Home

»

Latest News

'విశ్వంభర' కొత్త రిలీజ్ డేట్ లాక్.. అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే..?

Feb 23, 2026

ఈ ఏడాది సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్‌ గారు'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). అదే ఉత్సాహంతో ఈ ఏడాది మరో సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. అదే 'విశ్వంభర'. (Vishwambhara)

నిజానికి 'విశ్వంభర' మూవీ 'మన శంకర వరప్రసాద్‌ గారు' కంటే ముందే రావాల్సి ఉంది. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా సినిమా ఆలస్యమైంది. ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్ కి రెడీ అవుతోంది.

'విశ్వంభర' టీజర్ విడుదలైనప్పుడు వీఎఫ్ఎక్స్ పై నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో వీఎఫ్ఎక్స్ కి ఎక్కువ సమయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే అవుట్ పుట్ అదిరిపోయేలా వస్తోందని, మూవీ టీమ్ సంతృప్తిగా ఉందని తెలుస్తోంది.

'విశ్వంభర' రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేసినట్లు సమాచారం. జూలై 10న సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అనౌన్స్ మెంట్ కి కూడా ముహూర్తం ఖరారైనట్లు వినికిడి.

ఉగాది కానుకగా మార్చి 19న 'విశ్వంభర' కొత్త విడుదల తేదీని ప్రకటించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఒక స్పెషల్ గ్లింప్స్ తో రిలీజ్ డేట్ ని రివీల్ చేయబోతున్నారట. ఈ గ్లింప్స్ తరువాత ఒక్కసారిగా 'విశ్వంభర'పై అంచనాలు పెరిగిపోవడం ఖాయమని అంటున్నారు.

కాగా, 'విశ్వంభర' చిత్రానికి 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ని యు.వి. క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

Also Read: బాలయ్య, పూరి కాంబోలో మరో మూవీ!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com