
-ఉస్తాద్ భగత్ సింగ్ తో శ్రీలీల గోల్డెన్ లెగ్ అనిపించుకుంటుందా!
-శ్రీలీల అప్ కమింగ్ సినిమాల లిస్ట్ ఏంటి!
- ప్లాప్ లు వచ్చినా బడా సినిమాలు వస్తున్నాయా!
ప్రెజెంట్ సినీ పరిస్థితిని గమనిస్తే హిట్ కొట్టినా మరో సినిమా కోసం ఎదురుచూసే పరిస్థితి. కారణాలు తెలియదు గాని స్టార్స్ సైతం ఆ సిట్యువేషన్ ని ఎదుర్కుంటున్నారు. మరి ప్లాప్ వస్తే ఇంకేమైనా ఉందా? కానీ శ్రీలీల(Sreeleela)మాత్రం ప్లాప్ లేదు గ్లిప్ లేదు. అలాంటి వన్ని నా దగ్గర నడవవు అంటూ వరుస ఆఫర్స్ ని దక్కించుకుంటుదనేది ఫిలిం సర్కిల్స్ టాక్. మరి ఆఫర్స్ తాలూకు విషయాలేంటో చూద్దాం.
శ్రీలీల ఫస్ట్ టైం తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి శివ కార్తికేయన్ తో 'పరాశక్తి'(Parashakthi)లో చేసిన విషయం తెలిసిందే. కానీ తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న బిగ్గెస్ట్ డిజాస్టర్ లో ఒకటిగా నిలిచింది. కానీ ఈ ప్రభావం శ్రీలీల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. చూడకపోవడమే కాదు ఏకంగా స్టార్ హీరో ధనుష్(Dhanush)55 వ చిత్రంలో స్థానాన్ని పొందింది. తమిళనాట తన సత్తా చాటడానికి శ్రీలీల కి దొరికిన గోల్డెన్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఈ గోల్డెన్ ఆఫర్ ని మించిన డైమండ్ ఆఫర్ ని దక్కించుకున్నటుగా, బిగ్గెస్ట్ స్టార్ అజిత్ పక్కన ఛాన్స్ పొందిందనే వార్తలు తమిళ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న ఎక్స్ క్లూజివ్ న్యూస్. గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్(Ajith)కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలోనే చేయబోతున్నాడని అంటున్నారు. ఇందులోనే శ్రీలీల
ని హీరోయిన్ గా ఫిక్స్ చేసే యోచనలో మేకర్స్ ఉన్నారనేది టాక్.
also read: The Kerala Story 2: కేరళ స్టోరీ 2 బీఫ్ వివాదం.. ప్రకాష్ రాజ్ అదిరిపోయే రిప్లై
శ్రీలీల తెలుగులో కొంత కాలంగా వరుస పరాజాయాలని చవిచూస్తు ఐరెన్ లెగ్ అనే పేరుకి ఆమడ దూరంలో ఉంది. మార్చి 26 న రిలీజ్ కాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వన్ మాన్ షో ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat SIngh)తో హిట్ కొట్టి గోల్డెన్ లెగ్ పోటీలో ఉండాలని చూస్తుంది. హిందీలోను క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న శ్రీలీల అజిత్ తో సినిమా నిజమైతే తమిళ చిత్ర సీమలో హవా చాటడం ఖాయమని సినీ పరిశీలకులు అంటున్నారు.







.webp)

