బద్రీ, నందా మధ్య డిష్యూం డిష్యూం
posted on Jul 12, 2025 12:01PM

పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డారు ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ ద్వారా ఈ స్థాయిలో అమ్మకమా అంటూ పవన్ పై మరో మారు విమర్శలు గుప్పించారాయన. గత మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ని అధ్యక్షుడిగా చేయడం కోసం మెగా కాంపౌండ్ తీవ్రంగా ప్రయత్నించింది. నాగబాబు దగ్గరుండి మరీ ఈ ఎన్నికల్లో ఫైట్ చేశారు. పవన్ కూడా ప్రకాష్ రాజ్ కే సపోర్ట్ చేశారు. ఒక్క ఈ ఇద్దరే కాదు మెగా కాంపౌండ్ మొత్తం ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ తరుఫున నిలబడ్డారు.
అయితే అది వేరు- ఇది వేరని అంటారు ప్రకాష్ రాజ్. బేసిగ్గా ఆయన నాస్తికుడు. కొంత వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి ప్రకాశ్ రాజ్. ఆయన నేపథ్యం అలాంటిది. డీపర్ కర్ణాటక నుంచి తన తండ్రి బెంగళూరు రావడం.. అక్కడ ఆరోగ్యం బాగలేక ఆస్పత్రిలో చేరితే.. అక్కడొక నర్సుతో పరిచయం ప్రేమగా మారి ఆపై ఆమెనే పెళ్లాడారాయన. ఆ తర్వాత పుట్టిన సంతానంలో ఒకరు ప్రకాష్ రాజ్. ఎన్నేసి హిందూ సినిమాల్లో హిందూ పాత్రలు చేసినా.. సరే ఆయన బయట మాత్రం యాంటీ హిందూ- యాంటీ మోడీ- యాంటీ బీజేపీ- లాంగ్వేజ్ లో మాట్లాడతారు. అయితే ఇక్కడ పవన్ కి ప్రకాష్ రాజ్ కి ఉన్న గొడవేంటని చూస్తే ఇటీవల పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లేనంతగా హిందుత్వాన్ని భుజానికెత్తుకుని మోస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
మొన్నటి మురుగన్ మానాడు, అటు పిమ్మట హరిహర వీరమల్లులో హిందుత్వ నినాదం.. ఇలా సినిమా పరంగా, రాజకీయ పరంగా ఆయన హిందుత్వాన్ని పబ్లిగ్గానే హ్యాండిల్ చేస్తున్నారు. వక్ఫ్ బోర్డులాగా సనాతన్ బోర్డు ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే కాషాయంలో తిరగడానికైనా వెనకాడ్డం లేదు. దేవాలయాలకు కూడా విరివిగా తిరుగుతున్నారు. వీటన్నిటినీ చూసిన ప్రకాష్ రాజ్.. ఆయనపై గత కొంత కాలం నుంచి తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఇలా కూడా అమ్ముడవుతారా? అంటూ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. మరి ఈ కామెంట్ల కాట్లాటలో చివరికి ఎవరు గెలుస్తారు? అసలు పవన్ స్కెచ్ ఏంటి? మధ్య ప్రకాష్ రాజ్ ఈ గిచ్చుడేంటన్నది ఇటు పొలిటికల్ అటు సినిమా ఇండస్ట్రీలో వాడీ వేడిగా చర్చ నడుస్తోంది.