TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

రాముడి కథతో భారీ సినిమా?..అయోధ్య రామమందిరంలో ఘనంగా ప్రారంభం.!

Nov 26, 2026 5:56PM

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన ఎంచుకున్న కథ, సినిమా ప్రారంభించబోతున్న వేదిక రెండూ ఆసక్తిని పెంచుతున్నాయి. ఏకంగా అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో తన కొత్త సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. దీంతో ఈ సినిమా రాముడి కథతో ముడిపడి ఉంటుందా? అనే చర్చ మొదలైంది.

అర్జున్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించనున్నారు. నవంబర్ 27న అయోధ్యలో జరగనున్న ముహూర్త కార్యక్రమంలోనే సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించనున్నారు. సాధారణంగా సినిమాల ప్రారంభోత్సవాలు స్టూడియోలు లేదా స్థానిక ఆలయాల్లో జరుగుతుంటాయి. కానీ అర్జున్ సినిమా కోసం అయోధ్య రామమందిరాన్ని ఎంచుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

అయితే అయోధ్యలో ప్రారంభమవుతోందనే కారణంతోనే ఇది పూర్తిగా రామాయణం నేపథ్యంలో తెరకెక్కే సినిమా అని చెప్పలేం. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా దేశభక్తి నేపథ్యంలో రూపొందనుంది. ధైర్యం, త్యాగం, దేశం పట్ల బాధ్యత వంటి అంశాలు కథలో కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. కథ, స్క్రీన్‌ప్లేను రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ విజయ్ భార్గవన్ అందిస్తున్నారు. సైనిక నేపథ్యం ఉన్న వ్యక్తి కథను సిద్ధం చేయడంతో ఈ సినిమాలో దేశభక్తి అంశాలను ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి పెరుగుతోంది.

ఇది కూడా చదవండి: రామాయణ టీమ్‌తో అమిత్ షా ప్రత్యేక భేటీ.!

ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై అనూప్ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థకు ఇది మూడో సినిమా. బాలీవుడ్‌తో పాటు సౌత్ కు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు సమాచారం.

మరి అయోధ్య వేదికగా అర్జున్ ప్రకటించబోయే సినిమా టైటిల్ ఏంటి? దేశభక్తి కథలో రామాయణానికి కూడా ఏదైనా ప్రత్యేకమైన అనుబంధం ఉంటుందా? అన్నది తెలియాల్సి ఉంది.

మీకు నచ్చవచ్చు:
బాహుబలి కాంబో రిపీట్‌.. వారణాసి తర్వాత ప్రభాస్‌తో రాజమౌళి సినిమా.!
‘భోగి’కి A సర్టిఫికెట్.. సెన్సార్ టాక్ ఎలా ఉందంటే.?

 

 

 

[Arjun Sarja, Pan India Film, Ayodhya, Ram Mandir]

 

google-ad-img