English | Telugu

Latest News

తుల‌సి ఇంటికి కార్తీక్.. మోనిత‌కు ఫ్యూజులు ఔట్‌!

స్టార్ మాలో తెలుగులో ప్ర‌సారం అవుతున్న స‌క్సెస్‌ఫుల్ సీరియ‌ల్ 'కార్తీక దీపం'. సీరియ‌ల్స్‌లో దీనిపై వ‌చ్చిన‌న్ని మీమ్స్, కామెంట్స్ ఏ సీరియ‌ల్‌కి రాలేదేమో అన్నంత‌గా పాపులర్ అయిన ఈ సీరియ‌ల్ ఈ సోమ‌వారం ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిర‌గ‌బోతోంది. విహారి కార‌ణంగా దీప‌ని దూరం పెడుతూ వ‌స్తున్న కార్తీక్‌కి అత‌ని త‌ల్లి సౌంద‌ర్య నిజం చెప్పేస్తుంది.

ఈ అమ్మాయి నేటి సెన్సేష‌న‌ల్ హీరోయిన్‌.. గుర్తు పట్టారా?

ఎప్పుడు ఎవ‌రికి ఎలా స్టార్‌డ‌మ్ వ‌స్తుందో తెలీదు. ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోతుంటారు కొంత‌మంది. అలాంటి కొద్దిమందిలో లేటెస్ట్ సెన్సేష‌న‌ల్ కృతి శెట్టి ఒక‌రు. 'ఉప్పెన' సినిమాతో ఆమెకు వ‌చ్చిన కీర్తి ప్ర‌తిష్ఠ‌లు ఇటీవ‌లి కాలంలో ఎవ‌రికీ రాలేద‌ని చెప్ప‌వ‌చ్చు.

'రొమాంటిక్' రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌తో కిర్రెక్కిస్తున్న ఆకాష్‌-కేతిక‌!

త‌న‌యుడు ఆకాష్ పూరి హీరోగా న‌టిస్తోన్న 'రొమాంటిక్' మూవీకి డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్ క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ స‌మ‌కూరుస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఆయ‌న శిష్యుడు అనిల్ పాదూరి డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. కేతికా శ‌ర్మ హీరోయిన్. 'ఇస్మార్ట్ శంక‌ర్' లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రామ్, పూరి.. ఓ పాన్ ఇండియా మూవీ?

`ఇస్మార్ట్ శంక‌ర్`తో ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ కి కెరీర్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ ని అందించారు డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్. అంతేకాదు.. త‌ను కూడా మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేశారు. ఆ త‌రువాత ఇద్ద‌రు కూడా వేర్వేరు ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యారు.

చిరంజీవి వ‌ర్సెస్ మోహ‌న్ లాల్!

ఒక‌రేమో టాలీవుడ్ మెగాస్టార్.. మ‌రొక‌రేమో మాలీవుడ్ సూప‌ర్ స్టార్.. ఇద్ద‌రు కూడా వేస‌విలో ఒకే డేట్ ని టార్గెట్ చేసుకున్నారు. ఆ ఇద్ద‌రు స్టార్స్ మ‌రెవ‌రో కాదు.. చిరంజీవి, మోహ‌న్ లాల్...

జూన్ 3న 'గుడ్ ల‌క్ స‌ఖి'

జాతీయ ఉత్త‌మ‌న‌టి కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'గుడ్ ల‌క్ స‌ఖి'. ఆది పినిశెట్టి హీరోగా న‌టిస్తుండ‌గా, జ‌గ‌ప‌తిబాబు ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు. విమ‌న్ సెంట్రిక్ ఫిల్మ్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి స‌హ నిర్మాత శ్రావ్య వ‌ర్మ ఆధ్వ‌ర్యంలో ఎక్కువ మంది లేడీ టెక్నీషియ‌న్లు ప‌నిచేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

హిందీ 'ఛ‌త్ర‌ప‌తి' స‌ర‌స‌న దిశా ప‌టాని!

టాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'ఛత్ర‌ప‌తి'.. హిందీలో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ బాలీవుడ్ ఎంట్రీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాతోనే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వీవీ వినాయ‌క్ కూడా హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెడుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి షూటింగ్ షురూ కానుంది.

'మ‌ర్యాద క్రిష్ణ‌య్య' ఫ‌స్ట్ లుక్ ఇదే!

సునీల్ హీరోగా వి.ఎన్‌. ఆదిత్య ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న హిలేరియ‌స్ ఫ‌న్ ఫిల్మ్‌కు 'మ‌ర్యాద క్రిష్ణ‌య్య' అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఏటీవీ ఒరిజిన‌ల్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై కిశోర్ గ‌రిక‌పాటి, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అర్చ‌నా అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అనుకు షాకిచ్చిన ఆర్య‌వ‌ర్ధ‌న్‌!

'బొమ్మ‌రిల్లు' శ్రీ‌రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ నిర్మిస్తున్న సీరియ‌ల్ 'ప్రేమ ఎంత మ‌ధురం'. గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ క్ర‌మ క్ర‌మంగా టాప్ రేటింగ్‌ని ద‌క్కించుకుంటూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది. ఈ శ‌నివారం 251వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది.

అమ్మ రేపు రాదా?.. కార్తీక్‌ని నిల‌దీసిన హిమ‌!

నిరుప‌మ్‌, ప్రేమి విశ్వ‌నాథ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న సీరియ‌ల్ 'కార్తీక దీపం'. గ‌త కొంత కాలంగా ఉభ‌య తెలుగు రాష్ట్రాల మ‌హిళా లోకాన్ని ఉర్రూత‌లూగిస్తున్న ఈ సీరియ‌ల్ టాప్ రేటింగ్‌తో ముందు వ‌రుస‌లో నిలుస్తోంది. రోజు రోజుకీ వ‌రుస ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో ఆస‌క్తిక‌రంగా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల నీరాజ‌నాలందుకుంటోంది.

నేనింకా 'చెక్' చూడ‌లేదు.. నాకు తెలిసిన‌వాళ్ల‌కు న‌చ్చింది!!

"ప్రస్తుతం హైదరాబాద్‌లో లేను. ముంబైలో ఉన్నాను. హిందీ సినిమా చిత్రీకరణ చేస్తున్నా. అందువల్ల, నేనింకా సినిమా చూడలేదు. నేరుగా ప్రేక్షకుల స్పందన తెలుసుకోలేకపోయా. అయితే, నాకు తెలిసిన కొంతమంది సినిమా చూశారు. వాళ్లకు నచ్చింది." అని చెప్పారు ర‌కుల్‌ప్రీత్ సింగ్‌. నితిన్ హీరోగా చంద్రశేఖ‌ర్ యేలేటి డైరెక్ట్ చేసిన 'చెక్' మూవీ శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 26) విడుద‌లైంది.

కీర్తి సురేశ్.. ఫెస్టివ‌ల్ స్పెష‌ల్

`మ‌హాన‌టి`తో న‌టిగా ఎన‌లేని గుర్తింపుని సంపాదించుకుంది కీర్తి సురేశ్. అయితే ఆ త‌రువాత ఆ స్థాయి విజ‌యాన్ని మ‌ళ్ళీ అందుకోలేకపోయింది. ఈ నేప‌థ్యంలో.. రాబోయే చిత్రాల‌పైనే త‌న ఆశ‌ల‌ను పెట్టుకుంది ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్.

ర‌విని యాంక‌రింగ్ మానేయ‌మన్న‌ సుమ‌!

బుల్లితెర‌పై ఎదు‌టి వ్య‌క్తిని ఊపిరి తీసుకోకుండా వ‌రుస పంచ్‌ల‌తో ఉక్కిరి బిక్కిరి చేయ‌గ‌ల చాతుర్యం సుమ సొంతం. ‌పుట్టింది కేర‌ళ కుట్టిగానే అయినా తెలుగుపై వున్న ప్రేమ‌తో తెలుగు వాళ్లే ఆశ్చ‌ర్య‌పోయేలా స్పాంటేనియ‌స్‌గా పంచ్‌లు వేయ‌డం సుమ స్పెషాలిటీ. ఆ పంచ్‌ల‌కు స్టార్ హీరోలే స‌రెండ‌ర్ అంటూ చేతులెత్తేసిన సంద‌ర్భాలెన్నో..

'చెక్' ప్ర‌మోష‌న్స్‌లో ర‌కుల్ ఎందుకు లేదు?

నితిన్ హీరోగా చంద్ర‌శేఖ‌ర్ యేలేటి డైరెక్ట్ చేసిన 'చెక్' మూవీ శుక్ర‌వారం విడుద‌లై ఆడియెన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ పొందుతోంది. యేలేటి మార్క్ సినిమా లాగా లేద‌ని విమ‌ర్శ‌కులు తేల్చేసిన ఈ మూవీకి ఓపెనింగ్స్ సైతం ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో లేవు. కాగా ఈ మూవీలో ర‌కుల్ ప్రీత్ సింగ్ లాయ‌ర్ మాన‌స క్యారెక్ట‌ర్ చేసింది.

రాఖీ సావంత్ త‌ల్లికి కేన్స‌ర్‌.. సాయం చేస్తున్న స‌ల్మాన్‌!

ఐట‌మ్ గాళ్‌గా పేరుపొందిన న‌టి రాఖీ సావంత్ త‌ల్లి జ‌య కేన్స‌ర్ బారిన ప‌డి, ముంబైలోని ఓ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్య ఖ‌ర్చుల్లో చాలా వ‌ర‌కు బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌, ఆయ‌న త‌మ్ముడు సొహైల్ ఖాన్ భ‌రిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఓ వీడియోలో ఆ ఇద్ద‌రికీ థాంక్స్ చెప్పారు త‌ల్లీకూతుళ్లు.

ముమైత్ తొలి పారితోషికం ఎంతో తెలిస్తే షాకే!

`పోకిరి` చిత్రంతో కుర్ర‌కారుతో పాటు టాలీవుడ్ వ‌ర్గాల‌ని మెస్మ‌రైజ్ చేసింది ముమైత్‌ఖాన్‌. అయితే డ్యాన్స‌ర్‌గా ఆమె ప్ర‌యాణం వెన‌క పెద్ద క‌థే వుంది. ఈటీవీలో ప్ర‌ముఖ హాస్య న‌టుడు అలీ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న `ఆలీతో స‌రదాగా` కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ముమైత్‌ఖాన్ డ్యాన్స‌ర్‌గా త‌న ప్ర‌స్థానం ఎలా మొద‌లైంది? ఈ ప్ర‌యాణంలో ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది.. వంటి ప‌లు  ఆస‌క్తిక‌ర వివ‌ష‌యాల్ని పంచుకుంది.

`ట‌క్ జ‌గ‌దీష్`లో రీతూ వ‌ర్మ‌ క్యారెక్ట‌ర్ డిటైల్స్

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్`. `నిన్ను కోరి` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ కాంబినేష‌న్ లో నాని చేసిన సినిమా ఇది. ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో నానికి అన్న‌గా జ‌గ‌ప‌తిబాబు న‌టించ‌గా.. రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేశ్ నాయిక‌లుగా న‌టించారు.

హార‌ర్ డ్రామా సీక్వెల్‌లో.. అతిథిగా విజయ్ సేతుప‌తి

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌తో ముందుకు సాగుతున్నారు త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి. ఒక‌వైపు క‌థానాయ‌కుడిగా న‌టిస్తూనే.. మ‌రోవైపు ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ల్లోనూ అల‌రిస్తున్నారు. ఇంకోవైపు అతిథి వేషాల్లోనూ మెరుస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే.. తాజాగా ఓ హార‌ర్ డ్రామాకి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రంలో గెస్ట్ రోల్ లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట సేతుప‌తి.

'ఆచార్య'లో రామ్‌చ‌ర‌ణ్ కామ్రేడ్ లుక్‌!

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'ఆచార్య'‌. కొర‌టాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో జ‌రుగుతోంది. చిరంజీవి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోన్న ఈ మూవీని మే14న రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్‌పై రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా 'ఆచార్య‌'ను నిర్మిస్తున్నారు.

డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న సౌంద‌ర్య‌?

వెండితెరను కొన్నేళ్ల పాటు మురిపించిన అందాల రాశి సౌంద‌ర్య‌. క‌న్న‌డ న‌టి అయినా తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌టిగా చెరగ‌ని ముద్ర వేశారు. మహాన‌టి సావిత్రి త‌రువాత న‌టిగా అంత‌టి మంచి గుర్తింపుని, పేరుని సొంతం చేసుకున్నారు. టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు క‌న్న‌డ చిత్రాల్లోనూ స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించి స్టార్ హీరోయిన్‌గా ఈ మూడు భాష‌ల్లో ఓ వెలుగు వెలిగారు.

`పుష్ప‌` టీజ‌ర్ ఎప్పుడంటే..

`ఆర్య‌`, `ఆర్య 2` త‌రువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న సినిమా `పుష్ప‌`. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో సాగే ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో బ‌న్నీకి జోడీగా క‌న్న‌డ క‌స్తూరి ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించి దాదాపు 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని టాక్.

కీర్తి సురేశ్.. ముచ్చ‌ట‌గా మూడు!

గ‌త ఏడాది కీర్తి సురేశ్ రెండు సినిమాల‌తో ప‌ల‌క‌రించింది. ఆ చిత్రాలే.. `పెంగ్విన్`, `మిస్ ఇండియా`. ఈ రెండు కూడా ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ నే. అంతేకాదు.. ఓటీటీ వేదిక‌గానే నాలుగున్న‌ర నెల‌ల గ్యాప్ లో ఈ మూవీస్ స్ట్రీమ్ అయ్యాయి.

ప్ర‌భాస్.. జ‌స్ట్ 4 నెల‌ల్లోపే వ‌స్తున్నాడు బాస్!

`మిర్చి` ముందు వ‌ర‌కు ఏడాదికి ఒక సినిమాతోనైనా ప‌ల‌క‌రిస్తూ వ‌చ్చేవాడు ప్ర‌భాస్. అయితే.. `మిర్చి` త‌రువాత ఆ లెక్క మారింది. రెండేళ్ళ‌కో సినిమా అన్న చందాన ప్ర‌భాస్ నుంచి మూవీస్ వ‌స్తున్నాయి....

ప‌వ‌న్‌‌ ఈసారైనా సంక్రాంతికి ప‌వ‌ర్ చూపిస్తాడా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - వెర్సటైల్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్ లో  ఓ పిరియడ్ డ్రామా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. మొఘ‌లాయిల ప‌రిపాల‌నా కాలం నాటి వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నెవ‌ర్ సీన్ బిఫోర్ రోల్ లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు ప‌వ‌న్. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి సంబంధించి.. తాజాగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.

డార్క్ థ్రిల్లర్ 'జి.టి.ఎ' మొద‌లైంది

అశ్వద్ధామ ప్రొడక్షన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి బైరి దీపక్ సిద్ధాంత్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, డాక్టర్ బి.సుశీల నిర్మిస్తున్న డార్క్ థ్రిల్లర్  'జి.టి.ఎ' (గన్స్-ట్రాన్స్-యాక్షన్). చైతన్యకృష్ణ, హీనా రాయ్, సుదర్శన్, శరత్ చంద్ర, రాఖీ, శ్రీకాంత్ అయ్యంగార్, రూపాలక్ష్మి కుమర‌న్ ముఖ్య తారాగణంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 28 ఫిబ్రవరి ఉదయం హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా మొదలైంది.

అవినాష్ ముక్కుతో ఆడుకున్న అరియానా!

బిగ్‌బాస్ సీజ‌న్‌ 4తో 'జ‌బ‌ర్ద‌స్త్' క‌మెడియ‌న్ ముక్కు అవినాష్ కెరీర్ ఒక్క‌సారిగా మారిపోయింది. ఆ షోలో పాల్గొనే అవ‌కాశం లేక‌పోయినా స్టార్ మా చాన‌ల్‌ అవినాష్‌కి అండ‌గా నిలిచి ఏడాది పాటు స్టార్ మాలో ఎంట‌ర్‌టైన్ చేసేలా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ప్ర‌స్తుతం అవినాష్ స్టార్ మాలో 'కామెడీ స్టార్స్‌'తో పాటు 'డ్యాన్స్ ప్ల‌స్'`, '100 % ల‌వ్'` షో‌ల్లో త‌న‌దైన శైలి కామెడీతో ఆక‌ట్టుకుంటూ న‌వ్వులు కురిపిస్తున్నాడు.

సౌంద‌ర్య‌తో పెళ్లి వ‌ద్ద‌నుకున్న జేడీ!

వ‌ర్మ స్కూల్ నుంచి వ‌చ్చిన జేడీ చ‌క్ర‌వ‌ర్తి ముక్కు సూటిగా మాట్లాడుతుంటారు. 'శివ' వంటి ట్రెండ్ సెట్ట‌ర్‌తో జేడీ ప‌రిచ‌య‌మైన ఈ హీరో గ‌త కొంత కాలంగా త‌న‌కు న‌చ్చిన‌, త‌న దాకా వ‌చ్చిన చిత్రాల్లో మాత్ర‌మే న‌టిస్తున్నారు. తాజాగా ఆయ‌న న‌టించిన థ్రిల్ల‌ర్ '70 ఎంఎం'. అంతా కొత్త వాళ్లు నిర్మించిన ఈ చిత్రం ఇటీవ‌లే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది.

నాని ల‌క్కీ  మంత్ లో `శ్యామ్ సింగ రాయ్`?

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న పిరియ‌డ్ డ్రామా `శ్యామ్ సింగ రాయ్`. `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సాయిపల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టెయిన్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతోంద‌ని టాక్.

శంకర్ కోసమే.. చరణ్ కోసం కాదు!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఓ భారీ బ‌డ్జెట్ మూవీని తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప్రొడ్యూస్ చేయ‌నున్న ఈ పాన్ ఇండియా వెంచ‌ర్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని టాక్.

విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ స్క్రిప్టుతో ప్యాన్ ఇండియా ఫిల్మ్ 'సీత'‌

బాహుబ‌లి, బ‌జ్‌రంగీ భాయిజాన్, మ‌ణిక‌ర్ణిక‌ సినిమాల స్క్రిప్టుల‌తో విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ పేరు దేశ‌వ్యాప్తంగా మారుమోగింది. ఆయ‌న స్వ‌యానా య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి క‌న్న‌తండ్రి. ప్ర‌స్తుతం రాజ‌మౌళి రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్‌: రౌద్రం ర‌ణం రుధిరం' మూవీకి స్క్రిప్ట్ రైట‌ర్ ఆయనే. అలాగే కంగ‌నా ర‌నౌత్ టైటిల్ రోల్ చేస్తోన్న 'త‌లైవి'కి స్క్రిప్ట్ చేకూర్చింది విజ‌యేంద్ర‌ప్ర‌సాదే.

మ‌రో త‌మిళ చిత్రంలో మ‌ల్లికా షెరావ‌త్

`మ‌ర్డ‌ర్` (2004) చిత్రంతో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన న‌టి మ‌ల్లికా షెరావ‌త్. ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు `హాట్` ఫేవ‌రేట్ అయిన మ‌ల్లిక‌.. ఎక్కువగా హిందీ చిత్రాల్లోనే న‌టించినా అప్పుడ‌ప్పుడు త‌మిళ చిత్రాల్లోనూ మెరిసింది.  లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ `ద‌శావ‌తారం` (2008)తో పాటు శింబు `ఓస్తీ` (`ద‌బాంగ్` రీమేక్) (2011)లోనూ అల‌రించింది.`ద‌శావ‌తారం`లో కీల‌క పాత్ర‌లో న‌టించిన మ‌ల్లిక‌.. `ఓస్తీ`లో ప్ర‌త్యేక గీతంలో త‌ళుక్కుమంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మ‌రోసారి ర‌ష్మిక‌?

యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న క‌నువిందు చేసిన నాయిక‌ల్లో క‌న్న‌డ క‌స్తూరి ర‌ష్మిక మంద‌న్న ఒక‌రు. `గీత గోవిందం`, `డియ‌ర్ కామ్రేడ్` చిత్రాల్లో ఈ ఇద్ద‌రు జంట‌గా న‌టించారు. వీటిలో `గీత గోవిందం` బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

స్పెష‌ల్ డేన `దృశ్యం 2` రీమేక్ షురూ

విక్ట‌రీ వెంక‌టేశ్ కెరీర్ లో ప్ర‌త్యేకంగా నిలిచే చిత్రాల్లో `దృశ్యం` (2014) ఒక‌టి. మాలీవుడ్ ఇండ‌స్ట్రీ హిట్ `దృశ్యం` (2013)కి రీమేక్ గా శ్రీ‌ప్రియ ద‌ర్శ‌క‌త్వంలో వెంకీ న‌టించిన స‌ద‌రు ఫ్యామిలీ థ్రిల్ల‌ర్.. బాక్సాఫీస్ వ‌ద్ద విన్న‌ర్ గా నిలిచింది. క‌ట్ చేస్తే.. ఒరిజిన‌ల్ వెర్ష‌న్ `దృశ్యం`కి సీక్వెల్..

మాల్దీవుల్లో జ్వాల‌, విష్ణు షికారు!

బ్యాడ్మింట‌న్ స్టార్ జ్వాలా గుత్తా, త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విష్ణు విశాల్ కొంత‌కాలంగా డేటింగ్‌‌లో ఉన్న విష‌యం తెలిసిందే. లేటెస్ట్‌గా ఆ ఇద్ద‌రూ మాల్దీవుల‌కు వెళ్లి ఎంజ‌య్ చేసిన ఫొటోలు ఆన్‌లైన్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. 2009లో న‌టుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణు స్వ‌ల్ప‌కాలంలోనే ప్ర‌తిభావంతుడైన న‌టుడిగా పేరు తెచ్చుకున్నాడు.

అప్పుడు `వెంకీ`.. ఇప్పుడు `రంగ్ దే`..

రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ కి మార్చి నెల‌తో ప్ర‌త్యేక అనుబంధమే ఉంది. ఈ నెల‌లోనే త‌న సంగీత సార‌థ్యంలో రూపొందిన తొలి చిత్రం `దేవి` (1999) విడుద‌లైంది. అంతేకాదు.. `వెంకీ`(2004), `లెజెండ్` (2014), `రంగ‌స్థ‌లం` (2018) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ కూడా ఇదే మార్చి నెల‌లో విడుద‌లై దేవిశ్రీ ప్ర‌సాద్ స్థాయిని మ‌రింత పెంచాయి.

ప‌వ‌న్ చిత్రంలో ఆడిపాడిన వైజాగ్ బ్యూటీ

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్ లో ఓ పిరియ‌డ్ డ్రామా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పాన్ - ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్ర‌ముఖ నిర్మాత ఎ.ఎం. ర‌త్నం ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. కాగా, ఇందులో ప‌వ‌న్ కి జోడీగా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తుండ‌గా.. స్పెష‌ల్ రోల్ లో జాక్వ‌లైన్ ఫెర్నాండేజ్ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. అలాగే ఔరంగ‌జేబు పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు అర్జున్ రామ్ పాల్ క‌నిపించ‌నున్నాడు.

Short Films

Movie Reviews

Latest News

Video-Gossips


Gallery

'పుష్ప‌క విమానం'లో ఆనంద్ దేవ‌ర‌కొండ విహారం!

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడిగా 'దొర‌సాని' చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. రెండో సినిమా 'మిడిల్ క్లాస్ మెలోడీస్‌'తో న‌టుడిగా త‌న‌కంటూ సొంత అస్తిత్వాన్ని సాధించాడు. థియేట‌ర్ల‌లో కాకుండా స్ట్రెయిట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజైన ఆ సినిమాలో గుంటూరులో హోట‌ల్ పెట్టి పేరు తెచ్చుకోవాల‌నుకొనే యువ‌కుడిగా మంచి ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆనంద్‌.

సుధీర్ బాబు, కృతి శెట్టి.. ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్

`ఉప్పెన‌`తో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది కృతి శెట్టి. బేబ‌మ్మ‌గా జేజేలు అందుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్.. ప్ర‌స్తుతం రెండు తెలుగు చిత్రాల‌తో బిజీగా ఉంది. అందులో ఒక‌టి నేచుర‌ల్ స్టార్ నానితో చేస్తున్న `శ్యామ్ సింగ రాయ్` కాగా, మ‌రొక‌టి సుధీర్ బాబు - ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ కాంబినేష‌న్ లో రూపొందుతున్న చిత్రం.

`శ్యామ్ సింగ రాయ్`.. స్టోరీ లైన్ అదేనా?

నేచుర‌ల్ స్టార్ నాని టైటిల్ రోల్ లో న‌టిస్తున్న చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ నాయిక‌లుగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్ రూపొందిస్తున్నాడు.

ప‌వ‌న్, మ‌హేశ్.. ఫ‌స్ట్ ఎవ‌ర్ పొంగ‌ల్ క్లాష్!

అటు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఇటు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు.. ఇద్ద‌రు కూడా ప‌లు సార్లు సంక్రాంతి సీజ‌న్ లో త‌మ‌ సినిమాల‌తో సంద‌డి చేశారు. అయితే, ఏ పొంగ‌ల్ సీజ‌న్ లోనూ ఈ ఇద్ద‌రి చిత్రాల మ‌ధ్య పోటీ లేద‌నే చెప్పాలి. క‌ట్ చేస్తే.. 2022 ముగ్గుల పండ‌క్కి ప‌వ‌న్, మ‌హేశ్ తొలిసారి నువ్వా నేనా అన్న‌ట్లుగా బ‌రిలోకి దిగుతున్నారు..

నేను ఇండో పాక్‌ మిక్స్డ్ బ్రీడ్

'పోకిరి' త‌రువాత టాలీవుడ్‌లో ఐట‌మ్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది ముమైత్‌ఖాన్‌. 'పోకిరి' పాట‌తో త‌న‌దైన స్టైల్లో అందాలు ప‌రిచిన ముమైత్ టాలీవుడ్‌లో హాట్ ఫేవ‌రేట్‌‌గా మారిపోయింది. ఆ త‌రువాత ఏ సినిమా చూసినా ముమైత్ పాటే అనేంత‌గా పాపుల‌ర్ అయిపోయింది. ఒక ద‌శ‌లో కీల‌క పాత్ర‌ల్లోనూ, 'మైస‌మ్మ ఐపీఎస్‌' లాంటి చిత్రాల్లోనూ న‌టించి ఆక‌ట్టుకుంది.

చెన్నైలో బాయ్‌ఫ్రెండ్‌తో శ్రుతి చెట్ట‌ప‌ట్టాల్‌!

బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రుతి హాస‌న్ ప్ర‌స్తుతం శంత‌ను హ‌జారికా అనే డూడిల్ ఆర్టిస్ట్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో మున‌గి తేలుతోంద‌ని టాలీవుడ్‌, కోలీవుడ్ వ‌ర్గాలతో పాటు బాలీవుడ్ వ‌ర్గాలు కూడా కోడై కూస్తున్నాయి. ఇద్ద‌రూ క‌లిసి ప‌బ్లిగ్గా ఎప్పుడైతే తొలిసారి క‌నిపించారో, అప్ప‌ట్నుంచీ వారు వార్త‌ల్లో న‌లుగుతూ వ‌స్తున్నారు.

'సలార్'‌తో 2022 స‌మ్మ‌ర్ సీజ‌న్‌పై క‌ర్చీఫ్ వేసిన ప్ర‌భాస్‌!

ప్ర‌భాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ రూపొందిస్తోన్న 'స‌లార్' మూవీ రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేశారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ సినిమా విడుద‌ల‌వ‌నుంది. అంటే 2022 స‌మ్మ‌ర్‌ను చాలా ముందుగానే స‌లార్ బుక్ చేసేసుకుంద‌న్న మాట‌! శ్రుతి హాస‌న్ తొలిసారి ప్ర‌భాస్ జోడీగా న‌టిస్తోన్న ఈ మూవీని హోంబ‌ళే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిరంగ‌దూర్ నిర్మిస్తున్నారు.

బాల‌కృష్ణ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌?

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌కి అచ్చొచ్చిన క‌థానాయిక‌ల్లో ర‌మ్య‌కృష్ణ ఒక‌రు. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన తొలి, మ‌లి చిత్రాలు `బంగారు బుల్లోడు`, `వంశానికొక్క‌డు` బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. ఆ త‌రువాత వ‌చ్చిన `దేవుడు` నిరాశ‌ప‌ర‌చ‌గా.. `వంశోద్ధార‌కుడు` ఫ‌ర్లేద‌నిపించింది.

డిసెంబ‌ర్ లో `నితిన్ 31`

యువ క‌థానాయ‌కుడు నితిన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎంత‌లా అంటే.. ఎన్న‌డూ లేని విధంగా ఒకే క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో ఏకంగా నాలుగు చిత్రాల‌ను రిలీజ్ చేసే దిశ‌గా స్కెచ్ వేశారాయ‌న‌. తాజాగా `చెక్`తో ప‌ల‌క‌రించిన ఈ యంగ్ హీరో.. మార్చి 26న రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ `రంగ్ దే`తో ఎంట‌ర్ టైన్ చేయ‌బోతున్నారు. ఇక జూన్ 11న `అంధాధున్` రీమేక్ తో వినోదాలు పంచ‌నున్నారు. అలా.. ఫ‌స్టాఫ్ లో మూడు చిత్రాల‌ను ప‌క్కాగా సెట్ చేసుకున్నారు.

'చెక్' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు.. 'భీష్మ‌'లో 54 శాత‌మే!

నితిన్ హీరోగా చంద్ర‌శేఖ‌ర్ యేలేటి రూపొందించిన 'చెక్' మూవీ తొలిరోజు అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. ఫిబ్ర‌వ‌రి 26 శుక్ర‌వారం విడుద‌లైన ఈ మూవీ ఫ‌స్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.38 కోట్ల షేర్ సాధించింది. నితిన్ మునుప‌టి సినిమా 'భీష్మ' తొలి రోజు సాధించిన వ‌సూళ్ల‌తో పోలిస్తే ఇది చాలా త‌క్కువ కావ‌డం గ‌మ‌నార్హం.

'స‌మంత' డైరెక్ట‌ర్ ప్రొఫైల్ మామూలుగా లేదు!

శేఖర్ కమ్ముల మొదలుకొని శివ నిర్వాణ వరకు... పలువురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు మన తెలుగు సినిమా రంగంలో దర్శకులుగా అసాధారణ విజయాలు అలవోకగా కైవశం చేసుకుంటూ... తెలుగు సినిమా ప్రమాణాలను పెంచడంలో విశేష కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా ముఖేష్ కుమార్ చేరుతున్నాడు.

ఫ‌స్ట్ సాయితేజ్.. నెక్స్ట్ వైష్ణ‌వ్ తేజ్..

`ఉప్పెన‌`తో డ్రీమ్ డెబ్యూ ఇచ్చాడు యువ క‌థానాయకుడు వైష్ణ‌వ్ తేజ్. ఒక‌వైపు ఈ విజ‌యాన్ని ఆస్వాదిస్తూనే.. మ‌రోవైపు కొత్త చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు. `ఉప్పెన‌` రిలీజ్ కి ముందే.. క్రిష్ డైరెక్టోరియ‌ల్ (కొండ పొలం)ని పూర్తి చేసిన వైష్ణ‌వ్.. ఇటీవ‌ల ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అన్న‌పూర్ణ స్టూడియోస్ లో ఓ సినిమాకి క‌మిట‌య్యాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

`శాకుంతలం`.. ముహూర్తం ఫిక్స్

క‌థానాయిక‌గా స‌మంత‌ది 11 ఏళ్ళ ప్ర‌స్థానం. ఈ ప్ర‌యాణంలో విభిన్న భూమిక‌లు పోషించి మెప్పించారామె. త్వ‌ర‌లోనే ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్.. ఓ పౌరాణిక క‌థా చిత్రంలో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. ఆ సినిమానే.. `శాకుంత‌లం`. వెట‌ర‌న్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ రూపొందించ‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో కావ్య నాయిక శ‌కుంత‌ల పాత్ర‌లో స‌మంత క‌నిపించ‌నున్నారు.

నువ్వైనా మాట్లాడు లేదా న‌న్నైనా మాట్లాడ‌నివ్వు!

`స్టార్ మా`లో ఓంకార్ కొత్త‌గా మొద‌లుపెట్టిన డ్యాన్స్ షో `డ్యాన్స్ ప్ల‌స్‌`. డ్యాన్స్‌కి నెక్స్ట్ లెవెల్ అనే ట్యాగ్ లైన్‌తో మొద‌లుపెట్టిన ఈ షోలో బాబా భాస్క‌ర్‌, ర‌ఘు మాస్ట‌ర్‌, య‌ష్‌, యానీ, ముమైత్‌ఖాన్‌, మోనాల్ గ‌జ్జ‌ర్ న్యాయ నిర్ణేతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఓంకార్ ఈ కార్య‌క్ర‌మానికి హోస్ట్‌. గ‌త కొన్ని వారాలుగా శ‌ని ఆదివారాలు ప్ర‌సారం అవుతూ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. 

ర‌వితేజ‌, త‌మ‌న్.. వ‌న్స్ మోర్?

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌కి అచ్చొచ్చిన స్వ‌ర‌క‌ర్త‌ల్లో యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ ఒక‌రు. `కిక్`, `ఆంజ‌నేయులు`, `మిర‌ప‌కాయ్`, `వీర‌`, `నిప్పు`, `బ‌లుపు`, `ప‌వ‌ర్`, `కిక్ 2`, `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని`, `డిస్కో రాజా`, `క్రాక్`.. ఇలా వీరి క‌ల‌యిక‌లో 11 చిత్రాలు రాగా.. వీటిలో `కిక్`, `మిర‌ప‌కాయ్`, `బ‌లుపు`, `ప‌వ‌ర్`, `క్రాక్` మంచి విజ‌యం సాధించాయి. క‌ట్ చేస్తే.. మ‌రోసారి ఈ ఇద్ద‌రు జ‌ట్టుక‌ట్ట‌నున్నార‌ని స‌మాచారం.

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.