Home

»

Latest News

Samantha: నమ్మకం కోల్పోయానంటున్న సమంత.. చికాకు తెప్పించే జోడి!

Feb 23, 2026 5:25PM

 

-వైరల్ గా మారిన సమంత మాటలు 
-రాజ్ తో డిసెంబర్ 1 న పెళ్లి 
-చికాకు తెప్పిస్తాం
  

సమంత ఇటీవల ప్రముఖ దర్శకుడు 'రాజ్ నిడిమోరు'(Raj Nidimoru)ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆడంబరానికి దూరంగా అతి కొద్దీ మంది బందువుల సమక్షంలో వివాహం జరగగా సమంత(Samantha)కొత్త లైఫ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గా సమంత ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విషయాలు వాళ్ల కోరికకి  వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తున్నాయి. సమంత ఏం చెప్పిందో చూద్దాం.

సమంత మాట్లాడుతు నా మొదటి వివాహ బంధం నుంచి బయటకి వచ్చిన తర్వాత ఇక ఎవరిపై ఆధారపడకూడదని ఫిక్స్ అయ్యాను. అసలు ఇక ఎవర్ని నమ్మనేమో  అనిపించింది. ఎవరి స్నేహాన్ని,ప్రేమని ఆమోదిస్తానని కూడా అనుకోలేదు. కానీ రాజ్ తో పరిచయం, రిలేషన్ తర్వాత మార్పు వచ్చింది. అప్పటి వరకు ఉన్న నా రొటీన్ లైఫ్ మారిపోయి కొత్త అలవాట్లు వచ్చాయి. నేను రాజ్ పరస్పర అవగాహనతో అన్ని పనులు చేసుకుంటాం. నిజానికి మేము చికాకు తెప్పించే జోడి. నటిగాను నిడిమోరు నా పక్కన ఉన్నంత కాలం మరింత ముందుకెళ్తానని సమంత చెప్పుకొచ్చింది.

also read: Sreeleela: ప్లాప్ మూవీతోనే వరుస ఛాన్సులు.. శ్రీలీల ని పరిశీలిస్తున్నారని టాక్!

కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం స్వీయ నిర్మాణంలో 'మా ఇంటి మహాలక్ష్మి' చేస్తుంది. రాజ్ నిడిమోరు దర్శకత్వంలోనే 'రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ ఉందనే వార్తలు ఎప్పట్నుంచో వస్తున్నాయి. రాజ్ నిడిమోరు దర్శకత్వంలో ఇప్పటికే ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆ ఇద్దరి మధ్య పరిచయం జరిగింది.


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com