వైసీపీ రోజా దూకుడుకి అసలు కారణం ఇదా?
posted on Sep 23, 2015 6:07PM
.jpg)
జబర్దస్త్ ప్రోగ్రాంలో కామెడీ పండినా పండకపోయినా ఆపకుండా నవ్వుతూ తెగ హడావిడి చేసే రోజా..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ అదేరీతిలో నానా హంగామా చేస్తున్నారు.సీనియర్లను సైతం పక్కకునెట్టి సొంత మైలేజ్ కోసం తెగ ఆరాటపడిపోతున్నారట. అసెంబ్లీలో గలాటా మొదలు నగరి నియోజకవర్గంలో అధికారులపై విరుచుకుపడే వరకూ నానా యాగీ చేస్తోందట. ఇంతకీ ఈ యాగీ ఎందుకుని ఆరాతీస్తే...రోజా ఆంటీ ఇప్పుట్నుంచే తెగ కలలు కంటున్నారని తెలిసింది.
2019లో వైసీపీ అధికారంలోకి, తాను మంత్రి కావడం ఖాయమనే ఊహాల్లో తేలిపోతున్నారట రోజా, ఇదే విషయాన్ని అసెంబ్లీ లాబీల్లో ఆమె చెబుతుంటే మిగతా మహిళా ఎమ్మెల్యేలు ముక్కున వేలేసుకున్నారట, అందుకే అసెంబ్లీలో అధికార పార్టీ నేతలపై రన్నింగ్ కామెంటరీ చేస్తూ, పదేపదే స్పీకర్ పోడియంలోకి వెళ్లి అరుస్తూ హడావిడి చేస్తుందని, ఇదంతా జగన్ కంటిలో పడేందుకేనని అంటున్నారు. పైగా ఛాన్స్ దొరికితే మైకు అందుకుంటూ మిగతా మహిళా ఎమ్మెల్యేలు హైలేట్ కాకుండా చేస్తోందని అంటున్నారు. మీడియా పాయింట్ లోనూ అలాగే ప్రవర్తిస్తూ మొత్తం కబ్జా చేస్తోందని వాపోతున్నారట. అయితే దీనిపై కొందరు నొచ్చుకున్నా..సీనియర్లనే ఆమె వదలడం లేదు...మేమెంతా అంటూ సర్దుకుపోతున్నారట.
సొంత జిల్లా చిత్తూరులోనూ తన మార్కు చూపించుకోవడం కోసం మిగతా వైసీపీ ఎమ్మెల్యేలను సైడ్ ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తోందట, అందుకే తన సొంత నియోజకవర్గం నగిరిలోనూ ప్రతిరోజూ ఏదోఒక వంకతో అధికారులతో గొడవ పెట్టుకుని దాడులకు సైతం దిగుతోందని చెవులు కొరుక్కుంటున్నారు, పైగా వారంలో నాలుగు రోజులు హైదరాబాద్ టు తిరుపతి చక్కర్లు కొడుతూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని చెప్పుకుంటూ అధినేత దగ్గర తెగ బిల్డప్ ఇస్తోందని చెప్పుకుంటున్నారు. అయితే రోజా అతిని తట్టుకోలేని కొందరు నేతలు జగన్ కు ఫిర్యాదు చేస్తే అధినేత లైట్ తీసుకున్నారనే టాక్ వినబడుతోంది. దాంతో రోజా హడావిడి పార్టీకి ఎలాంటి కష్టాలు తెచ్చిపెడుతోందని ఎమ్మెల్యేలు గుసగుసలాడుకుంటున్నారట.