరెక్ట్ చేశాడు. వీటిలో ఏ ఒక్కటీ సూపర్ హిట్ కాలేదు. 'ఓనమాలు' సినిమాలో అనుబంధాలను బాగా చూపాడనే పేరు తెచ్చుకున్నాడు. శర్వానంద్, నిత్యా మీనన్ నటించిన 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాను రూపొందించిన తీరుతో సెన్సిబుల్ డైరెక్టర్‌గా విమర్శకుల మెప్పు పొందాడు. సునీల్ హీరోగా తీసిన 'ఉంగరాల రాంబాబు' మూవీ ఆయనకు కానీ, సునీల్‌కు కానీ పేరు తీసుకురాలేదు. ఇలాంటి బ్యాకింగ్‌తో ఆయన విజయ్‌ను 'వరల్డ్ ఫేమస్ లవర్'గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ 'అర్జున్‌రెడ్డి' లుక్‌ను తలపించిన విషయం మనకు తెలుసు. ఇది చాలామందిని డిజప్పాయింట్ చేసింది. విజయ్ నుంచి అతని ఫ్యాన్స్ చాలా ఆశిస్తున్నారు. అతడిని కొత్తగా చూడాలని వాళ్లు కోరుకుంటున్నారు. వాళ్ల అంచనాలకు తగ్గట్లు 'వరల్డ్ ఫేమస్ లవర్' ఉంటాడా? లెటజ్ వెయిట్ అండ్ సీ...
ఓ మనిషి చావును కూడా ఓ ఉత్సవంలా, పండగలా సెలెబ్రేట్ చేసుకోవాలనే కాన్సెప్ట్ తో దర్శకుడు మారుతి తెరకెక్కించిన సినిమా 'ప్రతిరోజూ పండగే'. సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించారు. ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి మదర్, హీరో సాయి తేజ్ అమ్మమ్మ అంజనాదేవి విడుదల చేశారు. ఆ ట్రైలర్ చూశాక... ప్రేక్షకుల వచ్చే డౌట్ ఒక్కటే. ఇదేదో 'శతమానం భవతి' కాన్సెప్ట్ లా ఉందే అని! 'శతమానం భవతి'లో విదేశాల్లో స్థిరపడిన పిల్లలను సొంతూరు రప్పించడం కోసం, కన్నతల్లికి చూపించడం కోసం 'మీ అమ్మకు విడాకులు ఇస్తున్నాను. మీరు వచ్చి ఎవరో ఒకరు తీసుకువెళ్ళండి' అని ప్రకాష్ రాజ్, తన పిల్లలకు ఈ-మెయిల్ చేస్తాడు. 'ప్రతిరోజూ పండగ' ట్రైలర్ చూస్తే... తనకు కాన్సర్ అని విదేశాల్లో స్థిరపడిన పిల్లలకు సత్యరాజ్ మెయిల్ చేస్తాడు. దాంతో రెండు కథలకు దగ్గర దగ్గర పోలికలు ఉన్నాయేమో, 'శతమానం భవతి' కథను కాస్త మార్చి 'ప్రతిరోజూ పండగే'లా మారుతి తీస్తున్నాడు ఏమో అని సందేహాలు వచ్చాయి. బహుశా... మారుతికి అటువంటి సందేహమే వచ్చి ఉంటుంది. అందుకని, ట్రైలర్ చివరలో రావు రమేష్ చేత ఒక డైలాగ్ చెప్పించారు. టిక్ టాక్ లో ఫేమస్ అయిన అమ్మాయి ఏంజెల్ ఆర్నగా రాశీ ఖన్నా క్యారెక్టరైజేషన్, సత్య రాజ్, రావు రమేష్ నటన, సాయి తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్... మారుతి కామెడీ టైమింగ్.‌.‌‌. 'ప్రతి రోజు పండగే' ట్రైలర్ ను ఆసక్తికరంగా మార్చాయి.
"ఇక్కడ (తెలుగులో) చాలా బిజీగా ఉన్నాను అండీ! సౌత్ సినిమాలకు పెద్ద రీచ్ ఉంటోంది. ఇక, హిందీకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? హిందీ ఎందుకు?" అంటోంది రాశీ ఖన్నా. ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ చేతి నిండా తెలుగు సినిమాలు ఉన్నాయి. ఈ నెల 13న విడుదలవుతున్న 'వెంకీ మామ'లో నాగచైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటించింది. వారం తర్వాత ఈ నెల 20న సాయి తేజ్ జోడీగా 'ప్రతిరోజూ పండగే'లో కనిపించనుంది. మళ్లీ ఫిబ్రవరిలో ప్రేమికుల రోజున విజయ్ దేవరకొండ సరసన ఓ కథానాయికగా 'వరల్డ్ ఫేమస్ లవర్'లో కనిపించనుంది. సాధారణంగా తెలుగులో స్టార్ట్ స్టేటస్ వచ్చిన తర్వాత హిందీలో ఛాన్సుల కోసం చాలామంది ఉత్తరాది అమ్మాయిలు ప్రయత్నిస్తారు. కానీ, రాశీ ఖన్నా మాత్రం హిందీలో అవకాశాల కోసం తెలుగును వాడుకోనని అంటోంది.  "సౌత్ సినిమాలతో పోలిస్తే బాలీవుడ్ కి బిగ్గర్ రీచ్ ఉందేమో. కానీ, బాలీవుడ్ సినిమాలు చేయడమే నా లక్ష్యం కాదు. బాలీవుడ్ కి వెళ్ళడానికి సౌత్ సినిమాలను వాడుకోవాలని లేదు. హిందీ, కన్నడ, మలయాళం, తెలుగు, తమిళం... ఎక్కడ మంచి పాత్ర దొరికితే అక్కడ చేయాలనేది నా అభిమతం. ఇక్కడ నుండి మెల్లమెల్లగా అక్కడికి వెళ్ళాలని నేను అనుకోవడం లేదు. హిందీ నుండి అవకాశాలు వస్తున్నాయి. అయితే... చాలామంచి పాత్ర వస్తేనే వెళతాను. లేదంటే రెండు పడవల మీద ప్రయాణం చేయను" అని 'వెంకీ మామ' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశీ ఖన్నా తెలిపింది.
'సరిలేరు నీకెవ్వరు' విడుదల తర్వాత సూపర్‌స్టార్ మహేష్‌బాబు మూడు నెలలు బ్రేక్ తీసుకోనున్నారు.  తర్వాత ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తారనేది ఇప్పటివరకూ ఒక పజిల్. కానీ, ఇకపై కాదు. 'కెజిఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్, రాజమౌళి, త్రివిక్రమ్... పలువురి దర్శకుల పేర్లు మహేష్ పేరుతో వినిపించాయి. ఆ కాంబినేషన్లో సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని ఫిలింనగర్ వర్గాల్లో వినిపించింది. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే... 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ సినిమా చేయనున్నాడు.  మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన 'మహర్షి' మంచి విజయం సాధించింది. ఆ తర్వాత తన తదుపరి సినిమా మహేష్ తో ఉండొచ్చని వంశీ పైడిపల్లి నుండి లీకులు వచ్చారు. ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. లొకేషన్ రెక్కీ కోసం విశాఖపట్టణం వెళ్ళినప్పుడు మహేష్ తో మరోసారి సినిమా చేయబోతున్నట్టు వంశీ పైడిపల్లి స్పష్టం చేశారు. ఈ సినిమాను కూడా దిల్ రాజు నిర్మించనున్నారని టాక్. 
  కరీంనగర్ జిల్లాలో చొప్పదండి నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ చర్చనీయాంశంగానే నిలుస్తాయి. అక్కడి ప్రజాప్రతినిధులు ఒకరి పై ఒకరు చేసుకునే ఆరోపణలు రాజకీయంగా వేడి రాజేస్తాయి. రాజకీయపరంగా విమర్శలు.. ప్రతివిమర్శలు..ఉంటేనే రాజకీయం కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా రాజకీయ విమర్శలన్ని ఆస్తులు.. అవినీతి ఆరోపణల చుట్టూ తిరుగుతుంటాయి. చివరికీ ఎమ్మెల్యేలకు ఉచ్చు బిగించడమే కాదు రాజకీయంగా ఇరకాటంలో పడవేస్తుంటాయి. ఇలాంటి వ్యవహారాలు గతంలో కూడా చాలానే జరిగాయి.  రాష్ట్ర విభజన అనంతరం.. చొప్పదండి నియోజకవర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికైన బొడిగ శోభపై కూడా ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలే ఎక్కుపెట్టాయి. నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ధికి ఎమ్మెల్యే మాములు వసూలు చేసే వారని.. కమీషన్ లేనిదే సంతకాలు పెట్టేవారు కాదంటూ.. ఆరోపణలొచ్చాయి. ఇది రెండేళ్ళ క్రితం నాటి కథ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆమె స్థానంలో సుంకె రవిశంకర్ తెరమీదకొచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. అవినీతి ఆరోపణలతో చొప్పదండి నియోజక వర్గ రాజకీయాలు మళ్లీ రెండేళ్లు వెనక్కి వెళ్లాయి. రవిశంకర్ పై కూడా అక్రమాస్తులకు సంబంధించి ఆరోపణలు రావడంతో చర్చ మొదలైంది. శోభకు ఎదురైన పరిస్థితులే ఇప్పుడు రవిశంకర్ కు ఎదురవుతున్నాయి. మరిప్పుడు ఆయన ఎలా ఎదుర్కొన్నాడనే డిస్కషన్ కార్యకర్తల్లో మొదలైంది.  మరోవైపు ప్రతిపక్షాలకు తమ పార్టీ నుంచే ఎవరో ఒకరు లీకులిస్తున్నారనే అనుమానాలు కూడా టీఆర్ఎస్ వర్గాల్లో కలుగుతున్నాయి. ఎక్కడి నుంచి లీకయిందనే విషయం తెలిసినా బయటకు చెప్పలేకపోతున్నారు. దీనిని ఉపయోగించుకొని కాంగ్రెస్ తన వద్ద ఉన్న సమాచారంతో ఎమ్మెల్యే పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది. ఎమ్మెల్యే రవిశంకర్ పాత ఎమ్మెల్యేనే ఫాలో అవుతున్నారనే విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలకు టీఆర్ఎస్ నేతల సైతం కౌంటర్ ఎటాక్ చేయడం మొదలెట్టారు. తమ ఎమ్మెల్యే నీతి నిజాయితీని శంకిస్తే సహించేది లేదంటూ మండిపడుతున్నారు. టీఆర్ఎస్ - కాంగ్రెస్ నాయకుల మధ్య ఆరోపణలను పక్కనబెడితే ఇదంతా అధికార పార్టీ నుంచే కాంగ్రెస్ కు సమాచారం వెళుతుందని అనుకుంటున్నారు. ఓవరాల్ గా చొప్పదండిలో వస్తున్న అవినీతి ఆరోపణల విషయం మాత్రం ఎమ్మెల్యేలకు కామన్ అయిపోయింది. దీంతో ఆ పదవిలో ఉండేవాళ్లు ఇదేం ఖర్మరా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు.
  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగిన నాయకులు.. సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించిన రవీందర్ రెడ్డి పక్కా టీఆర్ఎస్ కాండిడేట్ అని చెప్పుకోవచ్చు. 2004 లో రాజకీయ అరంగేట్రం చేసిన రవీంద్రరెడ్డి ఇంతవరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే స్థానానికి ఆరుసార్లు పోటీ చేయగా నాలుగు సార్లు గెలిచారు, రెండుసార్ల ఓడిపోయారు. 2008 ఉప ఎన్నికల్లో ఓసారి, 2018 ఎన్నికల్లో మరోసారి పరాజయం పాలయ్యారు. మిగతా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన ఇతర పదవులు పదోన్నతులు మాత్రం పొందలేకపోయారు. పార్టీ అధిష్టానంలో ఆయన పట్టు సాధించలేకపోవడం ఒక కారణమైతే జనంలో వ్యతిరేకత పెరగడం మరో కారణంగా మారింది. దీంతో గత ఎన్నికల్లో రవీందర్ రెడ్డి పరిస్థితి ఆశాజనకంగా లేదని నిఘా వర్గాలు ముందుగానే సంకేతాలిచ్చాయి. అభ్యర్థిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఎల్లారెడ్డి స్థానం గెలిచే అవకాశం లేదని గులాబీ బాస్ కు ముందస్తుగా వర్తమానం కూడా అందింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలో ఎనిమిదింటిని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ ఎల్లారెడ్డిలో మాత్రం పరాజయం పాలైంది. ఇక్కడ కాంగ్రెస్ కు చెందిన నల్లమడుగు సురేందర్ చేతిలో సుమారు 34 వేల ఓట్ల తేడాతో రవీందర్ రెడ్డి పరాజయం పాలయ్యారు.  రాష్ట్రమంతటా అనుకూల పవనాలు వీచినప్పటికీ ఎల్లారెడ్డిలో మాత్రం ఎదురుగాలి తగలడంతో పార్టీ పెద్దలు ఖంగుతిన్నారు. ఇది కేవలం రవీందర్ రెడ్డి స్వయంకృతాపరాధమేనని తేల్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నల్లమడుగు సురేందర్ టీఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమో.. తన మనుగడ కోసమో తెలీదు కానీ నల్లమడుగు సురేందర్ గులాబీ గూటిలో చేరడంతో ఎల్లారెడ్డి రాజకీయం రంజుగా మారింది. స్వపక్షంలోనే విపక్షం తయారు కావడంతో టిఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ రెడ్డి తన ఉనికి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 15 ఏళ్లుగా తన వెంట ఉంటున్న అనుచరుల కోసం గట్టిగా పని చేయాలని ఆయన భావించారు. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తన వర్గీయులకు టికెట్లు ఇప్పించేందుకు నానా ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ వర్గాన్ని ఢీకొనేందుకు సొంతంగా ప్రతి మండలంలో తన అనుచరులను రంగంలోకి దింపారు. ఈ ఇరువర్గ పోరు కారణంగా నియోజకవర్గంలో కొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల ఫలితాలొచ్చాయి. ఎల్లారెడ్డి జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నాగిరెడ్డిపేట ఎంపిపి కుర్చినీ స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు. మిగతావన్నీ టీఆర్ఎస్ ఖాతాలో పడినప్పటికీ వారంతా ఎమ్మెల్యే సురేందర్ వర్గీయులు కావడం విశేషం. అప్పటి నుంచి రవీందర్ రెడ్డి తన పంథా మార్చారు. మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని భవిష్యత్ కోసం వాడుకోవాలని చూస్తున్నారు. వారి అనుచరుడిగా చలామణి అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం.  ప్రధానంగా తాను హరీశ్ రావు వర్గియుడనని చాటుకునే ప్రయత్నాలను ఏనుగు రవీందర్ రెడ్డి ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని తన వర్గీయులను హరీశ్ రావు, ఈటెల రాజేందర్ వద్దకు తీసుకెళ్లి పరిచయం చేస్తున్నారు. ఇటీవల వరుసగా 3 రోజుల పాటు తన వారిని తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కల్పించారు. ఎల్లారెడ్డి, లింగంపేట, సదాశివనగర్, గాంధారి మండలాలకు చెందిన నాయకులను పరిచయం చేసి ఇదంతా తన వర్గమని చూపించారు. హరీశ్ రావుకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇలా దూకుడు పెంచారు. దీంతో పాటు ఎల్లారెడ్డిలో తన వర్గీయులతో ఏనుగు రవీందర్ రెడ్డి ప్రత్యేక శిబిరం నడుపుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే పార్టీ సమావేశాలు చర్చలు రవీందర్ రెడ్డి శిబిరంలోనే జరుగుతున్నాయి. అధికారికంగా ఎమ్మెల్యే సురేంద్ర నడుపుతున్న ఆఫీస్లో ఈయన వర్గీయులెవరూ కనిపించడం లేదు. రవీందర్ రెడ్డి వర్గీయులు ఇంత వరకు ఎమ్మెల్యే ఆఫీసు గడప కూడా తొక్కలేదు,అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు, ఎమ్మెల్యే నిర్వహించే పార్టీ సమావేశాలు సభలకు హాజరవడం లేదు, రవీందర్ రెడ్డి వచ్చినపుడు మాత్రమే వారు ఎల్లారెడ్డిలో దర్శనమిస్తున్నారు, అది కూడా రవీందర్ రెడ్డి వెంట ఆయన ఉన్నంత సేపు హడావుడి చేసి తిరిగి వెళ్ళిపోతున్నారు. దీంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇరువర్గాల పోరు నానాటికీ ముదురుతున్నట్టు కనిపిస్తోంది.  ఇక త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వర్గపోరు ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశాలున్నాయి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అయ్యాక తొలిసారి జరిగే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందోనని కార్యకర్తలు ఆందోళనకు చెందుతున్నారు. కౌన్సిలర్ ల టికెట్ లు మొదలు వారిని గెలిపించుకునే వరకు ఇటు నల్లమడుగు సురేందర్, అటు ఏనుగు రవీందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించే సూచనలున్నాయి. ఇప్పటికే రవీందర్ రెడ్డి తన అనుచరుల్ని మున్సిపల్ చైర్మన్ చేయాలని భావిస్తున్నారు, ఆ అభ్యర్థి పేరు కూడా ఖరారు చేశారు. దీనిపై హరీశ్ రావు ద్వారా అంతర్గత ప్రయత్నాలు కూడా చేస్తున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే సురేంద్ర మాత్రం కేటీఆర్ ద్వారా తన పరువు ప్రతిష్ట కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. మొదటి నుంచి హరీశ్ రావు అనుచరుడిగా ఉన్న రవీంద్రరెడ్డిపై సహజంగానే కేటీఆర్ కు సానుభూతి లేదు. దీనికి తోడు ఆయన ఇటీవల హరీశ్ రావు, ఈటెల రాజేందర్ వెంట తిరగడంతో కేటీఆర్ దృష్టిలో బలంగా నాటుకుపోయారు. ఈ వర్గపోరు కారణంగా ఏనుగు రవీందర్ రెడ్డిని మరింత దూరం చేసేందుకు ఎమ్మెల్యే సురేందర్ పావులు కదుపుతున్నారు. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో ఏనుగు రవీందర్ రెడ్డి ఇంకా ఎందుకు దూకుడు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడంలేదని కార్యకర్తలు అనుకుంటున్నారు. మొత్తం మీద ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే అయోమయంలో స్థానిక గులాబీ దళం ఉండగా అన్నీ కలిసొస్తే హరీశ్ రావు నీడను మళ్లీ అందలం ఎక్కుతాననే ఆశ విశ్వాసం మాత్రం ఏనుగు రవీందర్ రెడ్డికి ఉంది. మరి ఎవరి ఆశలు నెరవేరుతాయో ఎవరి అంచనాలు ఫలిస్తాయో చూడాలి.
రెండు మాసాలు సమ్మె చేశారు.. రెక్కాడితే కానీ డొక్కాడదని తెలిసి కూడా ఫలితం కోసం ముందడుగు వేశారు. ప్రభుత్వానికి.. విపక్షాలకి.. మధ్య కార్మికులు అనిగిపోయారనే విధంగా అనుకునే స్థాయిలో సమ్మె ముగింపు దారితీసింది. ఇదిలా ఉండగా.. సూర్యాపేట డిపో , ఎల్.కృష్ణ అనే ఆర్టీసీ కండెక్టర్.. సమ్మె కాలంలో తాను అనుభవించిన క్షోభను..మనోవేధనను ఒక లేఖలో సీఎం కేసీఆర్ గారికి రాసాడు. ఆ లేఖలో ఇలా రాసాడు." గౌరవనీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి , తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో ఉద్యోగం చేద్దామనుకున్నా.. ఆత్మగౌరవంతో బతుకుదామనుకున్నా..కానీ మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో కాదు కదా కనీసం తెలంగాణలో ఎందుకు పుట్టాను రా నాయనా అనే విధంగా తీవ్ర మానసిక వేదనకు గురై.. నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. మీకు మాట తప్పడం మాయ మాటలు చెప్పి మోసం చేయడం తెలుసని మా కార్మికలోకం లేటుగా తెలుసుకుంది. మీరు ఉద్యోగంలో నుండి తీసేయడం కాదు.. నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. దీనికి కారణం లేకపోలేదు సార్.. మా తెలంగాణలో నియంతృత్వం చూస్తా అని అనుకోలేదు. 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే మన కేసీఆర్ సారూ ఉన్నారు కదా అనుకున్నాను. ఆంధ్రా పాలకులు నిజంగా మోసం చేశారేమో మనల్ని ఈయన బాగా చూసుకుంటారని అనుకున్నా కానీ సార్.. 20 మందికి పైగా కార్మికులు చనిపోతే మీరు కనీసం స్పందించలేదు చూడండి సార్ అప్పుడనిపించింది సార్ తెలంగాణ మా కోసం కాదు తెలంగాణ కేవలం మీలాంటి నాయకుల కోసమే అని. నా అక్క చెల్లెమ్మలు లాఠీ దెబ్బలు తింటారని కలలో కూడా ఊహించలేదు సార్.. కానీ మీ బంగారు తెలంగాణలో అది సాధ్యమైంది. సార్ నా చెల్లెళ్లు ఏడుస్తుంటే.. రోజూ నా సోదరులు బాధపడుతుంటే.. తట్టుకోలేకపోతున్నా.. సార్, కానీ ఒక్కటి మాత్రం నిజం సార్ నా ఆర్టీసీ అక్కాచెల్లెళ్ళ ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుంది. సార్ నేను సూర్యపేట డిపోలో ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మీలాంటి ఒక్క మోసకారి, ఒక్క మాటకారి, ఒక్క మానవత్వం లేని ఒక నిరంకుశ ప్రభుత్వంలో నా ఆత్మాభిమానాన్ని చంపుకుని ఉద్యోగిగా పని చేయలేను. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా నా పేరు ఎల్ కృష్ణ, నా స్టాఫ్ నెంబర్ 176822, సూర్యాపేట డిపో సార్ నాది, నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను మీ సంస్థ నుండి నాకు రావలసిన బకాయిలు ఇప్పించి నా రాజీనామాను ఆమోదించగలరని నా యొక్క మనవి. అయ్యా సీఎం సార్ గారూ మీరు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకొండి. ఇప్పుడు మీ వైఖరి గుర్తు చేసుకోండి, పాపం సార్ ఆర్టీసీ వాళ్లు మిమ్మల్ని చాలా అభిమానించారు సార్. కానీ మీరు ఇలా చేస్తారని కలలో కూడా ఊహించి ఉండరు. సార్ ఆర్టీసీ కార్మికులు వాళ్లకొచ్చే రూ.16,000 రూపాయల జీతం తీసుకుని ఫ్యామిలీని చూసుకుంటూ చాలా గౌరవంగా బతుకుతున్నారు సార్.మీరు వాళ్ళకేమీ ఇవ్వకున్నా కనీసం పిలిచి మాట్లాడి ఉంటే మీ మీద గౌరవంతో ప్రాణాలిచ్చే వారు సార్. కనీసం నేను మీ బంగారు తెలంగాణలో సంతోషంగా లేను, కనీసం మా తల్లితండ్రులను అయినా సంతోషంగా ఉండేటట్లు నెలనెలా వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ నివ్వండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి.. మా కేసీఆర్ అని ఓటు వేశారు సార్. ప్రతి రోజూ ఈ అరెస్ట్ లేంది, ఈ లాఠీ దెబ్బలు ఏంది సార్, నా ఆర్టీసీ సోదరులు ఏం తప్పు చేశారని ఇంకా ఎంతమందిని ఆత్మహత్యలూ చేసుకునేటట్టు చేస్తారు. అందుకే ఇవన్నీ భరించలేకనే నా ఆత్మాభిమానాన్ని చంపుకునే ఉద్యోగం చేయలేను, అందుకే నేను మీ బంగారు తెలంగాణలో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగిని కాదు, మీ మాయ మాటలు నమ్మి మోసపోయిన తెలంగాణ సమాజంలోని వ్యక్తిని, నీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిగా ఉన్నాను కాబట్టి తక్షణమే నా తల్లితండ్రులకు వృద్ధాప్య పింఛను ఒకటి ఇవ్వండి. పేరు మీద సెంటు భూమి లేదు కాబట్టి మూడెకరాల పొలం, అలాగే నా పిల్లలకి ప్రభుత్వ స్కూల్ లో చదువు, నాకు ఉండటానికి ఇల్లు లేదు కనుక డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వండి ఒకవేళ మీరు ఏమి ఇవ్వకున్నా సమాజంలో గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని కోరుతూ అలాగే నా ఉద్యోగ రాజీనామాను తక్షణమే ఆమోదించగలరు. ఇట్లు ఎల్ కృష్ణ, స్టాఫ్ నెంబర్ 176822, ఆర్టీసీ కండక్టర్ సూర్యాపేట డిపో. " ఇలా తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ గారికి పంపించాడు. ఇలా అందరూ రాస్తే రోజు పుస్తకాలు చదవడం మానేసి లెటర్లు చదువుకోవాలని కొందరు అంటుంటే.. అలా చదివితేనైనా మానవత్వం అనేది పుట్టుకొస్తది మా కేసీఆర్ కి అని కొందరు అంటున్నారు.
  2019 ఎన్నికల్లో శ్రీ కాకుళం జిల్లాలో ఫ్యాన్ గాలి బలంగానే వీచింది. సిక్కోలులో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 8 చోట్ల వైసీపీ అభ్యర్ధులు గెలిచారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వీచిన వ్యతిరేక పవనాలు సిక్కోలును తాకాయి. దీంతో టిడిపి డీలా పడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత అధికార వైసీపీ నేతల్లో మంచి జోష్ కనిపించింది. ఇక సిక్కోలులో పార్టీకి తిరుగులేదనే తీరులో ఉన్నారు నేతలు. మెజారిటీ సీట్లు సాధించమన్న ధీమా వారిలో ఏర్పడింది. అయితే వైసీపీ అధికారం లోకి వచ్చి 6 నెలలు గడవక ముందే ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కేడర్ ను గందరగోళానికి గురి చేస్తున్నాయని లోకల్ టాక్.  వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధర్మాన కుటుంబం పెద్ద దిక్కుగా చెప్పాలి. పార్టీ ఆవిర్భావ సమయంలో జిల్లాలో వైసీపీ జెండా చేపట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. అలాంటి సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవిని వదిలేసి ధర్మాన కృష్ణదాస్.. వైయస్ జగన్ కు బాసటగా నిలిచారు. అంతేకాదు ఆ పార్టీకి మేమున్నామంటూ కృష్ణదాస్ భార్య పద్మప్రియ పార్టీ జిల్లా బాధ్యతలు స్వీకరించారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న కృష్ణదాస్ కుటుంబానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సముచిత స్థానం కల్పించారు.తన క్యాబినెట్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా క్రిష్ణదాసును నియమించారు. దీంతో విధేయతకు జగన్ పట్టం గట్టారన్న భావన పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది.  ఇక రాజకీయ అనుభవం విషయానికొస్తే ధర్మాన సోదరుల్లో ప్రసాదరావు సీనియర్.. గతంలో ధర్మాన ప్రసాదరావు , క్రిష్ణదాసు వేర్వేరు పార్టీలు ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రసాదరావు సైతం వైయస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరారు. మొన్నటి ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో, క్రిష్ణదాస్ నరసన్నపేట అసెంబ్లీ స్థానంల్లో విజయం సాధించారు. సీనియర్ కాబట్టి ధర్మాన ప్రసాదరావుకే మంత్రి పీఠం దక్కుతుందని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ జగన్ వ్యూహాత్మకంగా ఈ సోదరుల్లో పెద్దవాడైన కృష్ణదాస్ కి మంత్రి కుర్చీ వేశారు.అంతే అప్పటి నుంచి ఈ ధర్మాన సోదరుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.  సిక్కోలులో ఏదైనా ప్రభుత్వం  పథకాన్ని లేదా ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు జిల్లా కేంద్రంలో శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. అందులో జిల్లా మంత్రిగా ఉన్న కృష్ణదాస్ ముఖ్య అతిథిగా పాల్గొనడం సహజం. అయితే కృష్ణదాస్ అటెండవుతున్న కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన ప్రసాదరావు డుమ్మా కొడుతుండటం కొత్త చర్చకు దారితీస్తుంది. గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక పత్రాలు జారీ, సన్న బియ్యం పంపిణీ, అగ్రి గోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ, వైయస్ఆర్ వాహన మిత్ర వంటి పలు కార్యక్రమాలనూ జిల్లా అధికార యంత్రాంగం శ్రీకాకుళంలో అట్టహసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో ఎక్కడా ప్రసాదరావు జాడ కనిపించలేదు.  ఇటీవల జరిగిన ఓ పరిణామం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు తెరతీసింది. జిల్లా ఇన్ చార్జి మంత్రిగా నియమితులైన కొడాలి నాని నవంబర్ 14 న సిక్కోలు పర్యటనకు వచ్చారు. అయితే జిల్లా కేంద్రానికి వచ్చిన కొడాలి నాని స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఇంటికి అల్పాహార విందుకు వెళ్లారు. అదే సమయంలో మంత్రి క్రిష్ణదాస్ సైతం కొడాలి వెంట ప్రసాదరావు ఇంటికెళ్లారు. బ్రేక్ ఫాస్ట్ అనంతరం కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఈ అన్నదమ్ములిద్దరి మధ్య మరింత దూరం పెంచాయని స్థానికంగా కొందరు చెప్పుకుంటున్నారు. ఈ జిల్లాలో మంత్రి క్రిష్ణదాస్ ఉండేమి లాభం? స్పీకర్ తమ్మినేని తప్ప మిగతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలెవరూ తెలుగుదేశం పార్టీ పై విమర్శలు చేయడం లేదు అంటూ కొడాలి నాని చురకలంటించారు. అక్కడితో ఊరుకోకుండా అక్కడే ఉన్న కృష్ణదాస్ వైపు చూస్తూ రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ కూడా తమ్మినేని గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయనను చూసైనా నేర్చుకోండి అని కామెంట్ చేశారు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్న మంత్రి కృష్ణదాస్ అక్కడ్నించి వెళ్లిపోయారు. బయటకు వెళుతున్న సమయంలో కృష్ణదాస్ ను ధర్మాన ప్రసాదరావు చిరునవ్వుతొ ఆపి అన్న బయటకు వెళ్లాల్సిన దారి అటుకాదు ఇటూ అంటూ కాస్త వెటకారం ప్రదర్శించారు. అప్పటికే ఆవేశంతో ఉన్న క్రిష్ణదాసు ఆ దృశ్యాలను కెమెరాలో క్లిక్ మనిపిస్తున్న మీడియా వారిపై మండిపడ్డారు.  వాస్తవానికి కృష్ణదాస్ కి సున్నిత మనస్కుడని పేరుంది. అయితే ఇసుక వారోత్సవాలకు హాజరైన మంత్రి కృష్ణదాస్ తన సహజశైలికి భిన్నంగా వ్యవహరించారు. టిడిపి నేతలను ఉద్దేశించి అసభ్య పదాలు వాడేశారు. కృష్ణదాస్ నోటి వెంట అలాంటి మాటలు రావటం చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోయారు. అయితే లోతుగా ఆరా తీస్తే అసలు సంగతి తెలిసింది.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఈ అన్నదమ్ముల మధ్య కొడాలి నాని ఆజ్యం పోశారని స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చర్చించుకుంటుంది.నిజానికి మంత్రి కృష్ణదాస్ కు సిక్కోలులో సహాయనిరాకరణ జరుగుతోందనే చర్చ కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది. జిల్లా కేంద్రంలో జరుగుతున్న మంత్రి పర్యటనల్లో నరసన్నపేట కార్యకర్తల మినహా ప్రసాదరావు అనుచరులెవరూ కనిపించటం లేదు. ఈ తరుణంలో ధర్మాన సోదరుల మధ్య పెరుగుతున్న అంతరం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్న ఆందోళన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పెరుగుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
  కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించుకోలేని దుస్థితిలో రాష్ట్ర ఆర్థిక శాఖ కూరుకుపోయింది. కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేసి వాటికి యూసీలు చెల్లిస్తే తిరిగి నిధులు తెచ్చుకోవచ్చు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆర్థిక శాఖనే తన అంచనాల్లో గణాంకాల రూపంలో అంగీకరించడం గమనార్హం. భూములు అమ్మడం, అప్పులు చేయటం ఈ నిధులను పథకాలకు మళ్లించటం తప్ప ఆదాయం పెంచుకునే మార్గం ఒక్కటి కూడా ఈ శాఖకు కనిపిస్తున్నట్లుగా లేదు. బడ్జెట్ లో కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి 32,040 కోట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ మార్చి చివరికి ఈ పద్దు కింద రూ.14,235 కోట్లు వస్తాయని ఆ శాఖ భావిస్తోంది. అంటే దాదాపు రూ.17,805 కోట్లు తగ్గుతున్నాయి.  రాష్ట్ర ఆదాయ వనరుల తీరుతెన్నులపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం విజయవాడలో ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.2.31 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక శాఖ రూ.2.26 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కానీ వచ్చే మార్చి నాటికి కేవలం రూ.1.4 లక్షల కోట్ల ఆదాయం వస్తే గొప్ప అన్నట్టుగా ఉంది పరిస్థితి. బడ్జెట్ అంచనాలకు వాస్తవ ఆదాయం మధ్య తేడా రూ.86,000 ల కోట్లకు పైగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మొత్తం లోటును పూడ్చడం అసాధ్యం. కేంద్రం నుంచి ఏకంగా గ్రాంట్ల రూపంలో రూ.61,071 కోట్లు వస్తాయని బడ్జెట్ లో ప్రతిపాదించారు. మార్చి నాటికి ఆ పద్దు కింద రూ.17,665 కోట్లే వస్తాయని ఆర్థిక శాఖ అంచనాలు సిద్ధం చేశారు. అంటే గ్రాంట్ల రూపంలో వచ్చే ఆదాయమే రూ.43,406 కోట్లు తగ్గిపోతుంది. రాష్ట్ర స్వంత పన్ను ఆదాయం రూ.18,230 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.3,539 కోట్లు, పబ్లిక్ రుణాలు రూ.3,000 ల కోట్లు, కేంద్ర పథకాల నిధులు రూ.17,805 కోట్లు, పన్నుల్లో వాటా రూ.9,000 కోట్లు తగ్గే అవకాశాలున్నాయి. ఈ లోటు నిధుల మొత్తం రూ.94,000 కోట్లకు పైగా ఉంది.  కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.34,883 కోట్లు వస్తాయని బడ్జెట్ లో పేర్కొన్నారు. కానీ మొదటి త్రైమాసికంలో ఈ పద్దు కింద రూ.6,398 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.6,623 కోట్లు వచ్చాయి, మూడో త్రైమాసికంలోని మొదటి రెండు నెలల్లో రూ.4,440 కోట్లు వచ్చాయి. డిసెంబర్ లో రూ.2,200 ల కోట్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాలుగవ త్రైమాసికంలో మాత్ర పన్నుల్లో వాటా అమాంతం రూ.15,188 కోట్లకు పెరుగుతుందని ఆర్థిక శాఖ భావిస్తున్నది. వాస్తవానికి నాలుగో త్రైమాసికం లోనూ పన్నుల్లో వాటా రూ.6,600 ల కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రం సొంత పన్నుల ఆదాయం రూ.82,792 కోట్లు వస్తుందని బడ్జెట్ లో పెట్టారు. ఈ ఆదాయం రూ.18,230 కోట్ల మేర తగ్గి, రూ.64,562 కోట్లకు పరిమితమవుతుందని ఆర్ధిక శాఖ భావిస్తోంది. పన్నేతర ఆదాయం రూ.7,354 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అది కూడా రూ.3,539 కోట్లకు తగ్గుతుందని అంటున్నారు. పబ్లిక్ రుణాల రూపంలో రూ.32,417 కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. కానీ కేంద్రం మొదటి మూడు త్రైమాసికాలకు రూ.29,000 ల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ గడువు డిసెంబరుతో ముగుస్తుంది. నాలుగో త్రైమాసికానికి కేంద్రం అనుమతి లభిస్తేనే ఇంకో రూ.3,417 కోట్లు అప్పు రూపంలో తెచ్చుకోగలం. జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో పబ్లిక్ రుణాలు తీసుకునే అవకాశం ఉండదు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కాన్వాయ్ లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మంత్రి కాన్వాయిలో వెనుక వస్తున్న వాహనం బోల్తా పడి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో మంత్రుల కాన్వాయ్ లో తరచూ ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయని సమస్య మొదలైంది. కాన్వాయ్ లో ఏం జరుగుతోంది అని ఆరా తీస్తే అసలు విషయాలు బయటికొచ్చాయి. కాన్వాయ్ లో మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు. లేటెస్ట్ వెర్షన్ ఫార్చునర్ వాడుతున్నారు, అయితే ఇచ్చిన కారు సౌకర్యంగా లేదని మంత్రులు తమ సొంత కార్లలో ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన వాహనాన్ని వదిలి ఓల్వో, బెంజ్ కార్లలో తిరుగుతున్నారు. ఈ కార్లల్లో హై ఎండ్ ,సెకన్ లలో వంద కిలోమీటర్ల స్పీడ్ దాటి పరుగుపెడతాయి.దీంతో ఈ కారును స్పీడ్ ను కాన్వాయ్ లోని ఇతర వాహనాల్లో అందుకోలేకపోతున్నాయి. మంత్రి కారును అందుకోవాలని స్పీడుగా వెళ్లి పైలట్ ఎస్కార్ట్ సిబ్బంది వాహనాల ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా జరిగిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కాన్వాయ్ ప్రమాదంలోనూ ఇదే జరిగింది. తన సొంత బెంజ్ కారులో ఎర్రబెల్లి ప్రయాణం చేస్తే ఆయన కారును అందుకోవాలని స్పీడ్ గా కాన్వాయ్ వాహనం వెళ్ళిందని తెలిసింది. చివర్లో స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో ప్రమాదానికి గురైంది. గతంలో ఈటల రాజేందర్ కాన్వాయ్ లో వాహనం కూడా బోల్తా పడింది. అయితే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడం వల్ల ఆయన సురక్షితంగా బయట పడ్డారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్ లు కూడా అప్పుడప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వదిలి సొంత వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని పోలీసులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో మంత్రులందరూ ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడాలని సీఎం ఆదేశించారు. అయినప్పటికీ మళ్లి కొంత మంది మంత్రులు సొంత వాహనాన్ని వాడుతున్నారు. రూరల్ ఏరియా లో సింగిల్ రోడ్ల పై మంత్రుల కాన్వాయ్ కు తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు కంట్రోల్ తప్పి సామాన్యుల పై దూసుకెళుతున్నాయి. వరుసగా జరుగుతున్న ప్రమాదాల చూసైనా మంత్రుల తీరు మార్చుకోవాలని బయటికి చెప్పుకోలేక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
While going along with the fast moving world, we have forgotten to acknowledge what the present moment has for us. Similarly, our reactions to various situations in life are so quick, that sometimes we regret reacting in that manner. Fortunately, there is a simple way to deal with this. All you need to do is stop and thing before you do anything. We must understand that the past cannot be changed and the future cannot controlled. What we have in hand is the present so lets mold it in a way that makes us happy. Let us understand this, through a simple situation that we may experience very frequently.   Reacting to a person venting his or her frustration needs to be directed to the positive path. Shouting back at a frustrated person will only both of your peace of mine and then you may try to sooth this, you might take a glass of wine. Now just make slight changes in this situation. Instead of shouting, try and listen to what the person has to say. Either provide a solution or change the topic of discussion gradually. After reacting in this manner you will actually enjoy the glass of wine instead of just having it to get over a bad day. By taking time to react, you understand people and situations a lot better and it may also help you get rid of some your bad habits like smoking. Experts call this way of life, mindfulness. With developments in technology you can now incorporate mindfulness into your life through apps like   ­Calm in the Storm and Stop Breathe & Think. Start living like this and soon you will fall in love with your life. - Kruti Beesam  
  ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్‌ పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. మొన్నామధ్య ఏపీలో, ఇప్పుడేమో తెలంగాణలో ఇంటర్‌ ఫలితాల గురించే చర్చలు జరుగుతున్నాయి. మనకి తెలిసిన వాళ్ల ఇళ్లలో ఇంటర్ చదివే పిల్లలు ఎవరున్నారా అంటూ ఆసక్తిగా అందరూ ఫోన్లు చేస్తున్నారు. మార్కులు బాగా వస్తే అందరికీ సంతోషమే! కానీ తక్కువ వస్తేనో, లేక తప్పిపోతేనో అసలు సమస్య మొదలవుతుంది. పిల్లలు దిగాలు పడిపోవడం, డిప్రెషన్లోకి కూరుకుపోవడం, ఒకోసారి ఆత్మహత్యకి సైతం పాల్పడం జరుగుతూ ఉంటుంది. పరీక్షల్లో తప్పారన్న కారణంతో పిల్లలు తమ ఉసురుని తీసుకునే వార్తలు ఉసూరుమనిపిస్తాయి. పిల్లలు ఇలాంటి విపరీత మనస్తత్వంలోకి కూరుకుపోయినప్పుడు వారిని తిరిగి మామూలు మనుషులను చేసే సత్తా, బాధ్యతా తల్లిదండ్రుల మీద తప్పకుండా ఉంటుంది. ఇందుకోసం ఏం చేయాలంటే...     - పరీక్షా ఫలితాల తరువాత పిల్లవాడు డీలాగా కనిపిస్తుంటే అతనితో కాసేపు సమయాన్ని గడపండి. ఒకవేళ అతని దిగాలుకి ఫలితాలే కారణమైతే, అతనిలో ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నించండి. పిల్లవాడు క్రుంగుబాటుకి లోనైన ఈ కొద్ది రోజులలో అతనితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ కాలాన్ని కనుక వాళ్లు దాటేయగలిగితే, ఆత్మహత్య వంటి ఆలోచనలు కూడా దాటిపోతాయి. అందుకని పిల్లవాడు తిరిగి మామూలు స్థితికి వచ్చేదాకా అతన్ని ఓ కంట కనిపెడుతూ ఉండండి. అంతేకానీ అగ్నికి ఆజ్యం పోసేలా మీరు అతని ఫలితాల పట్ల నిరాశ చెందిన విషయాన్ని ప్రస్తావించవద్దు.     - ఇంటికి వచ్చినవారంతా పిల్లవాడి ఫలితాల గురించి పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. అలాంటి ప్రస్తావనని వీలైనంత త్వరగా ముగించేయండి. ‘కష్టపడ్డాడు కానీ...’, ‘మళ్లీ అందుకుంటాడు...’ లాంటి సానుకూలమైన వాక్యాలతోనే అతని ఫలితాల గురించి తెలియచేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కళ్ల ముందే వేరొకరు, మీ పిల్లవాడిని మందలించే అవకాశం ఇవ్వవద్దు. అతిథులతో ఫలితాలకు సంబంధించిన చర్చలను కూడా వీలైనంత క్లుప్తంగా ముగించేయండి.   -  తమ పిల్లవాడి తప్పాడన్న విషయం కంటే ఇతరుల పిల్లలు పాస్‌ అయ్యారన్న బాధే చాలామందికి ఉంటుంది. ఇది మానవసహజమే! కానీ ఇలాంటి సమయాలలో పోలికలు కొంప ముంచుతాయని గుర్తుంచుకోండి. ఫలానా సుబ్బారావుగారి పిల్లవాడి సంగతి మనకి అనవసరం. అలాగే మన పిల్లవాడి స్నేహితుల ఫలితాలూ ప్రస్తుతానికి అసందర్భం. పోలికలంటూ తెస్తే పరాజయాలనూ తీసుకురండి. ఫలానా ఎడిసన్ కూడా చిన్నప్పుడు ఫెయిల్‌ అయ్యాడనో, మీరు కూడా చిన్నప్పుడు ఇలాంటి పరాజయాలను ఎదుర్కొన్నారనో చెప్పి పిల్లలను ఊరడించండి.   - పరీక్ష ఫలితాన్ని ఎలాగూ మార్చలేము. కాబట్టి అసలు ఇలాంటి ఫలితం రావడానికి కారణం ఏంటో కనుక్కొనేందుకు ప్రయత్నించండి. ఇల్లు, కళాశాల, స్నేహాలు, ఏకాగ్రత, అనారోగ్యం... ఇలా ఏ సమస్య పిల్లవాడి చదువుకి అడ్డం పడుతోందో విశ్లేషించండి. పిల్లవాడు భవిష్యత్తులో తిరిగి ఓడిపోకుండా ఆ కారణానికి తగిన పరిష్కారాన్ని కూడా సాధించండి. ఆ పరిష్కారాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ ప్రణాళికను ఏర్పరిచేందుకు ప్రయత్నించండి. ఈ విశ్లేషణలో మీ పిల్లవాడిని కూడా భాగస్వామిగా చేసుకోవడం మర్చిపోవద్దు.   - పిల్లవాడని మరీ సుకుమారంగా పెంచడంతో ఒకోసారి వారు పరాజయాలను తట్టుకునే స్థితిలో ఉండరు. కాబట్టి ముందుగా మీ దృక్పథాలను కూడా ఓసారి సరిచూసుకోండి. పిల్లవాడికి నిరంతరం చదువే లోకంగా మారిపోతోందా? అతనిలో శారీరక దృఢత్వం, మానసిక పరిపక్వత లోపిస్తున్నాయా? అన్నది ఒక్కసారి గమనించుకోండి. ఈ విషయంలో అవసరమైతే సైకాలజిస్టుల వంటి నిపుణుల సలహాలను తీసుకోవడంలో తప్పేమీ లేదు.   ఒకరకంగా చెప్పాలంటే పరీక్షలలో బాగా తక్కువ ఫలితాలు రావడం అన్నది ఓ హెచ్చరికలాంటిది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందన్న సూచన మాత్రమే! ఆ హెచ్చరికను గ్రహిస్తే పిల్లవాడు భవిష్యత్తులో మరిన్ని పరాజయాలు ఎదుర్కోకుండా రక్షించనవారమవుతాం. లేకపోతే వాడి జీవితాన్ని మన ఆశలకు అనుగుణంగా మార్చేందుకు ప్రయత్నించి భంగపడతాం!   - నిర్జర.
  పోలీసు కారు తనని వెంబడించడం చూడగానే ఆ చర్చి ఫాదరు ఒకసారి తన స్పీడోమీటర్‌ వంక చూసుకున్నాడు. పరిమిత వేగాన్ని మించి 20 కిలోమీటర్లు ఎక్కువగా వేగంతో తను బండిని నడుపుతున్నాడు. ఆ విషయం గమనించి పోలీస్‌ తనని వెంబడిస్తున్నాడని అర్థమైంది. దాంతో నిదానంగా తన కారుని పక్కకితీశాడు. తీరా పోలీసు కారులోంచి దిగిన వ్యక్తిని చూశాక ఫాదరుకి కాస్త ఉపశమనంగా తోచింది. వారం వారం చర్చిలో తన ఉపన్యాసం వినడానికి వచ్చే హేరిస్‌ని ట్రాఫిక్‌ పోలీస్ అవతారంలో చూసేసరికి భయం కాస్తా ఎగిరిపోయింది. హేరిస్‌ తనని కాస్త చూసీ చూడనట్లు వదిలిచేయవచ్చు. ‘‘హాయ్‌ హారిస్! మనం ఇలాంటి సందర్భంలో కలుసుకుంటామని అనుకోలేదు’’ అన్నాడు చర్చి ఫాదర్‌ సరదాగా. ‘‘నేను కూడా!’’ చాలా నిర్లిప్తంగా బదులిచ్చాడు హేరిస్‌.   ‘‘ఇవాళంతా విపరీతమైన పని ఒత్తిడి. పైగా ఇంటికి వెళ్లేందుకు చాలా ఆలస్యం అయిపోయింది. ఇదిగో ఆ తొందరలో ఉండగానే నువ్వు నన్ను గమనించినట్లున్నావు’’ తన సంజాయిషీని తెలివిగా చెప్పుకొచ్చారు ఫాదర్‌. ‘‘ఊ!’’ అంటూ బదులిచ్చాడే కానీ హేరిస్‌ మొహంలో ఎలాంటి చిరునవ్వూ కనిపించలేదు. ‘‘అయినా నేనేమంత వేగంగా వెళ్లడం లేదు. మహా అయితే ఒక ఐదు కిలోమీటర్ల ఎక్కువ స్పీడుందేమో! ఏదో పరధ్యానంగా ఉండి పట్టించుకోలేదు,’’ అంటూ చటుక్కున చిన్న అబద్ధం చెప్పేశారు ఫాదర్‌.   హేరిస్‌ ఒక్క క్షణం ఫాదర్‌ మొహంలో చూశాడు. ‘‘మా వాడలో మీరు ఒక మంచి ఫాదర్‌ అన్న పేరు ఉంది,’’ అన్నాడు. హేరిస్‌ ఆ మాట ఎందుకు చెప్పాడో ఫాదర్‌కి అర్థం కాలేదు. కానీ ఇక అంతకు మించి అతనితో సంభాషణ అంత మంచిది కాదనిపించింది. నిదానంగా వెళ్లి కారులో కూర్చున్నాడు. హేరిస్‌ ఎలాగూ చలాను రాసి ఇస్తాడు కాబట్టి, ఎంతో కొంత రుసుముని చెల్లించేందుకు జేబులో ఉన్న డబ్బులు తీసి లెక్కపెట్టుకోసాగాడు. ఓ రెండు నిమిషాల తరువాత హెరిస్ కారు అద్దంలోంచి చలాను లోపలకి పడేశాడు.   చలాను తీసి చూసుకున్న ఫాదర్‌కి అది ఏదో ఉత్తరంలా తోచింది. ‘‘ఫాదర్‌! ఒక నాలుగేళ్ల క్రితం ఇలాగే వేగంగా వెళ్తున్న కారు కింద పడి నా ఆరేళ్ల పాప చనిపోయింది. డ్రైవరు వేగంగా కారు నడిపినందుకు గాను అతనికి జరిమానా, మూడు నెలల జైలుశిక్ష విధించారు. అతను ఓ మూడు నెలలు కళ్లు మూసుకుని జైళ్లో గడిపేసి తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆ ఇంట్లో తన ముగ్గురు పాపాలతో అతను హాయిగా ఉన్నాడు. కానీ నేను నా ఒక్కగానొక్క కూతురిని కోల్పోయాను. నేను చనిపోతే కానీ స్వర్గంలో ఉన్న నా కూతురిని కలుసుకోలేనేమో! ఈలోగా నా కొడుకుని చూసుకుంటూ ఆ బాధని మర్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నాము. మీరు వేగంగా నడిపే కారు ఏదో ఒక రోజు నా కొడుకుని కూడా మా నుంచి దూరం చేయగలదు. దయచేసి మా కుటుంబం కాసం ఆ ప్రభువుని ప్రార్థించండి. మరో బిడ్డ చనిపోకుండా ఉండేందుకు మీ కారుని నిదానంగా నడపండి,’’ అని ఆ ఉత్తరంలో ఉంది.   ఫాదర్‌ నోట మాట రాలేదు. వాహనాన్ని వేగంగా నడపడం అనేది తనకు సరదానో, అవసరమో కావచ్చు... కానీ అది ఇంకొకరి కుటుంబాన్ని నాశనం చేయగలదన్న ఊహే చాలా భయంకరంగా తోచింది. తన కారుని నిదానంగా ముందుకు పోనిచ్చారుత. వచ్చే ఆదివారం చర్చిలో ఈ విషయాన్ని నలుగురితో పంచుకోవాలని నిశ్చయించుకున్నారు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.
  పొలిటికల్ పార్టీ ఏర్పాటు పై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. అన్నీ కుదిరితే డిసెంబరు 12 న ప్రకటన రావచ్చు. వచ్చే ఏడాదే రాజకీయ పార్టీ ప్రారంభం కావచ్చు. స్వయంగా రజనీకాంత్ సలహాదారు తమిళరువి మణియన్ కమల్ చెప్పిన మాటలివి. రాజకీయ అరంగేట్రంపై తలైవకు క్లారిటీ వచ్చేసింది అని తమిళురువి చెప్పారు. డిసెంబర్ 12 న రజనీకాంత్ పుట్టిన రోజు, అందుకే ఆ రోజున రాజకీయ పార్టీ పై ప్రకటన చేస్తారని సమాచారం. 2021 లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ కొంత ఖుషిగా ఫీలయ్యారు.  లోక్ సభ ఎన్నికల తర్వాత రజనీ మళ్లీ సైలెంటయిపోయారు. దానితో అభిమానుల్లో మళ్లీ గందరగోళం ఏర్పడింది. అసలు రాజకీయ పార్టీ ఎప్పుడు పెడతారు.. పార్టీ ప్రకటన ఏ రోజు చేస్తారు.. అసలు పార్టీ ఉంటుందా ఉండదా అంటూ ప్రశ్నల వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో తమిళరువి మణియన్ కమల్.. రజనీకాంత్ తో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు వీరిద్దరూ చర్చించారు. రజినీ రాజకీయ అరంగేట్రం పైనే డిస్కషన్ సాగినట్లు తెలుస్తోంది. మొత్తానకి తలైవా పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది. వచ్చే వారం స్వయంగా రజినీకాంత్ ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఆ తర్వాత వచ్చే ఏడాది రాజకీయ పార్టీ నిర్మాణం పై దృష్టి సారించనున్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని మక్కల్ నీది మయ్యమ్ అధినేత నటుడు కమల్ హాసన్ ప్రకటించారు. రజనీకాంత్ కూడా ఇందుకు సానుకూలంగా స్పందించారు. అయితే కమల్ తో పొత్తు పెట్టుకుంటారా లేదా అన్నది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.  
  అనంతపురం జిల్లా పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్‌ ఓపెనింగ్ సెర్మనీ వేడుకలకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కియా మోటర్స్‌ ప్లాంట్‌ను జగన్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. కియా మోటర్స్‌ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో ఇంత పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేసినందుకు కియా సంస్థ ను అభినందిస్తున్నా అని అన్నారు. రాష్ట్రంలో కియా మోటర్స్‌ చక్కగా పని చేస్తుందన్నారు. కియా పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేపడితే ప్రత్యక్షంగా 11 వేల మందికి.. పరోక్షంగా మరో 7 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇప్పటికే 3 వేల మంది పని చేస్తుండగా, అనుబంధ విభాగాల ద్వారా మరో 3500 మందికి ఉపాధి లభిస్తోందని తెలిపారు. కియా మోటార్స్‌ బాటలోలో మరికొన్ని కంపెనీలు ఏపీకి వస్తాయని జగన్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే కియా మోటర్స్‌ ప్లాంట్‌ను జగన్ ప్రారంభించడం, కియా మోటర్స్‌ ని ప్రశంసించడంపై టీడీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. వాస్తవానికి ఆగస్టులో కియా కార్ లాంఛింగ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి రావాలని సీఎం జగన్‌ను కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా జగన్ ఆ కార్యక్రమానికి వెళ్లలేకపోయారు. టీడీపీ హయాంలో.. చంద్రబాబు కియా పరిశ్రమను అనంతపురం తీసుకొచ్చారని.. బాబుకి క్రెడిట్ దక్కుతుందనే జగన్ ఆ కార్యక్రమానికి వెళ్లలేదని అప్పుడు టీడీపీ నేతలు ఆరోపించారు. అంతేకాదు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో.. కియా క్రెడిట్ బాబుకి ప్లస్ అవుతుందేమోనన్న భయంతో అప్పుడు కియా మీద విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కియా క్రెడిట్ కొట్టేయడానికి ఆరాట పడుతున్నారంటూ.. వైసీపీని టీడీపీ విమర్శిస్తోంది. కియా మోటార్స్‌ ఓపెనింగ్ సెర్మనీ సందర్భంగా.. వైసీపీ అధికార ట్విట్టర్ పేజ్ లో చేసిన ట్వీట్ పై కూడా టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 'మ‌హానేత వైయ‌స్ఆర్ కృషితో ఏపీలో కియాను ఏర్పాటు చేసిన ద‌క్షిణ కొరియా సంస్థ‌. రూ.13500 కోట్ల‌తో కియా కార్ల ప‌రిశ్ర‌మ ఏర్పాటు.' అని వైసీపీ అధికార పేజ్ లో ట్వీట్ దర్శనమిచ్చింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. అసలు కియా బాబు వల్ల రాలేదు, ప్రధాని మోడీ వల్ల వచ్చిందని స్వయంగా జగనే వ్యాఖ్యానించారు. అప్పుడు మోడీ వల్ల వచ్చింది, ఇప్పుడు వైయ‌స్ఆర్ వల్ల వచ్చిందంటూ ఎన్ని మాటలు మారుస్తారు అని టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. అసలు అప్పట్లో కియాని విమర్శించిన మీరు ఇప్పుడు కియా క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారా అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు విజయసాయి రెడ్డి వంటి నేతలు మాట్లాడిన మాటల్ని గుర్తుచేస్తున్నారు. గతంలో విజయ సాయి.. బాబు కమీషన్లకు కక్కుర్తి పడి కియాకి రాయితీలు ఇచ్చారని అన్నారు. చైనాలోని అంత పెద్ద కియా మోటార్స్ ప్లాంటే మూత పడింది. ఇక అనంతపురం ప్లాంట్ సంగతి ఏంటో? అంటూ వెటకారం చేసారు. అప్పుడు అన్ని మాటలు  మాట్లాడిన మీరు ఇప్పుడు క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారా అంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
  తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను స్వాగతించారు బిజెపి ఎంపీ జీవిఎల్. పవన్ విలీన ప్రతిపాదనతో వస్తే అహ్వానిస్తామన్నారు. ఎన్నికల ముందు విలీనం చేయాలని కోరితే అంగీకరించేది లేదని తెలిపారు. బీజేపీతో కలిసి పని చేయాలనుకుంటే ప్రాంతీయ పార్టీల విలీనాన్ని స్వాగతిస్తామని చెప్పారు ఎంపీ జీవీఎల్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ దేశంలో మత సామరస్యం లేకపోవటానికి హిందువులే కారణమని.. ఏ గొడవలు జరిగినా అందుకు హిందూ నాయకులే కారణమని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేవలం హిందువులే కారణమని చెప్పడం వెనుక తప్పనిసరిగా రాజకీయ దురుద్దేశం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని.. భవిష్యత్తులో ఇటువంటి తప్పు చేయనని ప్రజలకు భరోసా ఇవ్వాలని జీవీఎల్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తానెప్పుడూ భారతీయ జనతా పార్టీతో విభేదించలేదని.. బీజేపీతోనే కలుసుకున్నానని చెప్పారన్నారు. అదే విధంగా టిడిపి నాయకులు కూడా ఈ మధ్య అటువంటి వ్యాఖ్యలే చెబుతూ.. అమిత్ షా గారంటే చాలా గౌరవమని అంటూనే ఆ నాయకులే రాళ్లు వేయించారని ఆరోపించారు. గుండె మార్పిడి జరిగిందో ఏమో గాని  కొత్తగా వినసొంపు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.   భారతీయ జనతా పార్టీ విధి విధానాలతో ఏకీభవిస్తే.. ప్రాంతీయ పార్టీలు ఏవైనా విలీనం చేయదలచుకుంటే  స్వాగతిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని మాతో  కలిసి పనిచేయమని.. జనసేనను బీజేపీలో విలీనం చేయమని ఎన్నికల ముందే ఆయనను అడిగామని కానీ ఆయన దానికి ఒప్పుకోలేదన్నారు. ఇప్పటికైనా మనసు మారి జనసేనను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే ఆలోచన గనుక ఉంటే తప్పని సరిగా దాన్ని స్వాగతిస్తామని జీవీఎల్ స్పష్టం చేశారు.
  ఈరోజుల్లో బెల్లంవాడ‌కం త‌గ్గిపోయింది. ఏదో పండ‌గ సంద‌ర్భంలో త‌ప్ప బెల్లం జోలికి వెళ్ల‌డం చాలా త‌క్కువ‌. అయితే బెల్లానికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. ఆ బెల్ల‌మే క‌దా అని తీసి పారేయ‌కండి. బెల్లంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలున్నాయి. ముఖ్యంగా చ‌లికాలంలో బెల్లం తిన‌డం ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ట‌. ముఖ్యంగా దీంతో శ‌రీరానికి కావాలసిన వేడి అందుతుంద‌ని చెబుతారు. అంతేకాదు ఎన్నోర‌కాల రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. ముఖ్యంగా గ‌ర్భ‌వ‌తి అయిన స్త్రీలు బెల్లాన్ని సేవిస్తే ఎంతో మంచిద‌ట‌.ఆయుర్వేదంలోనూ బెల్లానికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. చ‌లికాలంలో ద‌గ్గు, జలుబు లాంటి ఎన్నో రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. చిటికెడు బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు... ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. రోజంతా ఆఫీసుల్లో టెన్ష‌న్ టెన్ష‌న్ గా గ‌డిపేవాళ్ల‌కు ఇది ఎంతో మంచిద‌ట‌. బెల్లం తినాలంటే ఎక్కువ ప్ర‌యాస ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. బెల్లం కోసం ఎక్కువ డ‌బ్బు ఖ‌ర్చుపెట్టాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. మార్కెట్లో ఇత‌ర ధ‌ర‌ల‌తో పోలిస్తే బెల్లం రేటు త‌క్కువే.     బెల్లం తియ్య‌గా ఉంటుంది కాబట్టి ఇంటి నుంచి బ‌య‌లుదేరే ముందు కాస్త బెల్లాన్ని తిని వెళ్లాల‌ట‌. బెల్లం తిని వెళ్తే మంచి శ‌కునమ‌ని పెద్ద‌వాళ్లు కూడా చెబుతుంటారు. బెల్లాన్ని సేవిస్తే బెల్లంలో ఉండే తీపి లాగే మ‌న మాట‌లు కూడా చాలా తియ్య‌గా ఉంటాయ‌ట‌. క‌టువు మాటల వాడ‌కం త‌గ్గుతుంద‌ట‌. ముఖ్యంగా ఇంటి నుంచి బ‌య‌లుదేరే ముందు బెల్లం తిన‌డం వ‌ల్ల మ‌న ఆలోచ‌న‌లు కూడా చాలా పాజిటివ్ గా ఉంటాయి. ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే బెల్లంలో ఉండే తీపి ముఖ్యంగా మ‌న‌శ్శాంతిని పెంచుతుంది. కోపాన్ని నిరోధించి సంయ‌మ‌నాన్ని పెంచుతుంద‌ట‌. అన్నింటికంటే ముఖ్యంగా ఏదైనా ప‌నిని శ్ర‌ద్ధ‌గా చేస్తాం.... మ‌రియు ఈజీగా స‌క్సెస్ కూడా అవుతాం. నేరుగా బెల్లం తిన‌డం కంటే నువ్వుల ల‌డ్డూ మ‌రియు ఇత‌ర ఆహార ప‌దార్థాల్లో బెల్లాన్ని ఉప‌యోగిస్తే ఎంతో మంచిద‌ట‌. దీంతో పిల్ల‌లు కూడా మారాం చేయ‌కుండా చాలా ఇష్టంగా బెల్లాన్ని తింటారు. బెల్లాన్ని చ‌క్కెర కంటే మంచి పౌష్టికాహారంగా చెబుతారు. ఎందుకంటే ఇందులో ఎలాంటి రసాయ‌న ప‌దార్థాల వాడ‌కం ఉండ‌దు. చూశారా బెల్లానికి ఎంత ప్రాధాన్య‌త ఉందో.. ఇక నుంచి ఆ బెల్ల‌మే క‌దా అని లైట్ తీసుకోకండి.. కాస్త అప్పుడ‌ప్పుడు చిటికెడు బెల్లాన్ని నోట్లో వేసుకోండి.
  తొక్కలతో దోమలకు చెక్     దోమలతో  యుద్దానికి ప్రపంచ దేశాలు సన్నద్ధం అవుతున్నాయి అని ఈ మధ్య రోజు వార్తలలో వింటున్నాం కదా.  జికా దోమను ఎదుర్కోవటం ఎలా అన్న విషయం లో ఎన్నో చర్చలు జరుగుతున్నాయి కూడా . అయితే ఈ జాతి దోమ మాత్రమే కాదు  మనకు వచ్చే ఎన్నో  ఎలర్జిలకు,జ్వరాలకు కారణం అవుతున్న ఎన్నో రకాల  దోమల బారినుంచి తప్పించుకోవటానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.    మనం తరచూ దోమలు పోవటానికి వాడే లిక్విడ్ రీఫుల్స్ ,కోఇల్స్,ఇంకా మస్కిటో మాట్స్ వీటివల్ల దోమలకే కాదు మనకి కూడా ప్రమాదమే అని చెప్తున్నారు నిపుణులు. నమ్మకం కుదరకపోతే ఈ సారి ఏదైనా లిక్విడ్ రీఫుల్ ఇంటికి తెచ్చాక దానిలో ఉండే leaflet చదవండి, ప్రికాషన్ అని కనికనిపించని అక్షరాలతో రాసిన దగ్గర కొంతమందికి స్కిన్ ఎలర్జీలు, జలుబు, తుమ్ములు, దగ్గు,దురదలు,నరాల బలహీనత మొదలైనవి వస్తే వెంటనే డాక్టర్నిసంప్రదించండి అని ఉంటుంది. అందుకే ఎలాంటి రసాయనాలు లేని సహజ సిద్ద నివారణా మార్గాలు ని పాటిస్తే సరి.  * మనం తినే కమలాపండు తొక్కల్ని ఎండబెట్టి వాటిని కాల్చితే చాలు దోమలు దూరం. * పుదినా వాసనకి దోమలు ఆ దరిదాపులకి రావట. * దోమలు ఎక్కువగా ఉన్న చోట ఒక గిన్నెలో నీళ్ళు పోసి అందులో కర్పూరం బిళ్ళలు వేసి పెడితే చాలు.  దోమల ఉదృతి తగ్గుతుంది. * అరటి తొక్కలు కాల్చినా  చాలు దోమలు మాయం అవుతాయి. * వేపాకుల్ని ఎండబెట్టి కాల్చి ఆ పొగ పెట్టినా దోమలు రావు. * వేసవి కలం లో అయితే మనకి ఈజీగా దొరికే మామిడిపండు తొక్కల్ని కాలిస్తే దోమలు ఇంట్లోకి రావటానికి కూడా భయపడతాయి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో దోమలకి సులువుగా చెక్ చెప్పచ్చు . ..                                                                              ----కళ్యాణి
అప్సరసలాంటి అమ్మాయి ఎదురయితే గుండె దడదడ లాడిన పర్వాలేదు గానీ, మాములుగా ఉన్నప్పుడు కూడా అలా  కొట్టుకుంటుంటే? ఇదేదో బాగా ఆలోచించాల్సిన విషయమే అని గుర్తుపెట్టుకోండి.    గుండెని పదిలంగా చూసుకోవాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు అసలు డాక్టర్ని కలవాల్సిన పనే ఉండదంటున్నారు ప్రకృతి వైధ్య నిపుణులు. మనం తీసుకునే ఆహారపు విషయంలో కొంతమేర జాగ్రత్త తీసుకుంటే చాలట.  రోజువారి నడక, వ్యాయామం తో పాటు కింద చెప్పినవి కొన్ని పాటిస్తూ మన గుండెని ప్రేమగా చూసుకుందాం.    *  ఆకుపచ్చని రంగులో వుండే ఆకు కూరలు, కూరగాయలులో విటమిన్‌ - బి కాంప్లెక్స్ , నియాసిన్‌ అధిక మోతాదులో వుంటాయి. ఇవి రక్తనాళాలు మూసుకుపోకుండా వుండేందుకు సహాయపడతాయి. ఇంకా ఇవి బెర్రీస్‌, పుల్లటి రుచిగల పండ్లలో కూడా ఎక్కువగా లభిస్తాయి.   * గింజ దాన్యాలలో సోయా చాలా ప్రత్యేకమైనది.త్వరగా జీర్ణము అవుతుంది. అందుకే దీన్ని అన్ని వయసుల వారు తీసుకోవచ్చు.శరీరానికి అవసరమైన అమినోయాసిడ్లు, లైసీన్లతోపాటు ఇసోఫ్లేవిన్స్ ని కలిగిఉంటుంది. ఇది గుండెకు బలాన్నిస్తుంది. * ఆలివ్‌ ఆయిల్‌లో వుండే మోనో-శాటురేటెడ్స్‌ వల్ల శరీరంలో చెడు కొవ్వు తగ్గేందుకు ఉపయోగపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధిక మోతాదులో ఉంటాయి. ఇవి గుండె కవాటాలు సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. గుండె సంబంధిత సమస్యలను కూడా ఇవి నివారిస్తాయి.   * ఈ మద్య కాలంలో గుండెజబ్బుల నివారణకు, కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచడానికి ఓట్స్ ని వాడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీటిల్లో ఉండే ప్రత్యేక పీచు పదార్థం బెటాగ్లూకాన్. ఇది పైత్య రస ఆమ్లాలతో కలిసి శరీరంలోని కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచుతుంది. * బాదాం పప్పు  గుండెకు మేలు చేస్తుంది. మన ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదంలో ఉండే  ఒమెగా 3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్  ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. కరోనరీ గుండెజబ్బులను నివారిస్తుంది. *  గుమ్మడి కాయలలో బీటాకెరోటిన్‌ లు ఎక్కువగాఉంటాయి. ఇవి శరీరములో విటమిన్‌ ' ఎ ' గా మార్పుచెంది చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి. గుండెజబ్బులు, క్యాన్సర్ కి కారణమయ్యే ఫ్రీరాడిలల్స్ ను ప్రారదోలడములో సహకరించి గుండెను కాపాడుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందున గుండెకు మేలు జరుగుతుంది . ఇలా కొద్దిపాటి జాగ్రత్తలతో మన గుండెని పదిలంగా చూసుకుందాం. - కళ్యాణి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.