Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కిరణ్ బీజేపీలోకి వస్తారా?
posted on: Nov 5, 2014 1:57PM
.jpg)
కన్నా తర్వాత బీజేపీలోకి వచ్చే పేర్లలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కు మార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కిరణ్ ఇప్పటికే బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు కూడా జరిపారట. బీజేపీ హైకమాండ్ కూడా కిరణ్ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తోందట.
రాష్ట్ర విభజనను ఆపడానికి గట్టిగా ప్రయత్నించిన వ్యక్తిగా కిరణ్ కు కొంత సానుభూతి ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ కు కిరణ్ ఎదురొడ్డిన తీరునుకు అప్పట్లో జాతీయ మీడియా కూడా ప్రాముఖ్యత ఇచ్చింది. అయితే జై సమైక్యాంధ్ర పార్టీ అంటూ వేరుకుంపటి పెట్టుకొని ఆయన దెబ్బతిన్నారు. ఎన్నికలకు ముందు పార్టీ పెట్టడంతో తన కేబినెట్ సహచరులు మద్దతిస్తారని కిరణ్ ఆశించారు. కానీ ఆయన ఆశలన్నీ అడియాసలుగానే మిగిలిపోయాయి. కిరణ్ కు ఎన్నికలకు ముందే తన భవిష్యత్తేంటో అర్థమైపోతుంది. చివరకు ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఇష్టపడలేదు. ఎలాగోలా ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారాయన. ఎన్నికల ఫలితాలు ఊహించినవే కాబట్టి పెద్దగా ఆశలు కూడా పెట్టుకోలేదు కిరణ్. ఇక ఫలితాల తర్వాత ఆయన మీడియాలో కనిపించడం కూడా అరుదైపోయింది. అసలు ఎన్నికల తర్వాత కిరణ్ ఎక్కడా బహిరంగంగా కనిపించలేదు.
మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన తాను ఇలా అనుకోని పరిస్థితుల్లో ఖాళీగా ఉండడం కిరణ్ కు నచ్చడం లేదట. అందుకే తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన గట్టిగానే కసరత్తు చేశారని సమాచారం. తన సన్నిహితులతో సుదీర్ఘ మంతనాలు జరిపారని తెలిసింది. ఏ పార్టీ అయితే బెటరని గట్టిగానే వర్కవుట్ చేశాట. పార్టీల వారీగా లెక్కలు వేసుకన్నారట. టీడీపీలోకి వెళ్లలేరు. వైసీపీకి దగ్గర కాలేరు. అలా అని తిరిగి కాంగ్రెస్ లోనూ వెళ్లలేరు. ఎలాగూ ఆపార్టీకి ఏపీలో అంతసీనే లేదు. ఇక మిగిలిన ప్రధాన పార్టీ బీజేపీ ఒక్కటే. ప్రస్తుతం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ సూపర్ ఫామ్ లో ఉంది. మోడీ ఏది కావాలంటే అది జరుగుతోంది. దేశవ్యాప్తంగా మోడీ అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ అంశాలన్నింటినీ ఆయన బేరీజువేసుకొని బీజేపీ వైపే ఇంట్రెస్టు చూపిస్తున్నారని తెలుస్తోంది.
కిరణ్ రాకపై బీజేపీ నుంచి కూడా పాజిటివ్ సిగ్నల్ వస్తున్నాయి. బీజేపీ హైకమాండ్ కూడా ఏపీలో కిరణ్ వస్తే బలపడతామని గట్టిగా విశ్వసిస్తోందట. అమిత్ షా అయితే కిరణ్ బయోడేటా అంతా పరిశీలించి ఓకే కూడా చెప్పేశారట. అయితే ముహూర్తంపైనే తర్జనభర్జనలు జరుగుతున్నాయని చెబుతున్నారు. త్వరలోనే ఈ అంశాన్నింటిపైనా క్లారిటీ ఇచ్చేందుకు కిరణ్ సిద్ధంగా ఉన్నారట. మరి ఆయన ఏం చెబుతారన్నది వేచి చూడాల్సిందే.


.jpg)
(2).jpg)


