TeluguOne App Promotion
● # Tweets

Home

»

గాసిప్‌లు

బాహుబలి కాంబో రిపీట్‌: వారణాసి తర్వాత ప్రభాస్‌తో రాజమౌళి సినిమా.!

Nov 25, 2026 6:18PM

టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజ్ వేరు. అందులో ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ ముందు వరుసలో ఉంటుంది. ‘ఛత్రపతి’, ‘బాహుబలి’ సినిమాలతో ఈ ఇద్దరూ ఎలాంటి సంచలనాలు సృష్టించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశారు. అలాంటి కాంబినేషన్ మరోసారి రిపీట్ అయితే ఎలా ఉంటుంది? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే చర్చ మొదలైంది.

రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో ‘వారణాసి’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో రాజమౌళి తర్వాతి సినిమా ఏంటనే ఆసక్తి అప్పుడే మొదలైంది.

ఈ క్రమంలోనే రాజమౌళి తర్వాతి సినిమా ప్రభాస్‌తో ఉండబోతుందనే ప్రచారం మొదలైంది. వారణాసి తర్వాత మరోసారి ప్రభాస్‌తో కలిసి పనిచేయాలని రాజమౌళి భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్త ప్రభాస్, రాజమౌళి అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ 2’ సినిమాలు ఆయన లైనప్‌లో ఉన్నాయి. వీటితో పాటు ‘సలార్ 2’ కూడా ఉంది. 2028 వరకు చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసి, ఆ తర్వాత రాజమౌళి ప్రాజెక్టుకి పూర్తి టైం కేటాయించనున్నారని తెలుస్తోంది. అందుకే కొత్త సినిమాలేవీ కమిట్ కావట్లేదని సమాచారం.

ఇది కూడా చదవండి: మహేష్ ఫ్యాన్స్‌కి షాక్.. ‘వారణాసి’ కొత్త రిలీజ్ ప్లాన్ ఇదే.!

ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ అంటే అభిమానులకు ముందుగా గుర్తొచ్చేది బాహుబలి. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టడంలో రాజమౌళి పాత్ర ఎంతో కీలకం. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలిస్తే ఎలాంటి కథను ఎంచుకుంటారు? ఏ జానర్‌లో సినిమా చేస్తారు? అనే ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి.

మొత్తానికి ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ రిపీట్ అవుతుందనే వార్త నిజమైతే అభిమానులకు అంతకంటే పెద్ద గుడ్ న్యూస్ మరొకటి ఉండదు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల లైనప్ చూస్తే కొత్త ప్రాజెక్ట్ మొదలవడానికి ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది. మరి బాహుబలి కాంబో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తుందా? లేక ఇది అభిమానుల కోరికగానే మిగిలిపోతుందా? చూడాలి.

మీకు నచ్చవచ్చు: 
బిగ్ అప్డేట్.. బాలయ్య ‘దాదా’తో బాక్సాఫీస్ జాతర ఖాయం.!
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ టైటిల్ సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్.!

 

 

 

[Baahubali Combo, SS Rajamouli, Prabhas, Reunion, Varanasi]

 

google-ad-img