‘భోగి’కి A సర్టిఫికెట్: సెన్సార్ టాక్ ఎలా ఉందంటే.?
Nov 25, 2026 5:30PM

శర్వానంద్‌ను ఇప్పటివరకు చూడని రస్టిక్ మాస్ అవతార్‌లో చూపించబోతున్న దర్శకుడు సంపత్ నంది, ఈసారి హింస, రక్తపాతం విషయంలోనూ తగ్గేదేలే అన్నట్లు కనిపిస్తున్నారు. తాజాగా ‘భోగి’ సినిమాకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయినట్లు వార్తలు రావడంతో పాటు, సెన్సార్ బృందం నుంచి వచ్చిన ఫస్ట్ రివ్యూ టాక్ కూడా ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ఈ సినిమాకు A సర్టిఫికెట్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాను వీక్షించిన తర్వాత కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే కథ, పాత్రల స్వభావానికి అవి అవసరమని భావించిన చిత్రబృందం వాటిని తొలగించడానికి లేదా మార్పులు చేయడానికి ఇష్టపడలేదట. దీంతో ఈ సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే థియేటర్లలో ఈ సినిమాను చూడగలరు. ఇక సినిమా నిడివి 2 గంటల 34 నిమిషాలు (154 నిమిషాలు) అని సమాచారం.
సినిమాను చూసిన సెన్సార్ బృందం నుంచి వచ్చిన టాక్ ప్రకారం.. ‘భోగి’ ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని తెలుస్తోంది. ముఖ్యంగా శర్వానంద్ నటన, సంపత్ నంది టేకింగ్ ఆకట్టుకున్నాయని ప్రచారం జరుగుతోంది. సెకండాఫ్‌లో ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ సన్నివేశాలు మరింత బలంగా ఉంటాయని అంటున్నారు. దర్శకుడిగా సంపత్ నంది తన మార్క్ చూపించారని, చాలా కాలం తర్వాత ఆయన నుంచి మంచి సినిమా వస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కథ బొగ్గుల గుట్ట అనే ఓ కల్పిత గ్రామం నేపథ్యంలో సాగుతుంది. కమ్మరి గంగ (శర్వానంద్) ఓ కష్టపడి పనిచేసే యువకుడు. తన ఐదుగురు చెల్లెళ్లను, కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకుంటుంటాడు. అయితే ఆ గ్రామం కొందరు భూస్వాముల గుప్పిట్లో ఉంటుంది. వారి అకృత్యాలతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతుంటారు. మరోవైపు ప్రతి అమావాస్య పూజల సమయంలో కొన్ని మిస్టరీ ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. ఆ ఆచారాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? గ్రామాన్ని పట్టిపీడిస్తున్న మూఢనమ్మకాల వెనుక ఎవరు ఉన్నారు? భూస్వాములతో గంగ చేసే పోరాటం ఎలా సాగుతుంది? అనేదే కథలో ఆసక్తికరమైన అంశాలుగా కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: భోగి ప్రమోషన్స్‌కి అనుపమ దూరం.. కారణం ఇదేనా.?
నిజానికి ‘భోగి’ నవంబర్ 12నే విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ ప్రక్రియలో ఎదురైన సమస్యల కారణంగా సినిమాను రివైజింగ్ కమిటీకి పంపించారు. దీంతో విడుదల వాయిదా పడటమే కాకుండా, ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వంటి ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా ప్రభావితమయ్యాయి. తాజాగా సెన్సార్ ప్రక్రియ పూర్తవడంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది.

మొత్తానికి ‘భోగి’ విషయంలో A సర్టిఫికెట్, సెన్సార్ అభ్యంతరాలు, హింసాత్మక సన్నివేశాలపై వస్తున్న వార్తలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మరి నిజంగానే సంపత్ నంది తన మార్క్ యాక్షన్, ఎమోషన్స్‌తో శర్వానంద్‌కు భారీ విజయాన్ని అందిస్తారా? ఈ రస్టిక్ రూరల్ డ్రామా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో నవంబర్ 27న తేలనుంది.
మీకు నచ్చవచ్చు:
ఫస్ట్ AI హీరో.. ఏకలవ్య టీజర్ చూశారా.?
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ టైటిల్ సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్.!
[Bhogi First Review, Sharwanand, Dimple Hayathi, Sampath Nandi, Anupama Parameswaran]



