ఈసారి ఎవరిది పైచేయి అవుతుంది? రేవంత్ దా? కేసీఆర్ దా?

అందరిలా రుచీపచీ లేకుండా విమర్శలు చేయడు, పాత చింతకాయ పచ్చడిలా అసలే మాట్లాడడు, సెన్షేషనల్ కామెంట్స్ చేస్తాడు, అవసరమైతే బూతులు జోడిస్తాడు, కేసీఆర్ స్టైల్లోనే సన్నాసులు, వెధవలు అంటూ ఘాటుగా సమాధానమిస్తాడు, పంచ్ డైలాగ్ లతో అటు మీడియాని, ఇటు జనాన్ని తనవైపు తిప్పుకుంటాడు, ప్రత్యర్ధుల గుండెల్లో మంట పుట్టిస్తాడు, అందుకే ఇప్పుడు మరోసారి అసెంబ్లీలో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారాడు.

 

అనుమల రేవంత్ రెడ్డి, కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కేసీఆర్ కి కంట్లో నలుసులా మారిన ఫైర్ బ్రాండ్ లీడర్, ఒక్క కేసీఆర్ కే కాదు...రేవంత్ మాట్లాడితే ప్రత్యర్ధుల్లో ఎవరి గుండెల్లోనైనా మంటపుడుతుంది. ప్రతి విషయాన్నీ చాలా తెలివిగా లాజిక్ గా మాట్లాడతాడు, అతని మాటల్లోని ఆవేశం కసి లేవనెత్తే అంశాలు అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేస్తాయి, అందుకే అసెంబ్లీ అయినా బయటైనా ప్రత్యర్ధులకు అతనే టార్గెట్ అవుతాడు.

గత అసెంబ్లీ సమావేశాల్లో సభ జరిగినన్ని రోజులూ రేవంత్ ను సస్పెండ్ చేశారంటే అధికార పార్టీ ఎంతగా భయపడుతుందో అర్థమవుతుంది. కేసీఆర్ కూతురు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దీనికి ముందు సమావేశాల్లోనూ రేవంత్ ను సభ నుంచి సస్పెండ్ చేశారు, అంటే ఏదోఒక వంకతో రేవంత్ ను సభలో లేకుండా చేస్తున్నారనేది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం, ప్రత్యర్ధులకు సింహస్వప్నంలా మారే ముఖ్యమంత్రి కేసీఆర్ ను సైతం ఇబ్బంది పెడుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రేవంతే, అందుకే తెలివిగా ఓటుకు నోటు కేసులో ఇరికించారు, రేవంత్ దూకుడును తగ్గించాలని భావించారు, కానీ రేవంత్ దూకుడు డబుల్ చేశాడు, మునుపటి కంటే ఘాటుగా విరుచుకుపడుతున్నారు, అందుకే ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ సెషన్స్ లో అందరి దష్టి రేవంత్ పై పడింది.ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెడతాడు, ఓటుకు నోటు కేసు ఇష్యూని ఏవిధంగా ఎదుర్కొంటాడనే దానిపై అన్ని పార్టీల ఎమ్మెల్యేల్లోనూ చర్చ జరుగుతోంది.

రైతు ఆత్మహత్యలు, వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ లో తెలంగాణకు 13వ ర్యాంకు, ఏడాదిన్నరలో 51వేలకోట్ల కొత్త అప్పులు ఇలా అనేక అంశాలపై ప్రభుత్వాన్ని ఏకిపారేసుందుకు రేవంత్ మిస్సైల్ లా రెడీగా ఉన్నాడు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో విపక్షాల మధ్య పెద్దగా సఖ్యత లేకపోవడం ప్రభుత్వానికి కలిసిరాగా, ఈసారి అలాంటి పప్పులుడవంటున్నారు, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఈసారి మూకుమ్మడిగా దాడి చేసే అవకాశముందని, అది రేవంత్ కి కలిసొస్తుందని చెబుతున్నారు, ఒకవేళ విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి, రేవంత్ కి అండ దొరికితే రేవంత్ రెచ్చిపోవడం ఖాయమంటున్నారు. అయితే ఓటుకు నోటు కేసు ఇష్యూతో రేవంత్ నోరు మూయించాలని టీఆర్ఎస్ వ్యూహం సిద్ధంచేసుకుంది. ఏదోవిధంగా రేవంత్ ను రెచ్చగొట్టి అసెంబ్లీ నుంచి బయటకు పంపాలని స్కెచ్ గీసుకుంది.  మరి ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu