అందుకే డిల్లీ అసెంబ్లీ రద్దుకు కేంద్రం ఆమోద ముద్ర?
posted on Nov 4, 2014 1:19PM
.jpg)
డిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీతో సహా ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ డిల్లీ అసెంబ్లీని రద్దు చేసేందుకు రాష్ట్రపతికి సిఫార్సు చేసారు. దానిని ఈరోజు సమావేశమయిన కేంద్రమంత్రి వర్గం ఆమోదించింది. కనుక కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీలు కోరుకొంటున్న విధంగానే డిల్లీ అసెంబ్లీకి త్వరలో మళ్ళీ ఎన్నికలు జరగడం ఖాయమయిపోయింది. ఇదివరకు జాలు కట్టబెట్టిన అధికారాన్ని కుంటి సాకుతో వదులుకొన్న ఆమాద్మీ పార్టీ, ఈసారి ఎలాగయినా ఎన్నికలలో పూర్తి మెజార్టీతో గెలిచి పూర్తి కాలం అధికారం చెలాయించాలని ఉవ్విళ్ళూరుతోంది. అయితే ప్రస్తుతం దేశంలో మోడీ హవా చాలా జోరుగా వీస్తునందున్న డిల్లీ ఎన్నికలలో అవలీలగా గెలవడం తధ్యమని బీజేపీ నేతలు దృడంగా విశ్వసిస్తున్నారు. అటువంటప్పుడు మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భంగ పడటం కంటే ఎన్నికలు నిర్వహించి పూర్తి మెజార్టీతో అధికారం చెప్పట్టడమే మంచిదనే ఆలోచనతోనే, మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కాదనుకొని ఎన్నికలకి మొగ్గు చూపుతున్నారు. కానీ ఒక రాష్ట్రం తరువాత ఒక దానిని బీజీపికి ధారాదత్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికలపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.