Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాయుడి హత్య కేసులో సంచలన విషయాలు
posted on: Jul 12, 2025 3:53PM

శ్రీకాళహస్తి జన సేన ఇంచార్జ్ వినుతకోట మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులో వస్తున్నాయి. రాయుడిని చిత్రహింసలకు గురి చేసి చంపి.. ఆపై మృతదేహాన్ని తమ కారులోనే వినూత కోటా దంపతులు నదిలో పడేసినట్లు విచారణలో వెల్లడైంది. తన మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడిని హత్య చేసిన కేసులో జనసేన పార్టీ ఇంచార్జి వినూత కోటా అరెస్ట్ అయ్యారు. వినూత, ఆమె భర్త చంద్రబాబు తోపాటు మరో ముగ్గురినీ చెన్నై పోలీసులు ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో ఇప్పటిదాకా సాధించిన పురోగతి వివరాలను చెన్నై కమిషనర్ అరుణ్ మీడియాకు వెల్లడించారు. రాయుడు ఆంధ్రాలో మర్డర్ చేసి చెన్నై లో పడేశాడు. హత్యకు ఉపయోగించిన కారు ఆధారంగా కీలక సమాచారం సేకరించాం. సీసీటీవీ ఫుటేజీ ద్వారానే నిందితులను గుర్తించాం. ప్రస్తుతం వాళ్లు పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది అని అన్నారాయన. కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. చెన్నై మింట్ పీఎస్ పరిధిలో కూవం నదిలో మూడు రోజుల క్రితం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. చేతి మీద జనసేన సింబల్‌తో పాటు వినుత పేరు ఉండడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినూత కోటా, ఆమె భర్త చంద్రబాబు పోలీసులు విచారించారు. మూడు నెలలుగా రాయుడుకు వినుత కుటుంబ సభ్యులతో విభేదాలు ఉన్నాయని తెలిపింది. రాయుడు మృతికి వినుత కుటుంబ సభ్యులే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. రాయుడు నానమ్మ ఫిర్యాదు మేరకు వినుత, ఆమె భర్త కోట చంద్రబాబు, వినుత తండ్రి భాస్కర్‌లని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీసులు ఈ కేసుని ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.
ఆపై అది ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసుల(రాయుడు)దిగా నిర్ధారించారు. కోట వినుత వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉందని, గత కొంతకాలంగా ఆమెను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచినట్లు జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆమెపై చెన్నైలో హత్య కేసు నమోదు అయిన విషయం పార్టీ దృష్టికి వచ్చిన వెంటనే, తక్షణమే ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జనసేన అధిష్ఠానం ప్రకటించింది. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.



.webp)


