ENGLISH | TELUGU  

అల్లరి నరేష్ ఆటకట్టు !

on Jul 1, 2013

    "సుడిగాడు" అనంతరం అల్లరి నరేష్ నటించిన "యముడికి మొగుడు", "యాక్షన్ ౩డి" చిత్రాలు నిరాశపరిచాయి. తాజా చిత్రం "కెవ్వు కేక" మరో రెండు వారాల్లో విడుదల కానుంది. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్.. అల్లరి నరేష్ బర్త్‌డే సందర్భంగా జూన్ 30న హైద్రాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో జరిగింది. అల్లరి నరేష్ మిత్ర బృందం పెద్ద సంఖ్యలో తరలి వచ్చింది. హీరో శ్రీకాంత్, నాని, ఉదయ్‌కిరణ్, ఆది పినిశెట్టి, సందీప్ కిషన్ తదితరులతోపాటు అల్లరి నరేష్‌తో పని చేసిన దర్శకులు, రచయితలు, హీరోయిన్లు ఈ వేడుకలో పాలుపంచుకోనున్నారు. ముఖ్యంగా బ్రహ్మచారిగా అల్లరి నరేష్ జరుపుకునే "చివరాఖరి బర్త్‌డే" ఇదేనని అల్లరి నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ ప్రకటించడం ఈ ఆడియో వేడుకకు హైలైట్‌గా మారింది. అల్లరి నరేష్ తల్లి సరస్వతితోపాటు, అల్లరి నరేష్ వదిన (ఆర్యన్ రాజేష్ భార్య) రాజేశ్వరి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అల్లరి నరేష్ సరసన నటిస్తున్న షర్మిల మాండ్రే నటిస్తున్న "కెవ్వు కేక" చిత్రానికి దేవిప్రసాద్ దర్శకుడు. జాహ్నవి ప్రొడక్షన్స్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు!

 

Allari Naresh Kevvu Keka Audio Release, Kevvu Keka Audio Release Highlights, Kevvu Keka Audio Launch, Kevvu Keka Movie Audio Release
 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.