ఆ సన్నాసుల సహకారమే కావాలిప్పుడు

 

కృష్ణా బోర్డు చైర్మన్ పట్టుకొని కేసీఆర్ 'సన్నాసి' అనేసినట్లు వార్తలు వచ్చేయి. సన్యాసి కాని వాడిని పట్టుకొని సన్నాసి అనడం ఏమిటని చాలా మంది అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసారు. కానీ కేసీఆర్ ఒకసారి కమిట్ అయితే తన మాట తానే వినడు. కనుక ఇక ఆ విషయం గురించి ఎంత గొంతు చించుకొన్నా కంటశోష తప్ప మరొక ప్రయోజనం ఉండదు.

 

ఆనక ఆయన మేనల్లుడు హరీష్ రావు నిజంగా సన్యాసిణి అయిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిసి ఆంధ్రాపై, సదరు సన్నాసిపై కూడా పిర్యాదులు చేయడానికి డిల్లీ బయలుదేరినప్పుడు, కేసీఆర్ మళ్ళీ ఆమెను కూడా సన్నాసి(ణి) అని అనేస్తారేమోనని జనాలు తెగ కంగారు పడ్డారు. కానీ ఆమె మంత్రి హరీష్ రావు పిర్యాదులకు సానుకూలంగా స్పందించడమే కాకుండా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకోమని అనుమతి కూడా ఇచ్చేయడంతో బ్రతిపోయారు. లేకుంటే కేసీఆర్ ఆ సన్యాసిణిని కూడా సన్నాసి అనేసేవారేమో! అయితే చంద్రబాబు నాయుడు తనకు దూరదృష్టి లేదంటేనే చాలా హర్ట్ అయిపోయిన కేసీఆర్, ఇలా ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని సన్నాసులు, దద్దమ్మలు అంటూ తిడుతుంటే వాళ్ళు మాత్రం హర్ట్ అవరా? హర్ట్ అయినా అవనట్లు సర్దిచెప్పుకొని వాళ్ళు ఆయనకి, తెలంగాణా ప్రభుత్వానికి సహకరిస్తారా?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu